అమెరికాలో తెలుగు యువ‌కుడి విషాదం | Suryapet youth tragedy in America Road Accident | Sakshi
Sakshi News home page

అమెరికాలో బేతవోలు వాసి మృతి

Jun 9 2025 7:49 PM | Updated on Jun 9 2025 7:49 PM

Suryapet youth tragedy in America Road Accident

జల్లా నరేందర్‌

స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్‌ (25) అలియాస్‌ నవీన్‌ బీటెక్‌ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ మిస్సోరీలో ఎంఎస్‌ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.

ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్‌ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి నరేందర్‌ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 

చ‌ద‌వండి: అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో భార‌త విద్యార్థిపై దాష్టీకం

Advertisement
 
Advertisement
Advertisement