breaking news
YS Jagan Mohan Reddy
-
బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ రియాక్షన్
-
బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళ వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరిగిపోవడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి, అప్పులు పెరిగి పోతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019–24 మధ్య మా ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదేపదే అబద్దాలు చెప్పాయి. రాష్ట్రంలో ఆదాయ వృద్ది తగ్గిందనీ, అభివృద్ది అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయి. 𝙏𝙝𝙚 𝘾𝘼𝙂 𝙛𝙞𝙜𝙪𝙧𝙚𝙨 𝙧𝙚𝙫𝙚𝙖𝙡 𝙘𝙤𝙣𝙩𝙞𝙣𝙪𝙞𝙩𝙮 𝙤𝙛 𝙛𝙞𝙨𝙘𝙖𝙡 𝙨𝙩𝙧𝙚𝙨𝙨During the five year period, 2019-24, the then opposition parties TDP and JSP continuously lied that the then Government’s policies were resulting in unchecked growth in liabilities and… pic.twitter.com/X0JeWvpxVE— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04% పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఏపీ ఆర్థిక వృద్ధి 12.02% ఉంటే, మరి ఆదాయం పెరుగుదల 3.08% దగ్గరే ఎందుకు ఆగిపోయింది?, గతేడాదితో పోల్చితే ఈఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ది పది శాతం ఉండాల్సి ఉండగా, కేవలం 2.39% మాత్రమే ఉంది. మా హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,32,671 కోట్లు మాత్రమే. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లోనే ఏకంగా రూ. 1,86,361 కోట్లు అప్పు చేసింది. అంటే మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పుల్లో ఇప్పటికే 56% చేశారు. ఆదాయాలు తగ్గి, అప్పులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అన్ని స్థాయిల్లో పెరిగిన అవినీతిని అరికట్టాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
జగన్ చెప్పిందే నిజమైంది.. అమ్మకానికి స్టీల్ ప్లాంట్!
-
తాడిపత్రి YSRCP నేత స్వర్ణలతను ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్
-
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు వైఎస్ జగన్ నివాళి
-
నేడు ప్రకాశం పంతులు జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు . తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి నేడు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/cPB3xrhlKv— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 -
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సీపీఐ నేత, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘రాజకీయాలకు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి సురవరం సుధాకర్ రెడ్డి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా. సురవరం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు. The passing of CPI leader and former MP Comrade Suravaram Sudhakar Reddy Garu is deeply saddening. His contributions to politics and the Communist movement will always be remembered.My heartfelt condolences to his family. May his soul rest in peace. pic.twitter.com/k5ssa78oMZ— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 -
పేరం స్వర్ణలతకు వైఎస్ జగన్ పరామర్శ
తాడిపత్రి టౌన్: వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలతను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా శుక్రవారం పరామర్శించారు. అనారోగ్య కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని తన స్వగృహంలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమెతో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎలాంటి సాయం అందించడానికై నా తాను సిద్ధంగా ఉన్నానని భరోసానిచ్చారు. ఆమె భర్త పేరం అమర్నాఽథరెడ్డితో మాట్లాడుతూ.. పేరం కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కూడా అమెను ఫోన్లో పరామర్శించారు. అలాగే స్వర్ణలత ఇంటికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి కొనుదల రమేష్‌రెడ్డి దంపతులు, మాజీ ఎంపీ తలారి రంగయ్య దంపతులు చేరుకుని ఆమె ఆరోగ్య స్థితిగతులు ఆరా తీశారు. -
కుప్పం నుంచి కుట్రలకు క్లాప్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో అందుబాటులో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోంది. ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలను నీరుగారుస్తూ ‘డింక్’ (డిజిటల్ నెర్వ్ సెంటర్) పేరుతో ఓ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్ ద్వారా మెడికల్ కాలేజీల్లోని హబ్‌లతో పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లను అనుసంధానించి స్పెషలిస్టులతో వైద్య సేవలు అందించగా గొప్పగా నడుస్తున్న ఈ వ్యవస్థలను అటకెక్కించిన బాబు సర్కారు ముడుపుల కోసం కొత్త ప్రాజెక్టును తెచ్చింది. గతంలో అందించిన టెలీ మెడిసిన్ సేవలకే కలరింగ్ ఇస్తూ సమర్థంగా సేవలు అందించిన విలేజ్ క్లినిక్స్‌కు పాతరేసింది. వైద్య సేవల్లో ఇప్పుడేదో సరికొత్త వ్యవస్థను తెస్తున్నట్లు మభ్యపెడుతూ ‘డింక్’ పేరుతో రూ.350 కోట్ల ప్రజాధనానికి టెండర్ పెట్టింది! సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం కేంద్ర బిందువుగా ‘పైలెట్’ ప్రాతిపదికన ఈ దోపిడీ వ్యవహారాలకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలలుగా ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘డింక్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ‘డింక్’ ప్రాజెక్టులో భాగంగా రేషనలైజేషన్ పేరిట ఏకంగా 2,500 నుంచి 3 వేల విలేజ్ క్లినిక్‌లను మూసివేసేందుకు వైద్యశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించడం గమనార్హం. గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించిన వ్యవస్థలను నీరుగార్చి ప్రైవేట్ సంస్థల సేవల పట్ల మొగ్గు చూపడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎన్నికైన ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఈ క్రమంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్యులే నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యం చేసేలా విప్లవాత్మక రీతిలో ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఆరోగ్య సురక్షలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మరీ ప్రజలందరికీ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్సను పేదలకు ఉచితంగా అందించారు. వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేస్తూ జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఏకంగా 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీ మాటే లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యుల కొరత 50% ఉంటే రాష్ట్రంలో కేవలం 1.4% మాత్రమే ఉంది. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61% ఉంటే ఏపీలో 6.2 శాతం మాత్రమే ఉండేది. కేవలం వైద్య నియామకాలే కాకుండా ఆస్పత్రుల్లో మందుల కొరతకు తావు లేకుండా చేశారు. ఇలా ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. నిధులు దుర్వినియోగం కాకుండా 2019–24 మధ్య జగన్ వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తే నేడు పీపీపీ ప్రాజెక్టుల రూపంలో చంద్రబాబు ప్రజారోగ్యానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేశారు. రోగులకు ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులు దాదాపు రూ.నాలుగు వేల కోట్లు పెండింగ్‌లో పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ‘డింక్’ ప్రాజెక్టు ఏమిటంటే..?‘డింక్’ పేరిట కుప్పంలో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు అనుసంధానించారు. ఇక్కడికి వచ్చే రోగులకు డిజిటల్ హెల్త్ అకౌంట్ జారీచేసి ఈ సెంటర్ ద్వారా ఫోన్లో స్పెషలిస్ట్ వైద్యసేవలను అందచేస్తారు. అవసరం మేరకు వైద్యుడు వీడియో కాల్ చేసి రోగితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. సెంటర్లో ఉండే ఆరోగ్య సిబ్బంది గర్భిణులు, బాలింతలు, ఇతరులకు ఆరోగ్య సంరక్షణపై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. స్థూలంగా చెప్పాలంటే ‘డింక్’ ప్రాజెక్టు అచ్చు టెలీ మెడిసిన్ లాంటిదే. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కుప్పం పరిధిలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి రూ.350 కోట్ల మేర ఖర్చవుతుందని సంబంధిత సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. టెలీ మెడిసిన్‌తో అంతకంటే మెరుగ్గా..గత ప్రభుత్వం పైసా కూడా దుర్వినియోగం కాకుండా అంతకంటే మెరుగ్గా ప్రజలకు టెలీ మెడిసిన్ సేవలను అందించింది. 26 జిల్లాల్లో వైద్య కళాశాలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్‌లను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ హబ్‌లకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,400కిపైగా పీహెచ్‌సీలు, 562 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10,032 విలేజ్ క్లినిక్‌లను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ లాంటి మూడు రకాల స్పెషలిస్ట్ వైద్యులతో పాటు ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంచింది. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైన సందర్భాల్లో టెలీమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స అందించారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ ద్వారా రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్ సూచించేవారు. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్‌లో ఈ మందులను రోగులకు అందజేసే యంత్రాంగం అప్పట్లో పనిచేసింది. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలు పొందడానికి కూడా ఆస్కారం కల్పించారు. స్మార్ట్‌ఫోన్ లేనివారు, వినియోగం తెలియని వారికి ఆశావర్కర్లు సహాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రంలోని 42వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసిన గత ప్రభుత్వం వాటన్నింటినీ హబ్‌లకు అనుసంధానించింది. ఇలా ప్రైవేట్ వ్యక్తులు, నిధుల దుర్వినియోగానికి ఏమాత్రం తావులేకుండా గత ప్రభుత్వంలో ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు పారదర్శకంగా అందాయి.నాడు దేశానికే ఆదర్శంగా..నిధుల దుబారాకు అడ్డుకట్ట వేసి టెలీ మెడిసిన్ వైద్యసేవలు అందించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2019 నుంచి 2023 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీపీపీ ప్రాజెక్టుల రూపంలో రూ.వందల కోట్ల నిధులు దుబారా చేయకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటైన హబ్‌లను మరింత బలోపేతం చేసి టెలీవైద్య సేవలు అందించవచ్చని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.ప్రివెంటివ్ కేర్ బలోపేతం.. వైఎస్ జగన్ పాలనలో 2019–24 మధ్య ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ప్రివెంటివ్ కేర్‌ను బలోపేతం చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణాల్లో 562 యూపీహెచ్‌సీలను నెలకొల్పారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు/ఒక పీహెచ్సీ, ఒక సీహెచ్‌సీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు ప్రభుత్వ వైద్యులను సమకూర్చారు. అంతేకాకుండా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు అధునాతన సౌకర్యాలతో భవనాలు, ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గిరిజన, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్యసేవలను చేరువ చేస్తూ 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్ క్లినిక్స్‌ను నెలకొల్పారు.వైద్యులే ప్రజల వద్దకు..వైద్యం కోసం ప్రజలు వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేకుండా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్యులనే ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. విప్లవాత్మక రీతిలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ వైద్యులను గ్రామాలకు పంపి వైద్యసేవలు అందించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యాన్ని వాకబు చేసి వ్యాధులను ముందే గుర్తించడంతో పాటు వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుచేశారు. ఇందులో భాగంగా ఊరూవాడా స్పెషలిస్ట్ వైద్యులతో క్యాంపులు నిర్వహించి అనారోగ్య బాధితులకు కొండంత భరోసా కల్పించారు. 16 రకాలు టెస్టులు ఉచితంగా చేశారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చేయి పట్టుకుని ముందుకు నడిపించింది. అంతేకాకుండా గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఇళ్ల వద్దే ఖరీదైన మందులను ఉచితంగా డోర్ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో మందులు అందచేశారు. అంత గొప్పగా ఉన్న ఆరోగ్య రంగాన్ని నాశనం చేసిన చంద్రబాబు సర్కారు నిధులను దోచిపెట్టే ప్రాజెక్టులకే జైకొడుతోంది. -
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్/ నల్లగొండ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి(83) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతోసుధాకర్రెడ్డి మరణించినట్లు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు తెలిపారు. ఆయనకు భార్య విజయలక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్‌రెడ్డి గతంలో పార్టీలో అత్యున్నత పదవి అయిన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.నల్లగొండ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. సురవరం మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా..రెండుసార్లు ఎంపీగా సుధాకర్‌రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండ్రావుపల్లిలో సురవరం వెంకట్రామ్రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. అయితే ఆయన సొంతూరు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని కంచుపాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కర్నూలు జిల్లాలోని ఉస్మానియా కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలతో అనుబంధమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.సీపీఐ అనుబంధ ఆల్ ఇండియా విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో క్రమంగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అంతకుముందు 1966లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 1970లో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1972లో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా.. 1974 నుంచి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1984, 1990లలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1994లోనూ కర్నూలులోని డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.అయితే 1998 (12వ లోక్‌సభ), 2004 (14 లోక్‌సభ)లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ క్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా, 2012లో పాటా్నలో జరిగిన జాతీయ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా ఆయననే ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో 2012 నుంచి 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2004లో ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (కారి్మక) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యుత్ చార్జీల ఆందోళనలో కీలక పాత్ర 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచగా.. దీనిపై వామపక్షాలు పెద్దయెత్తున పోరాటం నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆందోళనల్లో సురవరం కీలక పాత్ర పోషించారు. ఎంపీగా పార్లమెంటులో కారి్మకులు, రైతులు, కూలీలు, పేదల సమస్యలపై గళమెత్తారు. వ్యవసాయ సంక్షోభం, కార్మిక హక్కులు, ఆర్థిక విధానాలపై నిరంతరం స్వరం వినిపించారు. ప్రజలు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. నిరాడంబర జీవనశైలి, ఆచరణాత్మక రాజకీయ దృక్పథం ఆయన ప్రత్యేకత. దేశంలో వామపక్ష శక్తుల ఐక్యత కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన సురవరం ప్రతాపరెడ్డి ఈయనకు పెదనాన్న. మహబూబ్‌నగర్‌లో జననం..నల్లగొండతో అనుబంధం సురవరం సుధాకర్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జని్మంచినా నల్లగొండతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీ కార్యక్రమాలైనా, రాజకీయాలైనా నల్లగొండ గడ్డ నుంచే క్రియాశీలంగా వ్యవహరించారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొంది సేవలందించారు. ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంగా అనేక వామపక్ష పోరాట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2024 డిసెంబర్లో నల్లగొండలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగసభలో పాల్గొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఆయన సభలో పాల్గొని మాట్లాడారు. జాతీయ నాయకులతో కలిసి వేదికపై ప్రసంగించారు. చిరస్మరణీయుడు సురవరం సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సీపీఐ పార్టీకే, తెలంగాణకు, దేశ వామపక్ష రాజకీయ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని సీపీఐ నేతలు నివాళులు అర్పించారు. గొప్ప నాయకుడిని కోల్పోయాం: సీఎం రేవంత్ సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్ధంచారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుధాకర్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగిప గొప్ప నాయకుడని, వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి దేశ రాజకీయాల్లో తన దైన ముద్ర వేశారని కొనియాడారు. కేసీఆర్, సీపీఐ నేతల సంతాపం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సురవరం మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, నర్సింహ, కలవేణ శంకర్, మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ నేతల సంతాపం సుధాకర్‌రెడ్డి మృతిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కమ్యూనిస్టు నాయకుడిగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసిన సుధాకర్ రెడ్డి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
‘నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని’
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను తాను కలవడంపై వస్తున్న విమర్శలపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌రెడ్డి స్పందించారు. తాను మల్లికార్జున ఖర్గేను కలవడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, మర్యాద పూర్వకంగా మాత్రమే ఆయన్ను కలిశానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు 22వ తేదీ) ‘సాక్షి’తో మాట్లాడిన ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి.. ‘ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశాను. ఆయన్ను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. 35 ఏళ్లుగా మల్లికార్జున ఖర్గే నాకు సన్నిహితుడు. కర్ణాటక హోం మంత్రిగా ఖర్గే పనిచేసిన దగ్గర్నుంచీ ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది. సన్నిహితుడు కాబట్టే మర్యాదపూర్వకంగా మాత్రమే ఖర్గేను కలిశాను. రాజకీయాల్లో ఉన్నంత వరకూ మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్‌తోనే నడుచుకుంటాను. నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని. ఎల్లో మీడియా కావాలని నాపై ఉద్దేశపూర్వక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
‘వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు’
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలను తెలుస్తుంది అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా అనకాపల్లిలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడికి వచ్చినా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ైవైఎస్ జగన్‌ను మించిన అభివృద్ధిగానీ, సంక్షేమం కానీ కూటమి ప్రభుత్వం చేయలేదు. కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బతీసింది. ఈసారి వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వస్తుంది. ఏపీలో వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలకు అప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్న వారంతా కచ్చితంగా ఫలితం అనుభవిస్తారు అని హెచ్చరించారు. -
వైఎస్ జగన్‌ని తిట్టడం తప్ప.. రాష్ట్రానికి ఏం చేశావో చెప్పు చంద్రబాబు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడేలా కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తోంది. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడడం లేదు. వైఎస్సార్సీపీని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడం తప్ప ఇంకేమీ లేదు. విశాఖ ఉక్కుపై కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తాం. యూరియా బస్తాలు ఇవ్వలేని స్థితలో ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టాల్సి వస్తే ముందుకు చంద్రబాబుపైనే కేసులు పెట్టాలిరాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. రైతులకు కేంద్రం సాయం తప్ప.. రాష్ట్రం ఇచ్చింది లేదు. ప్రజాప్రతినిధులు, వారి తాబేదారుల కబ్జాలు పెరిగిపోయాయి.14 నెలలుగా ఢిల్లీ వెల్లి ఏం సాధించారు?. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడారు’అని ప్రశ్నించారు.కాగా, ఈ నెల 25వ తేదీన వైఎస్ జగన్ రాజమండ్రి పర్యటన రద్దు అయ్యింది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో వైఎస్ జగన్ ములాఖత్ వినాయకచవితి తర్వాత ఉంటుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. -
చిన్నారుల మృతి పట్ల YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి విచారం
-
కర్నూలు జిల్లాలో విషాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందటం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి చెందారు. ఉజ్వల భవిష్యత్‌ను పొందాల్సిన విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
YSRCP నేత ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుని రిసెప్షన్‌కు హాజరు
-
మాజీ మంత్రి కన్నబాబు తండ్రి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కన్నబాబుకు పితృవియోగం కలిగింది. కన్నబాబు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.కాగా, కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. పలువురు పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్యనారాయణ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నారు.కురసాల సత్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శించిన ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ.. ఆయనకు నివాళులర్పించారు. దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ భరత్, వంగా గీతా, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, తోట నరసింహం, జక్కంపూడి రాజా, దవులూరి దొరబాబు కన్నబాబును పరామర్శించి సంతాపం తెలిపారు. -
జగన్ రాకతో దద్దరిల్లిన ఆకేపాడు.. నూతన వధూవరులకు ఆశీర్వాదం (చిత్రాలు)
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి, అన్నమయ్య: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంట శుభకార్యం జరగగా.. ఆ వివాహ రిస్పెప్షన్కు హాజరైన వైఎస్ జగన్ నూతన వధువరులను ఆశీర్వదించారాయన. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు అనురాగ్ రెడ్డి వివాహం వరదీక్షిత రెడ్డితో జరిగింది. ఈ వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. హెలిపాడ్ నుంచి వివాహ వేదిక వరకు పెద్దఎత్తున అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అందరికీ ఆప్యాయంగా అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదిలారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు అన్నమయ్య జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాజంపేట మండలం బాలిరెడ్డిగారిపల్లికి చేరుకొని.. అక్కడి నుంచి ఆకేపాడుకు వెళ్తారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో ఆయన పాల్గొంటారు. -
జగన్ మద్దతు కోరుతూ.. రాజ్‌నాథ్ సింగ్ ఫోన్
సాక్షి, ఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సోమవారం ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని జగన్‌ను కోరారాయన. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా రాధాకృష్ణన్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి భావిస్తోంది. ఇవాళో, రేపో అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించాలనుకుంటోంది. ఈ క్రమంలో.. పోటీ లేకుండా చూడాలని ఎన్డీయే కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే.. రాజ్‌నాథ్ సింగ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు విపక్ష నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే వాళ్ల నుంచి సానుకూల స్పందన లభించనట్లు సమాచారం. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి రాజ్‌నాథ్ మద్దతు కోరారు. ఈ అంశంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం చెబుతామని వైఎస్ జగన్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్ లో విద్యుత్ షాక్ ఘటనపై వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి
-
రామంతాపూర్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్‌లోని రామంతాపూర్ విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృతి చెందటంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో దుర్ఘటన జరగటం విషాదకరం అని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ ఘటనపై తాజాగా స్పందిస్తూ..‘పండగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. -
బాబు, రాహుల్ హాట్‌లైన్ బంధం నిజమే!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుమ్మక్కు అయినట్లేనా? రాహుల్ గాంధీ ఒకవైపు కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్నట్లు హడావుడి చేస్తూ.. ఇంకోపక్క అదే ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు ఎందుకన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య ఉన్న హాట్ లైన్ సంబంధాల గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడుస్తోందని ఆయన వెల్లడించారు. అంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా అటు బీజేపీతో పొత్తు, ఇటు కాంగ్రెస్‌తో రహస్య బంధం పెట్టుకున్నారన్న మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది కాని పెద్దగా ఫీల్ కాలేదనిపిస్తుంది. అందువల్లే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్‌పై కొద్దిమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని, బీజేపీకి మేలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఏపీ, ఒడిశాలల్లో జరిగిన ఎన్నికల తీరుపై ఎందుకు మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదన్నదానికి జవాబు దొరకడం లేదు. ఏపీలో పోలింగ్ నాటితో పోలిస్తే కౌంటింగ్ రోజు 12.5 శాతం ఓట్లు అధికంగా లెక్కవేశారని... అంటే సుమారు 49 లక్షల ఓట్ల మాయాజాలం జరిగిందని ఎన్నికల సంస్కరణల సంస్థ (ఎడిఆర్) ఒక నివేదికలో తెలిపింది.అయినా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విషయం తెలియనట్లు నటిస్తోంది. అదే జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలై, బీజేపీ గెలిచిన రోజే ఎన్నికల అక్రమాలపై తన నిరసన తెలిపారు. ఈవీఎంలు మానిప్యులేషన్‌కు గురవుతున్నాయిని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని సూచించారు. జగన్ అలా వ్యాఖ్యానించినా, ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన పత్రంలో ఈవీఎంల మాయ, ఓట్ల రిగ్గింగ్ తదితర కారణాలతో వైఎస్సార్సీపీ 88 సీట్లు కోల్పోయిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మోడీ అంటే వెరచేవారైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా? వైఎస్సార్సీపీ నేతలు కొందరు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఎన్నికల అధికారులు వాటిని పది రోజులలోనే దగ్ధం చేయించిన విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇన్ని జరిగినా కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పలేదు. ఈ ఆధారాలను రాహుల్ వాడుకోగలిగి ఉంటే ఆయన వాదనకు మరింత బలం చేకూరేది. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్చి రాహుల్ గాంధీకి జగన్ మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికీ జగన్‌ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారే కాని, ఏపీలో ఎన్నికల అవకతవకలు జరిగాయా?లేదా? అన్నదానిపై తమ అభిప్రాయం చెప్పలేదు. మోడీ,అమిత్ షాలపై జగన్ విమర్శలు చేయడం లేదట. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై జగన్ ఎవరిపై విమర్శలు చేసినట్లో తెలియడం లేదా? పైగా షర్మిల ఆధ్వరంలో జరిగే ర్యాలీలో జగన్ పాల్గొనాలని ఒక పిచ్చి సలహా పారేసి చంద్రబాబు పట్ల, బీజేపీ కూడా భాగస్వామి అయిన కూటమి పట్ల ఎంత విధేయత ఉందో ఈ కాంగ్రెస్ నేతలు మరోసారి చెప్పకనే చెప్పారనిపిస్తుంది.రాహుల్ గాంధీ చెప్పుడు మాటలు వింటారని గతంలో అనుకునేవారు. తల్లి సోనియాగాంధీ కూడా అదే తరహాలో వ్యవహరించిన కారణంగానే ఏపీలో కాంగ్రెస్ నాశనమైందని కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైందని అంతా విశ్వసిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన కుమారుడు జగన్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించలేదు. జగన్‌ను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసినా, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకుండా, మరో సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. తదుపరి అది తప్పు నిర్ణయమన్న భావనకు వచ్చిన అధిష్టానం ఆయనను మార్చి అప్పట్లో స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేశారు. ఈ ఎంపికలో రాహుల్ గాంధీ పాత్ర అధికంగా ఉందని అంటారు.చిదంబరం వంటి నేతలను ప్రభావితం చేసి రాహుల్ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కిరణ్ వ్యూహం అమలు చేశారని అంటారు. ఆ పిమ్మట జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వెళ్లారు. దాంతో కక్షకట్టి ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇందులో చంద్రబాబు సహకారాన్ని కూడా తీసుకున్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడడం, చంద్రబాబు కోరుకున్నట్లు జగన్‌పై అక్రమ కేసులు పెట్టడం వంటివి కూడా చేశారు. తత్పలితంగా కాంగ్రెస్ తన సమాధికి తానే రాళ్లు పేర్చుకున్నట్లయింది. ఫలితంగా ఈ 15 ఏళ్లు అధికారానికి దూరం కావల్సి వచ్చింది. అధికారం పోయిన తరువాత కూడా వారిలో పెద్దగా మార్పేమీ రాలేదు. బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరోక్ష స్నేహం చేస్తోందన్నది బహిరంగ రహస్యమే.ఏపీ కాంగ్రెస్‌లో కాస్తో, కూస్తో మిగిలి ఉన్న కేడర్ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత ఏపీలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు. 2019లో ఏపీలో పరాజయం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్‌ను పూర్తిగా వదలివేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాలు కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు కొందరికి టీడీపీ నాయకత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించిందని చెబుతారు. 2019 ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను వదలి బీజేపీ కూటమితో సాన్నిహిత్యం కోసం నానా పాట్లు పడ్డారు. అయినా ఎన్నడూ చంద్రబాబును రాహుల్ గాంధీ తప్పు పట్టలేదు. చివరికి 2024లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేసినా ఒకటి, అర సందర్భంలో తప్ప టీడీపీపై కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేయలేదన్నది వాస్తవం. అలాగే సోనియాగాందీ, రాహుల్ గాంధీలతోపాటు ,కాంగ్రెస్ ముఖ్యనేతలెవరిని చంద్రబాబు కూడా విమర్శించరు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీపై రాహుల్ ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా, వాటిని ఖండించడానికి, మోడీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడానికి చంద్రబాబు పెద్దగా చొరవ చూపిన సందర్భాలు కనిపించవు. ఆపరేషన్ సిందూర్ వంటి కీలకమైన అంశంలో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుపట్టినా చంద్రబాబు మాత్రం నోరెత్తలేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. మోడీతో కలిసి పాల్గొనే సభలలో మాత్రం ఆయనను చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతుంటారు. మోడీ,అమిత్ షా వంటివారితో సంబంధం లేకుండా ఏపీలో నిత్యం జరిగే సభలలో మాత్రం చంద్రబాబు వారి ఊసే ఎత్తకుండా, మొత్తం తన గురించే ప్రచారం చేసుకుంటుంటారని, అయినా తమ నాయకత్వం చూసి చూడనట్లు పోతోందని బీజేపీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయడంలో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాక ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేయడంలో చంద్రబాబు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట. అయినా బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం పొత్తుకు ఈ రాష్ట్ర నాయకులు అంత సుముఖంగా లేరని అంటున్నారు. అసలు ఏపీ కాంగ్రెస్‌లో చాలామందికి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె అచ్చంగా అధికారం కోల్పోయిన జగన్ పై విమర్శలు చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సపోర్టుగా వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయం ఉంది. ఆమెకు మాణిక్యం ఠాకూర్ వంటి వారు వంతపాడుతున్నారు. ఏపీలో అనేక స్కామ్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె కాని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కాని వాటి గురించి కాకుండా విపక్షంలో ఉన్న జగన్ పై విమర్శలు చేస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కొంతకాలం క్రితం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడితే, షర్మిల తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈవీఎంలకు బదులు బాలెట్ల వ్యవస్థను తీసుకురావాలని కోరుతుంటే ఈమె ఇలా ఎలా మాట్లాడతారో తెలియదు. ఈ కారణాలన్నిటి రీత్యానే రాహుల్ గాంధీపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుకు, రేవంత్‌కు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పటికీ సజావుగానే కొనసాగుతున్నాయని కాంగ్రెస్ కేడర్ సైతం చెబుతుంటుంది.అందువల్ల రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని, వారి మధ్య నిత్య సంబందాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడ్డారన్నమాట. చిత్రమేమిటంటే చంద్రబాబుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నేతలు అనడం లేదు. తాము చంద్రబాబు ఆద్వర్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై పోరాడతామని చెప్పడం లేదు. మళ్లీ జగన్ పైనే విమర్శలు చేసి చంద్రబాబును సంతోషపెట్టారనిపిస్తుంది. మరో వైపు ఒడిశాలో ఎన్నికల అక్రమాలపై బీజేడీ హైకోర్టుకు వెళుతోంది. అయినా రాహుల్ గాంధీ ఏపీ, ఒడిశాల గురించి మాట్లాడకుండా బీజేపీపై పోరాడుతున్నామని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ పర్యటన ఖరారు!
