సాక్షి, విశాఖ: డీఎస్సీలో అక్రమాల బండారం బయటపడిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. స్పోర్ట్స్ కోటా, పేపర్ లేకేజి ఆరోపణలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు గురువారం విశాఖలో వరుదు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. కర్నూలు ప్రభాకర్ గౌడ్ కు టెట్ అర్హత లేకుండా టీచర్ పోస్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
చర్చకు రావాలని సవాల్ విసరడం కాదు దమ్ముంటే డీఎస్సీ అంశంపై ఇప్పుడు మాట్లాడాలి. వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. డీఎస్సీలో ఇంకెన్ని అక్రమాలు జరిగాయో తేలాలని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చెయ్యాలని ఈ అంశంపై సీఎం చంద్రబాబు దీనిపై స్పందించాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు..



