బ్లాక్ బ్లేజర్‌లో సీఎం విజయ్... బ్లూ కాంజీవరంలో త్రిష | Vijay Trisha Steal the Show at TN Swearing-In | Sakshi
Sakshi News home page

బ్లాక్ బ్లేజర్‌లో సీఎం విజయ్... బ్లూ కాంజీవరంలో త్రిష

May 10 2026 11:16 AM | Updated on May 10 2026 12:58 PM

Vijay Trisha Steal the Show at TN Swearing-In

చెన్నై: ఆరు దశాబ్దాల ద్రవిడ రాజకీయాల ఆధిపత్యానికి తెరదించుతూ, చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. వెండితెర ‘దళపతి’ విజయ్ అధికారికంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ చారిత్రక ఘట్టం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. విజయ్ సరికొత్త ప్రొఫెషనల్ లుక్, ప్రముఖ నటి త్రిష సంప్రదాయ చీరకట్టుతో ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన ఫ్యాషన్ వేడుకగా మారి, నెట్టింట వైరల్‌గా అవుతోంది.

ప్రొఫెషనల్ లుక్‌లో ముఖ్యమంత్రి విజయ్
తన సాధారణ  దుస్తులకు భిన్నంగా, విజయ్ పర్ఫెక్ట్ వైట్ షర్ట్, దానికి నప్పే క్లాసిక్ బ్లాక్ బ్లేజర్, ప్యాంట్‌తో అత్యంత హుందాగా కనిపించారు. ఈ మోనోక్రోమ్ స్టైల్ తమిళనాడు రాజకీయ రంగానికి పర్ఫెక్ట్ కార్పొరేట్ పొలిటికల్ టచ్ ఇచ్చింది. తన సిగ్నేచర్ హెయిర్ స్టైల్, సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డంతో విజయ్ అచ్చమైన కొత్త ముఖ్యమంత్రిగా అదరగొట్టారు.

బ్లూ కాంజీవరం చీరలో మెరిసిన త్రిష
విజయ్ చిరకాల స్నేహితురాలు, సహనటి త్రిష ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులలో ఒకరు. సముద్రపు నీలం రంగు (టర్కోయిజ్) కాంజీవరం చీరలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్నని బంగారు అంచు ఉన్న ఆ చీరకు మ్యాచింగ్‌గా గోల్డ్-బీజ్ బ్రోకేడ్ బ్లౌజ్ ధరించారు. మధ్యలో కెంపు ఉన్న డైమండ్ చోకర్, దానికి తగ్గ కమ్మలు ఆమె అందాన్ని పదింతలు చేశాయి. దక్షిణ భారత సంప్రదాయం ఉట్టిపడేలా జుట్టును ముడివేసి, మల్లెపూలు పెట్టుకుని త్రిష అద్భుతంగా ముస్తాబయ్యారు.

నెట్టింట ట్రెండ్ అవుతున్న ‘గిల్లీ’ జోడీ
ఈ ప్రమాణస్వీకారోత్సవంలో త్రిష ఉత్సాహంగా పాల్గొనడం, ఆమె చిరునవ్వు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆన్-స్క్రీన్‌లో సూపర్ హిట్టయిన ‘గిల్లీ’ జోడీ, ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఇలా  కలిసి కనిపించడంతో అభిమానులు  ఉప్పొంగిపోతున్నారు. 

ఇది కూడా చదవండి: విజయ్ నమ్మకం.. కీర్తన బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement