
ఆతిశ్ తాసీర్ (Aatish Taseer) ‘భారతదేశపు విదేశీ పౌర సత్వాన్ని’ భారత ప్రభుత్వం 2019 నవంబర్ 7న ఎత్తివేసింది. హోమ్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్ ద్వారా ఆయనకు ఈ సంగతి మొదట తెలిసింది. అధికారిక లేఖ ఆ తర్వాత జారీ అయింది. తండ్రికి చెందిన పాకిస్తానీ మూలాలను ఆయన కప్పిపెట్టారనే సాకుతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కానీ, సంపూర్ణ సత్యం అదేనా?
‘ఎ రిటర్న్ టు సెల్ఫ్: ఎక్స్‌కర్షన్ ఇన్ ఎక్సైల్’ పేరుతో ఆయన రాసిన పుస్తకం తాజాగా విడుదలైంది. అందులోని ముందు మాటలో, ‘‘అది వింతైన ఆరోపణ’’ అని ఆయన అభివర్ణించారు. ‘‘నేను ఇంతకుముందు కూడా ‘స్ట్రేంజర్ టు హిస్టరీ’ (2009) పుస్తకం రాశాను. నా జీవితంలో చాలా భాగం నేను నా తండ్రికి దూరంగానే ఉన్నప్పటికీ, అందులో మా నాన్న గురించిన వ్యాసాలు చాలానే చేర్చాను’’ అని కూడా పేర్కొన్నారు. సల్మాన్ తాసీర్ (పాకి స్తాన్ రాజకీయ నాయకుడు) ద్వారా తవ్లీన్ సింగ్(కాలమిస్ట్)కు పుట్టిన కుమారుడు ఆతిశ్ అన్న సంగతి రహస్యం ఏమీ కాదు. ఈ సంగతి ప్రభుత్వానికి తెలియ దనుకోవడానికి ఏమాత్రం వీలు లేదు.
ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఆతిశ్ తరఫున తవ్లీన్ 1999లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు (ఇదే ఆ తర్వాత 2005లో ‘ఓవర్‌సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా’గా మారింది), ఆయన తల్లితండ్రులలో ఒకరు పాకిస్తానీ అనే కారణం అడ్డురాలేదు. కానీ 2016లో, అది ప్రతిబంధకంగా మారింది. నిజానికి, ఆతిశ్ తండ్రి సల్మాన్ పాకిస్తానీ, బ్రిటిష్ పౌరుడురెండూ అవుతారు. సల్మాన్ తల్లి బ్రిటిష్ పౌరురాలు. జన్మతః ఆతిశ్ బ్రిటిష్ పౌరుడ నడానికి బహుశా ఇదే కారణమేమో. కానీ, ఆతిశ్ ‘ఓవర్‌సీస్ సిటిజన్‌షిప్’ను వేరే కారణంతో ఎత్తి వేశారనడంలో సందేహమే లేదు. మోదీని విమర్శించడమే ప్రస్తుత స్థితికి కారణం. ‘‘మోదీ ప్రభుత్వ దృష్టిలో నేను ‘పాకిస్తానీ’గా మారాను. అన్నింటి కన్నా ముఖ్యంగా ‘ముస్లిం’ అయ్యాను. భారతదేశంలో చాలా వరకు తండ్రి మతమే పిల్లలకు వర్తిస్తుంది. ‘భారతదేశపు ప్రధాన విభజనకర్త’ శీర్షికతో నేను ‘టైమ్ మ్యాగజైన్’కు ముఖచిత్ర కథనం రాయడం, మోదీకి కోపం తెప్పించింది... మా అమ్మ భారతీ యురాలైనా లెక్కలోకి రాలేదు. నేను బయట వ్యక్తిగా, పరాయి మనిషిగా, పాకిస్తానీగా ముద్రపడ్డాను’’ అని ఆయన రాసుకున్నారు.
పౌరసత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రభుత్వం ఆయనకు వీసా ఇచ్చేందుకూ కూడా తిరస్కరించింది. దాంతో అమ్మమ్మ చనిపోయినపుడు ఆమె అంత్యక్రియలకు కూడా తాసీర్ హాజరు కాలేకపోయారు. పౌరసత్వాన్ని కోల్పోవడంలోని బాధేమిటో ఆతిశ్ ముందు మాటలో వివరించారు. ‘‘ఒక దేశం దూరంపెట్టడం కంటే అవ మానం వేరే ఉండదు. ఒక తండ్రి తన బిడ్డను తన బిడ్డ కాదంటే ఎలా ఉంటుందో... ఇంటి నుంచి తరిమేస్తే ఎలా ఉంటుందో అలా! దేశం లేకపోతే గాలికెగిరే విస్తరాకు అయిపోతాం.’’
ఇదీ చదవండి: భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ!
సత్యం ఏమంటే, అమెరికాలోని విశ్వవిద్యాలయం నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఒక ఉన్నత వర్గ మైనారిటీకి చెందిన వాడిననే స్పృహ ఆతిశ్‌లో ఉంది. అయినా హిందీ, ఉర్దూ, సంస్కృత భాషలు నేర్చుకునేందుకు పాటుపడ్డారు. మమేకమయ్యేందుకు దేశంలో విస్తృతంగా పర్యటించారు. భారతదేశంలో భాగమ య్యేందుకు, ఇక్కడి వాడినని అనిపించు కునేందుకు హృదయపూర్వకంగా చేసిన ప్రయత్నం అది. ‘‘భారతీయ జీవితంలో మెరుగ్గా ఇమిడిపోయేందుకు... నాలోని కొన్ని దృక్పథాలను దూరం చేసు కున్నాను’’ అని ఆయన రాసుకున్నారు.
చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
అందుకనే, మొహం మీద తలుపులు మూతపడినప్పుడు ఆయన ఇలా రాసుకోవడం ఆశ్చర్యం కలిగించదు: ‘‘నాకెందుకో విచి త్రంగా స్వేచ్ఛ లభించినట్లు అయింది. బంధ విముక్తుడిని అయ్యా ననిపించింది. ఇండియాలో ఇమిడేందుకు ప్రయత్నించాల్సిన కష్టం, నా స్వీయ పాశ్చాత్యీకరణకు మన్నించమన్నట్లు వ్యవహరించ వలసి రావడం నుంచి హఠాత్తుగా బయట పడేసినట్లయింది.’’ నేడు ఆయన భారతదేశం గురించి భూతకాలంలో ప్రస్తా విస్తున్నారు. ‘‘నాది ఒకప్పుడు భారతదేశం.’’ అలా రాయడం భరించలేని వేదన కలిగిస్తోందని ఆయన చెప్పుకొన్నారు. కానీ, దాన్ని ఆయనపై రుద్దారు. ఆతిశ్ 44 ఏళ్ళ వయసు వారే కాబట్టి, నిర్మించు కునేందుకు భవిష్యత్తు ఉంది. కానీ ప్రభుత్వం ఇండియాను ఆయనకు గతాన్ని చేసేసింది.
పౌరసత్వాన్ని కోల్పోవడంలోని బాధేమిటో ఆతిశ్ తాసీర్ ముందుమాటలో వివరించారు. ‘‘ఒక దేశం దూరంపెట్టడం కంటే అవమానం మరొకటి ఉండదు. ఒక తండ్రి తన బిడ్డను తన బిడ్డ కాదంటే ఎలా ఉంటుందో అలా!’’దేశాన్ని కోల్పోయినవాడు!
-కరణ్ థాపర్ , సీనియర్ జర్నలిస్ట్