డీఎస్సీపై చర్చ జరగాల్సిందే.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన | AP Assembly Session 20th Aug Live Updates | Sakshi
Sakshi News home page

డీఎస్సీపై చర్చ జరగాల్సిందే.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన

Aug 20 2026 10:16 AM | Updated on Aug 20 2026 10:38 AM

AP Assembly Session 20th Aug Live Updates

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌.. 

ఎమ్మెల్సీల ఆందోళన ఉధృతం

  • శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన ఉధృతం
  • శాసన మండలి వాయిదా పడినా ఆందోళన కొనసాగింపు
  • మండలిలో నేల మీద కూర్చుని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీలు
  • డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలని ఆందోళన
  • నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
     

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన

  • శాసనమండలిలో వైఎశాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
  • డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌
  • డీఎస్సీపై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టు
  • పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
  • నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు స్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన


ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కామెంట్స్‌..

  • డీఎస్సీపై చర్చ జరపాలని కోరుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదు
  • తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు
  • స్పోర్ట్స్ కోటా వారికి పరీక్ష లేకుండా ఉద్యోగమిచ్చామని మంత్రి లోకేష్ చెబుతున్నారు
  • టెట్ నుంచి మినహాయించి ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి అడిగినందుకు టీచర్లను సస్పెండ్ చేశారు
  • తక్షణమే టీచర్లపై సస్పెన్షన్ ఎత్తేయాలి
  • డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి

ఎమ్మెల్సీ మధుసూధన్ కామెంట్స్‌..

  • 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% శాతానికి పెంచారు
  • డీఎస్సీకి ముందు ఒక జీవో.. తర్వాత ఒక జీవో తెచ్చారు.
  • జీవోలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు
  • డీఎస్సీలో ఉద్యోగాల కోసం లక్షల్లో బేరసారాలు జరిగాయి
  • ఎందుకు డీఎస్సీపై విచారణకు భయపడుతున్నారు

ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కామెంట్స్‌..

  • గతంలో ఎన్నడూ ఇలాంటి సమావేశాలు జరగలేదు
  • డీఎస్సీపై విచారణ చేయించాలంటే భయపడి పారిపోతున్నారు.

ర్యాలీగా మండలికి  ఎమ్మెల్సీలు..

  • ర్యాలీగా మండలికి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
  • మెడలో నల్ల కండువాలు ధరించి నిరసన
  • మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలు
  • డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్
  • డీఎస్సీపై విచారణ చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శన
  • మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement