కోటీశ్వరుల స్వర్గధామం | how Monaco The Ultimate Playground for the Ultra Rich | Sakshi
Sakshi News home page

కోటీశ్వరుల స్వర్గధామం

May 29 2025 11:24 AM | Updated on May 29 2025 11:50 AM

how Monaco The Ultimate Playground for the Ultra Rich

ప్రపంచంలోని చాలా దేశాల కంటే చిన్నదైన మొనాకోలో నివసించేందుకు కుబేరులు పోటీపడుతున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఫ్రెంచ్ రివేరా అనే సుందర సముద్రతీరంలో ఈ ప్రాంతం ఉండడం ఒక కారణమైతే.. అక్కడి ఆర్థిక వెసులుబాట్లు కోటీశ్వరులను మరింత ఆకర్షిస్తోంది. సాటిలేని విలాసవంతమైన జీవనశైలితో సుపర్‌రిచ్‌ వ్యక్తులకు మొనాకో కలల గమ్యస్థానంగా నిలుస్తుంది. అసలు ఆ దేశం ఎలాంటి సదుపాయాలు అందిస్తుందో తెలుసుకుందాం.

పన్ను ప్రయోజనాలు

సంపన్నులకు స్వర్గధామంగా ఉంటున్న మొనాకో పన్ను విధానాలు అల్ట్రా రిచ్ వ్యక్తులకు ఆకర్షణీయంగా మారింది. అనేక దేశాల మాదిరిగా కాకుండా మొనాకో సిటిజన్లపై వ్యక్తిగత ఆదాయ పన్నును విధించదు. ప్రత్యేక ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా ఫ్రెంచ్ పౌరులకు మాత్రం ఇందులోనుంచి మినహాయింపు ఉంది. అక్కడి ప్రజలపై సంపద పన్ను లేదా మూలధన లాభాల పన్ను లేదు. సంపన్న వ్యక్తులు తమ ఆస్తులు కాపాడుకోవడానికి ఆ దేశం మరింత వెసులుబాట్లు అందిస్తోంది. ఈ విధానాలు మొనాకోను పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రముఖులకు అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా చేస్తున్నాయి. మొనాకో విలాసవంతమైన జీవనశైలికి పెట్టిందిపేరు. సూపర్ కార్లు, డిజైనర్ బొటిక్‌లు, మిచెలిన్ స్టార్ డైనింగ్.. వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులను ఆకర్షించేలా హై-ప్రొఫైల్ మోటార్ స్పోర్ట్ ఈవెంట్లు జరుగుతాయి.

పౌరసత్వం పొందాలంటే..

మొనాకోలో సిటిజన్‌షిప్‌ తీసుకుంటే ఎన్నో వెసులుబాట్లు ఉంటాయి. అయితే ఆ దేశం పౌరసత్వం పొందాలంటే కఠిన నిబంధనలు ఉన్నాయి. మొనాకో జుస్ సాంగునిస్ (బ్లడ్‌ రిలేషన్‌) సూత్రాన్ని అనుసరిస్తుంది. అంటే మోనెగాస్క్ దంపతులకు జన్మించిన వారు మాత్రమే మొనాకోలో డిఫాల్ట్‌గా పౌరసత్వాన్ని పొందుతారు. ఇతర పౌరులు మొనాకోలో పిల్లలకు జన్మనిచ్చినా అక్కడి పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు కూడా మోనెగాస్క్‌ జాతికి చెంది ఉండాలి. మోనెగాస్క్ పౌరుడిని వివాహం చేసుకున్న విదేశీయులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అది కూడా వివాహం జరిగిన 10 సంవత్సరాల తరువాత మాత్రమే దరఖాస్తు పెట్టాలి. 

ఇదీ చదవండి: స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

పౌరసత్వం కోసం అప్లై చేసే దరఖాస్తుదారులు మొనాకోలో కనీసం 10 సంవత్సరాలు నివసించి ఉండాలి. వారి ఫైనాన్షియల్‌ రికార్డులు, నేర చరిత్రను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దరఖాస్తుదారులు అక్కడి ల్యాంగ్వేజీ ఫ్రెంచ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అన్ని చేసినా తుది నిర్ణయం మొనాకో అంతర్గత మంత్రిత్వ శాఖదే అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement