కమిషనర్‌ రవివర్మను సస్పెండ్‌ చేయాలి | Municipal Commissioner Ravi Varma in OG Getup | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ రవివర్మను సస్పెండ్‌ చేయాలి

Sep 3 2026 11:55 AM | Updated on Sep 3 2026 12:01 PM

Municipal Commissioner Ravi Varma in OG Getup

సాక్షి, కోనసీమ జిల్లా: బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి హోదాలో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించిన ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్‌ పి.రవివర్మను సస్పెండ్‌ చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపంలో రాజకీయ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో రవివర్మ ఓజీ గెటప్‌లో పాల్గొని కేక్‌ కటింగ్‌ వేడుకల్లో పాల్గొనడం సివిల్‌ సర్వీస్ ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధమన్నారు.

ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజా సేవ చేయాల్సిన అధికారి ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా డ్రెస్‌కోడ్‌ చేసుకుని ప్రత్యక్షంగా పాల్గొనడం అత్యంత శోచనీయమన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్‌ ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

చదవండి: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement