NRI: బ్లూమింగ్‌టన్‌లో నాట్స్ చాప్టర్ ప్రారంభం | NATS Illinois Bloomington Chapter Started | Sakshi
Sakshi News home page

NRI: బ్లూమింగ్‌టన్‌లో నాట్స్ చాప్టర్ ప్రారంభం

Jun 23 2025 11:23 AM | Updated on Jun 23 2025 11:33 AM

NATS Illinois Bloomington Chapter Started

బ్లూమింగ్‌టన్: అమెరికాలో తెలుగు వారికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరింత చేరువ అవుతుంది. తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ నాట్స్ విభాగాలను ప్రారంభిస్తున్నారు.  క్రమంలోనే తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ - నార్మల్‌ జంట నగరాల్లో నాట్స్ చాప్టర్ ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో దాదాపు ఎనభై మంది తెలుగు ప్రజలు నాట్స్ చాప్టర్ ప్రారంభంలో పాల్గొన్నారు. బ్లూమింగ్టన్ చాప్టర్ సలహాదారులకా వేణుకుమార్ మద్దినేని, కృష్ణ వైట్ల వ్యవహరిస్తున్నారు. నాట్స్ బ్లూమింగ్టన్ చాప్టర్ కో ఆర్డినేటర్ బాధ్యతలను విజయ్ కృష్ణ చింటాకు నాట్స్ అప్పగించింది. బ్లూమింగ్టన్ నాట్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్లుగా ప్రేమేష్ గోగినేని, భరత్ అబ్బూరి, మహిపాల్ రెడ్డి గసిరెడ్డి లను నియమించింది. నాట్స్ బ్లూమింగ్‌టన్ మహిళా సమన్వయకర్తగా సుష్మ గుడ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 
నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని వివరించారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. స్థానికంగా ఉన్న తెలుగు సంఘాల సహకారంతో నాట్స్ విభాగం కార్యక్రమాలు చేపడుతుందని బ్లూమింగ్‌టన్ నాట్స్ నాయకులు తెలిపారు. స్థానికంగా ఉండే తెలుగు వారికి సేవలు అందించేందుకు నాట్స్ బ్లూమింగ్‌టన్ టీంను సిద్ధం చేసేలా ఈ చాప్టర్ ప్రారంభంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 
ఇంకా ఈ కార్యక్రమంలో బ్లూమింగ్టన్ - నార్మల్ జంట నగరాల తరపున ప్రాతినిధ్యం వహించబోతున్న వారి ఆలోచనలను ఈ కార్యక్రమలో పంచుకున్నారు. నాట్స్ సేవా కార్యక్రమాలను బ్లూమింగ్‌టన్‌ లో చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికపై నాట్స్ నాయకులు చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement