TVK Vijay
-
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్ను, అదీ పెద్ద స్టార్‌గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. రజనీకాంత్ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో విజయ్ ఫ్యాన్ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట. విజయ్ అభిమాని చేసిన పోస్ట్ అంటూ అది హల్ చల్కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్ స్టంట్ అంటూ ఓ బాంబ్ పేలడం ఈ ఎపిసోడ్‌ను మరో మలుపు తిప్పింది. సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్ విషయంలో “ఫ్యాన్ వార్ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్ డమ్ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్‌ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్ మరింతగా ముదిరింది. 1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్‌స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్ అభిమానులు ‘మాస్ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్ కలెక్షన్ల దాకా వెళ్లింది. ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్‌లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వార్స్ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్‌ను వారించడం.. మళ్లీ రిపీట్ కావడం అవుతూ ఉండేది. ఈలోపు.. విజయ్ సినీ కెరీర్ ఎవరూ అందుకోలేనంత పీక్స్‌కు చేరుకుంది.కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్.. జైలర్ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్‌గానే విజయ్ ‘లియో’ క్లైమాక్స్‌లో గద్ద రిఫరెన్స్ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది. పొలిటికల్ టర్న్..!90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్డమ్ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. విజయ్ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్‌ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్ స్టైల్, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్ సినిమాలపరంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్‌లో ఒక టాక్. అంతెందుకు విజయ్ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. విజయ్ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్‌గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్ స్పీచ్‌లతో సందేశాలిస్తూ వచ్చాడు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్‌కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్ హాసన్) స్వయంగా వెళ్లి విజయ్ను అభినందించడం.. విజయ్ విజయంపై మొక్కుబడిగా ఎక్స్‌లో ఓ మెసేజ్ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్‌మీట్ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. -
విజయ్ కు చిరంజీవి ఫోన్.. పవన్ సీరియస్?
-
పళనిస్వామికి భారీ షాక్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహణకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం బృందం సిద్ధమైంది. ఇందు కోసం 1000 మంది సభ్యుల చేత సంతకాలు చేయించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే సర్వసభ్య సమావేశం విషయంగా ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సభ్యులకు పళనిస్వామి సూచించారు.వివరాల మేరకు.. అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరాల మధ్య వివాదం ముదిరింది. పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గద్దె దించడం లక్ష్యంగా ఎస్పీ వేలుమణి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 1,800 మంది మేరకు సర్వ సభ్య సభ్యులు ఉన్నారు. వీరిలో 1000 మందిని తమ వైపునకు ఎస్పీ వేలుమణి శిబిరం తిప్పుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరితో సంతకాలు చేయించి, సర్వ సభ్య సమావేశం లక్ష్యంగా పట్టుబట్టే పనిలో పడ్డారు. పార్టీపరంగా తమతో ఉన్న 28 జిల్లాల కార్యదర్శుల ద్వారా మిగిలిన జిల్లాల కార్యదర్శులకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.సంతకాలు చేయవద్దు పార్టీ సర్వ సభ్య సభ్యులకు పళనిస్వామి సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. సర్వ సభ్య సమావేశం పేరిట సంతకాలు చేయవద్దని, పార్టీని సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల చర్యలకు చెక్ పెట్టేవిధంగా చట్ట పరమైన పోరాటానికి సైతం పళనిస్వామి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునేందుకు సీఎం విజయ్ కుట్రలు చేస్తున్నారని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో సీబీఐ విచారణ కోరుతామని హెచ్చరించారు. -
విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
సాక్షి, చెన్నై: అధికారం చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకుండానే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే (TVK) కూటమి ప్రభుత్వంపై సీనియర్ డీఎంకే (DMK) నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిలబడదని, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ త్వరలోనే మళ్లీ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది."మా తలైవరే తదుపరి ముఖ్యమంత్రి. మరో నాలుగు లేదా ఆరు నెలల్లో మా నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. రాధాకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయం గానీ, టీవీకే పార్టీ గానీ, లేదా ఆధవ్ అర్జున గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. టీవీకే, డీఎంకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ... అధికార తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, విల్లివాక్కం నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ విసిరారు. ఆధవ్ అర్జున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరుచెందూర్‌లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు.ఈ ప్రభుత్వం మహా అయితే మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుందంటూ జోస్యం చెప్పారు. గత ఏప్రిల్ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనవిజయం సాధించకముందు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు.అంతేకాదు ‘‘నీకు నిజంగా దమ్ముంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్, నేను కూడా చేస్తాను. మనమిద్దరం తిరుచెందూర్‌లో తలపడదాం. ఇది మా సొంత గడ్డ, ఇక్కడ మేము ఎవరినైనా ఓడిస్తాం" అని రాధాకృష్ణన్ అర్జునకు సవాల్ విసిరారు.కాగా తిరుచెందూర్ నియోజకవర్గం గత 25 ఏళ్లుగా రాధాకృష్ణన్‌కు కంచుకోటగా ఉంది. ఆయన మొదట 2001లో డీఎంకే బద్ధశత్రువైన ఏఐఏడీఎంకే (AIADMK) తరపున ఇక్కడి నుండి గెలిచారు. ఆ తర్వాత 2009లో డీఎంకేలో చేరి, అప్పటి నుండి ఈ స్థానాన్ని తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలలోనే విజయ్ సాధించిన విజయం అతిపెద్ద సంచలనంగా నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగానే 108 స్థానాలను కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీకి కేవలం 10 స్థానాల దూరంలో నిలిచినప్పటికీ, గత 62 ఏళ్లుగా తమిళనాడును మారుమార్చిపాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు.తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో మాజీ డీఎంకే నాయకుడు, ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీలో ఉన్న వి.ఎస్. బాబు చేతిలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వారం రోజుల పాటు జరిగిన తీవ్ర రాజకీయ డ్రామా అనంతరం కాంగ్రెస్, రెండు లెఫ్ట్ పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతుతో టీవీకే మెజారిటీ మార్కును దాటింది. దీంతో ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో కూడా 144-22 ఓట్ల తేడాతో మెజారిటీ నిరూపించుకున్న తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి అగ్రపీఠాన్ని అధిరోహించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పాలన, నియామకాలు, పరిపాలనాపరమైన నిర్ణయాలపై డీఎంకే నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. -
సీఎం విజయ్, రజనీ వ్యాఖ్యలపై కమల్ స్పందన ఇదే..
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే విమర్శలు చేయడం లేదా అంచనా వేయడం సరి కాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు.రెండు రోజుల్లో చెబితే అది జోస్యం అవుతుంది..సీఎం విజయ్ పాలన ఎలా ఉందనే ప్రశ్నపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. ‘విజయ్ ముఖ్యమంత్రి అయి రెండు రోజులే అవుతోంది. అప్పుడే ఆయన పాలన ఎలా ఉందో చెప్పమంటే అది జోస్యం చెప్పినట్లే అవుతుందని చమత్కరించారు. ఆరు రోజుల్లోనో, పదిహేను రోజుల్లోనో ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు చేయడం కూడా అంతే అని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడటానికి, వారి విధానాలు అమలు కావడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ పేర్కొన్నారు.ప్రజలు నమ్మి ఓటేశారు.. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడంపై స్పందిస్తూ... కొత్తవాళ్లు చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే రాజకీయాలకు ఇది కొత్తేమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బాధ్యతలు స్వీకరించిన వారంతా కొత్తవారేనని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి, ఆ పాలన సజావుగా సాగుతుందా లేదా అనేది గమనించాలన్నారు. తాము కూడా దాన్నే గమనిస్తున్నాం అని చెప్పారు.తమిళనాట పుడితే అది ద్రావిడ పార్టీనే తమిళనాడు రాజకీయ సిద్ధాంతాలపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తన ఉద్దేశం ప్రకారం.. తమిళనాడులో తమిళం మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ద్రావిడ పార్టీనే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ఎవరూ బలవంత పెట్టలేరని స్పష్టం చేశారు.మా ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల (ఒకవేళ కమల్ సీఎం అయినా తనకు అసూయ ఉండదన్న వ్యాఖ్యల) ప్రస్తావన రాగా, కమల్ హాసన్ వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను, రజనీకాంత్ ఎప్పుడూ ఒకరిని చూసి ఒకరం అసూయ పడలేదన్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదన్నారు. తాము సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోటీ పడ్డాం.. ఒకవేళ మేం క్రికెట్ ఆడి ఉన్నా సరే, ఇలాగే పోటీ పడేవాళ్లం తప్ప అసూయ పడేవాళ్లం కాదన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే మార్కులు వేయకుండా, కొంతకాలం వేచి చూడాలనే రజినీకాంత్ అభిప్రాయాన్ని కమల్ హాసన్ కూడా సమర్థించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. -
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ అన్నామలై బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీ నేత పీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది అన్నామలైకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి.అసెంబ్లీకి ఎన్నికల ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది. నైనార్ నాగేంద్రన్ సైతం ఓటమి పాలు కావడంతో ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న నినాదం బీజేపీలో బయలు దేరింది. దీంతో అధ్యక్ష మార్పు విషయంగా పీఎల్ సంతోష్ ద్వారా అభిప్రాయాల సేకరణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి.ఈ మేరకు పీఎల్ సంతోష్ అభిప్రాయాల సేకరణలో నిమగ్నమయ్యారు. మెజారిటీ శాతం మంది అన్నామలై ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యమన్నది స్పష్టం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆయన్ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆయనకు ఈసారి రాజ్యసభ పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా మద్దతుదారులు పేర్కొంటుండటం గమనార్హం. -
సింహం సింగిల్.. వెనక్కి తగ్గినా రజినీకాంత్.. జీర్ణించుకోలేకపోతున్న పవన్ !
-
రెండు పెద్ద పార్టీల మధ్య గెలవడం గ్రేట్.. విజయ్ ని ఆకాశానికెత్తిన రజినీ
-
టీడీపీ పల్లకీ మోయడం కాదు.. TVK విజయ్ ని చూసి నేర్చుకో
-
అన్నాడీఎంకేలో సంక్షోభం.. పళనిస్వామి కొత్త స్కెచ్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళని స్వామి రాజీనామా చేయాలన్న నినాదాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎస్పీ వేలుమణి దూకుడు పెంచారు. నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుడి స్థానంలో పళని స్వామి పేరును తొలగించి, తనపేరును వేసుకున్నారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు ముక్కలైన విషయం తెలిసిందే.ఓ శిబిరం సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుండగా, మరో శిబిరం పళణి స్వామితో కలిసి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఈ అంతర్గత కలహాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు.ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని వేలుమణి, షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నినాదాన్ని అందుకుంది. ఎడప్పాడిని లొంగదీసుకోవడానికి వేలుమణి వర్గం పార్టీ ప్రత్యేక సర్వసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది.ఇందుకోసం సర్వసభ్య కమిటీ సభ్యుల నుంచి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే పత్రిక నమదు అమ్మకు వ్యవస్థాపకుడిగా ఇది వరకు పళనిస్వామి పేరు ఉండేది. అయితే, తాజాగా ఆయన పేరు ను తొలగించి తన పేరును ఎస్పీవేలుమణి వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ పత్రికను తనగుప్పెట్లోకి తెచ్చుకున్న ఎస్పీ వేలుమని మరి కొద్ది రోజులలో పార్టీని కూడా కైవశం చేసుకోవడం ఖాయం అని పళని వ్యతిరేక ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.ఇదే సమయంలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున తమిళనాడు గవర్నర్ కార్యాలయానికి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఇప్ప టికే వినతిపత్రం సమర్పించారు. ఒకవేళ స్పీకర్ లేదా గవర్నర్ ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే, కోర్టులకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత న్యాయపరమైన చర్యల ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే గవర్నర్‌ను కలిసి స్వయంగా విన్నవించేందుకు పళణిస్వామి అనుమతి కోరి ఉండటం గమనార్హం.ఇక, ఎస్పీ వేలుమణి బృందం అయితే, పార్టీ ఫిరాయింపు ల నిరోధక చట్టం నుండి తప్పించుకుని, అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరంగా గుర్తించారు. దీంతో తమ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 32కు పెంచుకోవడానికి వేలుమణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.పళణి స్వామి వెనుక ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతా లు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, ఇరు శిబిరాల్లో ఈ వివాదం భగ్గుమంటోంది. విల్లుపురంలో సీవీషణ్ముం, పళని స్వామి వర్గం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యాలయాలకు భద్రతను పెంచారు. -
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో వైఫల్యం ఎందుకో? నిష్పక్షపాతంగా నిజాలు చెప్పండి అని క్షేత్ర పరిశోధన బృందానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదేశించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కేవలం 59 సీట్లను మాత్రమే గెలుచుకుని ఊహించని పరాజయాన్ని చవిచూసింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండు, మూడో స్థానాలకు పరిమితమయ్యారు. చివరికి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా తాను పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ భారీ షాక్ తర్వాత, ఓటమికి గల అసలు కారణాలను విశ్లేషించడానికి డీఎంకే నాయకత్వం రంగంలోకి దిగింది.క్షేత్రస్థాయి పరిశోధన బృందంతో స్టాలిన్ భేటీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్ నిర్మించేందుకు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ 36 మంది సభ్యులతో కూడిన ఒక క్షేత్ర పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేశారు. చెన్నైలో శనివారం ఈ బృందంతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు కనిమొళి, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.నిజాలు మాత్రమే చెప్పండి ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యులు లేదా స్థానిక నిర్వాహకులు ఏం చెబుతున్నారనేది పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకుని తనకు నేరుగా చెపాలని కోరారు. నివేదికలో తనను (డీఎంకే అధ్యక్షుడు) విమర్శించినా తప్పుగా అనుకోను. ఎవరినీ కాపాడటానికి ప్రయత్నించవద్దు అని సూచించారు. అలాగే ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో నివేదికలు ఇవ్వద్దు అని సూచించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, పరిశీలకులు , కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి జూన్ 5వ తేదీలోగా తుది నివేదికను సమర్పించాలని స్టాలిన్ కోరారు. -
సీఎం విజయ్ను కలిసిన కమల హాసన్.. కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను శనివారం సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల హాసన్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కమల హాసన్ శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. “ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపాను. తమిళనాడు అభివృద్ధి విషయంలో ఉన్న ఆశయాలను ఆయన ఉత్సాహంగా చెప్పారు. ఈ సమావేశంలో ఆయన చూపిన వినయం, అభిమానం నాకు గర్వంగా అనిపించాయి” అని తెలిపారు.ఈ సమావేశంలో తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన పలు కీలక వినతులను కూడా సమర్పించినట్లు కమల హాసన్ వెల్లడించారు. “పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న తమిళ సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ.. తమిళనాడు ప్రభుత్వానికి 6 కీలక డిమాండ్లు చేశాను” అని తెలిపారు.ఇంతకుముందు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న తొలి కీలక నిర్ణయాల్లో ఒకటిదానికి కమల హాసన్ మద్దతు తెలిపారు. తమిళనాడులో ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్ల దగ్గర ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.కొన్ని రోజుల క్రితం వినోద రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న నటుడికి ఏమైనా సలహా ఇస్తారా అని కమల్‌ను ప్రశ్నించగా.. కొత్త ప్రభుత్వానికి, మద్యం దుకాణాల మూసివేత నిర్ణయానికి అభినందనలు తెలిపారు. “తమిళనాడు కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు. 717 మద్యం దుకాణాల మూసివేత స్వాగతించదగ్గ నిర్ణయం. దీని గురించి చాలా కాలంగా చర్చ జరిగింది. ఇప్పుడు అమలు చేశారు. ఇది ప్రశంసనీయం” అన్నారు.విజయ్ రాజకీయ ప్రయాణంపై కమల్ ఇంకా మాట్లాడుతూ.. “విజయ్ను కేవలం సినీ నటుడిగా మాత్రమే చూడకూడదు. ఆయనపై ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి. ఏ రంగం నుంచి అయినా రాజకీయాల్లోకి రావచ్చు. మన పరిశ్రమ నుంచి విజయ్ అధికారంలోకి రావడం గర్వకారణం” అన్నారు. కాగా, విజయ్ రాజకీయ పార్టీ టీవీకే పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది.மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர், தம்பி விஜய் @TVKVijayHQ அவர்களை இன்று நேரில் சந்தித்து வாழ்த்துகளைத் தெரிவித்தேன். தமிழ்நாட்டை மேம்படுத்தும் பல கனவுகளை உற்சாகத்துடன் பகிர்ந்துகொண்டார். சந்திப்பின்போது அவர் காட்டிய பண்பும் அன்பும் நெகிழ்ச்சியளித்தது. பல்வேறு இடையூறுகளைச்… pic.twitter.com/timwTZeEdY— Kamal Haasan (@ikamalhaasan) May 16, 2026 -
తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు
చెన్నై: తమిళనాడు మంత్రులకు ముఖ్యమంత్రి విజయ్ శాఖలు కేటాయించారు. విజయ్ దగ్గరే హోంశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగొట్టైయన్‌ను నియమించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎవరెవరికి ఏయే శాఖలు? శాఖల కేటాయింపు జాబితా ప్రకారం.. విజయ్ వద్ద ప్రజా వ్యవహారాలు, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక పథకాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, శిశు సంక్షేమం, వృద్ధులు-దివ్యాంగుల సంక్షేమం, పురపాలక శాఖ, పట్టణ జల సరఫరా శాఖలు ఉన్నాయి.కేఏ సెంగొట్టైయన్ కు ఆర్థిక శాఖ దక్కింది. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు పెన్షన్లు, పెన్షన్ భత్యాల బాధ్యతలు ఆయన చూసుకుంటారు.అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ బాధ్యతలూ ఆమెకే అప్పగించారు. కీలక శాఖను మహిళా మంత్రికి ఇవ్వడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పంచాయతీ యూనియన్లు, పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణ రుణభారం, చిన్న నీటిపారుదల సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలో ఉంటాయి.ఆధవ్ అర్జున ప్రజా పనుల శాఖ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. భవనాలు, రహదారులు, చిన్న నౌకాశ్రయాలు సహా ప్రజా పనుల శాఖతో పాటు క్రీడాభివృద్ధి శాఖను ఆయన పర్యవేక్షిస్తారు.డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్ కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు.పీ వెంకటరామణన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారు. వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ శాఖలూ ఆయనకే అప్పగించారు.ఆర్ నిర్మల్‌కుమార్ కు ఇంధన వనరులు, న్యాయ శాఖలు దక్కాయి. విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, న్యాయ శాఖ, కోర్టులు, జైళ్లు, అవినీతి నిరోధక శాఖ, శాసనసభ, గవర్నర్, ఎన్నికలు, పాస్‌పోర్ట్ శాఖలు ఆయన పరిధిలో ఉంటాయి.రాజ్‌మోహన్ పాఠశాల విద్య, తమిళాభివృద్ధి, సమాచార-ప్రచార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపడతారు. పురావస్తు శాఖ, అధికారిక తమిళ భాష, తమిళ సంస్కృతి, సినీ సాంకేతికత, సినిమాటోగ్రాఫ్ చట్టం, న్యూస్‌ప్రింట్ నియంత్రణ, స్టేషనరీ-ముద్రణ, ప్రభుత్వ ముద్రణ శాఖలూ ఆయన పరిధిలో ఉంటాయి.డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరుల శాఖ కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారు. -
బాబోయ్ నన్ను వదిలేయండి.! విజయ్ దెబ్బకి పవన్ కి చుక్కలు..!
-
ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు కదా..! ట్రోల్స్ పై పవన్ రియాక్షన్
-
విజయ్ సీఎం.. పవన్ ఏడుపు.. పిచ్చెక్కిపోతున్న జనసేన నేతలు
-
బ్రిటీష్‌కాలం నాటి సంప్రదాయానికి వీడ్కోలు!
ఎటు చూసినా అల్మారాలు.. గుట్టలుగా ఫైళ్లు.. టేబుళ్లు వాటి మధ్యలో ఇరుక్కు గ్యాప్‌లో కుర్చీలు.. కాస్త దూరంలో ప్రత్యేకంగా వేసిన ఓ కుర్చీ.. దాని మీద తెల్లటి తువాలు.. గవర్నర్మెంట్ ఆఫీసుల్లో షరామాములుగా కనిపించే దృశ్యం ఇది. ఇందులో ఆ స్పెషల్ టవల్ చెయిర్ అనేది హోదాకు, అధికారానికి, వీఐపీ గుర్తుగా ముద్రపడిపోయింది. అయితే ఓ చిన్నారి రిక్వెస్ట్‌తో బ్రిటీష్ కాలంనాటి ఆ సంప్రదాయానికి తమిళనాడు నూతన సీఎం విజయ్ స్వస్తి పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేసే సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆయన ఈ పని చేయడానికి కారణం.. లిసిప్రియ కాంగుజమ్ అనే 14 ఏళ్ల బాలిక. చిన్నవయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన ఆమె.. వీఐపీ టవల్ కల్చర్‌ను ముగించాలంటూ విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొన్న సమావేశంలో కుర్చీలో తువాలు లేకుండా కనిపించింది. ఆ ఫొటోలను సీఎంవో రిలీజ్ చేయగా.. లిసిప్రియ ధన్యవాదాలు తెలిపింది. Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026అలా మొదలైంది.. ఎయిర్‌కండిషనింగ్ లేని కాలంలో.. చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీని రక్షించుకోవడానికి బ్రిటీష్ అధికారులు తువాలు వాడేవారు. తెల్లదైతే సులభంగా ఉతికేయవచ్చు.. మార్చేయవచ్చని ఆలోచన చేశారు. కాలక్రమంలో అది అధికార సింబల్‌గా మారింది. పెద్ద అధికారుల కుర్చీపై తువాలు ఉంటే.. జూనియర్ సిబ్బంది సాధారణ కుర్చీల్లో కూర్చోబెట్టబడేవారు. ఎవరైనా ముఖ్య అతిథి వస్తే, వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకువచ్చేవారు. ఇలా తెల్ల తువాలు అనే ఒక సాధారణ వస్తువు అధికార ప్రతీకగా మారింది. ఒకానొక టైంలో అదొక వృథా ఖర్చు అనే చర్చా నడిచింది కూడా. మార్పు మొదలైంది..అయితే.. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. వాళ్ల వెంట గుర్రాలు పోయాయి. కానీ తువాలు మాత్రం మిగిలిపోయింది’’. పవర్ సింబల్‌గా ఏళ్ల తరబడి కుర్చీలో టవల్ అనేదొ కొనసాగింది. ఇటు సోషల్ మీడియాలో ‘‘బ్రిటీష్ చట్టాలను మార్చేవాళ్లకు ఈ పాతకాలపు వీఐపీ సంస్కృతి కనిపించడం లేదా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలో ఓ చిన్నారి ఉద్యమకారిణి మెసేజ్‌కు తమిళనాడు సీఎం విజయ్ స్పందించడం ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇలాంటి సలహాలు కదా పాటించాల్సింది అని కొందరు అంటుంటే.. ఇది చిన్నవిషయమే కదా అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి చిన్న మార్పులు ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండే పాలనకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் தலைமையில், குறுவை நெல் சாகுபடி மற்றும் முக்கிய அணைகளின் நீர் இருப்பு நிலைகள் குறித்து வேளாண்மை மற்றும் உழவர் நலத்துறை, நீர்வளத்துறை உயர் அலுவலர்களுடன் ஆய்வுக் கூட்டம் நடைபெற்றது.#CMJosephVijay pic.twitter.com/OFGyvMnWkL— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 లిసిప్రియ ఎవరంటే.. లిసిప్రియా కాంగుజమ్.. భారత్‌కు చెందిన 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. మణిపూర్‌లో 2011 అక్టోబర్ 2న జన్మించింది. తండ్రి ఇచ్చిన ప్రేరణతో.. చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై పోరాటం ప్రారంభించింది. 2019లో మాడ్రిడ్‌లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది, అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన తెలిపింది. క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్న ఆమె ప్రచారంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి చైల్డ్ మూమెంట్ అనే ఎన్జీవోను నడిపిస్తోంది. అయితే.. 2023-25 మధ్యకాలంలో మణిపూర్ హింస సమయంలో ఆమె అరంబై తేంగోల్ అనే గ్రూప్‌నకు మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెపై నెట్టింట భయంకరమైన నెగెటివిటి నడిచింది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్‌కు చేసిన రిక్వెస్ట్‌తో ఆమె వార్తల్లో నిలిచింది. -
విజయ్‌తో పోలిక.. ట్రోలింగ్‌పై స్పందించిన పవన్
సాక్షి, అమరావతి: ‘‘తమిళనాడు ఎన్నికలొచ్చి ఆయన ముఖ్యమంత్రి కావడం ఏమోగానీ అందరూ నన్ను చంపేస్తున్నారు.. ఊళ్లో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్టు ఉంది. చాలా మంది ఏపీలో అలా చేసి ఉండాలని నాకు మెసేజ్ పంపిస్తున్నారు. నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు.’ అంటూ జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తూ నడుస్తున్న ట్రోలింగ్‌పై స్పందించారు. తమిళనాడు పరిస్థితులు వేరని కార్యకర్తలకు వివరించారు. 2019లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఏమైంది? రెండు చోట్ల ఓడించారు కదా అని పేర్కొన్నారు. ‘‘తమిళనాడుతో మనకు పోలికేంటి? నిజంగా నాకు పదవే ప్రాధాన్యం అనుకుంటే, 2008లో, 2014లోనే ఎంపీగా పోటీ చేసేవాడిని. ఒక పార్టీని నడపాలంటే ఎంత సత్తా ఉండాలి? అన్నీ నిర్ణయించుకుని ఒక దశాబ్దం నలుగుతానని నిలబడ్డా’ అంటూ పేర్కొన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. Contesting alone sounds easy after Vijay’s win, but I’ve already experienced how tough solo politics is in Andhra. - AP Deputy CM Pawan Kalyan pic.twitter.com/PxlKaqL2aj— South Matters (@SouthMatters) May 15, 2026ఒంటరిగా వెళ్లే చాన్స్ ఉన్నా.. ‘‘పొత్తులో సమస్యలు ఉన్నాయి. ఆయన(చంద్రబాబు)తో చాలా అంశాల్లో విభేదించొచ్చు. ఒంటరిగా వెళ్లే చాన్స్ ఉంది. కానీ ఆయనను జైల్లో పెట్టినప్పుడు ఒక కీలక పరిస్థితి. చాలా ఆలోచించే పొత్తు నిర్ణయం తీసుకున్నా. పదవులు, వీటన్నింటి కంటే ప్రజల సుస్థిరతే ముఖ్యమనుకున్నా. పొత్తులో మీకు ఉన్న ఇబ్బందులను నేను అర్థం చేసుకోగలను. వాటిని పార్టీ సరిదిద్దుతుంది. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని చేయను. మీ గౌరవానికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. ఇబ్బందులున్నా.. మనమంతా బలమైన కూటమి వెంట వెళ్లాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. కూటమి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి.’ అంటూ పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. నా కోసం ఎదురు దాడి చేయండి ‘సమసమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. మాట్లాడితే వంగవీటి రంగా గురించి మాట్లాడతారు. ఆ రోజు ఆయనకు ఇబ్బంది, ప్రాణహాని ఉందని అంటే ఆయన చుట్టూ దడికట్టలేకపోయారు. మనిషి బతికి ఉన్నప్పుడు రక్షించుకోలేకపోయారు. నేను ఒక కులం కోసమే పని చేసి, ఆ కులం అంతా ఓట్లు వేస్తే రెండు చోట్ల నేను ఓడిపోకూడదు కదా?. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తే ఎదురు దాడి చేయండి. నేను ఒక కులం కోసం పనిచేయడానికి రాలేదు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులతో పార్టీ పాలక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ సమావేశాల్లో నేను స్వయంగా పాల్గొంటా. తొలుత 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ శ్రేణులతో మాట్లాడతా’ అంటూ పవన్ వివరించారు. -
తమిళనాడు సీఎం విజయ్ ఆగ్రహం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల పెరుగుదలపై తీవ్రంగా స్పందించారు. పెరుగుదలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పెట్రో ధరల పెంపు పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.చెన్నైలో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 పెంచడం అన్యాయం. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించకుండా లాభాల రూపంలో లబ్ధి పొందుతున్నాయి. నిరు పేదలు, మధ్య తరగతి వర్గం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్నచిన్న వాహనాలపై ఆధారపడుతున్నారు. ధరల పెరుగుదల వారి నెలవారీ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బ్యాంకు రుణాలతో వాహనాలు కొనుగోలు చేసి టాక్సీలు లేదా అద్దె వాహనాలుగా నడిపే వారు మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల అద్దె ధరలు పెరగడం, అవసరమైన వస్తువుల ధరలు పెరగడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం జరుగుతుందని గుర్తు చేశారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై ప్రభావంమైక్రో,చిన్న పరిశ్రమలు (MSEs) కూడా ఇంధన ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయన్న సీఎం విజయ్ తద్వారా దేశీయ మార్కెట్ విక్రయాలు, ఎగుమతులు మందగించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమన్నారు.కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఇంధన ధరల పెరుగుదల తక్షణమే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2022 ఏప్రిల్ నుండి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, 2024 మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు ఒక్కసారి రూ.2 తగ్గించారని, ఇప్పుడు పెరుగుదల అన్యాయమని ఆయన అన్నారు. 2022 ఏప్రిల్‌లో చివరిసారి ధరలు పెరిగాయి. ఆ తర్వాత 2024 మార్చిలో ఎన్నికల ముందు ఒక్కసారి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ పెట్రో ధరలు పెంచడం ప్రజలకు భారమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ஒன்றிய அரசின் பொதுத்துறை எண்ணெய் நிறுவனங்கள் பெட்ரோலியப் பொருட்களின் விலையை இன்று (15.05.2026) உயர்த்தியுள்ளது தொடர்பாக மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்களின் அறிக்கை#CMJosephVijay pic.twitter.com/FZIcuTHdCQ— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 -
పారిశ్రామిక ప్రతినిధులతో సీఎం విజయ్ సమావేశం
-
ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: న్నికల తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల గురించి గురువారం స్టాలిన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జరిగింది ఒక రకమైన కొత్త వింత మాయాజాల సునామీ అని వ్యాఖ్యలు చేశారు. సునామీ అంటే అది అద్భుతమో లేక సాహసమో కాదు.. అది వినాశనానికి సంకేతంగా అభివర్ణించారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన సునామీ ఇది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదని, ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం కూడా కేవలం మిత్రపక్షాల దయతో నడుస్తున్నట్టు గుర్తు చేశారు.డీఎంకేలో భారీ మార్పులుడీఎంకేలో ప్రక్షాళన దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటుతో పాటుగా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఓటమికి కారణాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. పార్టీ కార్యకర్తలు తమ మనసులోని బాధను, ఓటమికి కారణాలను నేరుగా అధిష్టానానికి తెలియజేయడానికి శుక్రవారం నుంచి ఒక ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. ఎవరైనా పార్టీ కోసం పని చేయలేమని అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని, గ్రూపు రాజకీయాలను సహించేది లేదని జిల్లా కార్యదర్శులకు స్టాలిన్ ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. సోషల్ మీడియా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాబోయే రోజుల్లో డీఎంకే వ్యవస్థాగత నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ ఓటమి తాత్కాలికం.. మనం మళ్లీ ఫీనిక్స్ పక్షిలా ఎగురుతాం అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడును రక్షించే బలం, పోరాట స్ఫూర్తి అన్నది ఒక్క డీఎంకేకు మాత్రమే ఉందని వ్యాఖ్యలు చేశారు. ఉదయ సూర్యుడికి అస్తమయం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి, కేఎన్ నెహ్రూ, తిరుచ్చి శివ, ఎ. రాజ, ఐ పెరియస్వామి, పొన్ముడి, ముఖ్య నేతలు ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్, కోశాధికారి టీఆర్‌బాలుతో పాటూ అన్ని జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.ఓటమికి నేనే బాధ్యుడిని..పార్టీ ఓటమిపై స్టాలిన్ తన పరిణతిని చాటుకున్నారు. ఒక నాయకుడిగా ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, అన్నాదురై, కరుణానిధి నేర్పిన పాఠాలు. ఓటమిపై చర్చ జరగాలి కానీ, అది ఒకరిపై మరొకరు నిందలు వేసుకునేలా ఉండకూడదని హితవు పలికారు. -
అయ్యా విజయ్.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్!
యాక్టర్ టు సీఎం.. సి విజయ్ జోసెఫ్ ప్రస్థానం గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్‌గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్‌గా మారుతోంది. విజయ్ సర్కార్‌కు విరాళంగా అరుణ్ లోకనాథన్ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్‌కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్ చెబుతున్నాడు.అరుణ్‌కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్‌గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్ సినిమా సీన్ గుర్తు చేశాడు.విజయ్ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్ ఇన్స్పిరేషన్తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. ‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్ సర్కార్‌ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్‌ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్ పాత్ర. అరుణ్ కూడా గతంలో లా చేశాడంట. View this post on Instagram A post shared by Arun Loganathan (@arunthementalist_atm)విజయ్‌కు టర్నింగ్ పాయింట్విజయ్ సినీ కెరీర్‌ను తమిళన్కు ముందు.. తమిళ్‌కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంట్ జానర్ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్ మాజిత్ డైరెక్ట్కాగా, దర్శకనిర్మాత.. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్క్రీన్‌ప్లే అందించారు. మరో హైలైట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్‌ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్ రీల్స్ రూపంలో ఆ మధ్య వైరల్ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్గా ఉండడంతో కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా.. విజయ్ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్ హీరోల్లా విజయ్ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్ ఉదంతంతో శాంపిల్ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు. -
CM విజయ్ ఫస్ట్ రివ్యూ మీటింగ్
-
ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ లేఖ
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురువారం లేఖ రాశారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించాలని ఆ లేఖలో కోరారు. గ్రామీణ మహిళలకు అత్యధిక ఉపాధి ఇస్తున్న రాష్ట్ర టెక్స్టైల్ రంగం సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పత్తి, నూలు ధరలు పెరిగి తీవ్ర సంక్షోభం ఏర్పడిందని విజయ్ తెలిపారు.“తమిళనాడు భారత్‌లోనే టెక్స్టైల్, అపారెల్ ఎగుమతి చేసే అతిపెద్ద రాష్ట్రం. లక్షలాది మంది ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ రంగంపై ఆధారపడుతున్నారు. ఇటీవల పత్తి ధరలు, దాని ప్రభావంతో నూలు ధరలు పెరగడం వల్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం దీనికి ప్రధాన కారణం” అని ఆయన లేఖలో రాశారు.గత 2 నెలల్లో పత్తి ధరలు 25 శాతం పెరిగాయని తెలిపారు. ఒక్క క్యాండీ ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగిందని చెప్పారు. నూలు ధరలు కూడా కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగాయని, దీనివల్ల పరిశ్రమకు ముడి సరుకు కొరత తీవ్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు.“గత 2 నెలల్లో పత్తి ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగింది. ఇది 25 శాతం పెరుగుదల. అదే సమయంలో నూలు ధర కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ముడి సరుకు నిరంతర సరఫరా దిగుమతుల ద్వారానే సాధ్యమవుతుంది. అయితే పత్తిపై 11 శాతం దిగుమతి సుంకం ఉంది” అని ఆయన తెలిపారు. వ్యవసాయం తర్వాత టెక్స్టైల్స్, అపారెల్ రంగం అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగమని ముఖ్యమంత్రి విజయ్ తెలిపారు.“ఇలాంటి పరిస్థితుల్లో సుంకం లేకుండా పత్తి దిగుమతులకు అనుమతి ఇస్తే ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యాన్ని నిలబెట్టుకోగలదు. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోకుండా కాపాడడం, టెక్స్టైల్ విలువ స్థిరత్వాన్ని కాపాడటం ప్రభుత్వంపై ఉన్న బాధ్యత” అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని 0 శాతానికి తగ్గించి ముడి సరుకు లభ్యతకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు. -
మొన్నే సీఎంగా ప్రమాణం.. అప్పుడే విజయ్ బిగ్ బొనాంజ ప్రకటన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బిగ్ బొనాంజా ప్రకటించారు. గురువారం డియర్నెస్ అలవెన్స్ (డీఏ)లో 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఇది 2026, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.సమాచార, ప్రజాసంబంధాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సవరించిన డీఏ వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు లాభం చేకూరుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తమిళనాడు సీఎంవో ఎక్స్ ఖాతాలో వివరించారు.డీఏ పెంపు ఇలా..తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 2 శాతం డీఏ పెంపుతో మొత్తం డీఏ 60 శాతానికి చేరింది. దీనితో పోల్చితే బ్యాంకు ఉద్యోగులకు సుమారు 0.70 పాయింట్ల స్వల్ప పెంపు మాత్రమే లభించింది. దీంతో వారికి వచ్చే నగదు ప్రయోజనం తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణానికి వేర్వేరు రంగాలు ఎలా స్పందిస్తున్నాయో ఈ తేడా చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సుల్లో ఎక్కువ సవరణ లభించింది. ఈ నిర్ణయం వల్ల ఏటా అదనంగా సుమారు రూ. 1,230 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగుల సంక్షేమం, పెన్షన్ బాధ్యతలకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.அரசு அலுவலர்கள் மற்றும் ஆசிரியர்களுக்கு 58சதவீதமாக உள்ள அகவிலைப்படி 01.01.2026 முதல் 60 சதவீதமாக உயர்த்தி வழங்கப்படும் என மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் அறிவிப்பு#CMJosephVijay pic.twitter.com/jspnkFOKLS— CMOTamilNadu (@CMOTamilnadu) May 14, 2026 -
ప్రారంభంలోనే బిగ్ షాక్.. 24 గంటల్లోనే విజయ్ యూ టర్న్
-
జగన్ చేసిందే విజయ్ రిపీట్ మహిళలకు గుడ్ న్యూస్..
-
పొలిటికల్ స్టైల్ షో.. ఈ అదిరే లుక్స్ చూశారా?..
-
పుష్ప పాలిటిక్స్..! పుష్ప సినిమాను గుర్తుచేసిన డీఎంకే నేత ఉదయనిధి
-
విజయ్ సూటు.. వీధుల్లో ఆమ్బులెన్స్!!
సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో మార్కెటింగ్ రూపురేఖలు మారిపోయాయి. ఒక ప్రొడక్టును జనాల్లోకి పంపించాలంటే.. దాని నాణ్యత, ధరలతో సంబంధం లేకుండా పోతోంది. వీలైనంత వైవిధ్యంగా జనాలకు దానిని ప్రదర్శించాల్సి వస్తోంది. చిన్నాచితకాలే కాదు బ్రాండెడ్ కంపెనీలు ఈ విషయంలో కూడా పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో అవసరమైతే ఎంతకైనా వెళ్తున్నాయి. ముంబైలో మామిడి పండ్ల కొరతను వైవిధ్యంగా క్యాష్ చేసుకోవాలని ఇన్‌స్టామార్ట్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆమ్బులెన్స్ అనే కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చింది. ఆంబులెన్స్లాంటి వెహికిల్‌లో ఓ వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉంటాడు. అతని చుట్టూరా మామిడి పండ్లు ఉంటాయి. అది ఆంబులెన్స్కాదు.. మామిడి ఫీవర్‌కు ఆమ్ (మామిడి) + అంబులెన్స్=ఆమ్బులెన్స్ అంటూ ఇన్‌స్టామార్ట్ ప్రచారం ఉవ్వెత్తున్న చేస్తోంది. Reason why India doesn't export mangoes: pic.twitter.com/3Ddy41CMtF— Xavier Uncle (@xavierunclelite) May 13, 2026ఇక.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేసింది తెలిసిందే. సీఎంగా ఆయన సూట్ అవతారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే విజయ్ ట్రెండింగ్‌లో ఉండడంతో తమిళనాడులోని పలు వస్త్రదుకాణాలు ఆయన ఫొటోలను తెగ వాడేస్తున్నాయి. ది చెన్నై సిల్క్స్ ఓ అడుగు ముందుకేసి ఆ కాంబోపై ఆఫర్లు ప్రకటించింది. ఫ్యాషన్‌ను ఫన్‌గా మార్చిన ఈ స్టంట్.. సీఎంను కాస్త “Chief Marketing Influencer” కాన్సెప్ట్‌తో వస్త్రాలను పరిచయం చేస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. The Chennai Silks : A major textile retailer..introduces CM Vijay look attire!CM - Chief Marketing (Influencer)? pic.twitter.com/6AvxgOcDbn— We Dravidians (@WeDravidians) May 13, 2026వేసవిలో బ్రాండ్లు కేవలం ఉత్పత్తులు అమ్ముకోవడంతో పాటు వినియోగదారుల మనసును గెలుచుకోవడానికి కొత్త కొత్త స్టంట్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్‌స్టామార్ట్ ఆమ్బులెన్స్, తమిళనాడు సీఎం విజయ్ వస్త్రధారణ మార్కెట్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. మార్కెటింగ్‌లో ఈ రెండు స్టోరీ టెల్లింగులను చూసిన వాళ్లంతా ‘వారెవ్వా.. ఏం వాడకమయ్యా’ అని ఫిదా అయిపోతున్నారు. -
తమిళనాడు సీఎం విజయ్ కు వైఎస్ జగన్ ఫోన్
-
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్‌లో మద్దతు ఇవ్వడంతో, ఏఐఏడీఎంకే కఠిన చర్యలకు ఉపక్రమించింది. టీవీకేకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పార్టీ పదవుల నుంచి తొలగించింది.జిల్లా కార్యదర్శి పదవులతో సహా వివిధ బాధ్యతలలో ఉన్న 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 29 మంది ఏఐఏడీఎంకే నాయకులను పదవుల నుంచి తొలగించారు. ఈ జాబితాలో సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పీ. వేలుమణి, ఆర్. కామరాజ్, సి. విజయభాస్కర్, తంగమణి, కేపీ అన్బళగన్, కేసీ వీరమణి, ఎంఆర్. విజయభాస్కర్ వంటి పలువురు కీలక నాయకులు ఉన్నారు.ఈ చర్యతో ఏఐఏడీఎంకేలో అంతర్గత విభేదాలు మరింతగా బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళని స్వామి ఎమ్మెల్యేలను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్‌లో మెజారిటీని నిరూపించుకోవడం ద్వారా తన స్థిరత్వాన్ని బలపరచుకుంది. -
తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు.ఫోన్ సంభాషణలో సీఎం విజయ్‌తో.. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. సమర్థవంతమైన, పారదర్శకమైన.. ప్రజాపాలన అందించాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలి. తమిళనాడు ప్రజలు మీ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలి. మీ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలి. భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని కోరుకుంటున్నాని వైఎస్ జగన్ ఆకాంక్షించారు A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026 అంతకు ముందు మే4న తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో విజయ్‌కు వైఎస్ జగన్ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. సోదరుడు విజయ్‌కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్‌కు మరింత మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. తాజాగా, ఇవాళ వైఎస్ జగన్ విజయ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
కేంద్రానికి సీఎం విజయ్ రిక్వెస్ట్.. ఎందుకంటే?
చెన్నై: నీట్‌ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజ్ఞప్తి చేశారు. నీట్-యూజీ (NEET-UG) 2026 రద్దు, పరిణామాల నేపథ్యంలో ఈ పరీక్షా విధానంలోని నిర్మాణాత్మక లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు.12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవల పేపర్ లీక్ జాతీయ స్థాయి పరీక్షా విధానంలోని లోపాలను బయటపెట్టిందని.. ఇది లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఆశలను అడియాశలు చేసిందన్నారు. నీట్ పరీక్ష గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి, తమిళ మీడియం విద్యార్థులకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ (CBI) విచారిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా సిబిఐ ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పరీక్షల పారదర్శకతను పునరుద్ధరించడానికి ఎన్టీఏ స్థానంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని 'ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దర్యాప్తు ప్రకారం.. సిక్కర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి ద్వారా ఈ పేపర్ లీక్ మూలాలు కేరళ వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాలన్నీ సుమారు 22 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయి. -
అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
DMK వాక్అవుట్ .. బలపరీక్షలో 144 MLAల సపోర్ట్
-
అసెంబ్లీ లో అన్నాడీఏంకే హైడ్రామా
-
TVKలో షణ్ముగం వర్గం విలీనం..!? AIADMK చాప్టర్ క్లోజ్!
-
TVK సంచలన నిర్ణయం.. OSD రాధన్ పండిట్ నియామకం రద్దు
-
తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ
తమిళ రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ లేనంతగా గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రి కావడం. టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారం దక్కించుకున్నారు. రీసెంట్‌గానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల బలపరీక్షలోనూ నెగ్గారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కి దక్కింది. అయితే అధికారం దక్కించుకునే సీఎం విజయ్ సోఫా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు చేశారు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)ఉదయనిధి.. విజయ్‌పై విమర్శలు చేసిన సందర్భంలోనే తెలుగు బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా 'పుష్ప' గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యమంత్రి విజయ్‌పై ఘాటు విమర్శలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. సోఫా సెట్ రాజకీయం చేశారంటూ సీఎంపై కౌంటర్లు వేశారు. ఆయన పుష్ప తరహా సోఫా రాజకీయం చేశారని విమర్శించారు. ముందు సోఫాని ఎమ్మెల్యేకి పంపిన తర్వాతే సీఎం.. పూల బొకేలతో అక్కడికి వెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలని అప్పుగా తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలు వేశారు. టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఉదయనిధి ఆరోపించారు. ఉదయనిధి ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. ప్రభుత్వాన్ని నడపడానికి రేసు గుర్రాలని కొనే అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.'పుష్ప 2' సినిమాలో హీరో, కేంద్రమంత్రి పాత్రధారిని కలవడానికి ముందే డబ్బుల కట్టలతో నిండిన సోఫాని ఆయనకు పంపిస్తాడు. అలానే రావు రమేశ్ పాత్రని ముఖ్యమంత్రి చేసేందుకుగానూ ఎమ్మెల్యేలకు డబ్బులతో నిండిన సోఫా సెట్లని పంపిస్తాడు. అలా ఈ చిత్రంలోని సన్నివేశాల్ని రిఫరెన్స్‌గా తీసుకుని తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి) View this post on Instagram A post shared by ETamil News (@etamilnewsig) -
CM విజయ్ కి కత్తి మీద సాములా ఉదయనిధి
-
144 Seats.. విజయ్ ను వరించిన విజయం
-
CM విజయ్ ని చూసి బాబు, పవన్ నేర్చుకోవాలి..
-
నా పార్టీ నేతలు తప్పు చేసినా సరే.. అసెంబ్లీ విజయ్ విశ్వరూపం
-
టీవీకే పార్టీకి గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క ఓటు తేడాతో నెగ్గిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి ఊరట లభించింది. ఆయన్ని బలపరీక్షలో ఓటు వేయొద్దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.ఎన్నికల ఫలితంపై వివాదం ఉంటే ఎన్నికల పిటిషన్ (Election Petition) దాఖలు చేయడం సరైన మార్గమని హైకోర్టు చెప్పింది. అలాంటిది ఒక రిట్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని ఫ్లోర్ టెస్ట్‌లో ఓటు వేయకుండా ఆపింది. ఇది దారుణం. అలాంటి ఆదేశాలివ్వడం ముమ్మాటికీ తప్పే అని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.#BREAKING #SupremeCourt stays the Madras High Court's order which stopped TVK MLA Sreenivasa Sethupathi from voting in TN Assembly floor test.#TamilNadu pic.twitter.com/ljOHA56050— Live Law (@LiveLawIndia) May 13, 2026అసలేం జరిగింది..తిరప్పత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా పోటీ చేసి శ్రీనివాస సేతుపతి సమీప డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పర్ మీద ఒక్క ఓటు తేడాతో నెగ్గారు. అయితే అదే పేరుతో ఉన్న మరో నియోజకవర్గం(ఒకటి తిరప్పత్తూరు జిల్లాలో ఉంది, మరొక నియోజకవర్గం శివగంగ జిల్లాలో ఉంది) నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సు మారిపోయిందని.. ఓట్ల లెక్కింపు గందరగోళంతో శ్రీనివాస సేతుపతి నెగ్గారని.. ఆయన ఎన్నిక చెల్లదని పెరియాకరుప్పర్ హైకోర్టును ఆశ్రయించారు.శ్రీనివాస సేతుపతి(ఎడమ), పెరియా కరుప్పర్ (కుడి)శనివారం ఆయన పిటిషన్ వేస్తే.. ఆదివారం దానిని అత్యవసరంగా విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈసీ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని కోర్టులో వాదనలు వినిపించారాయన. అయితే శ్రీనివాస సేతుపతి ఎన్నికనే ఈ పిటిషన్ సవాల్ చేస్తుండడం.. ఆయన ఓటింగ్‌లో పాల్గొంటే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలపరీక్షలో ఓటేయొద్దని శ్రీనివాస సేతుపతికి మంగళవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హుటాహుటిన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ తీవ్రత దృష్ట్యా అత్యవసర విచారణ లిస్టింగ్‌కు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు. సుప్రీంలో ఇవాళ.. బుధవారం విచారణ జరిపిన కోర్టు.. శ్రీనివాస సేతుపతి తరఫున అభిషేక్ మను సింఘ్వీ, పెరియాకరుప్పర్ తరఫున మకుల్ రోహత్గీ వాదనలు వినింది. చివరకు సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. శ్రీనివాస సేతుపతికి ఊరట ఇస్తూ ఆదేశాలిచ్చింది. అదే సమయంలో డీఎంకే అభ్యర్తి వేసిన పిటిషన్‌ను మద్రాస్ బెంచ్ అత్యవసర విచారణ చేపట్టడాన్ని కూడా తప్పుబట్టింది. ఓటేయకుండా ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో పాటు పెరియాకరుప్పన్ వేసిన రిట్ పిటిషన్ విచారణపైన కూడా స్టే విధించింది సుప్రీం కోర్టు .సుప్రీం కోర్టు నిర్ణయంతో శ్రీనివాస సేతుపతి ఓటు హక్కు చెల్లుబాటు అవుతుంది. అయితే ఇప్పటికే బలపరీక్ష జరగడం.. అందులో విజయ్ టీవీకే సర్కార్ గెలవడంతో ఆ ఓటు అవసరం లేకుండా పోయింది. అదే సమయంలో.. డీఎంకే అభ్యర్థి పెరియాకరుప్పర్ వేసిన ఎన్నికల పిటిషన్‌పై మాత్రం విచారణ కొనసాగనుంది. కాబట్టి.. తుది తీర్పు వచ్చే వరకు శ్రీనివాస సేతుపతి టీవీకే ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. -
విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ
-
నాకు ఇక తిరుగులేదు.. తమిళనాడు చరిత్రలో చరిత్రాత్మక పరిణామం
-
విజయ్ సంచలన నిర్ణయం.. ఆయన నియామకం రద్దు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సొంత పార్టీ సహా మద్దతు ఇస్తున్న నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఈ నియామకాన్ని పునరాలోచిస్తానని విజయ్ సంకేతం ఇచ్చారు. అనంతరం, ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, తమిళనాడు సీఎం విజయ్ తన కార్యాలయంలో జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ప్రత్యేక అధికారి (OSD)గా నియమించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాధన్ నియామకంపై VCK, DMDK, BJP, DMK వంటి పార్టీలు విజయ్ను ప్రశ్నించాయి. ఈ క్రమంలో శాస్త్రీయ ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాలి, జ్యోతిష్యానికి కాదు అని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో విజయ్.. వెట్రివేల్ నియామకాన్ని పునరాలోచిస్తానని సంకేతం ఇచ్చారు.ఇక, ఈరోజు అసెంబ్లీలో కూడా వెట్రివేల్ నియామకంపై విజయ్ను ప్రేమలతా విజయ్‌కాంత్(విజయ్‌కాంత్ సతీమణి) ప్రశ్నించారు. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్‌కాంత్(విజయ్‌కాంత్ సతీమణి) విజయ్‌పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె.. ‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’ అంటూ చురకలు అంటించారు. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. -
ఉదయనిధికి సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త అసెంబ్లీలో పొలిటికల్ పంచులు పేలడం అప్పుడే ప్రారంభమైంది. టీవీకే ప్రభుత్వ బలనిరూపణ వేళ.. ప్రతిపక్ష డీఎంకే సంచలన ఆరోపణలకు దిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం విజయ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ బలనిరూపణ చర్చ వేళ విమర్శలు గుప్పించారు. ‘‘65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడింది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు’’ అని ఆరోపించారాయన. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం టీవీకే తీరుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగించారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు. మున్ముందు ఆ ప్రయత్నం చేయబోం. మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. కాబట్టి వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అనేది చూడం.. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. అలాగే గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయ్ టీవీకే సర్కార్ నెగ్గింది. -
బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్
-
విజయ్‌కు షాక్.. ఉదయనిధి సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ రసవత్తరంగా మారింది. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం విజయ్, టీవీకేపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారని విమర్శలు గుప్పించారు.తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వం బల పరీక్షకు ముందు సీఎం విజయ్ టార్గెట్‌గా ఉదయనిధి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ..‘ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైంది. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు.టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోంది. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందు సోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు.#WATCH | DMK MLAs walk out of the Tamil Nadu Assembly before the Floor test of the TVK government(video source: TN Assembly) pic.twitter.com/0oXlxMe4LM— ANI (@ANI) May 13, 2026పళని కౌంటర్.. అంతకుముందు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా టీవీకేను టార్గెట్ చేశారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. "We are not an enemy party; we wish to function as a responsible Opposition,” says AIADMK MLA Edappadi K. Palaniswami, adding that AIADMK MLAs would vote against the government in the Assembly. pic.twitter.com/elXR9fWGBR— ANI (@ANI) May 13, 2026కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. ఇక.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్‌పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. -
TVK విజయ్ పార్టీ నుండి రెండు సీట్లు కట్
-
సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు
సినిమాలకు సంబంధించిన వ్యక్తి.. ప్రభుత్వంలో ఉంటే పలు నిర్ణయాలు ఇండస్ట్రీకి కలిసొచ్చేలా ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కోలీవుడ్‌కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు తమిళనాడులో ఆ ట్రెండ్ మొదలైంది. ఎన్నాళ్లుగానో లేని స్పెషల్ షోలకు అనుమతి లభించింది. త్రిష హీరోయిన్గా నటించిన మూవీతోనే దీనికి శ్రీకారం చుట్టడం విశేషం.(ఇదీ చదవండి: టాలీవుడ్‌కి బిగ్‌షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది)తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు తొలిసారి ఊరట లభించింది. సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' మూవీకి మే 14,15 తేదీల్లో ఉదయం 9 గంటల స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమిళనాడులో చాన్నాళ్ల నుంచి స్పెషల్ షోలు లేవు. దీంతో ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్టర్స్.. సీఎం విజయ్‌కి థ్యాంక్స్ చెప్పింది. తెలుగులో ఈ చిత్రం 'వీరభద్రుడు' పేరిట రిలీజ్ కానుంది. విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 2 వరకు రెండు రోజుల పాటు మొత్తం 5 షోలు వేయనున్నారు.సూర్య,త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన 'కరుప్పు' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. కోర్టులో సామాన్యులకు న్యాయం అందకుండా చేసే ఓ అవినీతి లాయర్ భరతం పట్టేందుకు దేవుడే దిగివస్తే ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత రెండు మూడు సినిమాలతో బాగా డీలాపడిపోయిన సూర్య.. ఇది హిట్ అవ్వడం చాలా కీలకం. మరి ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
విజయ్‌పై ప్రేమలతా విజయ్‌కాంత్ ఎదురుదాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కొంటున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్‌కాంత్(విజయ్‌కాంత్ సతీమణి) విజయ్‌పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’’ అని విజయ్‌కు చురకలంటించారామె. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. முதல்வர் விஜயை பார்த்து கேட்ட பிரேமலதா #premalatha pic.twitter.com/ei8tNlTIJi— Way2News Tamil (@way2news_) May 13, 2026Video Source: Way2News Tamil మరోవైపు.. బల నిరూపణ వేళ విజయ్ సర్కార్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విడుదల చిరుతైగల్ కట్చి(VCK) పార్టీ సైతం జ్యోతిష్యుడిని నమ్ముకుని పాలన చేయొద్దని విజయ్‌కు హితవు పలికింది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తు.. 108 సీట్లు గెల్చుకుంది. ఆ సమయంలో డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్‌కు అభినందనలు తెలియజేశారు. విజయ్ తన బిడ్డలాంటోడని.. మొదటి నుంచి తన భర్త విజయ్‌కాంత్‌కు దగ్గరగా ఉండేవాడని.. ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు ఇస్తారా? అనే అంశంపై మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఎన్డీయే కూటమిలో భాగంగా విరుదాచలం నుంచి పోటీ చేసిన ఆమె.. ఆ పార్టీ నుంచి పోటీ నెగ్గిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు. -
Watch Live: విజయ్ సర్కార్ కు బలపరీక్ష.. నెంబర్ గేమ్ పై ఉత్కంఠ
-
బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ నేరుగా.. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 144 మంది విజయ్ టీవీకే సర్కార్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ నుంచి 61 మంది వాకౌట్(డీఎంకే సభ్యులతో పాటు) చేయగా.. 22 మంది విజయ్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. బీజేపీ, పీఎంకే సభ్యులు ఐదుగురు గైర్హాజరు అయ్యారు. బలపరీక్ష విషయంలో తటస్థంగా ఉన్నట్లు బీజేపీ తర్వాత ఓ ప్రకటన విడుదల చేసింది. విజయ్ ధన్యవాదాలుతమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ వేళ.. ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు.మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని అన్నారు. అంతకు ముందు.. చర్చ సందర్బంగా ఒక్కో పార్టీ విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే అన్నాడీఎంకే వంతు వచ్చేసరికి హైడ్రామా మొదలైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే వేలుమణికి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే ఒక రెబల్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఏంటని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకుని.. సంచలన ఆరోపణలకు దిగారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. చివరకు చేసేది లేక పళనిస్వామి వర్గం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఉదయనిధి సంచలన ఆరోపణలుప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోంది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఓటింగ్..విజయ్ సర్కార్ బలనిరూపణ కోసం ఓటింగ్ జరిగింది. టీవీకేకు బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 118. బలనిరూపణ ఓటింగ్ సందర్భంగా మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించగా.. ఒక్కొక్కరు లేచి తమ హాజరును ప్రదర్శించారు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంల్, వీసీకే, ఏఎంఎంకే రెబల్ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకేలో రెబల్ ఎమ్మెల్యేలు(షణ్ముగం వర్గం 25 మంది) విజయ్‌కు సపోర్ట్‌గా లేచి నిలబడ్డారు.కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్‌పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. Tamil Nadu Legislative Assembly: Confidence motion moved in support of the Council of Ministers led by Chief Minister Vijay. pic.twitter.com/uxT0BMzNoY— Vijay Fans Trends (@VijayFansTrends) May 13, 2026 -
నేడే సీఎం విజయ్ బల పరీక్ష
-
లిక్కర్ షాపులపై విజయ్ సంచలనం..
-
నేడు విజయ్ సర్కార్‌కు బలపరీక్ష
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శాసనసభలో విజయ్ సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అయితే అధికార టీవీకేకు చెందిన ఒక ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.తమిళనాడు ఎన్నికల్లో 234 స్థానాలకుగానూ విజయ్ పార్టీ 108 సీట్లు గెలిచింది. విజయ్ రెండు చోట్లా పోటీ చేయడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో టీవీకే బలం 107కి పడిపోయింది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4, వీసీకే 2 సీట్ల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118ని టీవీకే చేరుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. ఒక ఓటు తేడాతో నెగ్గిన తిరుప్పత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్‌లో తేడా జరిగిందని.. శ్రీనివాస ఎన్నిక చెల్లదంటూ డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియాకరుప్పర్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ టీవీకే ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అయితే.. శ్రీనివాస్ దూరం అయిన నేపథ్యంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వ బలం 117కి పడిపోయింది. అయితే ఏఎంఎంకే పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ తన అధిష్టానాన్ని ఎదురించి మరీ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అలాగే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. అందులోని 28 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ (Vijay) సీవీ షణ్ముగం నివాసానికి వెళ్లి భేటీ కావడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో.. ఇవాళ్టి బలనిరూపణ ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
అరవ చదరంగం అదుర్స్
-
వీసీకే అధినేతను సీఎంను చేయడానికి సంప్రదింపులు జరిగాయా?
చెన్నై: కులం-ముఖ్యమంత్రి పదవి గురించి విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) అధినేత తొల్ తిరుమావళవన్ ఇటీవల చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వీసీకే మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కూటమి ఏర్పాటు జరిగితే తనను ముఖ్యమంత్రిని చేస్తామంటూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు సంప్రదించాయంటూ వచ్చిన వార్తలను తిరుమావళవన్ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యల అర్థాన్ని వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని తిరుమావళవన్ మీడియాను కోరారు. “మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని కొందరు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని అంటున్నారు” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారని తిరుమావళవన్ తెలిపారు. దానికి తాను స్పందిస్తూ.. “అలాంటి ప్రయత్నం జరిగిందని నాకు కూడా సమాచారం వచ్చింది” అని అన్నారు.ఎవరూ నన్ను సంప్రదించలేదు తనకు పరిచయం ఉన్న కొంతమంది స్నేహితులు వచ్చి తనను ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాల గురించి మాట్లాడారని తెలిపారు. అంతేగానీ, డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి అధికారికంగా ఎవరూ తనను ముఖ్యమంత్రి విషయంపై సంప్రదించలేదని, తానూ ఈ విషయం గురించి ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. ఆ ప్రశ్నకు తాను వివరణ ఇచ్చానని.. కానీ, దానికి వేరే అర్థం వచ్చేలా శీర్షికలు పెట్టి వార్తలు ప్రచారం చేసి సంచలనం సృష్టించడం మీడియాకు సరికాదని తెలిపారు. నిన్న, ఇవాళ దీని గురించి మీడియాలో నిర్ధారణ కాని వార్తలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడులో దళిత సమాజానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని చేసేందుకు తమిళ సమాజం ఇంకా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన చేదు నిజమని చెప్పారు.భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో దళితులు ముఖ్యమంత్రులుగా పాలనా పీఠంపై నిలిచిన చరిత్ర ఉందని తెలిపారు. కానీ, తమిళనాడులో ఇంకా 100 సంవత్సరాలు గడిచినా అది కలగానే మిగులుతుందని తనకు తెలుసని చెప్పారు. అయినా, నేటి రాజకీయ పరిస్థితుల్లో అలాంటి చర్చ జరిగిందని చెప్పారు. దాన్ని వక్రీకరించి వేరే అర్థం వచ్చే ఉద్దేశంతో కొన్ని మాధ్యమాలు వార్తలు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని తిరుమావళవన్ చెప్పారు. కాగా, టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఉంది. కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు తలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. -
విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ AIADMK (అన్నాడీఎంకే) చీలిక దిశగా వెళ్తుండటంతో, ఆ పార్టీకి చెందిన రెబల్ వర్గం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించు కోవాల్సి ఉన్న తరుణంలో సీఎం విజయ్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో CV షణ్ముగం, SP వేలుమణిలతో భేటీ కావడంతో తమిళనాట రాజికీయాలు మరింత వేడెక్కాయి.ముఖ్యమంత్రి విజయ్, టీవీకే కూటమికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే కీలక నేతలతో సమావేశ మయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి (EPS) ప్రతిపాదనపై వ్యతిరేకత కారణంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రెబల్ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఇది తమ ఎమ్మెల్యేలలో అత్యధికుల నిర్ణయమని షణ్ముగం మంగళవారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.కొత్త నాయకత్వంరెబల్ వర్గం తమ సొంత నాయకత్వాన్ని ఎన్నుకుంది:శాసనసభాపక్ష నేతగా ఎస్.పి. వేలుమణిని, డిప్యూటీ లీడర్‌గా జి. హరిని ఎన్నుకోవడం సంచలనం రేపింది.విజయ్‌తో అన్నాడీఎంకే రెబల్ నేతల భేటీఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, బద్ధశత్రువైన DMK (డీఎంకే) మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని భావించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని షణ్ముగం తెలిపారు.డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడకే ముప్పు అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే తమ రాజకీయం ఉందని, అందుకే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకేలో మరో చీలిక తమకు ఇష్టం లేదని ఎస్.పి. వేలుమణి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పళనిస్వామిని కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే (108 సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే 59 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతుతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం కానుంది. -
డియర్ విజయ్ హ్యాట్సాఫ్ : హీరో విశాల్ ప్రశంసలు
తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసి, రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకున్న తాజా నిర్ణయంపై హీరో విశాల్ స్పందించారు. తన తొలి సంతకంతోనే మరో సంచలనం క్రియేట్ చేసిన సీఎం విజయ్ నిర్ణయంపై విజయ్ చిరకాల మిత్రుడు, విశాల్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై కూడా విశాల్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు మరియు బస్టాండ్లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 మద్యం దుకాణాలను (TASMAC) మూసివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరోవైపు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి, అధికారాన్ని చేపట్టడం, తొలి నిర్ణయంతోనే తనదైన ముద్ర వేయడంతో విజయ్ అభిమానులు, తమిళ ప్రజలు సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు."ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హ్యాట్సాఫ్. పాఠశాలల సమీపంలోని 717 మద్యం దుకాణాలను మూసివేయడం గొప్ప నిర్ణయం. స్కూళ్ల దగ్గర మద్యం దుకాణాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. ఈ చర్యతో వారికి ఊరట లభిస్తుంది. వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఎంత గొప్ప చర్య," అని విజయ్‌కు పంపిన వీడియో సందేశంలో విశాల్ పేర్కొన్నారు. అంతేకాదు "ప్రియమైన విజయ్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ రోజు మీకు, మీ ప్రభుత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను," అంటూ మరో పోస్ట్‌లో తన సంతోషాన్ని ప్రకటించారు.చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాల వద్ద మద్యం షాపుల కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.Kudos to you ,whistles to u. Hats off to u. Dear CM josephvijay avargal. Thank u for the announcement to close 717 wine shops especially the ones near schools. Wat a move. So many girl children hav been facing harassment especially the one I know in rk nagar where a girl… pic.twitter.com/vYria0MIaB— Vishal (@VishalKOfficial) May 12, 2026 కాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలను గెలుచుకుంది. అయితే పూర్తి మెజారిటీకి (118) పది సీట్లు తక్కువ కావడంతో, వారం రోజుల హైడ్రామా తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు,వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం చేసిన తరవాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర కీలక నేతలను గౌరవప్రదంగా కలుసుకోవడం కూడా నెట్టింట ఆకర్షణీయంగా మారింది. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ టీవీకే
ఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో టీవీకే నేత, తిరుపత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్.శ్రీనివాస సేతుపతితో పిటిషన్ దాఖలు చేయించింది. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఓటు వేయకుండా సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నేత పెరియకరుప్పన్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు సేతుపతి. స్వల్ప మెజారిటీపై ప్రత్యర్థి ఫిర్యాదు చేయడంతో సేతుపతి ఓటు హక్కుపై న్యాయస్థానం ఆంక్షలు విధించింది. దీంతో ప్రజాప్రతినిధిగా తన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టును కోరారు సేతుపతి. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.కాగా, మంగళవారం జరగనున్న అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతిని మద్రాస్ హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బ్యాలెట్ ఓటులో మార్పులు జరిగాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్యేగా సేతుపతి బాధ్యతలు చేపట్టకుండా ఆపాలని కేఆర్ పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో హైకోర్టు నుంచి ఆంక్షలు విధిస్తూ ఈ ఉత్తర్వులు వచ్చాయి.పిటిషన్ ప్రకారం.. తిరుపత్తూర్ నియోజకవర్గం నం.185లో నమోదు కావాల్సిన ఓటును వెల్లూరు జిల్లాలోని తిరుపత్తూర్ నియోజకవర్గం నం.50కు మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత బ్యాలెట్ వ్యత్యాసాలపై ఫిర్యాదు వస్తే నిబంధనల ప్రకారం చర్యలు అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఒక్క ఓటును కూడా మరో నియోజకవర్గానికి మార్చలేదని సంఘం వెల్లడించింది. అయితే, పెరియకరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు మద్దతుగా సరిపడా ఆధారాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా శ్రీనివాస సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించింది. -
జ్యోతిష్కుడి జోస్యం నిజమైంది.. సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన పరిపాలనా దక్షతతో దూసుకుపోతున్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. పాఠశాలల సమీపంలోని 717 వైన్ షాపులను మూసివేయాలని సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు, సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ చర్యను చాలా మంది స్వాగతిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న మరో నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహాలపై సలహా ఇచ్చే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(OSD)గా ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రీటా హరీష్ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఎవరు? గత 40 ఏళ్లుగా ఆయన వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ధ్యానం ఆధారిత మార్గదర్శకత్వం చేస్తున్నారు. దేశంలో అత్యంత ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కులు, రాజకీయ జ్యోతిష్కులులో ఒకరిగా గుర్తింపు పొందారు. 2008లో తమిళనాడు నుంచి ముంబైకి మకాం మార్చి రాధన్ పండిట్ అనే పేరుతో జ్యోతిష్యం చెబుతున్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం, ఆయనకు దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, ఏఐడీఎంకే నేతలు క్లయింట్లుగా ఉన్నారు.విజయ్‌తో సంబంధం ఎన్నికలకు ముందు విజయ్ టీవీకే పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన ప్రముఖుల్లో వెట్రివేల్ ఒకరు. గతంలో విజయ్ జాతక చక్రం బలంగా ఉందని, రాజకీయాల్లో విజయ్ సునామీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.తమిళనాడులో విజయ్ 150కి పైగా సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలో దేవాలయాలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని కూడా పేర్కొన్నారు. 2024లో విజయ్ రాజకీయాల్లో విజయం సాధించే కారణాలను ఆయన తన యూట్యూబ్ వీడియోలో వివరించారు. ఆ తర్వాత విజయ్ ఆయనను టీవీకే అధికారిక ప్రతినిధిగా నియమించుకున్నారు. రాధన్ జోస్యం నిజం కావడంతో తన రాజకీయ సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.అయితే, విజయ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోత్యుష్కుడి ప్రభుత్వ పదవి ఇవ్వండి ఏంటని విమర్శించే వారు లేకపోలేదు. మరి ఈ విమర్శల్ని విజయ్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. -
నేను విజయ్ ఒకటే కాలేజ్ అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్
-
సీఎం విజయ్ స్పీచ్ కు దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ
-
ఉదయనిధి స్టాలిన్ స్పీచ్ కు సీఎం విజయ్ రియాక్షన్
-
సీఎం విజయ్ స్పీచ్ తో దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ
-
సనాతన ధర్మంపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్‌గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్‌కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మం(sanatana dharma)పై విమర్శలు చేశారు. “ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిధి అన్నారు. అలాగే.. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ తాయ్ వజ్తు కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయ మర్యాద కొనసాగాలి. ప్రభుత్వం–ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. ప్రజల కోరిక కూడా అదే” అని అన్నారు. సీఎం విజయ్ను ఉద్దేశిస్తూ.. “ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. రాజకీయాల్లో మేము సీనియర్లు. మా అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఉదయనిధి ప్రసంగం ముగిశాక.. ప్రతిగా సీఎం విజయ్ నమస్కారం చేశారు.Udhayanidhi Stalin again says"SANATANA MUST BE ERADICATED."CM Joseph Vijay in assembly just looks on and even greets with folded hands pic.twitter.com/MNMz7PWmQL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2026ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ స్పందించేందుకు నిరాకరించారు. “ఈ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల గౌరవం మాత్రమే జరగాలి. ఇతర విషయాలపై సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను” అని అన్నారు. 2023లో ఉదయనిధి మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సిద్ధాంతం. దాన్ని నిర్మూలించడం మానవత్వం, సమానత్వాన్ని కాపాడటమే” అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్ హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. బాధ్యత గల పదవిలో ఉండి విద్వేషపూరిత ప్రసంగం చేయడమేంటని మందలించింది. అయినప్పటికీ ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గలేదు. -
TVK అధినేత, సీఎం విజయ్ కు మద్దతు ప్రకటన
-
TVK MLA జేబులో జయలలిత ఫోటో విజయ్ డిఫరెంట్
-
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్
చెన్నై: తమిళనాడు 17వ శాసనసభ సభాపతి (స్పీకర్)గా టీవీకే సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో సీఎం విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్పీకర్ పదవికి ప్రభాకర్ మే 11న నామినేషన్ దాఖలు చేయగా.. ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ పడకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.కాగా, జేసీడీ. ప్రభాకర్‌కు శాసనసభ నిబంధనలు, సంప్రదాయాలపై అపారమైన అనుభవం ఉంది. 2011లో విల్లివాక్కం నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారింది. అన్నాడీఎంకేలో సీనియర్ నేతగా ఇది వరకు ఉన్న జేసీడీ ప్రభాకర్ ప్రస్తుతం టీవీకే తరపున థౌజండ్ లైట్స్ నుంచి గెలిచారు. సీఎం విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగం తరపున సీనియర్ నాయకుడు, థౌజండ్ లైట్స్ ఎమ్మెల్యే జే.సీ.డీ. ప్రభాకర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం విజయ్, మంత్రులతో కలిసి ఆయన ఈ నామినేషన్‌ను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఇవాళ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కెప్టెన్ విజయకాంత్ భార్య మాటలకు అసెంబ్లీలో ఎమోషనల్
-
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
తమిళనాడులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిత్రపక్షం అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. టీవీకే విజయ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే టీవీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూడా అదే ప్రకటన చేసింది. ‘‘డీఎంకేతో చేతులు కలిపి సీఎం కావాలని పళనిస్వామి కుట్ర చేశారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నాం. ఇకపై ఎన్డీయే కూటమికి.. మాకు సంబంధం లేదు. మాదే అసలైన అన్నాడీఎంకే. విజయ్ ప్రజల సీఎం. అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని అన్నాడీఎంకే రెబల్ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం ప్రకటించారు. ఆ వెంటనే.. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ అధినేత టీవీవీ దినకరన్ హైడ్రామా నడిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న టీవీకేకు తొలుత కామరాజ్ మద్దతుగా సంతకం చేశారు. అయితే తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ విషయంపై గవర్నర్‌కు, పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ మిత్రపక్షం అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉందని.. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. అయితే.. టీవీకే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అయినా కూడా దినకరన్ తన ఆరోపణలను కొనసాగించారు. ఈ తరుణంలో.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటన చేయడం గమనార్హం. అయితే తన ఎమ్మెల్యే కామరాజ్ దినకరన్ సూచన మేరకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటన చేశారా?.. లేదంటే రెబల్‌గా సంతకం చేశారా? ఎన్డీయే కూటమి నుంచి దినకరన్ పార్టీ కూడా బయటకు వచ్చేసినట్లేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మొత్తం 234 స్థానాలకుగానూ.. 223 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేసి 47 గెల్చుకుంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు నెగ్గింది. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. పట్టాలి మక్కల్ కట్చి(PMK) 18 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలిచింది. ఫలితంగా, ఈ కూటమి మొత్తం 53 స్థానాలు గెలుచుకుంది.ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఎన్డీయే కూటమిలో.. లుకలుకలు బయటపడ్డాయి. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (24-30) మంది కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించారు. ఇటు దినకరన్ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పళని వర్గ ఎమ్మెల్యేలు, పీఎంకే 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే మాత్రమే మిగిలినట్లైంది!. -
విజయ్ తో కనిపించే ఆ వ్యక్తి ఎవరు? సోషల్ మీడియాలో హాట్ టాపిక్
-
బల పరీక్షకు ముందు టీవీకేకు షాక్
సాక్షి, చెన్నై: తమిళనాడులో బల నిరూపణకు ముందు తమిళగ వెట్రి కగళం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ఓటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్ సేతుపతి ఈ ఎన్నికల్లో టీవీకే తరఫున తిరుప్పత్తూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పన్‌పై ఒక్క ఓటుతో గెలిచారు. కౌంటింగ్ సమయంలో ఆ టైంలో హైడ్రామా నడిచింది. అయితే.. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. తిరుపత్తూరు నియోజకవర్గం నం.185లో నమోదు కావలసిన ఓటు, పొరపాటున వెల్లూరు జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గం నం.50కి బదిలీ చేయబడిందని.. ఈ విషయంపై తాను ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కరుప్పన్ కోర్టులో వాదించారు. ఈసీ మాత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఫిర్యాదులపై చర్య అవసరం లేదని పేర్కొంది. అలాగే, ఒక్క పోస్టల్ ఓటు కూడా ఇతర నియోజకవర్గానికి బదిలీ కాలేదని స్పష్టం చేసింది. అయితే.. కోర్టు పెరియా కరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు ఉన్నాయని గమనించింది. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా ఓటు వేయడానికి వీల్లేదని శ్రీనివాస్‌కు తేల్చి చెప్పింది. అదే సమయంలో.. అన్ని పోస్టల్ బ్యాలెట్లను సురక్షితంగా భద్రపరచాలని, సంబంధిత వీడియో ఫుటేజ్‌ను కూడా కాపాడాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఓటింగ్‌కు శ్రీనివాస్ సేతుపతి దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు మ్యాజిక్ ఫిగర్ 118. గవర్నర్‌కు విజయ్ సమర్పించిన మద్దతుదారు ఎమ్మెల్యేల సంఖ్య 118. ఇందులో టీవీకే 107, కాంగ్రెస్ 5, వీసీకే 2, లెఫ్ట్ పార్టీలు 4 ఉన్నాయి. బల నిరూపణకు ఒక్క ఎమ్మెల్యే దూరం అయితే ఆ ఫిగర్ 117కి పడిపోనుంది. అయితే ఏఎంఎంకే, అన్నాడీఎంకే చీలిక వర్గ ఎమ్మెల్యేల మద్దతు ప్రకటనతో గండం నుంచి విజయ్ గట్టెక్కే చాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. -
స్టాలిన్ ఇంటికి విజయ్ భయంతో వెళ్లాడా? మర్యాదపూర్వకమా!
-
సీఎం విజయ్ సంచలన నిర్ణయం మద్యం దుకాణాలు క్లోజ్
-
ఎన్డీయేకు ఝలక్.. విజయ్‌కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు
అన్నాడీఎంకే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యే వర్గం సంచలన ప్రకటన చేసింది. ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగని ఇది పార్టీని చీల్చే ప్రయత్నం ఏమాత్రం కాదని ఆ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం తేల్చి చెప్పారు. సీవీ షణ్ముగంలో నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు(24 మంది అని కొన్ని తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయ్) విజయ్‌కు మద్దతు ప్రకటించారు. తాము ఏ పదవులనూ ఆశించబోవడం లేదని.. బయటి నుంచే విజయ్ సర్కార్‌కు సపోర్ట్ ఇస్తామని అన్నారు. చెన్నైలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు నిజమేనని ఆయన అంగీకరించారు. ‘‘విజయ్ ప్రజల సీఎం. ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలని తమిళ ప్రజలు కోరుకున్నారు. ప్రజా నిర్ణయమే మాకు శిరోధార్యం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని షణ్ముగం ప్రకటించారు. అదే సమయంలో.. పార్టీ లుకలుకలను ఆయన మీడియాకు వివరించారు. డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళని స్వామి కుట్ర చేశారు. ఎలాగైనా ఆయన సీఎం కావాలని అనుకున్నారు. ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదు. అన్నాడీఎంకే స్థాపన లక్ష్యం డీఎంకేను ఎదుర్కోవడం. అలాంటి పార్టీతో చేతులు కలపడం పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమే కాదు.. అత్యంత ప్రమాదకరం కూడా. ఈ విషయంలో పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పాం అని షణ్ముగం వివరించారు. వరుస ఓటములకు పళనినే కారణమన్న షణ్ముగం.. ఆయన అన్ని పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మాదే అసలైన అన్నాడీఎంకే కూటమి.. ఎన్డీయేతో మాకు సంబంధం లేదు.. మేం బయటకు వచ్చేశాం. ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తాం అని స్పష్టం చేశారాయన. దీంతో పళనిస్వామి ఎలా స్పందిస్తారు? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది?. కూటమి విచ్ఛిన్నంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో? అనే ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 53 సీట్లు నెగ్గింది. అన్నాడీఎంకే 47 స్థానాల్లో.. పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో సీటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్‌కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంతో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్‌కు మద్దతు పార్టీకి ప్రజల్లో సింపథీ క్రియేట్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో అది పనికి వస్తుందని వాదించింది. అంతేకాదు.. ఆ పార్టీ తరఫున శాసనసభా పక్షనేత, ఉప నేత ఎంపికలోనూ ఈ వర్గపోరు మరింత ఉధృతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన అనుచర గణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి శాసనసభా పక్ష నేత, డిప్యూటీ పదవిని జీ హరి, సీ భాస్కర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే పోరు ముదిరి బయటకు వచ్చి ప్రకటన చేసింది. రేపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కొనుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన బూస్ట్ కానుంది. -
విజయ్ ప్రమాణస్వీకారోత్సవం చూస్తూ..
తిరువొత్తియూరు: తిరుచ్చి నవ్లూర్ కుట్టపట్టు, వన్నంకోవై ప్రాంతానికి చెందిన జార్జ్ విలియం సేతురాజ్ (33) పెట్రోల్ బంక్ ఉద్యోగి. ఇతను నటుడు విజయ్‌కు వీరాభిమాని. విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుండి తమిళగ వెట్రి కళగం లో తీవ్రంగా పనిచేశాడు.గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరంగం నియోజకవర్గ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఎన్నికల్లో విజయ్ నాయకత్వంలోని పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంతో అతను ఎంతో సంతోషించాడు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జరిగిన ఆలస్యం అతడిని కొంత ఆందోళనకు గురిచేసింది. దీంతో ఫలితాల కోసం 24 గంటలూ టీవీ చూస్తూనే ఉన్నాడు. ఆదివారం అన్ని అడ్డంకులను అధిగమించి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దశ్యాలను టీవీలో చూస్తుండగా, జార్జ్ విలియమ్‌కు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. వెంటనే తన బైక్ మీద భార్యను కూర్చోబెట్టుకుని 3 కి.మీ దూరంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తనే స్వయంగా నడుపుకుంటూ వెళ్లాడు. మార్గమధ్యంలో నొప్పి ఎక్కువవడంతో, అక్కడి నుంచి కారులో మరో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే జార్జ్ విలియం ప్రాణాలు విడిచాడు. అతిగా కలిగిన ఆనందంతో వచ్చిన గుండెపోటు మరణానికి కారణమని చెబుతు న్నారు. మరణించిన జార్జ్ విలియం కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అతనికి 4 ఏళ్ల కవల పిల్ల లు ఉన్నారు. అందులో జోస్వ అనే బాబు మూగవాడు (దివ్యాంగుడు). జార్జ్ తల్లిదండ్రులు కూడా వద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి విజయ్ అండగా నిలవాలని బంధువులు, స్థానికులు కన్నీళ్లతో కోరుతున్నారు. -
గేమ్‌ఛేంజర్.. కీర్తన
సాక్షి, చెన్నై : సీఎం విజయ్ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్. కీర్తన గురించిన చర్చ తమిళనాట ప్రధాన అంశంగా మారింది. 29 ఏళ్ల ఈ ’యువ తుపాన్’.. 5 భాషల్లో ప్రావీణ్యం..సాధించి ఉండడంతో ఆమె గురించిన ఆసక్తికర అంశాలను తెలుసుకునే వారు పెరిగారు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైన ధృవీకరణ పత్రాన్ని మరచి పోవడంతో ఆమెపై చర్చ మరింత ఊపందుకుంది. రాజకీయ వ్యూహకర్త నుండి మంత్రి వరకు.. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గం నుండి విజయం సాధించిన కీర్తన, కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, ఒక సమర్థవంతమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ (రాజకీయ వ్యూహకర్త). ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రఖ్యాత రాజకీయ సలహా సంస్థలైన ఐప్యాక్, షోటైమ్ కన్సల్టింగ్‌లో డిజిటల్ క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేశారు. కీర్తన తన వృత్తిపరమైన ప్రయాణంలో దేశంలోని హేమాహేమీలైన రాజకీయ నాయకుల వద్ద పనిచేశారు. చదువు ..భాషా నైపుణ్యం విరుదునగర్ ప్రభుత్వ పాఠశాలలో తమిళ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన కీర్తన, మదురై కామరాజ్ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్, పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. ఈమెకు తమిళం, తెలుగు, ఇంగ్లీష్ హిందీ, మలయాళం వంటి 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా విజయ్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆమె హిందీ నేర్చుకోవడం విశేషం.శివకాశిలో సరికొత్త రికార్డు 2026 ఎన్నికల్లో శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన, తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్‌ను 11,670 ఓట్ల మెజారిటీతో ఓడించారు. గత 70 ఏళ్లలో శివకాశి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించారు. రాజకీయ నేపథ్యం గానీ, ధన బలం గానీ లేకపోయినా.. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే విజయ్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుంది అనడానికి తానే ∙నిదర్శనం అని కీర్తన వ్యాఖ్యానిస్తున్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి, రాజకీయ వ్యూహకర్తగా అనుభవం గడించి, నేడు ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన కీర్తన ప్రయాణం తమిళనాడులోని ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా మారినట్లయ్యింది. -
లిక్కర్ షాపులపై విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే కీలక హామీల ఫైల్స్‌పై ఆయన సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మహిళల భద్రతకు సంబంధించిన టీం పర్యవేక్షణ తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆయన నిర్ణయించారు. తాజాగా మద్యం దుకాణాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది విజయ్ సర్కార్.టాస్మాక్(Tamil Nadu State Marketing Corporation Limited) పరిధిలోని 717 మద్యం దుకాణాలు మూసేయాలని టీవీకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకుగానూ రెండు వారాల గడువు విధించింది. ఇవి ఆలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉండడమే కారణమని తెలుస్తోంది. మూసివేయబడే దుకాణాలు: 717276 – ఆధ్యాత్మిక స్థలాల దగ్గర186 – విద్యాసంస్థల దగ్గర255 – బస్స్టాండ్ల దగ్గరకాలపరిమితి: రెండు వారాల్లో ఈ దుకాణాలను మూసివేయాలని ఆదేశం.Tamil Nadu Chief Minister C. Joseph Vijay has ordered the closure of 717 government-run TASMAC liquor retail outlets located within a 500-meter radius of places of worship, educational institutions, and bus stations, within two weeks. pic.twitter.com/1eSSG18V2k— ANI (@ANI) May 12, 2026టాస్మాక్ అనేది తమిళనాడు ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వహణను ఇదే చూసుకుంటోంది. అంటే అక్కడ ప్రైవేట్ షాపులు ఉండవన్నమాట. ప్రస్తుతం దీని పరిధిలో 4,765 దుకాణాలు (-717) ఉన్నాయి. విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిర్ణయంపై మహిళలు, తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కావొచ్చంటున్నారు. అయితే, TASMAC ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై ప్రభావం పడనుంది.తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గి విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ, వీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారాయన. -
విజయ్ ఎఫెక్ట్‌తో పళని విలవిల
ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. తప్పు చేయను, తప్పు చేయనివ్వను అంటూ సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు విజయ్ ప్రకటించారు. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామని డీఎంకే ఎంకే స్టాలిన్ హుందాగా ప్రకటించుకున్నారు. ఇంకోవైపు.. విజయ్ దెబ్బకు మరో విపక్షం అన్నాడీఎంకే మాత్రం వర్గపోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. టీవీకేకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటునకు నాలుగు రోజుల హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో విజయ్ను దెబ్బ తీయాలని పళనిస్వామి తీవ్రంగా ప్రయత్నించినట్లు ఊహాగానాలు వినిపించాయి. కేవలం 47 మంది స్థానాలు నెగ్గిన అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకోసం బద్ధశత్రువు డీఎంకే మద్దతు తీసుకోనుందనే ప్రచారం ఉవ్వెత్తున సాగింది. చివరకు ఆ ఎపిసోడ్ తుస్సుమంది. గ్రూపు రాజకీయాలతో.. అదీ విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలోనే మొదలైన సంక్షోభంతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నాడీఎంకేలో వర్గపోరు మునుపెన్నడూ లేనంత తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల్లో వరుస పరాజయాల కారణంగా పళనిస్వామి నాయకత్వంపై ఆ పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఆయన డీఎంకేతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించారని.. మరో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని వర్గం దీనిని వ్యతిరేకించిందని.. అదే సమయంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చర్చలు జరిపిందని జోరుగా ప్రచారం నడిచింది. పళనిస్వామి ఎమ్మెల్యేల మద్దతు కోసం వారిని పుదుచ్చేరి రిసార్ట్‌కి తరలించినా ఈ విభేదాలు చల్లారలేదు. చివరకు తన నివాసంలో కూర్చోబెట్టి బుజ్జగించినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన ‘‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి..’’ అని తెగేసి చెప్పినట్లు సమాచారం. అటుపై మే 10 రాత్రి జరిగిన మరో సమావేశం తీవ్ర వాగ్వాదాలతో ముగియడంతో.. షణ్ముగం వర్గం విడిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.తాజాగా.. సోమవారం తమిళనాడు కొత్త అసెంబ్లీ సమావేశమైంది. దీనికి పళనిస్వామి నేతృత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు, అలాగే షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు విడివిడిగా శాసనసభకు వచ్చి ప్రమాణం చేసి వెళ్లిపోయారు. పళని స్వామిని శాసనసభా పక్ష నేతగా గుర్తించాలని ఆయన మద్దతుదారులు.. లేదు ఎస్పీ వేలుమణిని గుర్తించాలని షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి విడిగా లేఖలు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎంపికపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుతో అన్నాడీఎంకేలో మొదలైన విభేదాలు.. మరింత ముదిరి ఇంకో మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఇవాళ జరగబోయే స్పీకర్ ఎన్నికలో షణ్ముగం వర్గం టీవీకేకు మద్దతు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది జరిగితే, పళనిస్వామికి సొంత పార్టీలోనే షాక్ తప్పదు.విజయ్ ప్రభావం అన్నాడీఎంకేలోని అంతర్గత సమీకరణాలను గణనీయంగా మార్చేస్తోంది. పళనిస్వామి తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం ఆయనను విలవిలాడే స్థితిలోకి నెట్టింది. మొత్తం మీద, అన్నాడీఎంకేలోని ఈ చీలిక పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. అయితే.. ఈ పరిణామాలతో సైలెంట్‌గా లాభపడేది టీవీకే, బీజేపీ అనే విశ్లేషణ నడుస్తోంది. అసెంబ్లీలో విజయ్ టీవీకే బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం ఆ సమయంలో టీవీకేకు మద్దతు ప్రకటిస్తే పెనుసంచలనమే కానుంది. అయితే.. బయట మద్దతు తీసుకోవచ్చని.. మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ విబేధాలను అన్నాడీఎంకే కూటమి పార్టీ బీజేపీ తమ వ్యూహంలో భాగంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. బలహీనమైన అన్నాడీఎంకే ద్వారా టీవీకేపై ప్రభావం చూపించే ప్రయత్నం చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు.షణ్ముగం వర్గం బలపడితే, పళనిస్వామి నాయకత్వం కూలిపోవడం ఖాయం. ఇక స్పీకర్ ఎన్నికలో టీవీకే పార్టీ అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు పొందితే, ఆ ప్రభావం తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. -
దుబాయ్ విడిచి.. విజయ్ వెంట నడిచి..
వెండితెరపై ‘దళపతి’గా వెలిగిన విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. అయితే ‘తమిళక వెట్రి కజగం’ (టీవీకే) సారథిగా రాజకీయ క్షేత్రంలో కదం తొక్కిన విజయ్ ఎక్కడికి వెళ్లినా, ఏ బహిరంగ సభలో పాల్గొన్నా ఆయన పక్కనే నలుపు రంగు దుస్తుల్లో నిశితంగా గమనిస్తూ కనిపించే ఒక ‘మిస్టరీ మ్యాన్’ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. ఆయనే నయీమ్ మూసా. దుబాయ్‌లో భారీ వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పటికీ, కేవలం స్నేహం కోసం విజయ్ రక్షణ వలయాన్ని పర్యవేక్షిస్తున్న ఈ మలయాళీ పారిశ్రామికవేత్త ప్రయాణం ఒక సినిమా కథను తలపిస్తోంది.మాహే నుంచి దుబాయ్ వరకు..పుదుచ్చేరి పరిధిలోని మాహేలో జన్మించిన నయీమ్ మూసాకు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్, బాడీబిల్డింగ్‌పై మక్కువ ఎక్కువ. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన ఆయన, అక్కడ కఠిన శ్రమతో తన శరీరాకృతిని మలచుకున్నారు. ఒక చిన్న సెక్యూరిటీ అసైన్మెంట్తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం, నేడు గల్ఫ్ దేశాల్లోనే ప్రముఖ భద్రతా సంస్థ అయిన ‘జెండర్ సెక్యూరిటీ’ స్థాపనకు దారితీసింది.గ్లోబల్ స్టార్లకు రక్షణ కవచంనయీమ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పాప్ సింగర్ జస్టిన్ బీబర్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వంటి హేమాహేమీలు దుబాయ్ వెళ్తే వారి భద్రత బాధ్యత నయీమ్దే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి భారీ క్రీడా వేడుకలకు యూఏఈ ప్రభుత్వం అధికారికంగా నయీమ్ ఏజెన్సీకే భద్రతా ఏర్పాట్లు అప్పగిస్తుంటుంది. ప్రస్తుతం తన వ్యాపారాన్ని భారత్‌కు విస్తరించి, చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయన వ్యాపారం కోట్లలో విస్తరించి ఉన్నప్పటికీ, దాని ఖచ్చితమైన విలువ వివరాలు తెలియవు.రాజకీయాల్లోనూ విజయ్ ‘రైట్ హ్యాండ్’విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు కేవలం షూటింగ్లకే పరిమితమైన నయీమ్, టీవీకే స్థాపన తర్వాత విజయ్‌కు అనివార్య వ్యక్తిగా మారారు. ‘నయీమ్ నా వెంట ఉన్నంత కాలం నా భద్రత గురించి నాకు చింత లేదు’ అని విజయ్ స్వయంగా పేర్కొనడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వం విజయ్‌కు 'వై' కేటగిరీ భద్రత కల్పించిప్పటికీ, వ్యక్తిగతంగా నయీమ్ ఏర్పాటు చేసే రక్షణ వలయంపైనే దళపతికి గురి. తమిళనాడు రాజకీయ సభల కోసం కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులను నయీమ్ రప్పిస్తుంటారు. ఆధునిక సాంకేతికతను, కట్టుదిట్టమైన క్రమశిక్షణను కలగలిపి ఆయన రూపొందించే భద్రతా వ్యూహాలు అజేయమైనవి. ఆడంబరాలకు దూరంగా, మీడియా వెలుగులోకి రాకుండా కేవలం తన క్లయింట్ భద్రత, గోప్యతకే నయీమ్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. -
సీఎం విజయ్ కోసం 650కిలో మీటర్ల కాలినడక .. సోషల్ మీడియాలో వైరల్!
సాక్షి,చెన్నై: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండ పార్టీలను మట్టికరిపించిన టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయనను కలిసేందుకు ఓ యువజంట చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన రఫీ, షహానా భార్యాభర్తలు. రఫీ డ్రైవర్‌గా పనిచేస్తూనే డైలీ వ్లాగ్స్ చేస్తుంటారు. ఈ దంపతులకు హీరో విజయ్ అంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానం ఇప్పుడు హద్దులు దాటి, కేరళ నుంచి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో చెన్నైలో సీఎం విజయ్ను కలుసుకోవడానికి కాలినడకన ప్రయాణం ప్రారంభించారు.ఆకలేసినప్పుడు హోటల్లో తినడం, లేకపోతే రోడ్డు పక్కనే వండుకోవడం చేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన సామాగ్రిని వెంట తీసుకెళ్లారు. రాత్రివేళల్లో పెట్రోల్ బంకులు, షాపుల వద్ద టెంట్ వేసుకుని నిద్రిస్తున్నారు. మే 7న ప్రారంభమైన వారి ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ ప్రయాణంలో అనుభవాలను వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నారు. నెటిజన్లు వారికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు అభిమానం వెర్రి తలలు అంటే ఇదేనేమో.. బస్సు, ట్రైన్లో వెళ్లొచ్చు కదా, కాలినడకన రావాల్సిన అవసరమా? అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.రఫీ దంపతులు మాట్లాడుతూ.. మాకు విజయ్, ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించి, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక మరింత బలపడింది. అందుకే చెన్నై వరకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.కేరళ జంట 650 కి.మీ నడిచి చెన్నై చేరుకోవడం, తలపతి విజయ్ను కలవాలని ప్రయత్నించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అభిమానులు ‘పీక్ తలపతి క్రేజ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఖచ్చితమైన అపాయింట్మెంట్ లేదా అధికారిక ఏర్పాట్లు లేకపోయినా, చెన్నై చేరుకున్న తర్వాత ఆ అవకాశం తప్పకుండా లభిస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు.రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ టీవీకే, సంకీర్ణ భాగస్వాముల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి మెజారిటీ సాధించింది. -
హీరోయిన్ త్రిషకు షాకింగ్ కౌంటర్ : డా.శివరంజని పోస్ట్ వైరల్
అనేక ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మధ్య ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంప్రదాయ చీరకట్టులో హాజరైన నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలం రంగు పట్టుచీరలో, కొప్పున మల్లెలతో కనిపించడమే కాదు, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆనందబాష్పాలతో నిండిన కళ్లతో భావోద్వేగానికి లోనవుతున్న వీడియో సంచలనం రేపింది. ఆ తరువాత తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ప్రేమ ఎప్పుడూ గొప్పదే అంటూ ఆమె చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో విజయ్-త్రిష మధ్య ప్రేమానుబంధంపై రకరకాల వాదనలు, పుకార్లు హాట్ టాపిక్‌గా మారాయి.అయితే చిన్నపిల్లల వైద్యురాలు, ఓఆర్ఎస్పై అలుపెరుగని పోరాటం చేసిన హైదరాబాద్‌కు చెందిన డా. శివరంజని ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా త్రిష పోస్ట్‌కు కౌంటర్‌గా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చకు దారి తీసింది. ‘ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. ద్రోహం. విచ్ఛిన్నమైన కుటుంబాల నిశ్శబ్దం బాధాకరం. ముఖ్యంగా పిల్లలకు’ అని అర్థం వచ్చే పిక్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. View this post on Instagram A post shared by Dr Sivaranjani Santosh (@drsivaranjanionline) నెటిజనుల స్పందనవావ్..ఎంత అద్భుతమైన సమాధానం, వావ్. మీపై గౌరవం పదివేల రెట్లు పెరిగింది అంటూ ఆమెను కొనియాడగా, మహిళలు ఆమెనే ఎందుకు నిందిస్తున్నారు, దీనికి ఆ వ్యక్తి ( విజయ్) బాధ్యుడు కాదా? నిజం ఏమిటంటే, ప్రతీ వివాహం శాశ్వతంగా నిలవాలని లేదు. కొన్నిసార్లు విడిపోవడమేమంచిది. ఆరోగ్యకరం కూడా. అందుకే చాలా జంటలు సమాజం కారణంగా కలిసి జీవిస్తాయి. వారు తమలో నింపుకున్న ద్వేషం చాలా లోతుగా పాతుకుపోయి, చాలాసార్లు దానిని పిల్లలకు కూడా అందిస్తారు అని మరొకరు కమెంట్ చేశారు.చిన్నప్పుడు నేను దీనిని అనుభవించాను. అది నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది, ఇప్పటికీ నన్ను ప్రభావితం చేస్తూనే ఉంది! ఈ విషయాన్ని గట్టిగా చెప్పినందుకు ధన్యవాదాలు అని మరొకరు సమాధానం ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను‘ప్రతి ఒక్కరూ వివాహేతర సంబంధాన్ని సాధారణీకరించి, దాన్ని గొప్పగా కీర్తిస్తుండటం అత్యంత అసహ్య కరమైన విషయం. పిల్లలు మోయబోయే బాధ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పిల్లలు తమ తల్లికి చాలా గట్టిగా అండగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లూ భార్య వెన్నెముకలా నిలబడింది, అకస్మాత్తుగా మరో స్త్రీ వచ్చింది. ఇది ఇద్దరి వ్యక్తుల తప్పే. అతను ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ తన పిల్లల ముందు ఓడిపోయాడు.ఆమెను వేడుకకు తీసుకువచ్చి, పిల్లలను, భార్యను అవమానించడం అత్యంత ఘోరమైన విషయం.’ ఇది మరో స్పందన.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?ఒక పిల్లల వైద్యురాలిగా, విడిపోయిన లేదా, విచ్ఛిన్నమైన కుటంబాలలోని పిల్లలు అనుభవించే మానసిక క్షోభ, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆమె వ్యాఖ్యలు చేశారని, పిల్లలపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం అంటున్నారు మరికొందరు. ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే? -
తమిళనాడు అసెంబ్లీలో మొదటి రోజే ఆసక్తికర ఘటన
-
డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే .. విజయ్ రియాక్షన్ చూడండి
-
విజయ్ - స్టాలిన్ అపూర్వ కలయిక
-
సీఎం విజయ్ కోసం త్రిష రెడీ అయిందిలా (ఫొటోలు)
-
స్టాలిన్ ఇంటికి చేరుకున్న సీఎం విజయ్
-
TVK పార్టీ ఎమ్మెల్యే ల క్వాలిఫికేషన్ చూస్తే షాక్ అవుతారు
-
స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్
-
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అగ్రనటుడు విజయ్ ఆదివారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అదే ఊపులో మేనిఫెస్టోలో కీలక మూడు హామీల అమలును ప్రకటించారు. తొలి సంతకాన్ని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన దస్త్రాలపైనా సంతకాలు పెట్టారు. ఇక.. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసే టీంను తన పర్యవేక్షణలోనే ఉంచుకోనున్నట్లు విజయ్ ఇవాళ చెప్పారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన కాసేపటికే వరుస సమావేశాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యరుస్తూ ప్రతిపక్ష నేతల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే స్టాలిన్‌తో విజయ్ భేటీ అయ్యారని టీవీకే వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలోస్టాలిన్తో విజయ్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఎండీఎంకే నేత వైకో నివాసానికి వెళ్తారని సమాచారం. డీఎంకే కూటమిలో ఉన్న ఎండీఎంకే నాలుగు స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు నెగ్గలేకపోయింది. వీళ్లతో పాటు పలువురు నేతలను కలుస్తారని తెలుస్తోంది. అయితే.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలను కలుస్తారా? ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పళని ఇంటికి వెళ్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇక.. తమిళనాడులో కొత్త అసెంబ్లీ ఇవాళ కొలువు దీరింది. నూతనంగా ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో శాసన సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్‌ని డీఎంకే ప్రకటించింది. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 13న టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నీ సజావుగా సాగితే.. 17న అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. -
విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్
తమిళనాడు ముఖ్యమంత్రిగా హీరో విజయ్.. ఆదివారం ఉదయం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు విజయ్ భార్య పిల్లలు రాలేదు. తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. వీళ్లతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆకుపచ్చని చీరలో దర్శనమిచ్చింది. విజయ్ మాట్లాడుతున్నప్పుడు ఈమె ఎమోషనల్ అవుతూ కనిపించింది. ఇకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష పెట్టిన తొలి పోస్ట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది.విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పట్టుచీర కట్టుకొచ్చిన త్రిష.. ఈ చీరని ఎంతో ప్రేమతో డిజైన్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలని షేర్ చేసి 'ప్రేమ ఎప్పుడూ గొప్పదే' అనే క్యాప్షన్ పెట్టింది. ఇది విజయ్‌ని ఉద్దేశించే పెట్టిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.స్టార్ హీరో విజయ్, త్రిష కలిసి తమిళంలో పలు సినిమాలు చేశారు. అయితే విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోవడానికి త్రిషనే కారణమనే కామెంట్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే విజయ్-త్రిష కలిసి కనిపించడం, ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష.. విజయ్ ఇంటికి వెళ్లడం, తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవడం లాంటివి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan)🥺❤️🫂 @trishtrashers getting emotional during CM Joseph Vijay sir’s speech was truly a heart-touching moment ❤️🥹#trishakrishnan #Trisha #vijay #cmvijay #thalapathy #trishaforever #southqueentrisha #ladysuperstartrisha #wonderingwomen pic.twitter.com/3Ofr1zDl4P— Trisha😻Sushma (@Trishkrish_583) May 10, 2026 -
విజయ్‌కు భారీ గుడ్‌న్యూస్..
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకేలో విజయ్‌కి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఏఐఏడీఎంకేలో అశాంతి సంకేతాలు తీవ్రమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతగా అంటే.. పార్టీ ఓటమికి పళనిస్వామిని బాధ్యుడిని చేసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో, అన్నాడీఎంకేలో అంతర్గత పోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది.కాగా, అన్నాడీఎంకేలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు వేలుమణి వర్గం బలంగా ఎదుగుతోంది. పార్టీలో పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు పెరుగుతుండగా వేలుమణి–శణ్ముగం వర్గానికి మద్దతు భారీగా పెరిగింది. ఎన్నికల్లో గెలిచిన 47 మందిలో 36 మంది ఎమ్మెల్యేలు వీరితోనే ఉన్నారు. కాగా, వీరంతా టీవీకే విజయ్‌కి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ముందు నుంచే అనుకూలంగా ఉన్నారు. ఈ వర్గం ఫ్లోర్ టెస్ట్‌లో కూడా టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు.. పళనిస్వామి నాయకత్వాన్ని సవాలు చేస్తూ అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ కొత్త నేతగా వేలుమణిని ఎన్నుకోవాలని చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇది పార్టీ విభజనకు దారితీసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా వేర్వేరుగా వచ్చి అసెంబ్లీలో ప్రమాణం చేయడం గమనార్హం. A split in AIADMK again..🔥🔥🔥- Edappadi Palaniswami resigns as AIADMK General Secretary.- SP Velumani takes over AIADMK.- CV Shanmugam directly alleges that Edappadi is not even qualified to form an alliance.. pic.twitter.com/8Kvop8IGBj— Muthukumar Subbaiah (@smkumarlakshmi) May 9, 2026ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం సీవీ షణ్ముగంతో పొత్తులో ఉన్న ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు కలిసి.. ఆయన నాయకత్వాన్ని ఇకపై అంగీకరించడానికి సిద్ధంగా లేమని ఈపీఎస్‌కు తెలియజేశారు. వరుసగా నాలుగు ఎన్నికల ఓటముల తర్వాత ఈపీఎస్ వర్గానికి, షణ్ముగంతో ఉన్న నాయకులకు మధ్య విభేదాలు పెరిగాయి. ఓటములు అన్నాడీఎంకేలో నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. నాయకత్వం రాజకీయ వ్యూహంపై అంతర్గత ఆగ్రహాన్ని తీవ్రతరం చేశాయని వర్గాలు తెలిపాయి.అన్నాడీఎంకే పరిస్థితి ఇలా..అన్నాడీఎంకే వరుసగా ఎదుర్కొన్న ఓటములు పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.నాయకత్వ సంక్షోభం: ఈపీఎస్ నాయకత్వంపై తిరుగుబాటు పెరుగుతుండగా, వేలుమణి–శణ్ముగం వర్గం బలపడుతోంది.పార్టీ విభజన: రెండు వర్గాల మధ్య విభేదాలు పెరిగితే, పార్టీ విభజనకు దారితీసే అవకాశం ఉంది.డీఎంకేతో చర్చలు: డీఎంకేతో బ్యాక్‌చానల్ చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు, పార్టీ అంతర్గత అసంతృప్తిని మరింత పెంచాయి.టీవీకే ప్రభావం..విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతోంది.విజయం: 108 స్థానాలు గెలిచి భారీ మెజారిటీ సాధించింది.పొత్తు: అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం టీవీకేకు మద్దతు ఇస్తే, టీవీకే బలం మరింత పెరుగుతుంది. ఇది డీఎంకేకు సైతం ఎదురుదెబ్బ. -
అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టిన విజయ్
-
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడులో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు పళనిస్వామి, ఉదయ్‌నిధి స్టాలిన్ తదితరుంతా ప్రమాణం చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒకస్థానం వదులుకోవాల్సిన పరిస్థితుల్లో.. ఆయన తిరుచ్చికి రాజీనామా చేశారు. ముందుగా పెరంబూర్ ఎమ్మెల్యేగా విజయ్, ఆ తర్వాత టీవీకే సభ్యులు.. ఆ తర్వాత మిగతా పార్టీల సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణం చేయించారు. #WATCH | Chennai: Tamil Nadu Chief Minister C Joseph Vijay takes oath as Member of the Legislative Assembly (MLA) of the Perambur constituency(Source: TNDIPR) pic.twitter.com/nJR6RyIcUA— ANI (@ANI) May 11, 2026రేపు తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే ఈ నెల 13న అసెంబ్లీలో టీవీకే బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.కూటమిలో లుకలుకలు?టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలైనట్లు సమాచారం అందుతోంది. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందేమాతరం పూర్తిగా ఆలపించడంపైనా వీసీకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గవర్నర్ మెప్పు పొందేందుకు టీవీకే ప్రయత్నించిందని.. ఈ తీరు సరికాదని మండిపడింది.డీఎంకే ఫైర్సీఎం విజయ్‌పై ప్రతిపక్ష డీఎంకే భగ్గుమంది. గత డీఎంకే సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసిందని.. శ్వేత పత్రం విడుదల చేస్తామని విజయ్ ప్రకటించారు. అయితే అబద్ధ ప్రచారాలు ఆపాలంటూ తమిళనాడు కొత్త సీఎంకు డీఎంకే చురకలంటించింది. తమిళనాడు రాజకీయ చరిత్ర నేర్చుకోవాలంటూ సూచించింది.ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధిప్రతిపక్ష పార్టీ నేతగా మాజీ మంత్రి, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే పార్టీ ఎన్నుకుంది. ఇందుకుగానూ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌కు ఉదయనిధి కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీకి వెళ్లే ముందు నూతన ఎమ్మెల్యేలతో స్టాలిన్ కార్యాలయానికి వెళ్లిన ఉదయనిధి.. శాలువా కప్పి పుష్పగుచ్చం సమర్పించారు.#WATCH | Chennai, Tamil Nadu: DMK MLA Udhayanidhi Stalin met party chief MK Stalin, earlier today Udhayanidhi Stalin tweeted, "This morning, before heading to the Assembly, we met DMK President MK Stalin—who has given us the opportunity to serve as the Leader of the Opposition… pic.twitter.com/iudaT3h67J— ANI (@ANI) May 11, 2026 -
అసెంబ్లీలో విజయ్ సర్కార్ కు పరీక్ష.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు
-
సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు!
తిరువనంతపురం: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్ అప్పుడే పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, తన ‘కొత్త శకం’ అజెండాను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను తన అధికారిక కార్యదర్శులుగా నియమించుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ముఖ్యమంత్రి కార్యదర్శులుగా..ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.సెంథిల్ కుమార్‌ను బదిలీ చేసి, ముఖ్యమంత్రికి అదనపు ప్రధాన కార్యదర్శి-కార్యదర్శి వన్‌గా నియమించారు. అలాగే మరో సీనియర్ అధికారిణి జి.లక్ష్మీప్రియను ముఖ్యమంత్రి కార్యాలయానికి కార్యదర్శి టుగా బదిలీ చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు తర్వాత సీఎం ఆఫీస్ కార్యకలాపాలను పటిష్టం చేయడంలో ఇవే తొలి అడుగులు.120 సీట్లతో బలం.. సంక్షేమంపై గురిఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే)పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పటికీ.. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం), ఐయూఎంఎల్ మద్దతుతో 120 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే, సీఎం విజయ్ తన తొలి ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన అనే మూడు ప్రధాన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు ప్రకటించారు.ఖజానా ఖాళీ.. పాలనలో పారదర్శకత‘నేను రాజ కుటుంబం నుంచి రాలేదు. నేను మీ ఇంట్లో కొడుకుని, తమ్ముడిని, అన్నను’ అంటూ విజయ్ తన ప్రసంగంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, నిజమైన సామాజిక న్యాయంతో కొత్త శకానికి నాంది పలుకుతున్నానని ఉద్ఘాటించారు. గత డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టి, ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని, ప్రభుత్వ నిర్ణయాలన్నీ అత్యంత పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఇవేం బదిలీలు సామీ?.. కొత్త ప్రభుత్వం రాకముందే షాక్! -
విజయ్ భార్య పిల్లలు ఎక్కడ..?
