కర్నూలు(టౌన్): మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, విజయమనోహరి దంపతుల కుమారుడు జనక్‌దత్తారెడ్డి, శ్రీయల వివాహ రిసెప్షన్‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి 11.40 గంటలకు ఎస్‌టీబీసీ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి 12 గంటలకు సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించి 20 నిమిషాలు అక్కడే ఉంటారు. అనంతరం 12.35 గంటలకు తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. రిసెప్షన్‌కు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరవుతున్నారు.


