మిస్‌ యూఎస్‌ఏ తెలుగు టాలెంటెడ్‌గా పోలవరం యువతి | Polavaram Naga chandrikarani crowned Miss USA Telugu Talented | Sakshi
Sakshi News home page

మిస్‌ యూఎస్‌ఏ తెలుగు టాలెంటెడ్‌గా పోలవరం యువతి

May 31 2025 9:13 AM | Updated on May 31 2025 1:47 PM

Polavaram Naga chandrikarani crowned Miss USA Telugu Talented

గూడూరు: డల్లాస్‌లో జరిగిన మిస్‌ తెలుగు యూఎస్‌ఏ–2025 టాలెంటెడ్‌ విభాగంలో కృష్ణాజిల్లా గూడూరు మండలం పోలవరానికి చెందిన యువతి జాగాబత్తుల నాగచంద్రికారాణి సత్తాచాటింది. ఈనెల 25న జరిగిన పోటీల్లో టాలెంటెడ్‌ విభాగంలో విజేతగా నిలిచింది.

వివరాల ప్రకారం.. చంద్రికారాణి తండ్రి దుర్గాప్రసాద్, తల్లి శ్రీవల్లి. తండ్రి విజయవాడలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. తల్లి గృహిణి. చంద్రికారాణి ప్రస్తుతం ఫ్లోరిడాలో ఎంఎస్‌ చేస్తోంది.  విజయవాడలో ఐటీ ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకున్న ఆమె కొంతకాలం కాగ్నిజెంట్‌ కంపెనీలో ఉద్యోగం చేసిన అనంతరం ఉన్నత చదువుల నిమిత్తం  ఫ్లోరిడా వెళ్లింది. ఈ నేపధ్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్‌ తెలుగు యూఎస్‌ఏ పోటీల్లో విజేతగా నిలిచింది. చంద్రికారాణి విజయంపై  తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు..  

Advertisement
 
Advertisement
Advertisement