ఏదైనా ఒక రంగంలో ఒక ఘటన జరిగితే దాన్ని ఇతర విషయాలకు ఆపాదిస్తూ సందేహాలను వ్యక్తం చేయటం జరుగుతుంటుంది. అలాంటి సందేహాలు ఇప్పుడు ఒక మల్టీ స్టార్ చిత్రం గురించి వ్యక్తం అవుతున్నాయి ఆ చిత్రం ఏమిటన్నది చాలామంది గెస్ చేసే ఉంటారు. కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించిన మల్టీ స్టార్ చిత్రం గురించి ప్రస్తుతం వ్యక్తం అవుతున్న ఆ సందేహాలు.
వీరి కాంబినేషన్లో నెల్సన్ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఇన్బన్ ఉదయనిధి భారీ బడ్జెట్లో నిర్మించనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలుపడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై చివరి వారిలో గానీ ఆగస్టు ప్రథమార్థంలో గానీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి.
కాగా ప్రస్తుత రాజకీయ రాజకీయ పరిస్థితులే ఈ చిత్రంపై సందేహాలు నెలకొనడానికి కారణం అనే భావన వ్యక్తమవుతోంది. తమిళనాడులో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. మరో విషయం ఏమిటంటే విజయ్ నటించిన జననాయకన్ చిత్రం విడుదలకు పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వారసుడు ఇన్బన్ ఉదయనిధి ఇప్పుడు కమలహాసన్, రజినీకాంత్ హీరోలుగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్‌కు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రసక్తే లేదని, ఇతరత్రా సహకారాలకు సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంటుందా అన్నదే ప్రశ్న. డీఎంకే పార్టీకి మద్దతు దారుడిగా నటుడు రజనీకాంత్, అదే పార్టీకి సానుకూలపరుడిగా కమల్ వ్యవహరిస్తుండటం ఇందుకు ఒక కారణం. అయితే వీరిద్దరూ టీవీకే పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారన్నది గమనార్హం.
అంతేకాకుండా నటుడు, మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో రజినీకాంత్ కమలహాసన్ కలిసి నటించిన చిత్రంపై రేకెత్తిస్తున్న సందేహాలు వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


