మాకు పీవోకేను పాక్‌ అప్పగించడం తప్పితే వేరే మార్గం లేదు: మోదీ | India And Pakistan Related Live Updates | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి జేడీ వాన్స్‌ ఫోన్‌

May 11 2025 7:22 AM | Updated on May 11 2025 6:20 PM

India And Pakistan Related Live Updates

War Related Updates..

ప్రధాని మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఫోన్‌

భారత్‌, పాక్‌ ఉద్రిక్తతలపై  మోదీతో మాట్లాడిన జేడీ వాన్స్‌

పాక్‌ దాడి చేస్తే దీటుగా బదులిస్తామని చెప్పిన మోదీ

మా సంయమనం బలహీనత కాదు

దేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడం

ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని జేడీ వాన్స్‌  కు మరోసారి చెప్పిన మోదీ

 

పీవోకేపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  • ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుంది. ముగియలేదు.  
  • పీవోకే విషయంలో మాకు మధ్య వర్తిత్వం అవసరం లేదు
  • పీవోకేని మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదు : మోదీ  

3:10 PM

ప్రధానితో ముగిసిన త్రివిధ దళాధిపతుల భేటీ

  • సమావేశంలో పాల్గొన్న  రాజ్‌ నాథ్‌ సింగ్‌, జై శంకర్‌, సీడీఎస్‌
  • కాల్పుల విరమణ  ప్రకటన తర్వాత తాజా పరిస్థితులపై చర్చ
  • రేపు భారత్‌, పాక్‌ మధ్య కీలక చర్చలు
  • కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత తగ్గింపుపై చర్చలు
     

ఢిల్లీ..

  • ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్
  • పాకిస్తాన్ సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • సమావేశానికి హాజరైన ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌, నేవీ చీఫ్‌

 

 

  • అమృత్‌సర్‌లో రెడ్‌ అలర్ట్‌ ఎత్తివేత.
  • తాజా పరిణామాలపై ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశం
  • కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితులపై వివరణ 

ఢిల్లీ..

  • భారత్, పాక్ సరిహద్దులలో సాధారణ పరిస్థితి
  • ఆగిపోయిన కాల్పులు, కనిపించని డ్రోన్లు
  • కాల్పుల విరమణ అవగాహన అతిక్రమిస్తే పాక్‌దే బాధ్యత అని రాత్రే స్పష్టం చేసిన భారత్

అమృత్‌సర్‌లో రెడ్‌ అలర్ట్‌

  • అమృత్‌సర్‌లో ఇంకా మోగుతున్న సైరన్లు.
  • ప్రజలు ఎవరూ బయటకు రావద్దని డిప్యూటీ కమిషనర్‌ సూచన.
  • ఇళల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ.
  • నగరంలో విద్యుత్‌ సరఫరా పునరుద్దణ. 

👉కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్‌ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. విరమణ అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్‌ మళ్లీ దాడులకు తెగబడింది. శనివారం రాత్రి జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.

బ్లాకౌట్‌ ఎత్తివేత.. మళ్లీ విధింపు 
👉కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్‌లో బ్లాకౌట్‌ను అధికారులు ఎత్తేశారు. ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దానిని తిరిగి విధించారు. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్‌లలో బ్లాకౌట్‌ను కొనసాగిస్తున్నారు. గుజరాత్‌లోని కచ్‌లోనూ డ్రోన్లు కనిపించాయి. కశ్మీర్‌లోని నగ్రోటా వద్ద చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది.

 

👉కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి శనివారం రాత్రి అనేక ప్రాంతాల్లో పాక్‌ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్‌, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్‌ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్‌లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.

👉మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పుర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, బాడ్‌మేర్‌లలో పూర్తిగా కరెంటు నిలిపివేశారు. కఠువాలో బ్లాక్‌అవుట్‌ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. పంజాబ్‌లోని మోగాలోనూ కరెంటు నిలిపివేశారు.

గుజరాత్‌లోనూ డ్రోన్‌ దాడులు?
👉గుజరాత్‌లోనూ డ్రోన్‌ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. కచ్‌ జిల్లాలో అనేక చోట్ల డ్రోన్లు కనిపించాయని గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘవి వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి బ్లాక్‌అవుట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, భయాందోళనలకు గురికావద్దని ‘ఎక్స్‌’ వేదికగా సూచించారు.

👉శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement