టీఏడీ కార్య నిర్వహక బోర్డు ఎన్నిక | TAD Executive Board Election | Sakshi
Sakshi News home page

టీఏడీ కార్య నిర్వహక బోర్డు ఎన్నిక

Jun 4 2025 6:35 PM | Updated on Jun 4 2025 6:57 PM

TAD Executive Board Election

కోపెన్‌హాగన్: తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ డెన్మార్క్‌(Telangana Association of Denmark)(టీఏడీ) 2025–2027 సంవత్సరానికి గాను కొత్తగా కార్యనిర్వాహక బోర్డును ఎన్నుకుంది. ఈ సందర్భంగా బోర్డు సభ్యులకు టీఏడీ అభినందనలు తెలియజేసింది. 2025–2027 కాలానికి ఎన్నికైన కార్యనిర్వాహక బోర్డు సభ్యుల జాబితాను, వారి హోదాను టీఏడీ అధికారికంగా ప్రకటించింది. టీఏడీలోని సభ్యులు అంకితభావంతో బాధ్యతాయుతంగా సమాజానికి సేవ చేయడానికి, బోర్డుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపిక అయ్యారని టీఏడీ తెలిపింది. త్వరలో నిర్వహించబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ సభ్యులు అధికారికంగా తమ బాధ్యతలు చేపట్టనున్నారు. బోర్డుకు ఎంపికైన సభ్యులు, వారి హోదాలు ఇలా ఉన్నాయి.

1. ఉపేందర్ గిలకథుల (అధ్యక్షులు) 2. సురేందర్ కేసాని (ఉపాధ్యక్షులు) 3. విజయ్ మోహన్ గోపి (కార్యదర్శి)4. ఈశ్వర్ ఎమ్మడి (కోశాధికారి), 5. పవన్ కుమార్ పబ్బా (టెక్నికల్ మేనేజర్) 6. సతీష్ సామ (విదేశీ వ్యవహారాల మేనేజర్), 7. రాజ్ కుమార్ కలువల (అసెట్ మేనేజర్), 8. రమేష్ వనపర్తి (పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్)9. సులక్షణ చౌదరి కోర్వా (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 10. సాయ గౌడ్ పడాల (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 11. సాయికృష్ణా రెడ్డి మిల్కా (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు),12. మహేష్ ఆలేటి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 13. దయానంద్ గౌడ్ పడాల (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 14. వాసుదేవ్ గౌడ్ బిక్కి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 15. అఖిల్ కర్నాటి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 16. గోకుల్ దేసు (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 17. రాజేశ్వర్ నీరడి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 18. శరణ్ యాల్కా ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు)

Advertisement
 
Advertisement
Advertisement