సాక్షి, కడప: కడప మెగా డీఎస్సీలో నకిలీ కుల ధృవీకరణ పత్రంతో రసూల్ అనే వ్యక్తి ఉద్యోగం పొందారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2008, 2012, 2018 డీఎస్సీల్లో బీసీ-ఈ సర్టిఫికెట్ సమర్పించిన రసూల్.. 2025 మెగా డీఎస్సీలో ఓసీ-ఈడబ్ల్యూఎస్‌గా నమోదు చేసుకున్నారని జమీల్ ఫిర్యాదు చేశారు. దీంతో తనకు రావాల్సిన ఉద్యోగం రసూల్‌కు దక్కిందని ఆరోపించారు.
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు తప్పుడు సర్టిఫికెట్ సమర్పించినట్లు నిర్ధారించినట్లు సమాచారం. తహసీల్దార్ ఇచ్చిన ఓసీ-ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను మెగా డీఎస్సీలో అక్రమంగా ఉపయోగించారని ఆర్డీవో చంద్ర మోహన్ నివేదికలో పేర్కొన్నారు. తదుపరి చర్యల కోసం 2025 డిసెంబర్‌లో కలెక్టర్‌కు నివేదిక పంపినా ఇప్పటివరకు చర్యలు లేవని జమీల్ ఆరోపిస్తున్నారు. రసూల్ ఇప్పటికీ సుండుపల్లి మండలంలో ఉద్యోగం కొనసాగిస్తున్నాడు.


