మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్‌ | Ys Rajasekhar Reddy 17th death anniversary September 2 | Sakshi
Sakshi News home page

మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్‌

Sep 2 2026 5:30 AM | Updated on Sep 2 2026 5:30 AM

Ys Rajasekhar Reddy 17th death anniversary September 2

నేడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి 

సాక్షి, అమరావతి: ‘ది­­వంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లా­ది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి. కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైఎస్సార్‌. నీటి చుక్కతో నవ్య చరిత్ర రాసిన జలప్రదాత వైఎస్సార్‌కు 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’అంటూ వైఎస్సార్‌సీపీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. మరపురాని మహానేత .. జలప్రదాత డాక్టర్‌ వైఎస్సార్‌ అంటూ ఫొటోను ట్యాగ్‌ చేసింది.

 వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌  ఈ నెల 2న ఉదయం పులివెందులలోని నివాసం నుంచి బయలు­దేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌వద్ద డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం డాక్టర్‌ వైఎస్సార్‌ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement