వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత | Gottumukkala Madhu picked as a CISA deputy director | Sakshi
Sakshi News home page

Gottumukkala Madhu : వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత

Apr 26 2025 5:47 PM | Updated on Apr 26 2025 6:20 PM

Gottumukkala Madhu picked as a CISA deputy director

సైబర్‌ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థ డీడీగా మధు

ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ కేంద్రంగా పనిచేసే సైబర్‌ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్‌ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్‌ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. 

మధు కాకినాడలో ఇంటర్‌ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్‌ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్‌ సైబర్‌ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

చ‌ద‌వండి: అమ‌రావ‌తి ఐకానిక్‌.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్‌ ట‌వ‌ర్ల నిర్మాణ వ్యయం

Advertisement
 
Advertisement
Advertisement