సాక్షి, తాడేపల్లి: డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, పలువురు నేతలు ఆయన్ని స్మరించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు. “మిస్ యూ ఆల్వేస్, డాడ్! యూ విల్ ఫరెవర్ బీ మై ఇన్‌స్పిరేషన్” అంటూ తండ్రిని తలచుకున్నారు.
వైఎస్సార్ తనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని జగన్ పేర్కొన్నారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన జ్ఞాపకాలను స్మరించారు. అంతకు ముందు.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో, పార్టీ కేడర్‌తో కలిసి నివాళులర్పించిన విషయం తెలిసిందే.
Miss you always, Dad! You’ll forever be my inspiration. pic.twitter.com/4e9pkYxlem
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2026
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన ఆయన.. ప్రజల మనసుల్లో ‘వైఎస్సార్’ను చిరస్థాయిగా నిలబెట్టింది. అయితే 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతికి నేటితో పదిహేడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌ను స్మరించుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో నివాళులర్పిస్తున్నారు.
ఇటు వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయన అడుగుజాడల్లోనే సంక్షేమానికి పెద్దపీట వేశారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఏపీకి ముఖ్యమంత్రిగా పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, వివిధ వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.
ఇదీ చదవండి: మరపురాని మహానేత


