NRI
-
‘నైటా’ అధ్యక్షురాలిగా ఏనుగు వాణి
ఆత్మకూరు(ఎం): అమెరికాలోని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) కొత్త అధ్యక్షురాలిగా ఏనుగు వాణి ఎన్నికయ్యారు. ఏనుగు వాణి స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని సిద్దాపురం. న్యూయార్క్ నగరంలోని రాడిసన్ హోటల్లో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కార్యవర్గాన్ని ఏడాదికొకసారి ఎన్నుకుంటారు. నైటాలో మొత్తం వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షురాలిగా ఏనుగు వాణితో పాటు మరో 8 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి చైర్మన్‌తో సహా 12 మందితో కార్యవర్గం ఎన్నికైంది. నలుగురిని సలహాదారులుగా ఎన్నుకున్నారు. ఏనుగు వాణి భర్త ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి ‘నైటా’ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఏనుగు వాణి పుట్టినిల్లు యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం సుంకిశాల గ్రామం కాగా.. ఇదే జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సిద్దాపురం మెట్టినిల్లు. 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ‘నైటా’ ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో తెలంగాణ సంప్రదాయాలను చాటిచెప్పే పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు న్యూయార్క్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. -
Sunita Williams: ఆర్నెల్లు పూర్తి.. నాసా ఏమైనా దాస్తోందా?
వారం అనుకుంటే.. అటు తిరిగి ఇటు తిరిగి అదికాస్త ఆరు నెలలు దాటేసింది. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుట్చ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి ఆరు నెలలు పూర్తైంది. మరో రెండు నెలలపాటు వాళ్లు అక్కడ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈలోపు సునీతా విలియమ్స్ ఆరోగ్యం పాడైపోయిందంటూ కథనాలు వెలువడ్డాయి. ఇంకొన్ని కథనాలైతే ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురయ్యే అవకాశాలున్నాయంటూ భయపెట్టిస్తున్నాయి. ఇంతకీ నాసా ఏమంటోంది?🚀జూన్ 5వ తేదీన బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూల్‌లో.. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారంపాటు టెస్ట్ ఫ్లైట్ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ..🚀బోయింగ్ స్టార్‌లైనర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హిలీయం లీకేజీలతో.. ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో సెప్టెంబర్ 7వ తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్ భూమ్మీదకు వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో అనే ఆందోళన మొదలైంది.🚀టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన విలియమ్స్, విల్మోర్లు.. ఐఎస్ఎస్కు ఫుల్‌టైం సిబ్బందిగా మారిపోయారు.స్పేస్‌వాక్, ఐఎస్ఎస్ నిర్వహణతో పాటు ఆ భారీ ప్రయోగశాలలో వీళ్లిద్దరితో శాస్త్రీయ పరిశోధనలు చేయించింది నాసా. అంతేకాదు.. వీళ్ల పరిస్థితిని మరో రూపకంలోనూ ‘ఛాలెంజ్’గా తీసుకుంది నాసా. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ అంతరిక్షంలో ఇరుక్కుపోయినవాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనుక ఇస్తే.. వాళ్లకు రూ.17 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని నాసా ప్రకటించింది.🚀తప్పనిసరిగా ఇద్దరూ ఎనిమిది నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపాటుకు గురి చేశాయి. తాజాగా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్లు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట.. కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు.. రోజుకి రెండున్నర గంటలపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి. 🚀అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను.. పుకార్లుగా కొట్టిపారేస్తోంది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ను అందిస్తూ వస్తోంది. కానీ, ఐఎస్ఎస్లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు.🚀సెప్టెంబర్ 19న.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఈసారి ఆమె పుట్టినరోజు జరిగింది. అయితే అంతరిక్షంలో ఇదే ఆమెకు తొలి పుట్టినరోజేం కాదు. 2012లో జులై 14 నుంచి నవంబర్ 18 మధ్య ఆమె స్పేస్‌లోనే గడిపారు.🚀భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్.. అంతరిక్షం నుంచే కోట్లాది మందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు.. జులై 26వ తేదీన ఓ సరదా వీడియోను విడుదల చేసింది నాసా. భూమికి మైళ్ల దూరంలో స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు సరదా యాక్టివిటీస్‌లో భాగం అవుతారని ‘ఒలింపిక్స్’పేరిట వీడియో రిలీజ్ చేశారు.🚀ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998 నవంబర్‌లో ఇది ప్రారంభమైంది. నాసాతో పాటు ఐదు దేశాల స్పేస్ స్టేషన్లు దీనిని నిర్వహణ చూసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లో ఎర్త్ ఆర్బిట్(LEO) వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 4 లక్షల 45 వేల కేజీలు. 59ఏళ్ల సునీతా విలియమ్స్.. ప్రస్తుతం దీనికి కమాండర్‌గా ఉన్నారు. 🚀మరో రెండు నెలల తర్వాత.. ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ -9 రాకెట్ అక్కడికి వెళ్లనుంది. అందులో సునీతా విలియమ్స్, బుట్చ్ విల్మోర్లను భూమ్మీదకు తీసుకు వస్తారు.🚀అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న భారత–అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది స్పేస్‌వాక్ చేయబోతున్నారు. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించారు. ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించడమే స్పేస్‌వాక్. 🚀భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్.. అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు. ఆమె తండ్రి గుజరాతీ. తల్లి స్లొవేనియన్. మసాచుసెట్స్‌లోని నీధమ్ హైస్కూల్లో స్కూలింగ్ పూర్తిచేసిన ఆమె.. యూఎస్‌లోని నావల్ అకాడమీలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తిచేసిన సునీత.. తొలుత అమెరికన్ నావికా దళంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. డైవింగ్ ఆఫీసర్‌గా కొన్నాళ్ల పాటు పనిచేసిన ఆమె.. అంతరిక్షంపై మక్కువతో 1998లో రోదసీ యానానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు.🚀తన తొలి పర్యటనలో భాగంగా 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు.. సుమారు ఏడు నెలల పాటు ఐఎస్ఎస్లో గడిపారామె. ఈ సమయంలోనే 29 గంటల 17 నిమిషాల పాటు ఐఎస్ఎస్ వెలుపల నాలుగుసార్లు స్పేస్‌వాక్ చేశారు. ఇది అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఇక 2012లో రెండోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లారు సునీత. ఈ క్రమంలో నాలుగు నెలల పాటు ఐఎస్ఎస్లోనే గడిపిన ఆమె.. అక్కడి ఆర్బిటింగ్ ల్యాబొరేటరీపై పరిశోధనలు చేశారు. ఈ సమయంలోనూ అంతరిక్షంలో నడిచిన ఆమె.. మొత్తంగా 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసి.. ఎక్కువ సమయం స్పేస్‌వాక్ చేసిన రెండో మహిళా వ్యోమగామిగా చరిత్రకెక్కారు. ఇలా గత రెండు స్పేస్షటిల్స్తో కలిపి మొత్తంగా 322 రోజులు అంతరిక్షంలో గడిపారు సునీత. 🚀కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండో-అమెరికన్ మహిళగా ఖ్యాతి గడించారు. ఇప్పటిదాకా రెండుసార్లు వెళ్లొచ్చారు. నాసా స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్ష యానంలోనూ భారతీయ మూలాలను ఆమె ఏనాడూ వదల్లేదు. భగవద్గీతతో పాటు ఉపనిషత్తులను, గణపతి విగ్రహాన్ని వెంట తీసుకెళ్తానని ఆమె చెబుతూ ఉంటారు. -
బీబీసీ ఆధ్వర్యంలో ప్రోస్టేట్ కేన్సర్ అవగాహన కార్యక్రమం
బీబీసీ (బెర్క్‌షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో ఇటీవల బ్రిట్‌వెల్ లైబ్రరీలో మువంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోస్టేట్ కేన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రము ద్వారా మగవాళ్ళ లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన తోపాటు బయటపడేల ఛారిటీ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.ఈ ప్రోగ్రాంకి మంచి స్పందన రావడమే గాక దిగ్విజయంగా జయప్రదమయ్యింది. వంద మందికి పైగా పురుషులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో భాగంగా ప్రోస్టేట్ కేన్సర్ అవగాహన ఛారిటీ మొత్తానికి ఎనిమిదివేల పౌండ్స్‌కి పైగా సేకరించామని అన్నారు నిర్వాహకులు. నవంబరు నెల ప్రోస్టేట్ కేన్సర్‌కు సంబంధించి కావడంతో దీనిపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి..ఛారిటీ ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రోస్టేట్ కేన్సర్ బాధితులను ఆర్ధికంగా ఆదుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం తెలుగు వారందరికి గర్వకారణమని పలువురు ప్రసంశించారు.ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన సభ్యులు :సత్యనారాయణ నోముల,సంజీవ్ అంకిరెడ్డి,రామ్ జయనతి,రవి మంచిరాజు,రవి మేకల,సత్యనారాయణ ఆవుల,శ్రీధర్ బేటి,రమేష్ బుక్క,తిరుమల కాగిత,గోవర్ధన వడ్లపంట్ల,సతీష్ చింతపండు,విశి మాణిక్ రెడ్డి తదితరులు. అలాగే ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్పాన్సర్స్ అందరికి కృతజ్ఞతా పూర్వక అభినందనలు అని కమిటీ సభ్యులు తెలిపారు .(చదవండి: న్యూజెర్సీలో మాటా ఫ్రీ హెల్త్ క్యాంప్) -
న్యూజెర్సీలో మాటా ఫ్రీ హెల్త్ క్యాంప్
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ ను ప్రారంభించింది. న్యూజెర్సీ, ఎడిసన్‌లోని సాయి దత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్‌కి విశేష స్పందన వచ్చింది. ఫ్లు ఇంజెక్షన్ తోపాటు Free Medication అందజేశారు. వాలంటీర్లు, డాక్టర్లు పాల్గొని సేవలందించారు.ఈ సందర్భంగా మాటా తరుపున చేస్తున్న సేవా కార్యక్రమాలను సంస్థ సభ్యులు వివరించారు. అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్‌లో అతి తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాటా అన్నారు. మూడు వేల మంది సభ్యులతో ప్రారంభించి.. అనేక రాష్ట్రాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఫ్రీ హెల్త్ క్లినిక్ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, డాక్టర్లందరికీ మాటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాటా సంస్థని పలువురు అభినందించారు. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు మాటా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక
హన్సిక నసనల్లి అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేశారు. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు.ఇవే కాకుండా హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు. అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ గత నాలుగు సార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూనియర్ మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తా చాటారు. హన్సిక స్వస్థలం వనపర్తి. తండ్రి శేఖర్. తల్లి ప్రశాంతిని ప్రముఖ భరత నాట్య కళాకారిణి, నటి. కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు హన్సిక.మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. చదువులో ఉన్నతస్థాయిలో రాణిస్తూ బ్రౌన్ యూనివర్సీటీ లేదా హార్వార్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by Hansika Nasanally (@hansika_pageant) (చదవండి: 12th ఫెయిల్ హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణయం.. సరైనదే అంటున్న నిపుణులు!) -
చికాగోలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి ఏటా బాలల సంబరాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా చికాగోలో బాలల సంబరాలను విజయవంతంగా నిర్వహించింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా ప్రతియేటా ఈ బాలల సంబరాలను ఓ సంప్రదాయంలా నాట్స్ వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తూ వస్తోంది.బాలల సంబరాల్లో భాగంగా తెలుగు విద్యార్ధులకు అనేక పోటీలు నిర్వహిస్తోంది. బాలల్లో సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీసేలా నిర్వహించిన ఈ పోటీల్లో 150 మందికి పైగా చిన్నారులు సంస్కృతి, సృజనాత్మకతతో కూడిన ప్రదర్శనలతో తమ ప్రతిభ చూపించారు. బాలల సంబరాల పోటీల్లో తెలుగులో ఉపన్యాస పోటీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మ్యాథ్ బౌల్, ఆర్ట్ పోటీలు, ఫ్యాన్సీ డ్రస్ ప్రదర్శనలు, ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలతో ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. బాలల సంబరాలకు వివిధ తెలుగు సంస్థల నుండి ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ప్రతి విభాగంలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. బాలల సంబరాలను విజయవంతం చేయడంలో తోడ్పడిన సలహాదారులు, స్వచ్ఛంద సేవకులు, న్యాయనిర్ణేతలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా చిన్నారులకు చికాగో చాప్టర్ కోఆర్డినేటర్ వీర తక్కెళ్లపాటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం, కృషి, అంకితభావం వల్ల నాట్స్ బాలల సంబరాలు దిగ్విజయంగా జరిగాయని అన్నారు.చిన్నారుల్లో ప్రతిభను ప్రోత్సాహించేందుకు నాట్స్ బాలల సంబరాల పోటీలు దోహద పడతాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులని అభినందించారు. బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.పోటీల్లో మహిళా జట్టు చేసిన విశేష కృషిని నాట్స్ నిర్వాహకులు ప్రశంసించారు. తెలుగు ఉపన్యాస పోటీ నిర్వహణలో హవేళ, సిరి ప్రియ, భారతి కేశనకుర్తి మ్యాథ్ బౌల్ నిర్వహణలో చంద్రిమ దాది, ఆర్ట్ పోటీకి కిరణ్మయి గుడపాటి నృత్య ప్రదర్శనలకు బిందు, లక్ష్మి ఫ్యాన్సీ డ్రస్ పోటీల నిర్వహణ కోసం రోజా చేసిన కృషికి నాట్స్ చికాగో టీం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు-నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, శ్రీనివాస్ ఎక్కుర్తి, ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారుతో పాటు అంకితభావంతో పనిచేసిన వాలంటీర్ల మాధురి పాటిబండ్ల, బిందు బాలినేని, రవి బాలినేని, రామ్ కేశనకుర్తి, శ్రీనివాస్ పిల్ల, పాండు చెంగలశెట్టి, నవాజ్, గోపిలకు నాట్స్ జాతీయ నాయకత్వం ధన్యవాదాలు తెలిపింది.బాలల సంబరాలకు సహకరించిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కె బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, కిరణ్ మందాడి, రవి తుమ్మల, కిషోర్ నారే, మురళి మేడిచెర్ల, రాజేష్ కాండ్రు, నాట్స్ బోర్డ్ మాజీ సభ్యులు మూర్తి కొప్పాక, మహేష్ కాకర్ల, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన తదితరులకు చికాగో నాట్స్ బోర్డు చాప్టర్ జట్టు కృతజ్ఞతలు తెలిపారు.బాలల సంబరాలకు ప్రాథమిక స్పాన్సర్ గా వ్యవహరించి, అందరికీ ఎంతో రుచికరమైన భోజనం అందించిన బౌల్ ఓ బిర్యానీ వారికి నిర్వాహకులు చికాగో నాట్స్ టీం ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: ఓమహాలో నాట్స్ ప్రస్థానానికి శ్రీకారం) -
ఓమహాలో నాట్స్ ప్రస్థానానికి శ్రీకారం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగువారికి మరింత చేరువ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓమాహాలో నాట్స్ తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. ఓమాహాలోని నవాబీ హైదరాబాద్ హౌస్‌లో నాట్స్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఓమహాలో నాట్స్ చాప్టర్ కో ఆర్డినేటర్‌గా మురళీధర్ చింతపల్లికి నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. శ్రీనివాస్ మల్లిపుడి జాయింట్ కో ఆర్డినేటర్ పదవి వరించింది. మహిళా సాధికారిత శ్రీదేవి కమ్మ, విరాళాల సేకరణ, సభ్యత్వం ప్రదీప్ సోమవరపు, వెబ్ అండ్ మీడియా శ్రీనివాసరావు, క్రీడలు సత్యనారాయణ పావులూరి, కార్యక్రమాల నిర్వహణ కృష్ణ చైతన్య రావిపాటిలకు నాట్స్ బాధ్యతలు అప్పగించింది. మనం చేసే సేవే కార్యక్రమాలే మనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయని నాట్స్ ఓమహా చాప్టర్ సభ్యులు సరికొత్త సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్కో అధ్యక్షుడు మదన్రా పాములపాటి కోరారు. నాట్స్ చేపట్టే సేవా కార్యక్రమాలు మన పిల్లలతో సహా భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని అన్నారు. ఓమహాలో తెలుగు వారిని ఐక్యం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నాట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల అన్నారు. ఓమహాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ ఉందనే భరోసా ఇచ్చే విధంగా నాట్స్ సభ్యులు, వాలంటీర్లు కృషి చేయాలని కోరారు. నాట్స్ డాక్టర్స్ హెల్ప్ లైన్ అందించిన సెకండ్ ఓపినీయన్స్ ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చిందని భాను ధూళిపాళ్ల వివరించారు. నాట్స్ మెంబర్షిప్ నేషనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ బాలినేని ఒమాహా బృందాన్ని అభినందించారు. ఓమహా బృందాన్ని అందరికి పరిచయం చేశారు.ఓమహాలో నాట్స్ చాప్టర్‌ను స్థానికంగా ఉండే తెలుగు వారందరిని కలుపుకుని ముందుకు సాగుతుందని నాట్స్ ఓమహా చాప్టర్ కోఆర్డినేటర్ మురళీధర్ చింతపల్లి అన్నారు.. నెబ్రాస్కా విశ్వవిద్యాలయం నుండి తెలుగు ప్రొఫెసర్లు స్థానిక సంస్థల నుంచి సీనియర్ తెలుగు నాయకులతో కూడిన విద్యార్థి కెరీర్ కౌన్సెలింగ్ బృందాన్ని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ రావుల భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి శ్రీనివాసరావు మల్లిపూడి కృతజ్ఞతలు తెలిపారు. రావు చిగురుపాటి, హిందూ దేవాలయం అధ్యక్షుడు సుందర్ చొక్కర, ప్రొఫెసర్ డాక్టర్ ఫణిలు తమను నాట్స్ జాతీయ నాయకత్వంలో భాగస్వామ్యం చేసినందుకు నాట్స్ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ చైతన్య ఈ కార్యక్రమానికి ఆడియో వీడియో సపోర్ట్‌ను అందించారు. శ్రీదేవి కమ్మ స్టేజీ డెకరేషన్లో సహకరించారు. ప్రదీప్ సోమవరపు, సత్య పావులూరిలు నాట్స్ మెంబర్షిప్ డ్రైవ్, నాట్స్ ప్రచారాన్ని ప్రారంభించారు. నవాబీ హైదరాబాద్ హౌస్‌తో సహా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి, ఒమాహాలోని తెలుగు ప్రజలందరికీ ఓమహా నాట్స్ చాప్టర్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: చికాగోలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు -
దిగ్విజయంగా ముగిసిన '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు'
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహాలో నవంబర్ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుఘనంగా ముగిసాయి. మధ్య ప్రాచ్య దేశాలలో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించుకుంది. 9 తెలుగు సంస్థల సహకారంతో నిర్వహింపబడిన ఈ చారిత్రాత్మక సదస్సుకు ప్రధాన అతిధిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విచ్చేశారు. ఖతార్ లో భారతదేశ రాయబారిశ్రీ విపుల్ కూడా సదస్సుకు హాజరై నిర్వాహకులను అభినందించారు. అమెరికా, భారత దేశం, ఉగాండా, స్థానిక ఆరబ్ దేశాలతో సహా 10 దేశాల నుంచి రెండు రోజుల పాటు సుమారు 200 మంది తెలుగు భాషా, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సుమారు 18 గంటల సేపు 60 కి పైగా సాహిత్య ప్రసంగాలు, 30 మంది స్వీయ కవిత, కథా పఠనం, 34 నూతన తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం, సినీ సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్, MSME, SERP & NRI సాధికారత శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ సదస్సుకు ప్రత్యేక అభినందనలు వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రాధిక మంగిపూడి (ముంబై), విక్రమ్ సుఖవాసి (దోహా) ప్రధాన నిర్వాహకులుగా, శాయి రాచకొండ (హ్యూస్టన్), వంశీ రామరాజు (హైదరాబాద్) దోహా ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులైన సాయి రమేశ్ నాగుల, దాసరి రమేశ్, శేఖరం.ఎస్. రావు, గోవర్ధన్ అమూరు, ఆరోస్ మనీష్ మొదలైనవారు, శ్రీ సుధ బాసంగి, శిరీష్ రామ్ బవిరెడ్డి, రజని తుమ్మల, చూడామణి ఫణిహారం మొదలైన వ్యాఖ్యాతలు 14 ప్రసంగ వేదికలను సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్తలు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, వామరాజు సత్యమూర్తి, అద్దంకి శ్రీనివాస్, కవి మౌనశ్రీ మల్లిక్, రాజ్యశ్రీ కేతవరపు, అత్తలూరి విజయలక్ష్మి, చెరుకూరి రమాదేవి, కలశపూడి శ్రీనివాస రావు, గంటి భానుమతి, గరికిపాటి వెంకట ప్రభాకర్, బి.వి. రమణ, ప్రభల జానకి, విశ్వవిద్యాలయ ఆచార్యులు అయ్యగారి సీతారత్నం, శరత్ జ్యోత్స్నా రాణి, త్రివేణి వంగారి, దేవీ ప్రసాద్ జువ్వాడి, కట్టా నరసింహా రెడ్డి, సినీ నిర్మాతలు వై.వి. ఎస్. చౌదరి, మీర్ అబ్దుల్లా, నాట్య గురువు ఎస్.పి. భారతి మొదలైన వక్తలు, కవులు వైవిధ్యమైన అంశాల మీద తమ సాహిత్య ప్రసంగాలను, స్వీయ రచనలను వినిపించారు. వరంగల్ కి చెందిన ప్రొ. రామా చంద్రమౌళి గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది, సదస్సులో భాగంగా శ్రీమతి బులుసు అపర్ణ చేసిన అష్టావధానం అందరినీ ప్రత్యేకంగా అలరించడమే కాకుండా, మధ్య ప్రాచ్య దేశాలలోనే జరిగిన తొలి అష్టావధానంగా రికార్డ్ ను సృష్టించింది. రెండవ రోజు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నిర్వాహకుల తరఫున వందన సమర్పణ కార్యక్రమంలో వదాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. దుబై, అబుదాబి, బెహ్రైన్, ఒమాన్, ఖతార్ తదితర ప్రాంతాల తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదలకి తమ వంతు కృషి చేస్తామని వివరించారు. -
డాల్లాస్‌లో మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
వాషింగ్టన్ : ఎక్కడి ఆంధ్రప్రదేశ్.. ఎక్కడి అమెరికా.. ఆంధ్రాలో ఉన్నన్ని సంప్రదాయాలు.. ఆధ్యాత్మికత అక్కడ ఎందుకు ఉంటుంది.. అది అమెరికా.. అక్కడి జనాలు వేరు.. అందరూ మనలా ఉండరు అని అనుకుంటారు. కార్తీకం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇల్లిల్లూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. నిత్యం శివారాధన.. ఆలయాల దర్శనాలు.. పూజలు.. ప్రతి ఊళ్లోనూ శివమాలలు వేసుకునే భక్తులు.. అయ్యప్ప దీక్షలు.. వీధుల్లో శరణుఘోష.. తెల్లారితే శివ స్తోత్రాలతో ఒక ప్రశాంత భావన ఉంటుంది.. ఇదే వాతావరణం అమెరికాలో ఉంటుందా ? ఆహా..అది సాధ్యమేనా .. అక్కడివాళ్లకు ఈ పూజలు భజనలు. మాలలు ఉంటాయా.. అంటే అక్కణ్ణుంచి ఒక పెద్దాయన లైన్లోకి వస్తారు.. భలేవారే మీరు అలా సులువుగా తీసిపడేయకండి. మన మాతృ భూమికి దూరంగా ఉన్నా సరే.. మెం మీకన్నా ఎక్కువగా మన సంప్రదాయాలు.. భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాం అంటారు. అంతేకాదు తనతోబాటు వందలమందికి ఈ ఆధ్యాత్మిక సౌరభాలను అందించి వారిని కూడా భక్తిమార్గంలో నడిపిస్తున్నారు.అటు కంప్యూటర్ పని ఇటు అయ్యప్ప భజనలు కొమండూరి రామ్మోహన్ .. అయన ఓ టెక్ కంపెనీ సీఈవో.. నిత్యం ప్రాజెక్టులు.. టీమ్ మీటింగులు.. కార్పొరేట్ డిస్కషన్స్ అంటూ ఏడాదంతా బిజీగా ఉంటారు. కానీ కార్తీకంలో మాత్రం అయన ఆ సీఈవో స్థానం నుంచి కాస్తా పక్కకు జరిగి గురుస్వామిగా మారతారు. అమెరికాలోని డల్లాస్.. టెక్సాస్... వాషింగ్టన్ మినియాపోలిస్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని తెలుగు యువతను ఐక్యం చేసి వారిలో భక్తిభావాన్ని నింపుతారు. ఏటా కనీసం ఐదారు వందలమందికి అయ్యప్ప మాలధారణ చేస్తారు. అంతేకాకుండా తొలిసారిగా మాలవేసుకునే ప్రతి కన్నె స్వామి ఇంటికి వెళ్లి వారు ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప పీఠాన్ని పర్యవేక్షించి నిత్య పూజలు భజనలు ఎలా చేయాలి.. ఎలాంటి ఆచారాలు పాటించాలి .. మాలధారణ తరువాత మన నడవడిక ఎలా ఉండాలి అనేది పూసగుచ్చినట్లు చెప్పి వారిని స్వాములుగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే పాతికసార్లకు పైగా మల ధారణ చేసిన రామ్మోహన్ గురుస్వామి తాను వీలు కుదిరినప్పుడల్లా శబరిమల వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకుని మాల విసర్జన చూస్తుంటానని అన్నారు. అయితే అమెరికాలో ఉంటున్నవారి పరిస్థితి ఏమిటి ? వారు మల విసర్జన ఎలా అంటే.. అమెరికాలో ప్రతి పెద్ద నగరంలోనూ అయ్య్యప్ప ఆలయాలు ఉన్నాయని, అక్కడకు వెళ్లి మాలను విసర్జిస్తాం అని అన్నారు.అత్యంత నిష్ఠతో పూజలు భజనలు అమెరికావాళ్లకు అంత టైం ఉండదు.. ఏదో అలా పూజలు చేసేసి మామ అనిపిస్తారు అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా అమెరికాలోనే అత్యంత భక్తిప్రపత్తులతో అయ్యేప్ప మండల దీక్ష చేస్తారు. ఎక్కడా నిబంధనలు అతిక్రమించకుండా భక్తులంతా వీలును బట్టి ఇళ్లలోనే పీఠాలు పెట్టుకుంటారు. లేనిపక్షంలో పదిమంది కలిసి ఒక ఇంటిని వేరేగా అద్దెకు తీసుకుని అందులో పీఠం పెట్టుకుంటారు. కొంతమంది ఐతే ఇంట్లోని పీఠంలోనే 18 మెట్లతో కూడిన పీఠం పెట్టుకుని పూజలు చేస్తారు. ముఖ్యంగా అత్యంత ఖర్చుతోకూడిన పడిపూజ చేయడానికి ఎంతో వ్యయప్రయాసలకు సైతం సిద్ధం అవుతారు. జెపి మోర్గాన్‌లో పనిచేసే సిస్టమ్స్ ఆర్కిటెక్ సప్తగిరి పద్మనాభం, ఐటి కంపెనీ మేనేజర్ శ్రవణ్, ఉత్తమ్ కుమార్ అనే మరో సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ తమకు ఈ నెలన్నారా అత్యంత ప్రశాంతమైన భావన కలుగుతుందని, అటు ఉద్యోగాలు.. ఆఫీస్ బాధ్యతలు చూస్తూనే అయ్యప్ప భజనలు.. పూజలు ఎక్కడా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. ఇదంతా తమ గురుస్వామి రామ్మోహన్ గారి ప్రోత్సహంతోనే సాధ్యం అయిందని అన్నారు. ఐటి ఉద్యోగులే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు సైతం అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.శరణు ఘోషతో మార్మోగిన డల్లాస్ తొలిసారి దీక్ష తీసుకున్న సప్తగిరి స్వామి మాట్లాడుతూ ఈ దీక్ష ద్వారా మన మనసు ప్రశాంతత వైపు పయనిస్తుందని.. నిత్యం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి సైతం విముక్తి లభిస్తుందని అన్నారు. మొన్న భారీ ఎత్తున చేపట్టిన పడిపూజకు ఐదువందలమంది దీక్షాధారులతోబాటు కనీసం రెండువేలమంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. రామ్మోహన్ గురుస్వామి మాట్లాడుతూ తాము ఒక పెద్ద గ్రౌండ్ తీసుకుని అక్కడ పడిపూజ చేస్తామని.. ఇది యావత్ డల్లాస్ లో జరిగే పెద్ద కార్యక్రమం అని.. ఇది ఈ ప్రాంతం మొత్తానికి ఆధ్యాత్మిక శోభను తెస్తుందని అన్నారు. మనిషి ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా అద్దేఆత్మికత లేకపోతె జీవితానికి సార్థకత లేదని సెప్పే గురుస్వామి రామ్మోహన్ తనకు చేతనైనంత వరకు యువతలో భక్తిభావాన్ని పెంపొందిస్తుంటానని చెప్పారు. అమెరికాలోనూ అయ్యప్ప ప్రాచుర్యం పొందడం వెనుక ఆ దీక్షలో ఉండే నియమాలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం వంటివే కారణముంది... అందుకే యువత పెద్దసంఖ్యలో ఈ దీక్ష తీసుకుంటున్నారని అయన చెప్పారు.-సిమ్మాదిరప్పన్న. -