రాజంపేట: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19న రాజంపేట మండలం ఆకేపాడు రానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయిందని రాజంపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి ఆదివారం విలేకర్లకు తెలిపారు.రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆకేపాటి సాయిఅనురాగ్రెడ్డి, వరదీక్షితా నవదంపతుల రిసెప్షన్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేసి, నవదంపతులను ఆయన ఆశీర్వదించనున్నారన్నారు. ఆకేపాటి ఎస్టేట్‌లో రిసెప్షన్ వేడుక జరగుతుందని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రాజంపేటకు హెలీక్యాప్టర్‌లో వస్తారన్నారు. ఇందుకోస హెలీప్యాడ్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఉదయం పది గంటలకు బయలుదేరుతారన్నారు. తిరిగి ఆకేపాడు ఎస్టేట్ నుంచి 12.35 గంటలకు బయలుదేరి బెంగళూరుకు వెళతారన్నారు. వైఎస్జగన్మోహన్రెడ్డి వస్తున్న తరుణంలో భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని,, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆకేపాటి అనిల్‌రెడ్డి తెలిపారు.పర్యటన వివరాలు..ఉదయం 10గంటలకు బెంగళూరులోని యలహంక నుంచి బయలుదేరుతారు. రోడ్డుమార్గంలో 10.20కి చేరుకుంటారు, 10.30గంటలకు జక్కురు ఎయిర్‌డ్రోమ్ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరుతారు. 11.30గంటలకు ఆకేపాడులోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో 11.40గంటలకు ఆకేపాటి ఎస్టేట్‌కు చేరుకుంటారు. 12 గంటల నుంచి 12.15 వరకు ఆకేపాటి ఎస్టేట్‌లో ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి తనయుడు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొంటారు. 12.25కు హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 12.35కు జక్కూరు ఎయిర్‌డ్రోమ్ బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.40 గంటలకు బయలుదేరి 2గంటలకు యలహంకలోని రెసిడెన్సీకి చేరుకుంటారు. -
కృష్ణాష్టమి సందర్భంగా.. పులివెందుల ఎన్నికపై జగన్ ఆసక్తికర ట్వీట్..
-
దేశం బాగుపడాలంటే జగన్ ఆలోచనలే కరెక్ట్
-
వైఎస్సార్సీపీలో పలు విభాగాలకు నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు విభాగాలకు నియామకాలు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది.⇒ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ను పార్టీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగం అధ్యక్షుడిగా నియమించారు.⇒ శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన అంబటి శ్రీనివాసరావుకు రాష్ట్ర పోలినాటి వెలమ విభాగ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ⇒ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఎల్లా భాస్కర్‌రావును రాష్ట్ర అతిరస విభాగ అధ్యక్షుడిగా నియమించారు.⇒ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన పులిపాటి దుర్గారెడ్డికి పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు.⇒ పల్నాడు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియో జకవర్గానికి చెందిన షేక్ దస్తగిరిని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. -
అధర్మం నాలుగు పాదాలపై...
శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి. ‘పరిత్రాణాయ సాధూనామ్, వినాశాయ చదుష్కృతామ్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అనే సందేశాన్ని మన జనజీవన స్రవంతితో సమ్మేళన పరిచిన భగవానుడాయన. సన్మార్గులను రక్షించడానికీ, దుర్మార్గులను శిక్షించడానికీ ప్రతి యుగంలోనూ నేను అవత రిస్తూనే ఉంటానని ఆయన చేసిన గీతోపదేశాన్ని భారతీయ సమాజం ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నది. ఇక జన్మాష్టమి సందర్భమైతే సరేసరి. పామరుల నుంచి పండితుల వరకు, సామాన్యుల నుంచి సర్కార్ పెద్దల వరకూ ఆ మహామహో పాధ్యాయుని సంస్మరణ అవిస్మరణీయమైన ఆచారంగా మిగిలి పోయింది.ఈ కృష్ణాష్టమి సందర్భంగా రాజకీయ నాయకులు ఇచ్చిన సందేశాల్లో ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఎక్కువగా ఆకర్షించింది. ‘అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. నిన్నమొన్నటి రాజకీయ పరిణామాలు ఈ ట్వీట్‌కు ప్రేరణ కావచ్చు. ఎన్నికలొక తతంగంగా – ప్రజాస్వామ్యం ఒక ప్రహసనంగా మారిన తీరు ప్రభావితం చేసి ఉండవచ్చు. కిందటేడాది జరిగిన సాధారణ ఎన్నికలపై పుంఖా నుపుంఖాలుగా ఆరోపణలు వస్తున్న విషయం విదితమే. ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు సమకూరుతున్న తీరు కూడా తెలిసిన సంగతే.రెండు రోజుల కిందటే జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల తతంగం మరో రకమైన వంచన. నడిబజార్లలో ప్రజా స్వామ్యం బట్టలూడదీసి వివస్త్రగా నిలబెట్టిన దుశ్శాసన క్రీడగా దాన్ని వర్ణించవచ్చు. ఈ వికృత కేళికి బాధ్యులెవరంటే ఏమని చెబుతాం? కర్ణుడి చావుకు కారణాలేమిటో అర్జునుడికి కృష్ణపర మాత్మ తెలియజెప్పుతాడు. ‘నీ చేతను, నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత భార్గవు చేత నరయంగ కర్ణుడీల్గె నార్వురి చేతన్’ అని వివరిస్తాడు. ‘కర్ణుడు నీవల్లా నావల్ల మాత్రమే చనిపోలేదు. ఆయన చావుకు కుంతీదేవి,ఇంద్రుడు, భూదేవి, పరశురాముడు కూడా కారకులే’నని చెబుతాడు.అదేవిధంగా పులివెందుల, ఒంటిమిట్టల్లో కూడా రక్షకు లుగా ఉండవలసినవారే ప్రజాస్వామ్య హత్యాకాండకు ఒడి గట్టారు. ‘సత్యం వద’ (సత్యాన్ని మాట్లాడు), ‘ధర్మం చర’ (ధర్మాన్ని అనుసరించు) అని ఉపనిషత్తులు చేస్తున్న బోధనను మన సనాతన ధర్మ ప్రభుత్వం ‘సత్యం వధ’ (సత్యాన్ని చంపు), ‘ధర్మం చెర’ (ధర్మాన్ని నిర్బంధించు)గా అర్థం చేసుకున్నట్టుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ సత్యాన్ని వధించైనా ఓ గెలుపును కైవసం చేసుకోవాలని సంకల్పించింది. రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తించవలసిన ఎన్నికల వ్యవస్థ ఈ సంకల్పానికి సహకరించింది. నిష్పక్షపాతంగా వ్యవహరించవల సిన అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ఈ సంకల్పానికి సాగిలబడింది. సత్యాన్ని మాట్లాడవలసిన నాలుగో స్తంభం (మీడియా) దాన్ని చంపేయడానికి తోడ్పాటు నిచ్చింది.రాజ్యాంగ ధర్మాన్ని నిలబెట్టవలసిన ప్రభుత్వం, ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం, మీడియా సమష్టిగా అధర్మ పతాకాన్ని ఎగరవేశాయి. అధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించాయి. ఆ నడక తీరు ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఇరవై జడ్పీటీసీ స్థానాలు ప్రాతినిధ్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఇందులో చాలా స్థానాలు పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు ఖాళీ అవకముందు నుంచే అలా ఉన్నాయి. అధికారం బాగా తలకెక్కిన వారికి చిత్రాతిచిత్రమైన కోర్కెలు కలుగుతుంటాయని చాలా కథల్లో చదువుకున్నాము. అటువంటి ఒక కోరిక ముఖ్యమంత్రికో, ఆయన కుమారునికో కలిగిందని సమాచారం. జగన్మోహన్రెడ్డికి బలమైన కోట వంటి పులివెందులలో ఆయన్నొకసారి ఓడించాలనేది ఆశ. ఆ కోర్కె తీరేలోగా పులివెందుల నియోజకవర్గం నుంచి ఓ తోకనో, ఒక ఈకనో గెలుచుకొచ్చి అదేం దుర్భేద్యమైన దుర్గం కాదని చాటేందుకు ఉబలాటపడ్డారు. అలా చేస్తే వైసీపీ నైతిక ధృతి దెబ్బతిని స్థానిక ఎన్నికల్లో తమకు ‘జీవన్టోన్’లా ఉపయోగ పడుతుందని ఆశించారు.పులివెందుల జడ్పీటీసీతోపాటు పక్కనే ఉన్న రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట స్థానానికి కూడా ఉపఎన్నికలు జరిపి ఏదోవిధంగా రెండూ గెలవాలని ఆలోచన చేశారు. అలా జరిగితే కడప జిల్లాలో జగన్ బలం కోల్పోయాడని ప్రచారం చేసుకోవాలనేది లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం కలిసివచ్చే కరి వేపాకుల్ని ఇంతకుముందే సేకరించి పెట్టుకున్నారు. ఈ రెండింటికి మాత్రమే ఎన్నికలు జరిపితే మిగిలిన 18 జడ్పీటీసీల సంగతి? ఇన్నిచోట్ల ఒకేసారి దుశ్శాసన ప్రయోగం మంచిది కాదు. వికటించినా వికటించవచ్చు – అని ఈ రెంటికి మాత్రమే ఎన్నిక జరిగే విధంగా జయరామిరెడ్డి అనే దేశం కార్యకర్తను కోర్టు మెట్లు ఎక్కించారు. కడప జడ్పీ ఛైర్మన్ ఎమ్మెల్యేగా గెలిచి నందువల్ల అప్పటికే ఆ పదవి ఖాళీగా ఉన్నది. రెండు జడ్పీ టీసీలు ఖాళీగా ఉండగా కొత్త ఛైర్మన్ ఎన్నిక కుదరదని, కనుక ఈ రెండు స్థానాలకు ముందుగా ఎన్నికలు నిర్వహించేవిధంగా ఆదేశించాలని జయరామిరెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. న్యాయస్థానం ఓకే చేసింది.రాజ్యాంగంలోని 243వ అధికరణాన్ని అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సంపూర్ణమైన అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే! రెండు జడ్పీటీసీల ఎన్నికలకు కోర్టు ఆదేశించినప్పుడు ఖాళీగా ఉన్న మిగిలిన స్థానాలకు కూడా ఎన్ని కల నిర్వహణకు ఈసీ ఉపక్రమించి ఉండవచ్చు. అది దాని ధర్మం కూడా! కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మతం కాని పనిని చేయడానికి ఈసీ సాహసించలేదు. ఆరు మాసాలకు మించి ఖాళీగా ఉండకూడదన్న స్ఫూర్తిని కూడా విస్మరించింది. ఇక ఎన్ని కలు జరిగిన రెండు స్థానాలపై చాలాకాలం ముందునుంచే టీడీపీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఎన్నికలు సరిగ్గా వారం రోజుల ముందటే పులివెందుల నియోజకవర్గానికే చెందిన వైసీపీ కార్యకర్త సైదాపురం సురేష్ రెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ మరుసటిరోజే శాసనమండలి సభ్యుడైన రమేశ్ యాదవ్‌పైనా, వైసీపీ నాయ కుడు వేల్పుల రాముపైన దాడి జరిగింది. రామును హత్య చేయ డానికే చూశారని సమాచారం. వైసీపీ కార్యకర్తలూ, నేతలూ ఎన్నికలయ్యేంతవరకు ఇళ్ళను వదిలి వెళ్లకపోతే ఇటువంటి ఘటనలే జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. పాలక కూటమి దాడుల పట్ల పోలీసుల స్పందన మరీ అన్యాయం. ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం వందలాదిమంది పోలీసులతో ఒక డీఐజీ స్థాయి అధికారే మోహరించారు. దాడులపై ఫిర్యాదులు చేసిన వారితో ఆయన వెటకారంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ‘పక్క ఊరికి వెళ్లి పత్తాపారం చేస్తే ఇలానే ఉంటుంద’ని ఆయన వ్యాఖ్యానించారు. తామే లేకపోతే అక్కడ తలలు తెగిపడేవనే మాటలు కూడా వైరల్ అయ్యాయి.ఈ తరహా కామెంట్ల వల్ల తమకు పోలీసు రక్షణ లభించ దనే అభిప్రాయం సహజంగానే వైసీపీ కార్యకర్తలకు ఏర్పడుతుంది. ఏడాది మాత్రమే గడువున్న ఒక చిన్న ఎన్నిక కోసం గ్రామాల ప్రశాంతత ఎందుకు భగ్నం కావాలన్న ఆలోచన కూడా ఉండవచ్చు. వైసీపీ ముఖ్య కార్యకర్తలంతా మండలం నుంచి బయటికి వెళ్లారు. యెల్లో మీడియా మాత్రం వైసీపీ వాళ్లు ఓటుకు ఐదు వేలు, పదివేలిచ్చి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనీ యథావిధిగా వెకిలి రాతలే రాసింది. తలలు తెగిపడే పరిస్థితులు ఉన్నాయని డీఐజీ స్థాయి అధికారి చెప్పినప్పుడు ఎన్నికల సంఘం స్పందించి ఉండాల్సింది. పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేసి ఉండవలసింది. కానీ అటువంటివేమీ జరగలేదు.నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు బయటి ప్రాంతాల వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలి. మంత్రి సవిత నాయకత్వంలో ఒకటి, జమ్మలమడుగు ఎమ్మెల్యే దండ నాయకునిగా మరొకటి, కమలాపురం ఎమ్మెల్యే నేతృత్వంలో ఇంకోటి, బీటెక్ రవి అధీనంలో ఒకటి చొప్పున అక్కడే తిష్ఠవేసి ఉన్న నాలుగు బెటాలియన్లు మాత్రం ఈ నిబంధన పాటించ లేదు. పోలింగ్ రోజున ఉదయం నాలుగు గంటలకే ఈ బెటా లియన్లు మొత్తం 15 పోలింగ్ బూతుల్ని చుట్టుముట్టాయి. పోలింగ్ బూత్‌లకు ఈ బెటాలియన్లు ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా నిలబడితే పోలీసులు ఇన్నర్ రింగ్‌రోడ్డు మాదిరిగా పోలింగ్ బూత్ ప్రాంగణాల్లో ఉండిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వచ్చిన వారికి తొలుత కూటమి బెటాలియన్లే ఎదురుపడ్డాయి.ఓటేసేందుకు వచ్చిన ఓటర్ల దగ్గర స్లిప్పులు లాక్కుని కూటమి సైన్యం వారిని వెనక్కి పంపించింది. ఒక్క వైసీపీ ఏజెంట్‌ను కూడా బూతుల్లోకి ఈ కిరాయి సైన్యం అనుమతించలేదు. ఫిర్యాదు చేయడానికి ఏ ఒక్క పోలీసూ కనబడలేదు. అంతకు ముందే నాలుగు గ్రామాల పోలింగ్ బూత్‌లను ఎత్తివేసి పక్క గ్రామాలలో ఏర్పాటు చేశారు. ఆ గ్రామాల మధ్య మాత్రం పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. కాళ్లు పట్టుకున్నా పోలీ సులు కనికరించలేదు. ఓట్లు వేసేందుకు వెళ్లనీయలేదు. ఈ వార్తలు, ఫోటోలు ఒక సెక్షన్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే కనిపించాయి. కానీ ఎన్నికల సంఘం స్పందించ లేదు. పోలింగ్ బూత్‌లను మార్చడమనే నిర్ణయాన్ని కూడా పాలక కూటమి సూచన మేరకే ఈసీ తీసుకున్నదనే విషయం బహిరంగ రహస్యం.ఒంటిమిట్ట మండలంలోనూ ఇదే ఫార్ములాను అమలు చేశారు. కాకపోతే తొలుత పోలింగ్ బూతుల్లోకి వైసీపీ ఏజెంట్లు ప్రవేశించగలిగారు. ఓ గంటన్నర తర్వాత రాష్ట్ర మంత్రి నాయ కత్వంలో ఓ పటాలం బయల్దేరి బూతుల్లో ఉన్న ఏజెంట్లను బయటకు తరిమేశారు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర మంత్రి అక్రమంగా బూత్‌లో చొరబడ్డా, ఏజెంట్లపై దౌర్జన్యం చేసినా ఎన్నికల సంఘం కిమ్మనలేదు. కొన్ని బూతుల్లో కాసేపు ఏజెంట్లు కూర్చున్న ఫలితం ఓట్ల సంఖ్యలో కనిపించింది. అక్కడ వైసీపీకి 6 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. నిజమైన ఓటర్లను అనుమతించని పులివెందులలో వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి. అవి కూడా కూటమి సైన్యమే వేసి ఉంటుంది కనుక అందుకు వారికి ఓ వైసీపీ నాయకుడు వెటకారంగా ధన్యవాదాలు తెలియజేశారు.బూటకపు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూటమికి వంత పాడుతున్న మీడియాలోని ఓ ప్రధాన సెక్షన్ స్పందన జుగుప్సాకరంగా ఉన్నది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందువల్ల టీడీపీ గెలిచిందట. ముప్పయ్యేళ్ల తర్వాత పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందట! అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ బ్యాలెట్ బాక్సుల్లో స్లిప్పులు వేశారట! స్లిప్పుల బండారాన్ని సోషల్ మీడియాలో ఓ యువకుడు ఎండ గట్టిన తీరు నవ్వు తెప్పిస్తున్నది. కామెంట్లు రాసిన కాగితాలను బ్యాలెట్ బాక్సుల్లో వేయాలంటే ఆ కాగితాన్ని మతడపెట్టి వేయాలి. కానీ ఆ కాగితాలపై మడతలు లేకపోగా ఇస్త్రీ చేసిన ట్టుగా ఉన్నాయంటూ వాటి ఫోటోలను జతజేశాడు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేయడానికి క్యూలైన్లలో నిలబడిన కూటమి కార్యకర్తలను గుర్తించి, ఆ ఫోటోలను ఒక సెక్షన్ మీడియా ప్రచురించింది. అయినా ఈసీలో స్పందన లేదు. ఈరకంగా వ్యవస్థలన్నీ ప్రలోభాలకు లోనై ఏలినవారి ఎదుట సాగిలపడుతున్న తీరును చూస్తుంటే మన ప్రజాస్వామిక వ్యవస్థ పెనుప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నట్టు హెచ్చరికలు కనిపిస్తు న్నాయి. పౌరులారా బహుపరాక్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
తాడేపల్లి :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. పార్టీ రాష్ట్ర దివ్యాంగ విభాగ అధ్యక్షులుగా పులిపాటి దుర్గారెడ్డి, అతిరస రాష్ట్ర విభాగ అధ్యక్షులుగా ఎల్ల భాస్కర్ రావు, పోలినాటి వెలమ విభాగ రాష్ట్ర అధ్యక్షులుగా అంబటి శ్రీనివాసరావు, శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షులుగా ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌లను నియమించారు. -
వాజపేయి వర్థంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్థంతి. ఈ సందర్భంగా వాజపేయికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దూరదృష్టి, విలక్షణ నాయకత్వం, వాక్పటిమకు ప్రతీక మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి. దేశ ప్రగతికి మార్గదర్శకుడైన వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. దూరదృష్టి, విలక్షణ నాయకత్వం, వాక్పటిమకు ప్రతీక మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారు. దేశ ప్రగతికి మార్గదర్శకుడైన వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/9xx6tDtAJM— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2025 -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
-
అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. "అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం." ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2025 -
ప్రీమియం పెను భారం..
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేయడం వల్ల ఈ ఖరీఫ్‌లో 86లక్షల ఎకరాలకు గానూ, కేవలం 14.15 లక్షల ఎకరాలకు మాత్రమే రైతులు సొంత ఖర్చుతో బీమా చేయించుకోగలిగారు. ఐదేళ్ల పాటు పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని అధికారంలోకి వచ్చీ రాగానే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపుతూ స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టింది.ప్రీమియం భారం భరించలేని స్థితిలో ఉండడంతో ఈ పథకంలో చేరలేక అన్నదాతలు బీమాకు దూరమైపోతున్నారు. ఈ నేపథ్యంలో 2025 ఖరీఫ్ సీజన్‌కు వాతావరణ ఆధారిత పంటలతో పాటు దిగుబడి ఆధారిత పంటలకు ప్రీమియం చెల్లించేందుకు గడువు ముగిసింది. ఉచిత పంటల బీమా పుణ్యమా అని 2024 ఖరీఫ్‌లో 85.83 లక్షల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. దాదాపు 71.17 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్ లభించింది. కానీ ఈ ఏడాది అంటే 2025 ఖరీఫ్‌లో బాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల కేవలం 10.97 లక్షల మంది రైతులు తమ సొంత డబ్బులు చెల్లించి 14.15 లక్షల ఎకరాలకు బీమా ప్రీమియం చెల్లించారు. దీంతో 71.85 లక్షల ఎకరాలకు బీమా దక్కలేదు. నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణంలో కూడా 12 శాతం పంటలకు మించి బీమా కవరేజ్ లభించలేదు. దాదాపు 90 శాతం మంది రైతులు బీమా రక్షణకు దూరమైపోయారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.జిల్లాకో రీతిలో.. పంటకో రీతిలో అమలు» ఖరీఫ్ 2025–26 సీజన్లో స్వచ్ఛంద పంటల బీమా పథకం కింద దిగుబడి ఆధారంగా 15, వాతావరణం ఆధారంగా 7 చొప్పున 22 పంటలను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వరికి మాత్రమే 26 జిల్లాల్లో నోటిఫై చేయగా, మిగిలిన పంటలకు జిల్లా పరిధిలో సాగు విస్తీర్ణాన్ని బట్టి నోటిఫై చేశారు. నోటిఫై చేసిన పంటల వాస్తవ సాగు విస్తీర్ణం 86 లక్షల ఎకరాలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం 70.36 లక్షల ఎకరాలకే నోటిఫై చేసింది. వీటిలో దిగుబడి ఆధారిత పంటల సాగు విస్తీర్ణం 50.76 లక్షల ఎకరాలు కాగా, వాతావరణ ఆధారిత పంటల సాగు విస్తీర్ణం 19.60 లక్షల ఎకరాలుగా పేర్కొంది.» దిగుబడి ఆధారిత పంటలను ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తో, వాతావరణం ఆధారిత పంటలను పరిమిత వాతావరణం ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) కింద స్వచ్ఛంద నమోదు పద్ధతిన అమలు చేస్తున్నారు. రైతులు ముందుగా జిల్లాల వారీగా కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం సొమ్ము జమ చేసి, నిర్దేశిత గడువులోగా ఈ పథకంలో చేరాలి. బ్యాంకుల్లో పంట రుణాలు పొందే రైతులు ఐచ్ఛిక పద్ధతిలో ఈ పథకంలో చేరేందుకు ముందుకొస్తే, ప్రీమియం మొత్తాన్ని మినహాయించుకుని ఆ మేరకు రైతుల తరఫున బ్యాంకులు కంపెనీలకు డబ్బు చెల్లిస్తాయి. » రుణాలు పొందని రైతులైతే స్వచ్ఛందంగా సమీప సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో నిర్దేశిత ఫారాలు నింపి, సాగు వివరాలు నమోదు చేసి.. ప్రీమియం చెల్లించాలి. అయితే జిల్లాకో రీతిలో, పంటకో రీతిలో కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తం రైతులకు పెనుభారంగా మారింది. » గడిచిన 2024 ఖరీఫ్ సీజన్లో ఉచిత పంటల బీమాను కొనసాగించడంతో వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి నూరు శాతం అంటే 19.60 లక్షల ఎకరాలకు గాను 13.86 లక్షల మంది రైతులు బీమా కవరేజీ లబ్ధి పొందారు. ఈ ఏడాది జూలై 15వ తేదీతో ఈ పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు ముగియగా, కేవలం 10.23 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు సంబంధించి 6.80 లక్షల మంది రైతులు బీమా కవరేజ్ పొందగలిగారు. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 9.37 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు సంబంధించి 7.06 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందలేక పోయారు.వరి సహా ఇతర పంటల పరిస్థితి దారుణం » వాస్తవానికి వరి సాధారణ విస్తీర్ణం 37.17 లక్షల ఎకరాలు కాగా, ప్రభుత్వం 32.66 లక్షల ఎకరాల్లో సాగయ్యే పంటనే నోటిఫై చేసింది. వరియేతర పంటల సాధారణ విస్తీర్ణం 29.23 లక్షల ఎకరాలుండగా, ప్రభుత్వం 18.09 లక్షల ఎకరాలకే పరిమితం చేసింది. కనీసం ఆ మేరకైనా బీమా కవరేజ్ కల్పించిందా అంటే అదీ లేదు.» గతేడాది ఉచిత పంటల బీమా పుణ్యమా అని దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 71.57 లక్షల మంది రైతులు 50.77 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా రక్షణ పొందగలిగారు. వరియేతర పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు జూలై 31వ తేదీతో ముగియగా, వరి పంటకు శుక్రవారం (ఆగష్టు 15వ తేదీ)తో ముగిసింది. » వరి సహా దిగుబడి ఆధారిత పంటలన్నీ కలిపి ఈ సీజన్లో కేవలం 3.92 లక్షల ఎకరాలకు 4.17 లక్షల మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించి బీమా కవరేజ్ పొందగలిగారు. ఇందులో ఒక్క వరి పంటే దాదాపు 3 లక్షల ఎకరాలుండటం గమనార్హం. ఇతర పంటలన్నీ కలిపి 92 వేల ఎకరాలకు మించలేదు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 46.84 లక్షల ఎకరాల్లో నోటిఫై చేసిన పంటలకు 67.40 లక్షల మంది రైతులు బీమా చేయించుకోలేకపోయారు. మొత్తంగా నోటిఫై చేసిన పంటల వరకు చూసినా సరే 57 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు బీమా కవరేజ్ లభించ లేదు. 74.86 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందలేకపోయారు. 2024– 25 రబీ సీజన్లో 9.90 లక్షల ఎకరాలకే బీమాచంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల 2024– 25 రబీ సీజన్లో కేవలం 6.75 లక్షల మంది రైతులకు సంబంధించి 9.90 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. రబీ–2023 సీజన్‌తో పోల్చుకుంటే 24.35 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ దూరం కాగా, 36.63 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందలేకపోయారు. మరో వైపు రైతులు తమ వాటాగా ప్రీమియం రూపంలో రూ.37.77 కోట్లు చెల్లించగా, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా రూ.88.12 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం కూడా ఇప్పటి వరకు చెల్లించిన పాపాన పోలేదు.ఐదేళ్లూ పైసా భారం లేకుండా భరోసా» వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019–24 మధ్య ఐదేళ్లూ పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ కవరేజ్ కల్పించింది. పైగా ఏ సీజన్‌కు చెందిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా జమ చేసి అండగా నిలిచింది. » ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు, ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.10 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించింది. ప్రభుత్వ వాటాతో పాటు రైతుల తరఫున రూ.3,022.26 కోట్లు ప్రీమియం కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే కంపెనీలకు చెల్లించింది. » ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు 7,802.08 కోట్ల మేర పరిహారాన్ని రైతుల ఖాతాలకు జమ చేసింది. అంతేకాకుండా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం 6.20 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలను సైతం చెల్లించి రైతులకు అండగా నిలిచింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే అదనంగా 23.70 లక్షల మంది రైతులకు రూ.43.90 కోట్ల మేర పరిహారం అందించింది.2024 ఖరీఫ్ పంటల బీమా పరిహారం ఎగనామం2024 ఖరీఫ్ సీజన్ వరకు ఉచిత పంటల బీమా పథకాన్నే కొనసాగించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. 2024–25 రబీ సీజన్ నుంచి ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. అయితే 2024 ఖరీఫ్ సీజన్లో 71.17 లక్షల ఎకరాలకు సంబంధించి 85.83 లక్షల మంది రైతులకు అందాల్సిన పరిహారం మాత్రం ఇప్పటికీ అందలేదు. దిగుబడి ఆధారిత పంటలకు రూ.303.88 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలకు రూ.530.04 కోట్లు.. మొత్తంగా రైతుల వాటాతో కలిపి రూ.833.92 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించలేదు. ఏప్రిల్, మేలో ఈ ప్రీమియం చెల్లించి ఉంటే జూలై –ఆగస్టుల్లో రైతులకు బీమా పరిహారం అందేది. ఇప్పటి వరకు దిగుబడులు, వాతావరణం ఆధారిత పంట నష్టం వివరాలు కూడా కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది. దీంతో 2024 ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం వస్తుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. మరో వైపు 2023–24 సీజన్‌కు సంబంధించిన ప్రీమియం రూ.930 కోట్లు (2024 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల కోడ్ కారణంగా చెల్లించలేదు) చంద్రబాబు ప్రభుత్వం చెల్లించి ఉండాలి. ఆ మొత్తాన్ని ఇప్పటికీ చెల్లించక పోవడంతో రూ.1,385 కోట్ల పరిహారం నేటికీ రైతులకు అందలేదు.అందని పంట నష్ట పరిహారంపంటల బీమా పరిహారానికి తోడు పంట నష్టపరిహారం, కరువు సాయం కూడా నేటికీ జమ కాలేదు. గత ఖరీఫ్‌లో అధికారికంగా దాదాపు 6.96 లక్షల మంది రైతులకు చెందిన 10.78 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కరువు బకాయిలతో సహా రూ.838.57 కోట్ల పంట నష్ట పరిహారం చెల్లించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1.84 లక్షల మంది రైతులకు రూ.285 కోట్లు జమ చేసి చేతులు దలుపుకుంది. రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్‌లో దాదాపు 100 మండలాలు, రబీలో 80కి పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా, కంటి తుడుపు చర్యగా ఖరీఫ్‌లో 54, రబీలో 51 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా, పైసా సాయం చేయలేదు. ఖరీఫ్ సీజన్లో ప్రక టించిన కరువు మండలాల్లో 2.36 లక్షల ఎకరాలు బీడు వారగా, పంటలు కోల్పోయిన దాదాపు 1.41 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.143.10 కోట్ల కరువు సాయం నేటికీ జమ చేయలేదు.ప్రీమియం భారం భరించలేకున్నాంవైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉచిత పంటల బీమా అమలు చేశారు. మా దగ్గర నుంచి పైసా కూడా కట్టించుకోలేదు. ఏ సీజన్లో జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం ఆ మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసే నాటికి ఇచ్చేవారు. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరికి ప్రీమియం మొత్తం ఎక్కువగా ఉండడంతో పంటల బీమా చేయించుకోలేక పోయాం. సాంకేతిక కారణాలతో అన్నదాత సుఖీభవ సాయం కూడా నాకు జమ చేయలేదు. ఈ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. – వేముల సీతారామయ్య, పైడూరు పాడు, విజయవాడ రూరల్ -
బాబు గారికి పిచ్చి అన్నా స్పందించరా?
‘పీ-4 పిచ్చిలో చంద్రబాబు’’ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురితమైన ఒక కథనం శీర్షిక ఇది. ఇలాంటి కథనం ఏదైనా సాక్షిలోనో.. లేదా టీడీపీకి సంబంధం లేని ఏ ఇతర మీడియాలోనో వచ్చి ఉంటే ఆ పార్టీ, దాని మద్దతుదారులు అంతెత్తున లేచి ఉండేవారు. ముఖ్యమంత్రి చంద్రబాబును పట్టుకుని అంత మాట అంటారా అని మండిపడేవి. ఏ మాత్రం అవకాశం ఉన్నా కేసులు పెట్టడానికి ప్రయత్నించి ఉండేవారు. కాని టీడీపీ మీడియా యజమానే అనడంతో వాళ్లెవరూ కిక్కురుమనలేకపోతున్నారు. కనీసం ఖండన కూడా ఇచ్చినట్లు కనిపించలేదు.చిత్రమైన విషయం ఏమిటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన సందర్భంలోనూ ఈ ‘పీ-4’ అంశం గురించి చెప్పడం. అప్పుడు టీడీపీ మీడియా ఆహా, ఓహొ అంటూ ప్రచారం చేశారు. సూపర్ సిక్స్‌తో సహా ఎన్నికల ప్రణాళికలోని అంశాలన్నీ అద్భుతం అని, పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెగ ప్రచారం చేశాయి. ఏడాది కాలంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏ పిచ్చి పని చేసినా అది రైటే అన్నట్లుగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నాయి. కొన్ని సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి ఇస్తామని ప్రకటించినా, విజయవాడలో అత్యంత విలువైన ఆర్టీసీ స్థలం లులూ మాల్‌కు ఇచ్చేస్తున్నా టీడీపీ మీడియా అలా చేయడం తప్పు అని ఎక్కడా కథనాలు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏమైందో.. చిత్తశుద్దితోనే రాశారా? లేక ఏదైనా తేడా వచ్చి రాశారా? లేక బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో రాశారా? లేక ప్రజలలో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి రాశారా? అన్నది తెలియదు కాని ‘పీ-4’ గురించి రాసిన కథనంలో చంద్రబాబు ‘పీ-4 పిచ్చిలో ఉన్నారని అంటున్నారు. శీర్షికలో పిచ్చి అని రాసి చంద్రబాబును తప్పుపట్టినా, మేటర్‌లో మాత్రం తప్పు సలహాదారులు, అధికారులపై నెట్టే యత్నం చేశారు. ఆ సందర్భంలో కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకున్నారు. చంద్రబాబు నేల విడిచి సాము చేస్తుంటారట. ఆచరణ సాధ్యం కాని ‘పీ-4’ వంటి ఆలోచనలంటే ఆయనకు మా చెడ్డ ఇష్టమట. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్‌లోను పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారట. ఇప్పుడు ఇలా రాశారు కాని, టీడీపీ సూపర్ సిక్స్ ప్రకటించినప్పుడు ఇదే మీడియా అబ్బో ఇంకేముంది..జగన్‌పై శరాలు సిద్ధం అంటూ తెగ పొగిడింది. అది ఆచరణ సాధ్యమేనని ఈ మీడియాతో పాటు ఇతర టీడీపీ మీడియా సంస్థనలు కూడా హోరెత్తించాయి కదా! అలాగే చంద్రబాబుకు అత్యంత సన్నిహిత సలహాదారులలో ఈ మీడియా అధినేత కూడా ఉంటారని చెబుతారు. కాని ఇప్పుడు సడన్‌గా చంద్రబాబులో ఫలానా అవలక్షణం ఉందని ఆయనే చెబుతున్నారు. అదే టైమ్‌లో పుణ్యానికి పోతే, పాపం ఎదురైనట్లు చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతోందని అంటున్నారు. ఇందులో చంద్రబాబు చేసిన పుణ్యమేమిటో తెలియదు. ‘పీ-4’ కొత్త పల్లవి అందుకున్నారని రాశారే తప్ప ఎన్నికల ప్రణాళికలోనే దీనిని పెట్టిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతున్నారు. ఇప్పుడేమో అది దిక్కుమాలిన సలహా అని అంటున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పడాన్ని ఈ మీడియా కూడా నమ్మడం లేదు. బంగారు కుటుంబాలు, మార్గదర్శులు అంటూ ముద్దు పేర్లు పెట్టి, కొంతమందికి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఈ మీడియా యజమాని చెబుతున్నారు. ఇలాంటి సమాచారంతో కూడిన వార్తను సాక్షిలో వస్తే, టీడీపీ సోషల్ మీడియా తెగ విమర్శించింది. ఇదంతా అక్కసుతో కూడిన విమర్శలని ఆరోపించింది. మరి ఇప్పుడు స్వయంగా టీడీపీ మీడియానే ఆ విషయం రాస్తే నోరు విప్పలేకపోయింది. పేదరికం లేని సమాజం ఎక్కడైనా ఉందా? పూర్తిగా నివారించడం మన దగ్గర ఎలా సాధ్యం అన్న సందేహం ఎందుకు కలగలేదో తెలియడం లేదట. దాతలు స్వచ్ఛంగా ముందుకు వచ్చి అమలు చేసే ఇలాంటి కార్యక్రమాలను నిర్భందం చేయడం ఏమిటని ఆ మీడియా ప్రశ్నించింది. కోటి మంది పేద కుటుంబాలు ఉంటే 11 లక్షల కుటుంబాలనే ఎంపిక చేశారని, దీనివల్ల మిగిలిన వారు టీడీపీకి దూరం కారా అన్నది ఈ మీడియా యజమాని బాధ. చంద్రబాబు కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారని, దానివల్ల మిగిలిన పేద కుటుంబాలు కినుక వహించవా అని ఆయన అన్నారు. వారు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారట, ఇప్పటికే ఎంపికైన కుటుంబాలలో 26 శాతం అనర్హమైనవని కూడా అధికారులు చెబుతున్నారట.ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పీ-4’ అమలు కోసం పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను పిలిచి గంటల కొద్ది చర్చలు జరుపుతుండడాన్ని కూడా ఈ మీడియా ఆక్షేపించింది. ఈ సమావేశాలకు వెళ్లిన వారు ఇదెక్కడి తద్దినం అని తిట్టుకున్నారని కూడా వెల్లడించారు. దత్తత తీసుకునే వారిని ఇంతమందిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారని ఈ మీడియా యజమాని అంగీకరించారు. ఇదే మాట సాక్షి మీడియా చెబితే ఇంతెత్తున ఎగిరిపడిన ప్రభుత్వం, టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు నోరు మెదపడం లేదు. ‘పీ-4’ పథకం అమలు కమిటీ వైస్ ఛైర్మన్ కుటుంబరావును దీనికంతటికి బాధ్యుడు అన్నట్లుగా ఈ మీడియా యజమాని చెబుతున్నారు. తొలుత ముఖ్యమంత్రి ‘పీ-4’ పిచ్చిలో ఉన్నారని రాసిన ఈయన చివరికి దానినంతటిని ఒక సలహాదారుపై నెట్టేశారన్న మాట. ‘పీ-4’ వల్ల కూలీలు దొరకరని ఈయన సూత్రీకరిస్తున్నారు. అంటే ఎవరైనా నిజంగానే బాగుపడితే కూడా ఈయనకు నచ్చదు అనుకోవాలన్నమాట. అయితే టీడీపీతోసహా కూటమి ఎమ్మెల్యేలు కొందరు అరాచకాలకు పాల్పడుతున్నారని, ప్రజలను పీడిస్తున్నారని ఈ టీడీపీ మీడియా అంగీకరించడం విశేషం. ఎమ్మెల్యేలకు కప్పం కడితేనే ఏ పని అయినా అవుతోందని, చివరికి పోలీస్ స్టేషన్లలో కేసు కట్టడానికి, రిజిస్ట్రేషన్లకు కూడా వీరు అనుమతి ఉండాలట. రాజధాని అమరావతి విషయంలో కూడా పరిస్థితి గందరగోళంగా ఉందని కూడా ఈయన చెబుతున్నారు. ఇన్నాళ్లకు ఈ మీడియా ఒక నిజం రాసినా, ఇందులో వారికి ఉన్న చిత్తశుద్దిని శంకిస్తున్నారు. గతంలో ఒక నేతపై కథనం రాస్తూ ఆయన చానా పైరవీలు చేస్తున్నారని, లోకేశ్ పేరుతో దందాలు చేస్తున్నారంటూ చెప్పారు. ఈ స్టోరీ సరిగ్గా రాజ్యసభ ఎన్నికల ముందు వచ్చింది. అయినా ఆయనకే ఎంపీ పదవి దక్కింది. ఆ తర్వాత ఈ మీడియా కలం, గళం మూతపడిపోయింది. దీని భావమేమి తిరుమలేశ! అని అంతా ప్రశ్నించుకున్నారు.ఇప్పుడు ఈ కథనం ఇవ్వడం ద్వారా ఎవరిని బెదిరించడానికి అన్న చర్చ టీడీపీ వర్గాలలోనే జరుగుతుండడం ఆసక్తికరం! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
మన ప్రజాస్వామిక దేశానికి బలం ఈ మూడే: వైఎస్ జగన్
దేశమంతా 79వ స్వాతంత్య్ర దినోత్సవ #IndependenceDay వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చేసుకుంటున్న సందర్భంలో.. సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మన ప్రజాస్వామ్య దేశానికి నిజమైన బలంగా నిలుస్తాయని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ప్రతి భారతీయుడికి గర్వభరిత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.As we celebrate our hard-earned freedom, let us remember that the strength of a Democratic Nation lies in unity, justice, and equal opportunity for all.Wishing every Indian a proud Independence Day!#IndependenceDay— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2025 -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. అనంతపురం జన సంద్రం
-
అనంతపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురంలో పర్యటించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి వివాహానికి ఆయన హాజరయ్యారు. హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికాయి.అనంతరం రుద్రంపేట సర్కిల్ మీదుగా ఇంద్రప్రస్థ కళ్యాణ వేదిక దాకా వైఎస్ జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. నూతన వధూవరులు ప్రణయ్ రెడ్డి, సాయి రోహిత లకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
వర్షంలోనూ తగ్గని అభిమానం
-
నేడు వైఎస్ జగన్ అనంతపురం పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనంతపురంజిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనంతపురం చేరుకుంటారు.నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులుసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ కార్యక్రమం బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ వేడుకకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజుకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నాయకులు ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, కారుమూరి సునీల్‌కుమార్, గూడూరి ఉమాబాల, పాతపాటి మురళీకృష్ణంరాజు, మేకా ప్రతాప్ అప్పారావు, తెల్లం బాలరాజు, కొఠారు అబ్బయ్యచౌదరి, తలారి వెంకట్రావు, కంభం విజయరాజు, మామిళ్లపల్లి జయప్రకాష్, చినమిల్లి చినవెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు జోరు వానను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. వారందరికీ వైఎస్ జగన్ అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరించారు. -
ఏజెంట్లే లేకుండా ఎన్నికలా?: వైఎస్ జగన్
మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చల విడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా చంద్రబాబూ? – వైఎస్ జగన్ అసలు ఏజెంట్లే లేకుండా పోలింగ్ నిర్వహిస్తే.. వాటిని ఎన్నికలు అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించకపోతే, గొంతు విప్పకపోతే అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఎన్నికలు హాస్యాస్పదమే అవుతాయి. అప్పుడు ఎన్నికల అవసరం కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్లు అంతా ఓట్లు వేసుకోవడమే. సీఎం చంద్రబాబు, ఆయనతో చేతులు కలిపి అంట కాగుతున్న ఎల్లో మీడియా లక్ష్యం ఇదే. వారి లక్ష్యం ప్రజలకు మంచి చేయడం, పాలకుల మోసాన్ని ప్రశ్నించడం కానే కాదు. కేవలం దోచుకో.. పంచుకో.. తినుకో.. అదే వారి ఎజెండా. దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి.చంద్రబాబుకు మా డిమాండ్.. అలాగే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారికి మా విన్నపం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, అది చేజారిపోతే.. నక్సలిజం అక్కడే పుడుతుంది. చంద్రబాబు ఈ రోజు ఒక ప్రమాదకర పరిస్థితికి పునాది వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. నిన్న జరిగిన రెండు ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి.పులివెందుల జెడ్పీటీసీ కింద ఆరు పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 700 మంది పోలీసులను పెట్టారు. కేవలం ఓటర్లను భయపెట్టడం కోసమే అంత మందిని మోహరించారు. ఉదయం 4 గంటలకల్లా జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్ వద్ద దాదాపు 400 మంది పాగా వేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. వారే ప్రోత్సహించారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు.. అంతా కలిపి మొత్తం 7 వేల మంది ఉంటారు. అంటే ఒక్కో ఓటరుకు బయట నుంచి దాదాపు ఒక్కో రౌడీని ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీరు ప్రజలను మోసం చేశారు. మీ పాలన మొత్తం రాక్షస పాలన అని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ఇదివరకు చంబల్ లోయ బందిపోటు దొంగలను మరిపించేలా.. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అడ్డగోలుగా దొంగ ఓట్లు వేసుకున్నార’ని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇలా అడ్డగోలుగా రాజకీయాలు చేసే వారిని నాయకుడనరని.. చంద్రబాబు ఒక మాబ్స్టర్.. ఫ్రాడ్‌స్టర్ అని తేల్చి చెప్పారు. ‘మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే.. మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే.. వెంటనే మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి’ అని సవాల్ విసిరారు. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే.. మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే.. ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దెప్పిపొడిచారు. ‘ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా?’ అని సీఎం చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. వెబ్ కాస్టింగ్, సీపీ ఫుటేజీ ఇస్తే ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది మరింతగా బట్టబయలవుతుందన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లను తనతో కూర్చోబెట్టుకుని వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్‌లో పోలీసులు, టీడీపీ నాయకులు జట్టుగా ఏర్పడి వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఏజెంట్లపై దౌర్జన్యం చేయడం.. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను అడ్డుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులతో దొంగ ఓట్లు వేయించుకోవడం, కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేయడం నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల ఏకపక్ష దాడులు.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల దౌర్జన్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూపుతూ సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరును తూర్పారబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. అందుకు నిన్న (మంగళవారం) జరిగిన ఎన్నికలు (పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు) ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్ బూత్‌లలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 15 పోలింగ్ బూత్‌లు ఉండగా, వాటిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదు. ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్ దగ్గరకు పోనివ్వకుండా ఆపేసి రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రోద్బలంతో బూత్‌లలోకి ఏజెంట్లను పోనివ్వలేదు. ఇంత దారుణం ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా ఉండదేమో.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప!.పోలింగ్ ఏజెంట్ల కీలక బాధ్యతలు ⇒ అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్ హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్ అధికారికి చెప్పడం. అలాగే అవే వివరాలు పార్టీకీ తెలియజేయడం. ఈ బాధ్యతలన్నీ ఏజెంట్లకు ఉంటాయి కాబట్టే.. వారికీ హక్కులు కల్పించబడ్డాయి. ⇒ ఒక పోలింగ్ ఏజెంట్ బూత్‌లోకి వెళ్లగానే పోలింగ్ మొదలవడానికి ముందే ఫామ్–12 (వారి అపాయింట్మెంట్ కోసం పార్టీ ఇచ్చేది)ను అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు ఇస్తారు. ఆ తర్వాత బూత్‌లో కూర్చుంటాడు. కానీ నిన్న (మంగళవారం) మా పార్టీ ఏజెంట్ల నుంచి ఆ ఫామ్‌లను టీడీపీ వారు, పోలీసులు లాక్కుని చింపేశారు. ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం దిగజారి పోవడం చరిత్రలో చూసి ఉండం.⇒ ఓటరు బూత్‌లోకి రాగానే తన పేరు చెబుతాడు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ సంతకం తీసుకుని బ్యాలెట్ ఇస్తాడు. రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ అయితే, దాన్ని నిర్ధారించేది పోలింగ్ ఏజెంట్. పోలింగ్ ముగిసిన తర్వాత ఫాం–32ను నింపి ఆ బూత్‌లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనేది రికార్డు చేస్తారు. బూత్‌లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రిసైడింగ్ ఆఫీసరు.. ఏజెంట్ నుంచి ఒక రిసీట్ కూడా తీసుకుంటాడు. ఆ రికార్డుతో ఈ రిసీట్‌ను కూడా జత చేయాలి. మరోవైపు ఆ రికార్డును ధృవీకరించడమే కాకుండా, బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. చివరకు ఆ సీల్‌పై కూడా పోలింగ్ ఏజెంట్ సంతకం చేస్తాడు. ఈ ఉప ఎన్నికల్లో ఇవన్నీ జరిగాయా? ఈ రోజు ఎంత దారుణంగా వారు ఎన్నికలు నిర్వహించారంటే, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేశారంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చం చంబల్‌లోయ బందిపోట్ల మాదిరిగా వ్యవహరించారు. పోలీసులే దగ్గరుండి అన్నింటినీ ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ ⇒ మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, వెంటనే నిన్నటి ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే, మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం లేదు. అయినా ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది చూపుతాం. ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుణ్ని లీడర్ అనరు. మాబ్స్టర్ లేదా ఫ్రాడ్‌స్టర్ అంటారు. ⇒ ఎంత దారుణంగా నిన్నటి ఎన్నికలు జరిగాయంటే.. ఎక్కడైనా ఏ ఊరి ఓటర్లు ఆ ఊరిలోనే ఓట్లు వేస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఓటర్లు వారి సొంత ఊళ్లలోనే ఓటేయడం సహజం. కానీ, ఇక్కడ చంద్రబాబు ఏకంగా ఒక ఊరి నుంచి మరో ఊరికి పోలింగ్ బూత్‌లు మార్చేశారు.⇒ ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, నల్లగొండవారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, మళ్లీ నల్లపురెడ్డిపల్లి వారు ఎర్రబల్లికి.. నల్లపురెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లికి వెళ్లి ఓటు వేయాలంట. 4 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా పోలింగ్ సెంటర్లు మార్చారు.⇒ దాదాపు 10,600 ఓట్లకు గాను, 4 వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. స్కెచ్ అక్కడే మొదలైంది. ఇంకా వారి ఆలోచన ఏమిటంటే, ఓటర్లు 4 కిలోమీటర్లు నడిచి పోతుంటే బెదిరించాలి. దాడి చేసి అడ్డగించాలి. ఓటేయకుండా చూడాలి. నిన్న అదే జరిగింది.ఏకంగా గ్రామాలే పంచుకున్నారుఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా? టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అరాచకం సృష్టించేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఎర్రబల్లెలో తిష్ట వేస్తే.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి భారీగా తన అనుచరులతో నల్లపురెడ్డిపల్లెలో మకాం వేశాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందల మంది కార్యకర్తలతో మకాం వేస్తే.. బీటెక్ రవి అనే టీడీపీ నాయకుడు పులివెందుల రూరల్ ఓటరు కాకపోయినా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలింగ్ బూత్‌లకు వైఎస్సార్సీపీ ఏజెంట్లు వెళితే, వారిపై దాడి చేసి, ఫామ్‌లు లాక్కుని చింపేశారు. ఓటర్ల స్లిప్‌లు కూడా లాక్కుని వారిని వెనక్కి పంపి, వారే ఓటు వేసుకున్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైనా, లేక తటస్థుడైనా బూత్ వైపు వస్తే టీడీపీ వారు బెదిరించి ఓటరు స్లిప్ లాక్కుని దౌర్జన్యంగా బయటకు పంపించారు.పులివెందుల మండలంలో టీడీపీ నేతల ఆగడాలను విలేకరుల సమావేశంలో వివరిస్తున్న వైఎస్ జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి⇒ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఇన్ని అక్రమాలతో జరిగింది ఎన్నికలేనా? అసలు ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?⇒ ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ నిజం కాదా?⇒ పులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నిజం కాదా? నిజానికి అక్కడ ఎన్నిక లేదు. అయినా తెల్లవారుజామున అరెస్టు చేశారు.⇒ మొట్నూతలపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి, ఓటర్లను అడ్డగించడం నిజం కాదా?⇒ ఎర్రపల్లెలో మహిళలను ఓటు వేయనివ్వక పోవడం నిజం కాదా? ⇒ కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి, మంచంపై రైఫిల్ పెట్టి బెదిరించడం వాస్తవం కాదా?⇒ ఎర్రపల్లెలో రిగ్గింగ్‌కు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు స్వాగతం పలకలేదా?⇒ కనంపల్లెలో రిగ్గింగ్ జరిగిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం, బిటెక్ రవి తమ్ముడు భరత్ బెదిరింపులు నిజం కాదా?⇒ తమను ఓటు వేయనీయాలంటూ ఓటర్లు కనంపల్లెలో పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలేదా?⇒ పులివెందులలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని బయటకు రానివ్వకపోవడం నిజం కాదా?⇒ ఒంటిమిట్టలోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లు వాపోలేదా?⇒ ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ వాళ్లు స్లిప్‌లు ఇస్తూ, దొంగ ఓట్లు వేయించలేదా?⇒ ఎన్నిక పులివెందుల రూరల్‌లో జరుగుతుంటే, పులివెందులలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్‌కు డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి ఎందుకు హడావుడి చేశారు? ⇒ ‘కాల్చి పారేస్తా నా కొడకా’ అంటూ డీఎస్పీ మురళి బెదిరించడం వాస్తవం కాదా?⇒ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయలేదా? మా పార్టీ ఏజెంట్‌పై దారుణంగా దాడి జరగలేదా?⇒ చంద్రబాబూ.. నీవు నిజంగా మంచి చేశావనుకుంటే ఎందుకీ అక్రమాలు?భవిష్యత్తులో అవి మీకే చుట్టుకుంటాయి మీరు దౌర్భాగ్య పని చేస్తున్నారు. తప్పుడు వి«ధానానికి బీజాలు వేస్తున్నారు. అవే రేపు వృక్షాలు అవుతాయి. గ్రామాల్లో ఇప్పుడు మీరు తీసుకొచ్చే కక్షలు, దాడులు రాబోయే రోజుల్లో మీకే చుట్టుకుంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవే మీకు ఆఖరి ఎన్నికలు కావొచ్చు. ఈ వయసులో ఈ పనులేంటి? కనీసం రామ, కృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది. ఈ విధంగా చేస్తే నరకానికి పోతావు. ఇప్పటికన్నా రవ్వంత మార్పు తెచ్చుకోమని చంద్రబాబుకు గట్టిగా హితవు పలుకుతున్నా.డమ్మీ కన్నా దారుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా, దురదృష్టవశాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) డమ్మీ కన్నా దారుణమైన పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. అందుకే కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కోర్టులో కేసులు వేస్తాం. ఈ ఆధారాలన్నీ చూపుతాం. నిన్న పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా అందుకే ఇక్కడికి వచ్చారు. పోలీసులు పూర్తి వివక్ష⇒ ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఐదు మంది కలిసి వెళ్లినా కూడా పోలీసులు తరిమి తరిమి కొట్టారు. మహిళా ఏజెంట్లపైనా దాడులు చేశారు. ఇతర నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్లు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా షామియానాలు వేసుకుని, భోజనాలు చేస్తున్నా పోలీసులు వేడుక చూశారు. ⇒ ఈ ఎన్నికల కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్రావు సమీప బంధువు. వరసకు అల్లుడు అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపారు. ఆయన అచ్చంగా పచ్చ చొక్కా వేసుకుని సోమవారం రాత్రి నుంచే తనకు కావాల్సిన వారిని విధుల్లోకి తీసుకుని పులివెందులలో మకాం వేసి, ఎన్నికలు జరిపారు. యథేచ్ఛగా దోపిడీ, వాటాలు చంద్రబాబునాయుడు చేస్తున్న అవినీతిలో వీళ్లందరూ భాగస్వాములు. డీఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్లు.. మాఫియా రింగ్ లీడర్ ఎవరంటే డీఐజీ. బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి.. ఇసుక, మట్టి, ల్యాటరేట్, క్వార్ట్›జ్, సిలికా.. పేకాట క్లబ్బులు.. ఇంకా ఏ మైన్ ఉన్నా కలెక్షన్ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. వచ్చిన దాంట్లో ఎమ్మెల్యేలకు ఇంత.. చినబాబుకు ఇంత.. పెదబాబుకు ఇంత అని ఈ డీఐజీలు, డీఎస్పీలు, సీఐలు నడిపిస్తున్నారు. ఇదీ ముఠా నాయకత్వం.చంద్రబాబు మాట వినకపోతే.. ఒకవేళ పోలీసు అధికారులు ఎవరైనా చంద్రబాబు మాట వినకపోతే.. డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు కావాల్సిందే. పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకెళ్లారు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, అడిషనల్ డీజీ సంజయ్, విశాల్ గున్నీలపై అక్రమ కేసులు పెట్టారు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిరాణా టాటాపై కూడా అక్రమ కేసు. ఇంకా ఎంతో మందిని సస్పెండ్ చేశారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్‌క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు.ఆనాడు ఏం జరిగిందో గుర్తుందా?2017లో నా ప్రజా సంకల్పం పాదయాత్ర మొదలు కావడానికి ముందు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఇలాగే చేశారు. 27 వేలతో గెల్చి ఇక మా పార్టీ పనైపోయిందని అదేపనిగా చెప్పారు. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే నంద్యాలలో 35 వేలతో గెల్చాం. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా చంద్రబాబును భూస్థాపితం చేశాం. ఇంకో మూడున్నర ఏళ్ల తర్వాత ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు. మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు.ఇవిగో ఆధారాలు..⇒ ఇతర నియోజకవర్గాలు, మండలాల నుంచి వచ్చిన వారు ఎలా దొంగ ఓట్లు వేసింది.. వారు ఎవరనే పూర్తి వివరాలతో ఈ ఫొటోల్లో (ఫొటోలు చూపుతూ) చూడండి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే వారు దొంగ ఓట్లు వేశారు. ఆ వేసింది జమ్మలమడుగుకు చెందిన (ఫొటో చూపుతూ) టీడీపీ కార్యకర్తలు దస్తగిరి, సందీప్‌కుమార్. నల్లపురెడ్డిపల్లె పోలింగ్‌బూత్‌లో వారు దొంగ ఓట్లు వేశారు. మరో ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రోజు (బుధవారం) రీ పోలింగ్‌లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారు (ఆ ఫోటోలు కూడా ప్రెస్మీట్లో చూపారు). పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు కాబట్టి, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.⇒ జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ప్రకాశం, మైలవరానికి చెందిన ద్వారచర్ల జనార్ధనరెడ్డి నల్లపురెడ్డిపల్లెలో ఓటు వేశారు.⇒ పొన్నతోట మల్లికార్జున టీడీపీ జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి (చంద్రబాబుతో దిగిన ఫొటో ప్రదర్శించారు). జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కూడా. వీళ్లందరూ వచ్చి పులివెందులలో ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ అనే వాడిని ఉండనివ్వలేదు. ఇక అడిగేవాడు లేడని దొంగ ఓట్లు వేసుకున్నారు. కలెక్టర్ రెండు చేతులు జేబులో పెట్టుకుని దొంగ ఓట్లు వేయిస్తున్నాడు.⇒ కర్మలవారిపల్లె గ్రామం టీడీపీ సర్పంచ్ మారెడ్డి చిన్నపుల్లా రెడ్డి పులివెందులలో ఓటు వేశారు. జమ్మలమడుగు మండలానికి చెందిన నాగేశ్వరరెడ్డి, అదే మండలంలోని గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డిలు నల్లపురెడ్డిపల్లెలో దొంగ ఓటు వేశారు.⇒ నవాబుపేట గ్రామానికి చెందిన రామస్వామిరెడ్డి, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్, హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్, కమలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుళ్లాయప్ప ఇలా అందరూ దొంగ ఓటర్లే. ⇒ విచిత్రంగా బుధవారం రీ పోలింగ్ జరుగుతుంటే కూడా.. కమలాపురం నియోజకవర్గానికి చెందిన నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుజ్జల నారాయణ యాదవ్ పులివెందులలోని ఈ కొత్తపల్లిలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డాడు. ఇలా రిపిటేషన్ పద్ధతిలో దొంగ ఓటర్లను తిప్పుకున్నారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం (ఫొటోలు)
-
పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ(బుధవారం) భీమవరంలో పర్యటించారు. విఎస్ఎస్ గార్డెన్స్‌లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజులకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. వివాహ వేడుకలకు మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రులు కారుమూరు వెంకట నాగేశ్వరరావు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. -
ఇదేం ఎన్నిక? (ఫొటోలు)
-
YS Jagan: రాసిపెట్టుకో 2029 ఎన్నికల్లో ఇదే జరుగుతుంది
-
మాపైన కూతలు.. చంద్రబాబుపై జగన్ షాకింగ్ కామెంట్స్
-
ఏజెంట్లని బూత్ లో అనుమతించలేదంటే.. ఇదే ఎలక్షన్ కమిషన్ తీరుకు నిదర్శనం
-
బాబు నీకు ఇదే ఆఖరి ఎలక్షన్..!
-
చీకట్లో బాబు, రేవంత్ రాహుల్ తో హాట్ లైన్..! బండారం బయటపెట్టిన జగన్
-
కాల్చి పడేస్తా.. నా కొడకా..! వైఎస్ జగన్ రియాక్షన్
-
ఏపీలోనే భారీ ఓట్ల చోరీ.. అయినా రాహుల్ గాంధీ మాట్లాడరేం?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఓట్ చోరీ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సూటి ప్రశ్నను సంధించారు. దేశంలో అత్యధికంగా ఓట్ల గోల్మాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనేనని.. అలాంటిది రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారాయన. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట అక్రమ ఎన్నికలపై వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంలో ఓట్ల దొంగతనం వ్యవహారంపై ఇండియా కూటమికు మద్దతు గురించి జగన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగకముందు.. జరిగిన తర్వాత ఉన్న ప్రకటించిన ఓట్లకు.. లెక్కించిన ఓట్ల సంఖ్యకు సమారు 12.5శాతం వ్యత్యాసం ఉంది. ఆ మొత్తం 48లక్షల ఓట్లు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో అత్యధికంగా ఓట్ల చోరీ జరిగింది. మరి ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని అంటున్న రాహుల్ గాంధీ.. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు?.. ఎందుకంటే.. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. చంద్రబాబుతో రాహుల్ గాంధీ హాట్లైన్లో టచ్‌లో ఉన్నారు. అందుకే చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాకూర్ ఒక్క కామెంట్ కూడా ఎందుకు చేయరు?. ఏపీలో ఎన్నో స్కాంలు జరుగుతున్నాయి. వాటిని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించదు అని వైఎస్ జగన్ అన్నారు.ఇదే విషయాన్ని ప్రెస్‌మీట్ అనంతరం జాతీయ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ జగన్ వివరించారు. ఓట్ల గోల్‌మాల్‌పై మేం గతంలో కోర్టుకు వెళ్లాం. ప్రత్యేకించి ఒంగోలు ఓటింగ్ విషయంలో న్యాయ పోరాటం చేశాం అనే సంగతిని జగన్ గుర్తుచేశారు. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 2013 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, నాలుగోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారని, ఓటమి పాలైన అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని రాహుల్ గాంధీని వైఎస్ జగన్ ప్రశ్నించారు. Amaravati, Andhra Pradesh: YSRCP President YS Jagan Mohan Reddy says, "12.5% is the difference in gap versus what was announced post-poll versus the actual number of votes that were counted. So this 12.5% is a huge gap. In fact, there's so much so the vote chori controversy what… pic.twitter.com/jVl9eTwB3C— IANS (@ians_india) August 13, 2025లోక్‌సభ ఎన్నికల్లో, అలాగే ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల చోరీ జరిగిందని, ఇందుకు బీజేపీకి ఈసీ సహకరించిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యానికి జరిగిన అతిపెద్ద ద్రోహం అంటూ పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించారాయన. -
పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలేంటి..? రాష్ట్ర చరిత్రలో తొలిసారి
-
బీటెక్ రవి, డీఐజీ కోయ ప్రవీణ్ ఎవరు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం.. ఒక్కో ఓటర్‌కు ఒక్కో రౌడీని దింపారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీ నాయకుడు బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. కనంపల్లిలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది పులివెందులలో మోహరించారని అన్నారు.పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ జగన్ పార్టీ ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఒక్కో ఓటర్ కోసం బయటి నుంచి ఒక్కో రౌడీ వచ్చారు. ప్రతీ పోలింగ్ బూత్‌కు 400 మందిని మోహరించారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రొత్సహించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారు. స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా?. ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారు.వాళ్లంతా ఎవరు?..మంత్రి సవిత ఆధ్వర్యంలో బయటి నుంచి వ్యక్తులు పులివెందులకు వచ్చారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి నల్లపురెడ్డి.. వారిని తీసుకొచ్చారు. ఈ కొత్తపల్లిలో పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి మకాం వేశారు. బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలీసుల సమక్షంలోనే బయటివాళ్లు వచ్చి పాగా వేశారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది.. బయటి నుంచి టీడీపీ నేతలు, వాళ్ల వర్గీయులు.. దాదాపుగా మొత్తం 7 వేలమంది పులివెందులలో మోహరించారు.ఎర్రబల్లిలో ఓటర్లను కూడా బూత్‌లోకి రానివ్వలేదు. కనంపల్లి సర్పంచ్‌ను పోలీసులు గన్‌తో బెదిరించారు. కనంపల్లిలో బీటెక్ రవి తమ్ముడు దౌర్జన్యం చేశాడు. కనంపల్లిలో ఓటు కోసం ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిని ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లే చెప్పారు. రీపోలింగ్‌లోనూ యథేచ్చగా దొంగ ఓట్లు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు. టీడీపీ వాళ్లు వందలాది మంది ఉన్నా పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ వాళ్లే లక్ష్యంగా..ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్సీపీ మహిళా ఏజెంట్లపై దాడి చేశారు. అభ్యర్థి హేమంత్ రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు. పులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. రిగ్గింగ్ చేయడానికి వెళ్లిన టీడీపీ వాళ్లకు చక్కగా పోలీసులు స్వాగతం పలికారు. ఓటు వేస్తామంటూ.. కొందరు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. కోయ ప్రవీణ్.. టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావు సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ.. ఆయన బలగం ఈ ఎన్నిక నిర్వహించాయి. టీడీపీ ప్రభుత్వం మాట వినని ఐపీఎస్ అధికారులకు తప్పని వేధింపులు. బాబు మాట వినకుంటే డీజీ స్థాయి వాళ్లు కూడా జైలుకే! అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా.. క్యూ లైన్లో దర్జాగా నిలబడి దొంగ ఓట్లు వేసిన వాళ్ల ఫొటోలతో సహా వివరాలను వైఎస్ జగన్ చదివి వినిపించారు. -
బందిపోటు దొంగల్లా చంబల్ వ్యాలీని మించిపోయారు
-
ఇంక ఎన్నికలు ఎందుకు? గుద్దుకుంటా కూర్చోండి..!
-
చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎలక్షన్ కావొచ్చు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు లేవనడానికి.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. సాక్షాత్తూ కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడటం లేదు. ప్రజాస్వామ్యం లేదన్నది ఎన్నికల్లో రుజువైంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితులున్నాయో చెప్పడానికి పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ఉదాహరణ. పోలింగ్ బూత్ లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు బూత్ లలో లేకుండా చేసి రిగ్గింగ్ చేసుకున్నారు. పోలీసుల ప్రోద్భలంతో రిగ్గింగ్ చేసుకున్నారు. దేశంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగింది ఇక్కడేపులివెందులలో జరిగింది ఎన్నిక అంటారా?పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు.. బాధ్యతలుంటాయ్. నకిలీ ఓటర్లను గుర్తించడం , అభ్యంతరాలను తెలియజేయడం , పోలింగే వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలుంటాయి. పోలింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫామ్ -12 ఇస్తారు. వైఎస్సార్సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ -12 ను పోలీసులు,టిడిపి వాళ్లు లాక్కున్నారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నాం. ఎన్నిక ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఇవన్నీ ఎన్నికలో జరిగాయా?. ఏజెంట్లే లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా?..ఇదే తరహాలో ఎన్నికలు జరిపితే హాస్యాస్పదమే అవుతుంది. ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్ధేశం ఈ ప్రభుత్వానికి లేదు. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇది వాళ్ల విధానం. ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చంబల్ లోయను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారు. సాక్షాత్తూ పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్.. ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేయండి. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నిక జరపండి.. .. ప్రజాస్వామ్యంలో మీకు ఓట్లు వేసే అవకాశం లేదు. ప్రతీ బూత్ లో వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకుందా?. ఎవరెవరు బయటి నుంచి వచ్చారు..ఎవరెవరు బూత్ లను ఆక్రమించుకున్నారో ఆధారాలిస్తా. అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్లను మోసగాడు అంటారు. ఏ ఎన్నిక జరిగినా ఆ ఊర్లో ప్రజలే అక్కడ ఓటేస్తారు ... గతంలోనూ అదే జరిగిందిప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు పోలింగ్ బూత్ లను మార్చేశారు. పోలింగ్ బూత్ లు మార్చడం వల్ల నాలుగు వేల ఓట్ల పై ప్రభావం పడింది. పోలింగ్ బూత్ లకు వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. పులివెందుల ఎన్నికలు ఆరు పంచాయతీల పరిధిలో జరిగాయి. ఈ ఆరు పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు ఈ గ్రామాల్లో పాగా వేశారు. పోలీసులే వారిని ప్రోత్సహించారు.ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారుపోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు. ప్రతీ బూత్ లో 400 లకు పైగా టీడీపీ రౌడీలు తిష్ట వేశారు. ఒక్కో ఓటరుకి ఒక్కో రౌడీని పెట్టారు. మంత్రి సవిత మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మనుషులు పోలింగ్ బూత్ లలో తిష్టవేశారు. బిటెక్ రవి పులివెందుల రూరల్ ఓటరు కాదు. కానీ కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేశాడు. ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని కొట్టి..వారి స్లిప్పులను లాగేసుకున్నారు. ఆ స్లిప్పులతో వాళ్లు ఓట్లేసుకున్నారు. టిడిపికి ఓటేసేవాడైతేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనిచ్చారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు. జమ్మలమడుగు నుంచి వచ్చిన టిడిపి నేతలు పులివెందులలో ఓట్లేశారు. ఇవాళ జరిగే రీపోలింగ్ లో కూడా దొంగఓట్లు వేశారు. అన్యాయమని ప్రశ్నిస్తే పోలీసులు తరిమితరిమి కొట్టారు. మహిళ ఏజెంట్లను కూడా ఇబ్బంది పెట్టారు. టీడీపీ వాళ్లు వందల మంది ఒకేచోట ఉన్నా.. షామియానాలు వేశారు.పోలీసులు.. పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే!ఏరికోరి పోలీసులను నియమించుకున్నారు. పచ్చచొక్కాలు వేసుకుని పోలీసులు టిడిపికి పనిచేశారు. డీఐజీ కోయ ప్రవీణ్ .. టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజి కోయ ప్రవీణ్ పర్యవేక్షలో ఈ ఎన్నిక జరిపారు. చంద్రబాబు మాట వినకపోతే డిజి స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందే. పీఎస్.ఆర్ ఆంజనేయులు,సునీల్ కుమార్,విశాల్ గున్నీల పై కేసులు పెట్టారు ..కొందరిని అరెస్ట్ చేశారు. ఈ డీఐజీ మాఫియా రింగ్ లీడర్. బెల్ట్ షాపుల కలెక్షన్ల నుంచి పర్మిట్ రూమ్ లు , ఇసుక,మట్టి,క్వార్ట్జ్, సిలికా, పేకాట శిభిరాలకు అనుమతి వరకూ అంతా డిఐజినే చూసుకుంటున్నాడు. ఈ కలెక్షన్లలో వాటాలను చంద్రబాబు,చినబాబు,ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు. ఇలాంటి డీఐజీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించారువైఎస్సార్సీపీ వాళ్లే లక్ష్యంగా..ఉదయం 4 గంటల నుంచే టిడిపి వాళ్లు పోలింగ్ బూత్ లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పులివెందుల టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టిడిపి నేతలు రెచ్చిపోయారు. మోట్నుతలపల్లిలో పోలింగ్ బూత్ లకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓటర్లను అడ్డుకున్నారు. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోనికి రాకుండా అడ్డుకున్నారని ఓటర్లే చెబుతున్నారు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి పోలీసులు గన్ తో బెదిరించారుఎర్రబల్లిలో రిగ్గింగ్ చేయడానికి వచ్చిన టిడిపి వాళ్లకు పోలీసులే స్వాగతం పలికారు. కనంపల్లిలో పోలింగ్ బూత్ లకు ఏజెంట్లు వెళ్లకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు. ఓటు వేయనివ్వండని ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. కనంపల్లి ఓటర్లు ఓటు వేయలేకపోయామని ఆవేదన చెందారు. పులివెందుల జడ్పీటీసి అభ్యర్ధి హేమంత్‌ను ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వలేదు. భూపేజ్ రెడ్డి పీఏ సుదర్శన్ రెడ్డికి పులివెందులలో పనేంటి?. పులివెందుల రూరల్ లో ఎన్నికలు జరుగుతుంటే టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డి ఆఫీస్ కు వెళ్లి డిఐజి హడావిడి చేశాడు. పులివెందులలో డీఎస్పీ ‘‘కాల్చిపడేస్తా నాకొడకా’’ అని వైఎస్సార్సీపీ వాళ్లను బెదిరించాడు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టలో పోలింగ్ బూత్ లో రౌడీయిజం చేశాడు. రాయచోటి ఎమ్మెల్యే,మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఒంటిమిట్టలో ఏం పని?చంద్రబాబుకి ఇదే హెచ్చరికప్రజలు ఓటేస్తారనే నమ్మకం నీకుంటే ఎందుకు ఇలాంటి పనులు చేయడం చంద్రబాబు. ప్రజలు నీకు ఓటు వేయరనే ఇలా దిగజారిపోయావు?. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలానే చేశాడు. నంద్యాలలో గెలిచి సంకలు గుద్దుకున్నాడు. ఏడాదిలోనే నంద్యాలలో గెలిచాం. రాష్ట్రవ్యాప్తంగా టిడిపిని భూ స్థాపితం చేశాం. కళ్లుమూసి తెరిచేలోగా ఏడాదిన్నర గడిచిపోయింది. మరో మూడున్నరేళ్లు కూడా అలానే గడిచిపోతుంది. ప్రజాస్వామ్యం చేజారిపోతే నక్సలిజం పుడుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలిజరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి. చంద్రబాబు తప్పుడు పునాదులకు బీజం వేస్తున్నారు. రేపు ఇదే మీకు చుట్టుకుంటుంది. చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎన్నిక కావొచ్చు. కృష్ణారామా.. అనుకుంటూ ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. మీడియా ప్రతినిధి: ఎన్నిక రద్దు కోరతారా?ఇలా జరిగేవాటికి ఎన్నికలు జరపడం ఎందుకు?. అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోర్టులను కోరతాం. మీడియా ప్రతినిధి: ఓట్ చోరీ పేరిట ఇండియా బ్లాక్ చేపట్టిన ర్యాలీకి దూరంగా ఎందుకు ఉన్నారు?ఓట్లు చోరీ అయ్యాయని మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడు. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5 శాతం తేడా ఉన్నది ఏపీలో మాత్రమే. అంటే.. పోలింగ్ నాటికి-కౌంటిగ్ నాటికి 48 లక్షల ఓట్లు పెరిగాయి. ఎలా?. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణికం ఠాకూర్ ఏరోజైనా చంద్రబాబు గురించి మాట్లాడాడా?. కానీ, నా గురించి మాట్లాడుతున్నాడు. ఏపీలో జరుగుతున్న అక్రమాల పై ఏరోజైనా మాట్లాడాడా?. కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు టచ్‌లో ఉన్నారు. రేవంత్ ద్వారా రాహుల్ గాంధీకి టచ్‌లో ఉన్నారు. ఏపీలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులు అర్పించారు.శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి గార్ల మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/QyLN6VXHR4— YS Jagan Mohan Reddy (@ysjagan) August 13, 2025 -
పులివెందులలో టీడీపీ గూండాల దౌర్జన్యంపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
-
పులివెందులలో అరాచకాలపై YS జగన్ ఉగ్రరూపం
-
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న (బుధవారం) ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. -
నేడు భీమవరంలో పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ విఎస్ఎస్ గార్డెన్స్‌లో జరిగే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి:రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జరిగిన అరాచకాలపై మంగళవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.‘పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని,పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్ డే.పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యందిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న… pic.twitter.com/Qky1FZjeQA— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2025 ‘చంద్రబాబు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కాని, చంద్రబాబుగారు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్ చేయించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతాం? చంద్రబాబుగారు.. ఓట్లను రిగ్గింగ్ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదు...ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం గతం వరకూ నుంచో పాటిస్తున్న విధానం. కాని చంద్రబాబుగారి ఆదేశాల మేరకు పులివెందుల ZPTC పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూత్‌లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పడే క్షుద్ర రాజకీయానికి నాందిపడింది. మరోవంక నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి, సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్లు యథేచ్ఛగా చొరబడి, తెల్లవారుజామునుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి, బూత్‌లను ఆక్రమించుకున్నారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లు బూత్‌ల్లో కనీసం కూర్చోనీయలేదు, ఓటర్లను బూత్‌లవైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టారు, తరిమి కొట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబుగారి తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్, టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావుగారి సమీప బంధువు, పచ్చచొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా? మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?’అని ప్ర శ్నించారు.‘అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఆయన ఏం మంచి చేశాడని ఓట్లేస్తారు. 15నెలల ఆయన పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత, పారిశ్రామిక రంగాలు సహా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది. ప్రతి కుటుంబం తన కాళ్లమీద తాను నిలబడేలా వారికి భరోసా ఉండేలా మా ప్రభుత్వం నాటి పథకాలన్నింటినీ, ఆ స్కీములు అన్నిటినీ రద్దుచేయడమే కాదు, తాను ఇస్తానంటూ ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లనూ మోసాలతో, అబద్ధాలతో ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఏగ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబునాయుడును, ఆ పార్టీకి చెందిన వారికి, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుమారు రూ.19వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు. మరోవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లెటరైట్, లిక్కర్, చివరకు కరెంటు కొనుగోలు ఒప్పందాలు, లంచాల కోసం శెనక్కాయలకు, బెల్లాలకు భూములు అప్పనంగా ఇవ్వడం మొదలు, మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట పనులు జరక్కుండానే, రేట్లు పెంచి ఇవ్వడం మొదలు, రాజధాని నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, విద్యాదీవెన, వసతి దీవెన లేదు, ఆస్పత్రులకు వెళ్తే ఏ పేదవాళ్లకూ ఆరోగ్యశ్రీ లేదు. స్కూళ్లలో నాడు-నేడు లేదు, ట్యాబుల్లేవు, టోఫెల్ పీరియడ్స్‌తో పాటు ఇంగ్లిషు మీడియం లేదు. మరి ఇలాంటి అబద్ధాలు, మోసాలు, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుగారికి ప్రజలు ఓట్లెందుకు వేస్తారు?’ ..పోనీ తనకే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబుగారు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకే ఓట్లేస్తారని అనుకున్నప్పుడు, ఆ ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా? ఓటర్లు ఉన్న దగ్గరే పోలింగ్ బూత్‌లు పెట్టేవాడు కదా? ఆ నమ్మకం లేదు కాబట్టే చంద్రబాబుగారు ఈ అరాచకాలన్నీ చేశారు. రెండు చిన్న ZPTC స్థానాలను లాక్కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వాడుకుని, ఇన్ని అరాచకాలు చేసి గెలవాలని చూస్తే దాంతో సాధించేది ఏముంటుంది?..2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబుగారు ఇదే తరహా కుట్రతో అరాచకాలు చేశారు. ప్రతి వీధికో ఎమ్మెల్యేను పెట్టారు, ప్రతి వార్డుకో మంత్రిని పెట్టి, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఆ ఉప ఎన్నికల్లో 27వేల ఓట్లతో గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు, మా పార్టీ పనైపోయిందని, జగన్ పని అయిపోందని టీడీపీకి చెందిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 34,560 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చంద్రబాబుగారి పార్టీ పూర్తిగా క్లీన్‌బౌల్డ్ అయ్యింది. అవ్వాళ్టి ఎన్నికతో పోలిస్తే ఇవాళ పులివెందుల ఈ రెండు ZPTC ఉప ఎన్నికల్లో అంతకుమించి అరాచకాలు చేశారు. 2019 తరహాలోనే భవిష్యత్తులోకూడా అదే స్థాయిలో పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు కచ్చితంగా స్పందించి, చంద్రబాబుకు బుద్ధిచెప్తారు...పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఇవాళ ఇన్ని అక్రమాలు జరిగినా, అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనం దాల్చడం విచారకరం. అయినా రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో, ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో, వారి భద్రత నడుమ తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతాం’ అని చంద్రబాబు రౌడీ రాజ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
EVMల గోల్ మాల్.. రాహుల్ నోట.. జగన్ మాట
-
జగనన్నకు కృతజ్ఞతలు.. ఇదొక సవాలుగా స్వీకరిస్తా
-
మా వాళ్లని చంపేస్తారా ? జగన్ ఫైర్..
-
చంద్రబాబుకు జగన్ టెన్షన్.. దెబ్బకు కేబినెట్ లో మార్పులు
-
చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
అప్రజాస్వామిక, అరాచకవాది చంద్రబాబు నాయుడు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
అప్రజాస్వామిక, అరాచకవాది చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాది అని.. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చిని లాక్కోవాలని చూస్తున్నారనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయంటూ దెప్పి పొడిచారు.పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు అంటూ ఎత్తిచూపారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంత మంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరికొంత మంది పోలీసులు.. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పన్నాగాన్ని సాక్ష్యాధారాలతో వివరిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచి్చంది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందల మంది వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండోవర్ చేసి, వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తున్న వారిని, ప్రచారం చేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.⇒ ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయి. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లి వారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికి దిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.⇒ ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కారుని బద్దలు కొట్టారు.పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారు. రమేష్ యాదవ్‌కు గాయాలుకాగా, తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేరి్పంచారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈ రకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.⇒ తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్సార్సీపీ నాయకులపైనే తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాము సహా మరో 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింత మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.⇒ ఆగస్టు 8న వైఎస్సార్సీపీకి చెందిన ఒక నాయకుడిని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమ వైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని.. తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ⇒ అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు.. ఆగస్టు 8న వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జెడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు 4 వేల మంది ఓటర్లను, పక్కా వైఎస్సార్సీపీకి చెందిన గ్రామాలకు చెందిన వారిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు.వీళ్లు ఓటేయడానికి వెళ్లకుండా బెదిరించడం, భయపెట్టడం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్‌ను తగ్గించడం, బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడటం.. ఈ మాదిరి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. (పోలింగ్ బూత్‌లను అడ్డగోలుగా ఎలా మార్చారన్నది టేబుల్లో పరిశీలించగలరు.)⇒ నల్లగొండువారిపల్లి వద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే ఆగస్టు 8వ తేదీ రాత్రి ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంత మంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెబుతున్న సమయంలో బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్‌స్టేషన్‌లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు.అయినా వారి మీద కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు వీరిని వదిలి పెట్టాల్సి వచి్చంది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్‌కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.⇒ ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ శాతం తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడి చేస్తున్నారు. వారిపైనా దాడులకు సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడి మీద, ప్రజల మీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. -
‘జగన్ అంటే చంద్రబాబు ఎంత భయపడుతున్నారో అనడానికి ఇదే నిదర్శనం’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి సీఎం చంద్రబాబు ఎంత భయపడిపోతున్నారో ప్రస్తుతం ఓ చిన్న ఎన్నిక కోసం జరుగుతున్న పరిణామాలను చూస్తేనే అర్ధమవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ చిన్న ఎన్నికకు జగన్ అంటే సీఎం చంద్రబాబు ఎంత భయపడుతున్నారో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి. టీడీపీ నేతల దాడిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. మా నేతలపై దాడి చేసినా ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయలేదు. తప్పుడు ఫిర్యాదుతో మా పార్టీ నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వంలోని నేతలు గౌరవించటం లేదు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం. దాడులకు గురైన వారిపైనే రిటర్న్ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గం. పులివెందుల జెడ్పీటీసీ సెగ్మెంట్ లో గెలిచి ఆధిపత్య రాజకీయాలు చూపించాలనుకుంటున్నారు చంద్రబాబు. ఎన్నికలు జరుగుతుంది వైఎస్సార్సీపీకి కూటమికి మాత్రమే కాదు. వైసీపీకి పోలీసులకు.. వైసీపీకి ఎన్నికల సంఘానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. ఎన్ని ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుంది..సీఎం స్థాయిలో కూర్చున్న వ్యక్తి జెడ్పీటీసీ ఎన్నికను పర్యవేక్షించటం చంద్రబాబు హయంలోనే మొదలైంది..డీజీపీ కార్యాలయానికి వెళ్తే పోలీసులను పెట్టి ఆపిస్తున్నారు. డీజీపీ రాష్ట్రానికా.. టీడీపీ కా?, ప్రజా ప్రతినిధులు వస్తే ఔట్ వార్డులో ఇచ్చి వెళ్ళమంటారా?, ఎస్సీ నేతలమని మాపై డీజీపీ వివక్ష చూపిస్తున్నారు. కనీసం ఒక్క అధికారి కూడా రాలేదు. ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్ళినా.. డీజీపీ కార్యాలయానికి వెళ్ళినా ఇదే తంతు జరుగుతుంది. చంద్రబాబు దృష్టిలో పడాలని అధికారులు పోటీలు పడుతున్నారు. మార్చిన పోలింగ్ కేంద్రాలు యధాస్థానంలో ఉంచాలి. మేము ఓడిపోతామనే భయంతో మాట్లాడటం లేదు.ఎన్నికల సంఘానికి ఇది శల్య పరీక్ష అని గుర్తుంచుకోవాలి. మా నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి. హైకోర్టు ఆదేశాలు పాటించాలి’ అని సూచించారు. -
చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాది: వైఎస్ జగన్
తాడేపల్లి: ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాది అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేసే వ్యక్తి కాదని జగన్ దుయ్యబట్టారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ చంద్రబాబు చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.‘చంద్రబాబు కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్ను పోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరి కొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారు’ అని జగన్ విమర్శించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పథకాల్ని వైఎస్ జగన్ ట్వీట్ రూపంలో ప్రస్తావించారు. .@ncbn అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే… pic.twitter.com/MaZrGo174C— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2025 1. పులివెందుల, ఒంటిమిట్ట ZPTCల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందలమంది వైయస్సార్సీపీ, నాయకులను కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్ గడపతొక్కని వారిని, ఎలాంటి కేసులు లేనివారిని కూడా బైండోవర్ చేసి, వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తున్నవారిని, ప్రచారంచేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.2. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడిచేశాయి. ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికిదిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.3. ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ MLC రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్యచేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లెవద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు,రాళ్లు, రాడ్లతో దాడిచేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కార్ని బద్దలు కొట్టారు. పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నంకూడా చేశారు. రమేష్ యాదవ్‌కు గాయాలుకాగా, తీవ్రగాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేర్పించారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహించారు. వైఎస్సార్సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈరకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.4. తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6, మధ్యాహ్నం 3.30గంటలకు వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడిచేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాముసహా మరొక 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ మరియు హత్యాయత్నం కేసుపెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింతమంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.5. ఆగస్టు8, వైఎస్సార్సీపీకి చెందిన ఒక నాయకుడ్ని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమవైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని, తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైయస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీచేశారు.6. ఆగస్టు8: అధికారపార్టీతో చేతులు కలిపిన అధికారులు, వైయస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు4వేల మంది ఓటర్లను, పక్కా వైయస్సార్సీపీకి చెందిన గ్రామాలకు చెందినవారిని ఈ రకంగా ఇబ్బందిపెట్టి, వీళ్లు ఓటేయడానికి వెళ్లే క్రమంలో వారిని వెళ్లనివ్వకుండా బెదిరించడం, భయపెట్టడ్డం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్‌ను తగ్గించడం, బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డం, చంద్రబాబుగారు ఈమాదిరి కుట్ర చేస్తున్నారు. (పోలింగ్ బూత్‌లను అడ్డగోలుగా ఎలా మార్చారన్న టేబుల్‌ను అటాచ్ మెంట్లో ఉంది. పరిశీలించగలరు)7. ఆగస్టు8 రాత్రి, నల్లగొండువారిపల్లెవద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే తప్పుడు ఎస్సీ, ఎస్టీకేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న సమయంలో వాళ్లు బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్‌స్టేషన్‌లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. అయినా వారిమీదకూడా ఎస్సీ, ఎస్టీకేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో వీరిని పోలీసులు వదిలిపెట్టాల్సి వచ్చింది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్‌కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.8. ఇక ఎన్నికల పోలింగ్ రోజున, ఓటింగ్ తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడిచేస్తున్నారు. వారిపై దాడులకూ సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసంచేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి.అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడిమీద నమ్మకం ఉంది. ప్రజలమీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. -
YS Jagan: ఆదివాసీలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
ప్రకృతి ఒడిలో నివసించే కల్మషం లేని మనుషులే వీళ్లు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు(అగస్టు 9న) అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రకృతి ఒడిలో నివసించే కల్మషం లేని మనుషులు ఆదివాసీలు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి నిలువుటద్దం వారు. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నా ఆదివాసి సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు అంటూ తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.ప్రకృతి ఒడిలో నివసించే కల్మషం లేని మనుషులు ఆదివాసీలు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి నిలువుటద్దం వారు. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నా ఆదివాసి సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.#WorldTribalDay— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2025ఆదివాసీ ప్రజల హక్కులు, వారిపట్ల గౌరవం, మరియు వారి సంస్కృతిని పరిరక్షించేందుకు.. ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా 1994లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. -
అక్క చెల్లెమ్మలకు YS జగన్ రాఖీ శుభాకాంక్షలు
-
నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాఖీ పండుగ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, మహిళకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలోని నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రక్షా బంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా.. మహిళలకు ఎప్పుడూ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.రాష్ట్రంలోని నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.#RakshaBandhan— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2025 -
అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాఖీ పండుగ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.రక్షా బంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా.. మహిళలకు ఎప్పుడూ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఇది YSR అడ్డా.. పులివెందుల ప్రచారంలో పెద్దారెడ్డి
-
కరువు సీమగా ఉండే పులివెందులను ఆకుపచ్చ బంగారం చేసిన YSR
-
YS Jagan: ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచాం
-
ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచాం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
-
ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నేతన్నల జీవితాలు బాగు పడాలన్న ఆకాంక్షతో వైఎస్సార్సీపీ హయాంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అన్ని హామీలను అమలు చేసి ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలిచామని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ గురువారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తమ హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ టీడీపీ కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేస్తూ అన్ని వర్గాల మాదిరిగానే చేనేతలను సైతం చంద్రబాబు మోసం చేసిన వైనాన్ని ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..నేతన్నలకు రూ.3,706.16 కోట్ల సాయం చేశాం.. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘‘సంత్ కబీర్’’ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు (పొందూరు)లకు అభినందనలు. మా ప్రభుత్వ హయాంలో ప్రతి అడుగులోనూ నేతన్నలకు అండగా నిలిచాం. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం’ ద్వారా ఏటా రూ.24,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.969.77 కోట్లు, నేతన్నల పింఛన్ కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు రూ.468.84 కోట్లు చెల్లించాం. అంతేకాదు.. వివిధ పథకాల ద్వారా నేతన్నలకు రూ.3,706.16 కోట్లు మేర సాయం చేశాం. ఇది ఒక రికార్డు. నేతన్నలకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్‌కు రాయితీపై విద్యుత్ అందించాం. చేనేత వస్త్రాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇలా ప్రతి అడుగులోనూ చేనేతలకు అండగా నిలిచాం. ఏ రకంగా ఆదుకున్నట్లు..?ఈ ప్రభుత్వం చేనేతలకు నడుస్తున్న పథకాలను ఆపివేయడంతోపాటు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసింది. జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీన్ని అమలు చేయాలంటే దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. కానీ రెండు బడ్జెట్లలో ఈ ప్రభుత్వం పెట్టింది సున్నా. పవర్లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. కానీ 14 నెలలు గడిచినా అమలు చేయలేదు. కరెంటు సబ్సిడీ ఇవ్వలేదు గానీ విద్యుత్తు చార్జీలు అమాంతం పెంచారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు రూ.19 వేల కోట్ల మేర కరెంటు షాక్ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం చేనేతలను ఏ రకంగా ఆదుకున్నట్లు? పత్రికల్లో ప్రకటనలు మినహా ఏమీ కనిపించడం లేదు. అన్ని వర్గాల మాదిరిగానే చంద్రబాబు చేనేతలను వంచించారు, మోసం చేశారు. -
నేతన్నలను చంద్రబాబు సర్కార్ ఏ రకంగా ఆదుకున్నట్లు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సంత్ కబీర్ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు (పొందూరు)లకు ఆయన అభినందనలు తెలిపారు.‘‘నేతన్నల జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వారికి ప్రతి అడుగులోనూ అండగా నిలిచాం. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 'వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం’ ద్వారా ప్రతి ఏటా రూ.24,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.969.77 కోట్లు, నేతన్నల పింఛన్ కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు రూ.468.84 కోట్లు చెల్లించాం. అంతేకాదు వివిధ పథకాల ద్వారా నేతన్నలకు రూ.3,706.16 కోట్లు సాయం చేశాం. ఇది ఒక రికార్డు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘నేతన్నలకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్ కు రాయితీపై విద్యుత్ అందించాం. చేనేత వస్త్రాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇలా ప్రతి అడుగులోనూ చేనేతలకు అండగా నిలిచాం. ఈ ప్రభుత్వం చేనేతలకు నడుస్తున్న పథకాలను ఆపేసి ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసింది. జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీన్ని అమలు చేయాలంటే దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. రెండు బడ్జెట్లలో పెట్టింది సున్నా.ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్న నేతన్నలందరికీ శుభాకాంక్షలు.ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా సంత్ కబీర్ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు… pic.twitter.com/x0ewriEn5z— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2025..పవర్లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. 14 నెలలు గడిచినా అమలు చేయలేదు. కరెంటు సబ్సిడీ ఇవ్వలేదు, కానీ కరెంటు ఛార్జీలు అమాంతంగా పెంచారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు రూ.19వేల కోట్ల మేర కరెంటు షాక్ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం చేనేతలను ఏ రకంగా ఆదుకున్నట్లు?. పత్రికల్లో ప్రకటనలు తప్ప ఏమీ కనిపించడం లేదు. అన్ని వర్గాల మాదిరిగానే చంద్రబాబు చేనేతలను వంచించారు, మోసం చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు. -
పులివెందులలో టీడీపీ అరాచకాలపై YS జగన్ ఆగ్రహం
-
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
-
ఎందుకీ రౌడీ రాజకీయాలు? : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పులివెందుల మండలం నల్లగొండువారిపల్లెలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేశ్‌యాదవ్, రామలింగారెడ్డిను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఏం పాపం చేశారని దాడి చేశారు? ఎందుకు ఇలా గాయపరిచారు? అని ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. ఈమేరకు బుధవారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మంగళవారం సాయంత్రం పులివెందులలో జరిగిన మరో ఘటనలో.. ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై ఫంక్షన్ హాల్లోనే టీడీపీ వాళ్లు దాడి చేశారు. ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్రెడ్డి తదితరులను కూడా దారుణంగా కొట్టారు..’ అని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ దాదాపు 100 మందికిపైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను బైండోవర్ చేశారు. ఇంకా చాలామందిని బైండోవర్ చేసి నిర్బంధించాలని యత్నిస్తున్నారు. ఇంత బరి తెగించి దాడులు చేసిన టీడీపీ వారిపై కేసులు లేవు. అరెస్టులు కూడా లేవు. టీడీపీ నుంచి ఒక్కరిని కూడా బైండోవర్ చేయలేదు’ అని ధ్వజమెత్తారు. ‘మా పార్టీకి చెందిన నాయకుడిని బెదిరించి, భయపెట్టి తమవైపు లాక్కుని.. ఆ పార్టీ మారిన వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. దాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి, మరో కార్యకర్త గంగాధర్‌రెడ్డిపై పోలీసులు మరో తప్పుడు కేసు పెట్టారు..’ అని మండిపడ్డారు. ‘పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక పథకం ప్రకారం కుట్రలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో హింసను రాజేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ ఎన్నిక జరగకూడదని... వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులెవరూ తిరగకూడదని పోలీసులను ఉపయోగించుకుని చంద్రబాబు ఈ అరాచకాలన్నీ చేయిస్తున్నారు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవైపు అక్రమ కేసులు, అరెస్టులు, బైండోవర్లతో పోలీసులు మా పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తుంటే మరోవైపు టీడీపీ గ్యాంగ్‌లు టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ గ్యాంగ్‌లు దాడులు చేసేందుకు వీలుగా ఉద్దేశ పూర్వకంగానే పోలీసులు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారు. రెండు రోజులుగా వరుసగా దారుణ ఘటనలకు కారకులైన వారిలో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ప్రాంత డీఐజీ ఈ కుట్రను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక జడ్పీటీసీ స్థానం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారిపోతారా?’ అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో శాంతి భద్రతలు దిగజారడంతో పాటు పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడం, వ్యవస్థలను నీరుగార్చడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తెస్తామని ప్రకటించారు. చంద్రబాబు రౌడీ రాజకీయాలను పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు ఎవరూ సహించరని, ఆయనకు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ‘ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. కళ్లు మూసి తెరిచేసరికి మరో మూడేళ్లు అయిపోతాయి. ఆ తర్వాత మీరు చేసిన ఈ అన్యాయాలన్నీ వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయని గుర్తుపెట్టుకోవాలి’ అని హెచ్చరించారు. -
బరితెగించిన 'బాబు గ్యాంగ్'
పూర్వం రాజుల కాలంలో బందిపోట్లుండేవారు.. ఉన్నట్లుండి మెరుపు దాడులు చేస్తూ దోచుకెళ్లేవారు.. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు దొంగల ముఠా అంతకు మించి అన్నట్లు బరితెగించి వ్యవహరిస్తోంది.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ ముఠా అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేయడమే లక్ష్యంగా మెరుపు దాడులకు ఉపక్రమించింది.. గుంపులు గుంపులుగా వాహనాల్లో రావడం.. ఆయుధాలు చేత పట్టుకుని విచక్షణా రహితంగా దాడులు చేసి వెళ్లడం పరిపాటిగా మారింది.. ఇదంతా పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతుండటం దుర్మార్గం.. ఎలాగైనా సరే పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా చేసి.. ఓటింగ్ క్యాప్చర్ చేసి గెలవాలనే కుతంత్రంతో ఇలా చేస్తోంది.. ఈ అరాచకం చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆటవిక పాలనకు అచ్చుగుద్దినట్లు అద్దం పడుతోంది.సాక్షి, టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ చంద్రబాబు అండ్ గ్యాంగ్ బరితెగించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే డిపాజిట్ కూడా దక్కదనే భయంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు, కుతంత్రాలకు తెగబడింది. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా వైఎస్సార్సీపీ నేతలపై వరుస దాడులకు పాల్పడుతూ వసు్తన్న ఈ సైకో గ్యాంగ్.. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల మండల నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి (వేల్పుల రాము)లపై బుధవారం పులివెందుల రూరల్ మండలం నల్లగొండువారిపల్లెలో హత్యాయత్నం చేసింది. ఇనుప సమ్మెటలు, రాడ్లు చేత పట్టుకుని టీడీపీ రౌడీ మూకలు విచక్షణారహితంగా దాడికి దిగాయి. వాడే.. టార్గెట్.. వేయండి.. అంటూ సైకోల్లా అరుపులు, కేకలతో అరగంటపాటు రెచ్చిపోయాయి. ఈ దాడిలో రామలింగారెడ్డి తలకు బలమైన గాయం కాగా, ఎమ్మెల్సీ భుజం ఎముక విరిగింది. ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్న వైఎస్సార్సీపీ నేతలకు ఆ గ్రామ మహిళలు అండగా నిలిచి, ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో టీడీపీ మూకలు అక్కడి నుంచి తోకముడిచాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... పులివెందుల మండలం నల్లగొండువారిపల్లె గ్రామానికి చెందిన చెన్నారెడ్డి.. వేల్పుల రామలింగారెడ్డికి సమీప బంధువు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆయనతో చర్చించేందుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో కలిసి వేల్పుల రామలింగారెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడిన తర్వాత పక్కనే ఉన్న సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఈశ్వరరెడ్డితో మాట్లాడేందుకు వెళ్తుండగా, ఒక్కమారుగా టీడీపీ రౌడీ మూకలు వారిని చుట్టుముట్టాయి. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పైనా అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. దాంతో ఆయన భుజం ఎముకలు విరిగిపోయాయి. ఆపై ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చ్యూనర్, స్కార్పియో వాహనాలను సమ్మెటలతో ధ్వంసం చేయగా..అలజడి రేగడంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన మహిళలు.. కింద పడిపోయిన రామలింగారెడ్డికి అడ్డుగా నిలిచారు. ఆయనపై మళ్లీ దాడి చేయబోతుండగా టీడీపీ మూకలను అడ్డుకున్నారు. కొంత మంది మహిళలు ఆయనను లాక్కెళ్లి పక్కనే ఉన్న ఇంట్లో వేసి తాళం వేశారు. దీంతో టీడీపీ రౌడీలు.. తాళం వేసిన ఇంటి లోపలికి పెట్రోల్ చల్లారు. నిప్పు పెట్టేందుకు విఫలయత్నం చేశారు. గొడవ జరుగుతోందనే విషయం గ్రామం మొత్తానికి తెలియడంతో గ్రామస్తులంతా అక్కడికి వచ్చారు. గ్రామస్తులు తిరగబడటంంతో టీడీపీ రౌడీ మూకలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.తుద ముట్టించేందుకు పక్కా ప్రణాళికవేల్పుల రామలింగారెడ్డి ఆ ప్రాంతంలో టీడీపీ నాయకులకు కంటగింపుగా ఉన్నారు. టిఫెన్ బెరైటీస్ కంపెనీ కేర్‌టేకర్‌గా కొనసాగుతున్నారు. అందులో నిల్వ ఉన్న కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్ దోపిడీపై.. టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి సహకారంతో వేముల పార్థసారథిరెడ్డి, మబ్బుచింతపల్లె శ్రీనాథరెడ్డి దొంగిలించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిఫెన్ బెరైటీస్‌లో అక్రమ మైనింగ్‌కు అడ్డుగా నిలవగంతో ఆయన టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం కనంపల్లె, మోట్నూతల గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. పక్కా ప్రణాళికతో ఆయన్ను తుద ముట్టించాలని టీడీపీ శ్రేణులు కుట్ర పన్నాయి. బుధవారం ఆయన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో కలిసి నల్లగొండువారిపల్లెకు వెళ్లారని తెలుసుకుని.. ఇనుçప సమ్మెటలు, రాడ్లు.. పెట్రోల్ బాటిళ్లు తదితర మారణాయుధాలతో అక్కడికి వెళ్లి మాటు వేశారు. ఇవన్నీ పరిశీలిస్తే వేల్పుల రామలింగారెడ్డిని అంతం చేయాలని పక్కా ప్రణాళికతోనే టీడీపీ మూకలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తలపై రాడ్డుతో కొట్టగానే రామలింగారెడ్డి కింద పడిపోగా, ఆ వెంటనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై వారు దాడికి దిగారు. ఆ సమయంలో గుంపులో నుంచి ‘వీడితో పాటు వాడిని కూడా వదలొద్దు’ అంటూ కేకలు విన్పించడంతో మళ్లీ రామలింగారెడ్డి వైపు తిరిగారు. అప్పటికే మహిళలు అడ్డుగా నిలవడంతో రెండోసారి దాడి చేయడం సాధ్యపడలేదని తెలుస్తోంది. గ్రామంలో కాకుండా మార్గం మద్యలో దాడి జరిగి ఉంటే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ హత్యకు గురై ఉండే వారని గ్రామస్తులు చెబుతున్నారు. హైకోర్టు ఆదేశించినా భద్రత కరువుటీడీపీ నేతలతో ప్రాణహాని ఉందని, టిఫెన్ బెరైటీస్ కంపెనీకి కేర్ టేకర్‌గా ఉన్న తనకు పలువురితో ముప్పు ఉందని.. భద్రత కల్పించాలని వేల్పుల రామలింగారెడ్డి పోలీసు యంత్రాంగాన్ని అభ్యర్థించారు. ఏడాదిగా ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వన్ ప్లస్ వన్ భద్రత కల్పించాలని ఆదేశించింది. గన్మెన్ల జీతాలు సొంతంగా చెల్లించేందుకు ఆయన అంగీకరించడంతో ఆ దిశగా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు వెలువడి నెల అవుతున్నా, వాటిని పోలీసులు అమలు పరచలేదు. అంటే ఆయన్ను తుద ముట్టించే కుట్రలో వారు కూడా భాగస్వాములు కావడం దుర్మార్గం. ఈ దాడిలో ఆయన ఆ గ్రామ మహిళల అండతో వెంట్రుక వాసిలో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఏ ఒక్కరిపై బుధవారం రాత్రి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.వరుస ఘటనలు.. యథేచ్ఛగా నిందితులుమంగళవారం పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్లో వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్‌రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్రెడ్డి పై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేశాయి. అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌బాషా (కిరికిరి బాషా) ముఠా దాడి చేసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. బుధవారం వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లపై హత్యాయత్నం ఘటనలో కూడా అదే ముఠాతో పాటు వేముల పార్థసారథిరెడ్డి సోదరుడు పేర్ల శేషారెడ్డి సమీప బంధువులు పాల్గొన్నారు. ఈ ఘటనలోనూ పోలీసులు వెంటనే స్పందించక పోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతమైన పులివెందులలో ఉద్రిక్తతలకు బ్రేక్ వేయాల్సిన పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నందునే వరుస ఘటనలు తెరపైకి వస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కర్రలు, రాళ్లతో దాడి చేశారు.. మా గ్రామంలో సింగిల్ విండో ప్రెసిడెంట్ ఈశ్వరరెడ్డి, చెన్నారెడ్డిల ఇళ్ల వద్దకు వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు మాట్లాడేందుకు వచ్చారు. ఇది తెలుసుకున్న టీడీపీ అల్లరి మూకలు 15 వాహనాల్లో మా ఊరికి వచ్చారు. వచ్చీ రాగానే నాలుగు వాహనాలను ధ్వంసం చేసి.. రామలింగారెడ్డి, రమేష్ యాదవ్‌లను గాయపరిచారు. కర్రలు, రాడ్లతో కొట్టారు. – సునీల్ కుమార్‌రెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లె ఎదురుపడి ఉంటే చంపేసేవారు మా గ్రామం రోడ్డుపై వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు ఎదురుపడి ఉంటే టీడీపీ మూకలు వారిని చంపేసేవి. వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు అడ్డుపడకపోతే వారిని హతమార్చేవారు. – వెంకట్రామిరెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లె ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదుజెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగకూడదనే టీడీపీ వారు ఇలా దాడులకు పాల్పడ్డారు. ఇంటిపై పెట్రోలు పోసి.. నిప్పంటించబోయారంటే ఎంతగా తెగించారో ఇట్టే తెలుస్తోంది. 40 ఏళ్లుగా ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదు. – వై.వేణుగోపాల్‌రెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లెపోలీసుల తీరుపై శాంతియుత ర్యాలీవైఎస్సార్సీపీ నాయకులపై వరుసగా హత్యాయత్నాలు జరుగుతున్నా పోలీసు అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం, నిందితుల్ని అరెస్టు చేయకుండా యథేచ్ఛగా మరిన్ని దాడులు చేసేందుకు ఆస్కారం కల్పించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు కడపలో బుధవారం శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ మంత్రి అంజాద్‌బాషా, కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది మందితో 3 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. అనంతరం అర్బన్ పోలీసు స్టేషన్లో డీఎస్పీ మురళీనాయక్‌కు వినతిపత్రం అందించారు.బాబు డైరెక్షన్.. బీటెక్ రవి యాక్షన్⇒ పులివెందుల నియోజకవర్గంలో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్లో ఎమ్మెల్సీ బీటెక్ రవి యాక్షన్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ నేతలు సురేష్ కుమార్‌రెడ్డి, అమరేష్‌రెడ్డి తదితరులపై హత్యాయత్నం ఘటనలో టీడీపీ వర్గీయులైన అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, కిరికిరిబాషా బృందంపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చిన బీటెక్ రవి.. సురేష్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్సీపీ నేతలకు మధ్య తేడాలు వచ్చాయని, అందుకే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని.. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయనపై దాడి చేసి, నింద తమపై మోపారని చెప్పుకొచ్చారు. బుధవారం నాటి ఘటనతో టీడీపీకి సంబంధం లేనిదని తప్పించుకోజూశారు. ⇒ మరోవైపు రామలింగారెడ్డి వేముల మండలానికి చెందిన ఎస్సీ కార్యకర్తలను కులం పేరుతో దూషించడంతోనే ఘర్షణ చోటుచేసుకుందని ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కొద్ది రోజులుగా ఇక్కడ ఏం జరుగుతోందో స్థానికులందరికీ స్పష్టంగా తెలిసినా, బీటెక్ రవి ఇలా బరితెగించి మాట్లాడటంపై విస్తుపోతున్నారు. ⇒ టీడీపీ పులివెందుల ఇన్చార్జి బీటెక్ రవి కుట్రలు, ఎత్తుగడలకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తోడయ్యారు. వరుసగా వైఎస్సార్సీసీ నాయకులపై దాడి చేయడం ఈ కుట్రలో భాగం. బహుళ ప్రయోజనాలు ఆశించి ఇలా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత మంది వైఎస్సార్సీపీ నేతల్ని టార్గెట్ చేసి దాడి చేయనున్నట్లు సమాచారం. ఇలా వరుస దాడులతో పులివెందుల మండల ఓటర్లలో భయాందోళన సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తద్వారా జెడ్పీటీసీ ఉప ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరించేలా చేయడం, లేదా ఒకవేళ ఓటింగ్ జరిగినా ఓటర్లు ఎవరూ పోలింగ్ కేంద్రాలకు రాకుండా చూడటమే లక్ష్యమని తెలుస్తోంది.ఓటమి తప్పదనే భయోత్పాతంవైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటుసాక్షి, అమరావతి: పులివెందులలో టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి అర్థమై, కూటమి నేతలు ఇలా భయోత్సాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిను బుధవారం ఆయన ఫోన్లో పరామర్శించారు. వారితోపాటు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల దాడిలో మంగళవారం గాయపడ్డ వైఎస్సార్సీపీ నేతలు సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డితో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలనే ప్రయత్నాన్ని కూటమి నేతలు చేస్తున్నారని, దీనిని తిప్పికొడదామని పార్టీ నేతలకు జగన్ సూచించారు. టీడీపీ కూటమి నేతలు వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని.. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నేతలంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురు నియమితులయ్యారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు అన్నంరెడ్డి అదీప్ రాజు.. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు కారుమూరి సునీల్ కుమార్.. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు పేర్ని కిట్టు.. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భూమన అభినయ్ రెడ్డి.. వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలను పార్టీ నియమించింది. -
ఓటమి తప్పదనే పులివెందులలో టీడీపీ గూండాల అరాచకాలు: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తన సొంత నియోజకవర్గం పులివెందులలో గత రెండ్రోజులుగా జరిగిన పరిణామాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడిన నలుగురిని బుధవారం సాయంత్రం ఆయన ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న అరాచ ఘటనలను తీవ్రంగా ఖండించారాయన. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలనే ప్రయత్నాన్ని కూటమి నేతలు చేస్తున్నారని, దీనిని బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు సూచించారు. ‘‘వ్యవస్ధలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి అర్ధమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెబుతారు’’ అని జగన్ బాధితులతో అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ గూండాలు బరి తెగించారు. పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో మరో నేత వేల్పుల రాము కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు బాధితుల్ని పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ ఇద్దరితో పాటు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల దాడిలో గాయపడ్డ సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిలతోనూ వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
జగన్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం.. డోన్‌లో అభిమానుల సందడి (చిత్రాలు)
-
మాజీ మంత్రి బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్ కు వైఎస్ జగన్
-
బుగ్గన కుమారుడి రిసెప్షన్‌కు వైఎస్ జగన్.. జన సంద్రమైన డోన్
సాక్షి, డోన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. నంద్యాల జిల్లాలో పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరయ్యారు. డోన్‌లోని దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో నూతన వధూవరులు అనన్య రెడ్డి, బుగ్గన అర్జున్ అమర్నాథ్లను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వివాహ రిసెప్షన్లో పాల్గొన్న నాయకులను, అభిమానులను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలుకరించారు.ఇక, వైఎస్ జగన్ రాకతో డోన్ పట్టణం జనసంద్రమైంది. తమ ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. -
డోన్ చేరుకున్న వైఎస్ జగన్.. భారీగా తరలివచ్చిన అభిమానులు
-
జక్కంపూడి రామ్మోహన్ రావుకు వైఎస్ జగన్ నివాళి
-
ఉత్తరాఖండ్ వరదలపై YS జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి
-
హెలికాప్టర్ లో డోన్ కు బయలుదేరిన వైఎస్ జగన్
-
జక్కంపూడి రామ్మోహన్ రావుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆయనకు నివాళులు అర్పించారు. రామ్మోహన్a చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు. -
KSR Live Show: చంద్రబాబుకు మాస్ వార్నింగ్.. మీ పిచ్చి వేషాలకు జగన్ భయపడడు
-
ఉత్తరాఖండ్ వరదలపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,అమరావతి: ఉత్తరాఖండ్ వరదలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో వరద బాధితులను ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలి. బాధితులకు వెంటనే పునరావాసం కల్పించటంతోపాటు, తగిన సహాయ చర్యలను చేపట్టాలి’అని కోరారు. Deeply shocked by the devastating floods in Uttarakhand.My thoughts and prayers are with the victims and their families during this incredibly difficult time.I hope the government will take swift and effective relief measures to support those affected and ensure their safety…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 6, 2025వరద విలయం కరాళ నృత్యందేవభూమి ఉత్తరాఖండ్‌ను బురద వరద అతలాకుతలం చేసింది. ఆధ్యాత్మిక ధామాలను దర్శించే పర్యాటకులతో ప్రకృతి సోయగాలతో అలరారే రమణీయమైన హిమాలయ గ్రామం ‘ధరాలీ’పై వరద విలయం కరాళ నృత్యం చేసింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద వరద ఆ గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలను భూస్థాపితం చేసింది.అప్పటిదాకా ప్రకృతి అందాలతో తులతూగిన ఉత్తరాఖండ్‌లోని ఆ గ్రామం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల వరద నీరు, బురద ముంచెత్తండతో ఆ ప్రాంతంలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి. -
YS Jagan: చంద్రబాబు పాలన చూస్తుంటే ఇదేనా కలియుగం అనిపిస్తోంది
-
నేడు వైఎస్ జగన్ డోన్‌కు రాక
డోన్: పట్టణంలో బుధవారం జరిగే రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కుమారుడు అర్జున్ అమర్నాథ్రెడ్డి, మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి ముని మనవరాలు అనన్యరెడ్డి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. తాడేపల్లిలోని హెలిపాడ్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి డోన్ పట్టణ శివారులోని ఎం కన్వెన్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 11.40 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంబాలపాడు సర్కిల్, ఉడుములపాడు మీదుగా 44వ జాతీయ రహదారిపై స్థానిక దత్తాత్రేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకుంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి తిరిగి కారులో ఎం కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుని అనంతరం హెలికాప్టర్లో బెంగళూరుకు 12.20కి ప్రయాణమవుతారు.ఏర్పాట్ల పరిశీలన..వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా ఎం కన్వెన్షన్ హాల్ వద్ద నిర్మించిన హెలిపాడ్‌తో పాటు దత్తాత్రేయ స్వామి గుడి ఆవరణలో నిర్మించిన వివాహ రిసెప్షన్ వేదిక, భోజనశాల షెడ్లను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. సుమారు 40 వేల మంది ప్రజలకు వివాహ విందు ఏర్పాటు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. మాజీ మంత్రి వెంట పట్టణ, రూరల్ సీఐలు ఇంతియాజ్ బాషా, రాకేష్, ఎస్ఐ శరత్కుమార్రెడ్డితో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం, ధర్మం లేకుండా దుర్మార్గ పాలన సాగుతోంది... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
తప్పుడు సాక్ష్యాలు.. అక్రమ కేసులు: వైఎస్ జగన్
ఈరోజు మనం వాదిస్తోంది దెబ్బ తిన్న వాళ్ల గురించి. కళ్ల ఎదుటే దొంగ స్టేట్మెంట్లు, దొంగ సాక్ష్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఒక కేసులో బయటకు రాగానే, వెంటనే మరో కేసు పెట్టి లోపల వేస్తున్నారు. అలా వరసగా కేసులు పెట్టి.. జైల్లోనే ఉంచేస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అది వారికి అర్థం కావాలి. అధికారం ఉంది కదా అని, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలియాలి. ఇందులో మీ పాత్ర కీలకం. మీ సేవలను గుర్తుంచుకుంటాం. – న్యాయవాదులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ప్రతిపక్షంగా కష్టకాలంలో ఉన్న పార్టీకి లాయర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఈ సమయంలో పార్టీకి పెద్దన్నల్లా లాయర్లు పని చేస్తున్నారని ప్రశంసించారు. కలియుగం అంటే ఏమిటన్నది ఈ 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే అర్థమవుతుందన్నారు. ఎక్కడా న్యాయం, ధర్మం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చోటుచేసుకున్న పరిస్థితులపై మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులున్నాయి’. ఈ సమయంలో మీరు పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు పార్టీకి అన్ని విధాలుగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అడగకపోతే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్నట్లుగా.. కోరకపోతే దేవుడు కూడా వరమివ్వడు అన్నట్లుగా.. పిటిషన్లు వేసి, మీరు న్యాయస్థానంలో నిలబడకపోతే, న్యాయం కూడా దక్కదు. అందుకే మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం’ అని ప్రశంసించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..స్వరం వినిపిస్తే జీర్ణించుకోలేని పరిస్థితి తమకు గిట్టని వారు, నచ్చని వారు ఎవరైనా ఉంటే, ఎవరైనా తమ స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకుని, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకుని పోయి వారిని జైల్లో వేయాలి. ఎలాగైనా వారిని తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టాలి. వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి ఈరోజు చూస్తున్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే తన పరువు, ప్రతిష్టతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా, ఏ తప్పు చేయకపోయినా కూడా బురద చల్లుతున్నారు. తప్పు చేశాడు అని చెప్పి, దాని కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వాటికి అసలు ఆధారాలు, సాక్ష్యాలు ఉండవు. ఏ కేసు చూసినా మోడస్ ఆపరెండి ఒక్కటే. తొలిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య బా«ధితుల తరఫున గట్టిగా నిలబడి, వారి స్వరం వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మీ పాత్ర చాలా ముఖ్యం. మన భుజాల మీద బాధ్యత మరింత పెరిగింది. ముఖ్యంగా కష్టకాలంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్సార్సీపీకి పెద్దన్నగా మీ పాత్రను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు.నాడు లీగల్ కమ్యూనిటీకి ఎంతో మేలుగతంలో మనం (వైఎస్సార్సీపీ ప్రభుత్వం) లాయర్లు, లీగల్ కమ్యూనిటీకి ఏం చేశామనేది నా కంటే, మీరే బాగా చెబుతారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ ఊహించని విధంగా యువ న్యాయవాదులకు ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా ‘లా నేస్తం’ ఇచ్చాం. అలా యువ లాయర్లకు అండగా, తోడుగా నిలిచాం. నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాలని, జీపీలు, ఏజీపీల నియామకాల్లో 52% రిజర్వేషన్ ఇచ్చాం. అది కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించి, అందులో రూ.25 కోట్లు ఖర్చు చేశాం. లాయర్ల ఇన్సూరెన్స్ పథకానికి కూడా మూడో వంతు ప్రభుత్వమే చెల్లించింది. ఇవన్నీ అప్పట్లో గర్వపడే విధంగా చేశాం. అయితే కూటమి ప్రభుత్వంలో చివరకు లాయర్లను కూడా మోసం చేశారు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ ఏవీ లేవు. అంతా మోసం. మన ప్రభుత్వంలోని పథకాలన్నీ రద్దు చేశారు. వారి హామీలు మోసాలుగా మారాయి. మరోవైపు అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయి. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగం, శాంతి భద్రతలు ఇంకా పరిపాలనలో పారదర్శకత.. ఏది తీసుకున్నా అన్నీ అస్తవ్యస్తం. అన్నింట్లో తిరోగమనం. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు.విచ్చలవిడిగా అవినీతి రాష్ట్రంలో అవినీతి మామూలుగా లేదు. విచ్చలవిడిగా సాగుతోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టుషాప్‌లు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. అందుకోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. ఎక్కడ చూసినా చట్ట విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు. అక్కడ బాటిళ్లు కాకుండా, పెగ్‌ల ద్వారా మద్యం అమ్ముతున్నారు. అదీ చట్ట విరుద్ధమే. అది కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువే. ఇసుక ఫ్రీ అన్నారు. కానీ ఎవరికీ ఇవ్వడం లేదు. అంతా దోపిడి. గతంలో మన ప్రభుత్వంలో ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాయల్టీగా వచ్చేది. ఇప్పుడు అది రాకపోగా, ఇసుక ధర రెట్టింపు అయింది. ఏ నియోజకవర్గం తీసుకున్నా కళ్ల ముందే పేకాట క్లబ్‌లు. వాటన్నింటినీ ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఇది కూడా కళ్ల ముందే కనిపిస్తున్న నిజం.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పలువురు సీనియర్ న్యాయవాదులు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.అమరావతి నిర్మాణంలో యథేచ్ఛగా దోపిడీఅమరావతి నిర్మాణం పేరుతో యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. చదరపు అడుగు రూ.4 వేలు లేదా రూ.4,500కు లగ్జరీగా ఎక్కడైనా బ్రహ్మాండంగా కట్టొచ్చు. ఆ రేటుకు హైదరాబాద్, బెంగళూరులోనూ కట్టొచ్చు. కానీ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణాన్ని రూ.9,500, రూ.10 వేలకు ఇచ్చారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, 8 శాతం తీసుకుంటున్నారు. ఇది కూడా కళ్లముందే కనిపిస్తున్న నిజం. ఇంకా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం (పీపీఏ)లోనూ అవినీతి. మనం యూనిట్ రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, అప్పుడు మనపై బురద చల్లారు. ఆ తర్వాత వాళ్లు అదే యూనిట్ విద్యుత్‌కు రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు. ఎక్కడ చూసినా అవినీతే. ఏ పని చేయాలన్నా, కంపెనీ నడపాలన్నా, మైనింగ్ చేయాలన్నా, గ్రావెల్ తరలించాలన్నా ముందు ఎమ్మెల్యేను కలవాలి. లంచం ఇవ్వాలి. వారు కొంత తీసుకుని, పైకి కొంత పంపిస్తారు. ఇన్ని మోసాలు, దారుణాలు చేస్తున్న వారికి దేవుడు తప్పక బుద్ధి చెబుతాడు. తంతే ఎక్కడ పడతారో.. వాళ్లకూ తెలియదు.వారిని చట్టం ముందు నిలబెడతాం⇒ ఇప్పుడు పార్టీ కోసం పని చేస్తున్న వారెవ్వరినీ జగన్ 2.0లో మర్చిపోము. పక్కాగా డేటా బేస్ తయారు చేయమని మన లీగల్ విభాగం ప్రతినిధులకు చెబుతున్నాను. ఆ డేటా బేస్ ఆధారంగా వారందరికీ తగిన గుర్తింపు ఇస్తాం. త్వరలోనే ఒక యాప్ వస్తుంది. దాని తయారీలో సీనియర్ లాయర్లు కూడా పాలు పంచుకుంటున్నారు. ⇒ రాష్ట్రంలో ఎక్కడ, ఏ వైఎస్సార్సీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా.. ఆ యాప్ ఓపెన్ చేసుకుని, తన పూర్తి వివరాలు, తనకు జరిగిన అన్యాయం, అది ఎవరి వల్ల జరిగింది? దానికి సంబంధించి ఉన్న ఆధారాలు అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఇక్కడ మన డిజిటల్ లైబ్రరీలో నిక్షిప్తం అవుతుంది. రేపు మనం అధికారంలోకి రాగానే, ఆ డేటా ఓపెన్ చేసి చూస్తాం. ఇప్పుడు వేధిస్తున్న వారెవ్వరినీ వదలిపెట్టబోం. చట్టం ముందు నిలబెడతాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తాం. ⇒ దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అందుకే లాయర్ల ద్వారా ఆ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో న్యాయవాదుల పాత్ర చాలా ముఖ్యం. పెద్దన్న మాదిరిగా లాయర్లు తోడుగా ఉండాలి. లాయర్ల సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -
నేడు వైయస్ జగన్ డోన్ పర్యటన
తాడేపల్లి: నేడు (బుదవారం 06.08.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ నంద్యాల జిల్లా డోన్ పర్యటన చేయనున్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొననున్న వైయస్ జగన్.ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, నంద్యాల జిల్లా డోన్ చేరుకుంటారు, అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొననున్న వైయస్ జగన్, అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మహిళా విభాగంలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరిగింది. ఐదు జోన్లకు ఐదుగురు మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ నియమించింది.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఈర్లి అనురాధ.. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు వంగా గీత.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఉప్పాల హారిక.. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కాకాణి పూజిత.. వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎస్.వి.విజయమనోహరి నియమితులయ్యారు. -
ఇంకో మూడేళ్లే ఈ కష్టాలు... చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మఠం ప్రతినిధులు ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ని కలిసిన మఠం ప్రతినిధులు.. ఆహ్వాన పత్రాన్ని అందించారు.ఆగష్టు 8 నుంచి 14 వరకు రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు జరగనున్నాయి. వైఎస్ జగన్‌కు ఆహ్వాన పత్రిక, స్వామివారి జ్ఞాపికను రాఘవేంద్రస్వామి మఠం అసిస్టెంట్ మేనేజర్ నరసింహ స్వామి, ఆలయ సూపరింటెండెంట్ అనంత పురాణిక్ అందజేశారు. -
YS Jagan: ఎక్కడ అన్యాయం జరిగినా యాప్ లో ఫిర్యాదు చేయొచ్చు
-
న్యాయవాదుల సేవలు పార్టీ మరిచిపోదు.. లీగల్ సెల్ ప్రతినిధులతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
కాసేపట్లో YSRCP లీగల్ సెల్ ప్రతినిధులతో YS జగన్మోహన్రెడ్డి భేటీ
-