-
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్‌ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్‌తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్‌స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్‌కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్‌పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్‌ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
ఏపీకి సింహం జగన్ అయితే.. తమిళనాడు సింహం విజయ్
-
విజయ్‌కు స్టాలిన్ తొలి కౌంటర్
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు విజయ్ను మాజీ సీఎం స్టాలిన్ అభినందించిన వెంటనే కౌంటర్ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ తన ప్రసంగంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ అప్పులపై విజయ్ శ్వేతపత్రం విడుదల చేస్తామని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో తమిళనాడు అప్పులపై స్టాలిన్ స్పందిస్తూ..ప్రభుత్వానికి రూ.10 లక్షల కోట్ల అప్పుంది, ఖజానా ఖాళీగా ఉందని చెప్పడాన్ని తప్పుపట్టారు. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయన్నారు. కోవిడ్ లాంటి విపత్తును ఎదుర్కొని, నిధులకు సహకరించని బీజేపీని తట్టుకుని దీటుగా నిలబడ్డామని బదులిచ్చారు. డబ్బు పుష్కలంగా ఉందని, ప్రస్తుతం కావాల్సింది సంక్షేమ పథకాల అమలు చేయడమేనని చెప్పుకొచ్చారు. ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం అవసరం అంటూ కౌంటరిచ్చారు.ఇదిలా ఉండగా.. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలను తెరపైకి తెస్తోంది. అప్పు రూ.10 లక్షల కోట్లకు చేరుకోవడం వల్ల కొత్త ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణను పాటించడం పెద్ద సవాలు అవుతుంది. ఇది డీఎంకే చేసిన ఖర్చులపై ప్రజా చర్చను మరింత పెంచుతుంది. మరోవైపు.. డీఎంకే పాలనలో అమలు చేసిన పథకాల వల్ల అప్పు పెరిగిందని స్టాలిన్ చెబుతున్నారు. ప్రజలకు లభించిన ప్రయోజనాలను కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.విజయ్ తొలి పాలనలో ప్రాధాన్యతలుఉచిత విద్యుత్: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇది మధ్యతరగతి మరియు రైతులకు ఉపశమనం.మహిళల భద్రత: ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, ఇది కొత్త ప్రభుత్వానికి ప్రజా విశ్వాసాన్ని పెంచే అంశం.డ్రగ్ నియంత్రణ: యువతలో మత్తు పదార్థాల సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యేక చర్యలు.విద్య, ఆరోగ్యం, నీరు: ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రజల అంచనాలను తీర్చే ప్రయత్నం.రైతులు, మత్స్యకారులు: సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ వర్గాలను ఆకర్షించడం. -
విజయ్ కోసం త్రిష.. ఐస్ బ్లూ సారీలో సడెన్ ఎంట్రీ!
-
CM జోసెఫ్ విజయ్.. ఆన్ డ్యూటీ..!
-
విజయ్‌కు ప్రముఖుల అభినందనలు
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులతోపాటు శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌లో ప్రధాని మోదీ..‘తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తిరు సి.జోసెఫ్‌కు అభినందనలు. మీ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కలిసి ముందుకు సాగుదాం’అని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ విజయ్‌తో ఫోన్లో మాట్లాడి, అభినందనలు తెలిపారు. ‘టీవీకే చీఫ్ విజయ్‌కు అభినందనలు. తమిళనాడు కొత్త తరాన్ని, కొత్త గళాన్ని ఎంపిక చేసుకుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను’అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే ఆదివారం విజయ్‌కు అభినందనలు తెలిపారు. శ్రీలంక, తమిళనాడు నడుమ బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్న విషయాన్ని ఆయన ఎక్స్‌లో గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా విజయ్ను అభినందించారు. ‘టీవీకే అధినేత నాయకత్వంలో రాష్ట్ర రాజకీయ, సామాజికంగా విజయవంతంగా ముందుకు సాగుతుందన్న విశ్వాసం ఉంది’అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్,, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్లతోపాటు సినీనటులు కమల్ హాసన్, ఆర్.మాధవన్, సత్యరాజ్, ప్రకాశ్ రాజ్ టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం విజయ్‌కు అభినందనలు తెలిపారు. -
తమిళ సీఎంగా విజయ్ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ద్రవిడ పార్టీల పరిపాలనా పర్వానికి తెరదించుతూ తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ సి.జోసెఫ్ విజయ్ ఆదివారం నూతన ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. ఆత్మీయులు, కుటుంబసభ్యులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత 60 ఏళ్ల తమిళనాడు చరిత్రలో డీఎంకే, అన్నాడీఎంకే ప్రమేయం లేని ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10.15 గంటలకు అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం ఆరంభమైంది. విజయ్‌తో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేయించారు. టీవీకేలోని 9 మంది నేతలు మంత్రులుగా ప్రమాణంచేశారు. టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సైతం భాగస్వామిగా చేరిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ, తమిళనాడులో బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్, సినీ నటి త్రిష, వామపక్ష పార్టీల రాష్ట్ర ముఖ్యనేతలు ముందువరసలో కూర్చుని ప్రమాణస్వీకారాన్ని చూశారు. పలువురు ప్రముఖులు, తమిళ సినీతారలు, టీవీకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభిమానుల ‘విజిల్’ మోతలు, ‘సీఎం విజయ్’, ‘దళపతి’ నినాదాలతో ఇండోర్ స్టేడియం మార్మోగిపోయింది. విజయ్ తన మంత్రివర్గంలో యువత, అనుభవజ్ఞులకు ప్రాధాన్యమిచ్చారు. సీఎంగా ప్రమాణంచేశాక విజయ్ ఉద్వేగంగా ప్రసంగించారు. నిజమైన లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే పాలనకు సంబంధించిన నూతన శకం ఇప్పుడే ప్రారంభమైందని స్పష్టంచేశారు. తనదైన శైలిలో ప్రమాణం చేయబోయి.. విజయ్‌తో సీఎంగా ప్రమాణం చేయించేందుకు ఆయనను పోడియం వద్దకు గవర్నర్ ఆహ్వానించారు. ‘నేను’ అని గవర్నర్ అందివ్వగా అధికారికంగా ఇచ్చిన ప్రమాణపత్రాన్ని కాదని సొంతంగా తనదైన శైలిలో ప్రమాణంచేసేందుకు విజయ్ ప్రయ తి్నంచారు. వెంటనే గమనించిన గవర్నర్ సున్నితంగా అడ్డుకుని రాజ్యాంగంలో పేర్కొన్న శైలిలోనే ప్రమాణం చేయాలని సూచించారు. తొలి రోజే వివాదం ప్రమాణ స్వీకారోత్సవంలో గాయకులు వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను ఆలపించడం విశేషం. సాధారణంగా అధికారిక కార్యక్రమంలో మొదటి రెండు చరణాలను ఆలపిస్తారు. అయితే, మొత్తం ఆరు చరణాలను ఆలపించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రమాణ స్వీకార వేడుకలో తమిళ తల్లి గీతం.. తమిళ్ తాయ్ వాళ్తుకు మూడో స్థానం కల్పించడాన్ని సీపీఐ, డీఎంకేలు తీవ్రంగా పరిగణించాయి. వందేమాతరం, జనగణమన అనంతరం తమిళ్ తాయ్ వాళ్తు గీతాన్ని ఆలపించారు. ప్రాధాన్యతా క్రమంలో తమిళ గీతానికి మూడోస్థానం కల్పించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీర పాండియన్, వీసీకే అధినేత థోల్ తిరుమావళవన్తోపాటు సీపీఎం, ఐయూఎంఎల్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని, తమిళ తల్లి గీతానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌చేశారు. అధికారిక కార్యక్రమాల్లో తమిళ తల్లి గీతాన్ని మొదట ఆలపించడం సంప్రదాయమని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్.రాందాస్ గుర్తుచేశారు.వేదికపై 3 సంతకాలు ప్రజలకు ఇచ్చిన 3 వాగ్దానాల అమలుకు ప్రమాణ స్వీకార వేదికపైనే విజయ్ శ్రీకారం చుట్టారు. గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. మహిళల భద్రత కల్పించడానికి మహిళలతో ‘సింగా పెన్’ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తూ మరో ఫైల్‌పై సంతకం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మహమ్మారిని అరికట్టడమే లక్ష్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా దళం ఏర్పాటు కోసం మరో ఫైల్‌పై సంతకం చేశారు. తమకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, వామపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. యువత, టీనేజర్లు, చిన్నారులకు విజయ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత సీనియర్ నేత కె.ఎ.సెంగోట్టయన్, యువనేత డాక్టర్ కె.టి.ప్రభు, మహిళా నాయకురాలు ఎస్.కీర్తన, ఆధవ్ అర్జున, ఎన్.ఆనంద్, ఆర్.నిర్మల్ కుమార్, కె.జి.అరుణ్‌రాజ్, ఎ.రాజ్ మోహన్, పి.వెంకటరమణన్లు ప్రమాణంచేసి మంత్రివర్గంలో చేరారు.నేనొక్కడినే పవర్ సెంటర్ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసిన విజయ్ వేదికపై తనదైన శైలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘నా గుండెల్లో నివసించే అభిమానులందరికీ వందనాలు. నేను రాజరిక కుటుంబం నుంచి రాలేదు., సినిమాల్లో రాణించాలని కష్టపడిన ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ కుమారుడిని. ఆకలి, పేదరికం అంటే నాకు బాగా తెలుసు. అందుకే ప్రజలను నా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తా. తమిళప్రజలు నన్ను సొంత బిడ్డలా, అన్నగా, తమ్ముడిగా ఆదరించి సినిమాల్లో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చా. ప్రజల ఆశీస్సులతో ఈ పదవిలోకి వచ్చా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమిళనాడు ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి, మోయలేని భారాన్ని మనపై వదిలివెళ్లింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం. మా ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేయదు. రహస్యంగా ఎవర్నీ కలవదు. ఏది చేసినా ప్రజల సాక్షిగా బహిరంగంగానే చేస్తాం. ప్రజల సొమ్ము నుంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోను. నేను తప్పు చేయను. ఎవరినీ చేయనివ్వను. నా ప్రభుత్వంలో అధికారులైనా, మంత్రులైనా ఎవరైనా ఒకే మాట మీద నడవాలి. ఇక్కడ పవర్ సెంటర్లు ఉండవు. అంతా నా నాయకత్వంలోనే నడుస్తుంది. నేనే ఏకైక పవర్ సెంటర్. గెలవగానే ఆటలు ఆడదాం అనుకునే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇప్పుడే ఆ ఆలోచన మానుకోండి. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరి కోసం సమప్రాధాన్యంతో పరిపాలిస్తా. హామీల అమలుకు కొంత సమయం ఇవ్వండి. నేను దేవదూతను కాదు. సాధారణమైన వ్యక్తిని. విద్యార్థుల కోసం విజయ్ మామ మంచి పనులు చేస్తాడు. భవిష్యత్తులో నాకు అడ్డంకులు సృష్టించేవారు కూడా నాకు శ్రేయోభిలాషులే’’ అని విజయ్ వ్యాఖ్యానించారు. దేవుడి పేరిట ప్రమాణం ప్రమాణ స్వీకారంలో దళపతి విజయ్ సరికొత్త ఆహార్యంతో ఆకట్టుకున్నారు. సాధారణంగా నిత్యం ధరించే తెల్లచొక్కా, ఖాకీ రంగు ప్యాంటు కాకుండా ముదురు రంగు ప్యాంటు, తెల్లచొక్కా, దానిపై నలుపురంగు సూట్ ధరించారు. విజయ్ సహా మంత్రులందరూ దేవుడి పేరిట ప్రమాణం చేయడం విశేషం. రాహుల్ గాం«దీతోపాటు కేబినెట్ సహచరులతో, పార్టీ నాయకులతో విజయ్ సెలీ్ఫలు దిగారు. గవర్నర్‌తో గ్రూప్ ఫొటో సందర్భంగా వేదికపై అడ్డుగా ఉన్న పెద్ద బల్లను పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ సైతం బల్లను పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. శాసనసభ తొలి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణం చేస్తారు. టీవీకే ఎమ్మెల్యే కరుప్పయ్య ప్రొటెం స్పీకర్‌గా ఆదివారం లోక్‌భవన్‌లో ప్రమాణం చేశారు. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేగా రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్‌తోపాటు తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ ఎమ్మెల్యేగా గెలిచారు. నిబంధనల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండగా, తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇకపై పెరంబూర్ ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగుతారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ పంపించారు. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారిగా సచివాలయానికి రాక ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం విజయ్ సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం సీఎం చాంబర్లో విజయ్ ఆసీనులయ్యారు. కొన్ని అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు. సీఎం హోదాలో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళ భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డ్రగ్స్ కేసుల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
తిరుచిరాపల్లి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ఆదివారం తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శాసనసభ కార్యదర్శి డాక్టర్ కె.శ్రీనివాసన్‌ను మంత్రులు కేఏ సెంగొట్టైయన్, పి వెంకటరామణన్ కలిసి విజయ్‌కు సంబంధించిన రాజీనామా పత్రాన్ని అందజేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచారు. ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో గెలిస్తే ఒక స్థానంలో కొనసాగాలని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం పేర్కొంటోంది. దీంతో పెరంబూర్ నుంచి కొనసాగాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు.అంతకుముందు, విజయ్ తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెన్నైలోని చరిత్రాత్మక ఫోర్ట్ జార్జ్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కొత్త ప్రారంభానికి, నిజమైన లౌకిక, సామాజిక న్యాయ యుగానికి నాంది అవుతుందని చెప్పారు. సినీ జీవితాన్ని వదిలి ప్రజల రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను రాజ కుటుంబం నుంచి రాలేదని తెలిపారు.సీఎం విజయ్ సమీక్షా సమావేశంతమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు విజయ్ చెన్నైలోని సలై రోడ్డులో ఉన్న పెరియార్ స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్‌గా టీవీకే నాయకుడు ఎంవీ కరుప్పయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్నారు. త్వరలోనే విజయ్ శాసనసభలో బలాన్ని నిరూపించుకోనున్నారు. -
విజయ్ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పేసిన మంత్రి కీర్తన
చెన్నై: తమిళనాడులో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నిలిచిన టీవీకే నాయకురాలు ఎస్.కీర్తన (29) ఆదివారం కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తొమ్మిది మంది మంత్రుల్లో ఆమె ఒకరిగా నిలిచారు. కీర్తన తెలుగు యువతి. 1996లో విరుదునగర్‌లో జన్మించారు. విజయ్ క్యాబినెట్లో ఏకైక మహిళా మంత్రి ఆమె.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కీర్తన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుందని అన్నారు. విజయ్ టీవీకే ప్రభుత్వం మార్పు తీసుకొచ్చిందని చెప్పారు. దళపతి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వచ్చేశారని, ఇక అన్నీ మారిపోతాయని ఆమె ఉత్సాహంగా చెప్పారు.ప్రతిభకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యాన్ని ఆమె ప్రస్తావించారు. తనకు మంత్రి పదవి రావడం టీవీకే పార్టీ విధానాన్ని చూపుతోందని చెప్పారు.“మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందడం, క్యాబినెట్ మంత్రి కావడం ఏ రాష్ట్రంలోనైనా సులభమా? కాదు. విజయ్ ప్రతిభను చూస్తారు, నైపుణ్యాన్ని చూస్తారు. మార్పులన్నీ తీసుకురావడానికే మేము వచ్చాం. ఈ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుంది. మాది అత్యంత దీర్ఘకాలం కొనసాగిన ప్రభుత్వం అవుతుంది’’ అని ఆమె అన్నారు.కీర్తన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలలో గణితంలో బీఎస్సీ పూర్తి చేశారు. తర్వాత 2019లో పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో స్టాటిస్టిక్స్‌లో ఎమ్మెస్సీ చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీర్తన శివకాశి స్థానం నుంచి 11,697 ఓట్ల మెజార్టీతో గెలిచారు.గతంలో కీర్తన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... “నేను హిందీలో మాట్లాడుతున్నాను. మా పార్టీ ప్రాతినిధ్యాన్ని భారత్ అంతటా, ఇతర దేశాల్లో కూడా విస్తరించాలనుకుంటున్నాను. అందుకే హిందీలో మాట్లాడుతున్నాను. నా నాయకుడి గురించి అందరికీ తెలియాలి. మా పార్టీ గురించి అందరికీ తెలియాలి. రాజకీయాలకు భయపడకూడదు. అందరూ రాజకీయాల్లోకి రావాలి. నేను ఒక ఉదాహరణ మాత్రమే. అందరూ రాజకీయాల్లో చేరాలి అనేదే నా కోరిక” అని చెప్పారు.ఇదిలా ఉండగా, కీర్తనతో పాటు ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టైయన్, కేజీ అరుణ్‌రాజ్, పి.వెంకటరామనన్, ఆర్.నిర్మల్‌కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ శనివారం విజయ్‌తో రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.. మే 13లోపు అసెంబ్లీలో మెజార్టీ నిరూపించాలని ఆదేశించారు. -
బీజేపీకి సినిమా చూపెట్టిన సీఎం విజయ్
-
విజయ్ కేబినెట్ లో తెలుగమ్మాయి
-
సీఎం కుర్చీలో జోసెఫ్ విజయ్
-
ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చా.. విజయ్ గూస్బుమ్స్ స్పీచ్
-
సీఎంగా విజయ్.. రజనీకాంత్-కమల్ సినిమా ఆగిపోతుందా?
ఏదైనా ఒక రంగంలో ఒక ఘటన జరిగితే దాన్ని ఇతర విషయాలకు ఆపాదిస్తూ సందేహాలను వ్యక్తం చేయటం జరుగుతుంటుంది. అలాంటి సందేహాలు ఇప్పుడు ఒక మల్టీ స్టార్ చిత్రం గురించి వ్యక్తం అవుతున్నాయి ఆ చిత్రం ఏమిటన్నది చాలామంది గెస్ చేసే ఉంటారు. కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించిన మల్టీ స్టార్ చిత్రం గురించి ప్రస్తుతం వ్యక్తం అవుతున్న ఆ సందేహాలు. వీరి కాంబినేషన్లో నెల్సన్ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఇన్బన్ ఉదయనిధి భారీ బడ్జెట్లో నిర్మించనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలుపడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై చివరి వారిలో గానీ ఆగస్టు ప్రథమార్థంలో గానీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా ప్రస్తుత రాజకీయ రాజకీయ పరిస్థితులే ఈ చిత్రంపై సందేహాలు నెలకొనడానికి కారణం అనే భావన వ్యక్తమవుతోంది. తమిళనాడులో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. మరో విషయం ఏమిటంటే విజయ్ నటించిన జననాయకన్ చిత్రం విడుదలకు పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వారసుడు ఇన్బన్ ఉదయనిధి ఇప్పుడు కమలహాసన్, రజినీకాంత్ హీరోలుగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్‌కు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రసక్తే లేదని, ఇతరత్రా సహకారాలకు సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంటుందా అన్నదే ప్రశ్న. డీఎంకే పార్టీకి మద్దతు దారుడిగా నటుడు రజనీకాంత్, అదే పార్టీకి సానుకూలపరుడిగా కమల్ వ్యవహరిస్తుండటం ఇందుకు ఒక కారణం. అయితే వీరిద్దరూ టీవీకే పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారన్నది గమనార్హం. అంతేకాకుండా నటుడు, మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రజినీకాంత్ కమలహాసన్ కలిసి నటించిన చిత్రంపై రేకెత్తిస్తున్న సందేహాలు వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
తమిళనాట కొలువుదీరిన విజయ్ సర్కార్ (ఫొటోలు)
-
విజయ్ కేబినెట్లో ‘బుస్సీ’ పవర్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. సూపర్ స్టార్ విజయ్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించగా, ఆయనకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడైన బుస్సీ ఎన్ ఆనంద్ ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఒకప్పుడు విజయ్ అభిమాన సంఘాల నాయకునిగా ప్రత్యర్థుల ఎగతాళికి గురైన ఆనంద్, నేడు చెన్నై గుండెకాయ లాంటి త్యాగరాయ నగర్ (టీ నగర్) నియోజకవర్గం నుంచి గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.పుదుచ్చేరి నుంచి ‘బుస్సీ’ ప్రస్థానంబుస్సీ ఆనంద్ రాజకీయ ప్రస్థానం పుదుచ్చేరిలో అట్టడుగు స్థాయి నుంచి మొదలైంది. 2006లో పుదుచ్చేరి మున్నేట్ర కాంగ్రెస్ తరపున ‘బుస్సీ’ నుంచి పోటీ చేసి, డీఎంకే అభ్యర్థిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం పేరే ఆయన ఇంటి పేరుగా మారి, చివరకు ఆయన పేరు ‘బుస్సీ ఆనంద్’గా స్థిరపడిపోయింది. ఆ తర్వాత విజయ్ మీద ఉన్న అభిమానం, ఆయనపై ఉన్న నమ్మకంతో ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి మొదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ స్థాపన నాటి నుండి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు.టీ నగర్ కోటలో అద్భుత విజయంచెన్నైలో అత్యంత రద్దీగా ఉండే, వాణిజ్య పరంగా అత్యంత కీలకమైన టీ నగర్ నియోజకవర్గంలో ఆనంద్ విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని ఆయన తన వశం చేసుకున్నారు. డీఎంకే అభ్యర్థి రాజా అన్బళగన్‌ను ఢీకొట్టి, 51,632 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘విజిల్’ గుర్తుపై పోటీ చేసిన ఆనంద్, స్టార్ క్యాండిడేట్లను సైతం పక్కకు నెట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. గతంలో ఆయన్ని తక్కువ చేసి మాట్లాడిన వారు సైతం ఈ గెలుపు చూసి ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. -
బంగారం ‘8 గ్రాములే’ ఎందుకు?
సామాన్యుల జీవితాల్లో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక భరోసా. ఇటీవల తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో తెరపైకి వచ్చిన ‘8 గ్రాముల బంగారం’ హామీ ఇప్పుడు బులియన్ మార్కెట్, ఆర్థిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ఈ 8 గ్రాముల సంఖ్య వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ ఎంత? అన్న వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.ఎందుకు 8 గ్రాములు?దక్షిణ భారతదేశంలో బంగారాన్ని గ్రాముల కంటే ‘సవరం’ లెక్కన కొలవడం ఒక ఆనవాయితీ. 8 గ్రాముల బంగారాన్ని ఒక సవరంగా పిలుస్తారు. వివాహ సమయంలో ‘మంగళసూత్రం’ (తాళి) తయారు చేయడానికి కనీసం ఒక సవరం బంగారం ఉండాలని సెంటిమెంట్‌గా భావిస్తారు.ఒక మధ్యతరగతి లేదా పేద కుటుంబానికి వివాహ ఖర్చుల్లో అతిపెద్ద భారం బంగారం. ప్రభుత్వం సరిగ్గా ఒక సవరం (8 గ్రాములు) హామీ ఇవ్వడం ద్వారా, ఆ కుటుంబానికి ప్రాథమిక వివాహ అవసరాన్ని తీర్చినట్లు అవుతుందనేది ఈ సంఖ్య వెనుక ఉన్న వ్యూహం.నేరుగా బంగారమే ఇస్తారా? నగదు ఇస్తారా?హామీల అమలు తీరు ఆయా పార్టీల విధానాలపై ఆధారపడి ఉంటుంది. తమిళనాడులో సీఎం విజయ్ పార్టీ టీవీకే (Vijay TVK ) తమ హామీలో నేరుగా 8 గ్రాముల బంగారంతోపాటు పట్టుచీరను అందిస్తామని పేర్కొన్నాయి. గతంలో జయలలిత హయాంలో కూడా లబ్ధిదారులకు బంగారు నాణేలనే పంపిణీ చేసేవారు.అయితే, బంగారం పంపిణీలో నాణ్యత లోపాలు, అవినీతి వంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉండటంతో.. అస్సాం వంటి రాష్ట్రాలు ‘అరుంధతి’ పథకం కింద బంగారం కొనుగోలుకు సరిపడా నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి నిర్వహణ పరంగా సులభతరం అవుతుంది.ఎన్ని క్యారెట్లు ఇస్తారు?సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి పథకాల కింద 22 క్యారెట్ల బంగారాన్నే పంపిణీ చేస్తాయి. మన దేశంలో మంగళసూత్రాలు లేదా ఇతర ఆభరణాలను 22 క్యారెట్ల బంగారంతోనే తయారు చేస్తారు. ఇది ఆభరణాలకు అవసరమైన గట్టిదనాన్ని కలిగి ఉంటుంది. గతంలో ఇదే తమిళనాడు ప్రభుత్వం అమలు చేసిన 'తాళికి తంగం' పథకం కింద లబ్ధిదారులకు 22 క్యారెట్ల బంగారు నాణేలనే (Gold Coins) పంపిణీ చేసేవారు. విజయ్ పార్టీ హామీ కూడా అదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంది.ఇక ధరల పరంగా చూసినా 24 క్యారెట్లతో పోలిస్తే 22 క్యారెట్ల ధర గ్రాముకు సుమారు రూ.1000 పైనే వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం (మే 10, 2026 నాటికి) 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,150 ఉంది. అంటే 8 గ్రాములకు రూ.1,13,200 అవుతుంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గ్రాముకు రూ.15,437 ఉంది. ఇది 8 గ్రాములకు రూ.1,23,864 అవుతుంది. ప్రభుత్వం లక్షలాది మందికి పంపిణీ చేసేటప్పుడు, ఈ ధరల వ్యత్యాసం బడ్జెట్‌పై వందల కోట్ల ప్రభావం చూపుతుంది. -
సీఎంగా విజయ్.. తొలి సంతకం
-
విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన రాహుల్ గాంధీ
-
సీఎంగా విజయ్.. సందడి మొత్తం త్రిషదే
ఎట్టకేలకు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారరం చేశాడు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇందుకు వేడుకైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరికంటే స్పెషల్ అట్రాక్షన్‌గా మాత్రం త్రిష నిలిచింది.పద్దతిగా చీరలో.. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష కచ్చితంగా వస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లే కాస్త ముందుగానే త్రిష తన తల్లితో కలిసి కార్యక్రమానికి హాజరైంది. పద్దతిగా చీరకట్టులో త్రిష వచ్చిన త్రిష.. పార్టీ కార్యకర్తలను, అభిమానులను నవ్వుతూ పలకరించింది. అప్పటికే వేదిక దగ్గరకు వచ్చిన విజయ్ తల్లిదండ్రులను కలిసింది. విజయ్ తల్లి..త్రిషను హత్తుకొని పలకరించింది. స్టేజ్ ముందు ఏర్పాటు చేసిన మొదటి వరుసలోని కుర్చీల్లో విజయ్ తల్లిదండ్రులతో కలిసి త్రిష కూర్చుంది. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో త్రిష ముఖం సంతోషంతో మరింత మెరిసిపోయింది.ಗ್ಯಾಂಡ್ ಲುಕ್ ನಲ್ಲಿ @actorvijay ಅವರ ಪ್ರಮಾಣವಚನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನಟಿ ತ್ರಿಷಾ#Trisha #Oath #Vijay #tamilnaduelectionresults2026 pic.twitter.com/jySoXvqb3d— Anand Hunashal (@ana_hunashal) May 10, 2026త్వరలోనే పెళ్లి?విజయ్-త్రిష రిలేషన్లో ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరు మాత్రం ఆ విషయాన్ని ఇప్పటివరకు అధికారింగా ప్రకటించలేదు. కానీ విజయ్ సతీమణి సంగీత విడాకులు కోరుతూ.. ఓ నటితో తన భర్త రిలేషన్లో ఉన్నారని ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు బయటకు వచ్చింది. సంగీత ఆరోపణలను ఇద్దరూ స్పందించకపోవడం.. పైగా ఓ ఫంక్షన్‌కి కలిసి వెళ్లడంతో పరోక్షంగా రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాడు. ఇక త్వరలోనే త్రిషను పెళ్లి చేసుకొని తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించాలని విజయ్ భావిస్తున్నాడట. కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టి పెట్టి.. అంతా సెట్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి వీరిద్దరు వివాహ బంధంలోకి ఎప్పుడు అడుగుపెడతారో చూడాలి. Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/VmvDUqIjIq— ANI (@ANI) May 10, 2026 -
బ్లాక్ బ్లేజర్లో సీఎం విజయ్... బ్లూ కాంజీవరంలో త్రిష
చెన్నై: ఆరు దశాబ్దాల ద్రవిడ రాజకీయాల ఆధిపత్యానికి తెరదించుతూ, చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. వెండితెర ‘దళపతి’ విజయ్ అధికారికంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ చారిత్రక ఘట్టం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. విజయ్ సరికొత్త ప్రొఫెషనల్ లుక్, ప్రముఖ నటి త్రిష సంప్రదాయ చీరకట్టుతో ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన ఫ్యాషన్ వేడుకగా మారి, నెట్టింట వైరల్‌గా అవుతోంది.ప్రొఫెషనల్ లుక్‌లో ముఖ్యమంత్రి విజయ్తన సాధారణ దుస్తులకు భిన్నంగా, విజయ్ పర్ఫెక్ట్ వైట్ షర్ట్, దానికి నప్పే క్లాసిక్ బ్లాక్ బ్లేజర్, ప్యాంట్‌తో అత్యంత హుందాగా కనిపించారు. ఈ మోనోక్రోమ్ స్టైల్ తమిళనాడు రాజకీయ రంగానికి పర్ఫెక్ట్ కార్పొరేట్ పొలిటికల్ టచ్ ఇచ్చింది. తన సిగ్నేచర్ హెయిర్ స్టైల్, సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డంతో విజయ్ అచ్చమైన కొత్త ముఖ్యమంత్రిగా అదరగొట్టారు.బ్లూ కాంజీవరం చీరలో మెరిసిన త్రిషవిజయ్ చిరకాల స్నేహితురాలు, సహనటి త్రిష ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులలో ఒకరు. సముద్రపు నీలం రంగు (టర్కోయిజ్) కాంజీవరం చీరలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్నని బంగారు అంచు ఉన్న ఆ చీరకు మ్యాచింగ్‌గా గోల్డ్-బీజ్ బ్రోకేడ్ బ్లౌజ్ ధరించారు. మధ్యలో కెంపు ఉన్న డైమండ్ చోకర్, దానికి తగ్గ కమ్మలు ఆమె అందాన్ని పదింతలు చేశాయి. దక్షిణ భారత సంప్రదాయం ఉట్టిపడేలా జుట్టును ముడివేసి, మల్లెపూలు పెట్టుకుని త్రిష అద్భుతంగా ముస్తాబయ్యారు.నెట్టింట ట్రెండ్ అవుతున్న ‘గిల్లీ’ జోడీఈ ప్రమాణస్వీకారోత్సవంలో త్రిష ఉత్సాహంగా పాల్గొనడం, ఆమె చిరునవ్వు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆన్-స్క్రీన్‌లో సూపర్ హిట్టయిన ‘గిల్లీ’ జోడీ, ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఇలా కలిసి కనిపించడంతో అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇది కూడా చదవండి: విజయ్ నమ్మకం.. కీర్తన బాధ్యత -
తొలి సంతకంతోనే విజయ్ సంచలనం..
చెన్నై: తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్.. ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. మహిళా భద్రతపై విజయ్ రెండో సంతకం చేశారు. మహిళల భద్రత కోసం షీటీమ్ తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సీఎం సంతకం పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం చేశారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. నేను మీ ఇంట్లో కుటుంబసభ్యుడిని. మీకు అన్నగా తమ్ముడి ఉంటా. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చా. నాతో ప్రయాణం చేస్తున్న మీకు మంచి చేస్తా. ఇది అస్థిర ప్రభుత్వం కాదు....నా ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుంది. ఏది సాధ్యమే అది మాత్రమే చేస్తా. విద్యార్థుల భవిష్యత్‌కు విజయ్ మామ అండగా ఉంటాడు. మైనార్టీలకు అండగా ఉంటా ప్రజాధనం వృథా చేయను. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి త్వరలో శ్వేత పత్రం విడుదలచేస్తా. తమిళ ప్రజలకు రుణపడి ఉంటాను’’ అని ఆయన పేర్కొన్నారు. -
ప్రారంభమైన విజయ్ శకం
-
విజయ్ అనే నేను.. బాహుబలి సీన్ రిపీట్
-
విజయ్ కేబినెట్ మంత్రులు వీరే
చెన్నై: తమిళనాడు విజయ్ శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా సి.జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. విజయ్‌తో పాటు మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ కేబినెట్లో మంత్రులుగా ఎన్ ఆనంద్, అదవ అర్జున, కేజీ అరుణ్‌రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకటరమణన్, ఆర్ నిర్మల్‌కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభుత్వ, కీర్తన ప్రమాణస్వీకారం చేశారు.తెలుగు అమ్మాయి కీర్తన..శివకాశి నుంచి ఎమ్మెల్యేగా కీర్తన గెలుపొందిన తెలుగు అమ్మాయి కీర్తన మంత్రిగా ప్రమాణం చేశారు. విజయ్ కేబినెట్లో ఏకైక మహిళా ప్రతినిధి కాగా, మహిళా సాధికారత లక్ష్యంగా కీర్తనకు ప్రాధాన్యత ఇచ్చారుఎన్ ఆనంద్..మంత్రిగా ప్రమాణం చేసిన ఎన్ ఆనంద్.. టి.నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. ఈయన విజయ్‌కి అత్యంత నమ్మకస్తుడిగా పేరొంది. విజయ్ పార్టీ నిర్మాణంలో ఆనంద్ కీలక పాత్ర పోషించారు.అదవ్ అర్జున..విల్లివాక్కం నుంచి గెలిచిన అదవ్ అర్జునకు గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ విధానాల రూపకల్పనలో అదవ్ అర్జున కీలక పాత్ర పోషించారు కేఏ సెంగొట్టియన్..గోబిచెట్టిపాళయం నుంచి గెలిపిన కేఏ సెంగొట్టియన్.. ఈయన సీనియర్ రాజకీయ వేత్త. అన్నాడీఎంకే ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. విజయ్ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలవనున్నారు.నిర్మల్ కుమార్..తిరుప్పరంకుండ్రం నుంచి గెలిచిన నిర్మల్ కుమార్.. ఐటీ, సోషల్ మీడియా రంగంలో పట్టున్న నేతగా పేరొంది. గతంలో బీజేపీ ఐటీ వింగ్‌లో నిర్మల్‌కుమార్ కీలక బాధ్యతలు చేపట్టారుకేజీ అరుణరాజ్..తిరుచెంగోడు నుంచి గెలిచిన కేజీ అరుణరాజ్కు షెడ్యూల్ కులాల(ఎస్సీ) ప్రతినిధిగా మంత్రివర్గంలో చోటు లభించింది. సామాజిక న్యాయం దిశగా అరుణ్‌రాజ్ అవకాశం లభించింది.పి.వెంకటరమణన్..మంత్రిగా ప్రమాణం చేసిన పి.వెంకటరమణన్ మైలాపూర్ నుంచి గెలిచారు. చెన్నై నగర రాజకీయాల్లో ఆయన చురుకైన నేతగా గుర్తింపు పొందారుఎ.రాజమోహన్..ఎ.రాజమోహన్ ఎగ్మోర్ నుంచి గెలిచారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజమోహన్ గుర్తింపుపొందారు టీకే ప్రభు..మంత్రిగా ప్రమాణం చేసిన టీకే ప్రభు.. కారైకుడి నుంచి గెలిచారు పార్టీ బలోపేతంలో క్రీయశీలకంగా పనిచేశారు. -
ఫ్యాన్స్ కేరింతలు.. ఎమోషనల్ అయిన విజయ్
-
విజయ్ నమ్మకం.. కీర్తన బాధ్యత
చెన్నై: తమిళనాడు రాజకీయాలంటేనే ఎంతో ఉత్కంఠగొలుపుతాయి. అలాంటి గడ్డపై, అనుభవజ్ఞులైన ఉద్దండులు ఉన్న సభలో, కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రి పదవిని అలంకరించబోతున్నారు సెల్వి ఎస్. కీర్తన. ఒక సామాన్య నేపథ్యం నుండి వచ్చి, విద్యనే ఆయుధంగా మలచుకుని, నేడు రాష్ట్ర కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది.చదువులో మేటి.. లక్ష్యంలో స్పష్టతసెల్వి ఎస్. కీర్తన విద్యావంతురాలైన యువనేత. ఆమె ఎమ్మెస్సీ పట్టభద్రురాలు. చదువుకునే రోజుల నుంచే ఆమెకు సమాజం పట్ల, రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఆమె ప్రయత్నించారు. రాజకీయాలంటే కేవలం అధికారం మాత్రమే కాదు, అదొక బాధ్యత అని నమ్మిన అతి కొద్దిమంది యువతలో ఆమె ఒకరు. "సింగపెణ్" (సింహపుత్రి)పొలిటికల్ కన్సల్టెంట్‌గా అనుభవంరాజకీయాల్లోకి రాకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. సాధారణంగా తెరవెనుక ఉండి వ్యూహాలు రచించే బాధ్యత నుంచి, నేరుగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజాప్రతినిధిగా మారడం ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు. ఎన్నికల వ్యూహాలు, ప్రజాభిప్రాయ సేకరణ, సామాజిక సమస్యల విశ్లేషణలో ఆమెకు ఉన్న అనుభవం టీవీకే (టీవీకే) పార్టీలో ఆమె ఎదుగుదలకు తోడ్పడింది. ఈ వృత్తిపరమైన నేపథ్యమే ఆమెను ఒక పరిణతి చెందిన నాయకురాలిగా తీర్చిదిద్దింది.శివకాశి గడ్డపై విజయ కేతనంటపాసుల తయారీకి, కష్టపడే తత్వానికి మారుపేరైన శివకాశి నియోజకవర్గం నుంచి కీర్తన పోటీ చేశారు. ఆమెను ‘శివకాశి సింగపెణ్’ అని అంటుంటారు. సింగపెణ్ అంట్ సింహపుత్రి అని అర్థం. ఎన్నికల ప్రచారంలో ఆమె చూపిన తెగువ, మాట్లాడే తీరు అక్కడి ఓటర్లను, ముఖ్యంగా మహిళలను మరియు యువతను విశేషంగా ఆకర్షించింది. పార్టీ అధినేత విజయ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో ఆమె టీవీకే పార్టీలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.మహిళా సాధికారతకు నిలువెత్తు రూపంవిజయ్ తన తొలి కేబినెట్లోనే ఆమెకు చోటు కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. కేవలం మహిళా కోటాలో కాకుండా, ఆమెకున్న మేధస్సు, విద్యార్హత, పనితీరును చూసి ఈ బాధ్యతను అప్పగించారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి కూడా ఆమే కావడం విశేషం. ‘ఒక విద్యావంతురాలైన యువతి రాజకీయాల్లోకి వస్తే మార్పు ఎలా ఉంటుందో కీర్తన నిరూపిస్తున్నారు’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.విజయ్ నమ్మకం.. కీర్తన బాధ్యతముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్లో అనుభవజ్ఞులైన సెంగోట్టయ్యన్, ఆనంద్ వంటి వారితో పాటు కీర్తన వంటి యువ రక్తానికి ప్రాధాన్యత ఇచ్చారు. పాలనలో ఆధునికతను, సాంకేతికతను జోడించడంలో కీర్తన పాత్ర కీలకం కానుంది. ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా, స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం తమిళనాడులోని కోట్లాది మంది యువతులకు స్ఫూర్తిదాయకం. -
108 నుంచి 121కి వచ్చాం.. ఇకపై మా ఆట చూపిస్తాం..!
-
క్షణం క్షణం ఉత్కంఠ నడుమ స్నేహపూర్వక బ్రేక్‌ఫాస్ట్..!
తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించాయి. ఎట్టకేలకు ఆ ట్విస్ట్‌ల మధ్య చివరికి విజయ్ విజిల్ గట్టిగా మోగింది. రోజుల తరబడి సాగిన రాజకీయ ప్రతిష్టంభన తమిళనాడు గవర్నర్ ఆర్ వి అర్లేకర్‌తో జరిగి వరుస సమావేశాల అనంతరం మొత్తం 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో లోక్ భవన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి..అధికారిక ఆహ్వానాన్ని స్వీకరించి బయటకు వచ్చారు. ఇంత భారీ ఉత్కంఠ నడుమ గవర్నర్ నివాసం లోపల సహృద్భావ పూర్వక స్నేహ వాతావరణం ఉండటం విశేషం. ఆ నివాసం లోప కూటమికి సంబంధించి..సంఖ్యాబల లెక్కలు, రాజ్యంగపరమైన చర్చల తోపాటు చక్కటి రుచికరమైన అల్పాహార విందు, కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ వంటి సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..లోక్‌భవన్ జరిగిన సమావేశం సందర్భంగా విజయ్, ఆయన మిత్రపక్ష నాయకులకు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై కూడా ఉన్నారు. అక్కడ వడ, హల్వా, కాఫీ వడ్డించారు. గత కొన్ని రోజులగా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై తీవ్రమైన అనిశ్చితి ఉన్నప్పటికీ లోపల వాతావరణం మాత్రం ఎంతో స్నేహపూర్వకం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, అధికారిక చర్చలు ముగిసిన తర్వాత కూడా, విజయ్ లోక్ భవన్ లోపలే దాదాపు ఒక గంట పాటు గడిపినట్లు సమాచారం. గవర్నర్ నుంచి అధికారిక నియమాక పత్రాన్ని స్వయంగా స్వీకరించిన తర్వాత ఆయన ఆ ప్రాంగణం నుంచి బయలుదేరారని ఆ వర్గాలు తెలిపాయి. పైగా గత నాలుగు రోజుల్లో గవర్నర్‌తో విజయ్ జరిపిన నాల్గొవ సమావేశం ఇది. అంతేగాదు ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఖరారైన తర్వాత, సమావేశంలో కొన్ని సరదా సందర్భాలు కూడా చోటుచేసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం, కూటమిలోని కొందరు నాయకులు తమ కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్ చేసి, తమ పిల్లలతో కాసేపు మాట్లాడమని విజయ్‌ని కోరారు. ఏదీఏమైతేనేం రీల్స్ హీరో కాస్తా రియల్ హీరోలా తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు(ఆదివారం మే 10, 2026) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవలం రెండేళ్ల క్రితం స్థాపించబడి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్న 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి ఈ పరిణామం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది.(చదవండి: సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..) -
నా కొడుకు ప్రమాణస్వీకారాన్ని ఎంజాయ్ చేయాలి.. విజయ్ తల్లిదండ్రుల రియాక్షన్
-
విజయ్ ముఖ్య నేతలకు కీలక శాఖలు..
-
విజయ ప్రమాణ స్వీకారంలో తిష సందడి
-
విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష (ఫొటోలు)
-
విజయ్ ప్రమాణస్వీకారం ప్రత్యక్ష ప్రచారం
-
విజయ్ గెలుపు వెనుక అసలు సిక్రెట్ ఏంటి?
సాక్షి, చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తాజాగా తమిళగ వెట్రి కళగం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య శక్తిగా ఎదిగారు. ఈ అసాధారణ ఎదుగుదల వెనుక తెర వెనుక ఉండి చక్రం తిప్పిన వ్యూహకర్త, విజయ్ మేనేజర్ జగదీష్ పళనిస్వామి అన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా సినిమాలో విజయ్ బ్రాండ్ వాల్యూను పెంచడం నుండి, టీవీకే పార్టీ డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించడం వరకు జగదీష్ , ఆయన సంస్థ ది రూట్ పోషించిన పాత్ర ఇప్పుడు ఇతర రాజకీయ పారీ్టల దృష్టిని తమిళనాడులో ఆకర్షిస్తోంది.విజయ్ రాజకీయ రంగప్రవేశం అనేది అనుకోకుండా జరిగింది కాదు. దీని కోసం జగదీష్ బృందం గత ఐదేళ్లుగా ఒక పక్కా ప్రణాళికతో పనిచేసిందన్నది టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ’ది రూట్’ కేవలం సినిమా మేనేజ్మెంట్ సంస్థగా కాకుండా, ఒక భారీ డేటా అనలిటిక్స్ సెంటర్‌గా పనిచేసిందంటున్నారు. ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో యువతను ఆకర్షించడానికి జగదీష్ ప్రత్యేక వ్యూహాలు రచించారని చెబుతున్నారు.ఓ సాధారణ యువకుడు విజయ్‌కి సంబంధించిన చిన్న వీడియో చూసినా, మరుసటి నిమిషం నుండి అతని ఫీడ్ అంతా విజయ్ వార్తలతో నిండిపోయేలా అల్గారిథమ్ టెక్నిక్స్‌ను ఉపయోగించారని పేర్కొటున్నారు. సున్నా నుండి లక్షల వరకు ఫాలోవర్లు ఉన్న వేలకొద్దీ షాడో ఐడీల ద్వారా విజయ్ రాజకీయ భావజాలాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పవచ్చు.. ఇది ఒక కృత్రిమ డిజైన్డ్ వేవ్ ను సృషించి, విజయ్ను ఒక తిరుగులేని నాయకుడిగా ప్రొజెక్ట్ చేసిందన్నది జగమెరిగిన సత్యం.మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే వాట్సాప్ గ్రూపులను యాక్టివేట్ చేస్తాయి. కానీ, జగదీష్ బృందం గత ఐదేళ్లుగా ప్రతి నియోజకవర్గంలోని అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ బలమైన వాట్సాప్ నెట్‌వర్క్‌ను నిర్మించి ఉండడం విశేషం. ఏదైనా ఒక వార్త బయటకు వస్తే, అది కేవలం ఐదు నిమిషాల్లో తమిళనాడులోని లక్షలాది మంది యువత మొబైల్లకు చేరుకునేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్ది ఉన్నారు. మొదట్లో సినిమా కంటెంట్‌కు పరిమితమైన ఈ గ్రూపులు, మెల్లమెల్లగా విజయ్ను ఒక కుటుంబ సభ్యుడిగా భావించేలా మార్చేశాయి.రాజకీయాలంటే ఆసక్తి లేని యువతను సైతం ఆకర్షించేలా విజయ్ వేదికల మీద ఇచ్చే ప్రసంగాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సినిమా ఎడిటింగ్ టెక్నిక్స్‌తో, మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో రీల్స్‌గా మార్చి వైరల్ చేశారు. ఇది టీవీకే పార్టీని ఒక గ్లామరస్ , స్టైలిష్ పొలిటికల్ ఫోర్స్‌గా మార్చింది. విజయ్‌పై ఏవైనా విమర్శలు వస్తే వాటిని లాజికల్‌గా కాకుండా, భారీ డిజిటల్ అటాక్ ద్వారా అణిచివేసే పద్ధతిని వీరు అనుసరించడం ప్రత్యేకం.ప్రత్యర్థి నటులు లేదా పార్టీల ప్రతిష్టను తగ్గించేలా హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేయడంలోనూ ఈ రూట్ టీమ్ సిద్ధహస్తులని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి, ఎంజీఆర్ కాలం నాటి ఇమేజ్ను నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చి, విజయ్ను ఒక సూపర్ పవర్ పొలిటికల్ లీడర్‌గా నిలబెట్టడంలో జగదీష్ పళనిస్వామి ’మాస్టర్ మైండ్’గా నిలిచారన్నది ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. -
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
-
సీఎంగా విజయ్.. తొలి రోజే సంచలన ప్రకటన
Tamil Nadu CM Oath Live.. విజయ్ ప్రమాణ స్వీకారం అప్డేట్స్.. ఇక అన్నీ మారిపోతాయి: మంత్రి కీర్తనకొత్త మంత్రి, టీవీకే నాయకురాలు ఎస్.కీర్తన (29) కీలక వ్యాఖ్యలువిజయ్ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుందివిజయ్ టీవీకే మార్పు తీసుకొచ్చిందిముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వచ్చేరురాష్ట్రంలో ఇక అన్నీ మారిపోతాయిప్రతిభకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యాన్నిస్తారునాకు మంత్రి పదవి రావడం పార్టీ విధానాన్ని చూపుతోందిమధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానుఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందానునాలాంటివాళ్లు క్యాబినెట్ మంత్రి కావడం ఏ రాష్ట్రంలోనైనా సులభమా?విజయ్ సంచలన నిర్ణయాలు.. ఉచిత కరెంట్‌పై సీఎం విజయ్ తొలి సంతకం.మహిళల భద్రతపై రెండో సంతకం.తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక విభాగం.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సీఎం సంతకం.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం. సీఎం విజయ్ కామెంట్స్..నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే.మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను.నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు.రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు.నేను మీకు హామీ ఇస్తున్నాను.అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను.ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను.నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను.తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది.నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్ సెంటర్ ఉంటుంది.సాధ్యమైనది మాత్రమే చేస్తాను.చిన్నారులకు మామగా అండగా ఉంటా.ఇది అస్థిర ప్రభుత్వం కాదు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తా.వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు.. మీ కలల్ని మీ విజయ్ మామ తీరుస్తాడు.నన్ను అవమానించేవారున్నారు.. ఇబ్బంది పెట్టేవారు వస్తారు.వాళ్లంతా నాకు శ్రేయోభిలాషులే.. విజయ్‌కు ప్రధాని విషెస్.. విజయ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం.సీఎం విజయ్‌కు ప్రధాని అభినందనలుసీఎంగా ప్రమాణం చేసిన విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: మోదీ కమల్ హాసన్ శుభాకాంక్షలు..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఎంపీ కమల్ హాసన్ శుభాకాంక్షలు.సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు.విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం వెలుగొందాలని ఎక్స్‌లో పోస్ట్.విజయ్ సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయ్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..రాహుల్ గాంధీ సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.తమిళనాడు ముఖ్యమంత్రిగా, మీరు పేదలకు సంక్షేమం, అందరికీ న్యాయం చేస్తారని, మీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ఎత్తుకు తీసుకెళ్తారని నేను బలంగా నమ్ముతున్నాను.హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. 👉తమిళనాట విజయ్ శకం ప్రారంభంతమిళనాడు సీఎంగా విజయ్మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్విజయ్ కేబినెట్లో ఎన్ ఆనంద్, అదవ అర్జున, కేజీ అరుణ్‌రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకట్రామన్..ఆర్ నిర్మల్‌కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభుత్వ, కీర్తన👉తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం#WATCH | Chennai: Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay takes oath as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/8yGuYEAkfj— ANI (@ANI) May 10, 2026👉విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఆర్లేకర్👉విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా దద్దిరిల్లిన స్టేడియం #WATCH | Chennai | Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay and Lok Sabha LoP and Congress MP Rahul Gandhi at the Jawaharlal Nehru Stadium in Chennai.Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/9J8R7Zrq3H— ANI (@ANI) May 10, 2026 సీఎం ప్రమాణ స్వీకారంలో బీజేపీ నేతలు..విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ నేతలుకార్యక్రమానికి హాజరైన బీజేపీ చీఫ్ నాగేంద్రన్, తమిళిసై, అన్నామలై#WATCH | Tamil Nadu BJP president Nainar Nagenthran, and BJP leader K Annamalai at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK chief Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/HuzvvWCesA— ANI (@ANI) May 10, 2026👉నెహ్రు స్టేడియం చేరుకున్న గవర్నర్👉కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం.. నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్ ఆర్లేకర్నెహ్రు స్టేడియంకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీరాహుల్కు కాంగ్రెస్ శ్రేణుల స్వాగతం. #WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/xgXEyzAnNs— ANI (@ANI) May 10, 2026 #WATCH | Chennai | Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar leaves from Lok Bhavan. He will administer the oath of office to TVK Chief C Joseph Vijay as the Tamil Nadu Chief Minister shortly pic.twitter.com/Y9wpi6ol9r— ANI (@ANI) May 10, 2026నెహ్రు స్టేడియం చేరుకున్న త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన త్రిష. స్టేడియం వద్ద త్రిషకు స్వాగతం. #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/oCevs6N1Wx— ANI (@ANI) May 10, 2026విజయ్ మంత్రివర్గంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేవిజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్‌కు చోటు.మెలూరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్అయితే, నేడు చెన్నైలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం లేదు. తొమ్మిది మంత్రులు వీరే.. నేడు సీఎం సహా తొమ్మది మంది మంత్రుల ప్రమాణ స్వీకారంమంత్రి వర్గంలో కీర్తనకు చోటు. మంత్రి వర్గంలో అత్యంత పిన్న వయస్కురాలిగా కీర్తన రికార్డు C. Joseph Vijay, the Chief Minister-designate, has recommended a list of nine persons to be appointed as Ministers for the State of Tamil Nadu.1. N. Anand2. Aadhav Arjuna3. Dr. K.G. Arunraj,4. K.A. Sengottaiyan5. P. Venkataramanan6. R. Nirmalkumar7. Rajmohan8. Dr TK.… pic.twitter.com/0tU5Gox6zM— ANI (@ANI) May 10, 2026 స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్నెహ్రుకు స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్.విజయ్‌కి అధికారులు స్వాగతంకాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం. స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలి వచ్చిన అభిమానులు. #WATCH | TVK Chief C Joseph Vijay arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where he will take oath as the Chief Minister of Tamil Nadu shortly. (Source: TN DIPR) pic.twitter.com/4UvuSfAGxj— ANI (@ANI) May 10, 2026చెన్నై చేరుకున్న రాహుల్‌విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ.తమిళనాడు చేరుకున్న రాహుల్కాంగ్రెస్ శ్రేణుల ఆహ్వానం. #WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives in Chennai to attend the swearing-in ceremony of TVK Chief Vijay as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/XOgPYpftwI— ANI (@ANI) May 10, 2026స్టేడియంకు బయలుదేరిన త్రిష..చెన్నైలోని తన నివాసం నుండి బయలుదేరిన నటి త్రిష కృష్ణన్విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న త్రిష.ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం. #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/vUbZ5TpLE9— ANI (@ANI) May 10, 2026 #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/M7XFTKyKSt— ANI (@ANI) May 10, 2026 విజయ్ కుటుంబ సభ్యుల ఆనందం..విజయ్ సోదరి వ్యాఖ్యలు..విజయ్ ముఖ్యమంత్రి కావడం ఎంతో ఆనందంగా ఉంది.దేవుడి దయ, అభిమానులు, ప్రజల మద్దతే విజయ్ విజయానికి కారణం. మదర్స్ డే రోజున ఇది మాకు ఎంతో ఆనందమని విజయ్ తల్లి శోభ కామెంట్స్.. #WATCH | Chennai, Tamil Nadu: Shoba Chandrasekhar, mother of TVK Chief and CM-designate, Vijay, says, "I am so happy. It is Mother's Day today, I am very happy..." pic.twitter.com/Ti4DM4iCVl— ANI (@ANI) May 10, 2026 #WATCH | Chennai, Tamil Nadu: Cousin of TVK Chief and CM-designate, Vijay, says, "We are very proud. All credits to God and the people of Tamil Nadu." pic.twitter.com/oDu8OiYlqP— ANI (@ANI) May 10, 2026 స్టేడియంకు బయలుదేరిన విజయ్..నెహ్రు స్టేడియంకు బయలుదేరిన విజయ్..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం..భారీ కాన్వాయ్, అభిమానులతో స్టేడియంకు బయలుదేరిన దళపతి.. ఆనందంలో విజయ్ పేరెంట్స్. #WATCH | Tamil Nadu: TVK Chief and CM-designate Vijay leaves from his residence. He will take oath as the Chief Minister of Tamil Nadu today at Jawaharlal Nehru Stadium in Chennai.(Source: TN DIPR) pic.twitter.com/Cydz5VkjfC— ANI (@ANI) May 10, 2026 కీర్తన సరికొత్త రికార్డు..టీవీకే ఎమ్మెల్యే కీర్తన(29) మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలుశివకాశి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కీర్తనముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం #WATCH | Chennai, Tamil Nadu | S Keerthana, TVK MLA-elect from the Sivakasi constituency, says, "Today is a big day for Tamil Nadu and the public of the state...This is the moment everybody has been waiting for..." https://t.co/Ndr3C8C0VK pic.twitter.com/wbw05LZjQs— ANI (@ANI) May 10, 2026పదవుల జాబితా సిద్దం!ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్దం.ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్దే పెట్టుకోనున్న విజయ్. టీవీకే పార్టీ కన్వీనర్ సెంగొట్టయన్‌కు ప్రజా పనులు.పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్‌కు మున్సిపల్ శాఖ.పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ.పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్‌కు విద్యుత్ శాఖ.అరుణ్ రాజ్‌కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ.రాజమోహన్‌కు ఆది ద్రావిడ సంక్షేమం.ముస్తఫాకు మైనార్టీ సంక్షేమ శాఖ. తమిళనాడు బయలుదేరిన రాహుల్ గాంధీ.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీఢిల్లీకి తమిళనాడుకు బయలుదేరిన రాహుల్ టీవీకేకు కాంగ్రెస్ మద్దుతు. #WATCH | Delhi | Leader of Opposition (LoP) Rahul Gandhi arrives at IGI Airport as he heads to Tamil Nadu He will be attending the swearing-in ceremony of Tamil Nadu CM-designate Vijay in Chennai, today. pic.twitter.com/Z5yNaTr0vw— ANI (@ANI) May 10, 2026విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..నేడు సీఎంగా విజయ్ ప్రమాణం.. విజయ్‌తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణంప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులకు ఆహ్వానం.చెన్నైలో ఉన్న అని దేశాల రాయబారులకు ఆహ్వానం.చెన్నైలో ప్రమాణ స్వీకారం కోసం 20 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం.ప్రమాణ స్వీకారోత్సవానికి కోలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం. అసెంబ్లీలో బల నిరూపణలకు టీవీకే మూడు రోజులు సమయం ఇచ్చిన గవర్నర్ ఆర్లేకర్. ఈనెల 13న బలనిరూపణకు అవకాశం. నేడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..నేడు తమిళనాడు నూతన సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారంచెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా గొప్ప సంబరంకాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ దాటిన విజయ్రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో టీవీకే నేతలు, విజయ్ అభిమానులుప్రమాణ స్వీకారానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశంహాజరు కానున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.నాలుగు పార్టీల మద్దతు.. ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంనాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖకాసేపటికే ఐఎంయూఎల్ కూడా విజయ్‌కు మద్దతు ప్రకటనకాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐఎంయూఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది.ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు.ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గవర్నర్, తమిళనాడు సీఎంగా విజయ్ను నియమిస్తూ లేఖ విడుదల. -
కొత్త సర్కార్‌కు రిక్వెస్ట్.. ఎంకే స్టాలిన్ కీలక పోస్ట్
చెన్నై: కూటమి నుండి వైదొలిగిన కాంగ్రెస్‌పై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. మరో వైపు, రాబోయే కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ.. డీఎంకే పథకాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజల కోసం డీఎంకే ఎంతో చేసిందన్నారు. విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ తమ కూటమి నుంచి బయటకు రావడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కూటమి తరఫున పోటీ చేసి గెలిచినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా డీఎంకే ప్రధాన కార్యాలయానికి రాలేదని.. ఆ రోజే డీఎంకేతో సంబంధాలను తెంచుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను అవకాశవాదిగా అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు మద్దతు ఇచ్చినప్పటికీ, వీసీకేతో పాటు సీపీఐ, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీలు కూటమిలోనే కొనసాగుతాయని ఆయన అన్నారు.కమ్యూనిస్ట్ నేతలు కామ్రేడ్ షణ్ముగం, కామ్రేడ్ వీరపాండియన్లతో పాటు విడుదల చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ నాయకుడు తిరుమావళవన్.. తమిళనాడు హక్కులు, ప్రజల సంక్షేమం కోసం డీఎంకేతో చేతులు కలిపి పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తద్వారా వారు తమ మధ్య ఉన్న స్నేహభావాన్ని చాటుకోవడమే కాకుండా, బలమైన సిద్ధాంతాలు కలిగిన డీఎంకేపై తమకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నారు," అని ఆయన కొనియాడారు."డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలను సాధించలేకపోయినప్పటికీ.. తమకు భారీ సంఖ్యలో ఓట్లు వచ్చాయని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి ఆటంకాలు సృష్టించబోమని.. డీఎంకే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తుందని తాను ఇప్పటికే ప్రకటించానని స్టాలిన్ గుర్తు చేశారు. తమ మిత్రపక్షాలు తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా డీఎంకే.. గౌరవిస్తుందని, మళ్లీ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేకుండా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా సమన్వయంతో వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. என் உயிரோடு கலந்திருக்கும் தலைவர் கலைஞரின் அன்பு உடன்பிறப்புகளுக்கும், என் உயிர்நிகர் தமிழ் மக்களுக்கும் என் அன்பு வணக்கம்.தேர்தல் முடிவுகள் அறிவிக்கப்பட்ட பின்பு, நடக்கும் நிகழ்வுகளை நீங்கள் பார்க்கிறீர்கள். எந்தக் கட்சிக்கும் ஆட்சி அமைக்கும் பெரும்பான்மை கிடைக்காத வகையில்…— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 9, 2026 -
తమిళనాడు గవర్నర్ ను కలిసిన విజయ్
-
విజయ్ కి అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్
-
తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్‌లు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. కేరళం పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే, విజయ్‌కు గవర్నర్ తొలుత.. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్.. వెనుదిరిగారు. కేరళంకు వెళ్లడానికి సిద్ధమైన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు.విజయ్ కంటే ముందుగా లోక్‌భవన్‌కు సీపీఎం నేతలు చేరుకోగా.. వారిని కూడా లోక్‌భవన్ సిబ్బంది వెనక్కి పంపించారు. అయితే, చివరి క్షణంలో గవర్నర్ తన మనస్సు మార్చుకున్నారు. కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. విజయ్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారు. టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే నుంచి మద్దతు లేఖ కూడా టీవీకే బృందం అందుకుంది. దీంతో వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది.ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు 121కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేయడానికి.. మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ను విజయ్ కోరారు. ఇవాళ(శనివారం) సాయంత్రం గవర్నర్‌ను కలిసిన విజయ్.. తనకు మద్దతు ఇస్తున్న వారి పేర్లతో లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంటీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. రేపు(మే 10, ఆదివారం) నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్‌కు అందజేశారు. -
సినిమాకు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు..!
విజయ్.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. అంటే ఇప్పుడు రియల్ హీరో. అంతుకుముందు రీల్ హీరో. సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు. ఇప్పుడు అదే ఆయన్ను సీఎం పీఠంవైపు నడిపించింది. రజినీకాంత్ లాంటి వారే రిస్క్ చేయలేని చోట.. విజయ్ ఒక అడుగు ముందుకేసి మరీ సక్సెస్ కొట్టాడు. ధైర్యమే సక్సెస్‌కు పునాది అనే విషయాన్ని విజయ్ నిరూపించారు. అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేలు మాత్రమే ఎప్పట్నుంచో రాజ్యమేలుతున్న చోట. ఒక గట్టిదెబ్బ కొట్టాడు. కొత్త పార్టీతో తొలి అడుగు వేసేటప్పుడు ప్రభుత్వ ఏర్పాటు వరకూ వెళ్లడం అంత చిన్న విషయం కాదు. అలాంటిది విజయ్ చేసి చూపించాడు. ఏదో 60 నుంచి 70 సీట్లు అని అంచనా వేసిన చోట విజయ్.. ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. మొత్తం 108 స్థానాల్లో విజయ్ భేరీ మోగించి తన సత్తా చూపెట్టాడు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్య్యే మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో విజయ్ ఆగిపోవడంతో తీవ్ర అనిశ్చిత నెలకొంది. ఫలితంగా రెండు, మూడు సీట్లు సాధించిన పార్టీలకు డిమాండ్ పెరిగిపోయింది. దీనిపై వరుసగా ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ హైడ్రామా నడుస్తూనే ఉంది. ఒకసారి చిన్న పార్టీల మద్దతు అని, కాసేపు కాదనే డ్రామానే నడిచింది. దాంతో వరుసగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం, అక్కడ పూర్తి సభ్యుల మద్దతు లేదనడం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మూడుసార్లు గవర్నర్‌ను విజయ్ కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడలేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు వీసీకే, ఐయూఎంలు తాము మద్దతు ఇస్తున్నట్లు లేఖలు ఇవ్వడంతో మరొకసారి గవర్నర్‌ను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు గవర్నర్ అపాయింట్మెంట్..అయితే నాల్గోసారి అపాయింట్మెంట్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కాసేపు గవర్నర్ అపాయింట్ ఇవ్వలేదన్నారు. ఆయన కేరళ పర్యటనకు వెళుతున్నారనేది మొదటి సారాంశం. దాంతో విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి మరింత సమయం పడుతుందా? అని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నడుమ గవర్నర్ తన కేరళ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. విజయ్‌కు అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గవర్నర్ మనసు మార్చుకుని అపాయింట్మెంట్ ఇవ్వడంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లే. ఇన్ని టేకులు సినిమాల్లో కూడా తీసుకుని ఉండడు..తమిళనాడులో ప్రముఖ హీరోల్లో ఒకరైన విజయ్.. సినిమా చేసేటప్పుడు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా మనిషి కదా.. ఓపిక ఎక్కువే ఉంటుంది. టేకులు తీసుకోవడం విజయ్‌కు అలవాటే. అదే ఇప్పుడు జరుగుతుందని అనేవారు కూడా ఉన్నారు. రియల్ లైఫ్‌లో టేక్‌లు ఇలానే ఉంటాయని, ఇంత హైడ్రామా నడుమ విజయ్ కూడా మనసులో ఇదే అనుకుని ఉంటాడని అంటున్నారు. టేకాఫ్ అయ్యే ముందు ఈ టేకులను పెద్దగా పట్టించకోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.సినిమా పరంగా టేకులు అంటే ఒకే సందర్భాన్ని పదే పదే చేయడం. ఇప్పుడు అదే విజయ్ నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంది. విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నాటి నుండి ఇదే జరుగుతూ వస్తోంది. ఒకే సందర్భం.. గవర్నర్‌ను విజయ్ మళ్లీ మళ్లీ కలవడం. దీనికి ఎప్పటికి ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ కేరళ పర్యటన రద్దు నేపథ్యంలో ఆ టేక్కు కాస్త క్లియరెన్స్ వచ్చింది. ఫలితంగా విజయ్ సీఎం టేక్ రేపో, మాపో ఓకే అవ్చొచ్చు. -
తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్.. మళ్లీ వెనుదిరిగారు. కేరళకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.. విజయ్‌కు సమయం ఇవ్వలేదు. గవర్నర్‌కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు. విజయ్ కంటే ముందుగా లోక్‌భవన్‌కు సీపీఎం నేతలు చేరుకోగా.. వారిని కూడా లోక్‌భవన్ సిబ్బంది వెనక్కి పంపించారు.టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయన్న సంబరపడిన లోపే గవర్నర్.. విజయ్‌కు మరో షాక్ ఇచ్చారు. ఈ ట్విస్టులు కొనసాగుతుండగా.. గవర్నర్ తన మనసు మార్చకున్నారు. తన కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. గవర్నర్‌కు కలిసిన విజయ్.. 121 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందించారు.టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే నుంచి మద్దతు లేఖ కూడా టీవీకే బృందం అందుకుంది. దీంతో వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు 121కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. -
విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ అన్నట్లు తయారైంది. లేటెస్ట్ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ 107 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 11 సీట్లు అవసరమున్న నేపథ్యంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. విజయ్ పలుమార్లు గవర్నర్‌ని కలుస్తున్నా ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. మరోవైపు విజయ్-త్రిష బంధం గురించి సోషల్ మీడియాలోనూ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి రాఖీ సావంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్)'నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి త్రిష నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చింది. విజయ్‌తో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడితో ఒక్క పాటైనా చేయాలని కలలుకన్నాను. కానీ ఛాన్స్ రాలేదు. కనీసం విజయ్-త్రిష మెహందీ వేడుకలో అయినా డ్యాన్స్ చేస్తాను. పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ ఒకేసారి కలిసి ఫొటో దిగుతాను' అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.ముఖ్యమంత్రి అయ్యే పనిలో విజయ్ కిందామీద పడుతుంటే రాఖీ సావంత్ మాత్రం త్రిషని అతడు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యే పనిలో ఉంది. ఇప్పుడే కాదు గతంలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే దానిపై కామెంట్ చేస్తూ ట్రెండ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా విజయ్-త్రిషపై అలానే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి) -
తమిళనాడులో మొదలైన విజయ్ ఫ్యాన్స్ సంబరాలు
-
పాపం విజయ్... తెరవెనుక జరుగుతుంది ఇదే..!
-
అడుగు దూరంలో TVK విజయ్.. బిగ్ ట్వీస్ట్.. తమిళనాడు సీఎంగా VCK ఎమ్మెల్యే
-
VCKతో షరతులతో కూడిన ఒప్పందం... విజయ ప్రమాణస్వీకారానికి ఆల్ క్లియర్