అమెరికా ఎన్ఆర్ఐ కుటుంబానికి భారీ పరిహారం
హైదరాబాద్: విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో కోర్ ట్రాకర్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని లివ్ అపార్ట్మెంట్స్ స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన ఎన్ఆర్ఐ విద్యార్థి కొల్లి మణిదీప్ కుటుంబానికి ఆ సంస్థ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించిందంటూ సంస్థ చైర్మన్ విక్రంసాగర్ పసాలను అభినందించారు.శనివారం మాదాపూర్ టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో మణిదీప్ కుటుంబానికి భారీ నష్టపరిహారం (5.4 కోట్ల రూపాయలు) చెక్కును మంత్రి ఆందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఐటీ టెక్నాలజీ సంస్థ కోర్ ట్రాకర్ కృషి ఫలితంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందిందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ క్యూ ఆరిఫ్ బలమైన ఆధారాలు సేకరించి అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని వాదనను సమర్థవంతంగా వినిపించారని కొనియాడారు.చదవండి: కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ -
ఉన్నత చదువులకు వెళ్లి.. అనంతలోకాలకు
ఖమ్మంక్రైం: ఉన్నత చదువులు పూర్తి కాగానే తమ కుమారుడు ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. కుమారుడిని గొప్ప స్థాయిలో చూడాలని ఆశించి వారు అమెరికాకు పంపించగా అక్కడ దుండుగులు జరిగిన కాల్పుల్లో మృతి చెందాడనే సమాచారం అందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎంబీఏ చదివేందుకు వెళ్లిన ఐదు నెలల్లోనే జిల్లాకు చెందిన నూకారపు సాయితేజ(25) మృతి చెందినట్లు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.అక్క అక్కడే..ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుటుంబంతో కలిసి ఖమ్మం రాపర్తినగర్‌లోని రమణగుట్టలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య వాణితో పాటు కుమార్తె ప్రియ, కుమారుడు సాయితేజ ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే ప్రియ అమెరికాకు వెళ్లగా ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. కుమారుడైన సాయితేజ హైదరాబాద్‌లో ఇంటర్, బీబీఎం పూర్తిచేశాక అమెరికా ఎంబీఏ చేసేందుకు పంపించారు. ఆయనకు చికాగో ప్రాంతంలోని కాంకాడ్సి యూనివర్సిటీలో సీటు రావడంతో ఈ ఏడాది జూన్ 15వ తేదీన అక్కడకు బయలుదేరాడు. అమెరికా వెళ్లాక సాయితేజ మరికొందరు స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటూ పార్ట్‌టైం ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. ఖమ్మంలో ఉన్న తల్లిదండ్రులకే కాక అమెరికాలోని మరో ప్రాంతంలో ఉన్న తన సోదరి ప్రియకి ఫోన్ చేస్తుండేవాడు. వారంలో కనీసం మూడు రోజులైనా గ్రూప్ కాల్ మాట్లాడుకునేవారు. ఎంబీఏ పూర్తికాగానే మంచి ఉద్యోగం సాధిస్తానని, తల్లిదండ్రులను సైతం అమెరికా తీసుకెళ్తానని తరచుగా చెప్పేవాడు.ఏం జరిగింది...సాయితేజ అమెరికాలోని ఓ స్టోర్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఆయన క్యాష్‌కౌంటర్‌లో ఉండగా తుపాకులతో వచ్చిన దుండగులు బెదిరించడంతో డబ్బులు ఇచ్చేసి పక్కన నిల్చున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ దుండగులు అతి సమీపం నుంచి కాల్చడంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులు ఆయన స్నేహితులకు తెలపడంతో వారు కోటేశ్వరరావుకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. కాగా, శుక్రవారం కూడా సాయితేజ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడగా శనివారం ఫోన్ కోసం ఎదురుచూస్తుండగా పిడుగు లాంటి వార్త తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు. తల్లి వాణికి మృతి చెందినట్లు కాకుండా గాయాలయ్యాయని మాత్రమే చెప్పారు. అమెరికాలోని తానా సభ్యులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడి సాయి మృతదేహాన్ని త్వరగా పంపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో ఐదు రోజుల్లో మృతదేహం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.ఎంపీలు, ఎమ్మెల్సీ సంతాపంఖమ్మం మయూరిసెంటర్/ఖమ్మంవన్‌టౌన్: అమెరికాలో ఖమ్మం విద్యార్ధి నూకారపు సాయితేజ మృతి చెందడంపై ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. అలాగే, అమెరికా నుంచి సాయితేజ మృతదేహాన్ని త్వరగా రప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. కాగా, సాయితేజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పరామర్శించారు. ఆయన మృతదేహాన్ని ఖమ్మం త్వరగా పంపించేలా ఏర్పాట్లు చేయాలని తానా బాధ్యులైన లావు అంజయ్య చౌదరి, లావు శ్రీనివాస్ తదితరులను ఫోన్లో కోరారు. ఎమ్మెల్సీ వెంట నాయకులు బెల్లం వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. -
అమెరికా విద్యలో భారత్ హవా
సాక్షి, అమరావతి: అమెరికా విద్యా సంస్థల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తోంది. దాదాపు దశాబ్దంన్నర తర్వాత అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గరిష్టస్థాయికి చేరుకుంది. 2023–24లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాల్లో భారత్ వాటా 29 శాతంగా ఉన్నట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఓపెన్ డోర్స్ 2024 నివేదిక వెల్లడించింది. గత విద్యా సంవత్సరం 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుల కోసం వెళ్లారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2023–24లో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు రూ.4.22 లక్షల కోట్లు సమకూరగా ఇందులో భారత్ వాటా 20 శాతంగా ఉంది.డ్రాగన్‌ను దాటేశాం..!అమెరికా వర్సిటీలు, కళాశాలల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో చైనాను భారత్ అధిగవిుంచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2022–23లో 27.4 శాతం ఉండగా 2023–24లో 24.6 శాతానికి పడిపోయింది. 15 ఏళ్లలో ఇదే తక్కువ. గత విద్యా సంవత్సరం అమెరికాలో 11.26 లక్షల మంది అంతర్జాతీయ విద్య అభ్యసిస్తున్నట్టు నివేదిక తెలిపింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా పేర్కొంది. ఇందులో అగ్రస్థానంలో భారతీయ విద్యార్థులు (3.31 లక్షలు) ఉండగా 2.77 లక్షలతో చైనా విద్యార్థులు, 43,149 మందితో సౌత్ కొరియా విద్యార్థులు తరువాత స్థానాల్లో నిలిచారు. 64.5 శాతం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో పబ్లిక్ వర్సిటీలను ఎంచుకుంటున్నారు. 35.5 శాతం మంది స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్, పరిశోధనల కోసం ప్రైవేట్ వర్సిటీలకు వెళ్తున్నారు. ఈ ఏడాది 3 శాతం పెరుగుదల..ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలు మూడు శాతం పెరిగినట్లు స్నాప్‌చాట్ నివేదిక చెబుతోంది. యూఎస్‌లోని చాలా విద్యా సంస్థలు గ్రాడ్యుయేట్ విద్యలో ప్రవేశాలను పెంచుకునేందుకు భారత్, చైనా, ఘనా, నైజీరియాలపై దృష్టి పెట్టినట్టు తెలిపింది. 2022–23లో అమెరికాకు చెందిన 2.80 లక్షల మంది విద్యార్థులు ఇతర దేశాల్లో విద్యనభ్యసించారు. ఇటలీ, యూకే, స్పెయిన్, ఫ్రాన్స్ వారి ప్రధాన గమ్యస్థానాలుగా (45 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ (25 శాతం)లో ఎక్కువగా చేరికలున్నాయి. స్టెమ్ కోర్సులపై దృష్టి..భారతీయ విద్యార్థులకు అమెరికాలో అత్యంత ప్రాధాన్య విద్యా గమ్యస్థానాలుగా కాలిఫోరి్నయా, న్యూయార్క్, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్ నిలిచాయి. అంతర్జాతీయ విద్యార్థులలో 56 శాతం మంది స్టెమ్ కోర్సులను అభ్యసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌లో ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ ప్రవేశాల్లో 2 శాతం, ఫైన్, అప్లైడ్ ఆర్ట్స్‌లో 5 శాతం పెరుగుదల నమోదైంది. గ్లోబల్ డెస్టినేషన్..2014 నుంచి అంతర్జాతీయ విద్యార్థుల గ్లోబల్ డెస్టినేషన్‌గా అమెరికా కొనసాగుతోంది. కెనడా, యూకే తరువాత వరుసలో ఉన్నాయి. యూకేలో మొత్తం విద్యార్థుల్లో అంతర్జాతీయ విద్యార్థులు 27 శాతం, కెనడాలో 38 శాతం, ఆస్ట్రేలియాలో 31 శాతం ఉన్నారు. మరోవైపు భారత్‌ను అధ్యయన కేంద్రంగా ఎంచుకున్న అమెరికా విద్యార్థుల్లో 300 శాతం పెరుగుదల కనిపించింది. 2022–23లో భారత్‌లో చదువుతున్న అమెరికన్ల సంఖ్య 300 నుంచి 1,300కి పెరిగింది. -
టాంటెక్స్‌లో ఘనంగా ''నెలనెల తెలుగువెన్నెల'' 208వ సాహిత్య సదస్సు
డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 208 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ''తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు'' అనే అంశంపై సదస్సు రసవత్తరంగా జరిగింది. ముందుగా ఈ వేదిక లెనిన్ వేముల "హిమగిరి తనయే హేమలతే" ప్రార్ధనా గీతంతో ప్రారంభమయ్యింది. పాలక మండలి సభ్యులు సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేసి,' మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ గారి పాండిత్య ప్రతిభావిశేషాలను సభకు పరిచయం చేశారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. లెనిన్ వేముల గుర్రం జాషువా ''గబ్బిలం'' పద్య గానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. తరువాత ప్రముఖ రచయిత సత్యం మందపాటి మధురాంతకం రాజారాం, నరేంద్రలతో ఉన్న తన జ్ఞాపకాలను పంచుకొన్నారు.. మధురాంతకం రాజారాం గారి మేనల్లుడు శ్రీ భాస్కర్ పులికల్ గారు మధురాంతకం రాజారామ్ గారితో తన అనుబంధాన్ని తెలియజేయడంతో పాటు తన బావ మధురాంతకం నరేంద్రతో తన రచనల ప్రయాణాన్ని విశదీకరించడం జరిగింది . ఈ వేదికకు విచ్చేసిన ముఖ్య అతిథి ఆచార్య మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ.. తన తండ్రి మధురాంతకం రాజారాం తెలుగు, ఆంగ్లభాషలలో రచయిత, కథకులు కావడంతో తెలుగు భాషా సాహిత్యం పై మక్కువ పెంచుకొని తాను విద్యార్థి దశలోనే కథలు రాయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. కథ చదివే ప్రతి వ్యక్తిలో తద్వారా మన సమాజంలో ఒక సకారాత్మకమైన మార్పు తీసుకురావాలనేది తన ఆకాంక్షగా పేర్కొన్నారు.తన తండ్రి పేరు మీదుగా ''కథాకోకిల'' అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కొందరు మంచి రచయితలను సత్కరించడాన్ని అలవాటుగా చేసుకున్నానని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించబడడంతో భాషకి జరుగుతున్న నష్టాలను సోదాహరణంగా వివరిస్తూ తొండనాడు చరిత్ర ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడుఅనీ రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉందనీ తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల రచనలను పరిశీలించినపుడు తెలుగు తమిళ భాషలు పెనవేసుకొని ఉండడాన్ని గమనించవచ్చు అని చెప్పారు. మన నుంచి విడిపోయినప్పటికీ ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి, నాగర్ కోయిలు, తూత్తుకుడి,శ్రీ విల్లి పుత్తూరు, మదురై, తంజావూరు, తిరువాయూరు, కోసూరు, ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికముగా ఉందన్నారు. తెలుగు తమిళ భాషలు రెండూ వారి దైనందిన జీవితంలో భాగం కావడం గమనించదగిన విషయమన్నారు. అదేవిధంగా మాండలిక భాష రచనలను ప్రస్తావిస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే ఉత్తమ విధానమని అన్నారు. తరువాత మధురాంతకం రాజారామ్ గారితో అమెరికాలో అనుభవాలను డాక్టర్ బోయారెడ్డి సాహితీ ప్రియులతో పంచుకొన్నారు. సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర , ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, డాక్టర్ కోట సునీల్, గోవర్ధనరావు నిడిగంటి నరేంద్ర గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, తదుపరి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, పాలకమండలి ఉపాధిపతి శ్రీ హరి సింఘం మరియు సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి మధురాంతకం నరేంద్ర గారికి టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందన్నారు ఆచార్య మధురాంతకం నరేంద్ర . సభలో ప్రత్యక్షంగా, అంతర్జాలంలో అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. చివరిగా దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు, తమ అధ్యక్షోపన్యాసంలో, సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ,ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనలు తెలిపారు అధ్యక్షులు సతీష్ బండారు. (చదవండి: తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం') -
దివ్యాంగులకు హోఫ్4 స్పందన చేయూత
దివ్యాంగులకు అండగా నిలవాలనే సంకల్పంతో కృషి చేస్తున్న అమెరికాలోని హోఫ్4స్పందన సేవా సంస్థ తెలుగునాట వేల మంది వికలాంగులకు సాయం అందిస్తుంది. ఈ క్రమంలోనే అనంతపురంలోని కాటగానికాలువ గ్రామంలో ఆశ్రయ అనాధశ్రమానికి హోఫ్4 స్పందన అండగా నిలిచింది. ఈ ఆశ్రమంలో అనాధ మానసిక వికలాంగులకు శాశ్వత నివాసం కల్పించేందుకు కావాల్సిన ఆర్ధిక సహకారాన్ని అందించింది. అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, ఏకాంశ సంస్థలు ఈ సత్కార్యానికి సాయం చేశాయి. హోఫ్4 స్పందన నిర్వాహకులు లక్ష్మీ నరసింహం కోట తాజాగా అనంతపురంలోని ఆశ్రయ అనాధశ్రమం కోసం నిర్మిస్తున్న శాశ్వత షెల్టర్‌ను పరిశీలించారు. దాదాపు 70 శాతం పూర్తయిన ఈ షెల్టర్ అనాధ మానసిక వికలాంగులకు ఆవాసంగా మారనుంది. సమాజ సేవ కోసం హోఫ్4 స్పందన పిలుపుతో స్పందించి సాయం చేసిన నాట్స్, ఏకాంశ సంస్థలకు లక్ష్మీ నరసింహ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటితో పాటు హోఫ్4 స్పందన ఆశయ సిద్ధికి అండగా నిలిచిన నాట్స్ నాయకులు శ్రీధర్ అప్పసాని, మురళీకృష్ణ మేడిచెర్ల లకు ధన్యవాదాలు తెలిపారు. 25 ఏళ్లుగా అనాధ మానసిక వికలాంగుల కోసం ఆశ్రయ అనాధశ్రమం ద్వారా కృషి చేస్తున్న కృష్ణారెడ్డి సేవలు అభినందనీయమని లక్ష్మీ నరసింహ అన్నారు. వందమందికిపైగా మానసిక వికలాంగులకు ఈ కొత్త షెల్టర్ ఉపయోగపడనుంది.(చదవండి: ఫ్రాంచైజ్ బిజినెస్‌పై నాట్స్ వెబినార్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం) -
ఫ్రాంచైజ్ బిజినెస్‌పై నాట్స్ వెబినార్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ప్రాంచైజ్ బిజినెస్‌పై ఆన్లైన్ వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ఉండే తెలుగువారి ఆర్థిక భద్రతకు, స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని అందించే విధంగా నాట్స్ ఈ వెబినార్‌కు శ్రీకారం చుట్టింది. 250 మందికి పైగా తెలుగువారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలో ప్రముఖ వ్యాపారవేత్త, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ టి.పి.రావు ఈ వెబినార్‌లో ప్రాంచైజీ బిజినెస్ పై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో స్థిరమైన వ్యాపారం ప్రాంచైజెస్‌ల వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. మార్కెట్ పై అవగాహన పెంచుకోవడం, సరైన ప్రాంతాలను, ప్రాంచెజ్ పెట్టే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడంలోనే సగం విజయం దాగుందని టి.పి.రావు వివరించారు. మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ప్రాంచైజ్‌స్‌లతో రిస్క్ తక్కువగా ఉంటుందని, కానీ ప్రాంచైజ్ ప్రారంభించిన తొలినాళ్లలో దాని నిర్వహణ, వ్యవస్థాగతంగా దాన్ని బలోపేతం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి నిలిపితే చక్కటి లాభాలు ఉంటాయని తెలిపారు. ప్రాంచైజ్‌స్ పై అవగాహన కల్పించడంతో పాటు ప్రాంచైజస్ ఏర్పాటు తన వంతుగా చేతనైన సహకారం అందిస్తానని టి.పి. రావు వెబినార్‌లో పాల్గొన్న వారికి హామీ ఇచ్చారు. సమయం, ధనం వెచ్చించి పట్టుదలతో ముందుకు వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రాంచైజస్ చక్కటి మార్గమని తెలిపారు. ఈ వెబినార్‌కు నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి అనుసంధానకర్తగా వ్యవహరించారు. చాలా మంది ఔత్సాహికులు ప్రాంచైజ్ నిర్వహణ, ప్రాంచైజస్ బిజినెస్‌లో వచ్చే ఇబ్బందుల గురించి తమ సందేహాలను టి.పి.రావుని అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రస్తుత యూఎస్ గవర్నమెంట్లోఉద్యోగుల డోలాయమాన పరిస్థితుల్లో ఇటువంటి వెబినార్స్ యువతకు ఎంతో సహాయకారకం గా ఉంటాయని నాట్స్ ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ చెబుతూ టి.పి.రావు ను అభినందించారు. ఆన్లైన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందు టి.పి.రావు,కిరణ్ మందాడిలను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు) -
డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్‌లో బాలల సంబరాలు ఘనంగా నిర్వహించింది. భారత మాజీ ప్రధాని నెహ్రు జయంతి సందర్భంగా ప్రతి యేటా నాట్స్ డల్లాస్ విభాగం బాలల సంబరాలు నిర్వహిస్తోంది. గత పద్నాలుగు ఏళ్లుగా ఓ సంప్రదాయంలా నిర్వహిస్తున్నఈ సంబరాలను ఈ సారి ప్రిస్కో నగరంలో వండేమేట్టర్ మిడిల్ స్కూలులో ఘనంగా జరిపింది. బాలల సంబరాల్లో భాగంగా చదరంగం, గణితం, సంగీతం నృత్యం, తెలుగు పదజాలం, తెలుగు ఉపన్యాసం విభాగాల్లో జరిగిన పోటీల్లో దాదాపుగా 250 కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో దరఖాస్తు చేసుకున్న పిల్లల్ని వివిధ వయసుల వారీగా విభజించి ఈ పోటీలు నిర్వహించారు. నాట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు విద్యార్థులే కాకుండా, ఇతర ప్రవాస భారతీయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ సంగీతం, నృత్యంతో పాటు సినిమా సంగీతం, నృత్యం విభాగాల్లో జరిగిన పోటీల్లో బాల బాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలుగు పదజాలం, తెలుగు ప్రసంగ పోటీల్లో అనర్ఘళంగా తెలుగు మాట్లాడి అతిథులను అబ్బురపరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో దాదాపు 90 మందికి పైగా పిల్లలు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. డల్లాస్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి నేతృత్వంలో ఈ బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు మూడు నెలల ముందు నుండే పక్కా ప్రణాళికతో బాలల సంబరాలను నాట్స్ డల్లాస్ బృందం విజయవంతం చేసింది.నాట్స్ బాలల సంబరాలకు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఉప కోశాధికారి రవి తాండ్ర, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, మీడియా రిలేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ కిషోర్ నారెలు ఇచ్చిన అమూల్యమైన సూచనలు, మార్గదర్శకత్వం బాలల సంబరాల విజయానికి దోహదపడ్డాయని స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి తెలిపారు.డల్లాస్ చాప్టర్ సలహా బోర్డు సభ్యులు సురేంద్ర ధూళిపాళ్ల, కవిత దొడ్డ, డీ వీ ప్రసాద్, రవీంద్ర చుండూరు, డాలస్ చాప్టర్ జట్టు సభ్యులు సౌజన్య రావెళ్ల , కావ్య కాసిరెడ్డి, పావని నున్న, శ్రీనివాస్ ఉరవకొండ, కిరణ్ నారె, ఉదయ్, నాగార్జున, బద్రి బియ్యపు, మోహన్ గోకరకొండ, యూత్ టీం నుండి నిఖిత, సహస్ర, ప్రణవి, వేద శ్రీచరణ్, అద్వైత్, ధృవ్, పావని, అమితేష్, ఈశ్వర్, చంద్రాంక్ తదితరులు నాట్స్ బాలల సంబరాల్లో పాల్గొని విద్యార్ధులను ప్రోత్సహించారు.బాలల సంబరాలను జయప్రదం చేసిన జట్టు సభ్యులకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, న్యాయనిర్ణేతలకు, దాతలకు, యువ సభ్యులకు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి ధన్యవాదాలు తెలిపారు. ఈ బాలల సంబరాలను పద్నాలుగు సంవత్సరాలక్రితం డల్లాస్ నగరంలో ఏర్పాటుచేసి, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, మరిన్ని నాట్స్ చాఫ్టర్లు ఉన్న నగరాలకు విస్తరించామని తెలిపారు. మన ప్రవాస భారతీయ పిల్లలకు, ప్రత్యేకంగా తెలుగు వారి పిల్లలకు, వారి ప్రతిభను, నాయకత్వ లక్షణాలను, పోటీతత్వాన్ని పెంపొందించే అవకాశాలను కల్పించటం చాలా సంతోషంగా ఉందని బాపు నూతి అన్నారు. ఈ బాలల సంబరాలలో ప్రతి సంవత్సరం పాల్గొనే పిల్లల సంఖ్య పెరుగుతుండటంపై బాపు హర్షం వ్యక్తం చేశారు. స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వోల్డీలక్స్ మరియు ఫార్మ్2కుక్ లకు నాట్స్ డల్లాస్ చాప్టర్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గత 14 సంవత్సరాలుగా బాలల సంబరాలను దిగ్వజయంగా నిర్వహిస్తున్న డల్లాస్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు అధ్యక్షులు మదన్ పాములపాటిలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ ప్రస్థానం) -
మిస్సోరీ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన నాట్స్
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలబడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నాట్స్ జాతీయ నాయకత్వం అండదండలతో మిస్సోరీ చాప్టర్ నూతన కార్యవర్గం ముందుకు సాగనుంది. నాట్స్ సలహా మండలి సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ బోర్డ్ డైరక్టర్లు శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాట్స్ సోషల్ మీడియా నేషనల్ కో ఆర్డినేటర్ సంకీర్త్ కటకంల పర్యవేక్షణలో మిస్సోరీ నూతన కార్యవర్గం పనిచేయనుంది. మిస్సోరి చాప్టర్ కో ఆర్డినేటర్ గా సందీప్ కొల్లిపర, జాయింట్ కో ఆర్డినేటర్‌గా అన్వేష్ చాపరాల లను నాట్స్ నాయకత్వం నియమించింది. నాట్స్ మిస్సోరీ సభ్యత్వ నమోదు చైర్ తరుణ్ దివి, క్రీడా వ్యవహారాలు చైతన్య పుచ్చకాయల, కార్యక్రమాల నిర్వహణ నవీన్ కొమ్మినేని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హరీశ్ గోగినేని, నిధుల సేకరణ శ్రీకాంత్ కొండవీటి, వెబ్ & మీడియా చైర్ రాకేష్ రెడ్డి మరుపాటి, యువజన కార్యక్రమాలు హరి నెక్కలపు, సాంస్కృతిక అంశాలు మధుసూదన్ దద్దాల, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ యుగేందర్ చిలమకూరి, ఇమ్మిగ్రేషన్ చైర్ మురళీ బండారుపల్లి, హాస్పిటాలిటీ చైర్ నరేష్ రాయంకుల, హాస్పిటాలిటీ కో చైర్ సునీల్ సి స్వర్ణ, హెల్ప్ లైన్ చైర్ దేవి ప్రసాద్, హెల్ప్ లైన్ కో చైర్ చైతన్య అప్పని లకు బాధ్యతలు అప్పగించింది. నాట్స్ మిస్సోరీ చాప్టర్ 2.0 కు అప్పలనాయుడు గండి, శివకృష్ణ మామిళ్లపల్లి, మధు సామల, కవిత ములింటిలను సలహాదారులుగా నియమించింది. ఈ కమిటీల సభ్యులందరూ, మిస్సోరి నాట్స్ సభ్యులకు అండగా నిలవనున్నారు.నాట్స్ మిస్సోరీ నూతన కార్యవర్గానికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు. మిస్సోరీలో నాట్స్ ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు నాట్స్ మిస్సోరీ టీం కృషి చేయాలని వారు కోరారు.(చదవండి: గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ ప్రస్థానం) -
గ్రేటర్ ఓర్లాండోలోనాట్స్ ప్రస్థానం
అమెరికాలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన శాఖలను విస్తరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ చాప్టర్‌ని ప్రారంభించింది. గ్రేటర్ ఓర్లాండోలోని మా దుర్గా కన్వెన్షన్ హాల్లో నాట్స్ చాప్టర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు వారి కోసం గ్రేటర్ ఓర్లాండోలో ప్రారంభమైన ఈ చాప్టర్‌కు కో ఆర్డినేటర్‌గా రావి రవి కుమార్‌కు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. వేణు మల్ల, శ్రీధర్ గోలీ, శ్రీదేవి మల్ల, మీనా నిమ్మగడ్డ, లక్ష్మి అంగ, శేషు అచంట తదితరులు నాట్స్‌లో పలు శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు. నాట్స్ ఉన్నతమైన విలువలు పాటిస్తూ సామాజిక సేవలో వేస్తున్న అడుగులు అందరికి ఆదర్శంగా మారాయని.. గ్రేటర్ ఓర్లాండో నాట్స్ ప్రతినిధులు కూడా ఆ దిశగా కృషి చేసి నాట్స్ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేయాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి కొత్త జట్టు చురుకుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాట్స్ ఉచిత వైద్య సేవలతో తెలుగు వారికి చేరువైన వైనాన్ని నాట్స్ బోర్డు సభ్యులు టీపీ రావు వివరించారు. నాట్స్‌లో మహిళా సాధికారత, యువతను నాట్స్‌లో భాగస్వామ్యం లాంటి అంశాలపై నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి గ్రేటర్ ఓర్లాండో నాట్స్ సభ్యులకు దిశా నిర్ధేశంచేశారు. తెలుగు వారంతా ఎక్కడ ఉన్నా ఐక్యతగా ఉండాలని.. అదే మనకు, నాట్స్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని ప్రసాద్ ఆరికట్ల తెలిపారు. గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ బాధ్యతలు తీసుకున్న వారంతా చిత్తశుద్ధితో పనిచేస్తారనే నమ్మకం తనకు ఉందని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అన్నారు.గ్రేటర్ ఒర్లాండో చాప్టర్ జట్టు సభ్యులకు తన అభినందనలు తెలిపారు. తన మీద ఉన్న నమ్మకంతో గ్రేటర్ ఓర్లాండో బాధ్యతలు అప్పగించిన నాట్స్ బోర్డుకు నాట్స్ గ్రేటర్ ఓర్లాండో కో ఆర్డినేటర్ రవికుమార్ ధన్యవాదాలు తెలిపారు. తనపై, తన టీం సభ్యులపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేలా గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ కోసం పనిచేస్తామని రవికుమార్ హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ జాతీయ నాయకత్వంతో పాటు నాట్స్ వివిధ రాష్ట్రాల్లోని ఆయా చాప్టర్ల నాయకులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. నాట్స్ సౌత్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సుమంత్ రామినేని, శ్రీనివాస్ మల్లాది, భాను ధూళిపాళ్ళ తో పాటు నాట్స్ టాంపా బే చాప్టర్ సభ్యులు పాల్గొన్నారు. చాప్టర్ ప్రారంభోత్సవానికి సహకారం అందించిన దాతలు బావర్చీ, పెర్సిస్, హైదరాబాద్ కేఫ్, నాన్‌స్టాప్, నాటు నాటు, ఇంచిన్స్, శివి కేక్స్, మరియు స్మార్ట్ గ్లోబల్ వంటి సంస్థలకు గ్రేటర్ ఓర్లాండో నాట్స్ టీం తమ ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం) -
చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. అమెరికన్ సమాజంలో సామాజిక బాధ్యతను విద్యార్ధులకు అలవర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం నిర్వహించిన ఈ హైవే దత్త కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్లు, విద్యార్ధులు పాల్గొని హైవేను శుభ్రం చేశారు. అమెరికాలో సామాజిక సంస్థలు రోడ్లను, పబ్లిక్ ప్లేస్‌లను దత్తత తీసుకుని వాటిని శుభ్రం చేస్తుంటాయి. నాట్స్ కూడా ఇందులో నేనుసైతం అంటూ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అడాప్ట్ హైవే కార్యక్రమాన్ని నాట్స్ నిర్వహిస్తూ వస్తుంది. చికాగోలో నిర్వహించిన ఈ హైవే దత్తత కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్కని సమాజం కోసం స్వచ్ఛందంగా పనిచేసేలా భావితరాన్ని ప్రోత్సాహించారు. ఇలా సమాజం కోసం విద్యార్ధులు వెచ్చించిన సమయాన్ని అక్కడ కాలేజీలు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. నాట్స్ హైవే దత్తత కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలరందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, వీర తక్కెళ్లపాటిలు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో హైవేను పరిశుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చికాగో చాప్టర్ సభ్యులు ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారు, శ్రీనివాస్ ఎక్కుర్తి, రమేష్ జంగాల, దివాకర్ ప్రతాపుల, సునీల్ ఎస్, నిపున్ శర్మలు ఈ హైవే దత్తతకు చక్కటి మద్దతు, సహకారం అందించారు.భావితరాలకు ఎంతో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమం కోసం చికాగో చాప్టర్‌కి దిశా నిర్థేశం చేసిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, మాజీ బోర్డు సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బొప్పనలకు నాట్స్ చికాగో విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచే ఎంతో ఉపయుక్తమైన హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ చికాగో విభాగాన్ని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: -
తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం'
డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగ్ఙు పేరిట నిర్వహిస్తున్న 74వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “మన భాష మన యాస “మాండలిక భాషా అస్తిత్వం అనే కార్యక్రమం వైభవంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం పలికి వివిధ ప్రాంతాల మాండలిక భాషలు వాటి సొగసును సోదాహరణంగా వివిరించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే గాక తెలుగునేలనుండి తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలతో పాటు శ్రీలంక, మయన్మార్, మారిషస్ మొదలైన దేశాలకు వలసవెళ్ళిన తెలుగు కుటుంబాలవారు కూడా వివిధ రకాల యాసలతో తెలుగు భాషను సజీవంగా ఉంచడానికి శతాబ్దాలగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాండలిక భాషలోఉన్న సహజ సౌందర్యం నిరాదరణకు, నిర్లక్ష్యానికీ గురికాకుండా అస్తిత్వం నిలుపుకుంటూ మాండలిక భాషలో ఎంతో సాహిత్య సృజన చేయవలసిన అవసరం ఉందన్నారు మన దేశంలోనే ఒక లంబాడీ గిరిజన మహిళ ఒక విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎన్నికకాబడిన తొలి మహిళ ‘వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ’ ఉపకులపతి ఆచార్య డా. సూర్యా ధనంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని “ఇలాంటి ముఖ్యమైన అంశంమీద సమావేశం నిర్వహిస్తున్న తానా ప్రపంచసాహిత్యవేదిక కృషిని అభినందిస్తూ, మాండలిక భాషలతో పాటు, లిపిలేని లంబాడీ భాషల లాంటి భాషలకు లిపిని కల్పించి పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లిపి ద్వారా ఆయా తెగల జీవన విధానం, ఆచార వ్యవహారాలను సజీవంగా చిత్రీకరించవచ్చు అన్నారు.్ఙ విశిష్టఅతిథిగా పాల్గొన్న సుప్రసిద్ధ రచయిత, ఆంధ్రప్రదేశ్ పూర్వ భాషా, సాంస్కృతిక శాఖా నిర్దేశకులు డా. డి. విజయభాస్కర్ ‘ఉత్తరాంధ్ర యాస’ అస్తిత్వంపై శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం ప్రాంతాల ప్రజల యాసల మాధుర్యాన్ని, ఆ సాహిత్య సృజనచేసిన ఆయా ప్రాంత కవుల, రచయితల పాత్రను వివరించారు. లిపిలేని “రెల్ల్ఙి జాతికి చెందిన ప్రముఖ రచయిత మంగళగిరి ప్రసాదరావు పారిశుద్ధ్య కార్మికులుగా రెల్లి కులస్తులు చేస్తున్న సేవ, రెల్లి భాషకు లిపి కల్పిస్తేనే, ఇంకా ఎక్కువ సాహిత్యం వస్తేనే, వారి జీవనవిధానం పైన యితరులకు అవగాహన కలుగుతుంది అన్నారు. విద్యారంగంలో 50కు పైగా డిగ్రీలు సాధించిన అరుదైన విద్యావేత్త, వృత్తిపరంగా మానసిక వైద్యనిపుణులు, రాజమహేంద్రవరంవాసి, ‘అర్థంపర్థం’ అనే శీర్షికతో ఇప్పటికే ఏడువందలకు పైగా ఎపిసోడ్స్ రాసిన తెలుగు భాషాభిమాని డా. కర్రి రామారెడ్డి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. చింతకుంట శివారెడ్డి రాయలసీమ మాండలికంలో నిత్యం వాడుకలోఉండే అనేక పదాలకు అర్థాలు, వాటి విశిష్టతను ఆసక్తికరంగా పంచుకున్నారు. తెలంగాణ ప్రాంత వాసి, ప్రస్తుతం కాశీ హిందూ విశ్వవిద్యాలయం, వారణాశిలో భాషాశాస్త్రంలో సహయాచార్యులుగా ఉన్న డా. గట్ల ప్రవీణ్ తెలంగాణా భాషా మాధుర్యాన్ని, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మాండలిక భాషల వ్యత్యాసాలను సోదాహరణంగా వివరించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల ప్రజల మాండలిక భాషను ఒకే వేదికమీద ఒకేసారి సమీక్షించడం ఒక్క తానా ప్రపంచసాహిత్యవేదికకు మాత్రమే సాధ్యమైంది అన్నారు. ఎంతో సమయం వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును: https://youtube.com/live/pd6wroBTRLg -
జపాన్‌లో ‘తాజ్’ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు
పుణ్య కార్తీకమాసం సందర్భంగా వనభోజనాల కార్యక్రమాన్ని జపాన్‌లోని తెలుగు అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. జపాన్‌లో నవంబర్ 24, ఆదివారం, తాజ్ (Telugu Association of Japan) అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ వేడుక ఆద్యంతం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం పిల్లలు, పెద్దలు విందు భోజనాన్ని ఆరగించారు. -
అట్లాంటా: పేద రోగులకు భరోసా.. ‘శంకర నేత్రాలయ’ నిధుల సేకరణ కార్యక్రమం
శంకర నేత్రాలయ అమెరికా సంస్థ (SN USA) అట్లాంటాలో ఈ నెల 17న ఒక అద్భుతమైన శాస్త్రీయ నృత్య కార్యక్రమాన్ని పేద రోగుల దృష్టిని పునరుద్ధరించే మహత్తర కార్యం కోసం నిధులను సేకరించే లక్ష్యంతో నిర్వహించింది. ఈ కార్యక్రమంతో శంకర నేత్రాలయ అమెరికా సంస్థ $1,300,000(సుమారు రూ.10 కోట్లు పైన)ని సేకరించింది. ఈ నిధులు ద్వారా 20,000 కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేయవచ్చు.అట్లాంటాకు చెందిన నాలుగు ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య అకాడమీల నుంచి సుమారు 100 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలతో వేదికను అలంకరించడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతమయ్యింది. ప్రతి నృత్యం ప్రేక్షకుల నుంచి గర్జించే చప్పట్లు అందుకుంది, ఇచ్చిన ప్రదర్శనలు:నేపధ్యం : వాసవీ కన్యకా పరమేశ్వరిఅకాడమీ ఆఫ్ కూచిపూడి నృత్య గురువు: శశికళ పెనుమర్తినృత్యకారుల సంఖ్య: 17నేపధ్యం : శరణం అయ్యప్పకలైవాణి డ్యాన్స్ అకాడమీ గురువు: పద్మజ కేలంనృత్యకారుల సంఖ్య: 13నేపధ్యం : నాద బ్రహ్మ శంకరశ్రీవాణి కూచిపూడి అకాడమీ గురువు: రేవతి కొమండూరినృత్యకారుల సంఖ్య: 13నేపధ్యం : పంచభూత ప్రశస్తినటరాజ నాట్యాంజలి కూచిపూడి అకాడమీ గురువు: నీలిమ గడ్డమణుగునృత్యకారుల సంఖ్య: 50ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని విద్యాసంస్థలకు, గురువులకు, విద్యార్థులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నిర్వాకులు తెలిపారు. ఈ కార్యక్రమం కళ మాత్రమే కాకుండా సమాజం, దాతృత్వం వంటి వాటికి ప్రేరణగా నిలిచింది. ప్రతి నృత్యకారిణి, వాలంటీర్ అవసరమైన వారి కోసం నిధులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. పేద రోగుల దృష్టిని పునరుద్ధరించే ఉదాత్తమైన లక్ష్యం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవకులు, దాతలందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ..అట్లాంటా హిందూ దేవాలయం నుంచి పూజారి పవన్ కుమార్ క్రిస్టాపతి పవిత్ర మంత్రాలతో సత్కారాలు ప్రారంభించారు.మెగా డోనర్ ప్రసాద రెడ్డి కాటంరెడ్డి, అతని భార్య శోభా రెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని నిర్వాకులు తెలిపారు. దురదృష్టవశాత్తు, ప్రసాద రెడ్డి గారి ప్రియమైన తల్లి ఇటీవల మరణించడంతో, దంపతులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో డోనర్ ప్రసాద రెడ్డి గారి తల్లిగారి ఆత్మకు శాంతి చేకురాలని కోరుతూ ప్రగాఢ సంతాపం తెలిపారు నిర్వాహకులు. అలాగే ఇంత ఈ కష్ట సమయంలోనూ, $500,000(రూ. 4 కోట్లు) సహకారంతో మద్దతు అందించారు. ఈ ఉదార సహకారం ద్వారా 11 కంటి శిబిరాలకు మద్దతు లభించిందని తెలిపారు. దీంతోపాటు భారతదేశంలోని అత్యవసర ప్రాంతంలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU)ని కూడా ఏర్పాటు చేయగలిగామని అన్నారు. శంకర నేత్రాలయ యూఎస్ఏ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రసాద రెడ్డి కాటంరెడ్డి గారిని ప్రకటించారు. ఆయన తరఫున బాలా ఇందుర్తి , మాధవి ఇందుర్తి ఈ ఘనతను స్వీకరించారు.SN USA బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ సభ్యుడు డాక్టర్ కిషోర్ చివుకుల గారు $100,000 విరాళంగా అందించారు. ఈ విరాళం సంస్థకు అవసరమైన కంటి సంరక్షణ సేవలను అత్యవసరమైన రోగులకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వేలాది మంది రోగులు తగిన దృష్టి పునరుద్ధరణ శస్త్రచికిత్సలను పొందే అవకాశం కల్పిస్తుంది.SN USA బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ జగదీష్ షేత్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఆకట్టుకున్నారు. MESU అడాప్ట్-A-విలేజ్ కంటి శిబిరానికి స్పాన్సర్ చేయడానికి $12,500(రూ. 10 లక్షలు) విరాళం అందించి డాక్టర్ షేత్ తన మద్దతును మరింతగా చాటిచెప్పారు. ఈ సహకారం వందలాది మంది పేద రోగులకు కంటి చూపును పునరుద్ధరించడానికి సహాయపడటమే గాక కొత్త ఆశను కలిగిస్తుంది.