తప్పుడు సాక్ష్యాలతో కేసులు.. బాబు పాలనంతా అన్యాయమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం.. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ, తప్పుడు కేసుల్లో బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలన్నారు. న్యాయవాదుల సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు అంటూ హమీ ఇచ్చారు. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. న్యాయవాదులుగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి అన్నిరకాలుగా తోడుగా, పెద్దన్నగా మీరు ఉంటున్నారు. అడకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. కోరకపోతే దేవుడైనా వరం ఇవ్వడు. పిటిషన్ వేయకపోతే, మీరు వాదనలు వినిపించకపోతే న్యాయం కూడా దక్కదు. న్యాయవాదులుగా మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారు. నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నాం.బెదిరింపులతో తప్పుడు కేసులు.. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు, ప్రతిష్టలతో ఆడుకోవడం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో నడిపిస్తున్నారు. ప్రలోభాలు పెట్టి, బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా కేవలం తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదులుగా మీ బాధ్యతలు మరింత పెరిగాయి. ఈ సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు. మన ప్రభుత్వం హయాంలో మనం అనేక రకాలుగా న్యాయవాదులకు తోడుగా నిలిచాం. లా నేస్తం పేరిట న్యాయవాదులకు అండగా ఉన్నాం. అట్టడుగు వర్గాలకు తోడుగా నిలిచాం.జీపీలు, ఏజీపీల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చాం. న్యాయవాదుల సంక్షేమ నిధికోసం రూ.100 కోట్లు కేటాయించాం. ఇన్సూరెన్స్ కోసం 1/3 వాటాగా మన ప్రభుత్వమే ఇచ్చింది. ఇన్ని రకాలుగా మనం న్యాయవాదులకు మేలు చేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాదిరిగా న్యాయవాదులను కూడా మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానివి అన్నీ అబద్ధాలు, మోసాలే. అన్ని రంగాల్లో తిరోగమనమే. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. పురోగతి, అభివృద్ధి అన్నవి కనిపించడం లేదు. అవినీతి విచ్చలవిడిగా ఉంది.పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు..జగన్ 2.Oలో మీ అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకి పనిచేసే వారికి డేటాబేస్ పెడుతున్నాం. దీని ఆధారంగానే వీరికి గుర్తింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం ఎవరు పనిచేస్తారో, వారికి ప్రాధాన్యత ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో యాప్ కూడా విడుదల చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా.. ఆ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. తన దగ్గరున్న ఆధారాలను, సాక్ష్యాలను యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఆటోమేటిక్‌గా ఇవన్నీ డిజిటల్ లైబ్రరీలోకి వస్తాయి. అన్యాయాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేయకపోయినా దెబ్బలు తింటున్న వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, అన్యాయంగా బాధ పెట్టించిన వ్యక్తికి కూడా అర్థం కావాలి.లిక్కర్లో భారీగా అవినీతి.. లిక్కర్లో అవినీతి విపరీతంగా ఉంది. ఎంఆర్పీ రేట్లకు మించి అమ్ముతున్నారు. ప్రతీ గ్రామంలోనూ వీధికి ఒక బెల్టుషాపు ఉంది. బెల్టుషాపులకూ వేలం వేస్తున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు. అక్కడ కూడా ఎమ్మార్పీ రేట్లు కన్నా అధికంగా అమ్ముతున్నారు. ఉచిత ఇసుక పేరిట దోపిడీ చేస్తున్నారు. ఉచిత ఇసుక ఎవరికి చేరుతోంది?. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. కొంతమంది పోలీసులు దగ్గరుండి పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు.అమరావతిలో కమీషన్ దందా..అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతోంది. చదరపు అడుగుకు రూ.4వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయి. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10వేలు ఖర్చు చేస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారు. 10 శాతం ఇచ్చి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారు. మనం రూ. 2.49లకు పీపీఏ చేసుకుంటే, దానిపై విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రూ.4.60 పైసలకు పీపీఏ చేసుకుంటున్నారు. అవినీతికి అంతులేకుండా పోయింది. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్, మైనింగ్, పరిశ్రమలు నడపాలన్నా.. కమీషన్లు ఇవ్వాల్సిందే. పోలీసులు దగ్గరుండి వీటికి సహకరిస్తున్నారు. కళ్ల ముందే కరప్షన్ కనిపిస్తోంది అని ఆరోపించారు. -
శిబూసోరెన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత శిబూ సోరెన్ మృతిపట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడైన శిబూ సోరెన్ మృతి దేశానికి తీరని లోటన్నారు వైఎస్ జగన్. గిరిజన సంక్షేమం కోసం శిబూ సోరెన్ చేసిన కృషి చిరస్మరణియమని కొనియాడారు. ఈ మేరకు శిబూ సోరెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు.The demise of veteran leader Sibu Soren ji is a great loss to the nation. His lifelong efforts for tribal welfare and justice will be remembered. My heartfelt condolences to his family and followers. May his soul rest in peace. pic.twitter.com/yCoAWbCZXH— YS Jagan Mohan Reddy (@ysjagan) August 4, 2025 జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూతడిషోమ్ గురు.. అందుకే ఆయన నవ్వడం మానేశారు! -
గోడకు కొట్టిన బంతిలా.. తిరగబడ్డ నెల్లూరు!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పి ఉండాలి. వైఎస్సార్సీపీ పార్టీకి కూడా ఇదో అనుభవం అని చెప్పాలి. పోలీసుల వ్యవస్థ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తే ప్రజల్లో వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా తెలియజేసినంది. ఒక నాయకుడి పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు (రోడ్లు) ధ్వంసం చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు కూడా. ప్రజాస్వామ్యాన్ని ఇంతగా పరిహాసం చేసిన సందర్భం కూడా ఇంకోటి ఉండదు. వైఎస్ జగన్ తన మీడియా సమావేశంలో వ్యక్తిగత విమర్శలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, తను ఏ సందర్భంలో టూర్‌కు వచ్చిందీ, పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ కార్యకర్తల విధ్వంస కార్యక్రమాలు వాటి విపరిణామాలపై ఎక్కువ మాట్లాడారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన జమ్మలమడుగు పర్యటనలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ.. అసలు మినహా మిగిలిన సోదంతా వెళ్లబోసుకున్నారు. 👉జైల్లో ఉన్న మాజీ మంత్రి, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు, మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని టీడీపీ మూకలు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన్ను కూడా పలుకరించే ఉద్దేశంతో జగన్ నెల్లూరులో పర్యటనకు సంకల్పించారు. గత నెల మొదటిలోనే ఈ పర్యటన ఖరారైనా హెలిప్యాడ్ కోసం పోలీసులు ఒక అటవీ ప్రాంతాన్ని చూపించడంతో వాయిదా పడింది. ఆ ప్రదేశంలోనే ఒక చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకుని టూర్ తేదీలు నిర్ధారించుకున్నారు. అంతే! ఇక అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ఆయన ప్రోగ్రాంను విఫలం చేయడానికి చాలా శ్రమ పడింది. చంద్రబాబు, లోకేశ్‌లకు వీర విధేయులైన పోలీసు అధికారులను ప్రయోగించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. జగన్ టూర్లో పాల్గొనడానికి వీల్లేదని శాసించే రీతిలో పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు నోటీసులు ఇచ్చారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులే కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారు. జగన్ టూర్లో పాల్గొంటే ఏదో జరిగిపోతుందని, కేసులు పెడతారని ప్రచారం చేశారు. టూర్ జరిగే రోజున ప్రజలు, అభిమానులు ఎవరూ రాకుండా ఉండడం కోసం పోలీసులు జేసీబీలతో రోడ్లపై గోతులు తవ్వారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఎక్కడకక్కడ ఇనుప కంచెలు వేయడం, నెల్లూరు సందులలో నుంచి కూడా జనం రాకుండా చేయాలని యత్నించడం వల్ల ప్రజలు నానాపాట్లు పడ్డారు. చివరికి అంత్యక్రియల కోసం రేవుకు వెళ్లడం కూడా కష్టమైందని నెల్లూరు వాసి ఒకరు తెలిపారు. ఇన్ని నిర్బంధాల మధ్య ప్రజలు జగన్ టూర్‌కు రారేమో అని అందరకూ అనుకున్నారు. కానీ.. వేల మంది జనం పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ రోడ్లపైకి వచ్చి విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ఈ అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. 👉ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి పార్టీని అణగదొక్కాలని అనుకుంటే అది అన్నిసార్లు అయ్యే పని కాదని నెల్లూరు ప్రజలు తెల్చి చెప్పారు. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు సర్కార్ విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. జగన్ ఏ పట్టణానికి వెళ్లినా ఇలా జనం తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారో అర్థం కాక కూటమి నేతలు తల పట్టుకుంటున్నారు. ఒక పక్క జనం వస్తున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూనే ప్రజలు రాలేదని, సాక్షి టీవీలో బంగారు పాళ్యం ప్రోగ్రాం వీడియోలోని సన్నివేశాలు ప్రసారం చేశారని ఒక అసత్య ప్రచారం పెట్టారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి అలా మాట్లాడారంటే జగన్ టూర్‌పై వారు ఎంతగా కలవరపడుతున్నది అర్థం చేసుకోవచ్చు. బంగారుపాళ్యంలో జనం విశేషంగా వచ్చారని వారే స్వయంగా ఒప్పుకున్నట్ల అయ్యిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. ప్రభుత్వం దీనిని పరాభవంగా భావించి మరింత కక్షకు దిగకుండా ఇకనైనా ప్రజస్వామ్య పద్దతిలో జగన్ టూర్లకు సహకరించడం మంచిది. పోలీసులు ఎవరైనా ముఖ్యనేత వస్తుంటే ఆయనకు భద్రతకు కల్పించడం, జనం అధికంగా వస్తున్నారనుకుంటే దానికి తగ్గట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప, జనం ఆ ప్రోగ్రాంకు రాకుండా అడ్డుకోవడమే విధిగా పెట్టుకోరాదని ఈ ఘటన రుజువు చేసింది. 👉బంతిని ఎంత గట్టిగా కొడితే అది అంతగా పైకి లేస్తుందన్న విషయం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. జగన్, చంద్రబాబుల వ్యాఖ్యలను పరిశీలిద్దాం. పాలనలో విఫలం అయినందునే చంద్రబాబు భయంతో తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ విమర్శించారు. తన పార్టీ నేతలను కలవడానికి వస్తే ఇన్ని ఆంక్షలా అని ప్రశ్నించారు. కాకాణి పై ఉన్న పలు అక్రమ కేసుల గురించి ప్రస్తావించి సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు, మీడియా సమావేశం వీడియోను పోస్టు చేసినందుకు కూడా కేసులు పెట్టారని వివరించారు. నిజంగానే ఇది చాలా శోచనీయం. రాజకీయ నేతలకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించాలి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి అమలుకాని వైనం, రైతుల కష్టాలు, ప్రభుత్వంలో అవినీతి, శాంతిభద్రతల వైఫల్యం రెడ్ బుక్ రాజ్యాంగం, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మొదలైన అంశాలను జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు వేసిన రెడ్ బుక్ విత్తు పెరిగి చెట్టు అవుతుందని, భవిష్యత్తులో అది వారికే ప్రమాదం అని హెచ్చరించారు.తమ ప్రభుత్వం వచ్చి తీరుతుందని,ఆ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని కూడా జగన్ పేర్కొన్నారు. జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు ఎక్కడా నేరుగా బదులు ఇచ్చినట్లు కనిపించలేదు. రాజకీయ ముసుగులో కొందరు అరాచకాలు సృష్టించే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో కావాలన్నది ఆయన భావన. తన కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను నానా మాటలు అన్నప్పటికీ, ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అన్నప్పుడు కాని అవేవి అరాచకంగా ఆయనకు కనిపించలేదు. స్వయంగా చంద్రబాబే పలుమార్లు పోలీసులను ధిక్కరించి హెచ్చరికలు చేయడం, టూర్లు సాగించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయి జగన్ టూర్‌ను అరాచకంగా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కోసం జనం వస్తే తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. వివేకా హత్య కేసు గురించి మాట్లాడడం అసందర్భంగా అనిపిస్తుంది. రాజకీయ పాలన చేస్తానని చెప్పడం ద్వారా టీడీపీలో అరాచకాన్ని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. మళ్లీ వస్తా.. అంతు తేలుస్తా అని జగన్ చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు దానిని విశ్వసిస్తుంటే జగన్ టూర్ లకు ఎందుకిన్ని ఆంక్షలు పెట్టడం అన్నదానికి మాత్రం జవాబు ఇవ్వరు. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా తన కుమారుడు, మంత్రి లోకేశ్ అనుభవ రాహిత్యంతో అమలు చేస్తున్న రెడ్ బుక్ వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టడం అవసరం. నెల్లూరు అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ప్రభుత్వానికే మంచిది.లేకుంటే ప్రజలలో ఆయన ప్రభుత్వమే మరింత పలచన అవుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
గ్రానైట్ క్వారీ ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి ఒడిశాకు చెందిన కార్మికులు,పొట్టకూటి కోసం వచ్చి మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఆదివారం దయం బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మీ మోసం ఇవాళ మరోసారి నిజమైంది: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మీ హామీ ఒక మోసం.. మీ ష్యూరిటీ ఇంకో మోసం.. మీ బాండ్లు మరో మోసం.. మీ గ్యారెంటీ పచ్చి మోసం’ అన్నది మరోసారి దర్శి సభ సాక్షిగా నిజమైందని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా.. ఏటా రూ.20 వేలు ఇస్తానన్న హామీని చంద్రబాబు మంటగలిపారని మండిపడ్డారు.ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5 వేలేనని.. అది కూడా ఎంత మందికి చేరిందో తెలియదన్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే.. మీరు ఉద్దేశ పూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి ఏడు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టి అన్యాయం చేశారు.హామీల అమల్లో మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ మండిపడ్డారు. అందుకే ప్రజలను మభ్య పెట్టడానికి దర్శిలో మోసపూరిత కార్యక్రమాన్ని సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని జనం గమనిస్తూనే ఉన్నారని ఎత్తిచూపారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమే కాదు.. వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు. నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్–6, సూపర్–7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతు భరోసా పథకాన్ని దారుణంగా దెబ్బ తీశారు. మీ హామీ ఒక మోసం, మీ ష్యూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే. ⇒ ఇవాళ దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంత వరకూ రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికీ వాస్తవం. ⇒ చంద్రబాబూ.. మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే, ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేని పరిస్థితులున్నా సరే, 2019 అక్టోబర్‌లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించాం. ఆ ఐదేళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి, సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచాం. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా ప్రకటించేవాళ్లం. కానీ, మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు. ⇒ మా 2019 మేనిఫెస్టోలో 4 ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 చొప్పున ఇస్తామని వాగ్దానం చేస్తే, దానికంటే మిన్నగా.. మరో రూ.1,000 పెంచి వరుసగా ఐదేళ్లు ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించి రికార్డు సృష్టించాం.⇒ కానీ చంద్రబాబూ.. మీరు కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మీరు ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని మంటగలిపారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5 వేలు. అది కూడా ఎంత మందికి చేరిందో తెలియదు. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారుల వైపు, ప్రైవేటు అప్పుల వైపు మళ్లించారు.⇒ మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు ఉద్దేశ పూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి, సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి, రైతులకు అన్యాయం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధి లేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారిని మభ్య పెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ⇒ చంద్రబాబూ.. వైఎస్సార్సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకు ముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు. ⇒ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మేం ధరల స్థిరీకరణ నిధినిపెట్టి, తద్వారా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ, మీరు దాన్ని రద్దుచేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు. ⇒ రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేశారు.⇒ మేం ప్రవేశపెట్టి, అమలు చేసి, అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లు అందించి, రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఇన్సూరెన్స్ కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గత ఏడాది కూడా మీరు బీమా సొమ్ములు కట్టక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ⇒ ఆర్బీకేలనమీ–క్రాప్‌ను, టెస్టింగ్ ల్యాబులను నిర్వీర్యం చేశారు.⇒ ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మేం అందిస్తే, తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశ పూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకు వచ్చారు. ⇒ రాష్ట్ర వ్యాప్తంగా 250 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోక పోవడం, మీ అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం. -
మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి: చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
తాడేపల్లి: ఇచ్చిన హామీలను అమలు చేయకండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు చంద్రబాబు హామీల మోసాన్ని ‘ఎక్స్’ వేదికగా ఎండగట్టారు వైఎస్ జగన్ 1, చంద్రబాబు గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. 2. మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతుభరోసా పథకాన్ని దారుణంగా దెబ్బతీశారు. మీ హామీ ఒక మోసం, మీ ష్యూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే.3. ఇవాళ దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంతవరకూ రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికీ వాస్తవమే. 4. చంద్రబాబుగారూ మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే, ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేని పరిస్థితులున్నా సరే, అక్టోబరు, 2019లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించి ఆ ఐదేళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి, సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచింది. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా ప్రకటించేవాళ్లం. కాని, మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 5. మా 2019, మేనిఫెస్టోలో 4 ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 వేలు చొప్పున ఇస్తామని వాగ్దానం చేస్తే, దానికంటే మిన్నగా, మరో రూ.1000 పెంచి వరుసగా 5 ఏళ్లు ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించి రికార్డు సృష్టించాం.1.@ncbn గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 20256. కాని, చంద్రబాబుగారూ మీరు కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా, మీరు ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని మంటగలిపారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5వేలు. అదికూడా ఎంతమందికి చేరిందో తెలియదు. ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారులవైపు, ప్రైవేటు అప్పులవైపు మళ్లించారు.7. మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి, సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి, రైతులకు అన్యాయం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధిలేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారిని మభ్యపెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని, సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.8. చంద్రబాబుగారూ…, వైయస్సార్సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకుముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు.9. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మేం ధరల స్థిరీకరణ నిధినిపెట్టి, తద్వారా రూ.7,800కోట్లు ఖర్చుచేసి రైతులను ఆదుకున్నాం. కాని, మీరు దాన్ని రద్దుచేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు.10. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు.11. మేం ప్రవేశపెట్టి, అమలుచేసి, అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లు అందించి, రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. ఇన్సూరెన్స్‌కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గత ఏడాదికూడా మీరు బీమా సొమ్ములు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. .12.ఆర్బీకేలను, ఇ-క్రాప్‌ను, టెస్టింగ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు.13. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మేం అందిస్తే, తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశ పూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకు వచ్చారు.14 .రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికిపైగా రైతులు ఆత్మహత్యచేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం, మీ అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం. -
వైఎస్సార్సీపీ నేత అశోక్‌బాబుకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్‌బాబును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అశోక్‌పై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచిన అశోక్‌పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్‌ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. రైతుల తరుపున పోరాడుతూ, వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అణిచివేయాలని చూశారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం అశోక్ చేయడం అభినందనీయం. ఆయనపై పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అశోక్‌బాబుకు అన్నివిధాలా పార్టీ అండగా నిలుస్తుంది’’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.కాగా, సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై పోలీసులు దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్‌కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు.వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్‌బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు.అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్‌బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. -
పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అమరావతి: పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.భారతదేశ జాతీయ పతాక రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/lqErkr2l3P— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2025 -
KSR Comment: లోకేష్ ఖబర్దార్.. ఇక కాచుకో.. YSRCP యాప్ రెడీ!
-
Big Question: వణుకు పుట్టించిన జనసునామి.. రంగంలోకి గోతికాడ నేతలు
-
వైఎస్సార్సీపీ యాప్‌తో పోలీసు జులుంకు చెక్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలు, ప్రత్యేకించి పోలీసుల ఆగడాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున ప్రత్యేక యాప్ తయారీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ యాప్ సాయంతో తమపై జరుగుతున్న అకృత్యాలను, ఇబ్బంది పెడుతున్న పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించి చెప్పుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీ సర్వర్‌లో భద్రంగా ఉంటాయి. 2029 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయా అధికారులపై చట్టపరంగా చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన రాజకీయ సలహా మండలి సమావేశంలో జగన్ ఈ యాప్ గురించి తెలిపారు. అయితే.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, మోపుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకూ లీగల్సాయం మాత్రం అందిస్తోంది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు జగన్ స్వయంగా భరోసానిస్తున్నారు. జైల్లో ఉన్న నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న.. నెల్లూరు వెళ్లినప్పుడు.. అంతకుముందు పొదిలి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రకరకాల ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని నేరుగా యాప్‌లోనే నమోదు చేసుకునే అవకాశం వస్తుందని అంచనా. తద్వారా ఇలాంటి ఘటనలన్ని సమగ్రంగా అందుబాటులో ఉంటాయన్నమాట. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో హింస విచ్చలవిడిగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గూండాయిజానికి బరి తెగిస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒకవేళ పిర్యాదు తీసుకున్నా కేసులు కట్టడం, కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నది వైఎస్సార్సీపీ ఆవేదన. తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నింటిని నమోదు చేశారు. అదే టీడీపీ ఫిర్యాదులకు మాత్రం వాయు వేగంతో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుపడుతుంటే, కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తాడిపత్రి వెళ్లవద్దని పెద్దారెడ్డికి చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్‌పై పలు కేసులు పెట్టి ఏడు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. పద్నాలుగు కేసులలో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ కొత్త కేసు పెట్టి తీసుకుపోయారు. ఇదేమి ప్రభుత్వం అంటూ కిషోర్ భార్య రోదించినా కూటమి సర్కార్‌కు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒక కార్యకర్త పోలీసులు తన చేతులకు ఎలా బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి వందల కిలోమీటర్లు తిప్పింది ఫేస్బుక్లో వివరిస్తే, అది చదివిన వారి కళ్లు చెమర్చాయి. తప్పు చేస్తే పోలీసులు ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చు. కాని అచ్చంగా టీడీపీ వారి కోసమే పోలీసు వ్యవస్థ అన్నట్లు పని చేయడమే దుర్మార్గం. రాజకీయ సలహామండలి సమావేశంలో జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారిని కూడా అక్రమంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకటికాదు.. అనేక కేసులలో వైఎస్సార్సీపీ కేడర్‌ను, నేతలను వేధిస్తున్న పోలీసు అధికారుల గురించి యాప్‌లో ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కూడా కొంత నిగ్రహం పాటించవచ్చునన్న భావన ఏర్పడుతోంది. పోలీసులు అందరూ ఇలా ఉన్నారని కాదుకాని కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్సార్సీపీ ఫిర్యాదు. అలాంటి వారి వివరాలు యాప్‌లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో యాప్‌లో ఫిర్యాదు చేస్తారా అని టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఎవరైనా మరింత రెచ్చిపోతారా? అన్నది కూడా చూడాలి. వైఎస్సార్సీపీ యాప్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లు ఎలా స్పందిస్తారన్నది చెప్పలేం. 2029లో కూటమి అధికారం కోల్పోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వారు కూడా ఇవే తరహా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోలీసు వర్గాలలో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా, పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను వేధిస్తే, తర్వాత కాలంలో వారు కూడా ఇబ్బంది పడతారని చెప్పడానికి ఈ యాప్ ఉపయోగపడవచ్చు. అంతేకాక వీరి ప్రవర్తనకు సంబంధించి వైఎస్సార్సీపీ యాప్‌లో నమోదైతే ఆ అధికారులకు కూడా అప్రతిష్టే. ఏది ఏమైనా ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు, కేడర్ చేస్తున్న అరాచకాలకు ఈ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Varudu Kalyani: సింహపురిలో సింహగర్జన చూసి ప్రభుత్వానికి మైండ్ బ్లాంక్ అయ్యింది
-
Anil Kumar Yadav: నిరూపిస్తే.. 950 కోట్లు మీవే..
-
KSR Live Show: జగన్ దెబ్బతో మీడియా ముందుకు పరుగులు తీసిన టీడీపీ..
-
జగన్ ని నిర్బంధించిన ఒక పార్టీ ఇప్పటికీ లేవలేదు.. గుర్తుపెట్టుకోండి..
-
జనమే సాక్షిగా.. బాబుకు జగన్ జ్వరం
-
ఏంటా జనం.. ఆలోచిస్తేనే భయమేస్తుంది.. దెబ్బకు టీడీపీ ప్రెస్ మీట్..
-
Big Question: రోడ్లను తవ్వినా.. కంచెలు పెట్టినా.. జగన్ సునామిని ఆపలేరు
-
Magazine Story: వామ్మో జగన్.. వణికిపోతున్న చంద్రబాబు
-
పార్టీ వాళ్లను నేను కలవడానికి ఇన్ని ఆంక్షలెందుకు? నెల్లూరు పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
-
పాలనలో విఫలం.. బాబులో భయం: వైఎస్ జగన్
నా పర్యటనలో ఎందుకిన్ని ఆంక్షలు పెట్టారని చంద్రబాబును, ఆయన అడుగులకు మడుగులొత్తే పోలీసులను అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వారిని కలవడం నేరమా? అలా కలవడం తప్పా? ఎందుకు ఇంతగా ఆంక్షలు విధిస్తున్నారు? నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వారొస్తే తప్పేమిటి? సందుల్లోంచి టూ వీలర్లు కూడా రాకుండా ఏకంగా రోడ్లు తవ్వేశారు. ఇంత అధ్వాన పరిస్థితిని సృష్టించిన ఘనత బహుశా ప్రపంచంలో ఒక్క చంద్రబాబునాయుడికి తప్ప మరే రాజకీయ నాయకుడికీ ఉండదేమో. తన పాలన చూసి తనే ఇంతగా భయపడుతున్నాడు. అందుకే ఈ నిర్బంధాలు, అక్రమ కేసులు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదు. -వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అందుకే తన పాలన చూసి తానే భయపడుతున్నాడని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదన్నారు. ఎవరైనా బ్రహ్మాండమైన పాలన అందించి, ప్రజల మన్ననలు, ఆశీస్సులు పొందాల్సింది పోయి.. పాలన మొదలైనప్పటి నుంచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదని, పాలనంతా అబద్ధాలు మోసాలేనని నిప్పులు చెరిగారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేముందని, ఇన్ని ఆంక్షలేంటని నిలదీశారు. గురువారం ఆయన నెల్లూరు పర్యటనలో తొలుత అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారింట్లో జరిగిన దారుణ విధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు, అనేక ఘటనలు ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయన్నారు. ‘నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు బావిలో దూకాలి. ప్రతిపక్ష నాయకుడిని చూసేందుకు వస్తున్న ఆయన అభిమానులను ఆపడం కోసం, ప్రజలను ఆపడం కోసం రోడ్లను తవ్విన చరిత్ర ఒక్క చంద్రబాబునాయుడికే దక్కుతుంది. ఈ రోజు 2 వేలకు పైగా పోలీసులు, లెక్కలేనంత మంది డీఎస్పీలను పెట్టారు. డీఐజీ కూడా ఇక్కడే తిష్ట వేశాడట. వారంతా నా సెక్యూరిటీ కోసం కాదు.. నా అభిమానులను ఆపడం కోసం వారంతా పని చేస్తున్నారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..గొంతు నొక్కేందుకే రెడ్‌బుక్ ⇒ వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. స్కూళ్లు నాశనం అయిపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఆరు క్వార్టర్ల విద్యా దీవెన పెండింగ్. ఫీజులు అందడం లేదు. దాంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. నాడు–నేడు ఆగిపోయింది. నాడు గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇచ్చాం. ఈ రోజు స్కూళ్లలో తిండి తినడానికి పిల్లలు భయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. ⇒ మా ప్రభుత్వ హయాంలో ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ క్లాసులు పెడితే వాటిని ఎత్తేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెలకు రూ.300 కోట్లు కావాలి. దాదాపు రూ.4,200 కోట్లు బకాయి పెట్టాడు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులు వైద్య సేవలు అందించడం లేదు. ⇒ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా లేదు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. వారికి రైతు భరోసా అందడం లేదు. దాన్ని చంద్రబాబు ఖూనీ చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్లుగా వ్యవసాయం మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లూ మోసాలయ్యాయి. జగ¯Œ పథకాలన్నీ రద్దు చేయడంతో పేదలు అల్లాడుతున్నారు. ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేక, వారు ప్రశ్నిస్తే ఆ గొంతును నొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం.వైఎస్సార్సీపీ అభిమానులపై లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు.. కిందపడిపోయిన మహిళ వీటికేం చెబుతారు? ⇒ చంద్రబాబూ.. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడారో చూడండి. నిన్నగాక మొన్న నగరిలో మాజీ మంత్రి రోజమ్మ గురించి మీ ఎమ్మెల్యే ఎంత హేయంగా మాట్లాడారు? ఎంత నీచంగా మాట్లాడారు? చెప్పడానికి సిగ్గు పడేలా మాట్లాడితే చంద్రబాబు ఏం చేశారు?⇒ మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కారుపై ఎంత దారుణంగా దాడి చేశారు? కారులో ఆమె, ఆమె భర్త ఉండగానే వారిని తిడుతూ దాడి చేయడాన్ని ఏమంటారు? కారు అద్దాలు పగలగొట్టారు. కర్రలతో దాడి చేసి, దుర్భాషలాడారు. అన్యాయంగా తిట్టారు. దానికి మీ డిక్షనరీలో అర్థం ఏమిటి? మా మాజీ మంత్రి రజినమ్మపై ఎంత దారుణంగా మాట్లాడారు? దానికి ఏం చెబుతారు?అంతులేని అవినీతి, ఎక్కడికక్కడ దోపిడీ ⇒ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. అంతటా లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలే అందులో ఉంటున్నారు. వారే అక్కడ లిక్కర్ మాఫియా బాస్‌గా ఉన్నారు. వేలం పాట పాడి మరీ బెల్టు షాప్‌లు కేటాయిస్తున్నారు. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లతో లిక్కర్ అమ్ముతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు.. ఇలా లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అంటూ పంచుకుంటున్నారు.⇒ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా, క్వార్ట్ ్జ యథేచ్చగా దోచుకుంటున్నారు. సిలికా ఓనర్లంతా కోర్టుకెళ్లారు. ఇక్కడ లోకల్ లీడర్ వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి) ద్వారానే సిలికా అమ్మాలంట! ఎవరికీ కూడా మైనింగ్ పర్మిట్ ఇవ్వడం లేదు. ఇందులో నారా లోకేశ్, చంద్రబాబుకు వీపీఆర్ లంచాలు పంపిస్తున్నాడు. ప్రతి మై¯Œన్లో కూడా ఎమ్మెల్యేను కలవాలి. కొంత పోలీసులకు ఇవ్వాలి. ⇒ ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే పేకాట క్లబ్‌లకే కోటి రూపాయలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఎమ్మెల్యేకు, పోలీసులకు డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే మనుషులను పంపించి పరిశ్రమల ఉత్పత్తి ఆపేస్తున్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు. ఇంకా విచ్చలవిడిగా భూములను పప్పు బెల్లాలకు అమ్మినట్లు.. ఏకంగా 30 ఏళ్లు, 40 ఏళ్లు కాంట్రాక్ట్ అంటూ రూపాయికే ఎకరం భూమి కట్టబెడుతున్నారు. మా హయాంలో యూనిట్ విద్యుత్‌ను రూ.2.47తో కొనుగోలు చేస్తే.. ఇదే మనుషులు నానా రచ్చ చేశారు. వీరేమో రూ.4.50తో కొనుగోలు చేస్తున్నారు. మీ విత్తనమే రేపు వృక్షం అవుతుంది.. ⇒ అయ్యా చంద్రబాబూ.. నీవు ఒక తప్పుడు సంప్రదాయానికి విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపు పొద్దున వృక్షం అవుతుంది. నీవు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. ఎల్లకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. మరో మూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. అప్పుడు ఇదే చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తిన తప్పుడు అధికారులు.. ఎవరైతే అన్యాయాలు చేశారో, తప్పులు చేశారో అందరి లెక్కలు తీస్తాం. అందరినీ చట్టం ముందు నిలబెడతాం. మీరు విత్తిన విత్తనం మాదిరిగానే రెండింతలుగా మీకు రాబోయే రోజుల్లో జరుగుతుంది.⇒ ఇప్పటికైనా మేలుకోమని చెబుతున్నా. మీ నైజం, మీ వైఖరి మార్చుకోమని కోరుతున్నా. అలా చేయకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం కచ్చితంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులొత్తే అధికారులందరికీ చెబుతున్నాను.⇒ కొంత మంది అధికారులు రిటైర్ అవుతాం.. లేదా వీఆర్ఎస్ తీసుకొని విదేశాలకు వెళ్తామని అనుకోవచ్చు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలి పెట్టం. ప్రతి ఒక్కరినీ పిలిపించి, మీరు చేసిన ప్రతి పనికి సంబంధించి చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడతాయి.మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసన్న ఇంటిపై దాడి చేసి.. ఆయనపైనే కేసా?నా పక్కనే ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఎవరైనా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎదుటి వారు విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడూ చూస్తుంటాం. కానీ, గతంలో ఏనాడూ జరగని విధంగా, మనుషులను చంపడానికి ఏకంగా 80–100 మందిని ప్రసన్న ఇంటి మీదకు పంపించారు. వారంతా తప్ప తాగి రాడ్లతో, కర్రలు, మారణాయుధాలతో ఇంటిపై దాడి చేశారు. కారును తిప్పి పడేశారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి.. 83 ఏళ్ల మహిళనూ బెదిరించారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే, ఆయన్ను చంపేసి ఉండేవారు. ఇంతగా దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.కాకాణిపై చిత్ర విచిత్ర కేసులు ⇒ నా పక్కనే గోవర్ధన్‌రెడ్డి కూతురు ఉంది. ఏం తప్పు చేశాడని గోవర్ధన్‌రెడ్డిని జైల్లో పెట్టారు. ఆయనపై ఏకంగా 14 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెడుతున్నారు. ఆయన్ను 64 రోజులుగా జైల్లో ఉంచారు. ఆయన మీద ఎంత అన్యాయమైన కేసులు పెట్టారో ఒక్కసారి చూడండి. ఆయన ఇక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టాడు. ఆయన న్యూస్ ఐటెమ్ మీడియాలో వస్తే, దాన్ని వాట్సప్‌లో ఫార్వార్డ్ చేస్తే, అది కేసు.⇒ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెడితే, దానికి సంబంధించిన వీడియోను ఫార్వార్డ్ చేశాడని మరో కేసు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పింది. కానీ ఉచితంగా ఎక్కడిస్తున్నారు? మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరో వైపు ఉచిత ఇసుక ఇవ్వడం లేదు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తే, దానికి గోవర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారని మరో కేసు పెట్టారు. ఎంత దారుణం?⇒ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శేషయ్య మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే, దాన్ని నిరసిస్తూ గోవర్ధన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడాడని కేసు పెట్టారు. ఇది ఎంత దారుణం? కావలి నియోజకవర్గం కోళ్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేస్తే, బాధితులను పరామర్శించి, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టితే దానిపైనా కేసు పెట్టారు. ⇒ 2024 ఎన్నికల సమయంలో లిక్కర్ పంచారని కేసు పెట్టారు. నిజానికి అప్పుడు రాష్ట్రం ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉంది. వారి ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. అప్పుడు పెట్టిన కేసుకు సంబంధించి, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్‌షీట్ కూడా వేశారు. ఏడాది తర్వాత తప్పుడు వాంగ్మూలాలతో మళ్లీ చార్జ్షీట్లోకి వెళ్లి, గోవర్ధన్‌రెడ్డిని ఇరికిస్తున్నారు. ఎంత దారుణం? ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?⇒ అక్రమంగా క్వార్ట్ ్జతవ్వకాలు జరిపారని కేసు పెట్టారు. ఆయన ఒక మంత్రిగా పని చేశారు. ఆ కేసులో పస లేదని కోర్టు నిర్ధారించి, ఆ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి ముందస్తు బెయిల్ ఇచ్చారు. అలాంటి కేసులో గోవర్ధన్‌రెడ్డి ఏ–4. కానీ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే.. అందులో ఇక్కడ తాటిపర్తి అనే గ్రామంలో ఎలాంటి క్వారీ తవ్వకాలు గత నాలుగేళ్లుగా జరగడం లేదని వీఆర్వో సిద్ధం పుల్లయ్య చెప్పాడని ఆ రిపోర్టులో రాశారు. దీంతో ఆ కేసులో పస లేదని, ఏకంగా మైనింగ్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. చంద్రబాబునాయుడిలో శాడిజమ్ అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.⇒ మాగుంట శ్రీనివాసులురెడ్డి అనే ఎంపీ.. ఆయనకు తెలియకుండా ఎవరో ఫోర్జరీ సంతకాలు పెట్టి, చట్టవిరుద్ధంగా మైనింగ్ చేశాడని మా ప్రభుత్వ హయాంలోనే కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ చేశాం. ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తి చవ్వా చంద్రబాబునాయుడు. ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి. కానీ ఆయన మీద కేసు పెట్టకుండా, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించారు. అప్పుడు మేము పెట్టిన కేసుకు సంబం«ధించి, మీరు వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, చవ్వా చంద్రబాబునాయుడిపై కేసు పెట్టకుండా, ఆయన సాక్ష్యంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద కేసు పెట్టడం ఏమిటి? ఎంత దారుణం?⇒ గోవర్ధన్‌రెడ్డి అన్న ఇల్లు రూ.100 కోట్ల రాజ భవనం అని తప్పుడు ఆరోపణలు చేశారు. మరి అదే ఈ ప్రభుత్వంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టులో ఆ ఇంటి విలువ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇలాంటివి మొత్తం 14 కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చే సమయానికి మరో కేసు పెడుతున్నారు.మీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను కూడా పంపించి ఇప్పుడు మీరు చేస్తున్న మాదిరిగా దాడి చేయించే కార్యక్రమం మొదలు పెడితే రేప్పొద్దున రాజ్యాంగం బతుకుతుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా? చంద్రబాబూ.. నీవు చేస్తున్న పనులకు, నీవు వేస్తున్న బీజాలకు సిగ్గుతో తల దించుకోవాలి. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటు వైపు, అటు వైపు స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు. అవి నచ్చకపోతే, ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అత్యంత హేయం. వైఎస్సార్సీపీ నాయకులపై కేసుల పర్వం ⇒ ఇన్ని జరుగుతున్నా ప్రజల తరఫున ఏ గొంతూ వినిపించకూడదని ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపించారు. ఎంపీగా పని చేసిన దళిత నేత నందిగం సురేష్‌ను 190 రోజులు జైల్లో పెట్టారు. మంత్రిగా పని చేసిన బీసీ నాయకుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను జైలుకు పంపించారు. వల్లభనేని వంశీని ఒక కేసు అయిన తర్వాత మరో కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు.⇒ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కాలేజీలో కలిసి చదువుకున్నప్పుడు.. చంద్రబాబును చెప్పుతో కొట్టాడని చెప్పి, అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిని జైలుకు పంపించాడు. చిన్నప్పుడు జరిగిన ఘటనను గుర్తు పెట్టుకొని ఎంత శాడిస్ట్‌గా వ్యవహరించాడో గమనించాలి. ఇన్నేళ్ల తర్వాత పెద్దిరెడ్డన్న కొడుకును జైల్లో పెట్టించాడంటే ఈ మనిషిలో విషం, రాక్షసత్వం ఎంతగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన తప్పు ఏంటో తెలియదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యే కావడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా జైల్లో పెట్టించారు. ఇదే చంద్రబాబు 1983లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17 వేల మెజారిటీతో ఓడిపోయారు. మళ్లీ 1989లో మామ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరి కుప్పం నుంచి పోటీ చేశాడు. చంద్రగిరి తన చేతుల్లో నుంచి జారిపోయిందని భాస్కర్‌ను వేధించడం మొదలు పెట్టాడు. చివరకు భాస్కర్ కొడుకు మొన్ననే లండన్ నుంచి వచ్చాడు. ఆ పిల్లోడిపై కూడా కేసు పెట్టాడు.⇒ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పేర్ని నాని భార్యపై కూడా కేసులు పెట్టి చిత్రహింసలే. అనిల్ కుమార్ యాదవ్‌ను కూడా దొంగ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తే.. ఆ కేసుల్లో దొంగ స్టేట్మెంట్లు తీసుకున్నారని సాక్షి.. జడ్జి ముందు చెప్పాడంటే ఎంత దారుణంగా దొంగ కేసులు పెడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.⇒ మరో బీసీ నాయకుడు జోగి రమేష్, మా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డిని కూడా వదలడం లేదు. వేధిస్తున్నారు. మా పార్టీ మరో సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు విక్రాంత్రెడ్డినీ వదలడం లేదు. దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, అంబటి మురళి, విడదల రజిని, దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్, మరో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, అబ్బయ్య చౌదరి, గోరంట్ల మాధవ్, సుధీర్, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పాల రాము, మొండితోక అరుణ్, ఇలా నాయకులందరిపై తప్పుడు కేసులు పెట్టారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిపైనా తప్పుడు కేసులు పెట్టారు. ఇవి కాకుండా తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారినీ వదలకుండా వేల కేసులు పెట్టి వేధిస్తున్నారు. ధైర్యంగా ఉండండి..సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ములాఖత్ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. సుమారు అరగంట పాటు కాకాణితో ములాఖత్ అయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే 14 అక్రమ కేసులు నమోదు చేసిన విషయంపై చర్చించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని కాకాణికి సూచించారు. జగన్ వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు ఉన్నారు. అనంతరం సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి జగన్ చేరుకున్నారు. మీకు మరో కొడుకుగా నేనున్నా.. ‘అధికార కూటమి నేతల దాడులకు భయపడాల్సిన పని లేదు. మీకు మరో కొడుకు లాగా అండగా ఉంటాను. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ జగన్.. ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులందరినీ ఆత్మీయంగా పలకరించారు. టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసంపై, ఆనాటి పరిస్థితులను ప్రసన్నను, ఆయన తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. వారు ఆ రోజు జరిగిన ఘటనను పూసగుచ్చినట్లు వివరించడంతో వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. కేవలం విమర్శలను తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన రౌడీలు ఇలా దాడులు చేయడం అప్రజాస్వామికం అన్నారు. విధ్వంసం జరిగి ఇన్ని రోజులైనా పోలీసులు ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. రానున్న రోజుల్లో తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని ప్రసన్న కుటుంబానికి భరోసా ఇచ్చారు. -
అడ్డుకోలేని ఆంక్షలు.. ఇనుప కంచెలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనలో పార్టీ శ్రేణులను, అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఊరూరా ఆంక్షలు, పెద్ద సంఖ్యలో చెక్‌పోస్టులు, అడుగడుగునా బారికేడ్లు, ముళ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు తుదకు రహదారులను తవ్వి.. ధ్వంసం చేసినా ప్రభుత్వ పెద్దల లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇవేవీ కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలను అడ్డుకోలేకపోయాయి. జగన్‌ను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొందరు నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి ప్రభుత్వ పెద్దలను మెప్పించే ప్రయత్నాలు చేశారు. ఇంత చేసినా ఊహించని స్థాయిలో జనం రావడంతో నెల్లూరు నగరం జన సునామీగా మారింది. వైఎస్ జగన్ గురువారం నాటి పర్యటనకు 110 మందికి మించి పాల్గొన కూడదంటూ ఆంక్షలు విధించిన ఇన్చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో గుంటూరు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల నుంచి 2వేల∙మందికిపైగా పోలీసులను మోహరించారు. పర్యటనకు ఎవరూ రాకూడదంటూ, వస్తే కేసులు నమోదు చేస్తామంటూ నిర్బంధాలకు తెర లేపారు. అర్ధరాత్రి, అపరాత్రి తేడాలేకుండా వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు సైతం హెచ్చరికలు చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నెల్లూరు సరిహద్దుల్లో పదుల సంఖ్యలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, బయట ప్రాంతాల నుంచి ఎవరూ నగరంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రోడ్లపైకి వచ్చి తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజలు పనుల నిమిత్తం నెల్లూరు నగరానికి వెళుతున్నామని చెప్పినప్పటికీ వినకుండా బలవంతంగా వెనక్కి పంపారు. ఇనుప కంచెలతో బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారులను తవ్వేశారు. చెముడుగుంటలోని హెలిప్యాడ్ వద్ద నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. డీటీసీకి వెళ్లే రహదారిలోకి ఎవరినీ అనుమతించలేదు. ఆ ప్రాంతం వారు ఎవరూ ఇల్లు విడిచి బయటకు రాకుండా నిర్బంధించారు. కర్ఫ్యూ వాతావరణంకేంద్ర కారాగారం చుట్టూ బారికేడ్లు పెట్టారు. దానికి ముందు ముళ్ల కంచెను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అనుకూల మీడియా మినహా ఇతరులు ఎవరినీ వెళ్లనివ్వలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు వెళుతున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరుల పట్ల కూడా పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. నెల్లూరు నగరం అంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. విధుల్లో ఉన్న పోలీసులంతా వైఎస్ జగన్ భద్రత కోసం కాకుండా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు జగన్ వద్దకు వెళ్లకుండా నిలువరించడానికే పని చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ సమీపంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించి భయానక వాతావరణం కల్పించారు. నెల్లూరు నగరంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సిద్దిఖ్, 42వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మస్తాన్, కుక్కలగుంటకు చెందిన ఆవుల నాగేంద్రను చిన్నబజారు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.పలువురికి సెక్షన్ 170 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ తుదకు వైఎస్ జగన్ కేంద్ర కారాగారానికి వచ్చే సమయానికి వేల మంది అభిమానులు అక్కడికి చేరుకుని జై జగన్... అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి జగన్ పర్యటన ముగిసే వరకు కనుచూపు మేర జనం పోటెత్తారు. ఆంక్షలను లెక్క చేయక జగన్ పర్యటనలో పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. -
YS Jagan Nellore Tour : అవధులు లేని అభిమానం.. ఉరకలు పరుగులు (ఫొటోలు)
-
వైఎస్ జగన్ రాకతో జనంతో కిక్కిరిసిపోయిన నెల్లూరు రహదారులు
-
జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారు: వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా నెల్లూరులో ఆంక్షలు పెట్టడం దారుణం
-
Govt Officials: రిటైర్ అయిపోయిన వదిలిపెట్టను జగన్ స్వీట్ వార్నింగ్..
-
జగన్ అభిమానులపై లాఠీ ఛార్జ్ వైఎస్ అవినాష్ రెడ్డి రియాక్షన్..
-
మిథున్ రెడ్డి అరెస్ట్ పై జగన్ రియాక్షన్
-
LIVE: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన
-
Nellore Tour: పర్యటనలో బుడ్డోడిని ముద్దాడిన జగన్
-
Nellore Tour: చిన్నారులు సైతం జగన్ కు జేజేలు
-
మా వాళ్ళని పంపిస్తే వేరేలా ఉండేది.. బాబుకు జగన్ వార్నింగ్.. జాగ్రత్త
-
మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. జననేత కోసం కదిలిన జనసంద్రం (ఫొటోలు)
-
బాబు విషబీజాలు.. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు: వైఎస్ జగన్
రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటని.. పర్యటన కోసం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. నెల్లూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.. సాక్షి, నెల్లూరు: రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటి?.. పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా.. అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు. మా పార్టీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అధ్వాన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు?. ఇవాళ వేల మంది పోలీసులు.. లెక్కలేనంత మంది డీఐజీలు, డీఎస్పీలు ఉన్నారు. వీళ్లంతా నా సెక్యూరిటీ కోసం కాకుండా.. అభిమానులను ఆపడం కోసం ఉన్నారు. సూపర్‌సిక్స్ అంటూ ప్రజలను మోసం చేశారు. నాడు నేడు ఆగిపోయింది. ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది. అన్ని పథకాలు ఆపేశారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. తన పాలన చూసి చంద్రబాబే భయపడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే రెడ్‌బుక్ రాజ్యాంగం. ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ప్రసన్న ఇంటిపైకి 80 మందిని పంపి దాడి చేయించారు. మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆ దాడితో ప్రసన్న తల్లి వణికిపోయారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకుంటే చంపి ఉండేవారేమో. ఇళ్లపై దాడులేంటి.. మనుషుల్ని చంపాలని చూడడమేంటి?. మనిషి నచ్చకపోతే చంపేస్తారా?.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో చూడలేదు. మా పార్టీ మహిళా నేతలు రోజా, ఉప్పాడ హారిక, విడదల రజిని లాంటి వాళ్లను ఉద్దేశించి టీడీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడారో అంతా చూశారు. రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటారు.. కాకాణి గోవర్ధన్‌పై 14 కేసులు పెట్టారు. కావలిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దానిని ప్రశ్నించినందుకే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకాణిపై కేసులు పెట్టారు. ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే.. దానిని వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసులు పెడతారా?. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి వేధిస్తున్నారు. ఏ తప్పు చేశాడని కాకాణిపై కేసులు పెట్టారు?. శాడిజం చంద్రబాబు నరనరాన పేరుకుపోయిందనడానికి ఇదే నిదర్శనం అని జగన్ అన్నారు.టీడీపీ కార్యకర్త సాక్ష్యం చెబితే కాకాణిపై కేసు పెడతారా?. మాగుంట శ్రీనివాసులు ఫోర్జరీ కేసులో చొవ్వా చంద్రబాబు కోసం కాకాణిపై కేసు పెడతారా?. టీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించినా కేసులు పెడతారా?. పోలీసుల పక్షపాత ధోరణిని ఎత్తి చూపించినా కేసులు పెడతారా?. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఉంటాయా?.. అని జగన్ ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాకు డాన్ చంద్రబాబే. కూటమి ప్రభుత్వంలో ఇల్లీగల్ పర్మిట్ రూంలో మద్యం అమ్ముతున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారు. మద్యం కమీషన్లు చంద్రబాబు, ఎమ్మెల్యేలే పంచుకుంటున్నారు. సిలికా, క్వార్ట్జ్ను విచ్చలవిడిగా దోచేస్తున్నారు. మైన్స్ కమీషన్లు చంద్రబాబు, లోకేష్‌కే చేరుతున్నాయి. పరిశ్రమలు నడుపుకోవాలన్నా.. ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ పరిస్థితులే ఉదాహరణలు.నందిగం సురేష్‌ను జైల్లో పెట్టారు. వల్లభనేని వంశీని చిత్రహింసలు పెట్టారు. కాలేజీ రోజుల నాటి గొడవ.. పెద్దిరెడ్డితో కోపంతోనే మిథున్‌రెడ్డిపై చంద్రబాబు లిక్కర్ కేసు పెట్టారు. తన సొంత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడనే కోపంతోనే చంద్రబాబు కేసు పెట్టించాడు. కొడాలి నాని, పేర్ని నాని.. పేర్ని నాని భార్యను, అనిల్ కుమార్ యాదవ్‌ను వేధిస్తున్నారు. ఇలా ఎంతో మంది(పేర్లు చదివి వినిపించారు) అన్యాయాలను ప్రశ్నిస్తున్నవాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టారు అని జగన్ అన్నారు.చంద్రబాబూ.. మీరు ఏదైతే విత్తుతారో అదే రేపు పండుతుంది. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. కళ్లు మూసి తెరిచేలోపే మూడేళ్లు గడుస్తుంది. అప్పుడు మా ప్రభుత్వమే వచ్చింది. అప్పుడు కచ్చితంగా చంద్రబాబుకి, చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులకు లెక్క జమ తీసి చట్టం ముందు నిలబెడుతాం. తప్పు చేసిన ప్రతీ ఒక్కరికి శిక్ష తప్పదు. ఇప్పటికైనా అది గుర్తించండి.. అని జగన్ మరోసారి హెచ్చరించారు. -
Watch Live: నల్లపరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