ప్రేయసి రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్ | Director Jp Thuminad Ties Knot With Rashmika | Sakshi
Sakshi News home page

Jp Thuminad Rashmika: దర్శకుడిగా గతేడాది హిట్.. ఇప్పుడు పెళ్లి బంధంలోకి

May 9 2026 3:05 PM | Updated on May 9 2026 3:25 PM

Director Jp Thuminad Ties Knot With Rashmika

 రష్మికకు ఆల్రెడీ హీరో విజయ్ దేవరకొండతో పెళ్లయిపోయింది కదా! ఈ రష్మిక ఎవరు? ఏ దర్శకుడిని పెళ్లి చేసుకుందా అని ఆలోచిస్తున్నారా? కంగారు పడొద్దు. గతేడాది 'సు ఫ్రమ్ సో' అనే కన్నడ సినిమా తెలుగులోనూ రిలీజైంది. ఉన్నంతలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంతోనే హిట్ కొట్టిన దర్శకుడు జేపీ తుమినాడు.. మూడు రోజుల క్రితం ప్రేయసి రష్మికని పెళ్లి చేసుకున్నాడు.

(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్‌మెంట్.. ఆశీర్వదించిన చిరు)

కేరళలో పుట్టి పెరిగిన జేపీ తుమినాడు.. గత పదేళ్లుగా కన్నడ సినిమాల్లో నటుడు, రచయిత, దర్శకుడిగా చేస్తున్నాడు. 2017లో వచ్చిన 'ఒండు మొట్టెయ కథే'లో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేశాడు. తర్వాత తులు భాషలో దర్శకుడిగా 'కటపడి కట్టప్ప' అనే మూవీ తీశాడు. అనంతరం గరుడ గమన వృషభ వాహన, స్వాతి ముత్తిన మలే హనియే, సప్త సాగర ఎల్లో దాచే రెండు చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేశాడు.

గతేడాది రిలీజైన 'సు ఫ్రమ్ సో' అనే విలేజ్ కామెడీ మూవీతో తెలుగు, కన్నడలో మంచి స్పందన అందుకున్నాడు. ఇకపోతే నాటక రంగంలో ఉన్నప్పుడే పరిచయమైన రష్మిక అనే అమ్మాయిని జేపీ తుమినాడ్.. 14 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలోనే పెద్దల్ని ఒప్పించి ఈ బుధవారం(మే 06) మంగళూరులో వీళ్లిద్దరి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తర్వాత సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో తోటి సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement