ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం విజయ్‌ | CM Vijay Other New MLAs Swear-in Ceremony In Assembly | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం విజయ్‌

May 11 2026 10:24 AM | Updated on May 11 2026 11:27 AM

CM Vijay Other New MLAs Swear-in Ceremony In Assembly

సాక్షి, చెన్నై: తమిళనాడులో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు పళనిస్వామి, ఉదయ్‌నిధి స్టాలిన్‌ తదితరుంతా ప్రమాణం చేశారు. 

పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ నుంచి విజయ్‌ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒకస్థానం వదులుకోవాల్సిన పరిస్థితుల్లో.. ఆయన తిరుచ్చికి రాజీనామా చేశారు. ముందుగా పెరంబూర్‌ ఎమ్మెల్యేగా విజయ్‌, ఆ తర్వాత టీవీకే సభ్యులు.. ఆ తర్వాత మిగతా పార్టీల సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ సభ్యులతో ప్రమాణం చేయించారు. 

రేపు తమిళనాడు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. అలాగే ఈ నెల 13న అసెంబ్లీలో టీవీకే బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.

కూటమిలో లుకలుకలు?
టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలైనట్లు సమాచారం అందుతోంది. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందేమాతరం పూర్తిగా ఆలపించడంపైనా వీసీకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గవర్నర్‌ మెప్పు పొందేందుకు టీవీకే ప్రయత్నించిందని.. ఈ తీరు సరికాదని మండిపడింది.

డీఎంకే ఫైర్‌
సీఎం విజయ్‌పై ప్రతిపక్ష డీఎంకే భగ్గుమంది. గత డీఎంకే సర్కార్‌ అడ్డగోలుగా అప్పులు చేసిందని.. శ్వేత పత్రం విడుదల చేస్తామని విజయ్‌ ప్రకటించారు. అయితే అబద్ధ ప్రచారాలు ఆపాలంటూ తమిళనాడు కొత్త సీఎంకు డీఎంకే చురకలంటించింది. తమిళనాడు రాజకీయ చరిత్ర నేర్చుకోవాలంటూ సూచించింది.

ప్రతిపక్ష నేతగా ఉదయ్‌నిధి
ప్రతిపక్ష పార్టీ నేతగా మాజీ మంత్రి, చెపాక్‌ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే పార్టీ ఎన్నుకుంది. ఇందుకుగానూ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌కు ఉదయనిధి కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీకి వెళ్లే ముందు నూతన ఎమ్మెల్యేలతో స్టాలిన్‌ కార్యాలయానికి వెళ్లిన ఉదయనిధి.. శాలువా కప్పి పుష్పగుచ్చం సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement