విజయనగరం: జిల్లాలోని భోగాపురంలో దారుణం చోటు చేసుకుంది. బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదని ఓ కస్టమర్‌ను తాళ్లతో కట్టేసి, బైక్‌తో ఈడ్చుకెళ్లి నడిరోడ్డుపై తిప్పిన అమానవీయ ఘటన వెలుగుచూసింది. రామచంద్రరాజు పేటకు చెందిన ఎల్లా రాజేష్ అనే యువకుడు బైక్ రిపేర్ చేయించుకున్నాడు.
అనంతరం డబ్బులు ఇవ్వలేదనే కారణంతో మెకానిక్ మహేష్‌తో సహా మరో నలుగురి కలిసి.. రాజేష్‌ను హింసించారు. రాజేష్‌ను కట్టేసి బైక్‌కు తాళ్లతో కట్టి ఊరేగించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మెకానిక్ మహేష్‌తో సహా మరో నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కింద పలు సెక్షన్ల నమోదు చేశారు.