ఆగస్టా, జార్జియా నుంచి T. రామచంద్రారెడ్డి గారు 8 కంటి శిబిరాలకు $100,000 విరాళం ప్రకటించారు. ఇక తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా నంది వడ్డెమాన్ గ్రామంలో ఒక కంటి శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఎస్ఎన్ యూఎస్ఏ ప్రెసిడెంట్ బాలా రెడ్డి ఇందుర్తి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేకపల్లి భారతదేశంలో MESU కార్యకలాపాల పురోగతిని వివరించారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలకు చేరుకునే లక్ష్యంతో పేద రోగులకు సేవలను అందించడంపై దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఈ సేవలను మొత్తం భారతదేశానికి విస్తరించే ప్రణాళికను గురించి కూడా వెల్లడించారు.ముఖ్య అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని అంగీకరించి హాజరైన భారత కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ గారికి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయడంలో ఆయన చూపిన అంకితభావం, మద్దతుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కార్యక్రమంలో పాల్గొన్న వారిని నిర్వాహకులను గౌరవంగా గుర్తించేందుకు ఆయన ఫలకాలను అందజేశారు.సాయంత్రం మొత్తం ఎస్ఎన్ యూఎస్ఏ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వం దార్శనికతకు ప్రతి ఒక్కరూ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమం గణనీయమైన నిధులను సేకరించడం మాత్రమే కాకుండా, గొప్ప కారణం కోసం అవగాహనను విస్తృతంగా పెంచగలిగింది. ముందుండి ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడంమేగాక, ఈ మిషన్‌లో చేర్చేలా ఇతరులను ప్రేరేపించడంలో బాలా గారి ఎనలేని కృషి ప్రధాన భూమికను పోషించింది. తన విశేష సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక శంకరరత్న పురస్కారం అందుకోవడం పట్ల నిర్వాహకులందరూ ఆయనకు అభినందనలు తెలిపారు. వెనుకబడిన వ్యక్తుల జీవితాలను మెరుగుపరచడం, దృష్టిని పునరుద్ధరించడం పట్ల ఆయన చూపిన అచంచలమైన అంకితభావం స్ఫూర్తిదాయకం.SN USA ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని వంగిమల్ల, మెహర్ చంద్ లంక, రాజ్ ఐల, శ్రీధర్ జూలపల్లి, నీలిమ గడ్డమణుగు, డాక్టర్ మాధురి నాముదురి, స్పోర్ట్స్ కమిటీ చైర్ రమేష్ చాపరాల, MESU కమిటీ సభ్యుడు డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లు వంటి ప్రముఖుల నుంచి నిరంతరం మద్దతు అందింది. అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమళ్ళతో పాటు చాప్టర్ లీడర్స్ చిన్మయ్ దస్మోహపాత్ర, హేమంత్ వర్మ, పేన్మెట, సుధీర్ పాత్రో, విజయ్ గార్లపాటి ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. కార్యక్రమ నిర్వహణ, భోజన ఏర్పాట్ల సమన్వయంపై ఈ బృందం చేసిన కృషికి ప్రేక్షకుల నుంచి భారీగా చప్పట్లు వచ్చాయి.గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న రెండు MESU బృందాలలో ఒకటి చెన్నై కేంద్రంగా, మరొకటి జార్ఖండ్‌లో టాటా ట్రస్ట్స్ సహకారంతో సేవలందిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లలో 13నుంచి పది రోజుల కంటి శిబిరాలను విజయవంతంగా నిర్వహించింది. నాల్గవ యూనిట్ పుట్టపర్తిలో మార్చి 2025లో ప్రారంభమవుతుండగా, ఐదవ యూనిట్ ఆగస్టు 2025లో వైజాగ్‌లో ప్రారంభమవుతుంది. ప్రతి యూనిట్ దాని బేస్ లొకేషన్ నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. ఈ యూనిట్లు పూర్తిగా ఆపరేషనల్ అయిన తర్వాత భారతదేశంలోని దాదాపు 1/3 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తాయి.MESU అడాప్ట్-ఎ-విలేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా, అట్లాంటా SN చాప్టర్ స్పాన్సర్లు బాలా రెడ్డి ఇందుర్తి, శ్రీని రెడ్డి వంగిమల్ల, డాక్టర్ మాధురి నాముదురి, మెహర్ చంద్ లంక, రాజశేఖర్ ఐల, నీలిమ గడ్డమణుగు ఈ శిబిరాలు వందలాది మంది రోగుల దృష్టిని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ MESU ప్రోగ్రామ్ ద్వారా పేద రోగులకు అందించిన సేవల పట్ల వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అనుభవాలను పంచుకున్నారు.చాలా మంది వ్యక్తులు ముందుకు వచ్చి MESU అడాప్ట్-ఎ-విలేజ్ ప్రోగ్రామ్‌ను స్పాన్సర్ చేయడం ద్వారా తమ స్వస్థలం చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేద రోగులకు సేవలను అందించడంలో భాగస్వాములు అయ్యారు. రూ. $12,500 విరాళంతో బేస్ హాస్పిటల్ నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కంటి శిబిరాలను నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమం పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మాత్రమే కాకుండా దృష్టి కోల్పోయిన వారికి కొత్త ఆశలను అందించగలిగింది.SN USA ప్రెసిడెంట్ బాలా ఇందుర్తి గారు రాబోయే MESU ప్రాజెక్ట్‌ల గురించి, అవి ఎంత విస్తీర్ణంగా ఉన్నాయో, అలాగే ట్రస్టీలు, వాలంటీర్లు వివిధ నగరాల్లో నిధుల సేకరణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భారతదేశంలో అంధత్వాన్ని నిర్మూలించేందుకు ఎలా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారో వివరించారు.పేద రోగులకు దృష్టిని పునరుద్ధరించడానికి SN USA చేస్తున్న కృషికి ప్రేక్షకుల నుంచి భారీ కరతాళ ధ్వనులు వచ్చాయి.. SN USA అట్లాంటా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు - మూర్తి రేకపల్లి, నీలిమ గడ్డమణుగు, మెహర్ లంక, శ్రీని రెడ్డి వంగిమళ్ల, ఉపేంద్ర రాచుపల్లి, డా. మాధురి నాముదూరి, రాజశేఖర్ ఐల, సురేష్ వేములమాడ, శ్రీధర్ రావు జూలపల్లి, రాజేష్ తడికమల్ల, రమేష్ చాపరాల, డాక్టర్ కిషోర్ రాసమల్లు - ఈ కార్యక్రమాన్ని ఘనవిజయంగా నిర్వహించడానికి లక్షల గంటలు కష్టపడ్డారు. డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి (NRU), SN USA సెక్రటరీ శ్యామ్ అప్పాలి మాస్టర్స్ ఆఫ్ సెర్మనీ, శంకరనేత్రాలయ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు(చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్) -
బ్రిటిష్ కొలంబియా డిప్యూటీ ప్రీమియర్‌గా తొలి ఇండో–కెనడియన్
భారత సంతతికి చెందిన నికీ శర్మ బ్రిటిష్ కొలంబియా(బీసీ) డిప్యూటీ ప్రీమియర్‌గా నియామకం అయింది. ఈ పదవి చేపట్టిన తొలి ఇండో–కెనడియన్‌గా చరిత్ర సృష్టించింది. కెనడాలోని లేత్బ్రిడ్జ్లో పుట్టిన నికీ శర్మ బ్రిటీష్ కొలంబియాలోని స్పార్వుడ్లో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి వలస వచ్చారు. తండ్రి పాల్ చిన్న వ్యాపారవేత్త. తల్లి రోజ్ సైంటిస్ట్. ‘యూనివర్శిటీ ఆఫ్ ఆల్బెర్టా ఫ్యాకల్టీ ఆఫ్ లా’ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న నికీ శర్మ ఆ తరువాత లా ఫర్మ్ ‘డోనోవన్ అండ్ కంపెనీ’లో చేరింది.పర్యావరణ సంస్థ ‘స్టాండ్ ఎర్త్’ కోసం క్యాంపెయినర్‌గా పనిచేసింది. 2014లో వాంకూవర్ సిటీ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది. ఈ ఓటమి మాట ఎలా ఉన్నా ఆ తరువాతి కాలంలో ఎన్నో ఉన్నత పదవులను చేపట్టింది. అటార్నీ జనరల్‌గా జాతివివక్ష నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ భద్రతకు సంబంధించి ఎంతో కృషి చేసింది. గత పదిహేనేళ్లుగా ఈస్ట్ వాంకూవర్‌లో నివసిస్తున్న శర్మ ఇద్దరు పిల్లల తల్లి. ఎప్పుడూ చురుగ్గా ఉండే శర్మను పాదరసం’ అని పిలుస్తుంటారు. (చదవండి: నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!) -
సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్
సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా. అమెరికా, చికాగోలో ఈ కార్యక్రమం జరిగింది. భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నేషనల్ ఇండియా హబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ఏవీని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ యూఎస్ఏకి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా.. మరెన్నో నగరాలలో.. నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు పలు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు.(చదవండి: అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..) -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాది మృతి
కుత్బుల్లాపూర్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఉషా ఫ్యాన్స్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి రామ్‌ఆశిష్‌సింగ్ కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్–2లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సందీప్ కుమార్ యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని ఒహియా వెళ్లాడు.అయితే.. తాజాగా అక్కడ రోడ్డు ప్రమాదంలో సందీప్ మృతి చెందాడు. ఈ నెల 17న (భారత కాలమానం ప్రకారం) రాత్రి తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు కారులో బయల్దేరారు. మౌంట్ గిలిడ్ వద్ద మరో కారు వేగంగా ఎదురు వచ్చి ఢీకొట్టడంతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా రామ్‌ఆశిష్ సింగ్ వేడుకుంటున్నారు.