
బ్రిటన్స్ గాట్ టాలెంట్ (బీజీటీ) అనేది బ్రిటన్ టెలివిజన్ టాలెంట్ షో. ఈ వేదికపై తమ ప్రతిభను చూపించుకునేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తుంది యువత. ఈ ప్రపంచ వేదికపై ఫేమస్ అయిన ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ షోకి ఉన్న ఆదరణ, క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ షోలో మన భారతదేశం నుంచి చాలామంది తమ టాలెంట్ చూపించి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కూడా.
అయితే ఈ సీజన్ ఎపిసోడ్‌లోలో ఈశాన్య భారతదేశం నుంచి తొమ్మిదేళ్ల బినితా చెట్రి ఫైనల్‌కి చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ టాలెంట్ షో సెమీ ఫెనల్స్‌లో బినితా అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శన ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే గాక బినితాకి అధిక ఓట్లు పడ్డాయి. ఈ మేరకు ఇన్‌స్టాలో ఆ చిన్నారి బినితా.."ఆ ప్రోగ్రామ్ తాలుకా ఫోటోలను షేర్ చేస్తూ..ప్రతి క్షణం గొప్పగా ఉంది. మీ అందరి సపోర్టు లేకుండా ఇదంతా చేయలేను." అని పోస్టులో రాసుకొచ్చింది.
కాగా, అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన ఇవ్వాలనే తన కలను సాకారం చేసుకోవడానికి తన తండ్రితో కలిసి యూకేకి వెళ్లింది. అక్కడ ప్రదర్శన ఇచ్చే ముందు జడ్డీలతో ఇచ్చిన సంభాషణలో అమాయకంగా మాట్లాడిన ఆ చిన్నారి మాటలు అందర్నీ విస్మయానికి గురి చేశాయి. ఈ పోటీలో గెలిచి.. పింక్ ప్రిన్సెస్ హౌస్ కొనాలనేది తన కోరికని అత్యంత అమాయకంగా చెప్పడం విశేషం.
ఆ ముద్దు మాటలు అందరి మనసులను దోచుకున్నాయి. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెట్రీ ప్రదర్శనకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఆమె ప్రతిభను ప్రశంసించారు. "యూకేలో అస్సాం ప్రతిభ ప్రకాశిస్తోంది. ఈ లిటిల్ బినితా న్యాయనిర్ణేతలు అందరూ ఆహా అనేలా శక్తిమంతమైన ప్రదర్శన ఇచ్చింది.
ఆ చిన్నారి కచ్చితంగా తదుపరి రౌండ్‌కి వెళ్తుంది. అలాగే ఆమె కోరుకున్నట్లుగా పింక్ ప్రిన్సెస్ ఇంటిని కొనుగోలు చేయగలదని ఆశిస్తున్నా. "అని పోస్టులో పేర్కొన్నారు ముఖ్యమంత్రి హిమంత. ఇక చెట్రి తదుపరి పోటీలో దాదాపు తొమ్మిది మంది ఫైనలిస్ట్‌లో పోటీ పడనుంది.
(చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!)