breaking news
DSC
-
వైఎస్ జగన్ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా?
ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్చల సవాళ్లను వదలి, ఇక బెదిరింపుల పర్వంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎంత షాడో ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నప్పటికీ లోకేష్ వ్యాఖ్యలు దుందుడుకుతనంగా ఉండడం బాగోలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నిర్దిష్టమైన అభియోగాలతో, ఆధారాలతో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందిన వైనం, కొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించడం తదితర విషయాలను జగన్ ప్రస్తావించారు.దానికి సమాధానంగా లోకేష్ ఏమి మాట్లాడారో చూడండి. డీఎస్సీపై జగన్ విషం కక్కుతున్నారట. వారి ఉపాధ్యాయుల జోలికి వస్తే చర్యలు తప్పవట. నియామకాలు ఆపాలని 300 కేసులు వేసినా కోర్టు తప్పుపట్టలేదట. డీఎస్సీకి, ఏపీపీఎస్సీ తేడా తెలుసా అని మరోసారి జగన్‌ను లోకేష్ పిచ్చి ప్రశ్న వేశారు. ఇక్కడే ఈయన బలహీనత తెలిసిపోతుంది. జగన్ అడుగుతున్నదేమిటి? లోకేష్ చెబుతున్నదేమిటి? కోర్టులు డీఎస్సీలో అక్రమాలు జరగలేదని ఎక్కడ చెప్పాయో తెలియదు. మీ పత్రిక విలేకర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారని, దారుణమైన ఆరోపణ చేశారు.నిజంగా అలాంటిది ఒక్కటి జరిగినా ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో కదా! రెడ్ బుక్ పేరుతో ఎంతమందిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టించింది ప్రజలకు తెలియదా! టీచర్ల జోలికి ఎవరు వెళ్ళారు? ఎవరు దాడులు చేశారు? టీచర్లను రెచ్చగొట్టి ఏవైనా తప్పుడు కేసులు పెట్టించి, ప్రశ్నించే మీడియాను భయపెట్టడం ద్వారా డీఎస్సీ స్కామ్ వివరాలు బయటకు రాకుండా చూడాలన్నది మంత్రిగారి ఉద్దేశం ఏమో తెలియదు. కాని ఆ వ్యూహం అన్నిసార్లు పనిచేయదు కదా!స్పోర్ట్స్ కోటా అవకతవకల గురించి అడుగుతుంటే, వివరణ ఇవ్వకుండా టీచర్ల ఎంపిక మొత్తాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతున్నట్లు లోకేష్ ప్రకటన చేయడం ఏమిటి? పనిలో పని స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా చెప్పారు. కోర్టులో అసలు కేసే విచారణ లేకుండా చేసుకుని, ఇలా క్లీన్ చిట్ అని మాట్లాడడం ప్రజలను ఫూల్స్‌ను చేయడం కాదా? లోకేష్ చెబుతున్నట్లు డీఎస్సీపై జగన్ విషం కక్కలేదు. పరీక్షలలో జరిగిన అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈ అక్రమాలు అర్హులైన కొందరు అభ్యర్ధుల పాలిట విషతుల్యంగా మారాయని చెప్పారు.అది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అసలు పరీక్షలు రాయకుండానే టీచర్ పోస్టులు ఇవ్వాలని జీఓలు ఇవ్వడం, ఆ తర్వాత పని పూర్తి అయ్యాక పరీక్షలు లేకుండా టీచర్ల ఎంపిక జరగరాదని ఉత్తర్వులు ఇవ్వడం నిజమా? కాదా? ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యక్తి చేతిలోనే ఎందుకు పెట్టారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటాలో 372 మందికి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చి, తదుపరి గేట్లు మూసేశారా?లేదా? అసలు క్రీడలే జరగలేదు కాని, కొందరు అందులో భాగస్వాములైనట్లు నకీలీ సర్టిఫికెట్లు తెచ్చారా? లేదా? అధికారులు మీడియా అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలే పరిస్థితిని ఎదుర్కుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వారు అధ్బుతంగా సమాధానం చెప్పారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?అక్రమాలు జరిగాయని అధికారులు ఒప్పుకున్నారని వైఎస్ జగన్ అంటున్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఒకసారి, పరీశీలిస్తామని మరోసారి, తమకు కుల సర్టిఫికెట్లతో సంబంధం లేదని, రెవెన్యూ శాఖ పరిధిలోనివని ఇంకొకసారి అధికారులు చెప్పారా? లేదా? అధికారులు ఏడుసార్లు వెరిఫై చేశామని అన్నారు. అయినా ఇన్ని ఇన్ని అవకతవకలు ఎలా జరిగాయి? అవన్ని బయటకు వచ్చాయి కదా! ఇవన్ని ఎందుకు! జగన్ వేసిన ప్రశ్నలకు వరసగా జవాబులు ఇవ్వగలిగితే సరిపోతుంది కదా!ఇదీ చదవండి: క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్‌కు అగ్నిపరీక్ష!అభ్యర్థులు పలువురు తమకు అన్యాయం జరిగిందని, ఆధారాలతో సహా మీడియాకు చెబుతున్నారే! వారిని అధికారులు పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదు?వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికే భయపడుతన్నట్లు కనిపించడం లేదా! పరీక్షలు లేకుండా టీచర్ల పోస్టులు ఏమిటని వేరే కేసులో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చూడలేదా? కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సిలో తప్పు జరగలేదని చెబుతూనే మొత్తం ప్రక్రియ అంతా అధికారులే చేశారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఊహించినట్లుగానే ఈ మొత్తం ఎపిసోడ్‌ను అధికారుల మీద నెట్టివేయడం కాదా? అంతకుముందు లోకేష్‌ను అభినందిస్తున్నానని పలు సభలలో చెప్పిన చంద్రబాబు ఈసారి అధికారుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు?పవన్ కళ్యాణ్ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో లేకపోయినా ఎందుకు ఆయన కూడా ఉన్నట్లు చెప్పుకోవల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు దీనిపై స్పందించ లేదు? జనసేన, టీడీపీ మధ్య డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయా? లేదా? వాటిని అదుపు చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నించాయా?లేదా? అసలు ఏ తప్పు లేకపోతే సాక్షి మీడియాను నియంత్రించాలని ఎందుకు చూస్తున్నారు. సాక్షి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాతో పాటు, కొంతమంది స్వతంత్రంగా వీటిపై చేసే విశ్లేషణల వీడియోలను పోలీసుల ద్వారా ఎందుకు తొలగింపచేస్తున్నారు? డీఎస్సీ స్కామ్‌పై సాక్ష్యాలతో సహా కథనాలు ఇచ్చిన ఒక ప్రముఖ టీవీకి చెందిన సంపాదకుడు ఎందుకు రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోందా? లేదా?ఇవన్ని గమనిస్తే డీఎస్సీలో ప్రభుత్వం తప్పు చేసిందన్న అభిప్రాయం బలపడడం లేదా? ప్రభుత్వానికి ఎల్లో మీడియా ఎంత వంత పాడుతున్నా, టీచర్ల పేరుతో ర్యాలీలు తీయించినా, డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు కదా! అన్నిటిని మించి జగన్ చేసిన ఒకే ఒక్క సవాల్.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండింటిపైన సీబీఐ విచారణ జరపాలన్నదానిపై ఎందుకు నోరు మెదపడలేకపోతున్నారు?తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని లోకేష్ భయపడుతున్నట్లు అవడం లేదా? విషం కక్కారా? లేక అమృతం తాగారా? అన్నది కాదు సమస్య. అక్రమాలు జరిగాయా? లేదా? అన్నది తేల్చాలా? ఆ ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? మొదట బుకాయింపు, ఆ తర్వాత తడబాటు, తదుపరి సెంటిమెంట్, ఇప్పుడు భయంతో డబాయింపు, కేసుల బెదిరింపు, మొత్తం అధికారులపై నెట్టేసి కుమారుడిని రక్షించే యత్నం... ఇవన్ని ఏమి చెబుతున్నాయి. అన్ని వేళ్లు లోకేష్ వైపు చూపుతున్నాయని జగన్ చెబుతున్నది వాస్తవమే అనిపించదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఒక టీచర్ పోస్టు.. ఆరు మలుపులు!
సాక్షి, అమరావతి: ఒక ఉపాధ్యాయ పోస్టు నియామకంపై అధికారుల వివరణలు మారుతున్నాయని, ప్రతి కొత్త వివరణ టీచర్ అభ్యర్థుల్లో మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆ పోస్టుకు సంబంధించిన టెట్ మార్కులు, ఏడు దశల అర్హత పరిశీలన, డీఈవో ప్రకటన, అభ్యర్థి మళ్లీ టెట్ రాయడం వంటి అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.తొలి మలుపు: 65 మార్కులతో ఏడు దశల పరిశీలన అభ్యర్థికి 65 టెట్ మార్కులు ఉన్నట్లు చూపించి, ఏడు దశల పరిశీలన అనంతరం ఉపాధ్యాయ పోస్టు ఇచ్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాతే నియామకం జరిగిందని చెబుతున్నప్పుడు, ఆ పరిశీలనలో అభ్యర్థి అర్హతను ఎలా నిర్ధారించారో వెల్లడించాలని ప్రశ్నించారు. రెండో మలుపు: అనర్హుడని డీఈవో ప్రకటన అదే అభ్యర్థి అనర్హుడని డీఈవో నిర్ధారించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అర్హత లేకపోతే ఏడు దశల పరిశీలనలో ఆ విషయం ఎందుకు బయటపడలేదని నిలదీశారు. ‘‘ఆ ఏడు దశల్లో అసలు ఏం వెరిఫై చేశారు?’’ అన్నది టీచర్ అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అని పేర్కొన్నారు.మూడో మలుపు: ఉద్యోగం ఎలా వచ్చిందో అభ్యర్థికే తెలియదా? తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలియదని సదరు అభ్యర్థే చెప్పినట్లు వైఎస్ జగన్ ప్రస్తావించారు. నియామకం పొందిన అభ్యర్థి నుంచి కూడా అలాంటి సమాధానం వచ్చిందంటే, పోస్టు భర్తీ ప్రక్రియపై తలెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.నాలుగో మలుపు: తెరపైకి 2018 టెట్ 77 మార్కులు తాజాగా అధికారులు మరో వివరణ ఇచ్చారని, అభ్యర్థి 2018లో రాసిన టెట్‌లో 77 మార్కులు సాధించినట్లు ధ్రువీకరించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆ మార్కులు అప్పటి నుంచే రికార్డుల్లో ఉంటే నియామక సమయంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. 77 మార్కులతో అర్హత ఉందని ఇప్పుడు చెబుతున్నప్పుడు ముందుగా అనర్హుడని డీఈవో ఎందుకు ప్రకటించారని అడిగారు. ఈ వివరణ ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఐదో మలుపు: ఎస్జీటీ పోస్టుకు ‘రాంగ్ పేపర్’? 77 మార్కులు పేపర్ 2బీలో వచ్చినవిగా చెబుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పేపర్ కాగా, ఎస్ జీటీ పోస్టుకు పేపర్–1ఏ అవసరమని గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఏడు దశల అర్హత పరిశీలనను ఎలా దాటారని ప్రశ్నించారు.ఆరో మలుపు: ఉద్యోగం వచ్చాక మళ్లీ టెట్ ఎందుకు? ఉద్యోగం పొందిన తర్వాత కూడా అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాసినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. 2018లో సాధించిన 77 మార్కులే ఎస్జీటీ పోస్టుకు అర్హత కల్పించాయని అధికారులు చెబుతున్నట్లయితే, అభ్యర్థి మరోసారి టెట్‌కు హాజరు కావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలి ఒకే పోస్టుపై వరుసగా వస్తున్న ఈ వివరణల మధ్య నియామక ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగిందని ఎలా చెప్పగలరని సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం డీఎస్సీ కుంభకోణానికి దారితీయలేదా అని నిలదీస్తూ, దీనికి నైతిక బాధ్యత వహించరా అని నిలదీశారు. అభ్యర్థుల సందేహాలను తీర్చేలా మార్కులు, వర్తించే టెట్ పేపర్, అర్హత పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
నిరుద్యోగులకు వయో ‘గండం’
సాక్షి,అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతోంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చతికిల పడింది. ఏటేటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలిస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. ఇక డీఎస్సీ–2025 అక్రమాలకు అడ్డాగా మారింది.స్పోర్ట్స్ డీఎస్సీలో ప్రతిభ ఉన్న వారిని పక్కనపెట్టి దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి టీచర్ ఉద్యోగాలిచ్చేసింది. దీంతో నిరుద్యోగుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లు పారదర్శకంగా ఉండాలని.. ప్రధానంగా వయో పరిమితిపై స్పష్టత ఇవ్వాలని యువత డిమాండ్ చేస్తోంది.నోటిఫికేషన్‌కు ముందే స్పష్టత ఇవ్వాల్సిందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో భాగంగా సెపె్టంబర్ 15న విడుదల చేయనున్న ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ముందే వయోపరిమితిపై క్లారిటీ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావస్తున్నా నిరుద్యోగుల ప్రధాన సమస్య అయిన వయోపరిమితి పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.నోటిఫికేషన్లు ఆలస్యం.. పెరుగుతున్న ఆందోళన.. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో నిరుద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. ఏళ్ల తరబడి కోచింగ్‌లు, రూమ్‌ల కోసం లక్షలాది రూపాయిలు ఖర్చు చేసి ఉద్యోగాల నోటిఫికేష్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది వయోపరిమితి దాటిపోయి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంపు కోసం నిరీక్షిస్తున్నారు. అయినా సర్కారు దయ చూపడం లేదు. నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే..47 ఏళ్లకు వయోపరిమితి పెంచాలి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్న 42 సంవత్సరాల గరిçష్ట వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగుల వయోపరిమితి సమస్యపై స్పందించి 44 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా 47 ఏళ్లకు వయోపరిమితి పెంచాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. విపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల తరఫున వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలని నిరుద్యోగులు హితవు పలుకుతున్నారు.టెన్షన్లో పోలీస్ అభ్యర్థులు..: 2022లో చివరిసారిగా పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి కొత్త నోటిఫికేషన్ కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ రాకపోవడంతో అనేకమంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయింది. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ తదితర యూనిఫాం సర్వీసుల అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు సడలించాలి. ఐపీఎస్ పోస్టుకు 32 ఏళ్లు.. డీఎస్పీకి 30 ఏళ్లే...: యూపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఐపీఎస్ పోస్టుకు 32 ఏళ్ల వయోపరిమితి ఉంది. అయితే రాష్ట్రస్థాయిలో ఏపీపీఎస్సీ గ్రూప్–1 ద్వారా భర్తీ చేసే డీఎస్పీ పోస్టుకు 30 సంవత్సరాలే ఉందని.. ఈ అంశంపై పునఃపరిశీలించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అనేకమంది ప్రతిభావంతులైన అభ్యర్థులు వయోపరిమితి కారణంగా డీఎస్పీ పోస్టుకు దూరమవుతున్నారు. ఐపీఎస్‌కు 32 సంవత్సరాలు ఉన్నప్పుడు డీఎస్పీకి 30 సంవత్సరాల పరిమితి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యత్యాసంపైనా ప్రభుత్వం సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్పీ పోస్టుకు వయో పరిమితి 32 ఏళ్లకు పెంచాలని అడుగుతున్నారు. తెలంగాణలో సడలింపు..: నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితి సడలింపులు కల్పించింది. పొరుగు రాష్ట్రంలో నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వయోపరిమితిపై నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ తమ డిమాండ్‌ను నెరవేర్చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. -
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. అసలు చంద్రబాబు ఇచ్చే వివరణలే మరిన్ని ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు వైఎస్ జగన్. డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ట్విస్ట్ 1: 65 మార్కులు → 7 దశల వెరిఫికేషన్..65 మార్కులు టెట్‌లో వచ్చినా టీచరు పోస్టు ఇచ్చారు.అంతకుముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశాడు?ట్విస్ట్ 2: ఆ అభ్యర్థి అనర్హుడని డీఈవో తేల్చారుమరి ఆ 7 దశల్లో అసలు ఏం వెరిఫై చేసినట్టు?ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది... కానీ ఎలా వచ్చిందో అతనికే తెలియదు!మరి ఏడుసార్లు చేసిన వెరిఫికేషన్‌లో ఏం తేల్చారు?ట్విస్ట్ 4: సడన్‌గా తెరపైకి వచ్చిన 77 మార్కులు2018లో రాసిన టెట్‌లో అతనికి 77 మార్కులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు.ఆ 77 మార్కులు అప్పటికే రికార్డుల్లో ఉంటే..అంతకుముందే వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?డీఈవో అతన్ని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారు?ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఈ వివరణ ఎందుకు బయటకు వచ్చింది?ట్విస్ట్ 5: “రాంగ్ పేపర్” ట్విస్ట్77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది పేపర్ 2లోకానీ SGT పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ Paper-I-A.మరి అవేమీ చూడకుండానే అతను 7 దశల వెరిఫికేషన్‌ను ఎలా దాటాడు?ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాశాడు.2018లో వచ్చిన 77 మార్కులతోనే అతనికి అర్హత ఉంటే..మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రశ్నలు:ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ?ఇలాంటి వ్యవహారాలే డీఎస్సీ స్కామ్‌కు అవకాశం కల్పించలేదా?చంద్రబాబూ.. ఇప్పటికైనా ఈ స్కాంలకు మీరు నైతిక బాధ్యత వహిస్తారా? లేదా? 𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄… pic.twitter.com/MP38UWEkxD— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2026 -
పోలీసు రిక్రూట్మెంట్పై.. అన్నీ అనుమానాలే!
డీఎస్సీ తరహాలోనే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో కూడా భారీగా అవకతవకలు జరిగాయా? ఈనెల 7న పీఓపీ (పాసింగ్ అవుట్ పరేడ్)కి అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో వాయిదా వేయడంలో ఆంతర్యమేంటి? శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు అసలు ఏ కేటగిరీలో, ఏ రిజర్వేషన్లో ఉద్యోగం పొందారో సెలక్షన్ లిస్ట్ ఇప్పటివరకూ పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచలేదు? బ్యాక్ లాగ్ పోస్టులను పూర్తిగా స్పోర్ట్స్ కోటాలోనే భర్తీచేస్తున్నట్లు అమెండ్‌మెంట్‌లో చేర్చిన ప్రభుత్వం ఆ వివరాలు కూడా ఎందుకు పొందుపరచలేదు? ఈ సందేహాలన్నీ చూస్తే అసలు పోలీసు రిక్రూట్మెంట్ పారదర్శకంగానే జరిగిందా? లేదా స్పోర్ట్స్ కోటా ముసుగులో ‘యువగళం’ కోటాగా కొన్ని పోస్టులు టీడీపీ నేతలకు అప్పనంగా ఇచ్చారా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి బ్యూరో: దగా డీఎస్సీ స్కామ్ తరహాలోనే పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లోనూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు దిగజారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 6,100 పోస్టులతో మొదలైన ప్రక్రియలో 79 బ్యాక్లాగ్ పోస్టులను కొత్తగా చేర్చిన ప్రభుత్వం.. మొత్తం పోస్టుల సంఖ్యను మాత్రం 6,100గానే ఉంచడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. మరోవైపు 3 శాతం స్పోర్ట్స్ కోటా కింద 183 పోస్టులతో పాటు 79 బ్యాక్లాగ్ పోస్టులనూ అదే కోటాలో భర్తీ చేసేలా ఉత్తర్వులు జారీ చేయడంతో మొత్తం 262 పోస్టుల నియామకంపై అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రిలిమినరీ, ఫిజికల్ పరీక్షలు పూర్తయి, మెయిన్స్ అనంతరం ఎంపికైన అభ్యర్థులు తొమ్మిది నెలల శిక్షణ కూడా పూర్తి చేశారు. అయినప్పటికీ ఎవరు ఏ రిజర్వేషన్, ఏ కేటగిరీలో ఎంపికయ్యారు? స్పోర్ట్స్, బ్యాక్లాగ్ కోటాలో ఎవరికి ఉద్యోగాలు దక్కాయి? అనే వివరాలతో కూడిన తుది సెలక్షన్ జాబితాను ప్రభుత్వం బహిరంగపరచలేదు. దీనికితోడు ఈ నెల 7న జరగాల్సిన పాసింగ్ అవుట్ పరేడ్‌ను చివరి నిమిషంలో వాయిదా వేయడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. దీంతో పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ నిజంగా పారదర్శకంగానే జరిగిందా? లేక స్పోర్ట్స్ కోటా ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2022 నవంబర్ 28న 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఫిజికల్ టెస్ట్‌లు, పరుగు పందెం అప్పుడే పూర్తిచేశారు. ‘మెయిన్స్’ నిర్వహించే క్రమంలో నిరుద్యోగ జేఏసీ పేరుతో కొందరు కోర్టుకు వెళ్లడంతో రిక్రూట్మెంట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2025 జూన్ 1న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. ఎంపికైన వారికి రాష్ట్రంలోని 21 పీటీసీ, డీటీసీ సెంటర్లలో శిక్షణ ఇచ్చారు. 79 బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కడ ‘బాబూ’?.. 2022 నవంబర్ 28న జారీ అయిన నోటిఫికేషన్లో 6,100 పోస్టులున్నాయి. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 2025 జులై 30న 2022 నోటిఫికేషన్‌ను రివైజ్ చేస్తూ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. 6,100 పోస్టులతోనే రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు కొత్తగా మళ్లీ అమెండ్మెంట్ ఎందుకు? అలాగే, 79 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేస్తున్నట్లు అమెండ్‌మెంట్‌లో పేర్కొన్నారు. మరి 6,100 పోస్టులతో పాటు 79 బ్యాక్లాగ్ కలిపితే మొత్తం 6,179 పోస్టులు రిక్రూట్ చేయాలి కదా? ఎందుకు పోస్టుల సంఖ్య పెరగలేదు? అనేది ఇప్పుడు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. 79 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో భర్తీకి ఉత్తర్వులుమొత్తం 6,100 పోస్టుల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటాలో భర్తీచేసేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓలు జారీచేసింది. ఈ లెక్కన 183 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో భర్తీచేయాలి. అలాగే, బ్యాక్లాగ్ పోస్టులను కూడా స్పోర్ట్స్ కోటాలోనే భర్తీచేయాలని పేర్కొన్నారు. అంటే.. 183 పోస్టులతో పాటు 79 బ్యాక్లాగ్ కలిపి మొత్తం 262 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో భర్తీచేసినట్లు లెక్క. పైగా.. బ్యాక్లాగ్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు చేసేలా అమెండ్మెంట్ చివరి కాలమ్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు స్పోర్ట్స్ కోటాలో గతంలో ఉన్న 20 క్రీడలను 67కు పెంచుతూ జీఓలు జారీచేశారు. కానీ, మొత్తం రిక్రూట్మెంట్ మాత్రం 6,100కే జరిగింది. మరి అలాంటప్పుడు 79 బ్యాక్లాగ్ పోస్టులు ఎలా భర్తీచేశారు? ఎవరితో భర్తీచేశారు? బ్యాక్లాగ్ పోస్టులు భర్తీచేస్తే 6,100కే రిక్రూట్మెంట్ ఎలా పరిమితం చేశారు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. రిజర్వేషన్, కేటగిరి ప్రకారం సెలక్షన్ లిస్ట్ ఎక్కడ?.. ఇక రిక్రూట్మెంట్ చేసిన 6,100 పోస్టుల్లో కొందరికి వేరే ఉద్యోగాలు రావడం, ఇంకొందరు శిక్షణకు రాకపోవడం.. ఇతర కారణాలతో వెళ్లిపోయిన వారు కాకుండా మిగిలిన 5,757 మంది తొమ్మిది నెలలపాటు శిక్షణ పూర్తిచేసుకున్నారు. మెయిన్స్ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు శిక్షణకు ఎంపిక కాగానే ఏ అభ్యర్థి ఏ రిజర్వేషన్, ఏ కేటగిరిలో ఎంపికయ్యారు? బ్యాక్లాగ్, స్పోర్ట్స్ కోటాలో ఎవరు ఎంపికయ్యారు అనే వివరాలతో ఎంపిక జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. కానీ, అభ్యర్థులు తొమ్మిది నెలలు శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత, చివరకు ఈనెల 7న పీఓపీ తేదీ ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటివరకూ సెలక్షన్ లిస్ట్‌ను రిజర్వేషన్, కేటగిరీ వారీగా ప్రకటించలేదు. దీన్నిబట్టి చూస్తే రిజర్వేషన్, కేటగిరి వివరాలు ఎందుకు ప్రభుత్వం గోప్యంగా ఉంచిందనేది అంతుపట్టడంలేదు.స్పోర్ట్స్ కోటాలోని 262 పోస్టుల భర్తీపైనే అనుమానాలు..రిజర్వేషన్ల ప్రకారం ఎస్పీలు జిల్లాల వారీగా ఎంపిక జాబితాను డీజీపీకి పంపిస్తారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఇలా అన్ని విభాగాల్లో పోస్టుల ఖాళీలను డీజీ పరిశీలించి ఎస్ఎల్పీఆర్బీ (స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు)కు పంపిస్తారు. అప్పుడు ఎస్ఎల్పీఆర్బీ ప్రిలిమినరీ, ఫిజికల్, రన్నింగ్, మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. కానీ, ఈ ఉదంతంలో పోస్టుల జాబితాతో పాటు మెయిన్స్ మినహా మిగిలిన ప్రక్రియ మొత్తం 2022లోనే పూర్తయింది. మళ్లీ 79 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేస్తున్నట్లు అమెండ్‌మెంట్‌లో పేర్కొనడం, వాటిని స్పోర్ట్స్ కోటాలో స్థానికులతోనే భర్తీచేసేలా చెప్పడం.. కానీ, ఈ 79 సంఖ్య మొత్తం రిక్రూట్మెంట్లో పెరగకపోవడం, శిక్షణ పూర్తిచేసుకున్నా ఇప్పటివరకూ అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ రిజర్వేషన్ వారీగా ప్రకటించకపోవడంపై 92 వేల మందికి పైగా అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలోని 183 పోస్టులు, బ్యాక్లాగ్ 79 పోస్టులు కలిపి మొత్తం 262 పోస్టుల నియామకంపైనే తీవ్ర అనుమానాలు ఉన్నట్లు పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. 2022లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను మార్పు చేసి 2025లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటాలోని 262 పోస్టుల భర్తీపైనే అనుమానాలు..రిజర్వేషన్ల ప్రకారం ఎస్పీలు జిల్లాల వారీగా ఎంపిక జాబితాను డీజీపీకి పంపిస్తారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఇలా అన్ని విభాగాల్లో పోస్టుల ఖాళీలను డీజీ పరిశీలించి ఎస్ఎల్పీఆర్బీ (స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు)కు పంపిస్తారు. అప్పుడు ఎస్ఎల్పీఆర్బీ ప్రిలిమినరీ, ఫిజికల్, రన్నింగ్, మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. కానీ, ఈ ఉదంతంలో పోస్టుల జాబితాతో పాటు మెయిన్స్ మినహా మిగిలిన ప్రక్రియ మొత్తం 2022లోనే పూర్తయింది. మళ్లీ 79 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేస్తున్నట్లు అమెండ్‌మెంట్‌లో పేర్కొనడం, వాటిని స్పోర్ట్స్ కోటాలో స్థానికులతోనే భర్తీచేసేలా చెప్పడం.. కానీ, ఈ 79 సంఖ్య మొత్తం రిక్రూట్మెంట్లో పెరగకపోవడం, శిక్షణ పూర్తిచేసుకున్నా ఇప్పటివరకూ అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ రిజర్వేషన్ వారీగా ప్రకటించకపోవడంపై 92 వేల మందికి పైగా అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలోని 183 పోస్టులు, బ్యాక్లాగ్ 79 పోస్టులు కలిపి మొత్తం 262 పోస్టుల నియామకంపైనే తీవ్ర అనుమానాలు ఉన్నట్లు పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. -
ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ?
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియలో ఏడు దశల వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌పై ఆయన మరోసారి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘వెరిఫికేషన్.. నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్’ అంటూ జగన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందని చెప్పారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ నిలదీశారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కారు ఆటలాడుతోందని అన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల కెరీర్లు మీకు అపహాస్యంగా మారాయా అని మండిపడ్డారు. ‘ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడంలేదు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలింది. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారు? ఇది స్కామ్ కాదా? దీనికి మీరు నైతిక బాధ్యత వహించరెందుకు’ అని వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుని నిలదీశారు. స్కిల్ కేసులో క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం చంద్రబాబు చేసిన స్కామ్‌లో ఆయనే సొంతంగా క్లీన్ చిట్ ఇప్పించుకుని భుజాలు ఎగరేసుకుంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఫేస్బుక్లో ఈమేరకు ఒక పోస్టు చేశారు. ‘అధికారులను బెదిరించి తనపై ఉన్న కేసుల పని పూర్తి చేసుకుని క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం. తన మీద కేసులు తానే కొట్టేయించుకుంటున్నాడు. ఎందుకంటే అవన్నీ నిజం కాబట్టి. ఇప్పుడు కూడా డీఎస్సీ కేస్‌ని నిర్వీర్యం చేసే పని చేస్తున్నాడు. అయినా స్కిల్ కేసులో తనకు క్లీన్చిట్ వచ్చిందని చెప్పుకోవడం ఎంతటి దౌర్భాగ్యం’ అని వైఎస్ జగన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. -
కూన సంతకంతో ‘సిల్వర్’ సర్టిఫికెట్!
విజయనగరం అర్బన్: మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో క్రీడా అర్హతల్లో అవకతవకలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అర్హత ఉన్నప్పటికీ పోస్టులకు దూరమైన అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. మరో అనుమానాస్పద ఫారం–2 వెలుగులోకి వచ్చింది. జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో కేవలం పాల్గొన్న అభ్యర్థికి ఏకంగా ‘సిల్వర్ మెడల్’ సాధించినట్టు ఫారం–2 జారీ చేయడం, ఆ పత్రంపై నిబంధనల్లో పేర్కొన్న అధికారి కాకుండా రాష్ట్ర క్రీడా సంఘం అధ్యక్షుడు కూన రవికుమార్ సంతకం ఉండటం వివాదాస్పదంగా మారింది. ‘పార్టిసిపేషన్’ మాత్రమే.. మెడల్ సృష్టించారు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన కోట లీలా శివజ్యోతి 2021 డిసెంబర్ 24 నుంచి 28 వరకు అనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నారు. ఈ పోటీలకు సంబంధించి నిర్వాహకుల నుంచి ఆమెకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మాత్రమే లభించినట్లు తెలుస్తోంది. అయితే.. అదే పోటీలో ఆమె రెండో స్థానం సాధించి సిల్వర్ మెడల్ గెలిచినట్లు పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్‌బాల్ సంఘం నుంచి ఫారం–2 జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ధృవపత్రంపై రాష్ట్ర క్రీడా సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. పోటీలో పాల్గొన్నట్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉండగా.. అదే పోటీలో రెండో స్థానం సాధించినట్లు ఫారం–2 ఎలా జారీ అయింది? అసలు సిల్వర్ మెడల్ సాధించినట్లు నిర్ధారించే ఆధారం ఏమిటి? అన్న ప్రశ్నలు క్రీడావర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫారం–2 ఆధారంగానే ఉద్యోగమా? డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో కేవలం పోటీల్లో పార్టీసిపేషన్ సర్టిఫికెట్లకు ప్రాధాన్యం ఉండదు. అభ్యర్థి సాధించిన క్రీడా ప్రతిభ, పొందిన స్థానం, నిబంధనల్లో నిర్దేశించిన ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక జరగాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ అత్యున్నత క్రీడా ప్రతిభకు సంబంధించిన ధృవపత్రాలతో పాటు సంబంధిత ఫారాలను సమర్పించాలని అధికారిక నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాల్గొన్నట్లు ఉన్న ధృవపత్రంతో సిల్వర్ మెడల్ స్థాయి క్రీడా అర్హతను చూపించడం ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఈ ఫారం–2 ఆధారంగానే అభ్యర్థికి డీఎస్సీ–2025లో ఉద్యోగం లభించినట్లు తెలుస్తోంది. స్థానికతపైనా అనుమానాలు అభ్యర్థి స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. అయితే, విశాఖ జిల్లా స్థానికతతో 42 సంవత్సరాల వయసులో స్కూల్ అసిస్టెంట్ మేథమెటిక్స్ పోస్టు నియామక ఆదేశాలు వచ్చాయి. భర్త చొక్కాపు సత్యనారాయణ విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మరోవైపు ఇదే సాఫ్ట్‌బాల్ క్రీడా అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా కూడా భర్త సత్యనారాయణ వ్యవహరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అధ్యక్షుడి సంతకం.. నిబంధనల్లో మాత్రం కార్యదర్శి! 2025 క్రీడా కోటా మార్గదర్శకాల్లోని ఫారం–2లోనే.. ఆ ధృవపత్రం నేషనల్ ఫెడరేషన్ సెక్రటరీ లేదా సంబంధిత స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ వ్యక్తిగతంగా సంతకం చేసినప్పుడే చెల్లుబాటు అవుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అభ్యర్థి సమర్పించినట్లు చూపుతున్న ఫారం–2లో సంతకం చేసిన వ్యక్తి హోదా ప్రెసిడెంట్‌గా ఉంది. దీంతో ప్రెసిడెంట్ సంతకంతో జారీ చేసిన ఫారం–2ను అధికారులు క్రీడా ధృవపత్రంగా ఎలా పరిగణిస్తారన్న ప్రశ్న క్రీడావర్గాల నుంచి తలెత్తుతోంది. -
డీఎస్సీపై నిజాయితీ నిరూపించుకోండి
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇదే విషయాన్ని మేం ధైర్యంగా చెబుతున్నాం. అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోండి’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయనగరంలో వైఎస్సార్సీపీ జిల్లా విస్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలోను, బయట చాలెంజ్ చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ఎందుకు చాలెంజ్ చేయడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలపై తప్పుగా మాట్లాడితే కేసులు పెడతామంటూ అధికారులతో చెప్పించడం సిగ్గుచేటన్నారు. నారా లోకేశ్ నీతిమంతుడైతే తక్షణమే విచారణకు ఆదేశించాలన్నారు. 2006లో వోక్స్వ్యాగన్ అంశంలో తనపై ఆరోపణలు వచ్చాయని, తానే స్వయంగా సీబీఐ విచారణ జరిపించుకుని నిజాయితీని నిరూపించుకున్నట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీస్ వ్యవస్థపై నమ్మకంపోవడం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోస్టులు పెడితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, మహిళా కార్యకర్తలపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఈ పరిస్థితిలోనూ రైతులకు ఒక యూరియా బస్తా దొరకని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరం: కన్నబాబుపార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు సమీక్షలు కాదు ఫలితాలు కావాలంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ బాధ్యతగల ప్రతిపక్షంగా అదే చెబుతోందన్నారు. ఉదయం ఇచ్చిన పింఛన్ డబ్బులు సాయంత్రానికి మద్యం తాగేస్తున్నారని, ఎవరికి పింఛన్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో వెరిఫై చేయాలని చెప్పడం వెనుక చంద్రబాబు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా పింఛన్లు ఇస్తామని రెండున్నరేళ్ల తరువాత ప్రకటించి, పింఛన్ల కోసం కుటుంబాలు విడిపోయాయా లేదా అని సర్వే చేయాలనడం సరికాదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నా తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంటింటికీ మద్యం సరఫరా చేసే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి 4 మద్యం బాటిళ్లలో ఒక నకిలీ బాటిల్ ఉంటోందన్నారు.డీఎస్సీలో పేకాట ఆడినవారికి ఉద్యోగాలిస్తామని చంద్రబాబు చెప్పడం విచారకరమన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులుగా సర్టిఫికెట్లు జారీచేసి ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నారన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నా«థ్, పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
7 దశల్లో వెరిఫికేషన్ చేసి ఏం సాధించారు? DSCలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పై జగన్ ఫైర్
-
నకిలీ జూడో సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు!
తిరుపతి ఎడ్యుకేషన్: మెగా డీఎస్సీ 2025లో నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ గురించి ఏడాది క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి హెచ్చరించినట్లు రాష్ట్ర జూడో సంఘం మాజీ జాయింట్ సెక్రటరీ చీనేపల్లి కిరణ్ ‘సాక్షి’కి వెల్లడించారు. అనుమానాస్పదంగా ఉండటంతో పలువురు అభ్యర్థుల పత్రాలను పరిశీలించగా నిర్ఘాంతపోయే వాస్తవాలు గుర్తించామన్నారు. జూడోతోపాటు ఇతర క్రీడలకు సంబంధించి పలువురు మెగా డీఎస్సీ అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారని గుర్తించడంతో గత ఏడాది సెప్టెంబరు 16న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. నకిలీ సర్టిఫికెట్ల బాగోతంపై జూడో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆనం రామకిషోర్‌రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. జూడో సర్టిఫికెట్లు ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? మెరిట్ జాబితా ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద కోరినప్పటికి వెల్లడించేందుకు ‘శాప్’ నిరాకరించిందని, పైగా మెరిట్ జాబితాను వెబ్సైట్ నుంచి తొలగించిందని పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు గుర్తించామని శాప్ చైర్మనే చెప్పారుమెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న వారిలో 880 మంది నకిలీ సర్టిఫికెట్లను గుర్తించామని శాప్ చైర్మన్ రవినాయుడు గతంలో మీడియాకు చెప్పారని కిరణ్ గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సమాచార హక్కు చట్టం ద్వారా ఆ నకిలీ సర్టిఫికెట్ల వివరాలను తాము కోరామన్నారు. శాప్ అధికారులు కేవలం 32 మాత్రమే నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారన్నారు. అభ్యర్థులు కరిష్మ, షేక్ ఇమామ్ హుస్సేన్, సూర్యానాయక్, శ్వేతారాణి జూడో నకిలీ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయగా మరో 28 మంది వివిధ క్రీడలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను అప్లోడ్ చేశారన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో విచారిస్తే పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.2014లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్‌లో విజేతలకు అందజేసిన ఒరిజినల్ పార్టిసిపేట్ అండ్ మెరిట్ సర్టిఫికెట్లు శాప్ ఎండీ అవాస్తవాలు చెప్పారు..శాప్ ఎండీ భరణి ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి జూడోకు సంబంధించి ఫేక్ సర్టిఫికెట్ల అంశంపై తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. జూడో నకిలీ సర్టిఫికెట్లతో పలువురు ఉద్యోగాలు పొందారని గత ఏడాది సెప్టెంబరు 16న లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు శాప్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్‌ను ఛేదించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తేదీలు మార్చి ఫేక్ సర్టిఫికెట్లు..!రాష్ట్రం విడిపోయాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్ పోటీలను 2014 నవంబరు 28, 29వ తేదీల్లో విజయవాడలో నిర్వహించారు. దీనికి సంబంధించి ఇచ్చిన సర్టిఫికెట్లు ఒరిజినల్ అని తెలిపారు. అయితే అదే వేదికపై 2014 నవంబరు 11 నుంచి 13వతేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించినట్లు నకిలీ సర్టిఫికెట్లను ప్రింట్ చేసి అప్పటి జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నామిశెట్టి అమ్ముకున్నారని, ఇవే సర్టిఫికెట్లతో డీఎస్సీలో 28 మంది ఉద్యోగాలు సాధించారని ఆయన చెప్పారు. -
డీఎస్సీ పారదర్శకమైతే జీవోలు ఎందుకు మార్చారు?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానమా? దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు? అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీలో అక్రమాలకు ద్వారాలు తెరవలేదా..? జరిగిన పరిణామాలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా..?’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై సూటి ప్రశ్నలు సంధించారు. నియామకాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశం ఉంటే.. అర్హత పరీక్ష అవసరం లేదంటూ జీవోలు ఎందుకు జారీ చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత పరీక్ష ఆధారిత నియామక విధానాన్ని తిరిగి తీసుకొచ్చేలా నిబంధనలు ఎందుకు మార్చారని నిలదీశారు. ఈ పరిణామాలను నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియగా ఎలా పరిగణిస్తారని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ కుంభకోణానికి ఈ విధానాలు అవకాశం కల్పించలేదా? అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తాను మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు? » డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు? » అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా? » నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించడంపై చంద్రబాబు సమాధానం చెప్పరా? -
‘డీఎస్సీ అక్రమాలకు సీఎంగా బాబు నైతిక బాధ్యత వహించరా?’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబూ.. డీఎస్సీ నియామకాలను నిజంగా నిష్పక్షపాతంగా..పారదర్శకంగా నిర్వహించాలన్నదే మీ ఉద్దేశమైతే అర్హత పరీక్ష అవసరం లేకుండా జీవోలు ఎందుకు జారీ చేశారు?. క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు?.డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు?. డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానం.. దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు?అర్హత పరీక్ష నిబంధనను తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా?.నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించిన దానిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా?’అంటూ ధ్వజమెత్తారు. .@ncbn Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old… pic.twitter.com/vzDTCvOwGE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2026ఇదీ చదవండి : ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్ -
ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫేస్బుక్లో వీడియో రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసి.. ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.కాగా, నిన్న(గురువారం) ప్రెస్మీట్లో మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ మరోసారి ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు.ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని.. వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో
-
దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్
-
డీఎస్సీలో మరో నాలుగు వికెట్లు డౌన్, నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బట్టబయలు
-
కాక్రోచ్లు ఊరికే రావు..! మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్‌లే
అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం.– మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, చంద్రబాబు స్కామ్‌ల చరిత్రలో అదో ఆణిముత్యం.. చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో మరోసారి ఎండగట్టారు. ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని, వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు ఏడు సార్లు వెరిఫికేషన్ చేశామని అధికారులు చెబుతున్నారని.. మరి అన్ని నకిలీ (ఫేక్) సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవని అధికారులు చెప్పలేకపోయారన్నారు. జరగని పోటీలు, టోర్నీలతో సర్టిఫికెట్లు జారీ చేశారని.. అవి బోగస్ అని స్వయంగా అసోసియేషన్లు వెల్లడించినా వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా తమవారికి అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత గేట్లు మూసేసిందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అసలు ఏ పరీక్షా లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్ అని స్పష్టం చేశారు. ఇదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, అయితే మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్ వేయడమే కాకుండా, మిగిలిన పోస్టులకూ నియామకాలు చేపట్టలేదని వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు కల్పిస్తేనే కాక్రోచ్లు పుట్టుకొస్తాయని, తప్పు చేసిన వారి మెడలు వంచేందుకు తానూ కాక్రోచ్‌గా మారతానని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబుకు బీపీ పెరిగి బెదిరిస్తున్నారుడీఎస్సీ 2025 కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత కూడా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలరా? అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్కామ్ రూపాలన్నీ అనకొండలా అనిపిస్తున్నాయి. అందుకే ఇవి బయటకు వచ్చే కొద్దీ చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది. ఎవరైనా తప్పులు, ఆధారాలు బయటపెడితే వారిపై కేసులు పెడతాం, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. జర్నలిస్టుల మీద సైతం కేసులు పెడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిలదీయకూడదంటూ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?మెగా డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో సాక్ష్యాలు, ఆధారాలతో చూపించా. దీనిపై నేను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా చంద్రబాబుగానీ ఆయన సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రిగానీ సూటిగా సమాధానం చెప్పలేదు. అవన్నీ స్కామ్ పునాదులు. నేను అడిగిన ఆ నాలుగు ప్రశ్నలు చాలా సింపుల్. వాటిని మరోసారి గుర్తు చేస్తున్నా.1? రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ.. ఈ రెండిటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? పారదర్శకతకు ఎందుకు పాతరేశారు? ఇది స్కామ్‌కు ద్వారాలు తెరిచినట్లు కాదా? అని అడిగితే చంద్రబాబు నోరు విప్పలేదు.2? స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? అతడికి మొదటి ర్యాంకు వచ్చినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అతడి పేరును సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఎందుకు తీసేశారు? అతడి డీఎస్సీ క్యాండిడేట్ లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు? అతడిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు? తనను పిలవలేదని డీఎస్సీ కన్వీనర్‌కు నవీన్ లేఖ కూడా రాశాడు. నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? ఇదంతా స్కామ్‌ను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా? డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలను కూడా అమ్ముకున్నారని కొంతమంది అభ్యర్థులు చెప్పడం ఇటీవల సోషల్ మీడియాలో చూస్తున్నాం.. మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి ఇది మరింత బలాన్ని ఇవ్వడం లేదా?3? స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి గతంలో ఉన్న 2 శాతం కోటాను 3 శాతానికి పెంచడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ పరీక్షా రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా భర్తీ చేసుకోవడానికి జీవో నెం.4, జీవో నెం.47 ఎందుకు తీసుకువచ్చారు? ఈ జీవోలతో గేట్లు ఎత్తి 372 మందిని రిక్రూట్ చేసి, పనైపోయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.25, జీవో నెం.56తో గేట్లు మూసేశారు. ఎందుకు ఇంత అడ్డగోలు జీవోలు ఇచ్చారు? అసలు పరీక్షే లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఇష్టం వచ్చినట్లు ఇస్తారా? ఎందుకు జీవోలు ఇచ్చారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు?4? టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఏకంగా ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చిన తరువాత కూడా కేసును ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే వరకూ కేసును నీరుగార్చారు.అంత క్లియర్‌గా ఆడియో కాల్లో నెంబర్ కనిపిస్తుంటే ఆ వ్యక్తిని కనిపెట్టడం కష్టమా? కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం గుర్తు తెలియని (సస్పెక్ట్) వ్యక్తి అని రాశారు. కేసు నమోదుకు ఆలస్యం ఎందుకు అయ్యిందంటే..? ఉన్నతాధికారులతో సంప్రదించడం వల్ల అని రాసుకొచ్చారు. చంద్రబాబు, ఆయన తనయుడు మాత్రం.. అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించామని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో చూస్తే రిమాండ్‌కు పంపలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవన్నీ సింపుల్ ప్రశ్నలు. ఆరేళ్ల పిల్లాడికైనా అర్థం అవుతాయి. ఇవే మెగా డీఎస్సీ కుంభకోణానికి పునాదులు. ఇప్పుడు బయటకు వస్తున్న ఉదాహరణలన్నీ వీటికి సంబంధించిన కోణాలే. వెన్నుపోటు పార్టీ నాయకుడికి తనను, తన తనయుడిని కాపాడుకోవడమే ప్రధానం.అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం...! ఒక అక్రమాన్ని తవ్వుతుంటే, మరొకటి బయట పడుతోంది. బాబు కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ స్కామ్ ఆణిముత్యంగా నిలిచిపోతుంది. నిరుద్యోగ యువకులను నట్టేట ముంచిన స్కాం ఇది. స్పోర్ట్స్ కోటా పేరుతో చేసిన అక్రమాలు చూస్తే.. వీడు మనవాడా! డబ్బులు ముట్టాయా! అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం అన్నట్లుగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారు. జరగని పోటీలు జరిగినట్లుగా, ఆ పోటీల్లో పాల్గొని అద్భుతంగా ఆడినట్లుగా, తప్పుడు సర్టిఫికెట్లతో పోస్టులు ఇచ్చారు.పైస్థాయి నుంచి ఆదేశాలతో కింది స్థాయి వరకూ కుమ్మకై, ఒక పద్ధతి ప్రకారం (మోడస్ ఆపరాండీ) ఈ పోస్టులన్నిటినీ భర్తీ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రతి కేస్ స్టడీ చెబుతోంది.జూడోలో పరీక్ష లేకుండా పోస్టులు..మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అసలు పరీక్షలే లేకుండా 372 మందిని నియమిస్తే.. ఒక్క జూడో కింద 39 మందికి ఎలాంటి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చారు. వీరిలో కొందరు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్ 2013 ఖమ్మంలో జరిగినట్లుగా, అందులో పాల్గొని గెలిచినట్లుగా ధ్రువీకరిస్తూ ఏపీ జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లు పెట్టారు. తీరా చూస్తే అసలు ఆ తేదీల్లో (2013 అక్టోబర్ 19–21 మధ్య) ఆ ఛాంపియన్షిప్ ఖమ్మంలో జరగలేదని, తెలంగాణ జూడో అసోసియేషన్, ఖమ్మం జిల్లా జూడో అసోసియేషన్ చాలా స్పష్టంగా రాతపూర్వకంగా చెప్పాయి. ఇంతకీ ఈ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే.. చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు స్వయనా తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్. దీని అర్థం.. దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని, మళ్లీ ఆ దొంగ సర్టిఫికెట్లకు మన రాష్ట్రంలోని పెద్దలే ధృవీకరణ కూడా చేసి ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. సాఫ్ట్‌బాల్ పేరిట మరో 38 మందికి ఇలానే పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన సంతకం చేసిన 21 సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలిచ్చేశారు.పైనుంచి ఫోన్.. అంతా సెట్బసవేశ్వరరావు అనే మరో అభ్యర్థి 49వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ గుడివాడలో జరిగిందని, అందులో పాల్గొన్నానని సర్టిఫికెట్ పెట్టాడు. కానీ అతడి సర్టిఫికెట్ ఫేక్ అని ఆంధ్రా ఖోఖో అసోసియేషన్ అధికారికంగా శాప్‌కు లేఖ ఇచ్చింది. అయినా సరే దానిని పక్కన పడేసి, ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన వాడికి ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకంటే పైనుంచి ఫోన్.. అంతా సెట్ అయిపోయింది ఉద్యోగం ఇచ్చేయమని! ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థి కబడ్డీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ 2003 నాగార్జున యూనివర్శిటీలో ఆడినట్లుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో, పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆ యూనివర్శిటీలో ఆ గేమ్స్ జరగలేదని, సౌత్ వెస్ట్ జోన్ కబడ్డీ పోటీలు మాత్రమే జరిగాయని తేలింది. అయినా సరే 7 అంచెల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నారు! టెట్ క్వాలిఫై కాకున్నా ఉద్యోగాలు..మరికొన్ని కేసుల్లో అయితే టెట్ పాసవకుండానే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక కేటగిరీలో టెట్ మార్కులు చూపించి, మరో కేటగిరీ టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇంకొన్ని కేసుల్లో.. అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో ఉద్యోగం ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్ అనే అభ్యర్థికి ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు. అతడి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్‌లో 75 మార్కులు రావాలి. కానీ ఆయనకు 65 మాత్రమే వచ్చాయి. ఇదే విషయాన్ని కర్నూలు డీఈవో కూడా ఒప్పుకున్నారు. మరి ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఎవరు చెబితే ఇచ్చారు? దీనిని కవర్ చేసుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ప్రభాకర్‌కు టెట్‌లో 77 మార్కులు 2018లో వచ్చాయని అధికారులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి టెట్ డేటా చూస్తే ఆ 77 మార్కులు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2 బీ కేటగిరీకి సంబంధించిన మార్కులని తేలింది. అవి చూపించి ఆయనకు టెట్ 1 ఏ కేటగిరీలో ఉన్న పోస్టు ఎలా ఇచ్చారు? సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్రువీకరించి ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ ఉద్యోగాలు పొందిన 21 మంది వివరాలు ‘ఈడబ్ల్యూఎస్’ మరో పెద్ద రాకెట్..ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్లు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి. ఇతర కులాలకు చెందిన వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉద్యోగాలిచ్చారు. కడప, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లాలో రసూల్ 2008, 2012, 2018లో బీసీ–ఈ కేటగిరీ కింద డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పుడు మాత్రం ఓసీ–ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉద్యోగం ఇచ్చారు. 1 : 1 రేషియోలో అధికారులు వెరిఫికేషన్ చేశాక కూడా పోస్టు ఎలా ఇచ్చారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7 సార్లు వెరిఫై చేశామని చెబుతున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎలా జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా ఎలా పోస్టులు ఇచ్చారు? ఎవరు చెబితే ఈ పని చేశారు? డీఎస్సీ స్కామ్ పునాదుల నుంచి ఈ కేస్ స్టడీస్ అన్నీ బయటకు వస్తున్నాయి. ‘ఏపీపీఎస్సీ’లోనూ ఇదే చేయాలనుకున్నారు!ఇంకా నిర్ఘాంతపోయే అంశం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఏపీపీఎస్సీలోనూ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలిచ్చేయాలని చూశారు. అటవీ శాఖలో 814 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అందులో 40 పోస్టులు స్పోర్ట్స్ కోటా పేరిట పరీక్ష లేకుండా, కేవలం ఇలాంటి సర్టిఫికెట్లతో భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4ను వీళ్లు వాడుకున్నారు. అంటే డీఎస్సీ కుంభకోణం బయటకు రాకపోయి ఉంటే ఏపీపీఎస్సీలోనూ ఈ 40 పోస్టులు ఇచ్చేసేవారు. డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో మిగతా 774 పోస్టుల భర్తీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. 40 మంది జాబితా బయటపెట్టాల్సి వస్తుందని కాదా? అని నేను అడుగుతున్నా. ప్రభుత్వం, వ్యవస్థలపై నమ్మకం ఎలా ఉంటుంది?పోటీ పరీక్షల కోసం లక్షల మంది పిల్లలు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు ఇంత కష్టపడుతుంటే చివరికి స్కామ్‌లు చేసి, లంచాలు తీసుకుని నచ్చిన వాళ్లకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఇక ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్చాలంటే ఎలా జరుగుతుంది? పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. లేదంటే కాక్రోచ్లు రాక తప్పదు. వీరి మెడలు కూడా వంచక తప్పదు. కచ్చితంగా అదే జరుగుతుంది.అందుకే సీబీఐ విచారణ అవసరంఅసలు పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడమే ఓ స్కామ్. జీవోలు ఇవ్వడం.. స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు నింపడం.. ఆ తరువాత జీవోలను రద్దు చేయడం ఇదంతా పెద్ద స్కామ్! అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం. కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను పాలకుడు ఇలా దగ్గరుండి చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు.తప్పులు ఒప్పుకోక తప్పలేదు..!తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారులతో మాట్లాడించారు. ఐఏఎస్అధికారుల ప్రెస్‌మీట్ తర్వాత అంతిమంగా తేలింది ఏమిటంటే...⇒ టెట్ పాస్ అర్హత లేకపోయినా, పోస్టులు ఇచ్చామని ఒప్పుకోక తప్పలేదు.⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవి అని చెప్పలేకపోయారు.⇒ వెరిఫికేషన్ ఒక బోగస్ అని చెప్పకనే చెప్పారు.⇒ టోర్నమెంట్లు జరగకుండానే సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.⇒ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు.⇒ లోకేశ్ తోడల్లుడు అధ్యక్షుడిగా ఉన్న జూడో అసోసియేషన్‌లో పోటీలు జరగకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు. ⇒ కులాలు మార్చి కూడా పోస్టులు ఇచ్చామని అంగీకరించక తప్పలేదు.చక్రం తిప్పిన శాప్..మరికొన్ని కేసుల్లో శాప్ స్వయంగా చక్రం తిప్పింది. విశాఖపట్నంలో ఏ పరీక్షా లేకుండా స్పోర్ట్స్ కోటాలో సీహెచ్ యోగేశ్వరరావు అనే అభ్యర్థికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగం ఇచ్చారు. ఆయన చెల్లికి కూడా ఇచ్చారు. కుటుంబం మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నట్లున్నారు! నల్గొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2009లో యోగేశ్వరరావుకు ఫస్ట్ ప్లేస్, ఆయన చెల్లి మోహినిదేవికి సెకండ్ ప్లేస్ వచ్చినట్లు సర్టిఫికెట్లు చూపించారు. అయితే విజేతల జాబితాలో వీళ్లు లేరని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ రోజు పోటీలో గెలుపొందిన క్రీడాకారుల వివరాలు, పేర్లతో కూడిన రికార్డులను కూడా బయటపెట్టింది. అంటే ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుని, ఆ మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని అర్థం అవుతోంది. కానీ ఇచ్చిన ఈ ఉద్యోగాలన్నీ ఏడు సార్లు వెరిఫికేషన్ అయిన తరువాత, ప్రతీ దానిని స్రూ్కటినీ చేసి, స్క్రీనింగ్ చేసి, తనిఖీ చేసి ఇచ్చామని అధికారుల చేత చంద్రబాబు చెప్పిస్తున్నారు. -
అబద్ధాలు.. డ్రామాలు.. డైవర్షన్లు
అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా.మా హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారో చెక్ చేసుకోండి... ఎక్కడా తేడా చూడలేదు.మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు.సాక్షి, అమరావతి: ‘డైవర్షన్..డ్రామాలు..అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బతుకు.. అధికారులను బెదిరించి.. భయపెట్టి..ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను కొట్టేయించుకుంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. పైగా తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాడు. తమ అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు బయటపడిన ప్రతీసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామాలు ఆడడం చంద్రబాబుకే చెల్లింది‘ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. కుంభకోణాలు చేస్తూ.. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలిస్తుండటంపై సాక్ష్యాధారాలతో ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతారు. ఇలా అయితే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఎలా ఏర్పడుతుంది. లంచాలు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చుకుంటూ పోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వ్యవస్థలో మార్పు రావాలి. డీఎస్సీ స్కామ్‌పై పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి, ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంది.’ అని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..పరీక్ష రాయకుండానే ఉద్యోగాలిస్తే ప్రశ్నించకూడదా? నువ్వు పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇస్తానంటున్నావు. నీకు నచ్చిన వారికి డబ్బులు తీసుకొని స్కామ్‌లు చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నావు. అర్హత ఉండాలి కదా? ఎలాంటి అర్హత లేకుండా నీకు నచ్చాడని, నీకు డబ్బులు ఇచ్చాడని నీ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే ఎలా? ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పవుతుందా? ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు పారదర్శకంగా ఒక పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందాలి. అలా ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలిచ్చే సమయంలో ఒకటి రెండు తప్పిదాలు జరిగితే పొరపాటు చేశావ్ లే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కావాలనే పెద్ద మోసం చేసినట్టు స్పష్టంగా కన్పిస్తోంది. ఏ పరీక్ష రాయకుండానే 372 పోస్టులు ఇచ్చేందుకు స్కెచ్ వేశావు. ఉద్యోగాలకు పరీక్షలు రాయనవసరం లేదని ఏకంగా నువ్వు జీవోలు ఇచ్చావు. ఇదే రీతిలో మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకోవాలనుకున్నావ్. ఇది తప్పు కాదా? పైగా ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా? డైవర్షన్.. డ్రామాలు.. అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బ్రతుకు చంద్రబాబు అనే వ్యక్తి అబద్ధాల మీద అబద్ధాలు..డైవర్షన్ మీద డైవర్షన్..ఒక డ్రామా చేస్తాడు. డీఎస్సీ స్కామ్–1 కానీ, డీఎస్సీ స్కామ్–2 కానీ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా నేను చూపించాను. పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చిత్తశుద్ధితో సమాధానాలు చెప్పాలి. కానీ మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు. పైగా అధికారులతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏం చెప్పించారు.. ఏడుసార్లు వెరిఫికేషన్ తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మేము ఆధారాలతో బయటపెడుతున్నాం.. కాబట్టి దిక్కుతోచని, తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్పులను ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. నిరుద్యోగ జీవితాలతో చెలగాటాలా? డీఎస్సీ కుంభకోణంపై పోరాటం ఇంత పెద్దది కాకపోతే..జగన్ అనే వ్యక్తి ప్రశ్నించకపోతే డీఎస్సీ మాదిరిగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌కు వర్తింపచేసేవారు. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన వీళ్లు ఏపీపీఎస్సీలో కూడా పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు అమ్మేసుకోవాలని చూశారు. అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4నే ఇక్కడ వర్తింపచేయాలని చూశారు. డీఎస్సీలో అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేశారు. ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని నిలిపివేశారు. లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షల కోసం జీవితాలను ఫణంగా పెట్టి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చుచేస్తారు. ఇంత కష్టపడితే చివరకు స్కామ్‌లతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని నియామకాలు చేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెడుతూ సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నా. అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా. పాలకులుగా ఉన్న మనం ఏం చేస్తా ఉన్నాం. పరిపాలన అంటే ఇదేనా?ఎలాంటి ఆరోపణ లేకుండా లక్షల ఉద్యోగాలిచ్చాం.. మా ప్రభుత్వ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్ద పీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. చెక్ చేసుకోండి..సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడా తేడా చూడలేదు. ప్రభుత్వం అనేది ఉద్యోగార్థుల్లో నమ్మకం కల్గించేలా ఉండాలి. అర్హత లేని వారికి ఉద్యోగాలు అమ్ముకునే విధానాన్ని ఒప్పుకుంటే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద వారికి నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే డీఎస్సీ స్కామ్‌పై పారదర్శకంగా సీబీఐ విచారణకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. మా డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయంలో ఇప్పటికే వివిధ రూపాల్లో పోరాటాలు చేశాం. మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని రకాల వేదికలపైనా పోరాటాలు కొనసాగిస్తాం. నిజంగా సిగ్గుతో వాళ్లు తలదించుకోవాలి.. డీఎస్సీ స్కామ్‌పై మీరు లేవనెత్తిన అంశాలపై బీజేపీ, జనసేన ఎందుకు స్పందించడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఈ ప్రశ్నను మీరు వాళ్లను అడగాలి. డీఎస్సీ స్కామ్ విషయంలో జగన్ ఏమైనా విషయాలు తప్పుగా చెబుతున్నారా. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడా ? జగన్ చెప్పే విషయాలు లాజికల్‌గా లేవా ? అని వాళ్లను ప్రశ్నించాలి. జగన్ చెప్పే విషయాలన్నీ కరెక్ట్ అని అనిపిస్తా ఉన్నప్పుడు నోరు మెదపాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉన్న ఎవరికైనా ఖచ్చితంగా రావాలి. సాక్ష్యాలు, ఆధారాలతో పక్కాగా దొరికిపోయిన తర్వాత కూడా జనసేన, బీజేపీ నేతలు ప్రశ్నించకుండా ఇలాంటి చంద్రబాబును సపోర్టు చేస్తున్నందుకు, ఇలాంటి వ్యవస్థను బలపరుస్తున్నందుకు వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ.. చంద్రబాబు తనపై నమోదైన కేసులు కొట్టేయించుకుంటూ తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టించి, ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను మూయించుకుంటున్నారు ఇది జగమెరిగిన సత్యం. ప్రభుత్వం తన చేతుల్లో ఉంది. అధికారులందరూ ఆయన కింద పని చేస్తున్నవారే. తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. డీఎస్సీ పై నమోదైన కేసులను కూడా ఇదే రీతిలో నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వంలో రిపోర్టింగ్ అథారిటీ ఎవరు.. చంద్రబాబు నాయుడే. అందుకే తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయించుకుంటూ తనకు క్లీన్ చిట్ వచ్చిందని తనకు తానుగా చెప్పుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. -
నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్
-
మీలాంటి వాళ్ల వల్లే కాక్రోచ్ లు పుట్టకొస్తారు.. కూటమిపై విరుచుకుపడ్డ YS జగన్
-
జగన్ దెబ్బకు బాబుకు బీపీ హై వెలుగులోకి కీలక ఆధారాలు
-
7 స్టెప్స్ వెరిఫికేషన్.. ఇది వీళ్ల బండారం..జగన్ సంచలన వ్యాఖ్యలు
-
రాజీనామా చేసే వరకు వదిలిపెట్టను జగన్ మాస్ వార్నింగ్
-
అసలు సూత్రదారులు వీళ్లే..! ఆధారాలతో బయటపెట్టిన YS జగన్
-
బాబు జైలుకెళ్లి మూడేళ్లు... వెళ్తూ వెళ్తూ జగన్ సెటైర్లు అదుర్స్
-
15లక్షలకు DSC జాబ్ లు అమ్ముకున్నారు..! సంచలన వీడియో బయటపెట్టిన YS జగన్
-
స్కామ్‌పై సర్కారు సైలెన్స్!
సాక్షి, అమరావతి: ‘‘అర్హత లేనివారికి టీచర్ పోస్టులా? అనర్హులను ఎందుకు నియమిస్తున్నారు? విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా చెలగాటమాడతారు? అడ్డదారి నియామకాలతో తరతరాల భవిష్యత్తు నాశనమే. నిర్దేశిత అర్హతలు లేనివారిని నియమిస్తే.. అలాంటి వారిని సర్వీసులో కొనసాగించొద్దు..’’ ఉపాధ్యాయుల నియామకాలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలివీ! » మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఉమ్మడి ప్రకాశం జిల్లా పుల్లల చెరువు జడ్పీ స్కూల్ టీచర్ పీవీసీహెచ్ బసవేశ్వరరావు 2015లో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో చాంపియన్ షిప్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ సమర్పించాడు. అయితే ఆయన చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేదని.. తమ వద్ద అలాంటి సమాచారం ఏదీ లేదని ఏపీ ఖోఖో అసోసియేషన్ స్వయంగా శాప్‌కు సమాచారం ఇచ్చినా టీచర్ పోస్టు కట్టబెట్టారు. » 2013లో ఖమ్మంలో రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సీనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించినట్టు సర్టిఫికెట్ సమర్పించిన ఓ మహిళ స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం పొందింది. అయితే తాము అలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేదని జూడో అసోసియేషన్ (తెలంగాణ) రాష్ట్ర కార్యదర్శి కైలాష్ యాదవ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ‘బోగస్’ గుట్టురట్టు.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం స్పోర్ట్స్ కోటాను కొల్లగొట్టేందుకు పెద్దగా పరిచయం లేని మార్షల్ ఆర్ట్స్ క్రీడ ’కురాష్ ’ను తెరపైకి తెచ్చారు. 2016 నుంచి 2023 మధ్య ఏకంగా 1,500 వరకు నకిలీ సర్టిఫికెట్లతో సాగించిన భారీ కుంభకోణాన్ని ఇటీవల పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. జరగని పోటీలను జరిగినట్లుగా చూపిస్తూ, మహిళల ఈవెంట్లలో పురుషుల పేర్లు చేర్చడంతోపాటు జిల్లా పేర్లను మార్చి జారీ చేసిన ఈ బోగస్ సర్టిఫికెట్లతో ఇప్పటికే 71 మంది (పోలీస్, ఇతర విభాగాల్లో) ఉద్యోగాలు పొందగా, ఎంపీఎస్సీ గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల్లోనూ వీటితో లబ్ధి పొందారని దర్యాప్తులో తేలింది. ఈ రాకెట్‌కు సంబంధించి అసోసియేషన్ కార్యదర్శి, అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. భవిష్యత్‌లో మోసాలను అరికట్టేందుకు డిజిటల్ వెరిఫికేషన్, బ్లాక్‌చెయిన్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీలో ఎదురు దాడి...! మెగా డీఎస్సీ 2025 అక్రమాలు కళ్లకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా బాధిత అభ్యర్థులు బయటకు వస్తున్నా చంద్రబాబు సర్కారు నిర్భీతిగా బుకాయిస్తూ ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. యువగళం దళానికి టీచర్ పోస్టులు కట్టబెట్టింది. అందుకోసం ఏకంగా కొత్త జీవోలు తెచ్చి స్పోర్ట్స్ కేటగిరీలో దొడ్డిదారిన కట్టబెట్టింది. అక్రమాలకు గేట్లు ఎత్తి ఆ తర్వాత జీవోలు మార్చేసింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. ఏకంగా కులం, మతం కూడా మార్చేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు పోస్టు ఇవ్వలేదు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిని టీచర్లుగా నియమించారు. ఫస్ట్ ర్యాంకర్ నవీన్‌కు ఉద్యోగం ఇవ్వలేదు. ఇలాంటి అక్రమాలు వరుసగా వెలుగు చూశాయి. పలువురు అభ్యర్థులు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో తమకు సంబంధం లేదని స్వయంగా ఆయా అసోసియేషన్లే ప్రకటించాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు చలించకపోవడం.. స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై తేల్చేందుకు మహారాష్ట్ర తరహాలో డిజిటల్ వెరిఫికేషన్, బ్లాక్ చెయిన్ లాంటి విధానాలను తేకపోవడం మెగా డీఎస్సీ స్కామ్‌కు పక్కా నిదర్శనమని విద్యావేత్తలు, రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించడంతోపాటు విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని సూచిస్తున్నారు.స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లు రాష్ట్ర జూడో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆనం రామ్‌కిషోర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు నెల్లూరు (టౌన్): మెగా డీఎస్సీలో ఎక్కువ మంది స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని రాష్ట్ర జూడో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆనం రామకిషోర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది అసలు క్రీడాకారులే కాదు. నిజమైన క్రీడాకారులు ఈ విషయాన్ని బయట చెప్పుకోలేరన్నారు. ట్యాంపర్ చేసి పేర్లు మార్చారు... ‘కర్నూలు జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్ జూడో ఫేక్ సర్టిఫికెట్లతోనే ఉద్యోగం పొందారు. 2018లో నెల్లూరులోని ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొన్నట్లు ఆయన సర్టిఫికెట్ పెట్టారు. అయితే ఇస్మాయిల్ ఆ పోటీల్లో పాల్గొనలేదు. ఆ సమయంలో నేనే నెల్లూరు జిల్లా జూడో ప్రెసిడెంట్‌గా ఉన్నా. ఏ ఛాంపియన్షిప్ జరిగినా జిల్లా అసోసియేషన్ దగ్గర ఒక రికార్డు, జిల్లా శాప్ కార్యాలయంలో ఒక రికార్డు, రాష్ట్ర శాప్ కార్యాలయంలో ఇంకో రికార్డు కలిపి మొత్తం 3 రికార్డులు ఉంటాయి. కానీ, వీటిని ట్యాంపర్ చేసి పేర్లు మార్చారు. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. మెగా డీఎస్సీలో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌కు కొరియర్లో లేఖలు పంపా. అక్రమాలు బయట పెట్టానన్న అక్కసుతో నన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈ అక్రమాలపై కోర్టులో కూడా కేసులు వేశా. అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’ అని రామకిషోర్‌రెడ్డి పేర్కొన్నారు. -
మెగా డీఎస్సీలో ‘ఓపెన్’ స్కామ్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మెగా డీఎస్సీ 2025 ముసుగులో అసలు పరీక్షే లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేయడం.. ప్రతిభకు పాతర.. స్పోర్ట్స్ కోటాతో ఇష్టారాజ్యంగా జీవోలు.. గోల్డ్ మెడల్ విజేతలను పక్కనపెట్టి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి ఉద్యోగాలివ్వడం.. బేరసారాల కాల్ రికార్డింగ్స్ వైరల్ కావడం.. ఆటల్లో పాల్గొన్నట్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన వారికి పోస్టింగ్స్ ఇవ్వడం.. కనీసం టెట్ క్వాలిఫై కానివారిని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో నియమించడం లాంటి దారుణాలు ఇప్పటికే బహిర్గతం కాగా రిజర్వేషన్ అభ్యర్థులకూ ద్రోహం చేసినట్లు వెలుగులోకి వస్తోంది. మంచి ర్యాంకుతో మెరిట్ సాధించిన అభ్యర్థిని ఓపెన్ కేటగిరీలో కాకుండా బీసీ కేటగిరీలో భర్తీ చేయడంతో బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు తమ తలరాతలు మారిపోయి తీరని నష్టం వాటిల్లినట్లు ఆక్రోశిస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మెగా డీఎస్సీ ప్రక్రియలో స్పోర్ట్సు కోటా జీవోలు, రిజర్వేషన్ల అమలులో ఘోర తప్పిదాలపై రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాత పరీక్షలో మెరిట్ సాధించడంలో విఫలమైన వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో పోస్టింగ్‌లు ఇచ్చారని అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ బరి తెగింపు వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. ఓపెన్‌లో కాకుండా బీసీ–ఏ కేటగిరీలో భర్తీ.. మెగా డీఎస్సీలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల యాజమాన్యాల పరిధిలో కలిపి 72 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు కేటాయించగా, అందులో తొమ్మిది మహిళలకు కేటాయించారు. 6, 8, 13, 30, 35, 50, 57, 60, 70 ర్యాంకుల అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ మహిళా కోటాలో నియమించారు. అయితే 29వ ర్యాంకు వచ్చిన మహిళా అభ్యర్థిని మాత్రం ఓపెన్‌లో కాకుండా బీసీ–ఏ కేటగిరీలో భర్తీ చేశారు. దీంతో బీసీ–ఏ కేటగిరీలో మెరిట్లో ఉన్న అభ్యర్థులు నష్టపోయారు. » బీసీ–ఏ కేటగిరీలో 5 పోస్టులు కేటాయించగా పురుషులకు నాలుగు, మహిళలకు ఒక పోస్టు రిజర్వు చేశారు. కానీ పోస్టుల భర్తీ సమయంలో ఓపెన్‌లో ఉండాల్సిన 29వ ర్యాంకు మహిళా అభ్యర్థినిని తీసుకొచ్చి.. బీసీ–ఏ కేటగిరీలో భర్తీ చేశారు. ఇలా చూసినా బీసీ–ఏ మహిళా కేటగిరీ పూర్తయినట్టే. కానీ, 82వ ర్యాంకు వచ్చిన మరో మహిళా అభ్యర్థిని కూడా బీసీ–ఏ మహిళా కేటగిరీ కింద నియమించారు. దీంతో బీసీ–ఏ కేటగిరీలో ఇద్దరు మహిళలను నియమించినట్లయింది. దీనివల్ల మెరిట్లో ఉన్న పురుషులకు నష్టం జరిగింది. » మెగా డీఎస్సీలో మెరిట్లో ఉన్న బీసీ–ఏ అభ్యర్థులకు స్పోర్ట్స్‌కోటా జీవోతో మరింత నష్టం వాటిల్లింది. నోటిఫికేషన్లో రెండు పోస్టులు కేటాయించగా వాటిని ఏ రిజర్వేషన్ కింద భర్తీ చేయాలో ప్రస్తావించలేదు. పోస్టుల భర్తీ సమయానికి బీసీ–ఏ కింద భర్తీ చేసేశారు. అంటే బీసీ–ఏ కేటగిరీలో మొత్తం ఐదు పోస్టులకు గాను ఇద్దరు మహిళా రిజర్వేషన్లో భర్తీ కాగా, మరో ఇద్దరు స్పోర్ట్సు కోటాలో భర్తీ కావడంతో డీఎస్సీ మెరిట్లో ఉన్నవారికి కేవలం ఒకటే పోస్టు మిగిలినట్లు అయింది.మెరిట్లో విఫలం.. స్పోర్ట్సు కోటాలో పోస్టింగ్మెగా డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విభాగంలో తమ్మినేని పైడిరాజుకు 46వ ర్యాంకు వచ్చింది. డీఎస్సీ మెరిట్ ప్రకారం బీసీ–ఏ కేటగిరీ కింద ఆయన భర్తీ కావాలి. కానీ వితవుట్ రిజర్వేషన్ కింద స్పోర్ట్స్ కోటాలో మరో అభ్యర్థికి ఇచ్చారు. ఈ అభ్యర్థి రెండు రకాలుగా దరఖాస్తులు చేసుకున్నారు. డీఎస్సీ మెరిట్, స్పోర్ట్సు కోటాలో దరఖాస్తు చేశారు. ఎగ్జామ్‌లో ఆయన 38.57705 స్కోర్‌తో 2,232 ర్యాంకు పొందగా మెరిట్లో అర్హత సాధించలేకపోయారు. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్సు కోటాలో నేరుగా.. డీఎస్సీ ఎగ్జామ్ మెరిట్ అభ్యర్థి స్థానంలో పోస్టింగ్ పొందారు. » మెగా డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విభాగంలో వావిలాపల్లి కళాప్రతాప్కు 56వ ర్యాంకు వచ్చింది. డీఎస్సీ మెరిట్ ప్రకారం బీసీ–ఏ కేటగిరి కింద ఆయన భర్తీ కావాలి. కానీ వితవుట్ రిజర్వేషన్ కింద స్పోర్ట్స్ కోటాలో మరో వ్యక్తిని నియమించారు. ఆయన కూడా రెండు రకాలుగా దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ ఎగ్జామ్ మెరిట్, స్పోర్ట్సు కోటాకు దరఖాస్తు చేశారు. ఎగ్జామ్‌లో 33.33905 స్కోర్‌తో 2,746 ర్యాంకు సాధించారు. దీంతో ఎగ్జామ్ మెరిట్లో అర్హత సాధించలేకపోయారు. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్సు కోటాలో నేరుగా డీఎస్సీ ఎగ్జామ్ మెరిట్ అభ్యర్థి స్థానంలో నియమితులయ్యారు.అన్యాయం చేశారు...ఓపెన్ ర్యాంకర్‌ను తీసుకొచ్చి.. బీసీ–ఏ కేటగిరీలో భర్తీ చేశారు. స్టోర్సు కోటా నోటిఫికేషన్లో బీసీ–ఏ కింద రెండు పోస్టులు భర్తీ చేస్తామని ఎక్కడా చెప్పలేదు. మాకు అన్యాయం చేశారు. రెండు రకాలుగా నష్టపోయాం. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాం. కానీ అక్కడ మా బలం సరిపోవడం లేదు. – వావిలాపల్లి కళాప్రతాప్, డీఎస్సీ మెరిట్ అభ్యర్థి, ఎస్ఎంపురం -
నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు
-
సాక్షి సంచలన రిపోర్ట్...బయటపడ్డ మరో వ్యక్తి
-
అదేగనక జరిగితే లోకేశ్ జైలుకే: వరుదు కల్యాణి
తాడేపల్లి: వైఎస్సార్సీపీని తిట్టడమే టీడీపీ నేతల పనా? అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. తాడేపల్లిలో ఆమె బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేయడం, పారిపోవడం టీడీపీ నేతలకే చెల్లిందని ఆమె విమర్శించారు.టీడీపీ నేతలు ఆధారాలు చూపించరని, దూషణలు మాత్రం చేస్తారని వరుదు కల్యాణి అన్నారు. డీఎస్సీలో అక్రమాలకు సమాధానాలు చెప్పకుండా పారిపోతున్నారని చెప్పారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో ప్రెస్‌మీట్ పెట్టించి పచ్చి అబద్ధాలు చెప్పించారని తెలిపారు. డీఎస్సీలో అక్రమాలు చేయకపోతే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నారా వారి పాలన నకిలీ సర్టిఫికెట్ల పాలన అని ఆమె అన్నారు.ఆ స్థాయిలో భారీ స్కాం.. ‘‘డీఎస్సీలో విచారణ జరిగితే లోకేశ్ జైలుకే. ఆ స్థాయిలో భారీ స్కాం జరిగింది. స్కాంపై కూటమి నేతలు నోరు మెదపటం లేదు. సవాల్ చేసిన నేతలంతా ఇప్పుడెందుకు పారిపోయారు. టైం, డేట్ చెప్తే మేము చర్చకు రావటానికి సిద్ధమే. స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని కూడా చర్చకు తీసుకురావాలి.డీఎస్సీ పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వటం స్కాం కాదా? రూ.3 లక్షలకు 120 ప్రశ్నలు అమ్ముకోవటం స్కాం కాదా? రూ.20 లక్షల చొప్పున ఉద్యోగం అమ్ముకోవడం స్కాం కాదా? టెట్ లేని ప్రభాకర్ గౌడ్ కు ఉద్యోగం ఇవ్వటం స్కాం కాదా? ఫేక్ జూడో సర్టిఫికేట్లు తెచ్చిన వారికి ఉద్యోగం ఇవ్వటం స్కాం కాదా? వీటన్నిటిపై విచారణ జరగాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? సీబీఐ విచారణ జరిగితే లోకేశ్ జైలుకు వెళ్లక తప్పదు. ఆ భయంతోనే సీబిఐతో విచారణ జరపటం లేదన్నది వాస్తవం కాదా? లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు తెచ్చుకున్న వారి దగ్గర టీడీపీ నేతలు తమ పిల్లలకు చదువు చెప్పిస్తారా?లోకేశ్ చేసిన తప్పులను కవర్ చేయలేక మహిళా అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఫేక్ ప్రచారం చేయటం ఎలాగో చంద్రబాబు, లోకేశ్ ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే పార్టీ నేతలంతా బయటకు వచ్చి డీఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ కబుర్లు చెప్పారు’’ అని వరుదు కల్యాణి అన్నారు. -
బాబు, లోకేష్‌కు తెలియకుండా జీవోలు వచ్చాయా?: డీఎస్సీపై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: ఏపీలో డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచీ తాము సీబీఐ విచారణ కోరుతున్నామని.. అక్రమాలు లేవని చెప్పిన ప్రభుత్వం, ఆధారాలు బయటకు వచ్చి ప్రజల్లో చర్చ మొదలయ్యాక విచారణకు సిద్ధమంటూ మాట మార్చడం సరికాదని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాత్ర ఉందని ఆరోపించిన ఆయన.. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘డీఎస్సీ అక్రమాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాత్ర ప్రత్యక్షంగా ఉంది. కర్నూలుకి చెందిన ప్రభాకర్ ఉదంతంపై కమిటీ వేశారు.. ఉద్యోగం ఇచ్చాక కమిటీ వేసి విచారణ చేయడం ఏంటి? వ్యక్తిగత అర్హత గురించి విద్యార్హత గురించి పట్టించుకోకుండా నియామకాలు జరిపి మేము అక్రమాలు బయటకు వచ్చాక సంబంధం లేని వాదనలు వినిపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా విషయంలో అక్రమాలు జరిగినట్టు తేటతెల్లం కాగా అసోసియేషన్లపై నెపం నెడుతున్నారు. స్పోర్ట్స్ పత్రాల్లో అసలైన సంతకాలు ఉన్నాయా లేదా చెప్పాలి? క్లీన్ చిట్ ఇవ్వలేకపోతున్నారు అంటే మీకు తెలిసే ఇదంతా జరిగింది. కాబట్టి తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా కాలయాపన చేస్తున్నారు. అందుకే క్లీన్ చిట్ ఇవ్వలేకపోతున్నారు. అసలు టోర్నమెంట్లు నిర్వహించకుండానే క్రీడాకారులకు సర్టిఫికెట్ ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాద్ధాంతం అయ్యాక ఇప్పుడు అసోసియేషన్లను అడుగుతామంటున్నారు. ఇది ముమ్మాటికీ మీరు చేసిన పాపం.. ఫలితంగా నిరుద్యోగులు బాధపడే స్థాయికి తెచ్చారు. తప్పు జరగలేదు అంటే ఇన్ని రకాల ఎంక్వయిరీలు ఎందుకు చేస్తున్నారు?.డీఎస్సీపై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు చల్లారు.. బాధిత కుటుంబాలకు జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరు?. సీఎంకు తెలియకుండానే జీవోలు వచ్చాయా? ఆయన సంతకం చేయకుండానే ఫైల్స్ కదిలాయా? కాబట్టి ఇందులో ప్రత్యక్ష నిందితులు చంద్రబాబు, లోకేష్ అని ఖచ్చితంగా చెప్తున్నాం. న్యాయం అడుగుతుంటే మా గొంతు నొక్కుతున్నారు.. దమ్ముంటే రాజకీయంగా మాట్లాడండి.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పనికిరాదు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా లోపాలను ఒప్పుకోండి. స్పష్టమైన ప్రకటన చేయండి. విచారణ చేసి నిజాలపై వివరణ ఇవ్వండి. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఆపేది లేదు. శాఖాపరంగా, ప్రభుత్వం పరంగా అనేక రకాలుగా పొరపాట్లు జరిగాయి. ఇవన్నీ ప్రజలకు తెలియాలి అంటే సీబీఐ విచారణ జరిపించాలి. అంతులేని అక్రమాలకు కారకుడైన మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: మెగా డీఎస్సీల్లో అక్రమాలు ‘ఖోఖో’ల్లలు -
వారిద్దరిపై విచారణ జరపండి
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందినట్లు చెబుతున్న ఇద్దరు అభ్యర్థుల క్రీడా ధ్రువపత్రాలపై ఆంధ్రప్రదేశ్ ఖోఖో సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి మంగళవారం లేఖ రాశారు. చిల్లా మోహినీదేవి, సీహెచ్ యోగేశ్వరరావు సమర్పించినట్లు చెబుతున్న క్రీడా ధ్రువపత్రాల ప్రామాణికతను పరిశీలించాలని ఆ లేఖలో ఆయన కోరారు. వీరి సర్టిఫికెట్ల ధ్రువీకరణ కోసం శాప్ నుంచి తమ సంఘానికి ఎలాంటి సమాచారం, ఈ – మెయిల్ లేదా అభ్యర్థన రాలేదని స్పష్టం చేశారు. సంబంధిత టోర్నమెంట్‌కు సంబంధించి క్రీడాకారుల జాబితా, అధికారిక రికార్డుల్లో మోహినీదేవి, యోగేశ్వరరావు పేర్లు కనిపించలేదని తెలిపారు. వారి పేర్లతో తాము ఎలాంటి ప్రామాణికత, ధ్రువీకరణ పత్రాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. కాబట్టి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం పొందేందుకు సమర్పించిన ధ్రువపత్రాల చెల్లుబాటుపై సమగ్రంగా పరిశీలించాలని కోరారు. నకిలీ, ఫోర్జరీ లేదా అనధికారిక సర్టిఫికెట్లు సమర్పించినట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత క్రీడాకారుల జాబితా, రికార్డుల కాపీలను లేఖకు ఆయన జత చేశారు. అంతేకాకుండా ఖోఖో సంఘం వద్ద ఉన్న రికార్డులు, సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను స్వయంగా తానే వెళ్లి శాప్‌కు అందజేశానని, ఈ–మెయిల్ ద్వారా కూడా పంపించామని సీతారామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
మెగా డీఎస్సీలో అక్రమాలు ‘ఖోఖో’ల్లలు!
సాక్షి, అమరావతి: క్రీడల్లో ప్రతిభ కనబరిచి కష్టపడి ఆడిన క్రీడాకారులకు అన్యాయం చేసిన బాబు సర్కారు అసలు ఆటల్లో పాల్గొనని వారికి మెగా డీఎస్సీలో ఉద్యోగాలిచ్చేసింది! బంగారు పతకాలు సాధించిన వారిని పక్కనపెట్టి, నకిలీ పార్టీసిపేషన్ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కొలువులు కట్టబెట్టింది. మెగా డీఎస్సీ 2025 స్కామ్‌లో మరిన్ని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో నకిలీ ఖోఖో సర్టీఫికెట్‌తో డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఆట ఆడలేదు.. అయినా ఉద్యోగం.. మెగా డీఎస్సీలో ఎంపికైన పీవీసీహెచ్ బసవేశ్వరరావు మార్కాపురం (ఉమ్మడి ప్రకాశం) జిల్లా పుల్లలచెరువు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2015లో కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 49వ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇంటర్ డి్రసిక్ట్ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు ఆయన డీఎస్సీలో సర్టీఫికెట్ సమర్పించాడు. కానీ ఆయన అసలు ఆ పోటీల్లో పాల్గొనలేదు. ఖోఖో ఆటకి, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆ టోర్నమెంట్లో ప్రకాశం జిల్లా జట్టుకి 3వ స్థానం లభించింది. మూడో స్థానం సాధించిన 12 మంది సభ్యుల జట్టు దిగిన గ్రూప్ ఫొటోలోనూ బసవేశ్వరరావు లేడు. అయినా సరే బసవేశ్వరావుకి పార్టీసిపేషన్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందనేది అధికారులకే తెలియాలి. అదేవిధంగా చిల్లా మోహినీదేవి, సి.హెచ్. యోగేశ్వరరావు అనే మరో ఇద్దరు అభ్యర్ధులు సమర్పించినట్లు చెబుతున్న క్రీడా ధ్రువపత్రాల ప్రామాణికతపైనా ఖోఖో సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఏపీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు ఓ లేఖ కూడా రాసింది. స్పోర్ట్స్ కోటాలో దొడ్డిదారిలో ఉద్యోగాలిచ్చినట్లు ఇప్పటికే అనేక ఉదంతాలు బయటకు రాగా తాజాగా మరో బాగోతం బయట పడింది. మావద్ద లేవు.. బసవేశ్వరరావు గురించి అప్పటి ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి భవనం కాశీవిశ్వనా«థరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా తమ వద్ద అమ్మాయిల వివరాలు మాత్రమే ఉంటాయని, అబ్బాయిల వివరాలు ఫెడరేషన్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. నిజానికి రాష్ట్రం తరపున ఆడిన క్రీడాకారుల వివరాలు ఫెడరేషన్ వద్ద ఉంటాయి. జిల్లా స్థాయిలో అడిన వారి వివరాలు కార్యదర్శి వద్దనే ఉంటాయి. అంటే కావాలనే విశ్వనాథరెడ్డి తప్పించుకునే యత్నం చేస్తున్నారని స్పష్టం అవుతోంది. అడగడానికి మీరెవరు..? ఈ అంశంపై వివరణ కోరేందుకు బసవేశ్వరరావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించింది. తాను ఖోఖో క్రీడాకారుడినేనని, గుడివాడలో జరిగిన ఛాంపియన్ షిప్లో పాల్గొన్నానని బసవేశ్వరరావు చెప్పారు. తాను సమర్పించిన సర్టీఫికెట్ నకిలీది కాదన్నారు. ఆడకుండా, ఆడానని చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇంతకుమించి వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ‘నన్ను అడగడానికి మీరెవరు..?’ అంటూ సాక్షి ప్రతినిధిపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు.అతను ఆడలేదని ముందే చెప్పాం..స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీలో అర్హత సాధించిన 42 మంది అభ్యర్ధులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)కు ముందే పంపించాం. అందులో బసవేశ్వరరావుతో పాటు మరి కొందరు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని, వారు ఖోఖో ఆడలేదని, మావద్ద వారికి సంబంధించి ఎలాంటి వివరాలు లేదని స్పష్టంగా చెప్పాం. అయినప్పటికీ వారిలో కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు. బసవేశ్వరరావు సమర్పించిన పార్టీసిపేషన్ సర్టీఫికెట్ పూర్తిగా నకిలీది. అతను గుడివాడలో జరిగిన ఖోఖో ఛాంపియన్ షిప్లో పాల్గొనలేదు. – మేకల సీతారామిరెడ్డి, 2012–25 వరకు ఆంధ్రప్రదేశ్ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి -
అర్హత లేని వారికి టీచర్ పోస్టులా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మెగా డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో అక్రమాలను కప్పిపుచ్చుతూ చంద్రబాబు సర్కారు బుకాయింపులు, బెదిరింపులకు దిగిన తరుణంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన కీలక ఆదేశాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పోటీ పరీక్షలు లేకుండా అడ్డదారి విధానాలతో టీచర్ల నియామకాలు చేపడితే తరతరాల భవిష్యత్తు నాశనం అవుతుందని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. నిర్దేశిత అర్హతలు లేనివారికి టీచర్ పోస్టులు కట్టబెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారా? అని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ యాక్ట్), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చట్టాల ప్రకారం, నిర్దేశిత అర్హతలు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులుగా నియమించరాదని తేల్చి చెప్పింది. ఒకవేళ అలాంటి వారిని నియమిస్తే సర్వీసులో కొనసాగించరాదని స్పష్టం చేసింది. ఈమేరకు ఆయా చట్టాల ప్రకారం, నిర్దేశిత అర్హతలు లేని ఉపాధ్యాయుల నియామకాలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాల ఇష్టానుసార నియామకాలపై పిల్.. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అక్రమాల మయంగా మారడం.. మెగా డీఎస్సీపై రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తుండటం.. స్పోర్ట్స్ కోటా ముసుగులో ప్రతిభకు పాతరవేసి ఇష్టారాజ్యంగా జీవోలతో అనర్హులకు ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పారదర్శకత, పోటీ పరీక్షల ప్రక్రియ లేకుండా ప్రైవేట్ లేదా వెంచర్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పోటీ పరీక్షల ప్రక్రియ లేకుండా నిర్దేశిత అర్హతలు లేనివారిని నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించడంపై పిటిషనర్లు పిల్లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు (ఆర్టికల్ 14), ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల హక్కు (ఆర్టికల్ 16)లను ఈ విధానాలు ఉల్లంఘిస్తున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ నివేదించారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విద్యావ్యవస్థలోని లోపాలపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనర్హులకు టీచర్ పోస్టులపై సీజేఐ సీరియస్.. అనర్హులైన వ్యక్తులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టడంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అనర్హులైన వ్యక్తులను ఎందుకు నియమిస్తున్నారు? విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా చెలగాటమాడతారు?’’ అని మండిపడ్డారు. ఉపాధ్యాయుల నియామకాల్లో నిబంధనలను తప్పించుకునేందుకు ప్రభుత్వాలు అనర్హులను ‘ట్యూటర్లు’ లాంటి రకరకాల పేర్లతో నియమిస్తూ విద్యా ప్రమాణాలను భ్రష్టు పట్టిస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ‘‘ఈ రకమైన విధానాలతో వారు తరతరాల భవిష్యత్తును నాశనం చేస్తారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అర్హతలు లేకుండా నియమించొద్దు.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీఈ, ఎన్సీటీఈ, యూజీసీ నిబంధనల ప్రకారం నిర్దిష్ట అర్హతలు లేనిదే ఏ ఒక్కరినీ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ సర్వీసులో నియమించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజేశ్ చౌహాన్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.సీబీఐ విచారణకు ఆదేశించాలి సుప్రీం తీర్పు నేపథ్యంలో.. ఏపీలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. ఈ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో కనీసం పరీక్షలు కూడా లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం, స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో ఎక్కువ ఫేక్‌గా నిర్ధారణ కావడం, టెట్ అర్హత లేనివారికి ఉద్యోగాలు ఇవ్వడం, మెరిట్ అభ్యర్థులను పక్కనపెట్టి అర్హతలు లేనివారికి ఉద్యోగాలు ఇవ్వడం.. వంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ మెగా డీఎస్సీ స్కాం వెనుక మెగా హ్యాండ్ ఎవరన్నది బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి. – రామచంద్ర, ఏపీ విద్యార్థి, నిరుద్యోగ యువజన జేఏసీ కన్వీనర్ న్యాయవ్యవస్థ చెప్పినా లెక్కలేనితనం ఉపాధ్యాయ నియామకాల్లో టెట్సహా సంబంధిత నియమ నిబంధనలను అన్నింటినీ తప్పనిసరిగా పాటించాలని న్యాయ వ్యవస్థ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారు. డీఏస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత రావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే స్వచ్ఛందంగా సీబీఐ విచారణకు ముందుకు రావాలి. అయితే ఈ దిశలో మంత్రి లోకేశ్ వెనుకడుగు వేయడాన్ని చూస్తే.. తప్పు జరిగినట్లు అర్థమైపోతోంది. – బండేల నాసర్జి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శినిష్పక్షపాత విచారణ జరిపించాలి రాష్ట్రంలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అవకతవకలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి. ఎటువంటి అవకతవకలు జరగలేదని ఒకపక్క చెబుతున్న ప్రభుత్వం మరోవైపు కొంతమందిని అరెస్టు చేయడం, పలు ఘటనలపై విచారణకు ఆదేశించడం అనుమానాలకు తావిస్తోంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పారదర్శకత లోపించడం వల్ల ఏళ్ల తరబడి కష్టపడి చదువుతూ రూ.లక్షల ఖర్చు చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. – కె.ప్రసన్న, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీబీఐ విచారణతో నిజాలు నిగ్గుతేలుతాయి విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే ఉపాధ్యాయుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాలో నియామకాలపై వస్తున్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలి. కొంతమంది అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లతో తమకు సంబంధం లేదని పలు అసోసియేషన్లు స్వయంగా అధికారులకు లేఖలు రాయడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సీబీఐ విచారణతోనే నిజాలు నిగ్గుతేలుతాయి. – ఎన్.నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
ఏపీ డీఎస్సీ స్కామ్‌లో సంచలన పరిణామం
సాక్షి,విశాఖ: ఏపీ డీఎస్సీ స్కామ్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో టీచర్ ఉద్యోగాలు పొందిన చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఫేక్ అని తేలడంతో చర్చాంశనీయమైంది. ఈ వ్యవహారంపై ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) అధికారులకు సంచలన లేఖ రాశారు.ఈ ఫేక్ సర్టిఫికేట్ల బండారాన్ని సాక్షి టీవీ తొలుత బయటపెట్టగా, తాజాగా ఖోఖో అసోసియేషన్ అధికారిక లేఖతో విషయం మరింత స్పష్టమైంది. శాప్‌కు రాసిన లేఖలో‘చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలకు సర్టిఫికేట్లు మేం ఇవ్వలేదు.శాప్ నుండి వీళ్ల అభ్యర్థిత్వంపై ఎలాంటి సమాచారం మాకు అందలేదు. వీళ్లు ఇద్దరికి మేం ఎలాంటి మెరిట్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. మా టోర్నమెంట్ల జాబితాల్లో ఎక్కడా వీరి పేర్లు లేవు. శాప్‌కి మేం పూర్తి వివరాలు అందిస్తున్నాం. వీళ్లు పొందుపర్చిన సర్టిఫికేట్లు చెల్లవు.నకిలీ, ఫోర్జరీ సర్టిఫికేట్లపై విచారణ జరపాలి. ఆ సర్టిఫికేట్లపై చర్యలు తీసుకోవాలి. శాప్‌కి మేం పూర్తి సహకారాన్ని అందిస్తాం’అని ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
‘టెట్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’
తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై 3.30 లక్షల మంది నిరుద్యోగుల తరఫున జూన్ నెల నుంచే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసిన మోసాలు బయటపడటంతో సమాధానం చెప్పలేక ఇద్దరు ఐఏఎస్ అధికారులను ముందుకు నెట్టి అబద్ధాలు చెప్పిస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. స్పోర్ట్స్ కోటా అక్రమాలలో శాప్ పాత్ర ఉందని, అధికారుల ప్రెస్మీట్లో మీడియాను బెదిరించినట్లు ఉందన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, డీఎస్సీ కన్వీనర్, శాప్ చైర్మన్ చేసిన తప్పులను అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమాలన్నింటిపై విచారణ జరిపి తప్పులను తేల్చాల్సిన రోజు అధికారులకు వస్తుంది. స్పోర్ట్స్ డీఎస్సీ, మెగా డీఎస్సీల్లో టెట్ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. ఈడిగ ప్రభాకర్‌కు టెట్ అర్హత లేదని స్వయంగా అతనే ఒప్పుకున్నా, 2018లో 77 మార్కులు వచ్చాయని పీపీటీ ద్వారా అబద్ధపు ప్రచారం చేశారు. ఎస్జీటీ పోస్టుకు పేపర్ వన్-ఏ అవసరమైతే, స్పెషల్ స్కూల్స్‌కు వర్తించే పేపర్ టు-బి మార్కులను చూపించి కమిషనర్ ప్రజలను తప్పుదారి పట్టించారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ పరిశీలిస్తే ఎక్కడా ప్రభాకర్‌కు పేపర్ టు-బి రాసిన దాఖలాలు లేవు. డీఎస్సీ ప్రక్రియ ముగిసిన తర్వాత 2025లో జరిగిన టెట్ పరీక్షను ప్రభాకర్ ఎందుకు రాయాల్సి వచ్చిందో అధికారులు సమాధానం చెప్పాలి. జే ఉషా స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్‌కు దరఖాస్తు చేసుకుంటే, ఆమెకు ఏకంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టు కేటాయించారు. 2017 తర్వాత లాంగ్వేజ్‌లకు ప్రత్యేకంగా టెట్ పాస్ కావాలన్న నోటిఫికేషన్ నిబంధనలను ఉల్లంఘించి ఉషాకు పోస్టు ఇచ్చారు. రాజ్ కుమార్ అనే వ్యక్తికి అర్హత లేకపోయినా, డీఎస్సీ రాయకపోయినా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉద్యోగం కట్టబెట్టారు. తప్పులను ప్రశ్నిస్తున్న మీడియాకు, అభ్యర్థులకు వార్నింగులు ఇస్తూ అక్రమ కేసులు పెడతామని శాప్ ఎండీ బెదిరిస్తున్నారు. జూడో క్రీడలో జరిగిన ఘోరమైన అవకతవకలను రెండు అసోసియేషన్ల మధ్య గొడవగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూస్తున్నారు. 2025 సెప్టెంబర్‌లోనే రిక్రూట్మెంట్ ముగిస్తే, 2026 జూన్‌లో వెబ్సైట్ ద్వారా సర్టిఫికెట్లను అక్రమంగా మార్చేశారు. పెద్దాడ అప్పలరాజుకు తన తమ్ముడి సర్టిఫికెట్తో ఉద్యోగం ఇచ్చిన విషయం అధికారిక వెబ్సైట్ ద్వారానే బట్టబయలైంది.ఆర్చరీ, కబడ్డీ అభ్యర్థుల సర్టిఫికెట్లు, విజయాల వివరాలను కూడా అధికారులు నిస్సిగ్గుగా ట్యాంపరింగ్ చేశారు. ఎమ్మెల్యే పూనా రవికుమార్ సంతకాలతో ఇచ్చిన సర్టిఫికెట్లను చెల్లుబాటు చేయడానికి నకిలీ ఆథరైజేషన్ లెటర్లను సృష్టిస్తున్నారు. జీవో నెంబర్ 4, 47 ప్రకారం సెక్రటరీ లేదా జనరల్ సెక్రటరీ మాత్రమే సంతకం చేయాలన్న రూల్ ఉంటే గౌరవ అధ్యక్షుడి సంతకాలను ఎలా ఆమోదిస్తారు. 2018 నోటిఫికేషన్ ప్రకారం స్పోర్ట్స్ పర్సన్లకు గ్రౌండ్ పెర్ఫార్మెన్స్కు 20 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చే నిబంధనను ఎందుకు రద్దు చేశారు. జిల్లా స్థాయిలో డీఎస్డీవోల ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే పద్ధతిని పూర్తిగా తొలగించి శాప్‌లో కూర్చుని అక్రమాలకు పాల్పడ్డారు. కలెక్టర్లు, డీఈవోల ఆధ్వర్యంలో జరగాల్సిన 1:1 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను పూర్తిగా ఎత్తేసి నియామక పత్రాలు ఇచ్చారు. అభ్యర్థులు పెట్టుకున్న గ్రీవెన్స్‌లను కనీసం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా, శాప్ లేఖలు రాసినా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అర్హులకు న్యాయం చేయకుండా తొక్కిపెట్టింది. కోర్టు ఆదేశాలు ఉన్న 100 జెన్యూన్ కేసులను స్వయంగా తీసుకొస్తాం, గ్రీవెన్స్ ద్వారా బాధితులకు న్యాయం చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’ ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు -
AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి
-
‘డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు జరిగినట్టు అధికారులు అంగీకరించారు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని చెప్పారు.. అంటే అక్రమాలు జరిగినట్టు తేలిపోయింది. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి’’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజిలెన్స్‌తో కాకుండా సీబిఐతో విచారణ జరిపించాలన్నారు.‘‘ఈ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం ఉంది. 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలేవీ?. ఇప్పటికీ అక్రమాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?. పచ్చి అబద్దాలతో మంత్రి లోకేష్ అసెంబ్లీని సైతం అవమాన పరిచారు. వైఎస్ జగన్‌కు సవాల్ చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. డీఎస్సీ అక్రమాల వెనుక వ్యవస్తీకృత నేరం ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అక్రమాలు చేశారు...జూడో అసోసియేషన్ ఛైర్మన్ భరత్ సాక్షాత్తూ నారా లోకేష్ తోడల్లుడే. ఆ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇవన్నీ బయట పడాలంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైఎస్ జగన్‌కి సవాల్ చేసే స్థాయి లోకేష్‌కి లేదు. లోకేష్ ఎమ్మేల్యే కాకముందే నేను ఎంపీ అయ్యాను. లోకేష్‌తో చర్చకు నేను సిద్ధం. కరకట్ట ఇల్లయినా, హైదరాబాదు ఇంటికైనా చర్చకు వస్తా. డేటు, టైం లోకేష్ ప్రకటించాలి’’ అని మార్గాని భరత్ సవాల్ విసిరారు. -
మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు
-
ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..
-
DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట
-
DSC స్కామ్ పై లోకేష్ ఛాలెంజ్ లు నాగమల్లేశ్వరి అదిరిపోయే కౌంటర్
-
MAGAZINE Story: దగా DSCలో మెగా స్కామ్
-
DSCలో అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం అంగీకారం
-
ఇదే కదా అసలైన ఫేక్ పాలన అంటే
-
మతం, కులం మార్చేసి.. మెగా డీఎస్సీలో పోస్టింగ్!
పిఠాపురం: డీఎస్సీ అక్రమాల చిట్టా చాంతాడులా పెరుగుతోంది. నష్టపోయిన ప్రతిభావంతులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. ఇన్నాళ్లూ ఒంటరిగా కుమిలిపోయిన బాధిత అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. డీఎస్సీ ముసుగులో సర్కారు నిర్వాకాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఏకంగా మతం, కులం మార్చేసి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు తేలడం నివ్వెరపరుస్తోంది. తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. మెగా డీఎస్సీ 2025లో కుల ధ్రువీకరణ పత్రం విషయంలో జరిగిన అవకతవకలపై విచారించి మెరిట్లో ఉన్న తనకు న్యాయం చేయాలని కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన షేక్ అమీరుద్దీన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి... ఇదీ జరిగింది..! బీసీ ‘ఈ’ కేటగిరీకి చెందిన షేక్ అమీరుద్దీన్ డీఎస్సీ–2025లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ మెరిట్ జాబితాలో 1,014వ ర్యాంకు సాధించాడు (హాల్‌టికెట్ నంబర్ ఎంఎస్సీ 0015369). అయితే బీసీ ‘బి’ కేటగిరీకి చెందిన సక్కు లక్ష్మీ సునీత.. బీసీ ‘ఈ’ (మైనారిటీ) కేటగిరీలో టీచర్ ఉద్యోగం పొందారు. కాట్రేనికోన మండలం కందికుప్ప జెడ్పీ హైస్కూల్లో ఆమెను నియమించారు. దీంతో బీసీ ‘ఈ’ కేటగిరీలో తనకు రావాల్సిన ఉద్యోగాన్ని షేక్ అమీరుద్దీన్ కోల్పోయాడు. లక్ష్మీ సునీత ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యాసంస్థల రికార్డుల్లో బీసీ ‘బి’(హిందూ అచ్చుకట్టువారు)గా నమోదైనట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. 1998లో జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రంలోనూ ఆమెను బీసీ ‘బి’గా పేర్కొన్నారు. అయితే 2025 ఆగస్టు 18న పెద్దాపురం తహసీల్దారు నుంచి లక్ష్మీ సునీత బీసీ–ఈ ధ్రువీకరణ పత్రం పొందారు. -
సర్టిఫి‘కేట్లు’ కలకలం..!
సాక్షి, విశాఖపట్నం: మెగా డీఎస్సీలో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారగా.. ఉమ్మడి విశాఖతోపాటు ఇతర జిల్లాల్లోనూ నకిలీ ధ్రువపత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కోటాతోపాటు వీహెచ్ (విజువల్లీ హ్యాండీక్యాప్డ్), ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కేటగిరీల్లోనూ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి, మెరిట్‌ను పక్కనపెట్టి ఉద్యో గాలు పొందారన్నది పలువురు బాధిత అభ్యర్థుల ప్రధాన ఆరోపణ. 66.6 మార్కులొచ్చినా..విశాఖకు చెందిన దేవగుటపు సంతోష్ పార్వతి డీఎస్సీ పీజీటీ పరీక్షలో 66.6 మార్కులు (హాల్ టికెట్ నెం. ఎండీఎస్సీ 0124213) సాధించారు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు జోన్–1లో 92వ ర్యాంక్ లభించింది. పీజీటీలో మొత్తం 10 పోస్టులు ఉండగా తనకంటే చాలా తక్కువ మార్కులు సాధించిన వ్యక్తికి వీహెచ్ కోటా కింద ఉద్యోగం దక్కడం వల్ల తనకు అవకాశం చేజారిందని ఆమె వాపోతోంది. 46 మార్కులతో 852వ ర్యాంక్ పొందిన అశోక్‌కుమార్‌కు (హెచ్‌టీ నెం.ఎండీఎస్సీ 0242090) ఈడబ్ల్యూఎస్, వీహెచ్ కోటా కింద ఉద్యోగం లభించింది. తనకు రావాల్సిన ఉద్యోగాన్ని నకిలీ వీహెచ్ సర్టిఫికెట్ ద్వారా పొందినట్లు సంతోష్ పార్వతి ఆరోపిస్తోంది. ఇదే రీతిలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన భాస్కర్‌రెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో 72.52 మార్కులతో 68వ ర్యాంక్ సాధించినప్పటికీ ఉద్యోగం దక్కలేదని సంతోష్ పార్వతి చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్ నుంచి నకిలీ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ తెచ్చుకున్న గోనెగుంట సుభాషిణి టెట్ అర్హత కూడా లేకపోయినా 48 మార్కులతో ఉద్యోగం పొందారని ఆమె ఆరోపిస్తున్నారు. మరోవైపు మదనపల్లికి చెందిన అంజనప్పకు ఒక కన్ను లేకపోయినా.. వైద్య పరీక్షల్లో 30 శాతం వైకల్యమే ఉన్నట్లు నిర్ధారించడంతో ఉద్యోగం ఇవ్వలేదని బాధిత అభ్యర్థులు చెబుతున్నారు. రీ–వెరిఫికేషన్‌లో 40 శాతం వైకల్యం ఉన్నట్లు తేలిందని పేర్కొంటున్నారు. తనకు ఇది చివరి డీఎస్సీ అని, వయసు కారణంగా మరోసారి పరీక్ష రాసే అవకాశం లేదని పార్వతి చెబుతున్నారు. బంగారం తాకట్టు పెట్టి సుమారు రూ.60 వేల వరకు ఖర్చు చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు.700 మందికిపైగా నష్టపోయారా?రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ సాధించి 1 : 1 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు హాజరైన 700 మందికిపైగా అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి లోకేశ్‌తోపాటు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మండిపడుతున్నారు. -
దొరికిపోయినా దబాయింపు!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు నానా తంటాలు పడుతోంది. అక్రమాల మయంగా మారిన నియామక ప్రక్రియలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి రావడం.. స్పోర్ట్స్ కోటా ముసుగులో ఇష్టారాజ్యంగా జీవోలు.. ప్రతిభ, పారదర్శకతకు పాతర.. బాధిత అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరుగా బహిర్గతం చేయడం.. విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయడంతోపాటు సీబీఐ విచారణకు ఆదేశించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుండటంతో బాబు సర్కారు కట్టు కథలు వినిపిస్తోంది. సర్టీఫికెట్లు చూపించాలని అడిగితే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది. ఉన్నతాధికారులను రంగంలోకి దించి తప్పులను కప్పిపుచ్చే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్ ఎస్.భరణి సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ కుంభకోణంపై వరుసగా వస్తున్న కథనాల్లో వాస్తవం లేదంటూనే, జూడో అసోసియేషన్ ఇచ్చిన ప్రతి సర్టీఫికెట్పైనా విచారణ జరుగుతుందని చెప్పారు. తద్వారా తప్పిదాలను పరోక్షంగా అంగీకరించారు! ముఖ్యంగా కర్నూలుకు చెందిన టీచర్ ప్రభాకర్‌పై వచ్చిన ఆరోపణల్లో కొంత గందరగోళం ఉందని, విచారణకు త్రిసభ్య కమిటీని నియమించామని చెప్పడం గమనార్హం. మాట్లాడుతున్న భరణి, అన్సారియా అసోసియేషన్లు చెప్పిందే వేదం..! స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసిన సర్టీఫికెట్ల ఆధారంగానే అభ్యర్థుల అర్హతలను పరిగణించినట్లు శాప్ వైస్ చైర్మన్ భరణి పేర్కొన్నారు. సర్టీఫికెట్లను పూర్తిస్థాయిలో పరిశీలించే అధికారం, వ్యవస్థ తమ పరిధిలో లేదని ఆమె చెప్పడం గమనార్హం. సాధారణంగా అసోసియేషన్లు జారీ చేసే ధ్రువపత్రాలను ఒరిజినల్‌గానే భావిస్తామని ఆమె స్పష్టం చేశారు. అంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న అసోసియేషన్‌కు కనీసం గుర్తింపు లేకపోయినా, నిబంధనల ప్రకారం అసోసియేషన్ సెక్రటరీ మాత్రమే అభ్యర్ధుల ధృవీకరణ లేఖపై సంతకం చేయాల్సి ఉన్నా, కూన సంతకం ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. కూన రవికుమార్‌ను తాము ఎమ్మెల్యేగా చూడటం లేదని, అసోసియేషన్ అధ్యక్షుడిగానే చూస్తున్నామని, ఆయన సంతకాన్ని ఆమోదించాలని ఫెడరేషన్ చెప్పిందని భరణి పేర్కొన్నారు. అభ్యర్థి పెద అప్పలరాజు తన సర్టిఫికెట్లను ఆన్లైన్లో తప్పుగా అప్లోడ్ చేశారని, ఆయన సర్టిఫికెట్తో పాటు సోదరుడి సర్టీఫికెట్ కూడా ఇచ్చారని, ఇది కేవలం మానవ తప్పిదమని వెనకేసుకొచ్చారు. భార్యాభర్తలకు ఉద్యోగాలు రాకూడదా? 41 ఏళ్లు ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వకూడదా? అని ప్రశ్నించారు. ఎలాంటి మార్కులు రాకపోయినా, స్పోర్ట్స్ మెరిట్ ఉంటే ఉద్యోగాలిస్తామని చెప్పారు. జరగని టోర్నమెంట్‌పై దాటవేత.. ‘ఖమ్మంలో టోర్నమెంట్ జరిగిందంటూ జూడో సర్టీఫికెట్లతో వచ్చిన నలుగురు అభ్యర్ధులకు ఉద్యోగాలిచ్చారు. కానీ అక్కడ అసలు ఆ టోర్నమెంట్ జరగలేదు. జరగని టోర్నమెంట్లో పాల్గొని, సర్టీఫికెట్లు ఎలా తెచ్చారని విచారణ జరిపారా?’ అని ప్రశ్నించగా.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము ఏమీ మాట్లాడలేమని భరణి సమాధానం దాటవేశారు. 372 సర్టీఫికెట్లపై విచారణ చేయడం సాధ్యం కాదన్నారు. సర్టీఫికెట్లు ఇచ్చేది మేం కాదు.. కేసులు పెడతాం! టీచర్లందరికీ టెట్ తప్పనిసరి అని అన్సారియా స్పష్టం చేశారు. వల్లూరులో టీచర్‌గా నియమించిన ప్రభాకర్ టెట్‌లో అర్హత సాధించలేదు కదా? అని ప్రశ్నించగా.. టెట్ ఎన్నిసార్లయినా రాయవచ్చని, అతడు ఒకసారి రాసినప్పుడు 77 మార్కులతో అర్హత సాధించాడని, అయినప్పటికీ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్నూలులో ఉష అనే ఉపాధ్యాయురాలు టెట్‌లో తెలుగు సబ్జెక్ట్‌లో అర్హత సాధించలేదు. అలాంటప్పుడు ఆమెకు ఉద్యోగం ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఏ సబ్జెక్ట్ బోధించే టీచర్ ఆ సబ్జెక్టులో టెట్ అర్హత సాధించాల్సిన అవసరం లేదని అన్సారియా పేర్కొన్నారు. ‘ఈడబ్ల్యూఎస్ సర్టీఫికెట్లలో చాలా వరకూ ఫేక్ అని ఇప్పటికే రుజువైంది. ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కూడా ఇచ్చి వాటి ఆధారంగా డీఎస్సీలో ఉద్యోగాలు కట్టబెట్టారు..’ అనే ప్రశ్నలపై అన్సారియా దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఆ అంశం తమ పరిధిలోనిది కాదన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చేది తహసీల్దార్లు కాబట్టి రెవెన్యూ విభాగానికి చెప్పి విచారణ చేయిస్తామంటూ తప్పించుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందికి ఫోన్లు చేసి సర్టీఫికెట్లు చూపించాలని అడుగుతున్నారని, అలా ఎవరైనా అడిగితే వారిపై చర్యలు తీసుకుంటామని అన్సారియా హెచ్చరించారు. కుప్పంలో ఇలాంటి ఘటన జరిగితే 24 గంటల్లోనే ఓ విలేకరి, కెమెరామెన్‌పై కేసు నమోదు చేశామన్నారు. -
"అక్రమాలు చేయడం చంద్రబాబు నైజం"
సాక్షి,వైఎస్సార్: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అక్రమాలు చేయడమనేది చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌కు నైజంగా మారిందన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అబద్ధాలు అక్రమాలతో కూటమి ప్రభుత్వం నడుస్తోందని ఏపీలో టెట్ రాయకపోయినా టీచర్ ఉద్యోగం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటలు ఆడకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేశారని చంద్రబాబు మెుసలి కన్నీరు కారుస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి’అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. -
డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అంగీకారం!
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో బయటపడుతున్న అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అంగీకరించింది జూడో సర్టిఫికెట్లపై విజిలెన్స్ విచారణ చేపడుతున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్ - SAAP) ప్రకటించింది.ఈ వివాదంపై శాప్ వైస్ చైర్మన్ భరణి స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ‘స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పూర్తి స్థాయి పరిశీలన మా పరిధిలో సాధ్యం కాదు. స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసే సర్టిఫికెట్లను మేము ప్రాథమికంగా ఒరిజినల్‌గానే భావిస్తాము’ అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, అక్రమాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. కర్నూలుకు చెందిన ఉపాధ్యాయుడు ప్రభాకర్‌పై వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. మరోవైపు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అన్సారియా ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామని, ఆ నివేదిక రాగానే తగిన నిర్ణయం తీసుకుంటామని శాప్ వైస్ చైర్మన్ భరణి వెల్లడించారు. -
లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్
-
సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు
-
కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?
-
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్‌రెడ్డి
వైఎస్సార్ జిల్లా: డీఎస్సీని సక్రమంగా నిర్వహిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగం రావడం ఏమిటని ప్రశ్నించారు. సాఫ్ట్ బాల్ సంఘం వ్యక్తి భార్యకు ఉద్యోగం రావడం ఏమిటి? అని అన్నారు.‘‘నిజాలు బయటకు వస్తే మీరు దోషులుగా నిలబతారనే భయం మీకు ఉంది. అసమర్థ విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగాయి. ఏదో ఒక రోజు మీరంతా చట్టం ముందు నిలబడాల్సిందే. చర్చకు రమ్మని మాపై సవాలు విసరడం కాదు. ఫిర్యాదు చేసిన 30,000 మందితో చర్చ పెట్టు. నీకు నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే వాటికి సమాధానం చెప్పు. వాస్తవాలు చెప్తూ తప్పుని ఎత్తిచూపితే సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నారు. వాళ్లు చెప్పుకునే గొప్పలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లాలని ఈ కుట్ర. వాళ్ల తప్పులు బయటకు రాకూడదని మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు టీడీపీటీడీపీ నాయకులు పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. విచ్చలవిడిగా సంపాదించిన డబ్బు వారి వద్ద ఉందని తెలిపారు. మేము వైఎస్సార్సీపీ, వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలు చూపి ముందుకు వెళ్తున్నాం. కార్యకర్తలంతా సమష్టిగా ఎన్నికలలో పనిచేయాలి. ప్రభుత్వం అన్ని రకాలా విఫలమైంది. సాగు, తాగు నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పతి చేస్తుంటే మన ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుంది.రాయలసీమలో ఒక్క రిజర్వాయర్‌కూ నీళ్లు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వేధించిన అందరం సమష్టిగా ఎదుర్కొందాం. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటాం’’ అని తెలిపారు. -
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీలో మరో భాగోతం బయటపడింది. వైఎస్సార్ జిల్లాలో తప్పుడు కుల ధృవీకరణతో ఉద్యోగం పొందిన రసూల్‌పై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రసూల్ తప్పుడు కుల దృవీకరణ పెట్టాడని బద్వేలు ఆర్డీవో చంద్ర మోహన్ తేల్చడంతో రసూల్ బండారం బయపడింది. దీనికి సంబంధించిన విచారణ నివేదికను ఆర్డీవో.. కలెక్టర్‌కు పంపారు.అయితే ఆ నివేదికను కూటమి ప్రభుత్వం తొక్కిపెట్టింది. అయితే ‘సాక్షి’ చేతికి ఆర్డీవో విచారణ రిపోర్ట్ చిక్కింది. నకిలీ కుల ధృవీకరణతో రసూల్ ఉద్యోగం పొందాడని స్పష్టంగా ఆ రిపోర్ట్ తెలియజేస్తున్నది. దీంతో రసూల్‌ను జిల్లా అధికారులు కాపాడుతున్నారని తెలియవస్తోంది. రసూల్ నకిలీ కుల ధృవీకరణతో తనకు రావాల్సిన ఉద్యోగాన్ని కొట్టేశాడని జమీల్ ఫిర్యాదు చేశారు. 2008, 2012, 2018 డీఎస్సీలలో బీసీ ఈ సరిఫికేట్ రసూల్ పెట్టాడని తేలింది. అయితే 2025 మెగా డీఎస్సీలో మాత్రం తాను ఓసీ ఈడబ్ల్యూఎస్‌గా రసూల్ నమోదు చేసుకున్నాడు. దీంతో జమీల్ కు రావాల్సిన ఉద్యోగం రసూల్‌కి దక్కింది.జమీల్ పిర్యాదుపై విచారణకు జిల్లా అధికారులు ఆదేశించారు. విచారణలో స్పష్టంగా తప్పుడు సర్టిఫికెట్ పెట్టాడని రుజువైంది. అయితే తాను ఆర్ధిక స్థితిని తెలిపేందుకే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఇచ్చానని తహసీల్దార్ తెలిపారు. ఆయన ఇచ్చిన సర్టిఫికెట్‌ను అక్రమంగా మెగా డీఎస్సీ కి వాడారని ఆర్డీవో చంద్ర మోహన్ నివేదిక తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆర్డీవో చంద్ర మోహన్ ఈ నివేదిక పంపారు. డిసెంబర్ 2025లో నివేదిక సమర్పిచినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఇప్పటికీ సుండుపల్లి మండలంలో రసూల్ ఉద్యోగం చేస్తుండటంతో విద్యార్థులు,స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్ -
టోర్నీ జరగలేదు.. సర్టిఫికెట్ వచ్చింది!
ఖమ్మం స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో బయటపడుతున్న అక్రమాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగని టోర్నీకి సర్టిఫికెట్ సృష్టించి.. దాని ఆధారంగా ప్రకాశం జిల్లాలో ఓ మహిళ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 2013లో రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ఖమ్మం జిల్లా కేంద్రంలో 2013 అక్టోబర్ 19నుంచి 21వరకు జూనియర్ కేటగిరీలో బాలబాలికల రాష్ట్రస్థాయి జూడో పోటీలు జరిగాయి. కానీ ఇక్కడ సీనియర్ కేటగిరీలో పోటీలు జరిగినట్లు.. అందులో పాల్గొన్న మహిళ ద్వితీయస్థానం దక్కించుకున్నట్లు సర్టిఫికెట్ పుట్టుకొచ్చింది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా సదరు మహిళ ఏపీ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎస్జీటీ ఉద్యోగం సాధించినట్లు తెలిసింది. పోటీలు నిర్వహించిన అసోసియేషన్ బాధ్యుల సంతకాలతో కూడిన సర్టిఫికెట్ సృష్టించినట్లు తెలియడంతో... ఆమెపై చర్యలు తీసుకునేందుకు జిల్లా జూడో అసోసియేషన్ సిద్ధమవుతోంది. అసలు జరగని టోర్నీకి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారనే అంశంపై అసోసియేషన్ పరంగా విచారణ చేపట్టనున్నట్లు అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. సదరు మహిళ సంబం«దీకులే ప్రెస్‌లో సర్టిఫికెట్ ముద్రించారా.. లేక అసోసియేషన్‌కు చెందిన ఎవరైనా ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది. పరిశీలన ఏదీ? స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందాలంటే క్రీడాకారులు రాణించిన స్థాయిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ఉద్యోగాలు ఇచ్చే సమయంలో అసోసియేషన్ బాధ్యులు, అధికారుల సంతకాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించాలి. ఇందుకోసం నియామక బాధ్యులు.. సదరు సర్టిఫికెట్లను క్రీడా సంఘం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీలకు పంపించాలి. ఆతర్వాత వారు సర్టిఫికెట్‌ను పరిశీలించి పోటీల నిర్వహణ తేదీ, ఇతర అంశాలన్నీ సరిపోల్చుకున్నాక నిర్ధారిస్తారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన నిబంధనలు అమల్లో ఉన్నా ఏపీలో అలా జరగకపోవడం గమనార్హం. ఆ సర్టిఫికెట్తో సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం సాధించిన మహిళకు మా అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్ జారీ చేయలేదు. 2013లో ఖమ్మంలో కేవలం జూనియర్ కేటగిరీలోనే పోటీలు జరిగాయి. అలాంటప్పుడు సీనియర్ కేటగిరీలో పోటీలు జరిగినట్లు సర్టిఫికెట్ ఎలా వచ్చిందో తేల్చాలి. సర్టిఫికెట్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుంది. అక్కడి అధికారులు సదరు క్రీడా సంఘానికి లేదా జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి సర్టిఫికెట్లు పంపిస్తే అసలువా, నకిలీవా తేల్చేవాళ్లం. అలాంటివేవీ చేయకుండా నేరం మాపై మోపడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించినట్లు తెలుస్తోంది. – కైలాష్ యాదవ్, జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి -
మెగా డీఎస్సీలో మరో భాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగం?
సాక్షి, కడప: కడప మెగా డీఎస్సీలో నకిలీ కుల ధృవీకరణ పత్రంతో రసూల్ అనే వ్యక్తి ఉద్యోగం పొందారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2008, 2012, 2018 డీఎస్సీల్లో బీసీ-ఈ సర్టిఫికెట్ సమర్పించిన రసూల్.. 2025 మెగా డీఎస్సీలో ఓసీ-ఈడబ్ల్యూఎస్‌గా నమోదు చేసుకున్నారని జమీల్ ఫిర్యాదు చేశారు. దీంతో తనకు రావాల్సిన ఉద్యోగం రసూల్‌కు దక్కిందని ఆరోపించారు.ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు తప్పుడు సర్టిఫికెట్ సమర్పించినట్లు నిర్ధారించినట్లు సమాచారం. తహసీల్దార్ ఇచ్చిన ఓసీ-ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను మెగా డీఎస్సీలో అక్రమంగా ఉపయోగించారని ఆర్డీవో చంద్ర మోహన్ నివేదికలో పేర్కొన్నారు. తదుపరి చర్యల కోసం 2025 డిసెంబర్లో కలెక్టర్‌కు నివేదిక పంపినా ఇప్పటివరకు చర్యలు లేవని జమీల్ ఆరోపిస్తున్నారు. రసూల్ ఇప్పటికీ సుండుపల్లి మండలంలో ఉద్యోగం కొనసాగిస్తున్నాడు. -
హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు
-
‘పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: డీఎస్సీలో అక్రమాలు గురించి గతం నుంచి చెబుతూనే వచ్చామని.. మూడున్నర లక్షల మంది అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైతిక బాధ్యత వహించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వానికి రావటం లేదన్నారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలని డిమాండ్ చేశారు.‘‘దేశ చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో గత ప్రభుత్వ హయాంలో ఒకటిన్నర లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ నిర్వహించాం. హెరిటజ్లో పాలు, పెరుగు అమ్మినట్టు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రావటం విద్యార్థులకు శాపం. టెట్‌కి, డీఎస్సీకి ఒకరినే కన్వీనర్‌గా పెట్టడం దగ్గర నుంచి.. సంతలో బర్రెలు అమ్మినట్టు టీడీపీ నేతలు ఉద్యోగాలు అమ్మేసేంతవరకు ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాం. మీకు చిత్తశుద్ధి ఉంటే సీబిఐ విచారణ జరిపించండి’’ అని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ వ్యవహారంపై ఎందుకు సీబిఐ విచారణ జరపటం లేదు. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయి. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారో బయట పడుతుంది. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఉద్దేశంతోనే ధైర్యం చేయడం లేదు. కనీసం గ్రౌండ్లో అడుగుపెట్టని వారికి సైతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు.. డబ్బు కోసం అక్రమ సంపాదన కోసం ఎటువంటి నీచమైన పని చేయడానికైనా ప్రభుత్వం దిగజారి పోతుంది. ఆడియో టేపులు బయటకు వచ్చినా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు.డీఎస్సీ వ్యవహారంలో ఎందుకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేకపోయారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ నిలుపు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ సర్వీసెస్ పరీక్షలపై మీరు చేసిన ఆరోపణలపై, ప్రస్తుత డీఎస్సీపై సిబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వండి. మీరు చేసిన తప్పుడు నియామకాలు బయటపడతాయి. సాక్ష్యాలు ఉన్నా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడం దారుణం. లోకేష్ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదు. తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. ఈ వ్యవహారంలో కోర్టులు కూడా జోక్యం కల్పించుకోవాలి’’ అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. -
DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!
-
తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!
-
DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?
-
ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో డీఎస్సీ అక్రమాల డొంక కదులుతోంది. టెట్ అర్హత లేకుండా టీచర్ ఉద్యోగాలు.. డీఎస్సీ కుంభకోణం బద్దలవుతోంది. వరుస అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఒకే కుటుంబంలో ఇద్దరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెట్ అర్హత లేకుండానే ఉద్యోగాలు ఇచ్చినట్టు తేలింది.టెట్ పాస్ కాకుండానే టీచర్ ఉద్యోగం పొందిన చిల్లా యోగీశ్వరరావు.. అతని చెల్లి మోహిని దేవికి కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్ట్ వచ్చింది. టెట్ సెర్టిఫికెట్ పెట్టకపోయినా యోగీశ్వరరావుకి ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చేశారు. టెట్ అర్హత రావాలంటే 75 మార్కులు రావాలి.. మూడుసార్లు టెట్ రాసినా 75 మార్కులు రాలేదు. అయినా చంద్రబాబు సర్కార్ ఉద్యోగం ఇచ్చేసింది.వెలుగులోకి మరో టీచర్ వ్యవహారం..స్పోర్ట్స్ కోటాలో మరో టీచర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టెట్ అర్హత లేకుండానే ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉద్యోగం కట్టబెట్టారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. జంపాల ఉషా అనే మహిళకు ఎస్ఏ తెలుగు ఉద్యోగం ఇచ్చినట్లు తేలింది. స్పోర్ట్స్ కోటాలోనే జాబ్ దక్కించుకున్న ఉషా.. తెలుగు టెట్ పాస్ కాలేదు. దరఖాస్తులో ఎస్ ఏ బయాలజీగా ఉషా పేర్కొంది. సెలక్షన్ లిస్ట్‌లో ఎస్ఏ తెలుగు ఉద్యోగం ప్రభుత్వం ఇచ్చేసింది. సర్టిఫికేట్లలో మ్యాథ్స్, సైన్స్ మాత్రమే టెట్ రాసినట్టు వెల్లడించగా.. ప్రభుత్వ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లలో తెలుగు టెట్ అర్హత కానరాలేదు. ఆమె రాసిన హాల్ టిక్కెట్ నెంబర్‌తో తెలుగు టెట్ కానరాలేదు.హోళగుంద మండలంలో తెలుగులో అసలు టెట్ రాసినట్టుగా రికార్డ్ అందుబాటులో లేదు. టెట్ రికార్డుల్లో ఎక్కడా ఆమె తెలుగు రాసినట్టు ఆనవాళ్లు దొరకలేదు. ఆమె సర్టిఫికేట్లలో కూడా ఎక్కడా లేని తెలుగు టెట్ అర్హత సర్టిఫికేట్. ఎస్కేయూ యూనివర్సిటీ స్పోర్ట్స్ సర్టిఫికేట్లతో టీచర్ పోస్ట్ ఇచ్చేశారు. హోళగుంద మండలం వందవాగిలి స్కూల్లో తెలుగు టీచర్‌గా ఉద్యోగం పొందారు. ఈమె టెట్ అర్హతపై విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.కాగా, స్పోర్ట్స్ కోటా పేరుతో నచ్చినోళ్లకు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేసిన కుంభకోణం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఎక్కడో ఒకచోట నకిలీ సర్టిఫికెట్ బయటపడుతోంది.. మరోచోట వేరొకరి ధ్రువపత్రంతో ఉద్యోగం కొట్టేశారన్న ఫిర్యాదు వస్తోంది.. ఇంకొకచోట గడువు ముగిసిన తర్వాత సర్టిఫికెట్ మార్చుకునే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది.మరొక వ్యవహారంలో గుర్తింపు లేని క్రీడా సంఘం ధ్రువపత్రాలతోనే కొలువులు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే నియామక ప్రక్రియలో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన వర్తించినట్లుగా కనిపిస్తుండటమే ఇప్పుడు అసలు అనుమానాలకు తావిస్తోంది. మెరిట్లో ముందున్నవారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణల నుంచి.. అనుమానాస్పద సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారాల వరకు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఉదంతాలు మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియలో జరిగిన అక్రమాలను బయటపెడుతున్నాయి. ఇదీ చదవండి: ఆట దగా.. ‘కోటా’ దగా! -
ఆట దగా.. ‘కోటా’ దగా!
సాక్షి నెట్వర్క్: మైదానంలో గెలవాలంటే ప్రతిభ ఉండాలి.. డీఎస్సీలో ఉద్యోగం రావాలంటే మెరిట్ ఉండాలి. కానీ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ నడిపిన మెగా డీఎస్సీ దగా నాటకంలో ఉద్యోగం రావాలంటే నకిలీ సర్టిఫికెట్లు ఉండాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో నచ్చినోళ్లకు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేసిన కుంభకోణం ఇçప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఎక్కడో ఒకచోట నకిలీ సర్టిఫికెట్ బయటపడుతోంది.. మరోచోట వేరొకరి ధ్రువపత్రంతో ఉద్యోగం కొట్టేశారన్న ఫిర్యాదు వస్తోంది.. ఇంకొకచోట గడువు ముగిసిన తర్వాత సర్టిఫికెట్ మార్చుకునే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. మరొక వ్యవహారంలో గుర్తింపు లేని క్రీడా సంఘం ధ్రువపత్రాలతోనే కొలువులు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే నియామక ప్రక్రియలో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన వర్తించినట్లుగా కనిపిస్తుండటమే ఇప్పుడు అసలు అనుమానాలకు తావిస్తోంది. మెరిట్లో ముందున్నవారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణల నుంచి.. అనుమానాస్పద సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారాల వరకు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఉదంతాలు మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియలో జరిగిన అక్రమాలను బైటపెడుతున్నాయి. కేసులు వేరు.. వ్యక్తులు వేరు.. క్రీడలు వేరు. కానీ జరిగింది ఒక్కటే...ఇదో పెద్ద స్కామ్.. స్పోర్ట్స్ కోటా ఎంపిక మొత్తం ఓ పెద్ద కుంభకోణం.. దానిని నిరూపించే కొన్ని ఉదంతాలను చూద్దాం...టాపర్‌ను బలిచేసి అనర్హురాలికి పోస్టుకోటిపల్లి అనిల్‌కుమార్‌ది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామం. మెగా డీఎస్సీలో 2025లో ఎస్సీ గ్రూప్–1 కేటగిరీ కింద స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుకు ఎగ్జామ్ రాశారు. ఎస్సీ గ్రూప్–1 మెరిట్ లిస్టులో మూడో వ్యక్తి. అనిల్ కంటే ముందు ఉన్న ఇద్దరికీ ఓపెన్‌లో 13, 14వ ర్యాంకులు రావడంతో ఓపెన్ కేటగిరీలో పోస్టులు సాధించారు. వారి తర్వాత 73 మార్కులతో అనిల్ (168ఓపెన్ ర్యాంకు) ఉన్నారు. అంటే ఎస్సీ గ్రూప్–1 కేటగిరీ కింద అనిల్ టాప్‌లో ఉన్నారు. ఆ కేటగిరీ పోస్టు ఆయనకే దక్కాలి. కానీ ఎలాంటి మెరిట్ లిస్టు ప్రకటించకుండా విడుదల చేసిన స్పోర్ట్స్ కోటా కింద ఎస్సీ కేటగిరీకి చెందిన నాగరత్నం అనే మహిళను ఎస్సీ గ్రూప్ 1 సోషల్ రిజర్వేషన్ పోస్టులో భర్తీ చేశారు. దానిపై అభ్యంతరాలు స్వీకరించకుండా ఏకపక్షంగా నియమించేశారు. తీరా చూస్తే ఆ మహిళా అభ్యర్థి అనర్హురాలు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రెగ్యులర్‌గా పనిచేస్తున్న ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ పెట్టారు. బీపీఈడీ అనేది డిస్టెన్స్ మోడ్‌లో పూర్తి చేయాల్సిన కోర్సు కాదు. రెగ్యులర్‌గా కాలేజికి వెళ్లి చేయాల్సిన కోర్సు అది. కానీ ఇక్కడ నాగరత్నం సెలవు పెట్టకుండా కోర్సు పూర్తి చేసినట్టు తేలింది. అంటే, అది ఫేక్ సర్టిఫికెట్. అలాగే, డిగ్రీ కూడా ఫేక్ సర్టిఫికెట్ అని గుర్తించారు. దీనిపై అనిల్‌తో పాటు స్పోర్ట్స్ కోటాలో నాగరత్నం కంటే ముందు ఉన్న బి.ఎర్రయ్య అనే వ్యక్తి కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా ఆ సర్టిఫికెట్లు ఫేక్ అని గుర్తించారు. దీంతో ఆమెకు పోస్టు ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టారు. సమాధానం లేని ప్రశ్నలు డీఎస్సీ అభ్యర్థులు, ప్రతిపక్షాలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు జవాబుందా? ⇒ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల పూర్తి మెరిట్ జాబితాను ప్రభుత్వం ఎందుకు బహిరంగపరచలేదు? ⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఎవరు తుది నిర్ణయం తీసుకున్నారు? వారి బాధ్యతను ప్రభుత్వం వెల్లడిస్తుందా? ⇒ ఫేక్/అనుమానాస్పద సర్టిఫికెట్లపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపై ఒకే స్థాయి విచారణ జరిగిందా? లేక కేసు కేసుకు వేర్వేరు ప్రమాణాలు పాటించారా? ⇒ అనర్హత నిర్ధారణ అయిన అభ్యర్థులకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, ఆ నియామకాలను రద్దు చేస్తారా? వారికి చెల్లించిన వేతనాల పరిస్థితి ఏమిటి? ⇒ అక్రమంగా పోస్టు కోల్పోయినట్లు చెబుతున్న మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయడానికి తీసుకుంటున్న చర్యలేమిటి? ⇒ మొత్తం స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎన్ని సర్టిఫికెట్లను, ఎంతమంది అభ్యర్థులను ప్రత్యేకంగా ఆడిట్ చేశారు? ⇒ గుర్తింపు రద్దయిన లేదా గుర్తింపు లేని స్పోర్ట్స్ సంఘాల సర్టిఫికెట్లను డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఏ నిబంధన ప్రకారం అంగీకరించారు? ⇒ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు గుర్తింపు లేకపోయినా ఆ సంఘం జారీ చేసిన సర్టిఫికెట్ల ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు?సర్టిఫికెట్లు ఎప్పుడైనా మార్చవచ్చా? శ్రీకాకుళం జిల్లాలోనే ఇది మరో వ్యవహారం. స్పోర్ట్స్ కోటాలో పెద్ద అప్పలరాజుకు పీఈటీ ఉద్యోగం వచ్చింది. పోస్టు కోసం దరఖాస్తు చేసిన సమయంలో హయ్యెస్ట్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కింద 37వ నేషనల్ గేమ్స్ 2023 పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయగా, బ్యాకప్ సర్టిఫికెట్‌గా 4వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పార్టిసిపేషన్‌ను అప్లోడ్ చేశారు. ఇక్కడే తేడా జరిగింది. బ్యాకప్ సర్టిఫికెట్‌గా అప్లోడ్ చేసిన 4వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సర్టిఫికెట్ ఆయనది కాదు. ఆయన సోదరుడు విశ్వేశ్వరరావుది. అంతేకాదు అప్పలరాజు పుట్టిన తేదీ 1998 జూలై 29 కాగా, బ్యాకప్ సర్టిఫికెట్లో విశ్వేశ్వరరావు పుట్టిన తేదీ 2003 జూన్ 12గా ఉంది. అటు సర్టిఫికెట్లు చూసినా, ఇటు పుట్టిన తేదీ చూసినా తేడా ఉందని అధికారులు గుర్తించాలి. అభ్యంతరం పెట్టాలి. ఇదేమీ పరిశీలించకుండా పెద్ద అప్పలరాజుకు ఉద్యోగం ఇచ్చేశారు. వీటిపై ఆరోపణలు వచ్చే సరికి శాప్‌లో తన సోదరుడు విశ్వేశ్వరరావు సర్టిఫికెట్ తీసేసి బ్యాకప్ సర్టిఫికెట్‌గా అప్పలరాజుకు చెందిన 6వ ఎలైట్ మెన్స్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2022 పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పెట్టారు. అభ్యంతరాలు వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే మార్పులు, చేర్పులు జరిగిపోయాయి.మరి గిరిజనుడైన దుర్గయ్యకు ఆ రూల్ వర్తించదా? పెద్ద అప్పలరాజు అర్హుడైనప్పుడు గిరిజనుడైన దుర్గయ్య కూడా అర్హుడే అని చెప్పాలి. ఆర్చరీలో గోల్డ్ మెడలిస్టు అయిన దుర్గయ్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ పెట్టానని దుర్గయ్య అంటుంటే సిల్వర్ మెడల్ పెట్టారని ప్రభుత్వం చెబుతోంది. ఒక వేళ మిస్సయిందనుకుంటే గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ జత పరుస్తానని దుర్గయ్య చెబుతూ వచ్చారు. కానీ పరిగణనలోకి తీసుకోలేదు. దరఖాస్తు గడువు ముగిశాక వెనక్కి వెళ్లి పాత తేదీలతో ధ్రువీకరణ పత్రాలను స్వీకరించడం చట్టబద్ధంగా నిబంధనలకు విరుద్ధమని, సాంకేతికంగా ఆయన దరఖాస్తును పరిశీలించలేమని చెప్పేసింది. ఆన్లైన్లో గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయలేదని దుర్గయ్య దరఖాస్తును పరిశీలించినప్పుడు పెద్ద అప్పలరాజు ఆన్లైన్లో తన తమ్ముడు విశ్వేశ్వరరావు నేషనల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయడమే కాకుండా, పుట్టిన తేదీల్లో కూడా తేడాలున్నాయి. దానిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేయాలి. కానీ అలా చేయలేదు. అప్పలరాజుకు తన తమ్ముడు సర్టిఫికెట్ తీసి, తన సర్టిఫికెట్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. అది కూడా జాబ్ వచ్చాక, అభ్యంతరాలు వచ్చిన తర్వాత. దీనివెనకున్న మర్మమేంటో ప్రభుత్వమే చెప్పాలి. సర్టిఫికెట్ అప్లోడ్ విషయంలో పొరపాటు జరిగిందని, వెరిఫికేషన్ సమయంలో ఆ సర్టిఫికెట్ మార్చడం జరిగిందని పెద్ద అప్పలరాజు మీడియా ముందు కూడా అంగీకరించారు. అర్హత లేకపోయినా కూన రవికుమార్ సంతకంతో ఉద్యోగాలు అర్హత లేని సంఘాల ద్వారా కూడా స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇందులో నిబంధనలు కూడా పాటించలేదు. దీనికి సాఫ్ట్‌బాల్ అసోసియేషనే ఉదాహరణ. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ గానీ మినిస్ట్రీ ఆఫ్ యూత్ సర్వీసెస్ గుర్తింపుగానీ లేదు. ఇది లేకుండా ఏ సంఘం పనిచేసే అవకాశం లేదు. 2021లో ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా సంఘం గుర్తింపు రద్దు అయ్యింది. గతంలో ఒక వ్యక్తి సాఫ్ట్‌బాల్ నేషనల్స్ అడకుండానే హైకోర్టు ఉద్యోగానికి స్పోర్ట్స్ కోటాలో సెలక్టయ్యాడు. అతడి సర్టిఫికెట్‌పై అనుమానం వచ్చి విచారణ చేయగా అతను నేషనల్స్ అడినట్లు చెబుతున్న తేదీల్లో ఒక కాలేజీలో పరీక్షలు రాస్తున్నట్లు తేలింది. దీంతో 2025 డిసెంబర్ 15న అసోసియేషన్ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు అసలు గుర్తింపే లేకుండా డీఎస్సీ స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారన్నది ప్రశ్న. జీవో–4 ప్రకారం నోట్ అని ఒక కాలమ్ ఇచ్చారు. అందులో రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి లేదా ఫెడరేషన్ కార్యదర్శి సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా ఫెడరేషన్ కార్యదర్శి, అసోసియేషన్ కార్యదర్శితోపాటు అసోసియేషన్ అధ్యక్షుని హోదాలో ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా విచ్చలవిడిగా సర్టిఫికెట్లు ఇచ్చేశారు. అతని సర్టిఫికెట్లను కూడా పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆఖరికి శ్రీకాకుళం సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి రమణ భార్య లక్ష్మీదేవికి కూడా ఇదే కోటాలో ఉద్యోగం దక్కింది. శాప్ గుర్తింపు లేదంటూ రెజ్లింగ్ వంటి సంఘాలకు ఉద్యోగాలు నిరాకరించారు. అటువంటిది ఒలింపిక్ అసోసియేషన్ గాని కేంద్రం గుర్తింపు లేని సంఘం నుంచి ఉద్యోగాలివ్వడం వెనుక శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో సంబంధిత అసోసియేషన్ కార్యదర్శి సమక్షంలో ఈ ప్రక్రియ చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా శాప్ ఎండీకి కూడా సంబంధం లేకుండా శాప్ పరిపాలనా అధికారితో దీన్ని పూర్తి చేశారు. వాలీబాల్ అసోసియేషన్‌కు కూడా గుర్తింపు లేదని సమాచారం. ముఖ్యనేత అండ, భరోసా లేకుండా ఇలా చేయడం సాధ్యం కాదని డీఎస్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.పోస్టల్ డిపార్ట్మెంట్ నిరాకరించినా.. దగా డీఎస్సీలో ఉద్యోగం.. వెయిట్ లిఫ్టింగ్‌లో కతిల వెంకటలక్ష్మి తప్పుడు జనన ధ్రువీకరణ ఇచ్చారని రుజువు కావడంతో పోస్టల్ డిపార్టుమెంట్లో ఉద్యోగం నిరాకరించారు. ఆమె 1992 మే 20న పుట్టినట్లు స్కూల్ సర్టిఫికెట్లలో ఉంటే 1993 మే 10 పుట్టినట్లుగా బోగస్ జనన ధ్రువీకరణ పత్రం సృష్టించి వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొనట్లు గుర్తించారు. తాజాగా డీఎస్సీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లో మాత్రం ఉద్యోగం ఇచ్చేశారు. నాట్ క్వాలిఫైడ్.. కానీ ఉద్యోగం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేనికోన మండలం గచ్చకాయలపోర జెడ్పీ హైస్కూల్లో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్న మిరియాల గాయత్రి సాయిశ్రీ ఇటీవల సోషల్ (బ్యాక్లాగ్) కేటగిరీలో టీచర్ పోస్టు సాధించారు. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రిమార్క్‌లో నాట్ క్వాలిఫైడ్ అని ఉన్నా, బీఈడీకి సంబంధించి ఆమె సరైన ఆధారాలు సమర్పించకపోయినా ఫైనల్ లిస్టులో ఉద్యోగం ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం డివైఈఓ కిషోర్ గాయత్రిని తన కార్యాలయానికి పిలిచి విచారణ చేపట్టారు. ఆమె విద్యార్హత పత్రాలు, కుల ధృవీకరణ, బీఈడీ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. అనంతరం విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపినట్టు ఆయన తెలిపారు. సాఫ్ట్‌బాల్ సర్టిఫికెట్లపై అధ్యక్షుడి హోదాలో సంతకం చేసిన కూన రవికుమార్ నకిలీ పత్రాలతో అడ్డంగా దొరికిపోయారు.. దగా డీఎస్సీ నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో ఇదో కొత్త అంకం.. భార్యాభర్తలు ఒకే గేమ్ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటా కింద రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన షేక్ ఇమాంహుసేన్, అతని భార్య కరిష్మా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో జూడో ఛాంపియన్స్ అంటూ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం వీరు కౌతాళం మండలంలో ఉర్దూ ఎస్జీటీగా ఇమామ్ హుసేన్, తెలుగు ఎస్జీటీగా కరిష్మా విధులు నిర్వహిస్తున్నారు. కానీ వీరు సమర్పించిన ధ్రువపత్రాల్లో స్థానికత వేరువేరుగా ఉన్నాయి. 73కిలోల విభాగంలో జూడో హరిక్రిష్ణ అనే వ్యక్తి స్పోర్ట్స్ సర్టిఫికెట్‌ను సవరించి అందులో పేరు మాత్రం మార్చి వీరి పేరుతో సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు ఇమామ్ హుసేన్ స్వస్థలం ఒకచోట విశాఖ, మరో చోట దొర్నిపాడు అని, భార్య కరిష్మాది ఒక చోట దొర్నిపాడు అని మరోచోట విజయనగరం స్వస్థలాలుగా ఉన్నట్లు గుర్తించారు. ఒకే వ్యక్తికి రెండు స్వస్థలాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ అనుమానం. దీనిని బట్టి ఇవీ తప్పుడు స్పోర్ట్స్ ధ్రువీకరణ పత్రాలే అని తెలిసిపోయింది. ఎక్కడైతే చదువుతున్నామో అక్కడి నుంచే స్పోర్ట్స్ ఆడాల్సి ఉంటుంది. కానీ 2014లో కర్ణాటకలో డీఈడీ చదువుతూ అదే ఏడాది 2014లో ఏపీలో జూడో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి సర్టిఫికెట్ ఎలా పొందారన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. నొస్సం కరిష్మా ఇంటర్ 2011–2013లో చదివారు. 2014లో ఏదో ఒక కోర్సు చేస్తూ ఉండాలి. జూడో స్పోర్ట్స్ సర్టిఫికెట్లో మాత్రం 2014లో ఆడినట్లు ఉంది. కానీ ఆ సమయంలో ఆమె ఖాళీగా ఉంది. ఎందుకంటే డీఈడీ మాత్రం 2015–2017లో చేసినట్లు సర్టిఫికెట్ ఉంది. అంటే 2017లో డీఈడీ పూర్తి చేసి ఎలాంటి విద్యాభ్యాసం చేయకుండా ఉన్న 2014 సర్టిఫికెట్ ఎలా చెల్లుతుందనేది అనుమానం. -
టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష
-
సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్
-
DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త
-
డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!
-
మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?
-
బాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: హలో ఇండియా.. అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. డీఎస్సీ కుంభకోణం, కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాలను కనపడకుండా చేయడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. డీఎస్సీ 2025 నియామక కుంభకోణంలోని అంశాలు రోజురోజుకూ బయటపడున్నాయని చెప్పారు.‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తూ తీవ్రమైన అక్రమాలను బయటపెడుతున్నాయి. దీనిపై నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు నిజానిజాలు వెలుగులోకి రావడానికి సీబీఐ విచారణకు అంగీకరించాల్సింది పోయి, టీడీపీ కూటమి ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తును నిరాకరిస్తోంది. ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్న గొంతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది.మెటా సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డీఎస్సీ నియామక కుంభకోణంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్ష పార్టీలు, మీడియా వేదికలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తుల పోస్టులు, ఖాతాలను పరిమితం చేయడం, తొలగించడం లేదా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల్లో కనిపించకుండా చేయడం జరుగుతోంది. ఇందుకు మెటా “చట్టపరమైన అవసరాలు” కారణంగా పేర్కొంటోంది’’ అని వైఎస్ జగన్ తెలిపారు.‘సోషల్’ ఖాతాలపై ఆంక్షలు ఈ ఆంక్షలకు గురైన ఖాతాల పేజీల్లో ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్‌స్టాగ్రామ్‌లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగన్అన్న కనెక్ట్స్‌తో పాటు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇతర వ్యక్తిగత ఖాతాలు కూడా ఉన్నాయని వైఎస్ జగన్ చెప్పారు. ‘‘ఇది కేవలం డీఎస్సీ కుంభకోణంతో ఆగిపోవడం లేదు. అవినీతి, వైఫల్యాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలులో వైఫల్యం, అధికార దుర్వినియోగం లేదా అధికార అహంకారంపై టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్ర శ్ని స్తోందిప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు ప్రశ్నలు అడిగేవారి గొంతును అణచివేస్తున్నారు. ఇది పాలన కాదు. ఇది సెన్సార్షిప్. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నాయి. రాజకీయంగా అసౌకర్యంగా ఉన్న ప్రశ్నలు అడుగుతున్నారనే కారణంతో ప్రతిపక్షాన్ని, మీడియాను, కార్యకర్తలను లేదా పౌరులను నోరు మూయించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు’’ అని వైఎస్ జగన్ తెలిపారు.దేనికి భయపడుతున్నారు?చంద్రబాబు నాయుడు దేనికి భయపడుతున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నలకా? సమాధానాలకా? అని అన్నారు. ‘‘డీఎస్సీ నియామకంలో ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్న ఆధారాలు తప్పు అని మీరు చెబుతున్నట్లయితే, ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. సీబీఐ విచారణను ఎందుకు నిరాకరిస్తున్నారు? ఈ ఆరోపణలను బయటపెడుతున్న వారి గొంతులను ఎందుకు అణచివేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు పరిమితం చేస్తున్నారు?ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలను తొలగించలేరు. ఒక ఖాతాను నిరోధించినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి, ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి, రాజ్యాంగబద్ధంగా పాలించండి. డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?’’ అని నిలదీశారు.అవినీతి వాసనను వెదజల్లుతున్నాయి క్రీడా కోటాకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి, నియామకాల తర్వాత ఆ క్రీడా కోటా ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేశారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ‘‘అయినా ఆ ఉత్తర్వుల కింద నియమితులైన అభ్యర్థులు ఇప్పటికీ ఉద్యోగాల్లో కొనసాగడం, నియామకాలకు ముందు మార్గాలను తెరిచి, నియామకాల తర్వాత మార్గాలను మూసివేయడం. ఇవన్నీ అవినీతి వాసనను వెదజల్లుతున్నాయి.ఈ సెన్సార్షిప్ చర్యల్లో పరిమితం చేసిన ప్రతి ఖాతా, పోస్టు, కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని కోరుతున్నాను. డీఎస్సీ 2025 నియామకాలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరిగాయని మీరు చెబుతున్నట్లయితే, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని చంద్రబాబు నాయుడిని, ఆయన ప్రభుత్వాన్ని నేను సవాల్ చేస్తున్నాను.స్వతంత్ర దర్యాప్తు నిజానిజాలను తేల్చనివ్వండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఆరోపిత అక్రమాలకు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. ఖాతాలను పునరుద్ధరించండి. సెన్సార్షిప్ను ఆపండి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి. దాచాల్సిందేమీ లేకపోతే, దేనికి భయపడుతున్నారు?’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Hello India!The DSC 2025 recruitment scam is unravelling day by day, with fresh evidence and facts surfacing from different parts of the state, exposing serious irregularities and raising questions that the @ncbn -led TDP coalition government must answer. Instead of answering… pic.twitter.com/bVD6zHDFDC— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2026 -
ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?
-
DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?
-
CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్
-
సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్
-
తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు
-
బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...
-
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్‌లు
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్‌లు నోరు విప్పడం లేదు. కర్నూలు అనర్హత టీచర్ ప్రభాకర్‌పై సమాధానం చెప్పని ఐఏఎస్‌లు.. నకిలీ క్రీడా సర్టిఫికెట్ల టీచర్లపై కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా వహిస్తున్నారు. అధికారుల తీరుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విద్యాశాఖ మాజీ కార్యదర్శి కోన శశిధర్ నోరు విప్పడం లేదు. విద్యాశాఖ కమిషనర్ అన్సారియా ఎందుకు మాట్లాడటం లేదన్న సందేహాలు వ్యక్తమవుతుండగా.. కార్యదర్శి శ్యామలరావు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు.స్పోర్ట్స్ కోటా నకిలీ సర్టిఫికెట్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్ ఎందుకు నోరు విప్పడం లేదు? గతంలో అంతా సక్రమమన్న అజయ్ జైన్ ఇప్పుడెక్కడ?. శాప్ ఎండీ భరణికి ఇప్పుడు బాధ్యత లేదా?. అర్హతలేని స్పోర్ట్ కోటా టీచర్లపై ఎండీ భరణి ఎందుకు నోరు విప్పడం లేదు?. లోకేష్‌ను కాపాడటం కోసం నోరు విప్పడం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అక్రమాలపై పోస్ట్ చేస్తే చర్యలంటూ చంద్రబాబు సర్కార్ వార్నింగ్‌లు ఇస్తోంది. అడ్డంగా దొరికిపోవడంతో ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. -
సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్
-
ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..
-
ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు
-
ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?
-
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గురు పూజోత్సవం సందర్భంగా 'గురు పరిరక్షణ దీక్ష' పేరుతో ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. డీఎస్సీలో అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేష్ బాబు, ఇసాక్, కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్‌కుమార్, రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం నిరసన చేపట్టారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?: వైవీవైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. అనర్హులు కూడా టీచర్లు అయ్యారు.. అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?. అనర్హులను ఉద్యోగాల నుండి తప్పించాలి. సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు బయటికి వస్తాయి. మంత్రి లోకేష్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేస్తేనే అన్యాయమైన వారికి న్యాయం జరుగుతుంది. అర్హులుగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగించమని మేము అడగడం లేదు. అనర్హులను మాత్రమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేస్తే అనర్హులు బయటపడతారు’’ అని ఆయన పేర్కొన్నారు.విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?: కురసాలమాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అనర్హులు గురువులు అయితే విద్యార్థుల నష్టపోతారు. విద్యావ్యవస్థలో నకిలీ గురువులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నకిలీ గురువులతో భావితరాలు నష్టపోతాయి.. ఈ డీఎస్సీ ప్రక్రియ దుర్మార్గమైన స్కామ్. స్కామ్ బయటపడినా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?. కూటమి సర్కార్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. అన్ని వర్గాలకు ప్రభుత్వం నష్టం చేసింది’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు -
టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!
-
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డీఎస్సీ అక్రమాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా బండారం బయటపడింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేశారు. శాప్ పోర్టల్‌లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను ఎందుకు అప్లోడ్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా, సర్టిఫికెట్‌ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే సందేహాలు కలుగుతున్నాయి.ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ..ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ డీఎస్సీ నూయామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బ్లైండ్ సెర్టిఫికెట్తో ఒక వ్యక్తి ఉద్యోగం పొందాడని మరో మహిళా అభ్యర్థి ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్‌ని స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇవ్వాలని సాక్షి మీడియా కోరగా.. జాబితా ఇవ్వకూడదని.. ఉన్నతాదికారుల ఆదేశాలు పాటిస్తున్నామని డీఈవో తెలిపారు. ఏ సమాచారం కావాలన్నా లిఖిత పూర్వకంగా కోరితే ఆర్జేడీకి పంపుతామంటూ వెల్లడించారు.కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా పోస్టింగులు..కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన గాయత్రి సాయిశ్రీకి కాట్రేనికోన మండలం బ్రహ్మసమేద్యం పోస్టింగ్ ఇచ్చారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రిమార్క్స్‌లో నాట్ క్వాలిఫైడ్ అని అధికారులు రాశారు. ఆమె బీఈడీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫైనల్ లిస్ట్‌లో మాత్రం బాక్సింగ్ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం.. ఉద్యోగం ఇచ్చేసింది. బీఈడీ సర్టిఫికెట్లు లేకపోయినా అధికారులు ఎలా ఉద్యోగం ఇచ్చారో స్పష్టం కాలేదు. 11 సార్లు తెలుగు టెట్ రాసిన ఆమెకు సోషల్ స్కూల్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ పోస్టింగ్‌పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు పండిట్‌కు సోషల్ పోస్టింగ్ ఎలా ఇచ్చారో అధికారులు స్పష్టం చేయలేదు.రిజర్వేషన్లలోనూ గోల్మాల్వైఎస్సార్ జిల్లాలోనూ డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రిజర్వేషన్లలోనూ గోల్మాల్ చేసి అభ్యర్థులు ఉద్యోగం పొందినట్లు తేలింది. వైఎస్సార్ జిల్లాలో బీసీ–ఈ అభ్యర్థి మనూర్ రసూల్ ఓసీ కింద ఉద్యోగం పొందారు. 2008, 2012, 2018 డిఎస్సీల్లో తాను బీసీ–ఈ కేటగిరీగా నమోదు చేసుకున్న రసూల్.. 2025 డిఎస్సీలో మాత్రం తాను ఓసీ (ఈడబ్ల్యూఎస్) కింద దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందారు.రసూల్ చేసిన అవకతవకల వల్ల తనకు ఉద్యోగం రాలేదని రాయచోటికి చెందిన జమీల్ ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని జమీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రిజర్వేషన్లనే మార్చేసి అక్రమంగా ఉద్యోగం పొందడంపై చంద్రబాబు సర్కార్ నోరు విప్పడం లేదు. ఏడాదిగా ఈ అంశంపై జిల్లా యంత్రాంగం విచారణ చేస్తూనే ఉన్నారు. రసూల్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన ఉద్యోగం ఇప్పించాలని జమీల్ కోరుతున్నారు.విద్యా శాఖ ప్రకటనతో అనుమానాలుకర్నూలు డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చేందుకు విద్యాశాఖ ప్రయత్నం చేస్తోంది. విద్యాశాఖ ప్రకటనతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అంతా పారదర్శకం అంటూ విద్యాశాఖ మీడియా ప్రకటన చేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం, వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్, SGT(తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలపై పాఠశాల విద్యా శాఖ వివరణ ఇచ్చింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే శాఖాపరమైన దర్యాప్తును విద్యా శాఖ ప్రారంభించింది.ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. కర్నూలు డీఈవో విచారణను ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులను, వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించారు. విచారణ నివేదిక అందగానే, రిక్రూట్మెంట్, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక, విధానాన్ని అవలంభించామని పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటిస్తోంది. -
కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!
-
దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి
-
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే
-
ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్
-
మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డీఎస్సీ–2025 కుంభకోణం తీగ లాగితే అక్రమాల డొంకలు కదులుతున్నాయని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో జరిగింది మెగా డీఎస్సీ కాదు, యువగళం డీఎస్సీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని.. చంద్రబాబు, లోకేశ్‌ల పాపాలు ఒక్కటొక్కటిగా బట్టబయలవుతున్నాయని చెప్పారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, అది నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ అని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘అధికార బలం, అనుకూల మీడియా సాయంతో చేసిన పాపాలను ఎంతకాలం కప్పిపుచ్చగలరు? టెట్ పరీక్షలో పాస్ అవ్వని వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా లోకేశ్‌కే దక్కుతుంది. రాజకీయ పార్టీలు కాదు.. స్వయంగా ప్రజలే శోధించి డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. డీఎస్సీ అంటే తెలుగుదేశం అని ప్రగల్భాలు పలికిన వాళ్లకు ప్రజలు చెంపపెట్టు లాంటి నిజాలు చూపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో మొదలైన డీఎస్సీ అక్రమాల డొంక చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకూ పాకింది’ అని నిప్పులు చెరిగారు. నారా లోకేశ్ తన ‘యువగళం’ కోటా కింద, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అర్హత లేని తమ వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ–2025లో ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్, కేటగిరీ, సబ్జెక్ట్ అర్హత, కేటాయించిన పోస్టును కంప్యూటర్ ఆధారంగా క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమా? అని నాని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాయుడులకు నిజాలు బయటపెట్టే దమ్ముందా? అని నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో సమర్పించిన సర్టిఫికెట్లను, ముఖ్యంగా జరగని ఈవెంట్లకు సంబంధించినవిగా ఆరోపణలు వస్తున్న సర్టిఫికెట్లను పూర్తి స్థాయిలో వెరిఫై చేయించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాని ఇంకా ఏమన్నారంటే..టెట్ పాస్ కానివాడికి టీచర్ ఉద్యోగమా?» కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. నిన్నటిదాకా అసలు తప్పే జరగలేదన్న ఈ పాలకులు, ఇవాళ 16 వేల మందిలో ఒక్క తప్పు జరిగిందని తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజలే శోధించి ఆధారాలతో సహా లోకేశ్ బండారాన్ని బద్దలు కొడుతున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం టీచర్ ఉద్యోగం రావాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఏ కోటాలో వచ్చినా ఈ నిబంధన వర్తిస్తుంది. » బీసీలకు 75 మార్కులు రావాల్సి ఉండగా, కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఒల్లూరు ప్రాథమిక పాఠశాలలో కేవలం 65 మార్కులు వచ్చిన ప్రభాకర్ అనే వ్యక్తికి ఎస్జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారు? 150 మార్కులకు కనీస అర్హత సాధించని అభ్యర్థి ఆన్లైన్ దరఖాస్తును కంప్యూటర్ ఎలా స్వీకరించింది? డీఈవోలు, ఐఏఎస్ అధికారులు ఎదురెదురుగా కూర్చుని స్క్రూటినీ చేశామని చెప్పారు కదా.. మరి ఈ అనర్హుడిని ఎలా ఎంపిక చేశారు? పైనుంచి వచ్చిన బలమైన ఒత్తిళ్లు కాక దీనికి కారణమేంటి?బోర్డర్ మండలాల్లో స్పోర్ట్స్ కోటా దందా » ఎవరూ రారు, చూడరు అనే ధీమాతో కర్ణాటక సరిహద్దున ఉన్న కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఏకంగా 24 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లను నియమించారు. ఒక్క ఒల్లూరు స్కూల్లోనే ఐదుగురు స్పోర్ట్స్ కోటా వాళ్లే పాఠాలు చెబుతున్నారు. 41 ఏళ్ల వయసులో 2009–10 నాటి జూడో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే, 42 ఏళ్లకు టీచర్ కొలువు ఇచ్చేశారు. జూడో ఆడేవాళ్లే లేని రాష్ట్రంలో 30–40 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు?» ఇంత జరుగుతుంటే ఎంఈవో, డీఈవో ఆఫీసుల్లో కాకుండా ‘గోతులదొడ్డి’ స్కూల్లో చీకట్లో రహస్య విచారణలు ఎందుకు జరుపుతున్నారు? ఇవాళ శాప్ ఒక దొంగల బండిలా మారింది. శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్ బీఈడీ కళాశాల కేంద్రంగా ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దందా నడిచింది. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు రాత పరీక్ష నిబంధనను ఎత్తేస్తూ జీవో 4, జీవో 47 తెచ్చారు. మేము నిలదీశాక మళ్లీ జీవోలు మార్చారు. గుర్రపు స్వారీ (ఈక్వెస్ట్రియన్), ఫెన్సింగ్, రైఫిల్ షూటింగ్ వంటి సంపన్నుల ఆటలను ఏకేటగిరీలో పెట్టి.. సామాన్యులు ఆడే కబడ్డీ, బాడీబిల్డింగ్, చెస్, క్యారమ్స్లను బికేటగిరీకి నెట్టేశారు. అసలు జరగని టోర్నమెంట్లకు ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కొలువులు కట్టబెట్టారు.సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి » సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు? హోం మంత్రితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఈ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతోనూ అబద్ధాలు చెప్పించి.. వారిని అక్కడి నుంచి పంపించేసింది. ఒక్క తప్పిదం లేకుండా డీఎస్సీ పూర్తి చేశామన్న వారు ఇప్పుడేమంటారు? టెట్ పాస్ కాని అభ్యర్థి అప్లికేషన్‌ను ఎందుకు రిజెక్ట్ చేయలేదు?» ‘16 వేల మందిలో ఒక్క తప్పు మాత్రమే జరిగిందని చేతులు దులుపుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకోం. జీవో–15 ప్రకారం టెట్ క్వాలిఫై కాకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వడం ఉల్లంఘనే. చిత్తూరు జిల్లాలో ఓసీ అభ్యర్థికి టెట్‌లో 90 మార్కులు రావాల్సి ఉండగా, 79 మార్కులొచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కట్టబెట్టారు. » తూర్పుగోదావరి జిల్లాలో తెలుగులో టెట్ రాస్తే, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్లు, కేటగిరీలను కంప్యూటర్ క్రాస్ వెరిఫికేషన్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? తక్షణమే ఈ ‘దగా డీఎస్సీ’పై సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి. నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. » శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఒక పెద్ద దొంగల బండి లా మారింది. అక్కడ ముద్ర పడితే చాలు అర్హత లేకున్నా కొలువులు ఇచ్చేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ బీఈడీ కాలేజీ కేంద్రంగా సాగిన ఈ స్పోర్ట్స్ కోటా దందాను పూర్తిగా నిగ్గు తేల్చాల్సిందే.యువగళం కోటా వాళ్లకు రూల్స్ మినహాయింపుపాతికేళ్లు, ముప్పై ఏళ్లుగా నిబద్ధతతో పాఠాలు చెబుతూ సమాజానికి ఎంతో మంది ప్రయోజకులను అందించిన సీనియర్ టీచర్లనేమో టెట్ పాస్ కావాలని వేధిస్తారు. కానీ మీ యువగళం కోటాలో అర్హత లేకపోయినా, టెట్ తప్పినా అడ్డగోలుగా ఉద్యోగాలు కట్టబెడతారా? లోకేశ్ రాజకీయాల్లో ఒక కామెడీ పీస్‌గా మారిపోతున్నారు. డబ్బులిచ్చి సర్వేలు రాయించుకుంటూ 82 శాతం అక్షరాస్యత వచ్చిందని పోస్టులు పెట్టుకోవడం హాస్యాస్పదం.రెండేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ అందక, చదువు భారమై సుమారు నాలుగైదు లక్షల మంది పేద విద్యార్థులు చదువులు మానేశారు. వీళ్లకు ఇవ్వడానికి నిధులు ఉండవు గానీ, యోగా మ్యాట్లకు, ప్రతినెలా సీఎం పెన్షన్ ఇచ్చేందుకు తిరిగే ఆర్భాటాలకి రూ.కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇస్తామని ఊదరగొట్టిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక స్పందించడమే లేదు. రూ.40 వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారని ఉద్యోగులు అడుగుతుంటే ఉలకడం లేదు. ఒకపక్క ఉద్యోగుల జీతాల భారం అంటూనే, పాత డీఎస్సీ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి రెండో డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపి, ఉద్యోగుల బకాయిలు చెల్లించి, డీఎస్సీ అక్రమాలపై పూర్తిస్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలి. -
ఫేక్ ‘గేమ్’..‘మెగా’ స్కామ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మెగా డీఎస్సీ 2025 అక్రమాల డొంక కదులుతోంది. ఇప్పటికే స్పోర్ట్స్ కోటా ముసుగులో ఇష్టారాజ్యంగా జీవోలిచ్చి అక్రమాలకు గేట్లు ఎత్తడం.. అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలను కట్టబెట్టడం.. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకు పోస్టులు ఇవ్వడం లాంటి అక్రమాలు బహిర్గతం కాగా, తాజాగా టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)లో కనీసం క్వాలిఫై కూడా కాకుండానే ఉద్యోగాల్లో నియమించినట్లు తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. సాక్షి కథనంతో ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలో తెలియక సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖాధికారులు ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం పలువురు మెగా డీఎస్సీ టీచర్లు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల విక్రయదారులతో కర్నూలులో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీలో అక్రమాలకు ఇవన్నీ నిదర్శనాలని, సీబీఐతో విచారిస్తే నివ్వెరపోయే నిజాలు బహిర్గతం కావడం ఖాయమని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘మెగా డీఎస్సీలో రాత పరీక్ష అనంతరం 1 : 1 నిష్పత్తిలో అభ్యర్థులను వెరిఫికేషన్‌కు ఎందుకు పిలిచినట్లు? మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా నియమించిన వారి సర్టిఫికెట్లను తాజాగా రహస్యంగా వెరిఫికేషన్ చేస్తున్నారంటే... దీని అర్ధం గతంలో వెరిఫికేషన్ జరగలేదనే కదా! టెట్‌లో క్వాలిఫై కాకపోయినా, అర్హత లేదని తెలిసి కూడా టీచర్ పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన అభ్యర్థి ఇన్ని దశలు దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? దీని వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు..?’ అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. చంద్రబాబు సర్కారు ఇంకా బుకాయించకుండా మెగా డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ విచారణకు సిద్ధపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి రావడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సవాల్ విసిరినట్లుగా మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు అంగీకరించాలని, ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని విద్యావేత్తలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.స్వయంగా ప్రభుత్వ విచారణలో బట్టబయలు.. ముఖ్యనేత భరోసాతో మెగా డీఎస్సీ నియామకాల్లో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, టెట్ క్వాలిఫై కాకుండానే లోకేశ్ యువగళం సభ్యులకు టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టిన విషయం వెలుగు చూసింది. ఇన్నాళ్లూ మెగా డీఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ బుకాయించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయారు. కర్నూలు జిల్లాలో టెట్ క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటాలో జి.ప్రభాకర్ అనే వ్యక్తి టీచర్ ఉద్యోగం పొందడం.. అధికారుల విచారణలో ఇది వాస్తవమేనని తేలడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇదే తరహాలో మెగా డీఎస్సీలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యా శాఖ మంత్రి లోకేశ్‌తోపాటు చంద్రబాబు సర్కారుపై నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, జెన్‌జీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేతల గుప్పిట్లో సంఘాల నుంచి ఫేక్ సర్టిఫికెట్లు..! మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కారు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖాధికారులు విచారణ మొదలు పెట్టారు. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను యుద్ధ ప్రాతిపదికను తెప్పించుకుంటున్నారు. టెట్ క్వాలిఫై అయ్యారా? లేదా? ఎలాంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్ పెట్టారు? సదరు సర్టిఫికెట్ ఎక్కడనుంచి తెచ్చారు? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. దాదాపు అన్ని స్పోర్ట్స్ సర్టిఫికెట్లు టీడీపీ ప్రజా ప్రతినిధులు పర్యవేక్షిస్తున్న అసోసియేషన్ల నుంచి పొందినట్లు విచారణలో ప్రాథమికంగా వెల్లడైందని కర్నూలు విద్యాశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ముఖ్యనేత అండదండలతో..ముఖ్యనేత అండదండలు, భరోసాతో చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి క్రీడా సంస్థ నేత మెగా డీఎస్సీ నకిలీ సర్టిఫికెట్ల పంపిణీ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని అధికారుల దృష్టికి వచ్చి నట్లు తెలుస్తోంది. లోకేశ్ యువగళం యాత్రలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. యువగళం సభ్యులు మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందేందుకు తన పదవిని అడ్డుపెట్టి బోగస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయి. ముఖ్యనేత అండదండలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తన అనుచరులను ఏర్పాటు చేసుకుని నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేసినట్లు సమాచారం. ముఖ్యనేత భరోసాతో అనుచరుల ద్వారా నకిలీ సర్టిఫికెట్ల విక్రయాలు.. ముఖ్యనేత భరోసా లభించడంతో కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు నెల్లూరుకు చెందిన మల్లిఖార్జున అనే వ్యక్తి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ప్రైవేట్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు దూరవిద్యా కేంద్రంలో పనిచేస్తున్న మరోవ్యక్తి కలసి చిత్తూరు నేత నుంచి పెద్ద ఎత్తున స్పోర్ట్స్ నకిలీ సర్టిఫికెట్లు తెచ్చి విక్రయించినట్లు తెలుస్తోంది. వీరంతా అనంతపురం, చిత్తూరుకు చెందిన రెండు ముఠాలతో కలిసి మెగా డీఎస్సీ అభ్యర్థులకు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్మకానికి పెట్టారు. చిత్తూరు నేతతో సంబంధాలు ఏర్పరచుకున్న గుంటూరుకు చెందిన మరో ముఠా కూడా అభ్యర్థులకు బోగస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు తెచ్చి అభ్యర్థులకు విక్రయించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో పలువురికి దొడ్డి దారిలో టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో ముఖ్యనేత అండదండలు, భరోసా లేకుండా ఈస్థాయిలో అక్రమాలు జరిగేందుకు ఆస్కారం లేదని అంటున్నారు.అప్పుడు.. ‘బీసీ’ ఇప్పుడు.. ‘ఈడబ్ల్యూఎస్’మెగా డీఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల్లో లీలలు కర్నూలు సిటీ: 2018లో బీసీ కేటగిరీలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు.. తాజాగా మెగా డీఎస్సీ 2025లో ఈడబ్ల్యూఎస్ విభాగంలో దరఖాస్తు చేసుకోవడంతోపాటు టీచర్లుగా ఎంపిక కావడం గమనార్హం. గతంలో బీసీ సర్టిఫికెట్ సమర్పించిన శకునాల కేశవులు మెగా డీఎస్సీలో మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందిన జుమ్మలదిన్నె జడ్పీ హైసూ్కల్లో పని చేస్తున్నారు. ఏకంగా కులం మారిపోవడం.. ఇష్టారాజ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాల్లో చేరడం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లాలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలా టీచర్లుగా నియమించిన వారిలో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో ఆరుగురు, చాగలమర్రి మండలంలో ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్రంగా విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. » 2018 డీఎస్సీలో బీసీ–బీ కింద దరఖాస్తు చేసుకున్న ఓ మహిళా అభ్యర్థి... మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కోటాలో టీచర్ ఉద్యోగం పొంది కోసిగి జడ్పీ హైసూ్కల్లో పని చేస్తున్నారు. » 2018 డీఎస్సీలో బీసీ–బీ కింద దరఖాస్తు చేసుకున్న మరో మహిళా అభ్యర్థి.. మెగా డీఎస్సీలో మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్తో ఉద్యోగం పొంది పొదలకుంట్ల ఎంపీపీఎస్‌లో పని చేస్తున్నారు. » గతంలో బీసీ–డీ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్తో ఎంపికై కౌతాళం మండలం ఉరుకుంద జడ్పీ హైసూ్కల్లో పని చేస్తున్నారు. » గతంలో బీసీ–బీ సర్టిఫికెట్ సమర్పించిన మరో మహిళ.. మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్‌లో టీచర్ ఉద్యోగం పొంది కోసిగి ఎంపీపీఎస్ స్కూల్లో పని చేస్తున్నారు.కర్నూలులో మెగా డీఎస్సీ టీచర్ల సమావేశం..! కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలో 24 మంది స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందగా నియోజకవర్గంలోని వల్లూరు పాఠశాలలో ఐదుగురిని ఇదే కోటాలో టీచర్ పోస్టుల్లో నియమించారు. వల్లూరు ఎంపీపీ స్కూల్లో టెట్ క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటాలో ప్రభాకర్‌ను ఎస్జీటీ టీచర్‌గా నియమించినట్లు తాజాగా తేలడం.. అధికారుల విచారణలో అక్రమాలు నిజమేనని నిర్థారణ కావడం తీవ్ర సంచలనం రేపింది. ఇదే తరహాలో పలువురిని నియమించినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యాశాఖ విచారణతో మెగా డీఎస్సీ ద్వారా నియమించిన వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పలువురు మెగా డీఎస్సీ టీచర్లు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల విక్రయదారులతో కర్నూలులో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆందోళనతో యువగళం టీమ్ వద్దకు..! చిత్తూరులో కొందరు నకిలీ స్విమ్మింగ్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందగా వారిలో చాలామంది టెట్ క్వాలిఫై కాలేదని సమాచారం. కడపలో స్పోర్ట్స్ కోటాలో పలువురు టెట్ క్వాలిఫై కాకుండానే ఉద్యోగాలు పొందగా ఇందులో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలుతోపాటు సంతనూతలపాడు, దర్శి ప్రాంతాలకు చెందిన కొందరు ఇదే తరహాలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందినట్లు అనుమానాలున్నాయి. విద్యాశాఖ అంతర్గత విచారణతో ఆందోళనగా వీరంతా ఉద్యోగాలిప్పించిన లోకేశ్ యువగళం టీమ్ ముఖ్య నేతలను నిలదీస్తునట్టు సమాచారం. నకిలీ సర్టిఫికెట్లతో ప్రిన్సిపాల్ ఉద్యోగాలు..! ఏపీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో పోస్టులకు నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టి కొందరు ప్రిన్సిపాల్ ఉద్యోగాలను పొందినట్లు సమాచారం. వీరిలో చాలామంది నెల్లూరు, అనంతపురం, గుంటూరు ప్రాంతాల ముఠాల నుంచి బోగస్ సర్టిఫికెట్లు పొందినట్లు తెలుస్తోంది. మెడికల్ రిప్రెంజెంటేటివ్గా పనిచేస్తున్న కర్నూలుకు చెందిన వ్యక్తితోపాటు డోన్‌కు చెందిన మరొకరు నందికొట్కూరు ప్రాంతంలోని ప్రైవేటు బీఈడీ కళాశాల నుంచి బోగస్ సర్టిఫికెట్లతో ప్రిన్సిపల్ ఉద్యోగం పొందినట్లు సమాచారం. -
DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్
-
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్‌లో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ వరుసగా ఎన్నో సాక్ష్యాలు బయటకు వస్తున్నా ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థి టెట్‌లో క్వాలిఫై కాకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?వన్ టు వన్ ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి..’ అని స్పష్టం చేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆధారాలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. అందులో ఏమన్నారంటే... ఇంకా దాక్కుంటారా..? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ.. మోసాల్లో మెగా, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట దగా అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకు? ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో రాజీనామా చేయించకుండా.. అధికార బలంతో అబద్ధాలు చెబుతూ, పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కుమారుడిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆ అదృశ్య శక్తి లోకేశ్ కాదంటారా? కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? వన్ టు వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి.చంద్రబాబూ..! ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా, మీ అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా? మీ కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, మీ కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం. ఈ దారుణమైన స్కామ్‌ను కప్పిపుచ్చలేరు ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే.. వీటి వెనుక మీరు, మీ సుపుత్రుడు ఉన్నారు కాబట్టే మీరు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు చేయించి మీకు డబ్బా కొట్టించుకోవడం ద్వారా నిజాయితీపరులైన ఉద్యోగార్థులను దెబ్బ తీసిన ఈ దారుణమైన స్కామ్‌ను కప్పిపుచ్చలేరు. పారదర్శకంగా పరీక్షలు, నిష్పక్షపాతంగా ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువకులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని మరోమారు భరోసా ఇస్తున్నాం. లీకేజీ వ్యవహారం నుంచి స్పోర్ట్స్ కోటా వరకు.. టెట్ అర్హతల నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు.. మొత్తంగా మెగా డీఎస్సీ వ్యవహారాన్ని, జీవో నంబర్ 4 ఆధారంగా నడిచిన నియామకాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మరోమారు డిమాండ్ చేస్తున్నా.మీ అక్రమాలను ఏపీపీఎస్సీకి పాకించారు..మరో నిర్ఘాంతపరిచే విషయం ఏమిటంటే.. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన మీరు, మీ అక్రమాల విధానాన్ని డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి కూడా పాకించడం. మా హయాంలో ఫైనాన్స్ క్లియరెన్స్ పొందిన అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్ 4నే మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా? డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేయడంతోపాటు ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపివేయడం వాస్తవం కాదంటారా? .@ncbn గారూ… మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ మోసాల్లో “మెగా”, నిజాయితీపరులైన అభ్యర్థుల… pic.twitter.com/8dkiPMnKjk— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026 -
DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు
-
లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం
-
41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..
-
DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?
-
అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?
-
కదిలిన స్పోర్ట్స్ కోటా డొంక
కౌతాళం: కర్నూలు జిల్లాలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో చోటు చేసుకున్న బాగోతాలు కలకలం రేపడంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు హడావుడిగా విచారణకు ఉపక్రమించారు. కౌతాళం మండలంలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందిన 24 మంది ఉపాధ్యాయులను మండల విద్యాధికారులు రామాంజినేయులు, శోభారాణి గురువారం విచారించి వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఎంఈవో కార్యాలయానికి కాకుండా గోతులదొడ్డి పాఠశాల వద్దకు పిలిపించి అక్కడ రహస్యంగా విచారణ చేపట్టారు. వల్లూరు ఆదర్శ పాఠశాలలో ప్రభాకర్‌తో పాటు మిగతా నలుగురు ఉపాధ్యాయులు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం పొందిన వారే ఉన్నారు. కరా్టటక సరిహద్దు ప్రాంతమైన కౌతాళంలో నదీ తీర గ్రామాలనే స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఎంచుకోవడం గమనార్హం. వల్లూరు పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు, కుంబళనూరులో ఐదుగురు, గుడికంబాలిలో ముగ్గురు, కాత్రికి పాఠశాలలో నలుగురు, మరళిలో ఇద్దరు, కరణిలో ఒకరు, కుంటనహాల్‌లో ఒకరు, చిరుతపల్లి పాఠశాలలో ముగ్గురు.. ఇలా సరిహద్దు గ్రామాలనే స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఎంపిక చేసుకున్నారు.జిల్లా ఫస్ట్ వచ్చినా ఉద్యోగం రాలేదు.. డీఎస్సీలో తన చిన్నాన్న కుమార్తె 70.18 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించినా ఉద్యోగం ఇవ్వలేదని నదిచాగి ఎంపీటీసీ లింగన్నగౌడ్ పేర్కొన్నారు. తాళ్లూరు స్వాతికి టెట్‌లో 150కి 115 మార్కులు వచ్చాయన్నారు. కాల్ లెటర్ పంపించినా కర్నూలుకు వెళితే రిజెక్ట్ చేశారన్నారు. -
టెట్ ఫెయిలైనా టీచరే..!
కర్నూలు సిటీ: మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన పోస్టుల్లో పలువురు అర్హతలు లేకపోయినా తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో మెగా డీఎస్సీ ద్వారా సెకండ్ గ్రేడ్ టీచర్‌గా ఎంపికై విధులు నిర్వహిస్తున్న ఈ.ప్రభాకర్ విద్యార్హతలపై మీడియా, సోషల్ మీడియాలో వి్రస్తృతంగా ప్రచారం జరగడంతో నాలుగైదు రోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. కౌతాళం ఎంఈవో, కర్నూలు డీఈవో ఆఫీస్‌లో నిర్వహించిన విచారణలో టెట్ పరీక్షలో అర్హత మార్కులు సాధించకుండానే ఆయన టీచర్‌గా ఎంపికైనట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో 21 మంది స్పోర్ట్స్ జూడో కోటాలో టీచర్ పోస్టులు పొందారు. వీరిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఏడుగురు ఉన్నారు. వీరంతా బంధువులు కావడం గమనార్హం. ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిలో అనర్హులు ఉన్నట్లు కొందరు అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు. టెట్ క్వాలిఫై కాకున్నా టీచర్‌గా ఎంపిక చేసిన శాప్.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెగా డీఎస్సీ ద్వారా 1,697 ఎస్జీటీ, 786 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 79 మున్సిపల్ టీచర్ పోస్టులు, 28 ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ పోస్టులు భర్తీ చేశారు. స్పోర్ట్స్ కోటా కింద ఎస్జీటీ 48 (తెలుగు మీడియం), 3 పోస్టులు (ఉర్దూ మీడియం), లాంగ్వేజెస్ పోస్టులు 6, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు గణితం 2, ఫిజికల్ సైన్స్ ఒక పోస్టు, బయోలాజికల్ సైన్స్ 2, సోషల్ స్టడీస్ 3, ఫిజికల్ ఎడ్యుకేషన్ 5 పోస్టులకు శాప్ అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లా విద్యాశాఖకు పంపింది. ఆ జాబితాలో ఉన్న వారందరికీ పోస్టింగ్స్ ఇచ్చారు. వెల్దుర్తి మండలం రత్నపల్లికి చెందిన ఈ.ప్రభాకర్ వల్లూరు ఎంపీపీఎస్‌లో ఎస్జీటీ టీచర్‌గా పోస్టింగ్ పొందారు. ఆయన హాకీ క్రీడాకారుడుగా సర్టిఫికెట్ సమర్పించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు పొందాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో టెట్‌లో తప్పనిసరిగా 60 శాతం మార్కులు అంటే 75 మార్కులు సాధించాలి. కానీ డీఎడ్ తరువాత 2022లో రాసిన టెట్‌లో (హాల్‌టికెట్ నెంబరు: టీఈటీ 22265677) పేపర్–1 ఏలో ఆయనకు 65.4281 మార్కులు మాత్రమే వచ్చాయి. 2024లో (హాల్ టికెట్ నెంబరు: టీఈటీ 7240454497) 66.83274 మార్కులు సాధించారు. అదే ఏడాది మరోసారి నిర్వహించిన టెట్‌లో (హాల్ టికెట్ నెంబరు: టీఈటీ 241187876) ఆయన 61.81213 మార్కులు పొందారు. 2025లో నిర్వహించిన టెట్‌లో 51.7424 మార్కులు మాత్రమే వచ్చాయి. కానీ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసిన శాప్.. టెట్ 2022లో ఆయనకు వచ్చిన 65.4281 మార్కులకు అర్హుడిగా నిర్ధారిస్తూ ఎస్జీటీ పోస్టుకు ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీలు టెట్‌లో 75 మార్కులు వస్తేనే అర్హులు. కానీ ప్రభాకర్‌కు కనీస అర్హత మార్కులు లేకున్నా టీచర్ పోస్టుకు శాప్ ఎంపిక చేయడం గమనార్హం. చర్యలకు డీఈవో సిఫారసు..! మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఈ.ప్రభాకర్ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను కర్నూలు డీఈఓ ఆఫీసులో డిప్యూటీ డీఈఓ శ్రీధర్‌బాబు, కల్లూరు ఎంఈఓ–2 వనజాకుమారి బుధవారం పరిశీలించారు. ప్రభాకర్ టెట్ పేపర్–1ఏలో అర్హత మార్కులు పొందలేదని, ఈ విషయాన్ని ఆయనే అంగీకరించారని, తదుపరి చర్యల నిమిత్తం సీసీఏ నిబంధనలను అనుసరించి పాఠశాల విద్య డైరెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనర్హులను తొలగించాలి.. టెట్‌లో క్వాలిఫై కాని వ్యక్తిని మెగా డీఎస్సీలో టీచర్ ఉద్యోగానికి ఎంపిక చేసి అర్హులకు అన్యాయం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారితో పాటు మెగా డీఎస్సీలో ఎంపికైన వారందరి సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. అర్హత లేని వారిని తొలగించి, అర్హులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. – కె.సతీష్, బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మెగా డీఎస్సీపై సిట్టింగ్ జడ్జితో విచారించాలి. ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టెట్‌లో అర్హత పొందాల్సిందేనని చెబుతున్న ప్రభుత్వం మెగా డీఎస్సీలో అనర్హులను ఎలా ఎంపిక చేస్తుంది? స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లన్నీ మరోసారి వెరిఫై చేయాలి. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలకు వల్లూరు స్కూల్ టీచర్ ఉదంతమే ఉదాహరణ. – కె.భాస్కర్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు -
DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి
-
లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి.. వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖ: డీఎస్సీలో అక్రమాల బండారం బయటపడిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. స్పోర్ట్స్ కోటా, పేపర్ లేకేజి ఆరోపణలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు గురువారం విశాఖలో వరుదు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. కర్నూలు ప్రభాకర్ గౌడ్ కు టెట్ అర్హత లేకుండా టీచర్ పోస్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. చర్చకు రావాలని సవాల్ విసరడం కాదు దమ్ముంటే డీఎస్సీ అంశంపై ఇప్పుడు మాట్లాడాలి. వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. డీఎస్సీలో ఇంకెన్ని అక్రమాలు జరిగాయో తేలాలని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చెయ్యాలని ఈ అంశంపై సీఎం చంద్రబాబు దీనిపై స్పందించాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.. . -
స్పోర్ట్స్ కోటాలో DSC అక్రమాలు బట్టబయలు..
-
టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్టు ఇచ్చేశారు..
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా వల్లూరులో మెగా డీఎస్సీ అక్రమాలు బట్టబయలయ్యాయి. టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్ట్ ఇచ్చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. టెట్ అర్హత లేకుండానే స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టు ఇచ్చినట్లు కర్నూలు విద్యాశాఖ అధికారులు నిర్థారించారు. స్పోర్ట్స్ కోటాలో టీచింగ్ పోస్టుకు టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధనలు ఉండగా.. అర్హత లేకుండానే ఓ అభ్యర్దిని ఎస్జీటీ పోస్టుకు శాప్ ఎంపిక చేసేసింది.కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో అర్హత లేని టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. కర్నూలు డీఈవో ఆఫీస్‌లో టీచర్స్ కమిటి ఆధ్వర్యంలో ప్రభాకర్ గౌడ్ విద్యార్హతలపై విచారణ జరపగా.. విచారణ కమిటీకి అర్హత సర్టిఫికెట్లను ప్రభాకర్ గౌడ్ చూపలేకపోయారు. టీచర్ కమిటీ ముందు టెట్ అర్హత పొందలేదని ప్రభాకర్ అంగీకరించారు.స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ చేసిన టీచర్ పోస్టులలో అనర్హులకు చోటుపై వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు సర్కార్ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో కేవలం ఒక జూడో క్రీడ ద్వారానే 21 మందికి టీచర్ పోస్టులు ఇచ్చేసింది. ఘటనపై పాఠశాల డైరెక్టర్‌కు నివేదిక అందజేస్తామని కర్నూలు డీఈవో తెలిపారు. -
బాబూ.. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సమాధానమేది?
ఆంధ్రప్రదేశ్‌లో విశ్వసనీయతతో కూడిన రాజకీయానికి, బుకాయింపు రాజకీయానికి మధ్య ఉన్న తేడాను గమనించండి. డీఎస్సీ అక్రమాలపై సాక్ష్యాధారాలు చూపుతూ మీడియా సమావేశంలో వివరించడమే కాకుండా, వైఎస్సార్సీపీ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేసిన ఆరోపణలు అన్నింటికి జవాబు ఇచ్చిన తీరు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను పెంచిందని చెప్పాలి.ప్రతిపక్షం లేని అసెంబ్లీలో చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు డీఎస్సీపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చి, విపక్షం ఉన్న శాసనమండలిలో అసలు చర్చకే వెనుకాడడం, దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఏపీపీఎస్సీపై ఆరోపణలు చేసిన వైనంతో వారు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో లోకేష్ పరిణితితో వ్యవహరించలేకపోతే, చంద్రబాబు మాత్రం డబాయింపు విధానాన్ని అనుసరించారన్న అభిప్రాయం కలుగుతుంది. అన్నింటికి మించి డీఎస్సీ, ఏపీపీఎస్సీలు రెండిటి పైన సీబీఐ విచారణకు అప్పగించాలని జగన్ సవాల్ విసరడంతో చంద్రబాబు, లోకేష్‌లకు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.మామూలుగా అయితే జగన్ మీడియా సమావేశం పూర్తి కాగానే టీడీపీ అధినేతలు దానికి కౌంటర్‌గా వారే మాట్లాడడం కాని, లేదా పార్టీ ఇతర నేతలతో కాని జవాబు ఇప్పించేవారు. కాని అలా చేసినట్లు కనిపించలేదు. అసెంబ్లీలో వీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూటమి ఎమ్మెల్యేలు దాదాపు మౌన ప్రేక్షకుల మాదిరిగానే ఉన్నారనిపించింది. దాదాపుగా ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం, ముఖ్యమంత్రి, మంత్రి చెబుతున్న దానిలో హేతుబద్దత లేదన్న భావన కలుగుతున్నా వాటిని ఎత్తిచూపలేకపోవడం వారి బలహీనతగా తీసుకోవాలి. టీచర్ల నియమాకాలకు సంబంధించి జరిగే డీఎస్సీ ప్రక్రియలో, ప్రత్యేకించి క్రీడా రిజర్వేషన్ విభాగంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ నిర్దిష్ట ఆధారాలతో ఆరోపిస్తోంది. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సభ్యులు పోరాటం చేశారు. వెంటనే ఆ అక్రమాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాని అధికార టీడీపీ చర్చకు ముందుకు రాలేదు. పోనీ అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు పెట్టకుండా ఉంటే అదో పద్దతి అనిపించేది. చంద్రబాబు, లోకేష్‌లు డీఎస్సీ అక్రమాలు జరగలేదని చెప్పడానికి చేసిన వాదనలో చాలా లోపాలు కనిపించాయి. జగన్ చేసిన ఆరోపణలు ఒక్కోదానికి క్లారిటీగా సమాధానం ఇవ్వలేకపోయారు. వాటిలో కొన్నిటిని పరిశీలించండి.జగన్ తన వాదనలో ప్రధానంగా క్రీడా కోటాలో 372 పోస్టులు పరీక్షలు లేకుండా ఇచ్చిన విదానాన్ని ప్రశ్నించారు. ఇందుకోసం రెండు జీఓలు ఇచ్చి, వారికి ఉద్యోగాలు ఇచ్చేశాక మళ్లీ ఆ జీఓలను రద్దు చేస్తూ వేరొక జీఓ ఇవ్వడం గురించి జగన్ ప్రస్తావించారు. తమకు కావల్సినవారికి ఉద్యోగాలు ఇచ్చి, తదుపరి గేట్లు మూసివేశారా అన్నది ఆయన వేసిన ప్రశ్న. దీనికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా జవాబు ఇచ్చినట్లు కనిపించలేదు. ప్రఖ్యాత క్రీడాకారిణి పీవీ సింధూతో ఈ టీచర్లను లోకేష్ పోల్చడాన్ని యావన్మంది తప్పుపట్టారు. ఈ విషయం కూటమి ఎమ్మెల్యేలకు కూడా అర్థం అయి ఉండాలి. కాని అధికార పక్షంలో ఉన్నందున వారు అడగలేకపోయి ఉంటారు. లోకేష్ తీరు ఇమ్మెచ్యూర్గా ఉందని పలువురు విశ్లేషకులు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేధావులు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన లేఖల ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారో అర్థం కాదు. కేవలం స్థానికంగా ఆటలలో పాల్గొంటే చాలన్న పద్దతి బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండి ఉండదు. చిత్రంగా జాతీయస్థాయి క్రీడలలో మెడల్స్ సంపాదించిన కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. వారు బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వచ్చినట్లు ప్రకటించడం, ఆ తర్వాత అతనిని మెరిట్ లిస్ట్ నుంచి తొలగించడం, పరీక్ష పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఒకరికే అప్పగించడం వంటివాటిని లోకేష్ సమర్ధించుకున్న తీరు కూడా అంత బాగోలేదు.టీచర్ల పోస్టులకు బేరాసారాలు సాగిన ఆడియో తదితర విషయాలను కూడా జగన్ ఆధారసహితంగా చూపించారు. చంద్రబాబు, లోకేష్‌లు ఇచ్చిన సమాధానాలలో పరస్పర విరుద్దంగా ఉన్న అంశాలను కూడా ప్రస్తావించారు. జగన్ లేదా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసినంతనే లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. కాని తన వైపు తప్పులేదని చెప్పుకోవడానికి ఆయన పడిన పాట్లు, ఆయనను రక్షించడానికి తండ్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన యత్నాలు అందరికి అర్థం అయిపోయాయన్నది పలువురి భావన.చంద్రబాబు తనదైన శైలిలో ఎదురుదాడి చేయడానికి యత్నించారు. పనికట్టుకుని ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ, తన జీవితంలోనే ఎన్నడూ ఇలాంటి కుంభకోణం చూడలేదంటూ పెద్ద హడావుడి చేయాలని ఆయన తలపెట్టారు. కాని అది పండలేదు. అసెంబ్లీలో అయినా, బయట అయినా ఆయన ఎంత గట్టిగా మాట్లాడితే, అంత అసత్యం అయి ఉంటుందని, గతంలో వైఎస్సార్సీపీలో ఉండి, ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటుండేవారు. పనికట్టుకుని జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న అధికారి గురించి చంద్రబాబు ప్రస్తావించడంపై రకరకాల చర్చలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో చంద్రబాబుపైన పలు కీలకమైన కేసులు రావడానికి ఆ అధికారి కారణమన్న కోపం ఉండి ఉండవచ్చని, దానిని ఈ సందర్భంగా బయటపెట్టారని కొందరు అంటున్నారు.అయితే జగన్ తన వివరణలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అన్నిటిని పటాపంచలు చేసే విధంగా మాట్లాడారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలు తమ ప్రభుత్వంలో జరిగాయని ఆయన చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మొత్తం ప్రక్రియ జరిగిందని ఆయన తెలిపారు. అసలు సంబంధం లేని డిజిటల్ వాల్యుయేషన్, హాయ్ లాండ్ ఇష్యూలను తెరపైకి తెచ్చి, వాస్తవాలు మరుగున పరచడానికి ముఖ్యమంత్రి యత్నించారని ఆయన ఆరోపించారు. వాటిని కూడా ప్రస్తావించి జగన్ హైకోర్టు తప్పుపట్టలేదన్న సంగతిని గుర్తు చేశారు.గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగలేదని చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ హైకోర్టుకు నివేదిక ఇచ్చిందని, పేపర్ టాంపర్ కాలేదని సీఎఫ్ఎస్ఎల్ నివేదిక పేర్కొందని జగన్ వెల్లడించడంతో కూటమి ప్రభుత్వ వాదనంతా వీగిపోయినట్లయింది. ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటు, వాల్యుయేషన్ మూడు ప్రదేశాలలో జరపడం, అన్నిచోట్ల సిసిటీవీ కెమెరాల అమరిక జంబ్లింగ్ మొదలైన పద్దతులను కట్టుదిట్టంగా అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌లు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారిలో తమ ప్రభుత్వం తప్పు చేయలేదన్న కాన్పిడెన్స్‌ను చూపించలేకపోయారన్న అభిప్రాయం పలువురిలో ఏర్పడింది.అదే టైమ్‌లో జగన్ తన ప్రజెంటేషన్‌లో ఒక స్పష్టత, వీడియో, ఆడియో ఆధారాలు, ప్రభుత్వ జీఓలు, కోర్టు తీర్పులలోని వివిధ భాగాలు మొదలైనవాటిని చూపించడం ద్వారా తన క్రెడిబిలిటీని మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. ఈ వివాదాల నుంచి బయటపడాలంటే, అవినీతి జరగలేదని, తాము అసత్యాలు చెప్పడం లేదని ప్రజలను నమ్మించాలంటే చంద్రబాబు ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే జగన్ విసిరిన సవాల్‌కు ధైర్యంగా స్పందించి డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండిటిపైన సీబీఐ విచారణకు ఆదేశించడమే. మరి వారు అలా చేయగలుగుతారా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబూ.. లోకేష్‌ను కాపాడే ప్రయత్నమా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో డీఎస్సీ, గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సవాల్‌పై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు తన కుమారుని కాపాడుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ సమస్యలు మీద కాకుండా రాజకీయాలు మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన స్కాం నుంచి బయట పడటం మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. డీఎస్సీ, గ్రూప్-1 అవకతకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ సవాల్‌పై నోరు మెదపలేదు. తన కుమారుని కాపాడుకోవటం మీద చంద్రబాబు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.ప్రజాధనంతో సభలు పెడుతూ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు. లోకేస్ తోడల్లుడు భరత్, ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేస్తే ఉద్యోగాలు ఇచ్చారు. మీ వారిని కాపాడుకోవడానికి తాపత్రయమా చంద్రబాబు?. పనిక కాక ముందు ఒక జీవో.. పని అయ్యాక ఒక జీవోనా? సీబీఐ విచారణ జరిపించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?.ఇది కూడా చదవండి: తగ్గితే నెగ్గుకురాలేం.. జనసేనలో కొత్త ఆందోళనఒకొక్క టీచర్ ఉద్యోగాన్ని 15 లక్షలు వరకు అమ్ముకున్నారు. వైఎస్ జగన్ లక్ష 30 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేశారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎక్కడా ఒక అవినీతి ఆరోపణ వినిపించలేదు. అది వైఎస్ జగన్ క్రెడిబిలిటి. మీ పార్టీ నాయకులు సంతకాలు పెట్టిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం అని ప్రజలు నమ్ముతున్నారు. డేటా సెంటర్లకు మేము వ్యతిరేకం కాదు. డేటా సెంటర్లకు 10 టీఎంసీ నీళ్లు అవసరం. ఆ నీటిని డేటా సెంటర్లకు ఎలా ఇస్తారు?. చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలు. చంద్రబాబు పాదంతో మరోసారి కరువు సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం కోసమే బహిరంగ సభ పెట్టారు అంటూ మండిపడ్డారు. -
పీవీ సింధూ పోస్టుకి, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాకూ తేడా తెలీదు
-
ఉలకవేం బాబూ.. పలకవేం లోకేశ్.. వైఎస్ జగన్ సవాల్‌పై నోరు మెదపరేం?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి బట్టబయలు చేశారు. ఈ స్కామ్ నుంచి తన కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ను కాపాడుకోవాలన్న ఆరాటంతో ఏపీపీఎస్సీ–2018 గ్రూప్–1 నియామకాలపై సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువేనంటూ సాక్ష్యాధారాలతో బహిర్గతం చేశారు. గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, మరి డీఎస్సీ–2025పై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అని చంద్రబాబు, లోకేశ్‌కు వైఎస్ జగన్ సవాల్ విసిరారు. సిద్ధమైతే రెండింటిపై తక్షణమే సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని ఛాలెంజ్ చేశారు. వైఎస్ జగన్ సవాల్ విసిరి.. ఛాలెంజ్ చేసి 36 గంటలు గడిచినా అటు సీఎం చంద్రబాబుగానీ.. ఇటు మంత్రి లోకేశ్‌గానీ దానిపై నోరు మెదపడం లేదు. సవాల్‌ను స్వీకరిస్తున్నట్లుగానీ.. ఛాలెంజ్‌కు సిద్ధపడుతూ సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాస్తామనిగానీ వారిద్దరూ ప్రకటించలేదు. డీఎస్సీ కుంభకోణానికి పాల్పడ్డారు కాబట్టే తండ్రీకొడుకులు ఇద్దరూ మౌన ముద్ర దాల్చారని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, విద్యావేత్తలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. ‘నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు, లోకేశ్‌కు మరో నీతి ఉంటుందా?’ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మెగా డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అడ్డంగా దొరికిపోయిన తండ్రీ కొడుకులు » డీఎస్సీ కుంభకోణం, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు, లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించి చూపుతూ వారు చెబుతున్నవన్నీ అబద్ధాలేనంటూ వైఎస్ జగన్ సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. » రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యత ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు లోకేశ్ స్వయంగా అంగీకరించడాన్ని గుర్తు చేస్తూ, ప్రశ్నల లీకేజీకి ద్వారాలు తెరిచిన వైనాన్ని వివరించారు. » ‘డీఎస్సీ ప్రశ్నపత్రాలు తయారీ విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు తొలి ర్యాంక్ వచ్చి ందని చంద్రబాబు, లోకేశ్ అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. మొదటి మెరిట్ లిస్ట్‌లో నవీన్ పేరు ఉంది. రెండో లిస్ట్‌లో నవీన్ పేరు తీసేశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చి న నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి. ఆయనకు ప్రశ్నపత్రం యాక్సెస్ ఉంది కాబట్టి. పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి. నవీన్‌కు ఉద్యోగమిస్తే గోల అవుతుంది కాబట్టి. అందువల్ల ముందస్తుగానే మెరిట్ లిస్ట్‌లో నవీన్ పేరు తొలగించారు. నవీన్ కోర్టుకు వెళ్లాడు. ఉద్యోగం ఇవ్వాలని అడుగుతున్నాడు. మరి ఇది నవీన్ దగ్గరే ఆగిపోయిందా? లేక ఇంకా జరిగిందా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. » చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, లోకేశ్ ఒప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ దీన్ని సమర్థించుకోవడానికి క్రీడాకారులకు పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని.. పీవీ సింధుకు నేరుగా ఉద్యోగం ఇచ్చిన రీతిలోనే 372 టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చామని చెప్పడాన్ని ఎత్తిచూపారు. వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకునేందుకు ప్రత్యేకంగా జీఓ నెం.4, జీవో నెం.47 ఇచ్చి గేట్లు ఎత్తారని.. పని పూర్తయిన తర్వాత జీవో నెం.23, జీవో నెం.56 ఇచ్చి మళ్లీ గేట్లు మూసేశారని చెప్పారు. ఇంతకు ముందు పరీక్షలతో సంబంధం లేదన్నారని.. తర్వాత జీవోల్లో పరీక్షలో అర్హత సాధించాల్సిందేనన్నారని.. అంటే మళ్లీ గేట్లు మూసేశారని వివరించారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ‘సాఫ్ట్‌బాల్’ అసోసియేషన్ నుంచి, అలాగే లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ అధ్యక్షుడిగా ఉన్న ‘జూడో’ అసోసియేషన్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు భర్తీ చేసిన వైనాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో చంద్రబాబు, లోకేశ్ ఒప్పుకున్నారని.. కానీ బేరసారాలు జరిపిన వ్యక్తిని అరెస్టు కూడా చేయకపోవడాన్ని ఎత్తిచూపారు. » వైఎస్ జగన్ సాక్ష్యాధారాలతో డీఎస్సీ కుంభకోణాన్ని బట్టబయలు చేయడంతో తండ్రీకొడుకులు అడ్డంగా దొరికిపోయారని.. తేలుకుట్టిన దొంగల్లా నోరు మెదపడం లేదని డీఎస్సీ అభ్యర్థులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం డీఎస్సీ కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తూ.. ఎన్నో కీలక డాక్యుమెంట్లను ప్రదర్శిస్తూ.. సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా అంటూ వైఎస్ జగన్ సవాల్ విసిరారు. 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గ్రూప్–1 నియామకాల్లో తామెక్కడా తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఏకంగా గంటా 54 నిమిషాల పాటు సుదీర్ఘంగా వీటి గురించి వివరిస్తూ మాట్లాడారు. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నేరుగా స్పందించకుండా ఎప్పటిలాగే టాపిక్ డైవర్షన్‌కు తెర తీశారు. ఇన్ని ముఖ్యమైన అంశాలపై స్పందించకుండా డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఒకటే అన్నారంటూ నిస్సిగ్గుగా సోషల్ మీడియాలో తమకు అలవాటైన రీతిలో విష ప్రచారం చేస్తున్నారని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు మండిపడుతున్నారు. కళ్లెదుటే డీఎస్సీ కుంభకోణంపై సాక్ష్యాలు కనిపిస్తుంటే వాటిపై స్పందించే దమ్ము, ధైర్యం లేక ఇలా పలాయన మంత్రం పఠిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. -
DSC కుంభకోణంలో సంచలన నిజాలు బయట పెట్టిన అభ్యర్థి
-
14 లక్షల 50 వేలు తీసుకున్నారు... DSC ఉద్యోగం ఇప్పిస్తామని టీడీపీ నేతలు మోసం చేశారు..
-
జగన్ ను ఆపే దమ్ము వాళ్లకు లేదు.. నేను జగన్ మనిషిని అనుకుంటే తప్పేంటి..
-
కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీ కుమారులకో నీతా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో తప్పులపై ప్రశ్నిస్తే అబ్బాకొడుకులు గింజుకుంటారే గానీ సీబీఐ విచారణకు అంగీకరించడం లేదంటూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ల వ్యవహార శైలిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు, ఆయన కుమారుడికి వేరే నీతి ఉంటుందా?’ అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ మెగా డీఎస్సీ 2025 కుంభకోణం, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1ల నియామకాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడిన మాటల వీడియోలను చూపుతూ.. వారు చెబుతున్నవన్నీ అబద్ధాలేనంటూ సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. మెగా డీఎస్సీ విషయంలో లీకేజీ, అక్రమాలపై తాము ఇప్పటివరకూ ఏ అంశాలనైతే ప్రజలముందు ఉంచామో అవన్నీ వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితిలోకి వచ్చిందని వైఎస్ జగన్ తెలిపారు. ఇవన్నీ గట్టిగా ప్రస్తావిస్తామనే తమకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని, చివరకు ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారని చెప్పారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం తమదని, ప్రతిపక్ష నాయకుడిగా తనను గుర్తిస్తే, సభా నాయకుడు సీఎంతో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి గుర్తించడం లేదన్నారు. గ్రౌండ్లో ప్రత్యర్థి జట్టు లేనిచోట.. బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీ కుమారులు ఇద్దరూ బ్యాటింగ్ చేస్తూ, తాము అద్భుతంగా చేశామని తమకు తాము కితాబు ఇచ్చుకుంటున్నారంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ పేపర్ లీకేజీ, అక్రమాలపై చర్చ చేపట్టాలంటూ నాలుగు రోజులపాటు శాసన మండలిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు స్తంభింపచేశారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడతారేగానీ పక్కనే ఉన్న మండలిలో మాత్రం చర్చకు ముందుకు రావడం లేదన్నారు. ఎందుకంటే అక్కడ తమ పార్టీ బలం ఉంది కాబట్టి చర్చ జరిగితే వారి తప్పులన్నీ బయటకు వస్తాయని, డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేసి తప్పుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ తేటతెల్లం అవుతోంది కాబట్టి అక్కడ చర్చించడానికి ముందుకు రావడం లేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ స్కామ్‌ను అంశాలవారీగా ఎండగడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఒక్కరికే రెండు బాధ్యతలా..?డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ అనేది ఒక అంశం. పరీక్ష నిర్వహణ అనేది మరో అంశం. ఈ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు అసెంబ్లీలో లోకేశ్ స్వయంగా అంగీకరించారు. పైగా తప్పేముంది? అని దబాయిస్తున్నారు. ప్రశ్న పత్రం తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. పరీక్షల నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ బాధ్యత. ఈ రెండూ ఒక్కరి చేతే చేయిస్తే పారదర్శకత లోపిస్తుంది. లీకేజీకి ఎక్కువ అవకాశం ఉంది. ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి నిర్వహించిన చరిత్ర ఎన్నడూ లేదు. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణను ఒకే వ్యక్తికి అప్పగించామని లోకేశ్ తనకు తానుగా ఒప్పుకున్నారు. పరీక్ష పత్రం తయారీ, నిర్వహణ ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల చెక్స్ అండ్ బ్యాలన్స్ అనేది తొలగిపోయింది. లీకేజీకి ద్వారాలు తెరిచారు. అందుకే సీబీఐ విచారణ అడుగుతున్నాం.ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?డీఎస్సీ ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు తొలి ర్యాంక్ వచ్చిందని తండ్రీ కుమారులు అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. మొదటి మెరిట్ లిస్ట్‌లో నవీన్ పేరు ఉంది. రెండో లిస్ట్‌లో అతడి పేరు తీసేశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు విడుదల చేశారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదు కాబట్టి ఇవ్వలేదని చంద్రబాబు, లోకేశ్ చెబుతున్నారు. ఇదే వాస్తవం అయితే నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? తన ఐడీని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని నవీన్ కోర్టుకు వెళ్లాడు. తన ఐడీ బ్లాక్ అయ్యిందని, కాల్ లెటర్ రాలేదని, డీఎస్సీలో మంచి మార్కులు వచ్చాయని, అయినా ఎందుకు కాల్ లెటర్ రాలేదని, ఇది నా జీవితానికి చివరి ఛాన్స్ అని విద్యాశాఖకు నవీన్ మెయిల్ పెట్టాడు. ఇదే విధంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. క్యాండిడేట్ ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు అతడు వెరిఫికేషన్‌కు ఎలా రాగలుగుతాడు? దీనికి అసెంబ్లీలో అబ్బా కొడుకులిద్దరూ ఎందుకు సమాధానం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే కారణం.. నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి. ఆయనకు ప్రశ్నపత్రం యాక్సెస్ ఉంది కాబట్టి. పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి. అతడికి ఉద్యోగం ఇస్తే గోల అవుతుంది కాబట్టి. ముందస్తుగానే మెరిట్ లిస్ట్‌లో అతడి పేరు తొలగించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. తన ఐడీని బ్లాక్ చేశారు. కాల్ లెటర్ పంపలేదు. మొదటి లిస్ట్‌లో అతడి పేరు ఉంది, రెండో లిస్ట్‌లో తీసేశారు. ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. తన ఉద్యోగం తనకు ఇవ్వాలని అడుగుతున్నాడు. మరి ఇది నవీన్ దగ్గరే ఆగిపోయిందా? ఇంకా జరిగిందా? సీబీఐ దర్యాప్తు జరిగితేనే కదా ఇవన్నీ తెలిసేది.పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలా?ఒకవైపు సింధు పేరు చెప్పి వీళ్ల అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించిన ఎస్టీ అభ్యర్ధి దుర్గయ్యకు కాల్ లెటర్ పంపి ఉద్యోగం ఇవ్వలేదు. అతను ఆర్చరీలో బంగారు పతకం సాధించాడు. ఆశ్చర్యమేమిటో తెలుసా? వీళ్ల పార్టీకి చెందిన నేతలు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ‘‘సాఫ్ట్‌బాల్’’ అసోసియేషన్ నుంచి, అలాగే లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ అధ్యక్షుడిగా ఉన్న ‘‘జూడో అసోసియేషన్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఏకంగా 372 పోస్టులు భర్తీ చేశారు. సాఫ్ట్‌బాల్ సంఘ అధ్యక్షునిగా ఉన్న కూన రవికుమార్, జూడో సంఘ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ భరత్ గతంలోనూ స్పోర్ట్స్ కోటా ఉండేది. కానీ డీఎస్సీ క్వాలిఫై అవ్వాలి. కానీ ఇప్పుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇంటర్ కాలేజీ స్థాయిలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఉద్యోగాలిచ్చారు. పని అయిపోయిన తరువాత ప్రభుత్వమే ఈ జీవోలను రద్దు చేసింది. ఇక మీదట క్వాలిఫై అయితేనే అర్హత అని మరలా పాత పద్ధతికే వచ్చారు. ఇలా ఎందుకు జీఓలు మార్చారు? ఏకంగా జీవోలు ఇచ్చే స్థాయికి స్కామ్ వెళ్లిందంటే పైనుంచి కింద వరకూ అందరూ ఉన్నట్టే కదా! మంత్రి సంతకం లేకుండా జీవో ఇస్తారా? దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరగాలా వద్దా?బేరసారాలు జరిగినట్లు ఒప్పుకున్నా చర్యలేవీ?స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ వ్యక్తి ఎవరో పోలీసులు కనుక్కోకుండా, ఎఫ్ఐఆర్లో ఆ వ్యక్తి పేరు రాయకుండా కేవలం ‘సస్పెక్ట్’ అని మాత్రమే రాశారు. పైగా అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణం.. సీనియర్ అధికారులతో మాట్లాడినట్లు రాశారు. మరి ఎవరితో మాట్లాడినట్లు? అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కుమారులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి. అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని, బెయిల్‌పై వచ్చాడని తండ్రీ కుమారులు చెబుతున్నారు. అసెంబ్లీలో తండ్రీ కుమారులు చెప్పినట్లు నిజంగా ఆ వ్యక్తిని అరెస్టు చేశారా? కోర్టు ముందు ప్రవేశపెట్టారా? జైలుకు పంపారా? ఆ అరెస్ట్ ఉత్తదేనన్న సీసీటీఎన్ఎస్..కేంద్రం ఆధ్వర్యంలోని ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్’ (సీసీటీఎన్ఎస్)లో చూస్తే.. ఆ వ్యక్తిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఉంది. ఆ విషయం డాక్యుమెంట్లో ఉంది. నిజానికి ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. కానీ, తండ్రీ కుమారులు ఇద్దరూ ఈ విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరించినట్టు, అతడిని అరెస్టు చేసినట్లు, చర్యలు తీసుకున్నట్లు పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామా చేశారు. స్పోర్ట్స్ కోటాలో జాబ్ కోసం రూ.14.10 లక్షలు లంచంఒంగోలులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. డీఎస్సీలో జాబ్ ఇప్పిస్తామని నమ్మించి తమను మోసం చేశారని ఓ మహిళా అభ్యర్థి రాధిక నుంచి ఫిర్యాదు వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో జాబ్ కోసం రూ.14.10 లక్షలు లంచం ఇచ్చినట్లుగా బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి. రిఫరెన్స్‌గా మరో వ్యక్తికీ ఇలా చేస్తున్నామని ఆమెకు చెప్పారు. రిఫరెన్స్‌గా చూపిన వ్యక్తికి వచ్చింది. కానీ ఈ అమ్మాయికి రాలేదు. తాను మోసపోయానని గ్రహించి గట్టిగా నిలదీస్తే ఏపీ టూరిజంలో మరో పోస్టు ఇస్తామని మభ్యపెట్టారు. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్లో డీఎస్సీ పోస్టు కోసం బేరసారాలు చేశారని రాయకుండా, టూరిజం పోస్టుకోసం అన్నట్టుగా రాశారు. గతేడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంత వరకూ ఎలాంటి చర్యలు లేవు. అరెస్టులు లేవు. తన కంప్లైంట్‌పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఆ అమ్మాయి ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా ఎక్కడికక్కడే వదిలేయాలని తండ్రీ కుమారులు ఇచ్చిన ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తున్నారు. డీఎస్సీ లీకేజీ దగ్గరనుంచి స్పోర్ట్స్ కోటా బేరసారాల వరకూ అన్నీ సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు. అందుకే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేశ్ తక్షణం రాజీనామా చేయాలి.పీవీ సింధూతో పోలికా..? పరీక్ష రాయకుండానే ఉద్యోగాలా?డీఎస్సీ పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీ చేశామని కూడా ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోడానికి చెప్పిన కబుర్లు మామూలుగా లేవు. స్పోర్ట్స్ పర్సన్స్‌కు పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదంట! పీవీ సింధులాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువుచెప్పే 372 టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చారంట! సింధూకి ఏ రూల్ పాటించారో ఇక్కడ కూడా అదే రూల్ పాటించారంట! 372 ఉద్యోగాలు పరీక్ష లేకుండా సింధూ పేరు చెప్పి తీసుకొచ్చారు. ఇలా అడ్డగోలుగా సమర్థించుకోవడం ఆ అబ్బా కొడుకులు ఇద్దరికే మినహా ఎవరికైనా సాధ్యం అవుతుందా? పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేశ్‌ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్‌లో చిప్‌లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా? అసలు డీఎస్సీ ఎందుకు? పిల్లలకు చదువు చెప్పే సామర్ధ్యం ఉందో లేదో చూసేందుకే కదా? మరి బుద్ధి ఉన్న వాళ్లెవరైనా ఇలా చేస్తారా? అసలు పీవీ సింధుతో ఎలా పోలుస్తారు? పీవీ సింధుకు 2016 రియో ఒలింపిక్స్‌లో వెండి పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం వచ్చాయి. ఒలింపిక్స్ నుంచి నేషనల్ గేమ్స్ వరకు ఏ మెడల్ సాధించిన వారికి ఎటువంటి పోస్టులు ఇవ్వాలనేది స్పష్టంగా వివరిస్తూ 2024 డిసెంబర్ 10న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 18 ఇదీ.. దీనిలోనే శాప్ కోచ్‌లకు ఇచ్చే పోస్టుల గురించి కూడా పేర్కొన్నారు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్ ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఎన్నో విజయాలు సాధించింది. ఇలాంటివాళ్లకి ప్రత్యేక పాలసీ ఉంది. ఆమేరకు కేబినెట్ నిర్ణయాలు తీసుకుని వారికి మేలు చేస్తుంది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంత మందికి సింధూకి వచ్చినట్లు మెడల్స్ వచ్చాయని అడుగుతున్నా. అసాధారణ ప్రతిభ కనబరిచే అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రత్యేక నియామకం కల్పించటాన్ని సాధారణ స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్తో ఎలా పోలుస్తారు? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్‌లను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్‌ను అడ్డుపెట్టుకుంటున్నారు.సింధులాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెబుతున్న ఈ చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ కూడా మళ్లీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారు. మరి తర్వాత వచ్చేవాళ్లు క్రీడాకారులు కాదా? వాస్తవం ఏమిటంటే.. వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోడానికి ప్రత్యేకంగా జీఓ నెం.4, జీవో నెం.47 ఇచ్చి గేట్లు ఎత్తారు. పని పూర్తయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.56 ఇచ్చి మళ్లీ గేట్లు మూసేశారు. ఇంతకు ముందు పరీక్షలతో సంబంధం లేదన్నారు. తర్వాత జీవోల్లో పరీక్షలో అర్హత సాధించాల్సిందేనన్నారు. అంటే మరలా గేట్లు మూసేశారు. -
చర్చల్లేవ్.. ఆమోదాలే
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలంటూ నాలుగో రోజు గురువారం సైతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి శాసనమండలిలో ఆందోళనకు దిగారు. సభ వాయిదా విరామ సమయంలోనూ చైర్మన్ పోడియం ఎదుట నేలపై కూర్చుని ఆందోళన కొనసాగించారు. అయితే, డీఎస్సీ అంశంపై చర్చ లేకుండానే నాలుగు రోజుల శాసనమండలి సమావేశాలు ముగిశాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, రమేష్‌యాదవ్, ఇషాక్‌బాషా డీఎస్సీ–2025 నిర్వహణ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై చర్చించాలంటూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభ ప్రారంభం కాగానే తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ప్రకటించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెట్టినట్టు ప్రకటించగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా చైర్మన్ పోడియం ముందుకు చేరుకుని డీఎస్సీ అక్రమాలపై వెంటనే చర్చను చేపట్టాలని కోరారు. అయితే, ప్రశ్నోత్తరాల కార్యక్రమమే కొనసాగుతుండడంతో పోడియం ముందు, పోడియంపైన చైర్మన్ కుర్చీని చుట్టిముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో ఆందోళనకు దిగారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, డీఎస్సీపై సభలో చర్చ చేయకుండా ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది, వెంటనే చర్చకు అనుమతించాలి, విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. చైర్మన్ మోషేన్‌రాజు ఆందోళన చేస్తున్న సభ్యులను వారి స్థానాలకు వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనను కొనసాగించారు. సభ్యుల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పోడియంపై చైర్మన్ కుర్చీకి రెండువైపులా నిలబడి నినాదాలు చేశారు. చైర్మన్ ముఖానికి అడ్డంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన కొనసాగిస్తుండటంతో 10.21 గంటల సమయంలో సభను తాత్కాలిక విరామ వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. సభ్యుల ఆందోళన కొనసాగిన ఆ 20 నిమిషాల సమయంలోనే మంత్రులు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఐదు ప్రశ్నలకు జవాబిచ్చారు.నేలపై కూర్చుని ఆందోళన కొనసాగింపుసభ విరామ వాయిదా పడిన తర్వాత కూడా వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం ముందు కూర్చుని ఆందోళన కొనసాగించారు. ‘చర్చకు రాకుండా విద్యాశాఖ మంత్రి పారిపోతున్నారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి. వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు ప్రభుత్వం’ అంటూ నినాదాలు కొనసాగించారు. 11.45 గంటల సమయంలో సభ తిరిగి ప్రారంభం కాగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో చైర్మన్ మోషేన్‌రాజు ప్రమాణం చేయించారు. అనంతరం బిల్లులపై చర్చను చేపడుతున్నట్టు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ సభ్యులు తిరిగి పోడియం వద్దకు చేరుకుని డీఎస్సీపై చర్చను చేపట్టాలంటూ ఆందోళనను కొనసాగించారు. సభ్యులు పలు సందర్భాల్లో చైర్మన్‌కు దండం పెడూతూ డీఎస్సీ అక్రమాలపై చర్చకు అనుమతించాలని కోరడం గమనార్హం. కాగా, ఆందోళనల మధ్యనే దాదాపు 15 నిమిషాల వ్యవధిలోనే నాలుగు బిల్లులపై చర్చ కొనసాగి, ఆమోదం పొందినట్టు చైర్మన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు చైర్మన్ కుర్చీ చుట్టూ నిలబడి ప్లకార్డులతో ఆందోళన కొనసాగిస్తుండటంతో 12 గంటల సమయంలో సభను రెండోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదా అనంతరం 12.42 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనల మధ్యనే మధ్యాహ్నం ఒంటిగంటలోపు మరో 8 బిల్లులపై చర్చ చేపట్టిన చైర్మన్ ఆ బిల్లులన్నీ ఆమోదం పొందినట్టు ప్రకటించారు. తర్వాత మంత్రి నారాయణ ప్రవేశపెట్టిన ‘ది వాటర్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్) అమెండ్మెంట్ యాక్ట్‌పై తీర్మానం ప్రవేశపెట్టి సభ్యుల ఆందోళన, గందరగోళ పరిస్థితుల మధ్య సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ‘షేమ్.. షేమ్. డీఎస్సీ చర్చనుంచి పారిపోయిన ప్రభుత్వం.. సిగ్గు, సిగ్గు’ అంటూ నినాదాలు కొనసాగించారు. అదే సభ నిరవధిక వాయిదాకు గుర్తుగా ‘జనగణమన..’ గీతం ప్రారంభం కావడంతో ఎక్కడివారు అక్కడే మౌనంగా నిలబడి గీతాలాపన చేశారు.లోకేశ్ రాజీనామా చేయాలిడీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ అక్రమాలకు నైతికబాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ బయట సర్కిల్ నుంచి గురువారం ప్రదర్శనగా వారు ‘మండలి’కి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సిగ్గు సిగ్గు, వెన్నుపోటు పార్టీకి సిగ్గు శరము లేదు, ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ, డీఎస్సీ అక్రమాలపై న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది.. పరీక్ష లేకుండా టీచర్ పోస్టులు ఇస్తారా సిగ్గు సిగ్గు.. జీఓ నెం.4, 47లపై సీబీఐ విచారణ జరపాలి.. అంటూ వారు నినాదాలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం మండలిలో చర్చించాలని.. తక్షణమే సీబీఐ విచారణ జరపాలంటూ ప్లకార్డు, పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలందరూ పాల్గొన్నారు. -
గ్రూప్–1పై మేం రెడీ.. మెగా డీఎస్సీపై మీరు రెడీనా? సీబీఐ విచారణకు సిద్ధమా
పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేశ్‌ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్‌లో చిప్‌లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంత మందికి సింధూకి వచ్చినట్లు మెడల్స్ వచ్చాయి? అసాధారణ ప్రతిభ కనబరిచే అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రత్యేక నియామకం కల్పించటాన్ని సాధారణ స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్తో ఎలా పోలుస్తారు? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్‌లను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్‌ను అడ్డుపెట్టుకుంటున్నారు.చరిత్రలో మొదటిసారి అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలిచ్చారు. విద్యా శాఖ మంత్రి ఆమోదం లేకుండా ఆ జీవోలు ఇవ్వగలుగుతారా? అరాచకాలకు గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? స్పష్టంగా మొబైల్ నెంబర్ కనిపిస్తున్నా అనుమానితులంటూ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలాంటి చర్యలూ లేవు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని, బెయిల్‌పై వచ్చాడని తండ్రీ కుమారులు చెబుతున్నారు. అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కుమారులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి.. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 అక్రమాలన్నీ పక్కా సాక్షా్యధారాలతో రుజువు కావడంతో తన కుమారుడిని కాపాడుకోవడానికి సీఎం చంద్రబాబు కొత్త ఆట మొదలు పెట్టారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మరింత దిగజారిపోయి ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1 నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షలో ఇప్పటి మెగా డీఎస్సీలో మాదిరిగా పేపర్ లీకేజీ కాలేదు.. ఎవరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు.. పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని.. మరి మెగా డీఎస్సీ–2025పై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా..? అని చంద్రబాబు, నారా లోకేశ్‌కు సూటిగా వైఎస్ జగన్ సవాల్ విసిరారు. సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని చాలెంజ్ చేశారు. గ్రూప్–1 నియామకాల్లో తామెక్కడా తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. పక్కా సాక్ష్యాధారాలతో మెగా డీఎస్సీ కుంభకోణం రుజువు కావడంతో కుమారుడిని కాపాడుకోవాలన్న ఆరాటంతో 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను, పారదర్శకంగా చేపట్టిన గ్రూప్–1 నియామకాలను ఆధారాలతో వైఎస్ జగన్ వివరించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మెయిన్స్ నిర్వహణ.. మూల్యాంకనం.. ఇంటర్వూ్యలు.. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తయిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..డీఎస్సీ పోస్టులు అమ్ముకునేందుకు బేరసారాలు ఆడుతున్న ఆడియో కాల్ వివరాలను ఫోన్ నంబర్‌తో సహా ప్రదర్శించిన వైఎస్ జగన్ ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ..మా హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న ఫిర్యాదు వచ్చిందా? చిత్తశుద్ధి, పారదర్శకత అంటే అది. ఇప్పుడు చూస్తే కుట్రపూరిత జీవోలు ఇచ్చి వీళ్ల ఎంపీలు, ఎమ్మెల్యేలే ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి 372 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇష్టారాజ్యంగా కుంభకోణాలు చేశారు. మేం 1.30 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడైనా ఒక్క ఆరోపణ వచ్చిందా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న వివాదం తలెత్తిందా? మేం ఇచ్చిన వాటిలో ఏడు నోటిఫికేషన్లు చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. మరో రెండు రద్దు చేశారు. ఇదీ చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ. మీ జోక్యంతో జరిగిన అక్రమాలన్నీ స్పష్టంమా హయాంలో జరిగిన గ్రూప్–1 నియామకాలకు, ఇప్పటి డీఎస్సీ–2025 నియామకాలకు ఎంతో తేడా ఉంది. చరిత్రలో మొదటిసారి పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి సంతకాలు లేకుండా ఈ జీవోలు ఇవ్వగలుగుతారా? నేరుగా విద్యా శాఖ మంత్రి ఆమోదంతో పరీక్షే లేకుండా ఉద్యోగాలు కట్టబెట్టే వ్యవస్థను రూపొందించారు. 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అరాచకాలకు గేట్లు ఎత్తారు. ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. ఇది నేరుగా చంద్రబాబు కుమారుడు విద్యా శాఖ మంత్రిగా ఉండగా జరిగింది. ఇది ఎంతో ఘోరమైన విషయం. డీఎస్సీ పరీక్ష రాయకుండానే టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టిన చరిత్ర ఎప్పుడూ లేదు. మా హయాంలోని గ్రూప్–1, ఇప్పటి డీఎస్సీ–2025కి మధ్య మొదటి తేడా ఇది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? అదేవిధంగా అతని ఐడీలను ఎందుకు చెరిపేశారు? అతడికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఈ సాక్ష్యాలతోనే పేపర్ లీకైందని స్పష్టంగా రుజువైంది. బేరసారాలు జరిగినట్టుగా ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? మొబైల్ నంబర్ కనిపిస్తున్నా అనుమానితులని అంటున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలాంటి చర్యల్లేవు. మరో కేసులో రూ.14 లక్షల నగదు లావాదేవీ జరిగినా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయరు. విచారణ చేపట్టరు. ఇలా మీ వ్యక్తిగత జోక్యంతో కూడిన కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ స్వతంత్ర సంస్థ. పెద్ద పెద్ద అధికారుల పర్యవేక్షణలో ఆ సంస్థ పనిచేస్తుంది. పరీక్షలు నిర్వహిస్తారు. బాబు దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పైగా మా ప్రభుత్వం రాక ముందే గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికే మెయిన్స్ నిర్వహించాం. హైకోర్టు ఆదేశాలతో, కోర్టు ఆధ్వర్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనం, ఎంపికైన వారికి ఉద్యోగాల కల్పన ఇలా ప్రతి ప్రక్రియ చేపట్టాం. ఈ పరిస్థితి ఇంతకు ముందు లేదుబాబు పాలనలో నేరుగా పోలీసులతోనే నేరుగా గంజాయి అమ్మిస్తున్నారు. ప్రతి గ్రామం, వీధుల్లో గంజాయి లభ్యమవుతోంది. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. గంజాయి సంస్కృతి గ్రామాలకు పాకింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంతకు ముందు రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. పోలీసులే నేరుగా గంజాయి అమ్మకాలు.. బీసీల రిజర్వేషన్ అంశం.. బీసీలకు ఎవరేం చేశారు? రైతుల సమస్యలు.. రాష్ట్రంలో నెలకొన్న కరవు, సంక్షోభ పరిస్థితులపై వచ్చే వారం మరోమారు మీడియా ముందుకు వస్తా. -
స్పోర్ట్స్ కోటా ఉద్యోగం.. నా దగ్గర డబ్బు తీసుకుంది ఆయనే..! లైవ్ లో DSC బాధితురాలి ఆవేదన
-
ఏపీ డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూ.14.5 లక్షలు బాధితురాలి నుంచి టీడీపీ నేతలు వసూలు చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసం రూ.14.5 లక్షలు వసూలు చేశారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి డీఎస్సీ బాధితురాలు రాధిక ఫిర్యాదు చేశారు. మంత్రి లోకేష్ కోటాలో ఉద్యోగం అంటూ మోసం చేశారని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పరీక్ష లేకుండా నాకు డీఎస్సీ ఉద్యోగం ఇస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలు మెడికొండ జ్యోతి, అడపా భాను ప్రకాష్‌లు డబ్బులు తీసుకున్నారు. ఆ ఉద్యోగం వేరే వ్యక్తికి ఇచ్చి నన్ను మోసం చేశారు. ఆ వ్యక్తి దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశా.. 10 నెలలైనా చర్యలు లేవు. నన్ను చంపుతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు...ఎస్పీ ఆఫీస్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్ట్ ఇస్తామని మోసం చేశారు. నా దగ్గర ఆధారాలున్నా.. నిందితుడిని అరెస్ట్ చేయలేదు. నాకు జరిగిన మోసాన్ని వైఎస్ జగన్‌కు వివరించాను’’ అని రాధిక తెలిపారు. -
కొంచెం కూడా సిగ్గులేకుండా.. లోకేష్ ను కాపాడుకోవడానికి మరింత దిగజారుతావా చంద్రబాబు..
-
కొంచెం సీక్రెట్ గా చేయాలంటా.. DSC స్కాం పై మరో సంచలనం ఆడియో వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
-
అసెంబ్లీ సాక్షిగా అబ్బా కొడుకులే నిజం ఒప్పుకున్నారు... లైవ్ లో వీడియో ప్లే చేసి ఏకిపారేసిన జగన్
-
ఏపీ శాసన మండలి నిరవధిక వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్.. 👉ఏపీ శాసన మండలి నిరవధిక వాయిదా.. 👉పది బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదంచర్చకు రాకుండా తప్పించుకున్న కూటమి..డీఎస్సీ అక్రమాలపై చర్చకు రాని ప్రభుత్వంనాలుగు రోజుల పాటు డీఎస్సీ అక్రమాలపై విచారణ కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల పోరాటంనాలుగు రోజులు డీఎస్సీపై చర్చకు భయపడ్డ ప్రభుత్వంప్రతిపక్షం లేని అసెంబ్లీలో చర్చ పెట్టిన ప్రభుత్వంప్రతిపక్షం ఉన్న మండలిలో చర్చ కు భయపడ్డ ప్రభుత్వంఎమ్మెల్సీల ఆందోళన ఉధృతంశాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన ఉధృతంశాసన మండలి వాయిదా పడినా ఆందోళన కొనసాగింపుమండలిలో నేల మీద కూర్చుని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీలుడీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలని ఆందోళననారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనశాసనమండలిలో వైఎశాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్డీఎస్సీపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుపోడియం వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలునారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు స్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కామెంట్స్..డీఎస్సీపై చర్చ జరపాలని కోరుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదుతప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారుస్పోర్ట్స్ కోటా వారికి పరీక్ష లేకుండా ఉద్యోగమిచ్చామని మంత్రి లోకేష్ చెబుతున్నారుటెట్ నుంచి మినహాయించి ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి అడిగినందుకు టీచర్లను సస్పెండ్ చేశారుతక్షణమే టీచర్లపై సస్పెన్షన్ ఎత్తేయాలిడీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలిఎమ్మెల్సీ మధుసూధన్ కామెంట్స్..2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% శాతానికి పెంచారుడీఎస్సీకి ముందు ఒక జీవో.. తర్వాత ఒక జీవో తెచ్చారు.జీవోలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారుడీఎస్సీలో ఉద్యోగాల కోసం లక్షల్లో బేరసారాలు జరిగాయిఎందుకు డీఎస్సీపై విచారణకు భయపడుతున్నారుఎమ్మెల్సీ ఇసాక్ బాషా కామెంట్స్..గతంలో ఎన్నడూ ఇలాంటి సమావేశాలు జరగలేదుడీఎస్సీపై విచారణ చేయించాలంటే భయపడి పారిపోతున్నారు.ర్యాలీగా మండలికి ఎమ్మెల్సీలు..ర్యాలీగా మండలికి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుమెడలో నల్ల కండువాలు ధరించి నిరసనమెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలుడీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్డీఎస్సీపై విచారణ చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శనమంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ -
లోకేష్ కాదు 'లీకేష్'! ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా..
-
14 రోజులైంది పేర్ని నాని ఛాలెంజ్ చేసి.. ఏం భయమా..
-
వెన్నుపోటు పార్టీ సర్కారుపై నిరసనాగ్రహం
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ– 2025లో జరిగిన అక్రమాలు, అవినీతిపై శానసమండలిలో చర్చించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. శాసనసభలో డీఎస్సీపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి బల్లలు చరిపించుకున్న వారు మండలిలో చర్చకు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. లక్షలాది మందికి సంబంధించిన అంశంపై మండలిలో చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం అందజేస్తున్నా తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రోజు సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలతో హాజరయ్యారు. అంతకముందు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ డీఎస్సీపై చర్చకు రాని వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం డౌన్ డౌన్, మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. డీఎస్సీపై సీబీఐ విచారణ వేయాలి.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. -
డీఎస్సీ నియామకాల నిగ్గు తేలాలి.. సీబీఐ విచారణ జరపాల్సిందే
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, బేరసారాలపై చర్చ జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుసగా మూడోరోజు బుధవారం కూడా శాసనమండలిలో పట్టుబట్టారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు నిగ్గుతేలాలి.. సీబీఐ విచారణ జరపాల్సిందే.. అంటూ ఆందోళన కొనసాగించారు. నల్లజెండాలు మెడలో వేసుకొని చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. డీఎస్సీ–2025 నిర్వహణ, నియామకాలపై చర్చ కోరుతూ సభ్యులు టి.కల్పలత, ఎం.వి.రామచంద్రారెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి ఉదయం వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్‌రాజు ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు అనుమతించాలంటూ పోడియం వద్దకు వెళ్లి డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత చర్చకు అనుమతించడం కుదరదంటూ చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు డీఎస్సీ అక్రమాలపై చర్చకు వెంటనే అనుమతించాలని నినాదాలు చేస్తూ పోడియంపైన చైర్మన్ వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. పోడియం కింద ఉన్న పలువురు సభ్యులు బల్లలు చరుస్తూ నినాదాలు కొనసాగించారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలి.. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వమే ప్రొసీజర్స్ ఫాలో కావాలి కదా: చైర్మన్ఈ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుంటూ పోడియంపైకి వచి్చన సభ్యులపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ మోషేన్‌రాజును కోరారు. ‘వాళ్లను కిందకు రమ్మనండి. మీరు చెప్పాలి. అది ప్రొసీజర్..’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ.. ‘మీరు మంత్రి. స్పీకర్‌గా కూడా చేసి ఉన్నారు. మీరు పదేపదే సభను అర్డర్‌లో పెట్టమంటున్నారు. తప్పులేదు. చర్యలు తీసుకోమంటున్నారు. కానీ చర్యలు తీసుకోమన్నప్పుడు దానికి ఏం ప్రొసీజర్ ఉందో ప్రభుత్వపరంగా ఫాలో అవండి. అంతేతప్ప మీరు పదేపదే చైర్‌ను పెద్దస్వరంతో.. ఏదో చేయలేకపోతున్నారు అనడం సరికాదు. మీకు అన్ని రూల్స్ తెలుసు. చర్యలు ఏం తీసుకోవాలో, రూల్స్ ఫాలో అవండి’ అంటూ సూచించారు. మంత్రి నాదెండ్ల, చైర్మన్ల మధ్య ఈ చర్చ జరిగే సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రస్వరంతో నినాదాలు కొనసాగించడంతో కేవలం పది నిమిషాలకే సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. చైర్మన్‌కు మంత్రులు పాఠాలు చెప్పడం సరికాదు: బొత్స సత్యనారాయణ తిరిగి 11 గంటల సమయంలో సభ ప్రారంభమైన తరువాత మంత్రి నాదెండ్ల, మండలి చైర్మన్ మధ్య జరిగిన సంభాషణ మరోసారి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ను ఉద్దేశించి మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. ‘సభలో నిబంధనలు ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఒకే రకంగా వర్తిస్తాయి. చిన్న అలసత్వం ఏదైనా జరిగితే మీకు చెప్పవచ్చు కానీ, మీకు హితబోధ చేయడం సరికాదు. దురదృష్టకరం. మంత్రి వైఖరి చాలాసార్లు చూశా. సభ్యుల ఆవేదన కూడ చైర్మన్ పరిశీలించాలి. మా డిమాండ్ ఒక్కటే.. డీఎస్సీ అక్రమాలపై చర్చ జరగాలని. కానీ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం బయట మాత్రం ప్రతిచోట చర్చకు మేం సిద్ధమేనని చెబుతోంది. చర్చ జరపమనే మేం అడుగుతున్నాం. కానీ చైర్మన్‌కు పాఠాలు చెప్పడాన్ని ఖండిస్తున్నాం. మంత్రులే భాషను తూలనాడుతున్నారు. మేం తప్పుగా మాట్లాడితే చూపించండి’ అని బొత్స పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. తరువాత మరోసారి వాయిదా పడి తిరిగి 12.45 గంటలకు ప్రారంభమైన సభ పదినిమిషాల వ్యవధిలోనే గురువారానికి వాయిదా పడింది. -
డీఎస్సీ నియామకాలపై అనుమానాలు
సాక్షి, అమరావతి: డీఎస్సీ పరీక్ష నిర్వహణపై రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలతో పాటు నిరుద్యోగ భృతి, ఫీజు రీఇంబర్స్మెంట్ వంటి అంశాలపై రాష్ట్ర విద్యార్థులకు సంఘీభావంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అండగా ఉంటుందని ఆ పార్టీ సభ్యురాలు, ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా తెలిపారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా రెండు నుంచి మూడు శాతం పెంచడం, పాత నోటిఫికేషన్ స్థానంలో కొత్త నోటిఫికేషన్లు తీసుకురావడంపై విద్యార్థుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఏదైనా పరీక్షల నిర్వహణపై విద్యార్థులు సందేహాలు, అనుమానాలను రేకెత్తించినప్పుడు స్వేచ్ఛగా న్యాయ విచారణ జరిపి వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో నేహా బోరా మాట్లాడుతూ.. పరీక్షల్లో భారీగా కాపీ జరిగిందన్న అనుమానంతో అభ్యర్థులు సీసీటీవీ ఫుటేజ్ అడిగితే లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మొత్తం మీద చూస్తే రాష్ట్ర డీఎస్సీలో కొన్ని అక్రమాలు జరిగాయని.. ఈ అంశంపై పోరాటం చేస్తున్న విద్యార్థులకు తాము అండంగా ఉంటామని ఆమె స్పష్టంచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఎపిసోడ్లో అధికార పార్టీ ప్రజల గురించి కాకుండా ప్రతిపక్ష పార్టీల గురించి ఎక్కువ ఆందోళన చెందుతోందన్న విషయం అర్థమవుతోందన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హమీలను అమలుచేయాలని డిమాండ్ చేసినప్పుడు గత ప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పించుకోవడాన్ని నేటి యువత ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని ఆమె స్పష్టంచేశారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే సమాధానం చెప్పాలిగానీ గత ప్రభుత్వమంటూ తప్పించుకోలేరంటూ నేహా బోరా హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యం ఉంటే ఇటువంటి ఆటలు ఆడటం ఆపేయాలన్నారు. ప్రత్యక్ష ఎన్నికలే అవసరంలేదు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం ద్వారానే సమస్యలను పరిష్కరించనవసరంలేదని ప్రజా ఉద్యమాల ద్వారా కూడా వీటిని పరిష్కరించవచ్చని నేహా బోరా అభిప్రాయపడ్డారు. ఈ జెన్‌జీ ఉద్యమం ద్వారానే కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించామని, అలాగే.. మూడు వ్యవసాయ చట్టాలు కూడా రైతుల పోరాటం ద్వారా ఉపసంహరించుకున్న విషయాలను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా యువత, పౌరులు ఈ దేశాన్ని కొత్తగా తీర్చుదిద్దుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం సీజేపీ జన ఉద్యమ సంస్థగానే ఉందని, రాబోయే కాలంలో తాను ఎన్నికల ప్రజాస్వామ్యంలోకి వెళ్లాల్సి వస్తే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. -
అడ్డంగా బుక్కయ్యారు.. తండ్రీకొడుకులకు CBI ఫీవర్
-
డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: డీఎస్సీ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో చర్చకు పట్టుబడుతుంటే, సమాధానం చెప్పలేక ప్రభుత్వం వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ పారిపోతోందని ఎద్దేవా చేశారు. లక్షలాది రూపాయలు చేతులు మారాయిడీఎస్సీ నియామకాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచి్చన చరిత్ర ఎక్కడా లేదు. కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి. అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. ఈ కుంభకోణంపై పక్కా ఆధారాలు మా వద్ద ఉన్నాయి. – లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి డీఎస్సీ అక్రమాలపై చర్చకు ప్రభుత్వం భయపడి పారిపోతోంది. డాక్టర్, టీచర్ ఉద్యోగాలను ఏ పరీక్షలూ లేకుండా ఇష్టమొచి్చనట్లు కార్యకర్తలకు పంచుతామంటే చూస్తూ ఊరుకోం. కుంభకోణంపై కచి్చతంగా సీబీఐ విచారణ జరపాలి. మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. – పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చర్చ అంటే పరారే శాసనసభలో డీఎస్సీపై ఏదో నివేదిక చదివి.. చర్చకు సిద్ధమని ప్రకటించిన తండ్రీకొడుకులు శాసనమండలిలో చర్చ అంటే ఎందుకు పారిపోతున్నారు. డీఎస్సీలో అక్రమాలు, అవినీతిపై ఆధారాలతో నిరూపించడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ ఎందుకు జీవో మార్చారు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన 384 మందిలో ఎంతమందికి ఛాంపియన్‌షిప్‌లు, పతకాలు వచ్చాయో ప్రజల ముందు ఉంచాలి. నియామకాలు సక్రమంగా చేపట్టామని చెబుతున్న ప్రభుత్వం మరి జీవో ఎందుకు మార్చింది? ఉపాధ్యాయ పోస్టు బేరసారాలు జరిగినట్లు ఆడియో/వీడియో ఆధారాలు వస్తే కేసు పెట్టామని చెప్పడం ద్వారా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లయింది. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ ప్రకటనల్లోనే గందరగోళం శాసనమండలిలో డీఎస్సీ అంశంపై చర్చ జరగాలని పట్టుబడితే ప్రభుత్వం చర్చకు ముందుకు రాకుండా తప్పించుకుంటోంది. డీఎస్సీపై మంత్రి లోకేశ్ ఒకలా.. కార్యదర్శి ఒకలా ప్రకటనలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థ ఎంత గందరగోళంలో ఉందో అర్థమవుతోంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా సర్టీఫికెట్లపై స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ అసోసియేషన్ వారే లేఖ రాయడం మా దృష్టికి వచి్చంది. – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ -
శాసన మండలిలో ‘మెగా’ ప్రతిష్టంభన!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 అక్రమాలపై చర్చించాలని విపక్షం పట్టుబట్టడంతో శాసనమండలిలో రెండో రోజు కూడా ప్రతిష్టంభన కొనసాగింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియమకాలలో అవకతవకలపై చర్చకు వైఎస్సార్ సీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, కుంభా రవిబాబు, వరుదు కళ్యాణిలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతూ చైర్మన్ పోడియం ముందుకు చేరుకొని ఆందోళన కొనసాగించారు. అసెంబ్లీలో మెగా డీఎస్సీపై ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో మాత్రం చర్చకు ఎందుకు వెనుకంజ వేస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. అయితే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక దానిపై చర్చకు వీలు కాదంటూ శాసనమండలి చైర్మన్ మోషన్‌రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభించడంతో చైర్మన్ పోడియం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్సీపీ సభ్యల ఆందోళన మధ్యే ఐదు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో ఉదయం సభ ప్రారంభమైన 27 నిమిషాలకే పదిన్నర గంటల సమయంలో వాయిదా పడింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పునఃప్రారంభమైన వెంటనే తిరిగి బుధవారానికి వాయిదా పడింది. రైతులపై ప్రేమ అసెంబ్లీలో ఏమైంది?: బొత్సమరోవైపు.. మండలిలో ప్రతిపక్ష నేత బొత్య సత్యనారాయణ, మంత్రి పయ్యావుల కేశవ్ మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. ‘మెగా డీఎస్సీపై, దాంట్లో జరిగిన అవకతవకలపై చర్చ జరగాలని, విచారణ జరపాలని రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. చర్చకు రెడీ అంటూ అన్ని చోట్లా మాట్లాడుతున్నారు. మరి శాసన మండలిలో మేం అడుగుతున్నాం కదా..? సమాధానం చెప్పండి..’ అంటూ ప్రభుత్వాన్ని బొత్స నిలదీశారు. దీనిపై మంత్రి కేశవ్ స్పందిస్తూ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్సార్సీపీకి ప్రజల అజెండా పట్టదని ఆరోపించారు. దీనికి బొత్స తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘అసెంబ్లీలో ముందుగా డీఎస్సీపై చర్చించాకే కరువుపై చర్చించారు కదా? మరి రైతులపై ఈ ప్రేమ అక్కడ ఏమైంది? ఇక్కడే వచ్చిందా?’ అంటూ నిలదీశారు. వ్యవసాయం– కరువుపై చర్చించాలని అడిగింది కూడా వైఎస్సార్సీపీనే అని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎప్పుడూ లేని వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆ అంశంపై కూడా చర్చ జరగాలి. కేవలం నాలుగు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం వ్యవసాయం – కరువు పరిస్థితులపై చర్చించేందుకు మరో రెండు రోజుల పాటు సమావేశాలు పొడిగించవచ్చు కదా?’ అని బొత్స ప్రశ్నించారు. సమావేశాలను పొడిగించండి.. రైతుల సమస్యలపై సమగ్రంగా చర్చిద్దామంటూ డిమాండ్ చేశారు. ఈ సమయంలో చైర్మన్ జోక్యం చేసుకుంటూ దీనిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ సూచించారు. బొత్స, మంత్రి పయ్యావుల సంవాదం కొనసాగుతున్న సమయంలో సభ ఉదయం పదిన్నర గంటల సమయంలో తాత్కాలికంగా వాయిదా పడింది.డీఎస్సీ పేరెత్తితే ప్రభుత్వం పారిపోతోంది⇒ మండలిలో విపక్ష నేత బొత్స ధ్వజం⇒ మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరపాలి ⇒ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి ⇒ డీఎస్సీ అక్రమాలపై మండలిలో పూర్తిస్థాయిలో చర్చించాల్సిందే ⇒ అప్పటిదాకా వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందిసాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ పట్టుబడితే ప్రభుత్వం రెండో రోజు కూడా భయపడి పారిపోయిందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు దాటవేత ధోరణిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేం దేనికైనా సిద్ధంగా ఉన్నామని పత్రికల్లో గొప్పలు చెప్పుకోవడం మినహా వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో పూర్తిస్థాయిలో చర్చ జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో డీఎస్సీ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద నేరుగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 3 శాతం ఉద్యోగాలిస్తూ ఇచి్చన జీవోకు అసలు చట్టబద్ధత ఉందా? దాన్ని కేబినెట్లో గానీ అసెంబ్లీలో గానీ పెట్టారా? అని నిలదీశారు. మంత్రి సంతకంతో జీవో ఇవ్వడం, మళ్లీ ఆయనే దాన్ని రద్దు చేసి పాత జీవోకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. ఇలాంటి చర్యలతో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 438 మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. తప్పు జరిగిందని మీరే ఒప్పుకున్నారు..! మెగా డీఎస్సీలో పేపర్ లీకేజీ జరగకపోతే ప్రభుత్వం ఇంతవరకు మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదని బొత్స ప్రశ్నించారు. టీచర్ ఉద్యోగాల కోసం సెల్ఫోన్లలో బేరసారాలు ఆడిన వీడియోలు, ఆడియోలు బహిర్గతమైనా వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై పక్కా ఆధారాలతో తాము నిలదీస్తున్నా.. ప్రభుత్వం శాసనసభలో ఏవో మాటలు చెప్పడం మినహా మండలిలో సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ ఎంక్వైరీ వేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో తప్పులు జరిగాయని ఆరోపిస్తున్న వారు దానిపై సీబీఐ విచారణ వేసుకోవచ్చని.. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని బొత్స సవాల్ విసిరారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, లోకేశ్ డీఎస్సీపై మాట్లాడారు. ఎలాంటి తప్పు జరగకపోతే విచారణకు సిద్ధమని ఎందుకు అనడం లేదు? డీఎస్సీలో తప్పులు జరిగినట్లు అసెంబ్లీలోనే నారా లోకేశ్ ఇన్ డైరెక్ట్‌గా ఒప్పుకున్నారు. డీఎస్సీ మార్కులు తాము కన్సిడర్లోకి తీసుకోవడం లేదని లోకేశ్ ప్రకటించారు. పీవీ సింధుకు ఉద్యోగం విషయంలో లోకేష్ చెప్పింది తప్పు. ఆమె అంతర్జాతీయ క్రీడాకారిణి. ఆమె ఒక్కరికే ఉద్యోగం వచి్చంది. మీకు లాగా అందరికీ ఒకే మాదిరిగా ఇవ్వలేదు. వోక్స్ వ్యాగన్ కేసు విషయంలో ఆనాడు వైఎస్సార్ నా శాఖ మార్చి సీబీఐ విచారణ చేయించారు’ అని బొత్స పేర్కొన్నారు.రైతు సమస్యలపై చిత్తశుద్ధి కరువురాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీఏసీలో చర్చించాలని, అవసరమైతే అసెంబ్లీని మరో రెండు మూడు రోజులు పొడిగించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వ్యవసాయం, రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ‘రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని కోరిందే మేం. ఈ రోజు సభకు వ్యవసాయ మంత్రి రాలేదు. కానీ దీనిపై చర్చ మాత్రం చేస్తామంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచి్చనా కరువు తాండవిస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చారు.. ఎల్‌నినో వచ్చింది’ అని బొత్స వ్యాఖ్యానించారు. -
కొంచెం తెలివి వచ్చింది అనుకునే లోపే... బుర్రలేనోడిలా మాట్లాడావ్...
-
లోకేష్ కాదు 'లీకేష్"! చర్చకు భయపడి పారిపోయాడు..! పదవులు ఎందుకు?
-
AP అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. YSRCP ఎమ్మెల్సీల ర్యాలీ
-
ఇంకెంతకాలం పారిపోతారు.. - దమ్ముంటే చర్చకు రండి...!
-
LIVE: శాసనమండలిలో టెన్షన్ టెన్షన్!
-
ఎందుకు పారిపోతున్నావ్ లోకేష్? చర్చకు రా లోకేష్!
-
DSC అక్రమార్కుల డైవర్షన్ ప్లాన్!
-
ఒడిశా కూలీలు.. ఫేక్ జెన్జీలు!
సాక్షి, అమరావతి: ‘మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా డీవియేషన్ లేదు. అయినా డీఎస్సీపై ఒడిశా కూలీలతో, 90 ఏళ్ల ఫేక్ జెన్‌జీ వ్యక్తులతో ధర్నాలు చేయించారు..’ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. నియామక ప్రక్రియ వివరాలన్నీ పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచినా వైఎస్సార్సీపీ నేతలు హిట్ అండ్ రన్ చర్యలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ 14 డీఎస్సీలు జరిగితే టీడీపీ, ఎన్డీఏ హయాంలో 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంత వరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. 2019–24 మధ్య 10–12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లకు రావటం మానేశారని, అందుకే తల్లికి వందనం అమలు చేశామన్నారు.ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా 2019–24 మధ్య పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారని విమర్శించారు. ఓ మాజీ ఐఏఎస్, మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు..తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామని, కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టామన్నారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించామని తెలిపారు. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో చేపట్టి ఫలితాలను పారదర్శకంగా విడుదల చేసి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేశామన్నారు. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే అమలు చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఏఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు వందల కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని, అధికారికంగా వివరణ ఇచ్చినా రోజుకో కుట్ర చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారని విమర్శలు చేశారు. -
స్పోర్ట్స్ పర్సన్‌కు టెస్ట్ పెట్టాలని ఎక్కడా లేదు..
సాక్షి, అమరావతి: ‘పీవీ సింధుకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత మాది. మరి కొన్నేళ్లలో ఆమె ఐఏఎస్ అధికారి కాబోతోంది. జ్యోతి యర్రాజి ఉత్తరాంధ్ర బిడ్డ.. ముఖ్యమంత్రికి చెబితే ఆమెకు వెంటనే ఉద్యోగం ఇవ్వమని చెప్పారు. క్రికెటర్ శ్రీచరణికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని సీఎం డైరక్షన్. డిగ్రీ పూర్తయిన వెంటనే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని చెప్పారు. స్పోర్ట్స్ పర్సన్‌కు టెస్ట్ పెట్టాలని లేదు..’అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ 2025పై వెల్లువెత్తుతున్న విమర్శలకు సోమవారం ఆయన అసెంబ్లీలో సమాధానమిచ్చారు. పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి చివరి శిక్షణ వరకు పారదర్శకంగా 148 రోజుల్లో డీఎస్సీ నిర్వహించామని, ఎక్కడా షార్ట్ కట్లో చేయలేదని లోకేష్ చెప్పారు. స్పోర్ట్స్ కోటా గురించి ప్రతిపక్షం అనేక ఆరోపణలు చేస్తోందంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గతంలో 29 కేటగిరీలు ఉంటే 65 కేటగిరీలు తీసుకొచ్చి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ శాప్ ఆధ్వర్యంలో వివిధ దశల్లో నెల రోజులపాటు పూర్తి చేశాకే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను పకడ్బందీగా ఎంపిక చేశామన్నారు. కూన రవి, ఎంపీ భరత్, మరో ఎంపీ అసోసియేషన్లు బాధ్యతల్లో ఉన్నందున వారికి అనుకూలమైన వారికి ఉద్యోగాలు ఇచ్చారనడం తప్పన్నారు. ఆధారాలు ఉంటే తీసుకువచ్చి నిరూపించాలన్నారు. కాక్రోచ్‌లని చెబుతున్న వారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి.. ‘కాక్రోచ్‌లని చెబుతున్న వారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ప్రెస్ మీట్ ఎందుకు? హౌస్‌కు రమ్మనండి. టైమ్, డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్‌కు నేను రెడీ. హౌస్ లోపల అయినా బయట అయినా నేను రెడీ. నేను పారిపోవడం లేదు. సభకు రండి.. చర్చిద్దాం’ అంటూ నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం సింగపూర్, ఫిన్లాండ్కు శిక్షణ కోసం పంపితే గత ప్రభుత్వం వైన్ షాపుల ముందు నిలబెట్టిందని విమర్శించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు రిక్రూట్ చేశామని, టెట్‌కు 3,68,661 మంది దరఖాస్తు చేస్తే 1,87,256 మంది క్వాలిఫై అయ్యారని తెలిపారు. 722 మందికి అందుకే ఇవ్వలేదు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తర్వాత 16,291 మందికి కాల్ లెటర్స్ పంపామని, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ కారణంగా 722 మందికి ఇవ్వలేకపోయామని లోకేశ్ చెప్పారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు డీఎస్సీ నిర్వహణ బాధ్యత అప్పగించారని ఆరోపిస్తున్నారని, అది ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిందన్నారు. 148 రోజుల్లో త్వరగా నిర్వహించాలని ఒక వ్యక్తిని నియమించామని, అది చట్ట ఉల్లంఘన కాదని, ఈ ప్రక్రియలో ఆయన కింద 50 మంది పని చేశారని చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాడని, అతడికి మొదటి ర్యాంకు వచ్చింది అంటున్నారని, అయితే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్‌లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తికి కాల్ లెటర్ వెళ్లినా, సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు రాలేదన్నారు. 42 వేల ప్రశ్నలు, ర్యాండమైజ్ విధానంలో వెళ్తాయని, ఏదో జరిగిపోయింది అనడం సబబు కాదని, పేపర్ లీకైంది అనడం అవాస్తవమని చెప్పారు. ఆయనకు ఐఏఎస్ ఎలా వచ్చిందో? ఆన్లైన్లో ఎప్పటికప్పుడు జాబితాలు పెట్టామని, జగన్ ఫోన్ వాడకపోతే ఎవరూ వాడరు అనుకోవడం పొరపాటని, ప్రజాప్రభుత్వం ఫోన్‌కే డైరక్ట్‌గా సమాచారం ఇస్తుంటే పారదర్శకత లేదని ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ కోటాలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆడియో లీక్ వచ్చిందని, సర్టిఫికెట్ డబ్బులకు అమ్ముతున్నారని, అటువంటి వారిని శాప్ రక్షిస్తుందని ఆరోపిస్తున్నారని, ఆ ఆడియో లీక్ వచ్చిన వెంటనే ఆ వ్యక్తిపై విజయవాడ కమిషనర్‌కు శాప్ ఫిర్యాదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించామని లోకేశ్ పేర్కొన్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి స్పోర్ట్స్ కోటాలో 372 మంది ఒకే సామాజికవర్గం నుంచి ఎంపికయ్యారని ఆరోపణ చేశారని, ఆ మహానుభావుడికి ఐఏఎస్ ఎలా వచ్చిందో దేవుడికి తెలియాలని లోకేశ్ పేర్కొన్నారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, మరో 3 డీఎస్సీలు నిర్వహిస్తామని, ఉద్యోగాలు రాని వాళ్లు మళ్లీ రాయవచ్చని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. -
మెగా డీఎస్సీ స్కామ్‌కు సమాధానమేది
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 కుంభకోణంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ప్రజల్లోకి వెళ్లడం.. నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, యువత, జెన్‌జీ దీనికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడంతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు నిద్ర పట్టడం లేదు. అందుకే దాన్ని కప్పిపుచ్చేందుకు, పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఆపసోపాలు పడుతున్నారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారించాలనే డిమాండ్లు రోజురోజుకీ వెల్లువెత్తుతుండటంతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును కాపాడేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం అసెంబ్లీలో తండ్రి, కుమారుడు డీఎస్సీ అక్రమాలను సమర్థించుకుంటూ తప్పుదోవ పట్టించేలా కళ్లార్పకుండా అబద్ధాలు వల్లె వేశారని, అడ్డగోలు వాదనలు వినిపించారని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అని నిలదీస్తున్నారు. ‘‘ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను ఔట్‌సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు.. పబ్లిక్‌గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్‌కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్‌లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్‌కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు? పతకాలు లేకపోయినా కేవలం పార్టిసిపేట్ చేస్తే ఉద్యోగాలిస్తారా? జాతీయ పతక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? సొంత పార్టీ నేతలే క్రీడా ధృవీకరణ పత్రాలు ఇవ్వటాన్ని నిస్సిగ్గుగా ఎలా సమర్థించుకుంటారు? మెగా డీఎస్సీపై 336 కేసులు వేశారంటూనే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయించడం ఏమిటి? టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియోపై తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదుతో సరిపుచ్చి అసలు సూత్రధారులెవరో బయట పడకుండా తొక్కిపెడుతున్నదెవరు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆయనే. ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారించాలి’’ అని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. కీలక ప్రశ్నలకు లోకేశ్ సమాధానం చెప్పకుండా సవాళ్లు విసరటాన్ని, సభ సాక్షిగా వ్యక్తిగత దూషణలకు దిగటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమకు సమాధానం చెప్పాల్సిందేనని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఇచ్చిన రోజే స్పోర్ట్స్ కోటాలో నియామకాలకు అర్హత పరీక్ష ఎత్తివేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ ఒకరికేఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నల అప్లోడ్, డిజిటల్ నిర్వహణ అత్యంత గోప్యంగా జరగాలి. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను ఎస్సీఈఆర్టీ రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ ఇక్కడ డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనపెట్టి ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండు బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు బీజం పడింది ఇక్కడే. గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టడం వెనుక ఉద్దేశమేంటి?‘వెరిఫికేషన్‌కు రాలేదు’.. మరి కాల్ లెటర్ ఏది?మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి ధ్రువపత్రాల పరిశీలనకు రాలేదని, అందుకే పోస్టు ఇవ్వలేదని లోకేష్, చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాకమ్మ కబుర్లు కాదా? ఎందుకంటే.. మెరిట్ జాబితాలో ఆ అభ్యర్థి పేరు తీసేశారు.. అభ్యర్థి డేటాను మాయం చేశారు.. కాల్ లెటర్ ఇవ్వలేదు.. ఇక అలాంటప్పుడు ధృవపత్రాల పరిశీలనకు ఎలా వస్తాడు? అసలు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాలేదని చెబుతున్న వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు? అతడు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది.అవన్నీ గోల్మాల్ కాక మరేంటి?కీలక బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం..అతడికి టాప్ ర్యాంకు రావడం.. ఆ తర్వాత పోస్టు ఇవ్వకపోవడం.. అతడి వివరాలను మాయం చేయడం.. ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనంతటికీ అర్థం పేపర్ లీక్ అయిందని అంగీకరించినట్లే కదా? పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐతో విచారణ జరగాలి.కలెక్టరేట్లు డమ్మీ.. పారదర్శకత ఎక్కడ?గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. మెగా డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ జాబితాలు లేవు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు. బహిరంగంగా జాబితాలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సందేశాలు పంపించే కొత్త పద్ధతి తీసుకొచ్చారు. అసలు పారదర్శకత ఎక్కడ ఉంది? సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్లకు వెళ్తే పైకి వెళ్లండని, మాకు సంబంధం లేదని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?వన్ టు వన్ పిలిచి.. ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. నిబంధనల ప్రకారం మెరిట్, రోస్టర్ ఆధారంగా ధృవపత్రాల పరిశీలన చేపట్టారు. అంటే అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? ఓపెన్‌లోకి వస్తారా? రిజర్వేషన్‌లోకి వస్తారా? ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనికులు వంటి వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే తెలుసు. అందుకే 1 : 1 కింద పిలిచారు. మరి ధృవపత్రాలన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలిన వారికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? వారిని తిరస్కరించిన జాబితాలో కూడా ఎందుకు చూపలేదు? ప్రశ్నిస్తే సర్దుబాటు అంటున్నారు. ఎవరి కోసం ఈ సర్దుబాటు? వీటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. పతకాలు లేకపోయినా ఉద్యోగాలిస్తారా?క్రీడాకారుల ప్రతిభ చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. పతకాలు చూడలేదు. కేవలం ఆటల్లో పాల్గొన్న ధృవపత్రం ఉంటే చాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. బాల్ బ్యాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 270 మందికి పతకాలు లేకపోయినా కేవలం పాల్గొన్నందుకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అంతర్ కళాశాల పోటీల్లో పాల్గొన్న 99 మందికి ఉద్యోగాలు రాగా.. వారిలో 86 మందికి పతకాలు, ట్రోఫీలు లేవు. అంతర్ జిల్లా పోటీల్లో 59 మందికి ఉద్యోగాలు రాగా వారిలో 18 మందికి కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చారు.ధృవపత్రాలు ఇచ్చేదీ.. ధృవీకరించేదీ వారేనా?సాఫ్ట్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జూడో సంఘం అధ్యక్షుడిగా విశాఖ ఎంపీ భరత్ ఉన్నారు. వాళ్లే ధృవపత్రాలు ఇచ్చి.. వాళ్లే ధృవీకరించి.. వాళ్లే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఎలా వచ్చింది? అంటే నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరగలేదా? జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ఉద్యోగాలు రాకుండా.. కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు రావడం న్యాయమా?ఒక్కో పోస్టుకు రూ.15–20 లక్షల బేరసారాలా?స్పోర్ట్స్ కోటా పోస్టులకు ఒక్కొక్కదానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగినట్లు ఆడియో రికార్డులు సైతం బయటకు వచ్చాయి. ప్రభుత్వ చిహ్నాన్ని ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌తో వదిలేశారు. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ స్పష్టంగా ఉన్నా ఎఫ్ఐఆర్లో పేరు వెల్లడించకుండా అనుమానితుడిగా మాత్రమే పేర్కొనడం ఎందుకు? ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే దానికి సమాధానం లేదు. నిజాలు తేలాలంటే సీబీఐ విచారణే..మెగా డీఎస్సీ వ్యవహారంలో ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు.. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రవేశం నుంచి టాప్ ర్యాంకు వరకు.. మెరిట్ జాబితా మార్పుల నుంచి కాల్ లెటర్ల వరకు.. స్పోర్ట్స్ కోటా నుంచి బేరసారాల ఆరోపణల వరకు అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే విచారణ జరిగితే నిష్పక్షపాతంగా నిజాలు బయటకు వస్తాయా? స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడే విద్యాశాఖ మంత్రిగా ఉన్నందున దీనిపై స్వతంత్ర విచారణ అవసరమని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై మూడో పక్షం దర్యాప్తు జరగాలని స్పష్టంచేస్తున్నారు. సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని, దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్న డిమాండ్‌పై చంద్రబాబు సర్కారు ఎందుకు స్పందించడంలేదు?అవుట్సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంకర్ఈ ప్రక్రియలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్‌లో మొదటి ర్యాంకు సాధించారు. టీజీటీ తెలుగు పరీక్షలో జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించారు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించాడు. అంటే ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకు వెళ్లింది? ఎంతమందికి చేరింది? లీకైన ప్రశ్నాపత్రం పొందినవారు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ తేలాల్సి ఉంది. నిజంగానే మెరిట్‌తో ర్యాంకు సాధించి ఉంటే అతడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? లోకేశ్ వీటికి సమాధానం చెప్పలేదు.స్పోర్ట్స్ కోటా.. మరో పెద్ద కుంభకోణంమెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాను మరో పెద్ద కుంభకోణంగా మార్చారు. గతంలో రెండు శాతం ఉన్న క్రీడా కోటాను మూడు శాతానికి పెంచారు. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. డీఎస్సీ, టెట్ పరీక్షలు రాయకుండానే కేవలం క్రీడా ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనలు మార్చారు. కొన్ని పోస్టులకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి ధ్రువపత్రం సమర్పించవచ్చనే మినహాయింపులు కూడా ఇచ్చారు. అనుకున్న వారికి పోస్టులు ఇచ్చిన తర్వాత మళ్లీ నిబంధనలు మార్చి పాత జీవోలను రద్దు చేశారు. నిజంగా మంచి జీవోలు అయితే వాటిని ఎందుకు రద్దు చేశారు? తన వివరణలో లోకేశ్ ఈ అంశాలను ప్రస్తావించనేలేదు. -
‘లోకేష్‌కు దమ్ముంటే డీఎస్సీపై చర్చకు రావాలి’
తాడేపల్లి : ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై దమ్ము, ధైర్యం ఉంటే మంత్రి నారా లోకేష్ తమతో చర్చకు రావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సవాల్ విసిరారు. లోకేష్ ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు ఇవ్వడం మానేసి, తమ కౌన్సిల్‌కు వచ్చి చర్చించాలన్నారు. తమ పార్టీ సభ్యులు లేని చోట స్టేట్మెంట్లను ఆపి తమ సభ్యులున్న కౌన్సిల్‌కు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వాలన్నారు. అప్పుడే వాస్తవాలేంటో ప్రజలకు తెలుస్తాయన్నారు లేళ్ల అప్పిరెడ్డి. ఈరోజు(సోమవారం, ఆగస్టు 17వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపేంత వరకూ మా పోరాటం ఆగదు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు అమ్ముకున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వటం దుర్మార్గం. అలా ఇవ్వటం కరెక్టయితే మరి ఆ జీవోలను ఎందుకు రద్దు చేశారు?, తాము తప్పు చేసినట్టు లోకేష్ మాటల్లోనే తేలిపోయింది. శాసనసభలో మంత్రి లోకేష్ మాటల్లోని డొల్లతనం ప్రజలకు అర్థం అయింది. ఉద్యోగాలు అమ్ముకున్న ఆడియో టేపుల మీద విచారణ ఏదీ?, బేరసారాలు చేసిన వారిపై తూతూమంత్రపు చర్యలు తీసుకుంటారా?, ఆధారాలతో సహా మేము చర్చకు సిద్దం. మా పార్టీ నేతలు చర్చకు రమ్మని సవాల్ చేసినా ప్రభుత్వం ముందుకు రావటం లేదు. కౌన్సిల్ లోనైనా చర్చకు రావాలని కోరాం. కానీ కౌన్సిల్‌కి రాకుండా మంత్రి లోకేష్ తప్పించుకున్నారు’ అని విమర్శించారు. -
DSCపై ఆధారాలతో వస్తాం..! చర్చకు సిద్ధమా..? లోకేష్ కు ఎమ్మెల్సీ రమేష్ సవాల్
-
‘ఎంతమందిని వెన్నుపోటు పొడుస్తావ్ చంద్రబాబూ?’
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై వెన్నుపోటు పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ మండలి సమావేశాల నేపథ్యంలో బొత్స మీడియాతో మాట్లాడారు.‘డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలి. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నదే మా డిమాండ్. అందుకు కూటమి నేతలు సమాధానం చెప్పడం లేదు. కౌన్సిల్లో మేము చర్చకు రావాలని కోరాం. కానీ తప్పు చేసిన ప్రభుత్వం చర్చకు రాకుండా తోక ముడిచింది. చర్చకు రాకుండా సవాల్ చేయటం ఎందుకు?. డీఎస్సీ కమిషనర్‌గా ఇతర అధికారిని ఎందుకు నియమించ లేదు?అధికారులు లేక రాష్ట్రం ఏమైనా గొడ్డుపోయిందా?.కృష్ణా జిల్లా టాపర్ నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?. అతను ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది?. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్నది వాస్తవం. ఉద్యోగాలను అమ్ముకున్నట్టు వచ్చిన ఆడియో, వీడియో టేపులపై విచారణ ఏదీ?. వాళ్లను పట్టుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేవి కదా?.అందుకే మేము సీబిఐతో విచారణ చేయమని అడిగాం. గ్రూప్1 మీద కూడా సీబీఐతో విచారణ చేయించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎంతమందిని వెన్నుపోటు పొడుస్తారు చంద్రబాబూ?.లక్షా 30 వేల ఉద్యోగాలను ఎలాంటి అక్రమాలు లేకుండా ఒకేసారి మా హయాంలో ఇచ్చాం. చంద్రబాబు 16 వేల పోస్టులకు అక్రమాలు చేశారు.ఈ మొత్తం వ్యవహారాలపై సీబిఐతో విచారణ చేయాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ప్రభుత్వం బెదిరించడం వల్లే డీఎస్సీ టీచర్లు కర్నూలు, విజయవాడలో ర్యాలీ చేశారు. ర్యాలీలకు రాకపోతే ఉద్యోగం తొలగిస్తామని బెదిరించారు. డీఎస్సీ అక్రమాలను రాజకీయ కోణంలో చూడవద్దు. అర్హులందరికీ న్యాయం జరగాలి. అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్’అని స్పష్టం చేశారు. -
DSC అక్రమాలపై అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా బుక్కైన లోకేష్
-
డీఎస్సీ అక్రమాలు.. లోకేష్ ప్రకటనతో ఇరుకున పడ్డ ప్రభుత్వం!
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల విషయంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా బుక్కైంది. ఎలాంటి అవకతవకలు జరగలేదని నిన్నటిదాకా బుకాయిస్తూ వస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. ఇప్పుడు, ఇవాళ అసెంబ్లీ వేదికగా అన్ని తప్పులనూ అంగీకరించారు!. అంతేకాదు.. స్పోర్ట్స్ కోటా జీవోను మళ్లీ రద్దు చేసిన ప్రభుత్వం.. రిటెన్ టెస్ట్ పెడుతూ జీవో నెంబర్ 56ను రిలీజ్ చేయడం గమనార్హం. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన లోకేష్.. గతంలో క్రీడాకారిణి పీవీ సింధుకు రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అదే విధానంలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కూడా రాత పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టినట్లు వివరించారు. అయితే పీవీ సింధు వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి, సాధారణ క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఒకటేనా? అనేనా ప్రశ్న మొదలైంది.జీవోల్లో మార్పులు.. స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం నేపథ్యంలో ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 47ను రద్దు చేసి.. కొత్తగా జీవో 56ను తీసుకొచ్చింది. తాజా నిబంధనల్లో రాత పరీక్షను తప్పనిసరి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పు కూడా డీఎస్సీ ప్రక్రియలో గందరగోళానికి దారితీసినట్లైంది. తద్వారా అవకతవకలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని స్పష్టమవుతోంది.నవీన్ వ్యవహారంపైనా ప్రశ్నలుఎస్ఈఆర్టీ ఉద్యోగి నవీన్‌కు టాప్ ర్యాంక్ రావడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని, అందుకే ఉద్యోగం ఇవ్వలేదని గతంలో ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అయితే ఇవాళ శాసన సభలో లోకేష్ మాట్లాడుతూ.. కోర్టులో ప్రభుత్వం ఇచ్చిన వివరణకు విరుద్ధంగా ప్రకటన చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి కావడంతో ఎన్ఓసీ తీసుకోలేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎన్వోసీ అంశంపై తాము రిజక్ట్ చేయలేదని సెక్రటరీ కోన శశిధర్ గతంలో చెప్పారు. అలా.. ఈ రెండు ప్రకటనల నడుమ మధ్య బోలెడు వ్యత్యాసం ఉంది. ఒకరికే అవకాశం ఇచ్చారా?ఇక ఎస్ఈఆర్టీ, డీఎస్సీ కన్వీనర్ ఒకే వ్యక్తికి ఇచ్చిన అంశాన్ని కూడా లోకేష్ ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తరఫున లోకేశ్ వివరణ ఇస్తూ.. అలా ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని సమర్థించుకున్నారు. దీంతో నియామక ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు ఉన్నాయి.అవును.. అక్రమాలు జరిగాయ్స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై వచ్చిన ఆడియో లీక్ అంశాన్ని కూడా లోకేష్ సభలో ప్రస్తావించారు. దీనిపై శాప్ ఫిర్యాదు చేసిందని, సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.అయితే ఈ పరిణామాలన్నీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో లోపాలను బయటపెడుతున్నాయి. మెరిట్ అభ్యర్తుల్ని పట్టించుకోకుండా తమకు నచ్చినవాళ్లకే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారని వైఎస్సార్సీపీ తొలి నుంచి చెబుతోంది. డీఎస్సీ అక్రమాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ శాసన మండలిలో ఇవాళ గట్టిగా గళం వినిపిస్తోంది. ఈ తరుణంలో.. వైఎస్సార్సీపీ గైర్హాజరు అయిన శాసనసభలో లోకేశ్ ప్రకటన చేయడం, అవకతవకలు జరగలేదంటూనే తప్పులు అంగీకరించడంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లైంది. -
DSCపై చర్చకు సమయం ఇవ్వండి..! లోకేష్ రాజీనామా చేస్తారా..?
-
DSCపై సీబీఐ ఎంక్వైరీ.. లోకేష్ రాజీనామా..! మండలి వద్ద YSRCP ర్యాలీ
-
మండలిలో బొత్స పై నోరు పారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
-
డీఎస్సీ అక్రమాలపై దద్దరిల్లిన ఏపీ శాసన మండలి
సాక్షి, అమరావతి: ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు.. వాయిదాల పర్వంతో మొదలైంది. కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ పేరిట జరిగిన అక్రమాలపై శాసనమండలి దద్దరిల్లింది. ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. చైర్మన్ తిరస్కారంతో చర్చకు పట్టుబట్టింది. ‘‘ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలి. కానీ, మూడు లక్షల మందిని డీఎస్సీ రిక్రూట్మెంట్ పేరిట మోసం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. స్పోర్ట్స్ కోటా పేరుతో వాళ్లకు నచ్చినవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ అక్రమాలపై సభలో చర్చ జరగాల్సిందే. ఏపీపీఎస్సీపై కూడా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వం వర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. మంత్రుల అసహనండీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనం వ్యక్తం చేశారు. విపక్ష నేతకు మైక్ ఎలా ఇస్తారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును ప్రశ్నించారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్నారు. బొత్సను ఉద్దేశించి దద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. గొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్సీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
డీఎస్సీ డైవర్షన్ కోసమే..!
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలు, లీకేజీలపై జెన్‌జీ నిలదీస్తున్న వేళ.. అందరి దృష్టి మళ్లించేందుకు గ్రూప్–1పై పసుపురాతల ‘ఈనాడు’ అభూత కల్పనలకు తెగబడింది. డీఎస్సీ పాపాల నుంచి లోకేశ్‌ను కాపాడడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో డీఎస్సీ కుంభకోణంపై లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎస్సీ కుంభకోణంపై వైఎస్సార్సీపీ నిలదీస్తుందన్న భయంతోనే చంద్రబాబు హడావిడిగా గ్రూప్–1 అక్రమాలంటూ కొత్త కథలు మొదలుపెట్టారు. వాస్తవానికి కోవిడ్ పరిస్థితుల కారణంగానే ఎపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షలలో డిజిటల్ మూల్యాంకనం చేపట్టారు. కానీ ఫలితాలు వెలువడలేదు. దాని ఆధారంగా ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. ఎవరూ లబ్ధి పొందలేదు. హాయ్‌ల్యాండ్‌లో అసలు మూల్యాంకనమే జరగలేదని, అక్కడ జరిగినది ప్రిపరేటరీ వర్క్ మాత్రమేనని సాక్షాత్తూ చంద్రబాబు హయాంలో కోర్టుకు సమర్పించిన అడిషినల్ అఫిడవిట్లో ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఒకవైపు మూల్యాంకనమే జరగలేదని కోర్టులో చెబుతారు. మరోవైపు అదే అంశంపై ఆరోపణలు, అనుమానాలు ఎందుకు రేపుతున్నారు? హైకోర్టు ఆదేశాల మేరకే అత్యున్నత ప్రమాణాలతో మాన్యువల్ మూల్యాంకనం జరిగింది. దాని ఆధారంగానే తుది ఎంపికలు జరిగాయి. అసలు జవాబు పత్రాలు మార్చినట్లు, బార్కోడ్లు తారుమారు చేసినట్లు, ఎవరికైనా అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు ఆధారాలే లేవని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి స్కామ్ ఎక్కడ? అంతేకాదు.. అభ్యర్థుల ప్రతిభ, ర్యాంకులు, తుది ఎంపికలో అక్రమాలు జరిగాయని కూడా సిట్ ఎక్కడా నిర్ధారించలేదు. ఒకవైపు కోర్టు పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. మరోవైపు అక్రమాలకు ఆధారాలు లేవని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి ఇంకా ఆరోపణలు ఎందుకు? డీఎస్సీ అక్రమాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ఈ డైవర్షన్ కథనాలు.. ఎల్లోవీుడియా, చంద్రబాబు కలిసి లోకేశ్‌ని రక్షించడానికే ఇలాంటి అభూతకల్పనలు వండివార్చుతున్నట్లు అర్థం కావడం లేదూ... అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టం చేస్తూ సిట్ నివేదికలో పేర్కొన్న భాగం డీఎస్సీలాగా లీకేజీల్లేవ్.. అక్రమాల్లేవ్... వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన డీఎస్సీ మాదిరిగా ఎలాంటి అక్రమాలు జరగలేదు. కావాల్సిన అభ్యర్థుల కోసం అనుకూల జీవోలు ఇవ్వలేదు. పరీక్షల నుంచి మినహాయింపులూ ఇవ్వలేదు. పేపర్ లీకేజీలు జరగలేదు. డీఎస్సీ మాదిరిగా ఏపీపీఎస్సీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫస్ట్ ర్యాంకుల్లాంటివి రాలేదు. కోవిడ్ వల్లే డిజిటల్ మూల్యాంకనంకోవిడ్ నేపథ్యంలోనే రాష్ట్రప్రభుత్వం గ్రూప్–1 పరీక్షా పత్రాలను డిజిటల్ మూల్యాంకనం జరిపించింది. అయితే నోటిఫికేషన్ సమయంలో పేర్కొనలేదంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో టెక్నికల్ గ్రౌండ్స్‌లో డిజిటల్ మూల్యాంకనాన్ని కోర్టు నిలిపివేసింది. అంతే తప్ప డిజిటల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కాదు, కొంతమందికి అయాచిత లబ్ధి జరిగిందనీ కాదు. హైకోర్టు డిజిటల్ మూల్యాంకనం నిలిపేసిన తర్వాత, మాన్యువల్ మూల్యాంకనం ద్వారా మాత్రమే ఎంపిక ప్రక్రియ జరిగిందని స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఎంతో కష్టపడి చదివి, కఠినమైన ఇంటర్వూ్యలో ఎంపికై, నాలుగేళ్లపాటు ఉన్నత ఉద్యోగాలు చేసి, ప్రజలకు సేవలందిస్తున్న 163 మంది గ్రూప్–1 ఆఫీసర్లపై చంద్రబాబు కత్తి కట్టారు. అత్యంత పకడ్బందీగా జరిగిన పరీక్షలో ఉత్తీర్ణులై ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంపికై ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న 163 మంది జీవితాలతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు.హైకోర్టు పర్యవేక్షణలోనే మొత్తం ప్రక్రియఅసలు ఈ నోటిఫికేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి, ఉద్యోగాల భర్తీ వరకు మొత్తం ప్రక్రియ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకే సాగింది. అలాగే ఉద్యోగాలు సాధించిన వారు, ఉద్యోగాలు రాని వారు, కేసులు వేసిన వారు, ఇలా అందరి జవాబు పత్రాలన్నీ కూడా కోర్టు కస్టడీలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జవాబు పత్రాల మార్పులు, చేర్పులు జరగలేదని, తారుమారు కూడా కాలేదని సిట్ నిర్ధారించింది. ఉద్యోగాల భర్తీలో డిజిటల్ మూల్యాంకనాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు చేసిన మాన్యువల్ మూల్యాంకనాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. మాన్యువల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకునే ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత న్యాయ పర్యవేక్షణ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు చేయడం డీఎస్సీ లీకేజీ, అక్రమాల నుంచి డైవర్ట్ చేయడానికి కాక మరేమిటి?. అభ్యర్థుల ప్రతిభ, వారి ఎంపిక, వారి ర్యాంకుల్లో తప్పులు జరగలేదన్న విషయాన్ని సిట్ పదే పదే తన నివేదికలో స్పష్టం చేసింది. వారు తమ ప్రతిభ, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపికయ్యారని నివేదికలో పేర్కొంది. అసలు వాల్యుయేషన్ ఎలా జరుగుతుందన్న దానిపై అటు ఎల్లో వీుడియాకు, ఇటు చంద్రబాబుకు అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.అంతా సవ్యంగానే జరిగిందన్న ఏపీపీఎస్సీచంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే 2025, ఏప్రిల్ 22న విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇప్పించి, ఏపీపీఎస్సీ మూల్యాంకనంపై విచారణకు ఓ సిట్ వేశారు.. వాదనల సమయంలో ప్రస్తుత ఏపీపీఎస్సీ పాలక మండలి తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ మూల్యాంకనం అంతా సవ్యంగానే సాగిందని స్పష్టంచేశారు. కౌంటర్ దాఖలు చేశారు. అటు తరువాత హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మరొక సిట్‌ను 2026, ఫిబ్రవరి 14న వేసింది. ఈ సిట్ వేసిన దగ్గర నుంచి హైకోర్టులో వాదనలు మారిపోయాయి, గతానికి భిన్నంగా రాజకీయ బాస్‌ల ఆదేశాలకు అనుగుణంగా వాదనలు మొదలయ్యాయి. రెండో సిట్ అందుకు అనుగుణంగానే రాజకీయ కోణంలో ప్రాథమిక నివేదికలు ఇచ్చింది. సిట్ నివేదిక మొత్తం చూస్తే అభ్యర్థుల అర్హతల మీద కాని, వారి సామర్థ్యాల మీద గాని, పరీక్షలు నిర్వహించిన విధానాల మీద కాని, జవాబు పత్రాలను తారుమారు చేసినట్టుగాని ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ చంద్రబాబు, ఎల్లోవీుడియా బురదజల్లుతున్నాయి. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం మానసిక వేదనను అనుభవించాల్సి వస్తోంది.మూల్యాంకన ప్రక్రియ ఇలా ఉంటుంది...మూల్యాంకనంలో భాగంగా వాల్యుయేటర్ దిద్దిన తర్వాత, చీఫ్ ఎగ్జామినర్‌కి ఇస్తారు. దాంట్లో ఏమైనా తేడాలున్నాయని చీఫ్ ఎగ్జామినర్ భావిస్తే, మళ్లీ ఆ జవాబుపత్రాన్ని మరొకసారి పరిశీలించమని మొదటి వాల్యుయేటర్ను కోరవచ్చు. లేదా మరో వాల్యుయేటర్కి అప్పగించవచ్చు. ఈ ప్రక్రియలో ప్రతి ప్రశ్న ఎవాల్యుయేటర్ దిద్దాడా? దిద్దిన ప్రతి ప్రశ్నకు మార్కులు వేశాడా? వేసిన ప్రతి మార్కును తిరిగి ఓఎంఆర్ షీట్లలో నింపారా? అని పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులను సరిదిద్దమని మరోసారి వాల్యుయేటర్కి ఇస్తారు. ఈ కరెక్షన్స్ అన్నీ కూడా ప్రశ్నలవారీగా ఓఎంఆర్ షీటులో నమోదు చేస్తారు. ఇంత పకడ్బందీగా మూల్యాంకన ప్రక్రియ జరుగుతుంది. ప్రతిభ ఉన్న వారికి అన్యాయం జరగకుండా ప్రతి దశలో కూడా పరిశీలనా ప్రక్రియ ఉంటుంది. రెండు సార్లు ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి. మరి ఈ ప్రక్రియను అక్రమంటూ తప్పుడు రాతలు రాసి రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. మూల్యాంకనంలో ఏకరూపత కోసం చీఫ్ ఎగ్జామినర్‌కు మార్కులను పరిశీలించి మాడరేట్ చేసే అధికారం ఉంటుంది అన్న అంశాన్ని ఎల్లో మీడియా మర్చిపోయింది. వాస్తవానికి జవాబు పత్రాల మూల్యాంకనం అనేక దశల్లో జరుగుతుంది. ఇందులో అనేక మంది పాలుపంచుకుంటారు. ఒక క్యాంపు ఆఫీసర్, ఆయన కింద అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్, ఆయన కింద ఎగ్జామినర్, ఎగ్జామినర్ చేసిన మూల్యాంకనాన్ని పరిశీలించడానికి ఒక స్క్రూటినైజర్ ఉంటారు. వీళ్లందరి మీద ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. ప్రతి జవాబు పత్రాన్ని వీళ్లంతా చూస్తారు. జవాబు పత్రం వీళ్లందరి దగ్గరకూ వెళ్తుంది. ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. సరిదిద్దాల్సిన చోట దిద్దుతారు. ఈ దిద్దుబాట్లన్నీకూడా కంట్రోల్ బండిల్ స్లిప్పులో నమోదు అవుతాయి. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. అలాంటప్పుడు దిద్దివేతలు ఎలా అక్రమాలు అవుతాయి? అత్యున్నత అధికారులతో ఇంటర్వ్యూ బోర్డులు... విచిత్రంగా ఈ రెండో సిట్‌లో సభ్యుడిగా ఉన్న డీజీ ర్యాంకు అధికారి, సీనియర్ ఐపీఎస్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. తదుపరి నోటిఫికేషన్లో అభ్యర్థులను ఇంటర్వ్యూ కూడా చేశారు. 163 మందిని ఎంపిక చేసే ప్రక్రియలో 24 మంది సీనియర్ ఐఏఎస్‌లు.. ఐపీఎస్‌లు ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. వాళ్లు ఇంటర్వూ్యలకు మార్కులు కూడా వేశారు.గతంలో ఒక బోర్డు.. వైఎస్సార్సీపీ హయాంలో మూడు బోర్డులువైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు ఏపీపీఎస్సీ ఎంపిక ప్రక్రియకు ఒక్కటే ఇంటర్వ్యూ బోర్డు ఉండేది. అందులో ఒకరే సివిల్ సర్వీసెస్ అధికారి ఉండేవారు. కానీ సంస్కరణల్లో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసింది. గ్రూప్–1 నియామకాల్లో మొత్తంగా 24 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇంటర్వూ్యలు చేశారు.వీసీలకూ ఇంటర్వ్యూ బోర్డులో స్థానం.. ఎంపిక ప్రక్రియలో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన ఆరుగురు వైస్‌ఛాన్సలర్ (వీసీ)లకు కూడా ఇంటర్వ్యూ బోర్డులో స్థానం కల్పించారు. వారు కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన వారిలో ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ బోర్డుల్లో ఉన్న సభ్యుల్లో, రెండు బోర్డులకు ఛైర్మన్లు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వారే ఉన్నారు.. వారిలో ఒకరు కె. విజయ్‌కుమార్ కాగా, మరొకరు ప్రొఫెసర్ పద్మరాజు.గ్రూప్–1కి ఎంపికైన వారిలో 16 మంది ఐఏఎస్, ఐపీఎస్ సహా కేంద్ర సర్వీసులకు ఎంపికైనట్లు సిట్ వెల్లడించిన వారి వివరాలు జంబ్లింగ్ విధానంతో పారదర్శకత.. అప్పటి ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ 104 మందిని ఇంటర్వ్యూ చేస్తే, చంద్రబాబు హయాంలో నియామకం అయిన కె. విజయ్ కుమార్ 102 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఏ ఇంటర్వూ్యలో ఏ బోర్డు మెంబర్ ఉన్నారో కూడా తెలియకుండా.. జంబ్లింగ్ విధానాన్ని పాటించారు. దీనివల్ల అభ్యర్థుల ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షించినట్లయింది.హాయ్‌ల్యాండ్‌లో అసలు మూల్యాంకనమే జరగలేదుహైకోర్టు సూచనల నేపథ్యంలో మాన్యువల్ ఎవాల్యుయేషన్కు ఏపీపీఎస్సీ సిద్ధమయ్యింది. కోవిడ్ నేపథ్యంలో హాయ్‌ల్యాండ్‌ను ఎంచుకున్నారు. కానీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అక్కడ మూల్యాంకనం జరగలేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీ కోర్టుకు సమర్పించిన అడిషినల్ అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొంది. మాన్యువల్ ఎవాల్యూయేషన్కు అవసరమైన ప్రిపరేటరీ వర్క్ మాత్రమే అక్కడ జరిగిందని ఆ అఫిడవిట్లో ఏపీపీఎస్సీ స్పష్టంగా పేర్కొంది. అసలు అక్రమాలన్నీ హాయ్‌ల్యాండ్‌లోనే జరిగాయని, అక్కడే మూల్యాంకనం చేశారన్న పలువురి ఆరోపణలకు సిట్ కూడా తన నివేదికలో స్పష్టత ఇచ్చింది. హాయ్‌ల్యాండ్‌లో అసలు ఎలాంటి మూల్యాంకనం జరగలేదని తేల్చింది. గ్రూప్–1 వ్యవహారంలో హాయ్‌ల్యాండ్‌లో రెండో మూల్యాంకనం జరిగిందంటూ తప్పుడు ప్రచారాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ‘అనర్హుల చేత మూల్యాంకనం చేయించారు’, ‘డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పేపర్లు దిద్దించారు’ అంటూ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలోనే విప్లవాత్మక సంస్కరణలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా... పారదర్శకత కోసం ఏపీపీఎస్సీ మూల్యాంకనంలో నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ పెట్టారు. పరీక్ష రాసే అభ్యర్థుల్లో డూప్లికేట్ క్యాండిడేట్ లేకుండా ఫేషియల్ రికగ్నిషన్, వేలిముద్రల స్వీకరణ, ప్రతి పరీక్షా హాల్లో సీసీ కెమెరాలు పెట్టారు. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ కఠినమైన, పారదర్శకమైన పద్ధతులు అవలంబించడం మొదలుపెట్టగానే, అటు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇవే పద్ధతులు అనుసరించడం మొదలుపెట్టింది.పరీక్షలు పారదర్శకం.. అభ్యర్థుల ట్రాక్ రికార్డే నిదర్శనంఏపీపీఎస్సీ పరీక్షలు ఎంత సమర్థవంతంగా జరిగాయి, ఎంత పారదర్శకంగా జరిగాయి, ఎంత ప్రతిభ ఆధారంగా జరిగాయి అనడానికి ఎంపికైన అభ్యర్థుల ట్రాక్ రికార్డు కన్నా మరో నిదర్శనం ఉండదు. ఎంపికైన 163 మందిలో, ఇంటర్వ్యూలకు హాజరైన 325 మందిలో ఐఐటీల నుంచి 19 మంది, ఐఐఎంల నుంచి ఏడుగురు, ఎన్ఐటీల నుంచి 17 మంది, బిట్స్ పిలానీ నుంచి ఇద్దరు, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది, ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులు పూర్తిచేసిన వారు 177 మంది, జనరల్ పీజీలు, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు.సివిల్స్ అర్హత సాధించిన అభ్యర్థులు..ఇందులో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు 39 మంది ఉంటే, ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్‌ఎస్‌లుగా ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపికైన వారు 16 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరికి సివిల్ సర్వీసుల్లో వేరే రాష్ట్రాల కేడర్ వస్తే సొంత రాష్ట్రాల్లోనే పనిచేద్దామని ఆ సివిల్ సర్వీసు పోస్టులను కూడా వదులుకుని ఇక్కడే కొనసాగుతున్నారు. పైగా ఇదే నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించిన వారు కూడా, మళ్లీ ఏపీపీఎస్సీ నిర్వహించిన మరో నోటిఫికేషన్లో కూడా పరీక్షలు రాసి, డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగాలు పొందారు.గ్రూప్–1కి ఎంపిక అయిన వారిలో ఐఐటీల నుంచి 19 మంది ఎంపికైనట్లు సిట్ వెల్లడించిన వివరాలు ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారుఇవే ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలకు హాజరైన 325 మందిలో కేంద్రప్రభుత్వ సంస్థల్లో పనిచేసినవారు 34 మంది, రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన సంస్థల్లో పనిచేసిన వారు 103 మంది, ఇతర ఉద్యోగాలు చేసినవారు 101 మంది ఉన్నారు. ఐటీ రంగంలో నిపుణులుగానూ, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగులు గానూ, డాక్టర్లుగా పనిచేసిన వారూ ఉన్నారు. ఇదే రిక్రూట్మెంట్ లో ఎంపికైన వ్యక్తిని కుప్పం ఆర్డీఓగా చంద్రబాబు నియమించుకున్నారు. కోర్టు ఈ 163 మందిని నాన్ ఫోకల్ పోస్టుల్లో వేయాలని ఆదేశాలు ఇస్తే, ఇదే చంద్రబాబు మాత్రం ఆ ఆర్డీఓను తన నియోజకవర్గం కుప్పంలో ప్రత్యేకంగా నియమించుకున్నారు. దిద్దివేతలు ఎగ్జామినర్లవేఓఎంఆర్ షీట్లో దిద్దివేతలు గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవానికి సిట్ తన నివేదికలో ఎగ్జామినర్లే దిద్దివేతలు చేశారని, కాకపోతే వాళ్లు మూల్యాంకనం చేసిన తర్వాత పొరపాటున కొన్నిచోట్ల సంతకాలు మరిచారని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని ఎగ్జామినర్లు అంగీకరించారని సిట్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఇలా మరిచిపోవడాన్ని ఆసరాగా తీసుకుని ఎలాంటి బయటవ్యక్తులు దిద్దివేతలు చేసే అవకాశం కూడా లేదని తేల్చిచెప్పింది. సమాధాన పత్రాలు చెక్కు చెదరలేదు. మాన్యువల్ మూల్యాంకనంలో ఉపయోగించిన అభ్యర్థుల అసలు సమాధాన పత్రాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని సిట్ నిర్ధారించింది. ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయని సిట్ తన నివేదికలో పేర్కొంది. హాయ్‌ల్యాండ్‌లో జవాబు పత్రాలు 84 రోజుల పాటు ఉన్నప్పటికీ వాటిలో ఎలాంటి ట్యాంపరింగ్ లేదా మార్పులు జరగలేదన్నది ఫోరెన్సిక్ పరిశీలనలో తేలినట్లు సిట్ చెప్పింది.ఎన్ఐటీల నుంచి 17 మంది ఎంపికైనట్లు సిట్ వెల్లడించిన వివరాలు కొందరికి లబ్ది చేకూర్చారన్న ఆరోపణలు తోసిపుచ్చిన సిట్...ఎంపికైన 163 మంది అభ్యర్థులు, ఎంపిక కాని వారు, అలాగే హైకోర్టును ఆశ్రయించిన 408 మంది రిట్ పిటిషనర్ల విషయంలో ఒకే రకమైన మార్పుల నమూనాలు ఉన్నాయన్న సిట్, ఈ తేడాలు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికే పరిమితం కాలేదని స్పష్టంగా పేర్కొంది. ముందుగా నిర్ణయించిన కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చడానికి రికార్డులను సవరించారన్న ఆరోపణను సిట్ తోసిపుచ్చింది. మూల్యాంకనంలో మార్కులు పెరిగాయన్న దానికి సిట్ తన నివేదికలో చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. టోటల్ మార్కుల లెక్కింపులో దొర్లిన పొరపాటును సరిదిద్దడం వల్ల మాత్రమే మార్కుల పెరుగుదల జరిగిందని నిర్ధారించింది. తద్వారా మూల్యాంకన స్లిప్పై జరిగిన ప్రతి మార్పును మోసపూరిత తారుమారుగా చూడ్డానికి వీల్లేదని సిట్ తేల్చి చెప్పింది.అక్రమాలకు ఆధారాల్లేవన్న సిట్.. నిజానికి సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా గ్రూప్–1 సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని నిర్ధారించలేదు. బార్కోడ్లు మారలేదని స్పష్టం చేసినా, జవాబు పత్రాల మార్పిడి జరగలేదని చెప్పినా, మూల్యాంకనంలో ఎలాంటి అక్రమాల్లేవని తేల్చినా కూడా.. చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం, తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. హైకోర్టుకు సమర్పించిన 10 వేల పేజీల విచారణ నివేదికలో ‘ఒరిజినల్ జవాబు పత్రాలను మార్చినట్లు గానీ, బార్ కోడ్లను తారుమారు చేసినట్లు గానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ తేల్చింది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా లబ్ధి చేకూర్చినట్లు కూడా ఆధారాల్లేవంది. 287 బార్కోడ్ల వ్యత్యాసాలపై ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) జరిపిన అత్యున్నత స్థాయి ఫోరెన్సిక్ పరీక్షల్లో అభ్యర్థుల పేపర్లు మారలేదని సిట్ తేల్చింది. అభ్యర్థుల గుర్తింపుపై గానీ, మూల్యాంకనంపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని సిట్ నివేదిక తేటతెల్లం చేసింది. -
లోకేష్ పని ఖతం.. Gen-Z చేతిలో మూడింది.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న నో యూజ్


