Tamilnadu Assembly Election 2016
-
బ్లాక్ బ్లేజర్లో సీఎం విజయ్... బ్లూ కాంజీవరంలో త్రిష
చెన్నై: ఆరు దశాబ్దాల ద్రవిడ రాజకీయాల ఆధిపత్యానికి తెరదించుతూ, చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. వెండితెర ‘దళపతి’ విజయ్ అధికారికంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ చారిత్రక ఘట్టం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. విజయ్ సరికొత్త ప్రొఫెషనల్ లుక్, ప్రముఖ నటి త్రిష సంప్రదాయ చీరకట్టుతో ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన ఫ్యాషన్ వేడుకగా మారి, నెట్టింట వైరల్‌గా అవుతోంది.ప్రొఫెషనల్ లుక్‌లో ముఖ్యమంత్రి విజయ్తన సాధారణ దుస్తులకు భిన్నంగా, విజయ్ పర్ఫెక్ట్ వైట్ షర్ట్, దానికి నప్పే క్లాసిక్ బ్లాక్ బ్లేజర్, ప్యాంట్‌తో అత్యంత హుందాగా కనిపించారు. ఈ మోనోక్రోమ్ స్టైల్ తమిళనాడు రాజకీయ రంగానికి పర్ఫెక్ట్ కార్పొరేట్ పొలిటికల్ టచ్ ఇచ్చింది. తన సిగ్నేచర్ హెయిర్ స్టైల్, సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డంతో విజయ్ అచ్చమైన కొత్త ముఖ్యమంత్రిగా అదరగొట్టారు.బ్లూ కాంజీవరం చీరలో మెరిసిన త్రిషవిజయ్ చిరకాల స్నేహితురాలు, సహనటి త్రిష ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులలో ఒకరు. సముద్రపు నీలం రంగు (టర్కోయిజ్) కాంజీవరం చీరలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్నని బంగారు అంచు ఉన్న ఆ చీరకు మ్యాచింగ్‌గా గోల్డ్-బీజ్ బ్రోకేడ్ బ్లౌజ్ ధరించారు. మధ్యలో కెంపు ఉన్న డైమండ్ చోకర్, దానికి తగ్గ కమ్మలు ఆమె అందాన్ని పదింతలు చేశాయి. దక్షిణ భారత సంప్రదాయం ఉట్టిపడేలా జుట్టును ముడివేసి, మల్లెపూలు పెట్టుకుని త్రిష అద్భుతంగా ముస్తాబయ్యారు.నెట్టింట ట్రెండ్ అవుతున్న ‘గిల్లీ’ జోడీఈ ప్రమాణస్వీకారోత్సవంలో త్రిష ఉత్సాహంగా పాల్గొనడం, ఆమె చిరునవ్వు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆన్-స్క్రీన్‌లో సూపర్ హిట్టయిన ‘గిల్లీ’ జోడీ, ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఇలా కలిసి కనిపించడంతో అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇది కూడా చదవండి: విజయ్ నమ్మకం.. కీర్తన బాధ్యత -
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ లో కొత్త ట్విస్ట్
చెన్నె: తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొత్త మలుపు తిరిగాయి. స్థానిక మీడియాలో జయలలితకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. పోలింగ్ చివరి 2 గంటల్లో అధికార అన్నాడీఎంకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని వెల్లడించింది. అన్నాడీఎంకే ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని తంతి టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. అన్నాడీఎంకే 111, డీఎంకే 99, మూడో ఫ్రంట్ 3, పీఎంకే 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని తెలిపింది. వేదారణ్యం స్థానంలో బీజేపీ గెలుస్తుందని అంచనా వేసింది. జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఐదు ఎగ్జిట్ పోల్స్ లో ఒకటి మాత్రమే అన్నాడీఎంకు అధిక సీట్లు వస్తాయని పేర్కొంది. మిగతా నాలుగు డీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిపాయి. అన్నాడీఎంకు 139 స్థానాలు ఖాయమని సీఓటర్-టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా కట్టింది. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకున్నట్టు రాకపోవచ్చని సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. యాక్సిస్ మై ఇండియా ఫలితాలు తిరగబడొచ్చని అన్నారు. డీఎంకే 106-120, అన్నాడీఎంకే 89-101, పీడబ్ల్యూఎఫ్ 4-8, బీజేపీ 0-3 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది. పుదియ తలైమురై ఎగ్జిట్ పోల్స్ సర్వే: అన్నాడీఎంకే 164, డీఎంకే 66 కుముదమ్ రిపోర్టర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే: అన్నాడీఎంకే 162, డీఎంకే 41, డీఎంకే 15 -
తమిళనాడు అసెంబ్లీ పోరులో మజ్లిస్
హైదరాబాద్: జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల్లో బోణీ కొట్టిన స్ఫూర్తితో మజ్లిస్ పార్టీ దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో బరిలోకి దిగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం పార్టీ నిర్ణయించింది. మూడు స్థానాలకు అభ్యర్థులను సోమవారం ఖరారు చేసింది. గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులను బరిలో దింపిన ఎంఐఎం రెండు సీట్లు గెలుచుకుంది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. సీమాంచల్ ప్రాంతంలో కేవలం 6 స్థానాల్లో బరిలో దిగిన ఎంఐఎం ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. కోచాదామన్ లో రెండో స్థానం, కిషన్ గంజ్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగితా చోట్ల కనీసస్థాయి ప్రభావం కూడా చూపలేకపోయింది.


