
అగ్రరాజ్యం వేదికపై తెలంగాణ తేజం మెరిసింది. అమెరికా మెచి్చన అందం మన హైదరాబాద్ ఏఎస్‌రావునగర్‌కు చెందిన చూరి్నకా ప్రియ కొత్తపల్లి సొంతం. ఓ వైపు చదువులో రాణిస్తూనే.. మరోవైపు అందాల పోటీల్లో దూసుకెళ్లింది. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన చూర్ణికా ప్రియ డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్‌ఏ–2025 పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది.
ఎవరీ చూర్ణికా ప్రియ..
పుట్టింది పశ్చిమగోదావరి భీమవరం. పెరిగింది హైదరాబాద్ ఏఎస్‌రావునగర్ డివిజన్‌లోని భవానీనగర్‌లో.. తల్లిదండ్రులు కొత్తపల్లి రాంబాబు, వనజ ప్రోత్సాహంతో హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది. సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న ఆమె ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని నిర్ణయించుకుంది. డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్‌ఏ–2025లో పాల్గొంది.
ఈ పోటీల్లో మొత్తం 5,300 మంది పాల్గొన్నారు. ఇందులో ఫైనల్‌కు 20 మంది యువతులు ఎంపికయ్యారు. ఆ తర్వాత టాప్–5, టాప్–3లో చోటు దక్కించుకుని సోమవారం తెల్లవారుజున(అమెరికాలో ఆదివారం అర్ధరాత్రి) జరిగిన గ్రాండ్ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ పోటీలకు ప్రముఖ సింగర్ గీతామాధురితో పాటు మరొకరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అంతేకాదు.. ప్రతిష్టాత్మకమైన పీపుల్స్ చాయిస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది.
చాలా సంతోషంగా ఉంది
తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటాలనే లక్ష్యంతో చూర్ణికా ప్రియ ఈ పోటీల్లో పాల్గొంది. మిస్ తెలుగు యూఎస్‌ఏ–2025లో పాల్గొన్నట్లు మొదట మాకు తెలియదు. టాప్–20లో సెలక్ట్ అయిన తర్వాత మాకు చెప్పింది.
చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. తర్వాత మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. తన ఇష్టాలను ఎప్పుడూ కాదనలేదు. తనకు నచ్చిన రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నాం. టాప్–3లో ఉన్నాను ఫైనల్‌కు సెలక్ట్ అయ్యాను చెప్పింది. తర్వాత ఫోన్ చేసి ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.
– కొత్తపల్లి రాంబాబు, తండ్రి
(చదవండి: కాన్స్ ముగింపు వేడుకలో గూచీ చీరలో మెరిసిన అలియా..! పాపం నాలుగు గంటలు)