విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి | Rakhi Sawant Reacts Vijay Trisha Wedding Rumours | Sakshi
Sakshi News home page

Vijay Trisha: విజయ్‌ని చాలా ఇష్టపడతా.. కానీ ఛాన్స్ రాలేదు

May 9 2026 5:13 PM | Updated on May 9 2026 5:20 PM

Rakhi Sawant Reacts Vijay Trisha Wedding Rumours

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ అన్నట్లు తయారైంది. లేటెస్ట్ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ 107 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 11 సీట్లు అవసరమున్న నేపథ్యంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. విజయ్ పలుమార్లు గవర్నర్‌ని కలుస్తున్నా ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. మరోవైపు విజయ్-త్రిష బంధం గురించి సోషల్ మీడియాలోనూ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి రాఖీ సావంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.

(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్)

'నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి త్రిష నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చింది. విజయ్‌తో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడితో ఒక్క పాటైనా చేయాలని కలలుకన్నాను. కానీ ఛాన్స్ రాలేదు. కనీసం విజయ్-త్రిష మెహందీ వేడుకలో అయినా డ్యాన్స్ చేస్తాను. పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ ఒకేసారి కలిసి ఫొటో దిగుతాను' అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.

ముఖ్యమంత్రి అయ్యే పనిలో విజయ్ కిందామీద పడుతుంటే రాఖీ సావంత్ మాత్రం త్రిషని అతడు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యే పనిలో ఉంది. ఇప్పుడే కాదు గతంలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే దానిపై కామెంట్ చేస్తూ ట్రెండ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా విజయ్-త్రిషపై అలానే ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.

(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement