Archive Page | Sakshi
Sakshi News home page

Krishna

  • అన్నను హత్య చేసిన తమ్ముడి అరెస్ట్‌

    గుడివాడరూరల్‌: ఆస్తి తగదాల నేపథ్యంలో అన్నను హత్య చేసిన తమ్ముడిని అరెస్ట్‌ చేశామని గుడివాడ రైల్వే సీఐ ఎంవీ దుర్గారావు ఆదివారం తెలిపారు. రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఈ నెల 3న గుడివాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ధనియాలపేట వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని సమాచారం వచ్చిందన్నారు. రైల్వే ఎస్‌ఐ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. రైల్వే డీఎస్పీ రత్నరాజు ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో మచిలీపట్నం, గుడివాడ రైల్వే ఎస్‌ఐలు మహబూబ్‌ షరీఫ్‌, శివనారాయణలను తమ సిబ్బందితో విచారణ ప్రారంభించామన్నారు. రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాలు, సెల్‌ టవర్‌ డంప్‌, సీడీఆర్‌, ఫోన్‌పేల ఆధారాలను సేకరించామన్నారు. బిహార్‌కు చెందిన సోనూకుమార్‌ సహనీ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి మందపాడు ఎల్‌ఐసీ కార్యాలయ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

    రైల్వే సిబ్బందికి అభినందన..

    నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌లో తన అన్న పప్పుసహానీ(28)తో ఆస్తి విషయంలో మనస్పర్థలు ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో ఇటీవల గుడివాడ మండలం చిన ఎరుకపాడు వద్ద సీడ్‌ కంపెనీలో పనికి చేరానని, తన అన్న పనుల నిమిత్తం మైసూర్‌ వెళ్లాడన్నారు. ఈక్రమంలో తన అన్న మైసూర్‌లో పనులు చేసేందుకు కూలీలు అవసరమయ్యారని తెలపగా తాను గుడివాడలో కూలీలు ఉన్నారని తీసుకువెళ్లేందుకు తన అన్నను రావాలని కోరానన్నారు. ఈక్రమంలో ముందుగానే తాను వేసుకున్న పథకం ప్రకారం తన అన్న ఈ నెల 3న తెల్లవారు జామున గుడివాడ రాగానే ధనియాలపేట వద్దకు తీసుకెళ్లి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడన్నారు. వారం రోజుల్లోనే హత్య కేసును చేధించిన రైల్వే ఎస్‌ఐలు మహబూబ్‌ షరీఫ్‌, శివనారాయణ, ఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ షేక్‌ అక్బర్‌, సిబ్బందిని సీఐ ప్రత్యేకంగా అభినందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

  • తృటిలో తప్పిన పెను ప్రమాదం

    జి.కొండూరు: జి.కొండూరు మండల పరిధి కవులూరు గ్రామ శివారులో ఉన్న ఎన్‌సీఎల్‌ బ్రిక్స్‌ కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో ప్రధాన భాగమైన 250 టన్నుల బరువుతో ఉండే భారీ ఫ్లైయాష్‌ ట్యాంకు ఆదివారం మధ్యాహ్న సమయంలో కూలిపోయింది. భోజన విరామంలో ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ కంపెనీలో షిఫ్ట్‌కు 40 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లలో రోజుకు 120 మంది కార్మికులు పని చేస్తూ ఉంటారు. ప్రమాద సమయంలో కూడా 40 మంది కార్మికులు విధులలో ఉన్నప్పటికీ భోజన విరామం కావడంతో పెను ప్రమాదం తప్పింది. గత ఆరేళ్లుగా ఇప్పటి వరకు ఇది మూడో ప్రమాదంగా తెలుస్తోంది. గతంలో జరిగిన రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. యాజమాన్య నిర్లక్ష్యంతో నిర్వహణ లోపం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. యంత్రాలను మెయింటెనెన్స్‌ చేయాలని సిబ్బంది చెప్పినప్పటికీ యాజమాన్యం వారి మాటలను పెడచెవిన పెట్టి ఉత్పత్తిపైనే దృష్టి సారించడం వల్లన ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్మికుల భద్రతను గాలికొదిలేసి ఉత్పత్తిపైనే దృష్టి సారించిన ఎన్‌సీఎల్‌ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. యాజమాన్యం ఇదే తీరు కొనసాగిస్తే కార్మికులతో కలిసి కంపెనీ ఎదుట ధర్నాకు దిగుతామని నాయకులు హెచ్చరించారు.

    ఎన్‌సీఎల్‌ బ్రిక్స్‌ కంపెనీలో కూలిన భారీ ఫ్లైయాష్‌ ట్యాంకు

  • 104 వాహనాల ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

    పామర్రు: 104 వాహనాల ఉద్యోగులకు గత కాంట్రాక్ట్‌ కంపెనీ నుంచి రావాల్సిన గ్రాట్యూటీ, ఈఎల్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్‌ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీఆర్‌ ఫణికుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం యూనియన్‌ కృష్ణా జిల్లా బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఫణికుమార్‌ పాల్గొని మాట్లాడుతూ.. ప్రస్తుత యాజమాన్యం భవ్య హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కూడా ఇప్పటి వరకు నియామక పత్రాలు, పే స్లిప్పులు ఇవ్వకుండా ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తూ పని చేయించుకుంటోందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 104 సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు అదనపు పని భారం తగ్గించాలన్నారు. ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు, జీవో 7 ప్రకారం వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐలను సక్రమంగా చెల్లించాలని కోరారు. వాహనాలకు ఇన్సూరెన్సు, ఫిట్‌నెస్‌లు వెంటనే చేయించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఓ గంగాధర్‌ మాట్లాడుతూ.. కార్మికుల పోరాటాలకు సీఐటీయూ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ ఆల్‌ ఇండియా మహాసభను జయప్రదం చేయాలని కోరారు. యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ డి.విజయ్‌, యూనియన్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు, 104 సిబ్బంది పాల్గొన్నారు.

  • పర్యాటకులకు తప్పని నిరాశ..!

    కోడూరు: హంసలదీవి సాగర తీరంలో కార్తిక స్నానాలు ఆచరించేందుకు వచ్చిన పర్యాటకులకు నిరాశ తప్పలేదు. అటవీ అధికారులు పాలకాయతిప్ప కరకట్ట వద్ద గేటు ఏర్పాటు చేసి పర్యాటకుల రాకపోకలపై నియంత్రణ ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు గేటు తెరిచి సాయంత్రం 5 గంటలకు మళ్లీ గేటును మూసివేస్తున్నారు. అయితే కార్తిక మాసంతో సూర్యోదయ వేళ పుణ్యస్నానం చేస్తే ముక్తి లభిస్తుందనే ఆశతో హైదరాబాద్‌, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మంతో పాటు విజయవాడ, గుంటూరుకు చెందిన పర్యాటకులు ఉదయం 6 గంటలకే కరకట్ట గేటు వద్దకు చేరుకున్నారు. ఉదయం వేళ స్నానాలకు అనుమతి లేదని అటవీ అధికారులు వీరందరినీ పాలకాయతిప్ప బీచ్‌ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉదయం 9 గంటల వరకు పర్యాటకులను అనుమతించమని అటవీ అధికారులు స్పష్టం చేశారు. హంసలదీవి సాగరతీరంలో వేకువజామున ఎన్నో ప్రకృతి రమణీయ దృశ్యాలు, సూర్యోదయ సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయని, అటవీ అధికారులు నిబంధనలు పెట్టి వీటికి పర్యాటకులను దూరం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీ అధికారుల తీరు వల్ల సాగరతీరం విశిష్ట దెబ్బతింటుందని, కార్తిక మాసంలో అయినా అధికారులు నిబంధనలు సడలింపు ఇవ్వాలని పర్యాటకులు కోరుతున్నారు.

  • ‘క్రీడలను కాపాడుకుందాం – యువతను రక్షించుకుందాం’

    కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇటీవల జరిగిన మహిళా క్రికెట్‌ ప్రపంచకప్‌లో మన జట్టు దేశానికి అద్భుతమైన విజయాన్ని అందించిందని, అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో క్రీడలను కాపాడుకుందాం – యువతను రక్షించుకుందాం అని వక్తలు పిలుపునిచ్చారు. గవర్నర్‌పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము అధ్యక్షతన ఆదివారం మహిళా క్రికెట్‌ ప్రపంచకప్‌ విజేతలను అభినందిద్దాం–క్రీడా అభివృద్ధిపై చర్చిద్దాం అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ ప్రపంచకప్‌లో ఒక్కో మహిళా అగ్గిపిడుగులై గర్జించారని కొనియాడారు. భవిష్యత్తులో మహిళా క్రీడాకారులకు ఇది ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. యువతను డ్రగ్స్‌, గంజాయి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో క్రీడలకు మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని, తగినంత కోచ్‌లు లేరని చెప్పారు. హర్యానా లాంటి రాష్ట్రంలో 400మంది కోచ్‌లు ఉంటే మన రాష్ట్రంలో నలుగురు మాత్రమే ఉన్నారన్నారు. మల్టీ పర్పస్‌ ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి జిల్లాకు స్పోర్ట్స్‌ పాఠశాల, స్పోర్ట్స్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా క్రీడాకారులకు రక్షణ కల్పించడంతో పాటు జీవో నంబర్‌ 74ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కోచ్‌ ప్రసాద్‌, లెక్చరర్‌ ఎస్‌.లెనిన్‌బాబు, జేవీవీ, డీవైఎఫ్‌ఐ నాయకులు శ్రీను, శోభన్‌, రవి, రమణ, శివ, పి.కృష్ణ, నరసింహ, ప్రసాద్‌, కృష్ణకాంత్‌ పాల్గొన్నారు.

International

  • వాషింగ్టన్: 40 రోజులకు చేరిన అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ముగింపు దశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. రిపబ్లికన్‌ల డిమాండ్‌ ప్రకారం ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలపై ఓటింగ్‌కు హామీ ఇస్తే.. జనవరి చివరి వరకు నిధులను పొడిగించేందుకు మితవాద డెమొక్రాట్‌ల బృందం తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది.

    సెనేటర్లు జీన్ షాహీన్, మాగీ హసన్, అంగస్ కింగ్ నేతృత్వంలోని బృందం చేసిన ప్రతిపాదనతో విమానాల రద్దు, ఆహార సహాయం నిలిపివేత, ఫెడరల్ కార్మికుల జీతాల కొరత తదితర తీవ్ర పరిణామాలకు అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అమెరికా షట్‌డౌన్ ముగింపునకు దగ్గరగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఒప్పందంపై డెమొక్రాటిక్ పార్టీలో తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోంది. సెనేట్ డెమొక్రాటిక్ నేత చక్ షుమెర్, సెనేటర్ బెర్నీ సాండర్స్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

    అఫర్డబుల్ కేర్ చట్టం (ఏసీఏ) కింద ఆరోగ్య సబ్సిడీల పొడిగింపు అనే ప్రధాన డిమాండ్‌ను పక్కన పెట్టడం అంటే ట్రంప్‌నకు లొంగిపోవడమే అని సాండర్స్ పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించకుండా ఒప్పందం చేసుకోవడం లక్షలాది మందికి చేసే ద్రోహం అని హౌస్ ప్రోగ్రెసివ్ నాయకులు విమర్శించారు. ఈ అంతర్గత విభేదాల కారణంగా, ఒప్పందం ఆమోదం పొందడానికి జాప్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

    ఈ షట్‌డౌన్  అమెరికా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 2,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. లక్షలాది మందికి అవసరమైన ఆహార సహాయం (ఎస్‌ఏపీ) అందడంలో ఆలస్యం అవుతోంది. వర్జీనియా వంటి ప్రాంతాలలో లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతుండటంతో, స్థానిక ఫుడ్ బ్యాంక్‌లపై భారం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, వర్జీనియా సెనేటర్ టిమ్ కైన్ వంటి కొందరు డెమొక్రాట్లు ఫెడరల్ శ్రామిక శక్తిని, ప్రభుత్వ కార్యకలాపాలను రక్షించేందుకు ఈ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నారు.

    కాగా ప్రభుత్వ ఫట్‌డౌన్‌ను ఎత్తివేడానికి రిపబ్లికన్లకు కేవలం ఐదుగురు డెమొక్రాట్‌ల మద్దతు మాత్రమే అవసరం. అయినప్పటికీ, హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఏసీఏ సబ్సిడీలపై భవిష్యత్తులో ఓటు వేస్తామనే హామీకి కట్టుబడి ఉండకపోవచ్చని వస్తున్న వార్తలు.. ఒప్పందంపై అనుమానాలను పెంచుతున్నాయి. డెమొక్రాట్ల మధ్య చీలిక ఏర్పడటం, రిపబ్లికన్‌ల తుది హామీపైనే ఈ షట్‌డౌన్ ముగింపు ఆధారపడి ఉంటుంది.

    ఇది కూడా చదవండి: ‘శ్వాస చంపేస్తోంది’.. ఢిల్లీలో భారీ నిరసనలు

Jayashankar

  • రాబట్

    సాక్షిప్రతినిధి, వరంగల్‌: కీలక శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న కొందరి కక్కుర్తి సర్కారు ఖజానాకు గండి పెడుతోంది. అవినీతికి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గం పట్టిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా వారి వైఖరి మారడం లేదు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వ సొమ్మును వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది. రైతుల నుంచి సేకరించిన రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద సరఫరా చేస్తూ.. తిరిగి రాబట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కారు ధాన్యాన్ని బయట అమ్ముకుంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి ఏసీకే (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే)కు రూ.25 వేల వరకు వసూలు చేస్తూ మిన్నకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవలే కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడు ఏసీకేల బియ్యం ఎగవేసిన ఓ వ్యాపారి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటూ సివిల్‌ సప్లయీస్‌ డీఎం జీవీ నర్సింహారావు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.

    ఏళ్లు గడుస్తున్నా ఉదాసీనతే..

    ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్‌ రాబట్టడంలో కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సీఎంఆర్‌ దందాపై పత్రికల్లో వచ్చినప్పుడో.. లేదా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినప్పుడో స్పందిస్తున్న పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. సీఎంఆర్‌ ఇవ్వని మిల్లుల్లో ఉండే ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు 1,83,985 మెట్రిక్‌ టన్నులు రాబట్టారు. ఇంకా రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యం 31మంది రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తేల్చినప్పటికీ రాబట్టడం లేదు. మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.

    ఏసీకేల వారీగా వసూళ్లు..

    31 మంది రైస్‌మిల్లర్ల నుంచి రూ.217 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం రాబట్టాల్సిన అధికారులు.. వాటి జోలికెళ్లడం లేదు. గత సీజన్‌లో అక్కడక్కడా ఆ డిఫాల్టర్లకే మళ్లీ సీఎంఆర్‌ ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా విచారణ స్థాయి దాటలేదు. దీంతో సీఎంఆర్‌ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్‌ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. బకాయిదారుల నుంచి బియ్యం, ధాన్యం రాబట్టాల్సిన ఉన్నతాధికారులు.. ధాన్యం ఎగవేతదారులతో సంప్రదింపులు జరిపి ఏసీకేకు రూ.25 వేల చొప్పున కొందరి వద్ద ఇటీవల వసూలు చేసినట్లు తెలిసింది. వరంగల్‌కు చెందిన ఇద్దరు రైస్‌మిల్లర్ల లావాదేవీలు నిలిపివేసి పిలిపించిన పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు.. వారం రోజులకే మిల్లును తెరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో మూడు రైసుమిల్లులకు నోటీసులు ఇచ్చి.. ఐదు రోజుల వ్యవధిలోనే లావాదేవీలకు అనుమతి ఇవ్వడం అప్పట్లో ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఈ సీఎంఆర్‌ దందాలో హస్తలాఘవం చూపుతున్న ఇద్దరు డీఎంలు, ముగ్గురు డీఎస్‌ఓలపై ఏసీబీ అడిషనల్‌ డీజీపీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదులు వెళ్లడం కలకలం రేపుతోంది. సీఎంఆర్‌లో అక్రమాలపై ఓ వైపు ఏసీబీ మరో వైపు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రంగంలోకి దిగి ఆరా తీస్తుండడం ఆ శాఖ అధికారుల్లో చర్చనీయాంశమవుతోంది.

    పౌరసరఫరాల శాఖలో వివాదాస్పదంగా ఇద్దరు డీఎంలు, ఇద్దరు డీఎస్‌ఓల తీరు

    సీఎంఆర్‌ రాబట్టడంలో మీనమేషాలు.. మిల్లర్లను వెనకేసుకొస్తూ భారీగా నజరానాలు

    ఒక్కో ఏసీకేకు రూ.25 వేలకు పైనే..

    మిల్లర్ల వద్దే 1.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం

    ప్రభుత్వానికి చేరని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌.. నాలుగేళ్లుగా పెండింగ్‌

    ఏసీబీ అడిషనల్‌ డీజీ వరకు ఫిర్యాదులు.. కమిషనర్‌ పేషీకి సీఎంఆర్‌ దందా

  • సర్కా

    క్రీడా సామగ్రి కరువు

    ఏడు పీఈటీ పోస్టులు ఖాళీ

    కాటారం: ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాముఖ్యం కల్పించాల్సి ఉండగా.. ఆటలు ఆడుకొనే అవకాశం మాత్రం అందని ద్రాక్షగానే మారిపోయింది.

    మొక్కుబడిగా ఆటలు..

    జిల్లాలో 428 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా సుమారు 40 పాఠశాలల్లో మినహా ఎక్కడా సరైన క్రీడా మైదానాలు లేవు. అవి కూడా అసంపూర్తి సౌకర్యాలతోనే నెలకొనడంతో ఆటలు ఆడటం విద్యార్థులకు ఇబ్బందిగా మారుతుంది. వర్షాలు కురిస్తే గ్రౌండ్‌లలో అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు జనవరి 26 రిపబ్లిక్‌డే, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని విద్యార్థులకు మొక్కుబడిగా ఆటలు ఆడిస్తున్నారే తప్పా మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మాత్రం కానరావట్లేదు. ఆటవిడుపుగా అన్నట్లుగా ఏడాదికోమారు తూతూ మంత్రంగా మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.

    క్రీడా సామగ్రి కరువు..

    కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్‌ ఫండ్‌ అందకపోవడంతో క్రీడా సామగ్రి, పరికరాలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కొనుగోలు చేసిన క్రీడా పరికరాలను మరమ్మతు చేసుకొని విద్యార్థులు ఆటలు ఆడాల్సి వస్తుంది. ప్రధాన క్రీడలైన వాలీబాల్‌, క్రికెట్‌తో పాటు షాట్‌ఫుట్‌, జావెలిన్‌ త్రో, ఆర్చరీ, ఇతర అథ్లెటిక్‌ పరికరాలు ఏ పాఠశాలలో చూసినా కానరావడం లేదు. దీంతో విద్యార్థులు ఆటలపై మక్కువ కోల్పోతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలకు మినహా ఏ ప్రభుత్వ పాఠశాలకు స్పోర్ట్స్‌ ఫండ్‌ మంజూరు చేయలేదు.

    ఏడు పీఈటీ పోస్టులు ఖాళీ..

    జిల్లాలో 37 పీఈటీ పోస్టులు ఉండగా 30 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఏడు పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పీఈటీలకు పీడీలుగా ప్రమోషన్‌ కల్పించి పలు పాఠశాలలకు నియమించగా జిల్లాలో అప్‌గ్రేడ్‌ పొందిన ఏడు పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

    క్రీడలతో కూడిన బోధన

    జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతో విద్యతో పాటు క్రీడా బోధన జరిగేలా చర్యలు తీసుకుంటాం. పీఈటీలు ఆయా పాఠశాలల్లో ఉన్న సౌకర్యాల మేర విద్యార్థులకు ఆటలు ఆడిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా నిర్వహణ, సామగ్రి కొనుగోలుకు త్వరలోనే స్పోర్ట్స్‌ ఫండ్‌ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.

    – రాజేందర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

  • ఏర్పా

    పలిమెల: మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన నేపథ్యంలో ఆదివారం అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రైనీ ఐఏఎస్‌ బృందం మూడురోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో బృందానికి వసతుల కల్పనలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి పవన్‌, ఎంపీఓ ప్రకాశ్‌రెడ్డి, ఎస్సై రమేష్‌ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

    రెడ్డిగుడిని సందర్శించిన ‘సిరికొండ’

    గణపురం: మండలకేంద్రంలోని ప్రసిద్ధ నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని (రెడ్డి గుడి) మాజీ స్పీకర్‌, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆదివారం సందర్శించారు. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను కల్యాణానికి ఆహ్వానించారు.ఆలయాన్ని సందర్శించిన ఆయనకు ఆలయ అర్చకులు భద్రయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పురాతన ప్రసిద్ధి గాంచిన రెడ్డి గుడి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు.

    పెరిగిన చలి తీవ్రత

    భూపాలపల్లి అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. జిల్లాలో ఆదివారం ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో జిల్లాలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం తొమ్మిది గంటల లోపు.. సాయంత్రం ఆరు గంటల తర్వాత చలి పెరిగింది. చలి కారణంగా పట్టణ ప్రజలు సాయంత్రం కాగానే ఇళ్లకు చేరుకుంటున్నారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు చలి మంటలు ప్రారంభించారు.

    హేమాచలుడి దర్శనానికి నిరీక్షణ

    మంగపేట: మంగపేట మండల పరిధిలోని మల్లూరు హేమాచల శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం పోటెత్తింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఉదయం 8నుంచి సాయంత్రం 5గంటల వరకు భక్త జనంతో కిటకిటలాడింది.

  • పోటెత

    కాళేశ్వరం ఆలయానికి

    రూ. 5.73 లక్షల ఆదాయం

    కాళేశ్వరం: కార్తీమాసం ఆదివారం సెలవురోజు కావడంతో కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారు జామునుంచి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు, దంపతి స్నానాలు చేశారు. గోదావరి మాతకు పూజలు చేశారు. అరటి దొప్పల్లో దీపాలు వదిలి, సైకత లింగాలను పూజించారు. అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఉసిరి చెట్టు వద్ద లక్షవత్తులు, దీపాలు వెలిగించారు. దీపారాధనలు చేసి బ్రాహ్మణోత్తములకు దీప దానం చేశారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరికి హారతి కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. సుమారుగా 30వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా వేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తులు కిక్కిరిసి కనిపించారు. ప్రాకార ఆలయాలను దర్శించుకున్నారు. వివిధ పూజలు, లడ్డు, ప్రసాదాల ద్వార రూ. 5.73లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్‌ తెలిపారు.

  • కాళేశ

    కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని ఆదిలాబాద్‌ జిల్లా జడ్జి కె.ప్రభాకర్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆయన ఆలయానికి రాగా ఆలయ అర్చకులు రాజగోపురం వద్ద మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. ఆలయ అర్చకుడు శ్రావణ్‌కుమార్‌శర్మ స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు.

    సినీనటుడు పూజలు

    సినీనటుడు మధునందన్‌ కుటుంబ సమేతంగా దర్శించుకుని అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఆశీర్వచన వేదిక వద్ద ఆయనను అర్చకుడు రాముశర్మ స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు.

  • కోటగుళ్ల శిల్పసంపద అద్భుతం

    ఐఏఎస్‌ల శిక్షణ బృందం

    కోటగుళ్ల సందర్శన, ప్రత్యేక పూజలు

    గణపురం: కోటగుళ్ల శిల్పసంపద ఎంతో అద్భుతంగా ఉందని ఐఏఎస్‌ల శిక్షణ బృందం సభ్యులు అన్నారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా 12 మంది సభ్యులతో కూడిన వారి బృందం కోటగుళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఆలయాన్ని సందర్శించిన వారిలో ఐఏఎస్‌ల బృందం సభ్యులు అనురాగ్‌ రంజన్‌, పటాస్‌ రాజ్‌, కృష్ణ ఝావిపశయన తన్వర్‌, కృష్ణసి, విశేష్‌ సింగ్‌, తుషార్‌ సింగ్‌, ఆదిత్య సింగ్‌, మయాంక్‌ ఖండేల్వాల్‌, మణిమాల, విశాల్‌ సింగ్‌, పవార్‌ అక్షయ్‌ విలాష్‌, రితాకా రాత్‌ ఉన్నారు. సుమారు గంట పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించుకున్నారు. రాతితో కట్టిన ఆలయం ఎంతో అద్భుతమని.. సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. వారివెంట గణపురం ఎస్‌ఐ రేఖ అశోక్‌, మహాముత్తారం డీటీ సందీప్‌, గణపురం ఆర్‌ఐ చెక్క దేవేందర్‌ ఉన్నారు.

Parvathipuram Manyam

  • జగన్‌కు పేరొస్తుందనే చంద్రబాబు కుట్రలు

    విజయనగరం:

    న్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రజల్లో ఆయనకున్న మంచి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబా బు, కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకర ణ చేసే దిశగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయా లు చేస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుని పేద ప్రజలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య ఉచితంగా అందించేందుకు ప్రజా మద్దతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న బుధవా రం తలపెట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలకు సంబందించిన వాల్‌పోస్టర్‌లను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలగట్ల కూటమి ప్రభుత్వం చేస్తోన్న మోసకారి పాలనపై పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు కోలగట్ల వెల్లడించారు. స్థానిక సీఎంఆర్‌ జంక్షన్‌ వద్ద గల దివంగత నేత డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహం నుంచి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెయిన్‌ బ్రాంచి మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ సాగుతుందన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేయటం జరుగుతుందన్నా రు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘా లు, కలిసి వచ్చే పార్టీలను భాగస్వాములు చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకోవటం విడ్డూరంగా ఉందని కోలగట్ల వాఖ్యానించారు.

    చేసిందేమీ లేకే..

    చెప్పుకునేందుకు చేసిందేమీ లేని కూటమి నాయకు లు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు పేర్లు మార్చి ప్రచారం చేసుకోవటమేనా వారు సాధించిన అభివృద్ధి అంటూ కోలగట్ల ప్రశ్నించారు. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చినా ఇప్పటికీ ప్రజలంతా అమ్మఒడిగానే పిలుస్తున్నారని చెప్పారు. సచివాలయాలను విజన్‌ యూనిట్‌లుగా మార్పు చేసినా ప్రజల గుండెల్లో మాత్రం సచివాలయాలగానే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఇదే తరహలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన నవరత్నాలు, నాడు–నేడు పథకాలు ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నాయన్నాయని వివరించారు. ఈ తరహాలో చంద్రబాబు అమలు చేసిన పథకాల్లో ప్రజలకు టక్కున గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఎన్నికలకు ముందు వేదికలపై ఊగిపోతూ ప్రసంగాలు చేసి పదవి వచ్చిన తరువాత యువతను మోసగించటం నిజం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు కెల్ల త్రినాధరావు, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, కార్పొరేటర్‌లు జివి.రంగారావు, గాదం మురళి, బండారు ఆనంద్‌, ఎన్ని లక్ష్మణరావు, పార్టీ నాయకులు అవనాపు లక్ష్మణరావు, రెడ్డి గురుమూర్తి, బొంగ భానుమూర్తి, దుప్పాడ సునీత, తాళ్లపూడి పండు, రౌతు భాస్కరరెడ్డి, సప్పా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

    మెరకముడిదాం: మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న తలపెట్టిన ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, భీమిలి నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని చినబంటుపల్లిలో ప్రజా ఉద్యమానికి సంబంధించి పార్టీ ముఖ్యమైన నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రజా ఉద్యమం వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి నాయకులు చీకటి ఒప్పందం చేసుకున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా బైక్‌ ర్యాలీకి ప్రతీ గ్రామం నుంచి 20 బైక్‌లకు తక్కువ కాకుండా పాల్గొనే విధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలన్నారు. బైక్‌ ర్యాలీ గరివిడి శంకర్‌ ఫంక్షన్‌ హాలు నుంచి బయలుదేరి చీపురుపల్లిలోని మూడురోడ్లు కూడలి వరకూ నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఎస్‌.వి.రమణరాజు, తాడ్డి వేణుగోపాల్‌రావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌, బూర్లె నరేష్‌కుమార్‌, పప్పల కృష్ణమూర్తి, రేగిడి లక్ష్మణరావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

  • ‘కూటమ
    ఇంటర్‌ విద్యపై

    పార్వతీపురం రూరల్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇటీవల విడుదలైంది. మరో మూడు నెలల్లో విద్యార్థులు కీలకమైన వార్షిక పరీక్షలకు సిద్ధం కావాల్సిన తరుణమిది. కానీ, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల పరిస్థితి మాత్రం అంతా గందరగోళం.. అయోమయం అన్నట్టుగా ఉంది. కళాశాలల్లో తిష్ట వేసిన సమస్యలు విద్యార్థుల భవితకు గాలం వేస్తున్నాయి. మౌలిక వసతుల మాట దేవుడెరుగు.. కనీసం పాఠాలు చెప్పేందుకు సరిపడా లెక్చరర్లు, పరిపాలన నడిపేందుకు సిబ్బంది లేక కళాశాలలు కునారిల్లుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా.. ఇంటర్‌ విద్యపై నిర్లక్ష్యం వీడటం లేదు. దీంతో ఉన్న వారిపై పని భారం, విద్యార్థులకు పాఠాల భారం తప్పడం లేదు.

    ఆ పోస్టులు అలంకారప్రాయమే..!

    క్రీడలకు, విజ్ఞానానికి ప్రతీకగా ఉండాల్సిన ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ), లైబ్రేరియన్‌ పోస్టులు చాలా కళాశాలల్లో అలంకారప్రాయంగా మారాయి. పార్వతీపురం, పాలకొండ బాలురు కళాశాలల్లో మాత్రమే పీడీలు పని చేస్తున్నారు. బలిజిపేట, కొమరాడ, పార్వతీపురం, పాలకొండ (బాలురు), సాలూరులోని ఐదు కళాశాలల్లో మాత్రమే రెగ్యులర్‌ లైబ్రేరియన్లు ఉన్నారు. మిగిలిన తొమ్మిది కళాశాలల్లో ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరో ఒక లెక్చరరే అదనపు బాధ్యతగా వీటిని చూడాల్సి వస్తుండటంతో.. అటు బోధనకు, ఇటు లైబ్రరీ సేవలకు న్యాయం జరగడం లేదు.

    అక్కడ.. ఆ సబ్జెక్టులు చెప్పేవారేరీ?

    పరీక్షలు సమీపిస్తున్న వేళ.. పలు కళాశాలల్లో కీలక సబ్జెక్టులకు అధ్యాపకులే లేరు. ప్రధానమైన సబ్జెక్టులకు బోధకులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు ట్యూషన్లపై ఆధారపడలేని పేద విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బోధన సిబ్బంది సంగతి అలా ఉంచితే.. కళాశాల పరిపాలన నడపాల్సిన బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ ఊసే లేదు. జిల్లాలోని ఏ ఒక్క ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోనూ సూపరింటెండెంట్‌, క్లాస్‌–4 ఉద్యోగులు లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్‌ సబార్డినేట్లు ఒక్కో కళాశాలకు ముగ్గురు ఉండాలి, కానీ గుమ్మలక్ష్మీపురంలో ఒక్కరే పని చేస్తున్నారు. అలాగే రికార్డ్‌ అసిస్టెంట్లు 37 మందికిగాను కేవలం 16 మందే విధుల్లో ఉన్నారు. టైపిస్టులు ఆరు చోట్ల పోస్టులు మంజూరైనా.. పార్వతీపురంలో మాత్రమే ఒకరు పని చేస్తున్నారు. సీనియర్‌ అసిస్టెంట్లు 14 కళాశాలలకుగాను ఆరు చోట్లే ఉన్నారు. మిగిలిన ఎనిమిది కళాశాలల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్‌ విద్యకు పునాది వంటిది. అలాంటి కీలకమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ కళాశాలలను గాలికొదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన తరుణంలోనైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి, ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం మానుకోవాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.

    జిల్లా పరిధిలో సీతంపేట, గరుగుబిల్లి మినహా 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలన్నీ అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. మొత్తం 140 మంది కాంట్రాక్టు ఫ్యాకల్టీ (సీఎఫ్‌), 12 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీ, ఒక ఎంటీఎస్‌ లెక్చరర్‌తో విద్యార్థులకు బోధన సాగుతోంది. రెగ్యులర్‌ లెక్చరర్లు కేవలం 27 మందే ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. అంటే మొత్తం భారం కాంట్రాక్టు, గెస్ట్‌ లెక్చరర్లపైనే పడుతోంది. అయినా ఇంకా 12 లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. కాంట్రాక్టు, గెస్ట్‌ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కరువైంది. వారి సేవలను గుర్తిస్తున్న దాఖలాలు కూడా లేవు.

    ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఈ సమస్య తీవ్రతను రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదించడం జరిగింది. పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఆదేశాలు అందిన వెంటనే ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. – వై.నాగేశ్వరరావు,

    జిల్లా కళాశాల విద్యా అధికారి

  • ● నాల

    బొబ్బిలి: ఈపీఎఫ్‌ 95 పింఛన్‌ను రూ.9వేలకు పెంచాలని ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, ఉపాధ్యక్షుడు వి.శేషగిరిరావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల్లో 30 నుంచి 40 ఏళ్ల పాటు సర్వీసు చేసి లక్షలాది రూపాయల తమ కష్టార్జితాన్ని దాచుకుంటే కేవలం రూ.700 నుంచి 2వేల లోపు మాత్రమే పెన్షన్‌ ఇవ్వడం దారుణమన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెన్షన్‌ను పెంచాలని కోరుతున్నామన్నారు. పెన్షన్‌ అయినా ఇవ్వాలని లేకపోతే చనిపోవడానికి అనుమతులు అయినా ఇవ్వాలని కోరారు. సుమారు 20 కోట్ల మంది ఈపీఎఫ్‌ – 95 పెన్షన్‌ దారులున్నారనీ ఈపీఎఫ్‌ సంస్థ వద్ద రూ.25లక్షల కోట్లున్నాయన్నారు. కానీ అతి తక్కువ పెన్షన్లన్నీ రూ.700 నుంచే ఉన్నాయన్నారు. దీనిని నిరసిస్తూ ఈ నెల 11న ఉదయం 11 గంటలకు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జరపతలపెట్టిన నిరసన కార్యక్రమానికి కార్మికులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. వారి వెంట రామినాయుడు తదితరులు ఉన్నారు.

    విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం, కందిపప్పు, నూనె సరుకులు చేరలేదనే అంశంపై సాక్షిలో ఈ నెల 8వ తేదీన అంగన్‌వాడీల్లో ఆకలి కేకలు అనే శీర్షికన ప్రచురించిన కథనానికి ఐసీడీఎస్‌ అధికారులు స్పందించారు. మోంథా తుఫాన్‌ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా ఆలస్యమైందని ఐసీడీఎస్‌ పి.డి విమ లరాణి తెలిపారు. ఈ నెల 12వ తేదీ నాటికి సరుకులు కేంద్రాలకు చేరుతాయని తెలిపారు.

    బొబ్బిలి: పట్టణ పరిధిలోని గొల్లపల్లి నుంచి మండలంలోని అలజంగి – కారాడ గ్రామాల మధ్యలో ఉన్న అతి పెద్ద గోతుల్లో లారీ దిగబడిపోయి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆదివారం వేకువ జాము నుంచి ఉదయం 8.30 గంటల వరకూ సుమారు నాలుగు గంటలు పైబడి వందల సంఖ్యలో లారీలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీల డ్రైవర్లు, సిబ్బంది ఆహారం కోసం అల్లాడిపోయారు. ఆ సమయంలో అవసరమై న సరుకులు దొరక్క, లారీలు విడిచి వెళ్లలేక అవస్థలు పడ్డారు. మరో పక్క వాహనాలను తప్పించుకుని రావాల్సిన ఆటోలు, మోటారు బైక్‌లు, ఇతర వాహనాలతో రాలేక ఇబ్బందులు పడ్డారు. సోషల్‌ మీడియాలో ఆయా వాహనాల యజమానులు, డ్రైవర్లు, స్థానికులు రోడ్ల దుస్థితి, తమ ఇబ్బందులపై పోస్టులు పెడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చివరకు ట్రాఫిక్‌ ఎస్సై పి.జ్ఞానప్రసాద్‌ తన సిబ్బందితో వెళ్లి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

    బొబ్బిలి: గతంలో మద్యం తాగి వాహనాలు నడిపి తే రూ.10వేల జరిమానా విధించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దానితో పాటు వారిని జైలుకు కూడా పంపించి శిక్ష అనుభవించి చేసిన తప్పులు తెలుసుకునేలా చేస్తామని ఎస్పీ దామోదర్‌ అన్నారు. ఆది వారం రాత్రి పట్టణంలోని పోలీసు సర్కిల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గంజాయి తరలించినా, సేవించినా కఠినమైన చర్యలుంటాయన్నారు.

  • సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

    విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్‌ విద్యను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. మరో మూడు నెలల్లో విద్యార్థులు పరీక్షల రాయనుండగా పలు కళాశాలల్లో పూర్తి స్థాయి అధ్యాపకులే లేకుండా కాంట్రాక్ట్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీతో బోధనలు నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పలు కళాశాలల్లో లైబ్రేరియన్లు, కార్యాలయ సిబ్బంది కూడా లేరు. ఇలా ఇంటర్‌ విద్యలో బేలతనం స్పష్టంగా కనిపిస్తోంది.

    గాలికొదిలేసిన ప్రభుత్వం

    జూనియర్‌ కళాశాలల్లో కొలువుల ఖాళీ

    జిల్లాలో 14 కళాశాలలు, 27 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు

    91 శాతం బోధన భారం కాంట్రాక్ట్‌, గెస్ట్‌ అధ్యాపకులపైనే..

    కళాశాలల్లో క్రీడలు, విజ్ఞానానికి కరువైన సిబ్బంది

    చోద్యం చూస్తున్న కూటమి పాలకులు

  • టీడీపీలో అసంతృప్తి సెగలు

    వీరఘట్టం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ అంధకారంలో ఉందని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పరిశీలకుల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పాలకొండ కూటమిలో నెలకొన్న అంతర్గత విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్థానిక శ్రీకోదండరామా కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన పాలకొండ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల సమీక్ష సమావేశంలో పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ కనుమరుగవుతుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఖండాపు వెంకటరమణ తేల్చి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అహంకార ధోరణితో పార్టీని నమ్ముకున్న టీడీపీ నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే తమపై కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని పార్టీ పరిశీలకులు ముందు తెలిపారు. సమావేశానికి స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. అనంతరం టీడీపీ అరుకు పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు కిడారి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గం కూటమి నాయకుల్లో అంతర్గత విబేధాలు ఉన్నట్టు స్పష్టమౌతోందన్నారు. ఇక్కడ పార్టీ సీనియర్‌ నాయకులు చెప్పిన ప్రతీ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌, పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పార్టీ పెద్దల సూచనలతో నియోజకవర్గంలో పార్టీ నూతన క్యాడర్‌ను నియమిద్దామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు శివ్వాల సూర్యనారాయణ, నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ పడాల భూదేవి, గేదెల గజేంద్ర, కర్నేన అప్పలనాయుడు, బుజ్జి, పప్పల మహేష్‌, పిన్నింటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

    అంధకారంలో పాలకొండ టీడీపీ

    ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ కనుమరుగవుతుంది..

    పరిశీలకుల ముందు టీడీపీ సీనియర్‌ నాయకుల ఆవేదన

    మరోసారి కూటమిలో బహిర్గతమైన అంతర్గత విబేధాలు

  • ప్రణాళిక విభాగంతోనే అభివృద్ధి సాధ్యం

    విజయనగరం: నగరాలు, పట్టణాలు అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమని, క్షేత్ర స్థాయి విధుల నిర్వహణలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ఓ హోటల్లో అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడు తూ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో క్షేత్ర స్థాయి సిబ్బంది కొరత ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు భర్తీ కావటం లేదని సచివాలయ ప్లానింగ్‌ సెక్రటరీలకు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌లుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి పూర్తిగా వారికి బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతలు కల్పించాలన్నా రు. దీనికోసం సచివాలయ ప్లానింగ్‌ సెక్రటరీల సర్వీస్‌ రూల్స్‌ను అమెండమెంట్‌ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్లానింగ్‌ విభాగాన్ని మరింతగా బలోపేతం చేయటం ద్వారా పట్టణాలు, నగరాలు, స్మార్ట్‌ సిటీలలో అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. నూతనంగా ఏర్పా టు చేస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు వాటికి కనెక్టింగ్‌ రోడ్లు నిర్మాణానికి ప్రణాళిక విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సభ్యులకు గ్రూప్‌ ఇన్సూ రెన్స్‌ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విధి విధానాలను పరిశీలించాలని సూచించారు. అసోసియేషన్‌ కార్యదర్శి మోహన్‌బాబు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఓ మారు సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నామని, సభ్యుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జోనల్‌ అధ్యక్షులు వసీంబేగ్‌ మాట్లాడుతూ నగరాల్లో పట్టణ ప్రణాళిక విభాగంపైనే అధికంగా ఒత్తిడి ఉంటుందని, నగర పౌరులకు ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ముందుగా ఈ విభాగమే గుర్తుకు వస్తుందన్నారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షు డు అబ్దుల్‌ సత్తార్‌, ఆర్డీడీపీ నాయుడు, మొదటి జోన్‌ అధ్యక్షుడు ఐ.వి.రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, జి.కృష్ణ, రతన్‌ రాజు, టీపీఎస్‌ సునీత, మతిన్‌ పాల్గొన్నారు.

  • పేదలకు ఉచిత  న్యాయ సహాయం

    డెంకాడ: పేద ప్రజలు న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. జిల్లా న్యాయ సేవా దినోత్సవాన్ని పురష్కరించుకుని మండలంలోని డి.కొల్లాం గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సమ న్యాయం పొందడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. రూ.3లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారందరూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చని చెప్పారు. ఆర్థిక, ఇతర కారణాలు వలన ఏ ఒక్కరూ న్యాయం పొందే అవకాశం కోల్పోకూడదన్న ఉద్దేశంతో 1987 సంవత్సరంలో లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్రకారం డీఎల్‌ఎస్‌ఏగా ఏర్పాటైందన్నారు. దీని ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందించడమే లక్ష్యమన్నారు. వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు అందేందుకు కూడా సహాయం చేస్తుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ నేరుగా గాని, టోల్‌ఫ్రీ నంబరు 15100కు ఫోన్‌ చేసి న్యాయ సహాయం పొందవచ్చని వివరించారు.

    శక్తి యాప్‌పై విస్తృత ప్రచారం

    విజయనగరం డీఎస్పీ ఆర్‌.గోవిందరావు మాట్లాడు తూ బాలికలకు, మహిళలకు రక్షణగా ఉండే శక్తి యాప్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. సోషల్‌ మీడియా వలన మంచి, చెడులు కూడా ఉన్నాయని, అందువలన జాగ్రత్తగా వ్యవహరించా లని చెప్పారు. సదస్సులో సర్పంచ్‌ అట్టాడ కృష్ణ, జిల్లా బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు కె.రవిబాబు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Palnadu

  • సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ నాలుగు క్రస్ట్‌గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్‌ ఉత్పాదన అనంతరం మొత్తం 31,101 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ రెండు క్రస్ట్‌గేట్లు 1.5 మీటర్లు, మరో రెండు క్రస్ట్‌గేట్లు మీటర్‌ ఎత్తు ఎత్తి 22,640 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పాదన అనంతరం 8,461 క్యూసెక్కులు మొత్తం 31,101 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 75.50 మీటర్లకుగాను 75.50 మీటర్లకు చేరిందన్నారు. రిజర్వాయర్‌ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం రిజర్వాయర్‌లో 7.080 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. టీఆర్‌సీ లెవల్‌ 55.62 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువనున్న నాగార్జునసాగర్‌ నుంచి ప్రస్తుతం 34,185 క్యూసెక్కులు వస్తుందని పై నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు.

    మాజీ ఎంపీ శివాజీకి

    పరామర్శ

    నగరంపాలెం: మాజీ ఎంపీ డాక్టర్‌ యలమంచిలి శివాజీని ఆదివారం బృందావన్‌గార్డెన్స్‌లోని ఆయన నివాసంలో స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న తనయుడు, మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర శివాజీ పరామర్శించారు. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం ఇరువురిని విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ సత్కరించారు. శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల పాలకవర్గం కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్ధన్‌, పలువురు పాల్గొన్నారు.

    రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్‌ గజ్జెల సుధీర్‌ భార్గవరెడ్డి ప్రథమ చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. అద్దంకి – నార్కెట్‌పల్లి రహదారిపై పెదనెమలిపురి వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయాడు. అదేసమయంలో పిడుగురాళ్ల నుంచి నరసరావుపేట వెళుతున్న డాక్టర్‌ గజ్జెల సుధీర్‌ భార్గవరెడ్డి తీవ్ర గాయాలతో పడిఉన్న యువకుడిని గమనించి, వెంటనే అతని వద్దకు చేరి, ప్రథమ చికిత్స చేసి, క్షతగాత్రుడిని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ఆపద సమయంలో మానవత్వంతో సత్వరం స్పందించిన డాక్టర్‌ గజ్జెల సుధీర్‌ భార్గవరెడ్డిని స్థానికులు అభినందించారు.

    మానవత్వం చాటుకున్న వైఎస్సార్‌ సీపీ

    సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్‌ గజ్జెల

  • రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ పోటీల విజేత గుంటూరు

    సత్తెనపల్లి: 12వ రాష్ట్ర సీనియర్‌ అంతర్‌ జిల్లాల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ 2025 విజేతగా గుంటూరు నిలిచింది. సత్తెనపల్లి మండలం లయోలా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన 12వ రాష్ట్ర సీనియర్‌ అంతర్‌ జిల్లాల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ 2025 పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన గుంటూరు టీమ్‌ చాంపియన్‌షిప్‌ కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని విజయనగరం టీమ్‌, తృతీయ స్థానం అనంతపురం టీమ్‌ కై వసం చేసుకున్నాయి. బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు హాజరై మాట్లాడారు. క్రీడలతోపాటు విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాలో 415 పోస్టుల్లో 49 పోస్టులు సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు దక్కడం అభినందనీయమన్నారు. సభకు సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్‌ వంశీకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ రమణ, స్కాలర్స్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, కె.సత్యం, లయోలా కళాశాల అడ్మిషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, సాఫ్ట్‌బాల్‌ అసోసియేసన్‌ గుంటూరు జిల్లా సామంత్‌రెడ్డి, ట్రెజరర్‌ జనార్ధన్‌ యాదవ్‌ ఆవుల, నరసింహారెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

  • రక్తనాళాలపై అవగాహన పెంచుకోవాలి

    గుంటూరు వెస్ట్‌: రక్తనాళాలపై అవగాహన కలిగి ఉంటే ఎన్నో అనర్థాలను ముందుగానే గుర్తించి సరిచేసే అవకాశముంటుందని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ నందకిషోర్‌ పేర్కొన్నారు. వాస్క్యులర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి వాస్క్యులర్‌ వాకథాన్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్తనాళాలు మనిషికి ఎంతో కీలకమన్నారు. నిత్యం వ్యాయామం, చక్కని ఆహార అలవాట్లతోపాటు క్రమం తప్పని మెడికల్‌ టెస్ట్‌లు చేయించుకుంటే ముందుగానే అరికట్టవచ్చని తెలిపారు. నేటి ఆధునిక యువత, అవగాహన లేక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని నిర్మూలించడానికి ఎన్నో పద్ధతులు సమాజంలో ఉన్నాయని తెలిపారు. వాస్కులర్‌ సర్జన్‌ డాక్టర్‌ వి.విజయకుమార్‌ మాట్లాడుతూ వాస్కులర్‌ వాక్‌థాన్‌ను దేశ వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో నిర్వహించారన్నారు. ఊబకాయం, మధుమేహ రోగుల్లో రక్తనాళాల సమస్యల కారణంగా కాళ్లు, చేతులు శాశ్వతంగా తొలగిస్తున్నారన్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులు కొద్దిపాటి జాగ్రత్తలతోపాటు అవగాహన కలిగి ఉంటే చాలా ఇబ్బందులను తొలగించే అవకాశముంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తనాళాళ సమస్యలకు ఎన్నో ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అనంతరం వాక్‌ స్టేడియం నుంచి మదర్‌థెరిస్సా విగ్రహం వద్దకు కొనసాగింది. కార్యక్రమంలో వాస్కులర్‌ సర్జన్స్‌ సురేష్‌రెడ్డి, సురేంద్ర, రత్నశ్రీ , ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ బి.సాయికృష్ణ, ఉపాధ్యక్షులు ఎం.శివప్రసాద్‌ పాల్గొన్నారు.

    ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ నందకిషోర్‌

  • మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ దారుణం

    మాచర్ల: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన 17 మెడికల్‌ కాలేజీలను నేటి కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని చూడడం దారుణమని వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో పార్టీ ఐటీ వింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రుల కోటి సంతకాల’ సేకరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి రాష్ట్ర ఐటీ వింగ్‌ అధ్యక్షుడు సునీల్‌రెడ్డి పోసింరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల శివారెడ్డి, పులిచర్ల అంజిరెడ్డి, స్టేట్‌ ఐటీ వింగ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్యాల విజయభాస్కర్‌రెడ్డిలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ ఏపీలో పేద విద్యార్థులు చదువుకోవటానికి అవకాశం లేకుండా మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. ఆ కుట్రలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తిప్పికొడతామన్నారు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీలో స్థిరపడిన ఏపీ చెందిన ప్రజల చేత సంతకాల సేకరణ చేశారు.

    వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

    పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

  • అంబేడ్కర్‌ స్మృతివనాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలి

    చీరాల రూరల్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కోపంతో అంబేడ్కర్‌ విగ్రహా న్ని కూటమి ప్రభుత్వం అవమానిస్తోందని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సెయింట్‌ మార్క్స్‌ లూథరన్‌ జూనియర్‌ కాలేజీ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చారిత్రాత్మక పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో 18.81 ఎకరాల్లో సామాజిక న్యాయ విగ్రహం పేరుతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. స్మృతివనం ఎంట్రన్స్‌ ఫీజు మొదటగా రూ.5 గా నిర్ణయించారన్నారు. అయితే అక్కడ పారిశుద్ధ్య పనుల నిర్వహణ లోపం కారణంగా పర్యాటకులు ఎవరూ రావడం లేదన్నారు. కూటమి పార్టీలకు జగన్‌మోహన్‌రెడ్డితో ఉన్న వైరం కారణంగా అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానిస్తున్నారన్నారు. స్మృతివనం నిర్వహణకు తాము కూటమి నేతల డబ్బులు అడుగడం లేదని, సాంఘిక సంక్షేమ శాఖ నిధులు నుంచి నిర్వహణ చేపట్టాలన్నారు. అందులో పనిచేసే కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అపర కుబేరుడు రామోజీరావు స్మారక సభకు రూ.14 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసిన చంద్రబాబు.. అంబేడ్కర్‌ స్మృతివనానికి నిధులు లేవని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు సబ్సిడీ రుణాలను కూడా ప్రకటించి.. నిధులు నిలిపివేసి ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామన్న ఎన్నికల హామీ తుంగలో తొక్కారన్నారు. స్మృతి వనాన్ని సాంఘిక సంక్షేమ శాఖ నుంచి పర్యాటక శాఖకు అప్పగించడం కూటమి ప్రభుత్వ కుట్రపూరిత వివక్షకు నిదర్శనమన్నారు. స్మతివనం నిర్వహణకు కమిటీ నియమించాలని డిమాండ్‌ చేశారు. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడే మాచవరపు జూలియన్‌, మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాకుమాను రవికుమార్‌, జి.ఏలియా తదితరులు పాల్గొన్నారు.

    దళిత హక్కుల పరిరక్షణ సమితి

    రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు

  • నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదు

    నెహ్రూనగర్‌ : శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి వద్ద ఉన్న షాపుల యాజమాన్యం అడుగుతున్న నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఆదివారం మిర్చి యార్డు, శంకర్‌ విలాస్‌ వంతెన నిర్మాణ పనులను నగర మేయర్‌ కోవెలమూడి రవీంద్రబాబు, నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులతో కలిసి పనులను పరిశీలించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ మిర్చి యార్డు వద్దపై వంతెన పనులు చాలా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో యార్డు వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం అడ్డంకి కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి జీజీహెచ్‌ వైపు డిసెంబర్‌ 15 తేదీలోపు 7 పిల్లర్లు పూర్తయ్యేలా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శంకర్‌ విలాస్‌ వైపు ఉన్న షాపులు తొలగించడంలో కొంత జాప్యం చోటు చేసుకుందని, వ్యాపారులు, ప్రజలు అర్థం చేసుకుని అభివృద్దికి సహకరించాలని కోరారు. రోడ్డు విస్తరణలో కోల్పోయే షాపులకు యాజమానులు అడుగుతున్న నష్టపరిహారం సాధ్యం కాదని...సదరు సమస్య పరిష్కారానికి నగరపాలక సంస్థ మేయర్‌, కమిషనర్‌ చర్చలు జరుపుతున్నారని వీలైనంత త్వరలో పరిష్కారమవుతుందన్నారు.

    కేంద్ర సహాయ మంత్రి

    పెమ్మసాని చంద్రశేఖర్‌

    మిర్చియార్డు, శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి

    పనులను పరిశీలన

Guntur

  • రియల్
    గుంటూరు
    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025
    గొప్పల డప్పు..
    కొత్త ప్రాజెక్టులు రాకుండానే వచ్చేసినట్లు ప్రభుత్వ హడావుడి

    7

    అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 33,110 క్యూసెక్కులొచ్చి చేరుతోంది. దిగువకు 17వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 45.7183 టీఎంసీలు.

    నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి యలవర్తి శశిధర్‌ రూ.1,01,116 విరాళం అందజేశారు.

    చేబ్రోలు: నాగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ఆరుద్ర నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకారం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు.

  • ముడుపుల కోసమే పీపీపీ విధానం

    రాష్ట్రంలో వైద్య కళాశాలలను

    ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి

    మెడికల్‌ కళాశాలల పరిరక్షణ కమిటీ

    రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు

    మాట్లాడుతున్న మెడికల్‌ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు

    బాపట్ల: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయటం కేవలం ముడుపుల కోసమేనని మెడికల్‌ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు ఆరోపించారు. మెడికల్‌ కళాశాలను కాపాడుకోవాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బాపట్లలో నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలను సందర్శించి ఎన్జీవో హోంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. వైద్యరంగాన్ని ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి బాపట్ల వైద్య కళాశాలను నిర్మించాలన్నారు. 56 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న ఈ కళాశాలను కాపాడుకోవాలని, పీపీపీ విధానంలో పది ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు ఇచ్చిన 590 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. వైద్య విద్యను, అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చెయ్యాలనే ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని సూచించారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రైవేటీకరణతో కోటీశ్వరుల పిల్లలకే మెడికల్‌ సీట్లు దక్కుతాయన్నారు. అర్హత గల పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    అంత దుస్థితిలో ప్రభుత్వం ఉందా?

    రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి. రమాదేవి డిమాండ్‌ చేశారు. ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఉండాలనే నినాదంతో బాపట్లలో మొదలుపెట్టిన కళాశాల నిర్మాణం కొనసాగించలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతోందన్నారు. కళాశాల నిర్మాణాలను ప్రారంభిస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలతోపాటు డాక్టర్లు, నర్సులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు మెరుగుపడతాయన్నారు.

    అమ్మకానికి పెట్టిన కూటమి సర్కారు

    సదస్సులో రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ మెడికల్‌ మాఫియాను ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్రంలో 500 ఎకరాల్లో నిర్మాణంలో ఉన్న పది ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను, ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌ మెడికల్‌ మాఫియాకు కట్టబెట్టాలనే కుట్రలో భాగమే పీపీపీ విధానమన్నారు. కూటమి ప్రభుత్వం ఏకంగా మెడికల్‌ కళాశాలలను అమ్మకానికి పెట్టిందని మండిపడ్డారు.

    ప్రభుత్వ నిర్ణయం దారుణం

    జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ కార్పొరేట్‌ వైద్య సంస్థలకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను కట్టబెట్టడం దారుణమన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు, ఆసుపత్రులు పూర్తి చేసి పేదలకు ఉచిత వైద్యాన్ని, పేదవిద్యార్థులు వైద్యవిద్యను అందించగలమని తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం మంది ప్రభుత్వ వైద్యాన్ని పొందుతారన్నారు. దళిత బహుజన ఫ్రంట్‌ వ్యవస్థాపకులు కొరివి వినయ్‌ కుమార్‌ మాట్లాడుతూ వైద్య విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగితేనే దళిత, గిరిజన, బలహీన వర్గాల, మైనా ర్టీల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. పది ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిస్తాయన్నారు. రిజర్వేషన్లు అమలై సామాజిక న్యాయాన్ని శక్తిమంతం చేస్తాయని తెలిపారు.

    తొలుత బాపట్ల ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రాంగణాన్ని వివిధ పార్టీల రాష్ట్ర నేతలు, పరిరక్షణ కమిటీ బృందం, ప్రజా, పౌర సంస్థల నేతలు పరిశీలించారు. గత 17 నెలలుగా బాపట్ల ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో అదనంగా ఎలాంటి నిర్మాణం జరగలేదని, ఇక్కడి నుంచి కొంత ఇనుమును పిడుగురాళ్ల మెడికల్‌ కళాశాలకు తరలించినట్లు గుర్తించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట అంజి బాబు, సీపీఐ కార్యవర్గ సభ్యుడు పరుచూరి రాజేంద్ర బాబు, బాపట్ల జిల్లా కార్యదర్శి సింగరకొండ, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల కో కన్వీనర్‌ కె. వసుంధర, వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. జె. విద్యాసాగర్‌, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేధ శ్రీనివాసరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ దర్శి విష్ణు శంకర్‌, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

  • విద్య

    ఘనంగా ముగిసిన వీవీఐటీయూ

    బాలోత్సవ్‌– 2025

    విజేతలకు ప్రశంసాపత్రాలు,

    బహుమతులు అందజేసిన అతిథులు

    పెదకాకాని: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించేందుకే బాలోత్సవ్‌ వేడుకలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూలో మూడు రోజులపాటు వైభవంగా జరిగిన బాలోత్సవ్‌ 2025 వేడుకలు చిన్నారుల తీపి గుర్తులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధురానుభూతుల మధ్య ఘనంగా ముగిశాయి. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా వందల పాఠశాలల నుంచి వేల మంది తరలి వచ్చారు. 25 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 20 అంశాలు, 61 విభాగాలుగా జరిగిన పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమానాలతోపాటుగా రెండు ప్రత్యేక బహుమతులను విజేతలకు అందించారు. బాలల వికాసంతోపాటు వారికి సంస్కృతి, సంప్రదాయాలను కూడా పరిచయం చేశారు. విద్యార్థుల ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. ఆదివారం విచిత్ర వేషధారణ, శాసీ్త్రయ, జానపద బృంద నృత్యాల నడుమ ప్రాంగణం కోలాహలంగా మారింది. 52 జానపద బృందాలు మూడు వేదికల వద్ద జాతర వాతావరణాన్ని సృష్టించాయి. 36 శాసీ్త్రయ నృత్య బృందాలు 2 వేదికలపై ఉత్సాహంగా ప్రదర్శన చేశాయి. మట్టితో ప్రతిమలు తయారు చేసి ఆకట్టుకున్నారు. వర్సిటీ శాక్‌, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విద్యార్థుల కృషి అభినందనీయమని ప్రో చాన్సలర్‌ వాసిరెడ్డి మహదేవ్‌ అన్నారు. విజేతలకు చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, వైస్‌ చాన్సలర్‌ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వై. మల్లికార్జునరెడ్డి, బాలోత్సవ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కె. గిరిబాబు బహుమతులు ప్రదానం చేశారు.

    జీవితంలో కళలు భాగం కావాలి

    జీవితంలో కళలు భాగం కావాలని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్‌ అన్నారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు సృజనాత్మక విషయాలు అలవాటు చేసుకొని ఏదో ఒక రంగంలో రాణించాలన్నారు.

  • రచయిత నసీర్‌ అహమ్మద్‌కు  జీవిత సాఫల్య పురస్కారం

    లక్ష్మీపురం: మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని జరిగే విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉర్దూ అకాడమీ జీవిత సాఫల్య పురస్కారానికి ప్రముఖ చరిత్రకారుడు, రచయిత సయ్యద్‌ నసీర్‌ అహమ్మద్‌ ఎంపికయ్యారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్‌ గౌస్‌ పీర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన పాత్రను వివరిస్తూ మూడు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న నసీర్‌ 25 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను వెలువరించారు. ఈ గ్రంథాలు ఉర్దూతోపాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, గుజరాతీ భాషలలో వెలువడ్డాయి. నసీర్‌ అహమ్మద్‌ కేవలం చరిత్ర గ్రంథ రచన, ప్రచురణతో కాకుండా సమరయోధుల త్యాగమయ, సాహసోపేత పోరాటాలను యువత, విద్యార్థులకు తెలియజేస్తూ పలు ప్రచార కార్యక్రమాలను దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు. చరిత్ర గ్రంథాల రచన, ప్రచురణను వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో నిర్వహిస్తున్న నసీర్‌ అహమ్మద్‌ తన కుటుంబం, సన్నిహితుల ఆర్థిక సహకారంతో ప్రచురించిన గ్రంథాలను ఎంపిక చేసిన వందల గ్రంథాలయాలకు, చరిత్రకారులకు, జర్నలిస్టులకు అందిస్తున్నారు. ఈ గ్రంథాల పీడీఎఫ్‌ ఫైళ్లను ప్రత్యేకంగా తయారు చేయించి కోరిన వారికి అందజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాఠకుల సౌకర్యార్థం తన గ్రంథాలన్నింటినీ అందుబాటులో ఉంచారు. మూడు దశాబ్దాలుగా సయ్యద్‌ నసీర్‌ అహమ్మద్‌ అవిశ్రాంతంగా సాగిస్తున్న కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉర్దూ అకాడమీ ఈ ఏడాదికిగాను ప్రతిష్టాత్మక ‘జీవిత సాఫల్య‘ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపికతో నసీర్‌ అహమ్మద్‌ను విజయవాడలో మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తదితర ప్రముఖులు సత్కరించనున్నారు.

East Godavari

  • ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు

    ఎడ్యుకేషనల్‌ ఎపిఫనీ మెరిట్‌ టెస్ట్‌

    పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తులకు ఆహ్వానం

    రిజిస్ట్రేషన్‌కు 14 తుది గడువు

    రాయవరం: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వంతో పాటు, పలు ఎన్‌జీవో సంస్థలు ఏటా వివిధ పరీక్షలు నిర్వహిస్తుంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎడ్యుకేషనల్‌ ఎపిఫనీ మెరిట్‌ టెస్ట్‌(ఈఈఎంటీ) స్వచ్ఛంధ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లోని 7, 10 తరగతుల విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రతిభా పరీక్షను నిర్వహించనుంది. 12 ఏళ్లుగా ఎటువంటి రుసుమూ లేకుండా ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు అక్టోబరు 30న షెడ్యూల్‌ను విడుదల చేశారు.

    నచ్చిన చోటే పరీక్ష

    ఈఈఎంటీ పరీక్ష ప్రిలిమ్స్‌, మెయిన్‌ రెండు దశల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షను విద్యార్థి అభీష్టం మేరకు ఇంటి వద్ద నుంచి లేదా పాఠశాల నుంచి అటెండ్‌ అయ్యే అవకాశం కల్పించారు. ఈ పరీక్షలను శ్రీకోడ్‌ తంత్రశ్రీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిర్వహిస్తారు. డిసెంబరు 6న ప్రిలిమినరీ పరీక్ష, 7న ఫలితాలు విడుదల చేస్తారు. 40 శాతం పైబడి మార్కులు పొందడంతో పాటుగా, ఆన్‌లైన్‌ పరీక్ష నియమ నిబంధనలు సక్రమంగా పాటించిన వారు మెయిన్‌ పరీక్షకు అర్హత పొందుతారు. మెయిన్‌ పరీక్షకు డిసెంబరు 8 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష డిసెంబరు 27న నిర్వహిస్తారు. జిల్లాకు ఒక పరీక్ష కేంద్రం ఉండగా, అభ్యర్థి ఎంచుకున్న కేంద్రంలో పరీక్ష రాయాలి. పరీక్షలో 50 శాతం మార్కులు పొంది ఆన్‌లైన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించిన వారికి బహుమతులు అందజేస్తారు. పరీక్షను మొబైల్‌ ఫోన్‌/ల్యాప్‌టాప్‌/ట్యాబ్‌/కంప్యూటర్‌ వీటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని నిబంధనలకు లోబడి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌ రాసే వారికి నవంబరు 29న మాక్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్ష రాసే వారికి డిసెంబరు 20న మాక్‌ టెస్ట్‌ రాసే అవకాశం కల్పిస్తారు. హెచ్‌టీటీపీఎస్‌:ఎడ్యుకేషనల్‌ఎపిఫనీ.ఓఆర్‌జీ–ఈఈఎంటీ2026/రిజిస్ట్రేషన్‌.పీహెచ్‌పీ లింక్‌ ద్వారా అభ్యుర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

    రెండు మాధ్యమాల్లో పరీక్షలు

    విద్యార్థులకు రాష్ట్ర అకడమిక్‌ క్యాలెండరు 2025–26 సిలబస్‌ను అనుసరించి, డిసెంబరులో పూర్తయిన సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌పై 20 శాతం ప్రశ్నలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో పరీక్షలు ఉంటాయి. గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులు, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌ (విద్యార్థుల తరగతి స్థాయి) మేధా సంబంధిత ప్రశ్నలు ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో విద్యార్థి పేరు, పరీక్ష రాసే మొబైల్‌ నంబరు, విద్యార్థి/తల్లిదండ్రుల ఈ మెయిల్‌, విద్యార్థి పుట్టిన తేదీ, విద్యార్థి ఫొటో (2ఎంబీ కన్నా తక్కువ సైజు), తరగతి, జిల్లా, మండలం, పాఠశాల పేరు, హెచ్‌ఎంల పేరు, హెచ్‌ఎం ఈ మెయిల్‌ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

    పరీక్ష నిర్వహణ ఇలా

    గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది. విద్యార్థుల తరగతి స్థాయి ఆధారంగా జనరల్‌ నాలెడ్జ్‌ మరియు కరెంట్‌ అఫైర్స్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో 60 ప్రశ్నలు 100 మార్కులకు, మెయిన్స్‌ పరీక్ష 60 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు 60 నిమిషాల నిడివితో నిర్వహిస్తారు. 1 తేలిక మార్కు ప్రశ్నలకు ఒకటి, మధ్యస్థ రకం ప్రశ్నలకు 2, కఠినతరం ప్రశ్నలకు మూడు మార్కుల వంతున కేటాయిస్తారు.

    బహుమతులు ఇచ్చేదిలా

    ఈ పోటీల్లో 162 మంది విజేతలకు దాదాపుగా రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తతీయ బహుమతిగా రూ.20వేలు, 7వ తరగతితో రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేస్తారు. జిల్లా స్థాయిలో 10వ తరగతిలో రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు, 7వ తరగతి విద్యార్థులకు రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులుగా ఇస్తారు. మండల స్థాయిలో 10, 7 తరగతుల్లో ప్రథమ స్థానం పొందిన వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాన్ని మాత్రమే ఇస్తారు. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఈఈఎంటీ–2025 పరీక్షకు సంబంధించి మరింత సమాచారారం తెలుసుకునే వారు, సందేహాల నివృత్తికి 9951002400 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని పూర్వపు స్టేట్‌ కోఆర్డినేటర్‌ దూదేకుల నబి తెలియజేస్తున్నారు.

    ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈఈఎంటీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అధిక శాతం హాజరయ్యేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.

    – డాక్టర్‌ షేక్‌ సలీం బాషా, డీఈవో, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా

    ఈఈఎంటీ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు తవనం వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న సంస్థ ద్వారా పూర్తిగా ఉచితంగా పోటీలు నిర్వహిస్తున్నాం.

    – దూదేకుల నబి, ఈఈఎంటీ,

    పూర్వపు రాష్ట్ర సమన్వయ కర్త

  • అతితెలివితో అడ్డంగా దొరికి..

    బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్టు

    అప్పులపాలై అడ్డదారిలో వెళ్లి దురాగతం

    ఆత్మహత్యను హత్య కేసుగా నమోదు

    చాకచక్యంగా ఛేదించిన పోలీసులు

    ామచంద్రపురం: అత్యాసకు పోయి, దొంగతనం చేస్తూ అన్నెం పున్నెం ఎరుగని బాలికను హత్య చేసి మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నంలో చివరకు హంతకుడు పోలీసులకు దొరికిపోయాడు. రామచంద్రపురం పట్టణంలో ఈ నెల 4న జరిగిన బాలిక మృతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో వెలుగు చూసిన విషయాలు విస్మయం కలిగించాయి. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారానికి చెందిన పెయ్యల వీరవెంకట శ్రీనివాస్‌, అలియాస్‌ శ్రీనివాస్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఒక యూట్యూబ్‌ చానల్‌కు రిపోర్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పట్టణంలోని త్యాగరాజు నగర్‌లో ఒక ఇంట్లో చిర్రా సునీత తన కూతురుతో కలిసి అద్దెకు ఉంటున్నారు. వీరి కుటుంబంతో శ్రీనివాస్‌ సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే శ్రీనివాస్‌ బ్యాంకు అప్పులు, చెల్లెలి పెళ్లికి చేసిన అప్పులు వంటి వాటితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ ఈనెల 4వ తేదీన సునీత ఇంటికి వెళ్లాడు. అప్పటికే సునీత కుమార్తె (10) ఇంట్లో ఉంది. బంగారం, సొమ్ము అపహరించేందుకు వచ్చిన శ్రీనివాస్‌ ఇంట్లోకి రాగానే ఆ చిన్నారి ఎందుకు వచ్చావని ప్రశ్నించింది. ఫ్యాన్‌ రిపేరు చేయటానికి వచ్చానని అబద్ధం చెప్పాడు. దీంతో ఫ్యాన్‌ బాగానే ఉంది కదా అమ్మకు ఫోన్‌ చేసి చెబుతాను అని ఫోన్‌ చేస్తుండగా తన బండారం ఎక్కడ తెలిసిపోతుందోనని ఇంట్లో మంచం మీద ఉన్న చున్నీని బాలిక మెడకు చుట్టి మంచంపైకి తోసి అమె ముఖాన్ని మంచంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బాలిక శవాన్ని చున్నీతో ఫ్యాన్‌కు ఉరితీయటం ద్వారా ఆత్మహత్యగా చిత్రీకరించాడు. తనకు ఉన్న అనుభవంతో తలుపులు లోపల గడియపెట్టి వెళ్లిపోయాడు. తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సునీత తన కూతురు ఉరి వేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఇంట్లోనే ఉంటూ తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించిన శ్రీనివాస్‌, ఏం జరుగుతుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు లీకులు ఇస్తూ ఉండేవాడు. ఫోరెన్సిక్‌ నిపుణులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాలిక మృతిలో అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌పై పోలీసులకు అనుమానం వచ్చి అతని వేలిముద్రలు కూడా సేకరించారు. అయితే ఇంట్లో ఉన్న ఫ్యానుకు, తదితర చోట్ల ఉన్న వేలిముద్రలతో సరిపోలడంతో అతడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ రాహుల్‌ మీనా వెల్లడించారు. రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్‌, సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఎస్‌.నాగేశ్వరరావు ఎంతో చాకచక్యంగా అన్ని కోణాల్లోను దర్యాప్తు చేయటంతో శ్రీనివాస్‌ బాలికను హత్య చేసినట్లు నిర్థారించినట్టు ఎస్పీ వెల్లడించారు. అప్పుల పాలైన శ్రీనివాస్‌ దొంగతనం చేసే ప్రయత్నంలో బాలికను హతమార్చినట్లు తెలిపారు. అన్ని కోణాల్లోను దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.

  • బతుకు

    గండేపల్లి: బతుకుతెరువు కోసం జిల్లా దాటి వచ్చిన వారు విగత జీవులయ్యారు. యజమానిని రక్షించే యత్నంలో సహాయకుడితో సహా విద్యుదాఘాతానికి గురై సెకన్ల వ్యవధిలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. పోలీసుల కధనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగరవం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపెట్టి సింహాద్రి(57) తన దగ్గర ఉన్న వరికోత యంత్రంతో స్థానికంగా పలు ప్రాంతాల్లో వరి కోత కోస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మండలంలోని గండేపల్లి, రామయ్యపాలెం మీదుగా ఐషర్‌ వ్యాన్‌లో వరికోతకు యంత్రాన్ని తీసుకువెళ్తున్నాడు. రామయ్యపాలెం గ్రామ శివారుకు వచ్చే సరికి యంత్రం పైపునకు 11 కేవీ విద్యుత్‌ తీగలు అడ్డం వచ్చాయి. వాటిని తొలగించేందుకు డ్రైవింగ్‌ సీటు నుంచి కిందకు దిగిన సింహాద్రి వ్యాన్‌కు అడుగు భాగంలో కర్రను తీసే యత్నంలో తలుపుపై చేయి వేయడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ వెనుకే మోటారు సైకిల్‌పై వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన సహాయకుడు గెడ్డం సందీప్‌ (17) సింహాద్రిని రక్షించబోయాడు. దీంతో అతడు సైతం విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఓనర్‌ కం డ్రైవర్‌గా పనిచేసుకుంటున్న సింహాద్రికి భార్య విజయలక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సందీప్‌కు తల్లి, తండ్రి, ఇద్దరు అక్కలు ఉండగా మరో అక్కకు వివాహం కావాల్సి ఉందన్నారు.

    సీతానగరానికి కోతలకు వెళ్తుండగా..

    కలవచర్లలో శనివారం వరికోత ముగించుకున్న సింహాద్రి, సందీప్‌లు ఆదివారం సీతానగరం వెళ్లాల్సి ఉండగా ఇక్కడకు వచ్చి ఇలా మృతి చెందారని వరికోత యంత్రాన్ని పురమాయించిన వ్యక్తి పేర్కొన్నాడు. చాలా కాలంగా కిందికి వేలాడుతున్న విద్యుత్‌ తీగలను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదస్థలం వద్దకు చేరుకున్న సీఐ వైఆర్కే శ్రీనివాస్‌, ఎసై యు.వి.శివ నాగబాబు, సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెడ్‌.రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. విద్యుత్‌శాఖ ఏఈ సంఘటన వద్ద ప్రమాదకరంగా ఉన్న తీగలను సరిచేయించారు.

    గమనించి ఉంటే ప్రమాదం తప్పేది

    సింహాద్రి వెళ్తున్న మార్గంలో కొద్ది నిమిషాల ముందు మరో వాహనం వరికోత యంత్రాన్ని తీసుకువెళ్లిందని ఆ వాహన డ్రైవర్‌ సమాచారం అందజేసేంతలో ఇలా జరిగిపోయిందని స్తానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామస్తులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు అందజేసే యత్నం చేసినప్పటికి ప్రయోజనం లేకపోయిందన్నారు.

    వరికోత యంత్రానికి

    విద్యుత్‌ తీగలు తగిలి ఘటన

    యజమానితో సహా సహాయకుడూ

    క్షణాల్లో మృతి

    మృతులిద్దరూ ‘పశ్చిమ’ వాసులే

  • శెట్టిబలిజలు అన్నింటా ఉన్నతంగా ఉండాలి

    అమలాపురం టౌన్‌: శెట్టిబలిజ సామాజక వర్గీయులంతా అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని, అందరూ చదువుకుని అక్షరాస్యత శాతాన్ని పెంచినప్పుడే సామాజిక అభివృద్ధి సాకారమవుతుందని రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పిలుపునిచ్చారు. కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధన కమిటీ ఽఆధ్వర్యంలో అమలాపురంలోని వాసర్ల గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి బోస్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శెట్టిబలిజ సామాజిక వర్గంలో అక్షరాస్యత ప్రస్తుతం 67 శాతం మాత్రమే ఉందని, ఇది మరింత పెరిగినప్పుడే మనం అన్నింటా అభివృద్ధి చెందుతారని ఆయన ఆక్షాంక్షించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పెచ్చెట్టి చంద్రమౌళి తదితర ప్రముఖలు హాజరై ప్రసంగించారు. అమలాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి నాగేంద్రమణి, అమలాపురం, అల్లవరం, అంబాజీపేట ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధన కమిటీ ప్రతినిధులు దొమ్మేటి మీరా సాహెబ్‌ శెట్టి, సంసాని బులినాని, చెల్లుబోయిన శ్రీనివాసరావు, పితాని బాలకృష్ణ, మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి బాబు, వాసంశెట్టి తాతాజీ, గొవ్వాల రాజేష్‌, చిట్టూరి పెదబాబు, గుత్తుల చిరంజీవిరావు, కుడుపూడి సత్య శైలజ, విత్తనాల శేఖర్‌, కుడుపూడి భరత్‌ భూషణ్‌, విత్తనాల మూర్తి, కముజు రమణ, దొమ్మేటి రాము, కేతా భాను, దంగేటి రుద్ర, వాసర్ల వెంకన్న, దొంగ నాగ సుధారాణి, చొల్లంగి సుబ్బిరామ్‌ తదితరులు కార్తిక వన సమారాధనలో సేవలు అందించారు. కోనసీమ వ్యాప్తంగా శెట్టిబలిజ సామాజిక వర్గీయులు దాదాపు 15 వేల మంది కుటుంబ సమేతంగా హజరై వేడుకల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. తొలుత శెట్టిబలిజ నేతలు ఉసిరి చెట్టు వద్ద కార్తిక వన పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం అంతా సహ పంక్తి భోజనాలు చేసి ఆత్మీయతను చాటారు.

    విద్యావంతులై ప్రయోజకులు కావాలి కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధనలో ఎంపీ బోస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న

    ఎమ్మెల్సీ శ్రీనివాస్‌, మాజీ మంత్రి వేణు

  • షార్ట్‌ సర్క్యూట్‌తో తాటాకిళ్లు దగ్ధం

    రూ.15 లక్షల ఆస్తి నష్టం

    అంబాజీపేట: స్థలం కొనుగోలు కోసం అప్పు చేసి మరి కొద్ది సమయంలో ఆ మొత్తాన్ని అందజేస్తామనుకుంటే కళ్ల ఎదుటే రూ.7 లక్షలు కాలిపోయాయని బాధితులు బావురుమన్నారు. కె.పెదపూడి తిరుమనాథంవారిపాలెం శివారులో ఆదివారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధం కాగా నాలుగు కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు, ఈతకోట సుబ్బారావు, ఈతకోట శ్రీనివాసరావు, ఈతకోట ఈశ్వరరావు, ఈతకోట మంగాయమ్మలకు చెందిన రెండు తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత సుబ్బారావు, శ్రీనివాసరావులు నివాసమున్న ఇంటికి మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఈశ్వరరావు, మంగాయమ్మల ఇంటికి వ్యాపించాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇంటిలో ఉన్న సిలిండర్‌ పేలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో స్థలం కొనుగోలు కోసం ఇంటిలో దాచుకున్న సుబ్బారావుకు చెందిన రూ.1.5 లక్షల నగదు, 12 గ్రాముల బంగారం, అతని కుమారుల స్టడీ సర్టిఫికెట్లు, శ్రీనివాసరావుకు చెందిన రూ.2.5 లక్షల నగదు, 18 గ్రాముల బంగారం, విదార్హత సర్టిఫికెట్లు, మంగాయమ్మకు చెందిన రూ.1.5 లక్షల నగదు, 18 గ్రాముల బంగారం, విద్యార్హత సర్టిఫికెట్లు, ఈశ్వరరావుకు చెందిన రూ.2,7 లక్షల నగదు, 14 గ్రాముల బంగారం, స్టడీ సర్టిఫికెట్లు, గృహోపకరణాలు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. మొత్తంగా రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అమలాపురం అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనం లోపలకు వచ్చే అవకాశం లేకపోవడంతో స్థానికులు మంటలను అదుపు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. అంబాజీపేట భవాని సేవా సమితి ఆధ్వర్యంలో గురు భవానీలు దంగేటి సాయిబాబు, మల్లేశ్వరి దంపతులు, మట్టపర్తి ఏసు, మట్టపర్తి శ్రీనివాస్‌, పాటి శేఖర్‌, గుత్తుల పండు, పితాని శ్రీనులు బాధితులకు 50 కేజీల బియ్యం, చీరలను పంపిణీ చేశారు. సంఘటనా స్థలాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించి బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం 10 కేజీల చొప్పున బియ్యం, కేజీ బంగాళదుంపలు, వంట నూనె, ఉల్లిపాయలను అంజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కె.ఏడుకొండలు, వీఆర్వో వెంకటరమణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

  • శతాధిక వృద్ధుడి మృతి

    కరప: మండలం కూరాడ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధ పాస్టర్‌ మోర్త అండ్రేయ (104) ఆదివారం మృతి చెందారు. ఆండ్రేయ సొంత గ్రామం రామచంద్రపురం సమీపంలోని నరసాపురపేట. ఆ గ్రామం నుంచి 1975లో కరప మండలం కూరాడ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. కొద్దిరోజుల ముందు వరకు ఆయన సువార్త చెప్పేవారు. ఇంతవరకు ఆయన తన పనులు తానే చేసుకునేవారని, వయసురీత్యా కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం పరలోకగతులయ్యారని బంధువులు తెలిపారు. ఆయనకు ముగ్గురు కుమారు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆండ్రేయ మృతికి మండల అంబేడ్కర్‌ యువజనసేవా సంఘం ప్రతినిధి చిన్నం వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు సంతాపం వ్యక్తంచేశారు.

    పెట్రోలు బంక్‌లో అగ్నిప్రమాదం

    తప్పిన పెనుముప్పు

    కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న భారత్‌ పెట్రోలియం బంక్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బంకుకు వచ్చిన వాహనం నుంచి ఒక వాల్వు తెరచి డీజిల్‌ అన్‌లోడ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా స్పార్క్‌ వచ్చి నిప్పు అంటుకుంది. ఈ హఠాత్‌ పరిణామంతో పెట్రోలు కోసం వచ్చిన వినియోగదారులు, చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. ఇంతలో పక్కనే ఉన్న అగ్నిమాపక కార్యాలయం సిబ్బంది సమాచారం తెలుసుకుని వచ్చి ఏ త్రిబుల్‌ ఎఫ్‌ ఫోమ్‌ (నురగ) ను చల్లి మంటలను అదుపు చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేలు ఆస్తినష్టం వాటిలినట్లు అగ్నిమాపకశాఖాధికారి పేరూరి శ్రీనివాస్‌ తెలిపారు.

    09కెకెడి125–270023: ఆండ్రేయ (ఫైల్‌)

    ఆండ్రేయ (ఫైల్‌)

  • గోదావరిలో మునిగి  విద్యార్థి మృతి

    కపిలేశ్వరపురం (మండపేట): అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నామాడి బన్ను (17) గౌతమి గోదావరి నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్‌ కథనం ప్రకారం బన్ను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు వీధివారిలంకలోని పర్యాటక కేంద్రం ధనమ్మమర్రికి వచ్చాడు. స్నేహితులతో కలిసి గోదావరిలో స్నానానికి దిగారు. ఇంతలో బన్ను ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి అబ్బులు ఫిర్యాదుపై మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. అబ్బులుకు బన్ను పెద్ద కుమారుడు కాగా చిన్న కుమారుడు అభిషేక్‌ ఆరో తరగతి చదువుతున్నాడు.

    పుల్లేటికుర్రులో విషాదఛాయలు

    అంబాజీపేట: అప్పటివరకు స్నేహితులతో ఉల్లాసంగా గడిపిన బన్ను నీట మునిగి మృతి చెందడంతో చీకురుమెల్లివారిపేటలో విషాదం అలుముకుంది. బన్ను స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, అతని తండ్రి నామాడి అబ్రహం ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బన్ను మృతి వార్త తెలిసి గ్రామ సర్పంచ్‌ జల్లి బాలరాజు, ఉప సర్పంచ్‌ వీరా రవి, ఎంపీటీసీలు కుసుమ వెంకటేష్‌, వడలి కృష్ణమూర్తి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.

    వివాహిత ఆత్మహత్య

    కపిలేశ్వరపురం: భర్త వ్యవహార శైలితో మనస్తాపానికి గురై మండపేట మండలం ద్వారపూడి గ్రామ శివారు వేములపల్లికి చెందిన మట్టా రేఖ (24) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వి.కిశోర్‌ కథనం ప్రకారం రేఖకు అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన మట్టా వేణుతో వివాహమైంది. కొంతకాలం క్రితం రేఖ వేములపల్లిలోని తండ్రి నేదునూరి శ్రీను ఇంటికి ప్రసవానికి వచ్చింది. ఆ సమయంలో రేఖ, వేణుల మధ్య తరచుగా ఫోన్‌లో వాగ్వాదం జరిగేది. దీంతో మనస్తాపం చెందిన రేఖ ఆదివారం వేములపల్లిలోని కొబ్బరితోటలో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిశోర్‌ తెలిపారు. రేఖకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు.

  • అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌

    కొబ్బరి రకం ధర (రూ.ల్లో)

    కొత్త కొబ్బరి (క్వింటాల్‌) 20,000 – 22,500

    కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000

    కురిడీ కొబ్బరి (పాతవి)

    గండేరా (వెయ్యి) 30,000

    గటగట (వెయ్యి) 28,000

    కురిడీ కొబ్బరి (కొత్తవి)

    గండేరా (వెయ్యి) 29,000

    గటగట (వెయ్యి) 27,000

    నీటికాయ

    పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000

    కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,500

    కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250

    కిలో 350

Eluru

  • వైద్య

    ఏలూరు టౌన్‌: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రతిష్టను మంటకలిపేలా అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఏలూరు జీజీహెచ్‌ ప్రాంగణంలో వైద్య విద్యార్థులకు హాస్టల్‌ ఏర్పాటు చేయగా తాజాగా ఆరుగురు విద్యార్థులపై ఎలుకల దాడి ఆందోళనకు గురిచేస్తోంది. ఎంబీబీఎస్‌ విద్యార్థులకు సరైన వసతి కల్పించటంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. ఆఖరికి కాంట్రాక్టర్‌తో సైతం పనులు చేయించుకోలేని దుస్థితిలో అధికారులు ఉండటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఏలూరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

    ఆందోళనలో విద్యార్థులు

    ఏలూరు జీజీహెచ్‌ ప్రాంగణంలో ఎంసీహెచ్‌ భవనంపై అంతస్తులో 2023 సెప్టెంబర్‌ 15నాటికి ఫస్టియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులకు హాస్టల్‌ ఏర్పాటుచేశారు. ఒకవైపు బాలికలకు, మరోవైపు బాలురకు వేర్వేరుగా హాస్టల్‌ వసతి కల్పించారు. రెండో ఏడాది ఇదే చోట వసతి కల్పించగా.. తాజాగా మూడో ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు మాత్రం కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్‌ భవనంలో వసతి ఏర్పా ట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎంసీహెచ్‌ భవనంపై అంతస్తులో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆరుగురిని ఎలుకలు కరవగా, వారంతా జీజీహెచ్‌లో ఎమర్జెన్సీ విభాగంలో ఏఆర్‌వీ ఇంజెక్షన్లు చేయించుకున్నట్టు చెబుతున్నారు.

    కాంట్రాక్టర్‌ తీవ్ర నిర్లక్ష్యం

    ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాస్పత్రిలో పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. భారీగా నిధులు చెల్లిస్తున్నా పనులు మాత్రం లేవనే ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ హాస్టల్స్‌లోనూ ఎలుకలు, పిల్లులు, చెదలు, పాములు ఇలాంటి వాటి నివారణకు ప్రత్యేకంగా సాయి పెస్ట్‌ కంట్రోల్‌ సర్వీసెస్‌కు కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. నెలకు సుమారు రూ.4.68 లక్షల వరకూ ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. అయితే కాంట్రాక్టర్‌ పనులేమీ చేయకుండా జేబులు నింపుకుంటున్నాడనీ, అధికారులు సైతం ఏం మాట్లాడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్‌ నలుగురు సిబ్బందిని నియమించినా వారు కూడా విధుల్లో కనిపించరని అంటున్నారు. జోన్‌–2 పరిధిలో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని జీజీహెచ్‌లు, మెడికల్‌ కాలేజీలు, సీహెచ్‌సీ, ఏరియా హాస్పిటళ్లలో పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్ట్‌ అతనిదేనని చెబుతున్నారు.

    గతంలో శవాలను వదల్లేదు

    ఏలూరు జీజీహెచ్‌ మార్చురీలో గతంలో శవాలనూ ఎలుకలు వదల్లేదు. మార్చురీలోని మృతదేహాల ముక్కులు, చెవులను ఎలుకలు కొరుక్కుతిన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది అప్పట్లో సంచలనం అయ్యింది. అలాగే ఏలూరు సర్వజన ఆస్పత్రిలోనూ రోగులకు ఎలుకల బెడద ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

    హాస్టల్‌ విద్యార్థులపై దాడి

    ఆరుగురు విద్యార్థులను కరిచిన వైనం

    కాంట్రాక్టర్‌ నిర్లక్ష్య వైఖరి

    వైద్యారోగ్య శాఖ మంత్రి ఆగ్రహం

    గతంలో మార్చురీలో శవాలనూ ఎలుకలు కొరికిన సంఘటనలు

    ఎంసీహెచ్‌ భవనంపై అంతస్తులోని హాస్టల్‌ను మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సావిత్రి ఆదివారం పరిశీలించారు. సౌకర్యాలపై విద్యార్థిను లను ఆరా తీశారు. ఎలుకలు కరిచిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో ఎలుకల కోసం సిబ్బందితో బోనులు ఏర్పాటు చేయించారు. కొన్నిచోట్ల కిటికీలు, తలుపులకు రంధ్రాలు ఉండటంతో వాటిని మూయించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కా కుండా పటిష్ట చర్యలు తీసుకుంటామనీ, ఆందోళనకు గురికావద్దని భరోసా కల్పించారు. కాంట్రాక్టర్‌తో గతంలో ర్యాట్‌మ్యాట్‌లు పెట్టించటంతోపాటు, స్ప్రే చేయించామనీ, ఎలుకల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టేలా కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. హాస్టల్‌లో పరిస్థితులపై వైద్య విద్యార్థులు, వార్డెన్స్‌తోనూ మాట్లాడతామనీ, విచారణ అనంతరం చర్యలు చేపడతామని చెప్పారు.

    వైద్య విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపించాలనీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, ని ర్వహణ సంస్థ, హాస్టల్‌ వార్డెన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు డీఎంఈ రఘునందన్‌ పెస్ట్‌ కంట్రోల్‌ సర్వీసెస్‌ సంస్థకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వార్డెన్‌కు మెమో ఇవ్వాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ సావిత్రిని ఆదేశించారు. వెంటనే వైద్య విద్యార్థుల వసతి గృహాన్ని సందర్శించి నివేదిక సమర్పించాలన్నారు.

  • మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం

    నూజివీడు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పా టు చేసిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 12న పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నామని, ప్రజలంతా పాల్గొనాలని కోరారు. వైఎస్‌ జగన్‌ పాలనలో 17 ప్రభుత్వ కళాశాలలను తీసుకొస్తే నేడు కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతినిచ్చిన సీట్లను సైతం సీఎం చంద్రబాబు వెనక్కి పంపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు దోచి పెట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే 17 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని, దీంతో రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించే వారి సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. తద్వారా వైద్యుల కొరతను అధిగమించవచ్చన్నారు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేదలకు ఉచిత వైద్యం దూరమవుతుందన్నారు. ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందని, అన్నివర్గాలు కలిసి రావాలని కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొమ్ము వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గుడిమళ్ల కృష్ణంరాజు, పార్టీ మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడు మలిశెట్టి బాబీ, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్‌, క్రిస్టియన్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్‌, కౌన్సిలర్‌ మీర్‌ అంజాద్‌ ఆలీ, నాయకులు పాల్గొన్నారు.

  • క్షీరారామం.. ప్రహరీ శిథిలం

    ప్రమాదకరంగా బేడా మండపం ప్రహరీ గోడ

    వర్షాలతో అండలుగా పడిపోతున్న వైనం

    కర్రలను అడ్డుపెట్టిన ఆలయ అధికారులు

    పాలకొల్లు సెంట్రల్‌ : పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రహరీ గోడ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. ఆలయానికి పడమర వైపు ప్రహరీ గోడ బేడా మండపం వెనుక భాగంలో సుమారు 15 అడుగుల మేర అండలుగా పడిపోయింది. దీంతో ఆలయం వైపు సరస్వతీ దేవి, కుమారస్వామి, మహిషాసురమర్ధినీ విగ్రహాలు ఉండే ప్రాంతంలో బీటలు తీసినట్టుగా కనిపిస్తుంది. ఆలయ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రాంతంలో భక్తులు ప్రదక్షిణలు చేయకుండా కర్రలు అడ్డుగా కట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పడమర గోడకు వెలుపల వైపు (గోళి గుంట) పురావస్తు శాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని ఆనుకుని ఉన్న ఈ గోడ అండలుగా పడిపోయింది. సుమారు ఆరు నెలల క్రితం పురావస్తు శాఖ అధికారులు ఈ గోళీ గుంటను శుభ్రం చేయించారు. స్థలం ఖాళీగా ఉండడంతో వర్షానికి నీరు ఇంకి గోడ పడిపోయిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం చుట్టూ ఉండే ఈ బేడా మండ పం ప్రహరీ గోడతో కలిసి ఉంటుంది. మండపానికి లీకేజీలతో పలుచోట్ల వర్షం నీరు కారుతోంది. అలా గే స్వామివారి సోమసూక్తం వద్ద (జనార్దనస్వామి ఆలయం పక్కన ఉన్న) మండపం పరిధిలో మూడు స్తంభాలు పక్కకు ఒరిగిపోయాయి. మండపం లీకేజీలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పురావస్తు, దేవదాయశాఖ అధికారులు ఆలయాన్ని పరిశీలించి పర్వాలేదనడం గమనార్హం. కార్తీకమాసం కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆలయ అధికారులు ప్రమాదకరంగా ఉన్న ప్రాంతంలో కర్రలు కట్టారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తే నియంత్రించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.

    గతంలో ఉత్తరం వైపు..

    గతంలో ఆలయం ఉత్తరం వైపు దక్షిణామూర్తి, నటరాజస్వామి, బాణాసురుడు, దత్తాత్రేయులు, కాలభైరవుడు, నాగేంద్రుడు విగ్రహాలు ఉన్న ప్రహరీ గోడ వెలుపల వైపు (గోశాల వైపు) పడిపోయింది. దానికి మరమ్మతులు చేసి ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. గోడ మొత్తం అడుసుతో కట్టినట్టుగా ఉంది. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పంచారామ క్షేత్రానికి రద్దీ ఎక్కువగా ఉంటుందని, బేడా మండపం ప్రహరీ గోడను పునఃనిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

  • కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

    భీమడోలు: మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోకుంటే కూటమి ప్రభుత్వానికి ప్రజా ఉద్యమంతో ప్రజలే గుణపాఠం చెబుతారని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. పూళ్లలోని జిల్లా అధికార ప్రతినిధి కందులపాటి శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆదివారం ఈనెల 12న వైఎస్సార్‌ సీపీ తలపెట్టిన ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నియోజకవర్గ స్థాయిలో జరిగే నిరసన ర్యాలీలో నాలుగు మండలాల పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. ఉంగుటూరులో మండల అధ్యక్షుడు మరడ మంగారావు కోత మెషీన్‌ వద్ద నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేపడతామన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను పేదలు, మధ్యతరగతి వర్గాలకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుందని, దీనిని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కందులపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్‌, పార్టీ రాష్ట్ర యూత్‌ కార్యదర్శి మద్దుల రాజా, ఉంగుటూరు మండల అధ్యక్షుడు మరడ వెంకట మంగారావు, నియోజకవర్గ బీసీ సెల్‌ కన్వీనర్‌ తుమ్మగుంట రంగా, మండల ఉపాధ్యక్షుడు రామకుర్తి నాగేశ్వరరావు, జిల్లా నాయకులు యెలిశెట్టి పాపారావుబాబ్జి, ఎంపీటీసీ గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ పంచాయతీరాజ్‌ సెల్‌ కన్వీనర్‌ రామిశెట్టి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయవాది మద్దాల రాజేష్‌, మాజీ ఎంపీటీసీ పచ్చా బాబి, నాయకులు పాల్గొన్నారు.

  • నిరసన ర్యాలీని జయపద్రం చేయండి

    కై కలూరు: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 12న కై కలూరు నియోజకవర్గంలో జరిగే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మె ల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) కోరారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో ర్యాలీ పోస్టర్లను ఆదివారం అవిష్కరించారు. బుధవారం ఉదయం 9 గంటలకు నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు కై కలూరు సంత మార్కెట్‌ దివంగత వైస్‌ విగ్రహం వద్దకు రావాలన్నారు. అక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి గుమ్మడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి బలే నాగరాజు, రాష్ట్ర మైనారిటీ విభాగ కార్యదర్శి ఎండి.గాలిబ్‌బాబు, మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాము, ఏసేబురాజు, రామరాజు, జిల్లా అధికార ప్రతినిధి మొట్రూ యేసుబాబు పాల్గొన్నారు.

    వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

  • హక్కుల పరిరక్షణకే చట్టాలు

    భీమవరం: ప్రజల హక్కుల పరిరక్షణకు చట్టాలు రూపొందించబడ్డాయని, చట్టాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా శిక్షార్హులేనని భీమవరం ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌), జుడీషియల్‌ మొ దటి తరగతి మేజిస్ట్రేట్‌ జి.సురేష్‌బాబు అన్నారు. ఆదివారం జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్బంగా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రత్యేక ఉపకారాగారంలో ఏర్పాటుచేసిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన ముద్దాయిలతో మా ట్లాడి కేసు వివరాలు, పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేక న్యాయవాదిని పెట్టుకోలేకపోతే మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. జైలు సూపరింటెండెంట్‌ డి.వెంకటగిరి జైలులో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. న్యాయమూర్తి మధ్యాహ్న భోజనాన్ని, బియ్యం, పప్పుదినుసులను పరిశీలించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యేలేటి యోహాను పాల్గొన్నారు.

  • నిర్వాసితులకు న్యాయం చేయాలి

    మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

    బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం విషయంలో వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. మండలంలోని దుద్దుకూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి నాయకులతో కలిసి అధికారులు కమీషన్‌ రూపంలో దండుకోవాలని చూడటం బాధాకరమన్నారు. నిర్వాసితుల పక్షాన ఉంటూ వారికి న్యాయం చేయాల్సిన అధికారులు కూటమి నాయకులకు కొమ్ము కాస్తూ, నిర్వాసితులను నాయకుల వద్దకు వెళ్లి మాట్లాడుకోండని చెప్పడం సరికాదన్నారు. కూట మి నాయకులకు కమీషన్‌ ఇవ్వకపోతే క్రిమినల్‌ కేసులు పెట్టి జైలులో వేస్తామని సాక్షాత్తూ ఐటీడీఏ పీఓ బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నా రు. అలాగే ప్రస్తుతం నిర్వాసితులకు సేకరిస్తున్న భూములపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయని, భూసేకరణలో దళారులు ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

Telangana

  • జగిత్యాల జిల్లా: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం కండ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. బీర్‌పూర్‌ ఎస్సై రాజు వివరాలు తెలిపారు. కండ్లపల్లికి చెందిన శ్రీరాముల నవత తన ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని, వాటిని తీయడానికి ముగ్గురు వ్యక్తులను సంప్రదించింది. జగిత్యాల రూరల్‌ మండలం అనంతారం గ్రామానికి చెందిన నారవేణి మొగిలి, గోవిందుపల్లెకు చెందిన వరికొప్పుల సోమయ్య, ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన భైరవేణి రాజుతో గుప్తనిధులు వెలికితీయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 

    అనుకున్న ప్రకారం శనివారం రాత్రి సమయంలో ఇంట్లో కరెంట్‌ లేకుండా ఫ్యూజ్‌లు తొలగించి చీకట్లోనే తవ్వకాలు ప్రారంభించారు. 8 ఫీట్ల లోతు గుంత తవి్వనప్పటికీ ఏమీ లభించకపోవడంతో నారవేణి మొగిలి పైకి ఎక్కాడు. అయితే అప్పటికే తొలగించిన ఫ్యూజ్‌లో మొగిలి చేయి తగలడంతో షాక్‌ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి భార్య నారవేణి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్‌ సీఐ సుధాకర్, ఎస్సై రాజుతో కలిసి పరిశీలించారు. 

  • నిర్మల్ జిల్లా: జంట నగరాలుగా పేరొందిన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పట్టణంలోని తిమ్మాపూర్‌(తిమ్మబోయి), ఖానాపూర్‌(ఖానాబోయి) వీడీసీల ఆధ్వ ర్యంలో జేష్టక్క పండుగను ఆదివారం నిర్వహించారు. జేష్టక్క పో.. లచ్చక్క రా.. అని నినదిస్తూ పురుషులు జేష్టాదేవి దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఇళ్లలోని పాత చీపుళ్లు, చేటలు, బూజు కర్రలు, చెప్పులు, పాత గంపలు, పాత దుస్తులతో జేష్టాదేవిని తరిమి కొడుతున్నట్లుగా ఊరేగింపులో పాల్గొన్నారు.

     ఊరి పొలిమేర వరకు వెళ్లి దిష్టిబొమ్మలను అక్కడే వదిలేశారు. అనంతరం సమీపంలోని వాగులో స్నానాలు చేసి అక్కడే అందరూ దుస్తులు మార్చుకుని పూజలు చేశారు. లక్ష్మీదేవి తమ గ్రామంలోకి రావాలని ఆహా్వనించారు. అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకుని ఇళ్లకు వచ్చారు. వీరికి గృహిణులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ పండుగ అనాది నుంచి వస్తున్న ఆచారంలో భాగమని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఐదేళ్లకోసారి నిర్వహించేవారమని, ఈసారి 12 ఏళ్ల తర్వాత నిర్వహించామని పేర్కొన్నారు.   

Ananthapur

  • గార్లదిన్నె: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమం ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని కొప్పల కొండలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ–రచ్చబండ కార్యక్రమానికి ‘అనంత’, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్‌, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌ఎం మోహన్‌ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నార్పల సత్యనారాయణరెడ్డి, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ ఈనెల 12న శింగనమలలో జరగనున్న ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 40 శాతం మంది ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు ఉన్నారన్నారు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తే, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పథకాన్ని మరింత బలోపేతం చేశారన్నారు. నేడు సీఎం చంద్రబాబు ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చి పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేశారన్నారు. మెడికల్‌ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. మెడికల్‌ కళాశాలల విషయమై తీవ్ర ఒత్తిడి చేస్తున్నా చంద్రబాబు మొండిపట్టు వీడడం లేదన్నారు. కోటి సంతకాల సేకరణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కరువుతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యేలంతా మద్యం అమ్ముకొని బతుకుతున్నారని విమర్శించారు. డిసెంబర్‌ ఆఖరుకల్లా గ్రామాల్లో కమిటీలు పూర్తి చేయాలన్నారు.

    ప్రజల పక్షాన పోరాటం..

    రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకై క నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే అని సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మాట్లాడితే చాలు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. తుపాన్‌ వల్ల పంటలు నష్టపోతే చినబాబు లోకేష్‌ క్రికెట్‌ చూడటానికి వెళ్తారా అని నిలదీశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉండేవారన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరే కంగా చంద్రబాబు రూ. వందల కోట్ల విలువైన భూములను రూ.99 పైసలకే కట్టబెడుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ ఎల్లారెడ్డి, సర్పంచు రామాంజనేయులు, ఎంపీపీ వెంకటనారాయణ, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రసాద్‌, చామలూరు రాజగోపాల్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఆంజనేయులు, రైతు విభాగం అధ్యక్షులు పుల్లారెడ్డి, బూత్‌ కమిటీ అధ్యక్షులు ఓబిరెడ్డి, మేధావుల ఫోరం అధ్యక్షులు అనిల్‌ కుమార్‌ రెడ్డి, ఆర్టీఐ విభాగం అధ్యక్షులు నాగరాజు, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు నారాయణ స్వామి, ఆయా మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

    ‘ప్రజా ఉద్యమం ర్యాలీ’ని

    జయప్రదం చేయండి

    వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

    అనంత వెంకటరామిరెడ్డి పిలుపు

  • ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతాం

    ఉరవకొండ: ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజల మద్దతుతో అడ్డుకుని తీరతామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న ఉరవకొండలో నిర్వహించే నిరసన ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్లను పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ‘విశ్వ’ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దన్నర కాలం సీఎంగా ఉండీ ఒక్క మెడికల్‌ కళాశాల కూడా ఏర్పాటు చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు. అలాంటి వ్యక్తి నేడు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌కు అప్పజెప్పాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. బాబు నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్‌ కళాశాలలను తీసుకొచ్చి అందులో 5 పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే కళాశాలల నిర్మాణం పూర్తై 1,300 మెడికల్‌ సీట్లు రాష్ట్రానికి మంజూరయ్యేవన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. పీపీపీ విధానానికి మద్దతు తెలుపుతున్నారా లేదా అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం ఒక వైపు వైద్య విద్యను ప్రైవేట్‌ పరం చేస్తూ, మరోవైపు ఆరోగ్య శ్రీ సేవలకు మంగళం పాడిందన్నారు. పేదల ఆరోగ్యాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, వైస్‌ ఎంపీపీ ఈడిగప్రసాద్‌, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, పార్టీ మండల, రూరల్‌ సమన్వయకర్తలు ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, హవళిగి భరత్‌రెడ్డి, డిష్‌ సురేష్‌, లత్తవరం గోవిందు, నాయకులు పచ్చిరవి, ధనంజయ, ఈశ్వర్‌, అంగదాల అంజి, కురుబ ప్రకాష్‌, గంగాధర్‌, వేమన్న, వడ్డే ఆంజినేయులు, బెలగల్‌షమ్ము, టైలర్‌ శర్మాస్‌, చిన్నభీమా, మహానంది, నాగరాజు, జేసీబీ రామకృష్ణ, గంధోడి మారేష్‌, కమ్మటి రామాంజినేయులు, ఎర్రిస్వామి పాల్గొన్నారు.

    ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలపై

    బాబు తీరు దుర్మార్గం

    వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు

    వై. విశ్వేశ్వర రెడ్డి

  • కూటమి నేతల ఇష్టారాజ్యం

    రాయదుర్గం: బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు సమీపాన కూటమి నాయకుడు మైనింగ్‌ డాన్‌గా రెచ్చిపోతున్నాడు. 2019–14 మధ్య కంకర క్వారీల్లో జరిగిన అక్రమాలను అప్పటి టీడీపీ హయాంలోనే గుర్తించి రూ.13.19 కోట్ల జరిమానా విధించారు. కానీ నేటికీ పైసా చెల్లించలేదు. 2024 సెప్టెంబర్‌ ఏడో తేదీన జరిమానాపై పునఃపరిశీలన జరపాలని కూటమి సర్కార్‌ గనుల శాఖను ఆదేశించింది. ఈ మొత్తం రూపుమాపేలా కూటమి నాయకుడు చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ఇతనొక్కడే కాదు..మరికొందరు కూటమి నాయకులు అధికారం అండతో రెచ్చిపోతూ దోపిడీ కొనసాగిస్తున్నారు. జిల్లాలోని కర్ణాటక సరిహద్దున ఉన్న డి.హీరేహాళ్‌, బొమ్మనహాళ్‌ మండలాలు ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి. ఇక్కడ విలువైన ఐరన్‌ఓర్‌ పరిశ్రమలతో పాటు స్టోన్‌ క్వారీలు, క్రషర్ల నిర్వహణ ఎక్కువ. ఈ రెండు మండలాల్లోనే సుమారు 52 క్వారీలు, స్టోన్‌ క్రషర్లు ఉన్నాయి. వీటిలో మెజార్టీ కూటమి నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. క్వారీ లీజుదారులు విస్తీర్ణం కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా తవ్వకాలు జరిపి.. తక్కువ మొత్తం ఖనిజానికి రాయల్టీ చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. క్రషర్లలో స్టోన్‌గా మార్చి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, సండూరు, తోరణగల్లు, జిందాల్‌ తదితర ప్రాంతాలకు టిప్పర్లలో తరలిస్తున్నారు.

    నిబంధనలకు పాతర!

    కంకర క్వారీల్లో నిబంధనల ప్రకారం కంప్రెషర్‌తో గరిష్టంగా 20 అడుగులు మాత్రమే డ్రిల్లింగ్‌ చేయాలి. లైసెన్సు, అనుభవం ఉన్న వ్యక్తి పర్యవేక్షణలోనే బ్లాస్టింగ్‌ జరపాలి. అయితే..చాలా క్వారీల్లో వంద అడుగుల మేర రంధ్రాలు వేస్తూ బ్లాస్టింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల రాళ్లు, దుమ్ము ఎగిరిపడి పొలాల్లోకి చేరడంతో రైతులు పంటలు నష్టపోతున్నారు.

    నిబంధనలు పాటించాలి

    క్వారీలు, క్రషర్ల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలి. రాయల్టీ చెల్లించాకే కంకర తరలించాలి. పరిమితికి మించి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు చేపడతాం. మైనింగ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, రాయల్టీ అధికారులతో సంయుక్త తనిఖీలు జరిపి అక్రమాలుంటే చర్యలు చేపడతాం.

    – శ్రీనివాసులు, మునివేలు,

    డి.హీరేహాళ్‌, బొమ్మనహాళ్‌ తహసీల్దార్లు

    క్వారీలు, స్టోన్‌ క్రషర్ల నిర్వహణలో నిబంధనలకు నీళ్లు

  • బరితెగించిన  ‘పచ్చ’ నాయకులు

    నాయనపల్లిలో ఆర్డీటీ స్థలం

    కబ్జాకు యత్నం

    అడ్డుకున్న గ్రామస్తులు,

    వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి

    శింగనమల (నార్పల): కూటమి ప్రభుత్వంలో ‘పచ్చ’ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. స్థలాలను ఆక్రమించుకోవడమే కాకుండా అడ్డుకున్న వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా నార్పల మండలంలోని నాయనపల్లిలో ఆర్డీటీ స్థలాన్ని టీడీపీ నాయకుడు ఆక్రమించుకుంటుండగా అడ్డుకున్న గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. వివరాలు.. నాయనపల్లి దళిత కాలనీలో ఆర్డీటీ స్కూల్‌ కోసం గతంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓబిలేసు ఆ స్థలంపై కన్నేశాడు. ఆదివారం స్థలంలో పశువుల షెడ్‌ నిర్మాణానికి యత్నించాడు. ఈ క్రమంలో కాలనీవాసులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకోగా ఓబిలేసు రెచ్చిపోయాడు. ఇంతలోనే పలువురు టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని దౌర్జన్యానికి దిగారు. ఒక్కసారిగా అందరిపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో శ్రావణకుమార్‌, శశికుమార్‌, కుళ్లాయప్ప, నారాయణమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్‌ వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ సాగర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కబ్జాకు గురవుతున్న ఆర్డీటీ స్థలాన్ని పరిరక్షించాలన్నారు.

    ‘పీఎంఏవై’ గడువు పెంపు

    అనంతపురం టౌన్‌: ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద ఇళ్లు లేని నిరుపేదల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలు తమ దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పక్కా ఇంటిని మంజూరు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • ఆ ఓటర్లు ఉన్నట్టా.. లేనట్టా..?

    తాడిపత్రి రూరల్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాడిపత్రి నియోజకవర్గంలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. బోగస్‌ ఓట్లు, డబుల్‌ ఎంట్రీలు, మరణించిన వారి పేర్లు తదితరాల తొలగింపునకు ప్రాథమిక పరిశీలన చేపట్టారు. ఇటీవల 274 మంది బీఎల్వోలు రెండు ఓటర్‌ లిస్టులను ఆధారంగా చేసుకుని పరిశీలన చేశారు. 2002లో తాడిపత్రి నియోజకవర్గంలో 1,97,224 మంది ఓటర్లు ఉండగా, 2025కు సంఖ్య 2,50,391కు పెరిగింది. ఈ క్రమంలో రెండింటికి సంబంధించి 40 సంవత్సరాలకు పైబడి వయసున్న 1,27,187 మంది ఓటర్లను సరిపోల్చగా, కేవలం 48,874 మంది ఓటర్లే మ్యాచ్‌ కావడం గమనార్హం. ఏకంగా 78,313 మంది ఓటర్లు మ్యాచింగ్‌ కాకపోవడంపై అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మ్యాచింగ్‌ అయిన ఓటర్లను బీఎల్వోలు తమ లాగిన్‌లో నమోదు చేశారు. 40 సంవత్సరాల లోపు ఓటర్లకు సంబంధించి సరిపోల్చితే ఇంకెంత మంది మ్యాచ్‌ అవ్వరో తేలాల్సి ఉంది.

    కారణాలు ఇవేనా..

    ఓటర్లు సరిపోలకపోవడానికి పలు కారణాలను అధికారులు చెబుతున్నారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నాయకులు బోగస్‌ ఓట్లను ఇబ్బడిముబ్బడిగా చేర్చడం ఒక కారణమంటున్నారు. పేర్లు షార్ట్‌కట్‌ ఉండటం, సర్‌నేమ్‌లు లేకపోవడం, పేర్ల మార్పు తదితర కారణాల వల్ల కూడా మ్యాచింగ్‌ కాకపోయి ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ సోమశేఖర్‌ మాట్లాడుతూ ఎలాంటి తప్పులు లేకుండా పరిశీలన చేపడుతున్నామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నామన్నారు.

    తాడిపత్రిలో 78,313 మంది

    సరిపోలని ఓటర్లు

  • నర్సరీలో మల్బరీ మొక్కలు సిద్ధం

    అనంతపురం అగ్రికల్చర్‌: పట్టుశాఖ జిల్లా కార్యాలయ ఆవరణలో ఉన్న నర్సరీలో నాటుకునేందుకు అనువుగా ఉన్న మల్బరీ మొక్కలు విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ఈ మేరకు పట్టుపరిశ్రమ శాఖ ఎస్‌ఓ సుమాముక్తశ్రీ, టీఓ రామలింగారెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 50 వేల మొక్కలు అందుబాటులో ఉండగా, ఒక్కో మొక్క రూ.2 చొప్పున విక్రయిస్తున్నారు. మొక్క నాటుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీ రైతులకు ఎకరాకు రూ.27 వేలు, ఇతర రైతులకు రూ.22,500 చొప్పున సబ్సిడీ వర్తిస్తుంది. పూర్తి వివరాలకు 95336 01205, 99598 45950 లో సంప్రదించవచ్చు.

  • నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

    అనంతపురం అర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరిష్కార వేదిక జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి అర్జీ పరిష్కార స్థితి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.

    కలెక్టర్‌ ఆనంద్‌

  • అబ్బు

    తాడిపత్రి టౌన్‌: స్థానిక అయాన్‌ తైక్వాండో అకాడమీలో ఆదివారం ఓ చిన్నారి సాహసం అబ్బురపరిచింది. తాడిపత్రిలోని కృష్ణాపురం ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి యశ్వనిభారతి ఆరు నిమిషాల 9 సెకన్ల వ్యవధిలో వంద ట్యూబ్‌లైట్‌లను తన తలపై పగులకొట్టించి పలువురి ప్రశంసలు అందుకుంది. నోబెల్‌ వరల్డ్‌ రికార్డు కోసం ఈ విన్యాసాన్ని చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడిపత్రి రూరల్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి హాజరై, చిన్నారిని అభినందించారు.

    అమ్మోనియం నైట్రేట్‌

    డంప్‌ స్వాధీనం

    పామిడి: మండలంలోని నీలూరు మార్గంలో ఉన్న కంబగిరి రాముడు కంకర క్రషర్‌ యూనిట్‌లో అక్రమంగా డంప్‌ చేసిన 98 బస్తాల అమ్మోనియం నైట్రేట్‌ను పామిడి ఇన్‌ఛార్జ్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారంతో ఆదివారం తనిఖీలు చేపట్టి పరిమితికి మించి అమ్మోనియం నైట్రేట్‌ను డంప్‌ చేసినట్లుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    రైలు ప్రయాణికుడి మృతి

    గుంతకల్లు: తిరుమల దర్శనం కోసం వెళుతూ గుండెపోటుతో ఓ రైలు ప్రయాణికుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ఎం.రాకేష్‌ (44), తన భార్య విద్య, పిల్లలు, బంధువులతో కలసి తిరుమల దర్శనార్థం ఆదివారం ముంబయి – చెన్నె (22159) ఎక్స్‌ప్రెస్‌ రైలులో తిరుపతికు బయలుదేరాడు. రాయచూర్‌ రైల్వేస్టేషన్‌కు సమీపంలోకి రైలు చేరుకుంటుండగా రాకేష్‌కు చాతీలో నొప్పి వచ్చింది. దీంతో రాయచూర్‌ రైల్వే స్టేషన్‌ దిగేందుకు సిద్ధమవుతుండగా నొప్పి తగ్గిపోవడంతో ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలోనే మరోసారి నొప్పి మొదలు కాగానే విషయాన్ని రైల్వే సిబ్బందికి తెలిపారు. అప్రమత్తమైన రైల్వే యాజమాన్యం రైలు గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వెంటనే రాకేష్‌తో పాటు కుటుంబసభ్యులు, బంధువులను దింపి ఆగమేఘాలపై రైల్వే ఆస్సత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాకేష్‌ మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    తుంగభద్ర కాలువలో

    మరో మృతదేహం

    బొమ్మనహాళ్‌: తుంగభద్ర ఎగువ కాలువ ( హెచ్చెల్సీ) ఇప్పుడు భయానకంగా మారింది. హెచ్చెల్సీలో గత రెండు రోజుల వ్యవధిలోనే మూడు మృతదేహాలు బయటపడడంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. బొమ్మనహాళ్‌ హెచ్చెల్సీ సెక్షన్‌ పరిధిలోని డి.హీరేహాళ్‌ మండలం నాగలాపురం సమీపంలోని 117, 116 కిలోమీటర్ల వద్ద శనివారం రెండు మృతదేహాలు బయట పడగా.. ఆదివారం మరో మృతదేహం తేలింది. కాళ్లకు తాళ్లు కట్టేసి ఉండడంతో మిస్టరీగా మారింది. ప్రమాదమా? హత్యనా? ఆత్మహత్యానా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఒకే ప్రాంతంలో వరుసగా మూడు మృతదేహాలు లభ్యం కావడం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం కనిపించిన రెండు మృతదేహాల్లో హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ఉన్న ఓ శవాన్ని ముందుకు తోసేయడంతో అది ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తును తప్పించుకునేందుకు హెచ్చెల్సీ ఉపరిభాగంలో ఉన్న పోలీసులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని, అయితే దిగువన ఉన్న డి.హీరేహాళ్‌ పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోజుకొక శవం కాలువలో కొట్టుకు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మృతదేహాలు కర్ణాటక ప్రాంతం నుంచి కొట్టుకువచ్చాయా? లేదా జిల్లా వాసులవా? అనేది తేలాల్సి ఉంది.

    భర్త తాగుడు భరించలేక

    వివాహిత ఆత్మహత్య

    పెనుకొండ రూరల్‌: సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చు పెడుతుండడంతో కుటుంబ పోషణ భారమైన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు... బిహార్‌లోని గోపల్‌ఘంజ్‌ జిల్లా లోహిజరా గ్రామానికి చెందిన ప్రిన్స్‌ కుమార్‌ రాయ్‌కు రెండేళ్లుగా కియా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం ఆయనకు తన సొంత గ్రామానికి చెందిన అంజలీకుమారి (23)తో వివాహమైంది. భార్యతో కలసి గుట్టూరులో నివాసముంటున్నాడు. భర్త మద్యానికి బానిస కావడంతో దంపతుల మద్య తరచూ వివాదాలు చోటు చేసుకునేవి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న అంజలీకుమార్‌ ఆదివారం తెల్లవారుజామున పడక గదిలోని పైకప్పునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

  • ఓవరాల్‌ చాంపియన్‌గా ‘అనంత’

    అనంతపురం కార్పొరేషన్‌: రాష్ట్రస్థాయి 7వ రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో 38 పాయింట్లతో ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను అనంతపురం జట్టు కై వసం చేసుకుంది. తర్వాతి రెండు స్థానాల్లో వరుసగా విశాఖపట్నం, కాకినాడ జిల్లాలు నిలిచాయి. మూడ్రోజులుగా ఆర్డీటీ స్టేడియం వేదిక రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న రెవెన్యూ క్రీడలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖామాత్యులు అవగాని సత్యప్రసాద్‌, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, బీసీ సంక్షేమం శాఖ మంత్రి సవితతో పాటు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిడంబి శ్రీకాంత్‌, టెన్నిస్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత మైనేని సాకేత్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్‌ ఆనంద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి కేశవ్‌ హామీనిచ్చారు. మంత్రి అవగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు తిరుపతిలో రెవెన్యూ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వేలతో రెవెన్యూ ఉద్యోగులు నరకయాతన పడుతున్నారని, సర్వేలు, తదితర పనులకు నిర్ధేశిత సమయం కేటాయించాలన్నారు. వీఆర్‌ఏ, వీఆర్‌ఓ, ఆర్‌ఐ, డీటీలకు శిక్షణనిచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, డీఆర్‌ఓ మలోల, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటరాజేష్‌, డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జునుడు, మల్లికార్జున రెడ్డి, జిల్లా స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరెడ్డి, హరిప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    చివరి రోజు హోరాహోరీగా మ్యాచ్‌లు..

    ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం వివిధ విభాగాల్లో ఫైనల్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. క్రికెట్‌లో మొదటి మ్యాచ్‌లో కృష్ణ, అనంతపురం జట్లు తలపడగా... కృష్ణా జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన అనంతపురం జట్టు 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. త్రోబాల్‌ (ఉమెన్‌)లో చిత్తూరు విజేతగా, కాకినాడ రన్నర్స్‌గా, టగ్‌ ఆఫ్‌ వార్‌ (మెన్‌)లో కాకినాడ విజేతగా, నెల్లూరు రన్నర్‌గా, ఉమెన్‌లో కాకినాడ విన్నర్‌గా, విశాఖపట్నం రన్నర్‌గా నిలిచాయి. 100 మీటర్ల(మెన్‌)పరుగు పందెంలో రవివర్మ (విశాఖ), ఉమెన్‌లో వి.లలిత (అనంతపురం) మొదటి స్థానంలో నిలిచారు. వంద మీటర్ల రిలే పరుగు (మెన్‌)లో విశాఖ మొదటి స్థానం, నెల్లూరు రెండో స్థానంలో నిలిచాయి. ఉమెన్‌ విభాగంలో అనంతపురం మొదటి స్థానం, శ్రీ సత్యసాయి జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో(ఉమెన్‌) విశాఖపట్నంపై అనంతపురం జట్టు విజయం సాధించింది.

    ముగిసిన రెవెన్యూ క్రీడలు

    విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేసిన మంత్రులు సత్యప్రసాద్‌, కేశవ్‌, సవిత

  • సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా?

    అనంతపురం: సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా చంద్రబాబూ.. అంటూ సీఎంను వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆరు నెలల్లోనే రాష్ట్రాభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు రూ.63 వేల కోట్లు అప్పు చేశారన్నారు. ఈ పదహారు నెలల పాలనలో ఏకంగా రూ.2.27 లక్షల కోట్లు అప్పులు చేసినట్లుగా కాగ్‌ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. ఈ డబ్బు ఏమైందని సగటు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో కేవలం రూ.2.80 లక్షల కోట్లు అప్పు చేశారని, ఇందులోనూ రూ.1.57 లక్షల కోట్లు నగదు బదిలీ ద్వారా ప్రజలకు నేరుగా చెల్లించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించిన మొత్తానికి జవాబుదారీతనం ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడల్లా ప్రభుత్వ, ప్రజల ఆస్తులు తగ్గిపోతున్నాయన్నారు. గతంలోనూ.. ఇప్పుడూ అదే పరిస్థితి అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌ పరం చేయడం, అమ్మేయడం, ప్రజల్లోనూ కొనుగోలు శక్తి తగ్గిపోయేలా చేసి, ఆస్తులను అమ్ముకునే స్థాయికి దిగజార్చడం చంద్రబాబు పాలనలో పరిపాటిగా మారిందన్నారు. ‘శాశ్వతంగా అధికారంలో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచారని, అందువల్లే వారం రోజుల్లోనే వీవీ ప్యాట్లు కాల్చివేశారనే అనుమానం ప్రజల్లో ఉంది. సీఎం పదవే అనుమానాస్పదంగా ఉందని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే తరహాలో ప్రజలను మోసగించవచ్చునని భావిస్తున్నారేమో.. ఎల్లకాలం కుట్రలు ఫలించవనే విషయాన్ని గుర్తుంచుకోవాల’ని శైలజనాథ్‌ అన్నారు. విమర్శించే రాజకీయ పార్టీలను టార్గెట్‌ చేస్తున్నారని, పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూడడం చంద్రబాబు నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో సంబంధం లేకపోయినా వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న పవన్‌కల్యాణ్‌ ఎక్కడున్నారో.. తాట తీస్తాను అనే డైలాగ్‌ ఏమైందో.. అని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నకిలీ మద్యం ఏరులై పారుతోందన్నారు. బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉన్నాయన్నారు. మద్యం నకిలీదా? మంచిదా? అని పరిశీలించడానికి బెల్టుషాపుల్లో ఎవరు క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేట్‌కరణను నిరసిస్తూ ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో తలపెట్టిన ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్‌ రెడ్డి, బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ సభ్యుడు నీలం భాస్కర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

    కూటమి ప్రభుత్వంపై

    మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ధ్వజం

  • కురాష

    అనంతపురం కార్పొరేషన్‌: రాష్ట్రస్థాయి 69వ అండర్‌–14, 17, 19 కురాష్‌ పోటీల్లో అనంతపురం జట్టు క్రీడాకారులు ఐదు విభాగాల్లో విజయం సాధించి, ఆల్‌రౌండ్‌ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నారు. ఆదివారం పోటీలు ముగిసాయి. వివిధ విభాగాల్లో ఫిలిప్‌, యూసఫ్‌, జశ్వంత్‌ గిరిబాబు, సుజితకుమార్‌, శశికాంత్‌రెడ్డి, జతిన్‌, వెంకట్‌, చరణ్‌తేజ్‌. వరుణ్‌కుమార్‌, తేజ, దేవదర్శన్‌రెడ్డి, యోగీశ్వర్‌ రెడ్డి, మణికంఠ, ఫయాజ్‌, ధృవరెడ్డి, దీపుసింగ్‌, లావణ్య, వరలక్ష్మి, గోపిక, చందన, లోకేశ్వరి, పూజిత, భవ్య, లేక్షణ్యరెడ్డి, నవీన్‌, మనోహర్‌, వివేకానంద, అశోక్‌, మౌలాలి, దినేష్‌కుమార్‌, పూజిత్‌రాజ్‌, చరణ్‌, ప్రణతి, రిక్షిత, మనీషా, నిర్మల, జ్యోతి, ఝాన్సీ, లక్ష్మి, సాయి లిఖిత, హృదయ బంగారు పతకాలు సాధించారు. విజేతలను అభినందిస్తూ బహుమతులను డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, మాంటిస్సోరీ కరస్పాండెంట్‌ భరత్‌, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి శ్రీనివాసులు ప్రదానం చేశారు.

    రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో

    ‘అనంత’కు మూడో స్థానం

    సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి 12వ సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో అనంతపురం జిల్లాకు మూడో స్థానం దక్కింది. విజేతగా గుంటూరు జట్టు నిలిచింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లయోలా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల క్రీడా మైదానంలో పోటీలు జరిగాయి. రెండో స్థానంలో విజయనగరం జట్టు నిలిచింది. విజేత జట్లను అభినందిస్తూ ట్రోఫీలను సత్తెనపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు ప్రదానం చేశారు. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్‌ వంశీకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణ, స్కాలర్స్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, కె.సత్యం, లయోలా కళాశాల అడ్మిషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, సాఫ్ట్‌బాల్‌ అసోసియేసన్‌ గుంటూరు జిల్లా సామంత్‌రెడ్డి, ట్రెజరర్‌ జనార్ధన్‌ యాదవ్‌ ఆవుల, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • ఈ నరకం భరించలేకున్నా..

    గుంతకల్లు: కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు దూరం చేసేందుకు ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన ఓ మహిళ అష్టకష్టాలు పడుతోంది. తనను ఈ నరకం నుంచి బయట పడేయాలంటూ ఓ సెల్ఫీవీడియో ద్వారా అభ్యర్థిస్తోంది. వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు పట్టణానికి చెందిన నూర్‌ మహమ్మద్‌, షకీలాభాను దంపతులకు నలుగురు కుమార్తెలు. అనారోగ్యంతో దంపతులు మృతి చెందారు. స్థానిక దోనిముక్కల రోడ్డులో నివాసముంటున్న నూర్‌ మహమ్మద్‌ మూడో కుమార్తె షబానాబేగం చెల్లెలు జుబేదా బేగాన్ని ఆదరించి, ఆటో డ్రైవర్‌ అలీ బాషాకు ఇచ్చి పెళ్లి జరిపించింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారం కావడంతో జుబేదా బేగం దుబాయ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని, కడపకు చెందిన ఏజెంట్‌ మహమ్మద్‌ రఫీని సంప్రదించింది. అతని ద్వారా కువైట్‌లో ఇంటి పనిచేయడానికి 8 నెలల క్రితం వెళ్లింది. అయితే అక్కడ యజమాని 8 నెలలుగా వేతనం ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తుండడంతో దిక్కుతోచలేదు. కనీసం భోజనం కూడా పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేస్తుండడంతో భరించలేని జుబేదా బేగం సెల్ఫీ వీడియోలో తన వేదనను వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు పంపింది. తనను ఎలాగైనా గుంతకల్లుకు రప్పించాలని వేడుకుంది. లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని కన్నీటి పర్యంతమైంది. ఈ విషయంగా కుటుంబసభ్యులు నేరుగా వెళ్లి ఏజెంట్‌ను సంప్రదిస్తే... వెనక్కు రప్పించేందుకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. అంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించలేని స్థితిలో తాము ఉన్నామని, ఎలాగైనా జుబేదాబేగంను గుంతకల్లుకు రప్పించాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

    ఎలాగైనా గుంతకల్లుకు రప్పించండి

    ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన

    మహిళ వేదన

    సెల్ఫీవీడియో తీసి కుటుంబసభ్యులకు పంపినా జుబేదా

Bapatla

  • రైతుల

    ప్రాథమిక అంచనా ఇలా..

    కుళ్లిపోయిన వరి పంట

    మొక్కుబడిగా నష్టం లెక్కలు

    మోంథా తుపాను రూపంలో ప్రకృతి అన్నదాతలను అతలాకుతలం చేస్తే... ఆదుకునే మనసు లేని కూటమి సర్కారు వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. పంట నష్టం అంచనాల్లో కోతపెట్టి వంచించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ప్రాథమిక అంచనాల్లో భారీ నష్టం చూపిన ప్రభుత్వం చివరకు వచ్చేసరికి మొక్కుబడిగా మార్చింది. అన్నదాతల కడుపుకొట్టడంతో పాలకులపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    పంట నష్టం అంచనాల్లో

    పొంతన లేని లెక్కలు

    ప్రాథమికంగా 83,160

    ఎకరాల్లో నష్టం

    ఎన్యుమరేషన్‌ తరువాత

    35,789 ఎకరాలే

    పర్చూరు, చీరాల ప్రాంతాల్లో

    పెరిగిన వరద ప్రభావం

    50 వేల ఎకరాల్లో మునిగిన పంటలు

    ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో

    నీటిలోనే వరి పంట

    నష్టం అంచనాలను భారీగా

    తగ్గించిన ప్రభుత్వం

    తీవ్ర ఆందోళనలో బాధిత రైతులు

    కూటమి సర్కార్‌ తీరుపై మండిపాటు

  • వదలని ‘మత్తు’.. యువత చిత్తు

    రైళ్లలో గంజాయి రవాణా

    చేస్తున్న అక్రమార్కులు

    రెండు నెలల కాలంలో

    49 కేజీల పట్టివేత

    మత్తుకు బానిసలుగా మారిన

    విద్యార్థులు, యువత

    గంజాయి రవాణా, వినియోగం

    తగ్గించే చర్యలు శూన్యం

    చీరాల: ఒకప్పుడు బాపట్ల అంటే ఉన్నత చదువులకు చిరునామాగా ఉండేది. ప్రస్తుతం గంజాయికి అడ్డాగా మారింది. వైజాగ్‌ నుంచి కొన్ని ముఠాలు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల ద్వారా విజయవాడ, బాపట్ల, రేపల్లె, వెదుళ్లపల్లి, చీరాలకు భారీగా తరలిస్తున్నారు. అక్కడి నుంచి చిరువ్యాపారుల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు జులాయిల్లా మారిపోతున్నారు. ఉన్నత చదువులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. గంజాయి మత్తులో ఘర్షణలకు దిగుతున్నారు. గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు చీరాల ప్రాంతంలో అనేకం ఉన్నాయి.

    రైళ్లలో యథేచ్ఛగా రవాణా

    గతంలో రోడ్డు మార్గంలో గంజాయిని రవాణా చేసిన అక్రమార్కులు తమ పంథా మార్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రైళ్లలో గంజాయి రవాణాను కొనసాగిస్తున్నారు. ఈగల్‌ టీం, పోలీసులు, రైల్వే, ఆర్పీఫ్‌ పోలీసులు కలసి ఆగస్టులో తిరుపతి – పూరి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీ చేయగా 8 కిలోల గంజాయి లభించింది. అప్పట్లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్‌ 5న ధన్‌బాద్‌ – అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీ చేసి నాలుగు కిలోల గంజాయి పట్టుకున్నారు. అక్టోబర్‌ 24న చీరాల రైల్వేస్టేషన్‌ సమీపంలో 16 కిలోలు గంజాయి లభించింది. పూరి –తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేయగా బ్యాగుల్లో కేరళ తరలిస్తున్న 21 కిలోల గంజాయి దొరికింది. ఈ నెల 3న పూరి – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో రెండు కిలోలు చిక్కింది. గత ఏడాది మార్చిలో కత్తిపూడి – ఒంగోలు రోడ్డులో కంటైనర్‌లో ఫర్నీచర్‌ మాటున 240 కిలోల గంజాయి తరలిస్తుండగా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు పట్టుకున్నారు.

    మాటలకే సర్కారు పరిమితం

    ముఠాలు ఒడిశా నుంచి రైలులో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నాయి. గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్నా కనీసం రవాణాను కూడా అరికట్టలేకపోతోంది. కేసుల్లో దొరికిన వారంతా కూడా చిన్నస్థాయి వారే. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్న అసలు సూత్రధారులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. గత ప్రభుత్వం గంజాయి ఆక్రమ రవాణా నిరోధించేందుకు సెబ్‌ను ఏర్పాటు చేసింది. సెబ్‌, పోలీసులు స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఉంచి ఎక్కడికక్కడ అరికట్టే వారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ గంజాయి రవాణా జోరందుకుంది. గత ఏడాది తెల్లవారుజామున 5 గంటలకు ఈపురుపాలేనికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లగా అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఆమైపె విచక్షణరహితంగా దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట గంజాయి మత్తులో అల్లరిమూకలు యథేచ్ఛగా నేరాలకు, గొడవలకు పాల్పడుతూనే ఉన్నాయి.

    కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి రవాణా, వినియోగం పెరిగింది. మత్తుకు చీరాల యువత చిత్తవుతోంది. చీరాలతోపాటు జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా బహిరంగంగానే సాగుతోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్‌ చేసుకుంటూ స్మగ్లర్లు ఈ దందాలో చెలరేగిపోతున్నారు. చదువు మధ్యలో మానేసి చెడు అలవాట్లకు బానిసలైన వారిని ఎంచుకుని గంజాయి వ్యాపారాన్ని రోజు రోజుకూ విస్తరిస్తున్నారు.

  • రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలలను

    ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి

    మెడికల్‌ కళాశాలల పరిరక్షణ కమిటీ

    రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు

    బాపట్ల: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయటం కేవలం ముడుపుల కోసమేనని మెడికల్‌ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు ఆరోపించారు. మెడికల్‌ కళాశాలను కాపాడుకోవాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బాపట్లలో నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలను సందర్శించి ఎన్జీవో హోంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. వైద్యరంగాన్ని ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించి బాపట్ల వైద్య కళాశాలను నిర్మించాలన్నారు. 56 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న ఈ కళాశాలను కాపాడుకోవాలని, పీపీపీ విధానంలో పది ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు ఇచ్చిన 590 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. వైద్య విద్యను, అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చెయ్యాలనే ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని సూచించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రైవేటీకరణతో కోటీశ్వరుల పిల్లలకే మెడికల్‌ సీట్లు దక్కుతాయన్నారు. అర్హత గల పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    అంత దుస్థితిలో ప్రభుత్వం ఉందా?

    రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి. రమాదేవి డిమాండ్‌ చేశారు. ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఉండాలనే నినాదంతో బాపట్లలో మొదలుపెట్టిన కళాశాల నిర్మాణం కొనసాగించలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతోందన్నారు. కళాశాల నిర్మాణాలను పూర్తి చేసి, ప్రారంభిస్తే ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయన్నారు.

    అమ్మకానికి పెట్టిన కూటమి సర్కారు

    సదస్సులో రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను అమ్మకానికి పెట్టిందని మండిపడ్డారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ కార్పొరేట్‌ వైద్య సంస్థలకు కళాశాలలను కట్టబెట్టడం దారుణమన్నారు. దళిత బహుజన ఫ్రంట్‌ వ్యవస్థాపకులు కొరివి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని ప్రభుత్వం పాటించడం లేదన్నారు.

    తొలుత బాపట్ల ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రాంగణాన్ని వివిధ పార్టీల రాష్ట్ర నేతలు, పరిరక్షణ కమిటీ బృందం, ప్రజా, పౌర సంస్థల నేతలు పరిశీలించారు. గత 17 నెలలుగా బాపట్ల ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో అదనంగా ఎలాంటి నిర్మాణం జరగలేదని, ఇక్కడి నుంచి కొంత ఇనుమును పిడుగురాళ్ల మెడికల్‌ కళాశాలకు తరలించినట్లు గుర్తించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట అంజి బాబు, సీపీఐ కార్యవర్గ సభ్యుడు పరుచూరి రాజేంద్ర బాబు, బాపట్ల జిల్లా కార్యదర్శి సింగరకొండ, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల కో కన్వీనర్‌ కె. వసుంధర, వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.జె. విద్యాసాగర్‌, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు మేధ శ్రీనివాసరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ దర్శి విష్ణు శంకర్‌, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

    మాట్లాడుతున్న మెడికల్‌ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు

  • బాపట్
    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

    అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 33,110 క్యూసెక్కులొచ్చి చేరుతోంది. దిగువకు 17వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 45.7183 టీఎంసీలు.

    7

    నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి యలవర్తి శశిధర్‌ రూ.1,01,116 విరాళం అందజేశారు.

    చేబ్రోలు: నాగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ఆరుద్ర నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకారం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు.

  • ‘సూర్

    తరలివచ్చిన భక్తులు, పర్యాటకులు

    పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు

    భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు

    బాపట్ల టౌన్‌: పర్యాటకులతో సూర్యలంక సముద్ర తీరం ఆదివారం కళకళలాడింది. కార్తిక మాసం ప్రారంభం నుంచి పౌర్ణమి వరకు బీచ్‌ మూసివేసి ఉండటం, పౌర్ణమి తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు తీరానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో చేరుకున్నారు. దీంతో బాపట్ల–సూర్యలంక రహదారి రద్దీగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరంలో సందడి నెలకొంది. సూర్యోదయంతో కూడిన పుణ్యస్నానాలాచరించేందుకు భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే వచ్చారు. యువత సరదాగా గడిపారు. కొందరు తీరం వెంబడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇసుకతో గౌరీదేవి ప్రతిమ, శివలింగాలను తయారుచేసి వాటి ముందు ముగ్గులేసి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. స్వామి వారి శివలింగాన్ని పూలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజలనంతరం గౌరీదేవి ప్రతిమలతోపాటు గంగమ్మకు ఇష్టమైన పూలు, పండ్లను సముద్రంలో కలిపి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

    పోలీసుల సూచనలు పాటించాలి

    తీరం మొత్తం నిఘా నేత్రంలో ఉందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. ఆదివారం తీరాన్ని ఆయన సందర్శించారు. తీరం వెంబడి 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, తుపాను కారణంగా గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. డీఎస్పీలు జి.రామాంజనేయులు, ఎం.డి.మొయిన్‌, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, సీఐలు ఎం.శ్రీనివాసులు, పి.శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

  • రచయిత నసీర్‌ అహమ్మద్‌కు  జీవిత సాఫల్య పురస్కారం

    లక్ష్మీపురం: మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని జరిగే విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉర్దూ అకాడమీ జీవిత సాఫల్య పురస్కారానికి ప్రముఖ చరిత్రకారుడు, రచయిత సయ్యద్‌ నసీర్‌ అహమ్మద్‌ ఎంపికయ్యారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్‌ గౌస్‌ పీర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన పాత్రను వివరిస్తూ మూడు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న నసీర్‌ 25 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను వెలువరించారు. ఈ గ్రంథాలు ఉర్దూతోపాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, గుజరాతీ భాషలలో వెలువడ్డాయి. నసీర్‌ అహమ్మద్‌ కేవలం చరిత్ర గ్రంథ రచన, ప్రచురణతో కాకుండా సమరయోధుల త్యాగమయ, సాహసోపేత పోరాటాలను యువత, విద్యార్థులకు తెలియజేస్తూ పలు ప్రచార కార్యక్రమాలను దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు. చరిత్ర గ్రంథాల రచన, ప్రచురణను వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో నిర్వహిస్తున్న నసీర్‌ అహమ్మద్‌ తన కుటుంబం, సన్నిహితుల ఆర్థిక సహకారంతో ప్రచురించిన గ్రంథాలను ఎంపిక చేసిన వందల గ్రంథాలయాలకు, చరిత్రకారులకు, జర్నలిస్టులకు అందిస్తున్నారు. ఈ గ్రంథాల పీడీఎఫ్‌ ఫైళ్లను ప్రత్యేకంగా తయారు చేయించి కోరిన వారికి అందజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాఠకుల సౌకర్యార్థం తన గ్రంథాలన్నింటినీ అందుబాటులో ఉంచారు. మూడు దశాబ్దాలుగా సయ్యద్‌ నసీర్‌ అహమ్మద్‌ అవిశ్రాంతంగా సాగిస్తున్న కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉర్దూ అకాడమీ ఈ ఏడాదికిగాను ప్రతిష్టాత్మక ‘జీవిత సాఫల్య‘ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపికతో నసీర్‌ అహమ్మద్‌ను విజయవాడలో మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తదితర ప్రముఖులు సత్కరించనున్నారు.

  • పులిచ

    సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ నాలుగు క్రస్ట్‌గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్‌ ఉత్పాదన అనంతరం మొత్తం 31,101 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ రెండు క్రస్ట్‌గేట్లు 1.5 మీటర్లు, మరో రెండు క్రస్ట్‌గేట్లు మీటర్‌ ఎత్తు ఎత్తి 22,640 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పాదన అనంతరం 8,461 క్యూసెక్కులు మొత్తం 31,101 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 75.50 మీటర్లకుగాను 75.50 మీటర్లకు చేరిందన్నారు. రిజర్వాయర్‌ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం రిజర్వాయర్‌లో 7.080 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. టీఆర్‌సీ లెవల్‌ 55.62 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువనున్న నాగార్జునసాగర్‌ నుంచి ప్రస్తుతం 34,185 క్యూసెక్కులు వస్తుందని పై నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు.

    మాజీ ఎంపీ శివాజీకి

    పరామర్శ

    నగరంపాలెం: మాజీ ఎంపీ డాక్టర్‌ యలమంచిలి శివాజీని ఆదివారం బృందావన్‌గార్డెన్స్‌లోని ఆయన నివాసంలో స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న తనయుడు, మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర శివాజీ పరామర్శించారు. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం ఇరువురిని విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ సత్కరించారు. శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల పాలకవర్గం కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్ధన్‌, పలువురు పాల్గొన్నారు.

    రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్‌ గజ్జెల సుధీర్‌ భార్గవరెడ్డి ప్రథమ చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. అద్దంకి – నార్కెట్‌పల్లి రహదారిపై పెదనెమలిపురి వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయాడు. అదేసమయంలో పిడుగురాళ్ల నుంచి నరసరావుపేట వెళుతున్న డాక్టర్‌ గజ్జెల సుధీర్‌ భార్గవరెడ్డి తీవ్ర గాయాలతో పడిఉన్న యువకుడిని గమనించి, వెంటనే ప్రథమ చికిత్స చేశారు. క్షతగాత్రుడిని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ఆపద సమయంలో మానవత్వంతో సత్వరం స్పందించిన డాక్టర్‌ గజ్జెల సుధీర్‌ భార్గవరెడ్డిని స్థానికులు అభినందించారు.

    మానవత్వం చాటుకున్న వైఎస్సార్‌ సీపీ

    సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్‌ గజ్జెల

  • పరమ శ

    వేటపాలెం: నాయినపల్లిలోని గంగా భవానీ సమేత భోగలింగేశ్వరస్వామి దేవస్థానంలో పరమ శివుడ్ని ఆదివారం భానుడి కిరణాలు అభిషేకించాయి. శివుడికి ప్రీతి పాత్రమైన కార్తిక మాసంలో శివలింగాన్ని తాకడాన్ని భక్తులు అధిక సంఖ్యలో వీక్షించారు. అర్చకులు స్వామికి పలు పూజలు చేశారు.

    పోలేరమ్మ ఆలయంలో..

    చీరాల: పట్టణంలోని పాపరాజుతోటలో గల శ్రీ పోలే రమ్మ అమ్మవారి అర్ధ ముఖాన్ని ఆదివారం సూర్య కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం అమ్మవారి దివ్య చైతన్యానికి సంకేతమంటు భక్తులు విశేష పూజలు నిర్వహించారు.

  • పెద్దపులి దాడిలో గేదె మృతి

    వెల్దుర్తి: నల్లమల అటవీ ప్రాంత సమీపంలోని వజ్రాలపాడు తండా సమీపంలో మేత మేస్తున్న గేదైపె పెద్దపులి దాడి చేయగా, అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. మండలంలోని వజ్రాలపాడు తండాకు చెందిన మూడావత్‌ తులశ్యనాయక్‌కు చెందిన గేదె అడవిలో మేత మేస్తుంటే పెద్దపులి దాడి చేసి చంపింది. విషయం తెలుసుకున్న తులశ్యనాయక్‌, సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. గేదె మెడ కొరికి తాగిన ఆనవాళ్లు ఉండడంతో పెద్ద పులి దాడిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రూ.50వేల విలువైన గేదె పెద్దపులి దాడిలో చనిపోయిందని అటవీశాఖాధికారులు తనకు న్యాయం చేయాలని తులశ్యనాయక్‌కోరారు. ఈ ప్రాంతంలో అప్పడప్పుడు పెద్దపులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అటవీశాఖాధికారులు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • ‘పది’లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

    సత్తెనపల్లి: పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎగ్జామినేషన్‌ విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.ఎం.ఎ.హుస్సేన్‌ అన్నారు. రాష్ట్ర పాఠశాల కమిషనర్‌ వి.విజయరామరాజు ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్‌.చంద్రకళ నేతృత్వంలో ఆదివారం నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డివిజన్‌లలోని పలు మండల కేంద్రాల్లో ఉప విద్యా శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. హుస్సేన్‌ మాట్లాడుతూ రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు దూర విద్యలో పదో తరగతి, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు కూడా పరీక్షల కోసం పదో తరగతి పరీక్ష కేంద్రాలను వినియోగించనున్నామన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై ఈఏడాది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో బోధన కొనసాగించాలన్నారు. టెన్త్‌ పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఆ మేరకు ఎంఈఓలతోపాటు, ప్రతి పరీక్ష కేంద్రాన్ని స్వయంగా సందర్శిస్తామన్నారు. పరీక్ష కేంద్రానికి పూర్తి సదుపాయాలు ఉంటేనే అనుమతి ఇస్తున్నామన్నారు. జంబ్లింగ్‌ విధానంలో కేంద్రాల కేటాయింపు ఉంటుందన్నారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం ఉండదన్నారు. ఎక్కడైనా కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే ఆ ఉపాధ్యాయులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన టెన్త్‌ పరీక్షల్లో 49 పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 40 శాతం కంటే తగ్గిందన్నారు. ప్రతి మండలంలో ఉత్తీర్ణత శాతం వంద శాతానికి పెంచాలన్నారు. దీనికి ఎఫ్‌ఏ1, ఎఫ్‌ఏ2 మార్కుల ఆధారంగా ఏ, బీ గ్రేడ్‌వారు, సీ,బీ గ్రేడ్‌లవారీగా విభజించి డీసీఈబీవారు ఇచ్చిన మెటీరియల్‌ను నవంబరు 30లోపు సిలబస్‌ పూర్తి చేసి వంద రోజుల వంద రోజుల ప్రణాళిక ద్వారా ఉపాధ్యాయులు మెరుగైన బోధన చేపట్టి విద్యార్థులు ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. గతంలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఈఏడాది ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 ద్వారా అన్ని పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేయడం జరిగిందన్నారు. వివిధ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులందరూ ప్రత్యేక తరగతులు తప్పకుండా నిర్వహించాలన్నారు. ఆయతోపాటు ఉప విద్యా శాఖ అధికారులు ఎస్‌ఎం సుభాని (నరసరావుపేట), వి.ఏసుబాబు (సత్తెనపల్లి), మండల విద్యా శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.

    ఎగ్జిమినేషన్‌ విభాగం

    అసిస్టెంట్‌ కమిషనర్‌ హుస్సేన్‌

  • రక్తనాళాలపై అవగాహన పెంచుకోవాలి

    గుంటూరు వెస్ట్‌: రక్తనాళాలపై అవగాహన కలిగి ఉంటే ఎన్నో అనర్థాలను ముందుగానే గుర్తించి సరిచేసే అవకాశముంటుందని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ నందకిషోర్‌ పేర్కొన్నారు. వాస్కులర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి వాస్కులర్‌ వాక్‌థాన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్తనాళాలు మనిషికి ఎంతో కీలకమని చెప్పారు. నిత్యం వ్యాయామం, చక్కని ఆహార అలవాట్లతోపాటు క్రమం తప్పకుండా మెడికల్‌ టెస్ట్‌లు చేయించుకుంటే ముందుగానే అరికట్టవచ్చని తెలిపారు. నేటి ఆధునిక యువత అవగాహన లేక అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, వాటిని అరికట్టడానికి ఎన్నో పద్ధతులు సమాజంలో ఉన్నాయని తెలిపారు. వాస్కులర్‌ సర్జన్‌ డాక్టర్‌ వి.విజయకుమార్‌ మాట్లాడుతూ వాస్కులర్‌ వాక్‌థాన్‌ను దేశ వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో నిర్వహించారన్నారు. ఊబకాయం, మధుమేహ రోగుల్లో రక్తనాళాల సమస్యల కారణంగా కాళ్లు, చేతులు శాశ్వతంగా తొలగిస్తున్నారన్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులు కొద్దిపాటి జాగ్రత్తలతోపాటు అవగాహన కలిగి ఉంటే చాలా ఇబ్బందులను తొలగించే అవకాశముంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తనాళాల సమస్యలకు ఎన్నో ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అనంతరం స్టేడియం నుంచి మదర్‌థెరిస్సా విగ్రహం వద్దకు వాక్‌ కొనసాగింది. కార్యక్రమంలో వాస్కులర్‌ సర్జన్స్‌ సురేష్‌రెడ్డి, సురేంద్ర, రత్నశ్రీ , ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ బి.సాయికృష్ణ, ఉపాధ్యక్షులు ఎం.శివప్రసాద్‌ పాల్గొన్నారు.

    ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ నందకిషోర్‌

  • రాష్ట్ర సాఫ్ట్‌ బాల్‌ పోటీల విజేత గుంటూరు

    సత్తెనపల్లి: 12వ రాష్ట్ర సీనియర్‌ అంతర్‌ జిల్లాల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ 2025 విజేతగా గుంటూరు నిలిచింది. సత్తెనపల్లి మండలం లయోలా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన 12వ రాష్ట్ర సీనియర్‌ అంతర్‌ జిల్లాల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ 2025 పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన గుంటూరు టీమ్‌ చాంపియన్‌షిప్‌ కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని విజయనగరం టీమ్‌, తృతీయ స్థానం అనంతపురం టీమ్‌ కై వసం చేసుకున్నాయి. బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు హాజరై మాట్లాడారు. క్రీడలతోపాటు విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాలో 415 పోస్టుల్లో 49 పోస్టులు సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు దక్కడం అభినందనీయమన్నారు. సభకు సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్‌ వంశీకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ రమణ, స్కాలర్స్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, కె.సత్యం, లయోలా కళాశాల అడ్మిషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, సాఫ్ట్‌బాల్‌ అసోసియేసన్‌ గుంటూరు జిల్లా సామంత్‌రెడ్డి, ట్రెజరర్‌ జనార్ధన్‌ యాదవ్‌ ఆవుల, నరసింహారెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

  • అంబేడ్కర్‌ స్మృతివనాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలి

    చీరాల రూరల్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కోపంతో అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం అవమానిస్తోందని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సెయింట్‌ మార్క్స్‌ లూథరన్‌ జూనియర్‌ కాలేజీ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చారిత్రాత్మక పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో 18.81 ఎకరాల్లో సామాజిక న్యాయ విగ్రహం పేరుతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. స్మృతివనం ఎంట్రన్స్‌ ఫీజు మొదటగా రూ.5 గా నిర్ణయించారన్నారు. అయితే అక్కడ పారిశుద్ధ్య పనుల నిర్వహణ లోపం కారణంగా పర్యాటకులు ఎవరూ రావడం లేదన్నారు. కూటమి పార్టీలకు జగన్‌మోహన్‌రెడ్డితో ఉన్న వైరం కారణంగా అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానిస్తున్నారన్నారు. స్మృతివనం నిర్వహణకు తాము కూటమి నేతల డబ్బులు అడుగడం లేదని, సాంఘిక సంక్షేమ శాఖ నిధులు నుంచి నిర్వహణ చేపట్టాలన్నారు. అందులో పనిచేసే కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అపర కుబేరుడు రామోజీరావు స్మారక సభకు రూ.14 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసిన చంద్రబాబు.. అంబేడ్కర్‌ స్మృతివనానికి నిధులు లేవని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు సబ్సిడీ రుణాలను కూడా ప్రకటించి.. నిధులు నిలిపివేసి ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామన్న ఎన్నికల హామీ తుంగలో తొక్కారన్నారు. స్మృతి వనాన్ని సాంఘిక సంక్షేమ శాఖ నుంచి పర్యాటక శాఖకు అప్పగించడం కూటమి ప్రభుత్వ కుట్రపూరిత వివక్షకు నిదర్శనమన్నారు. స్మతివనం నిర్వహణకు కమిటీ నియమించాలని డిమాండ్‌ చేశారు. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడే మాచవరపు జూలియన్‌, మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాకుమాను రవికుమార్‌, జి.ఏలియా తదితరులు పాల్గొన్నారు.

    దళిత హక్కుల పరిరక్షణ సమితి

    రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్ర

  • విద్య

    మార్టూరు: విద్యుత్‌ మరమ్మతులు చేస్తుండగా ఇద్దరు యువకులు గాయపడిన సంఘటన వలపర్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో మండలంలోని వలపర్ల గ్రామంలో నూతనంగా విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి లైన్లు లాగుతున్నారు. ఈ పనుల కోసం జార్ఖండ్‌కు చెందిన యువకులను మరికొందరిని నియమించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం దిలీప్‌, తాపేశ్వర్‌ విద్యుత్‌ స్తంభం పైకి ఎక్కి వైర్లను బిగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా కావడంతో దిలీప్‌ షాక్‌ తగిలి తీగలపై వాలిపోయాడు. చేతికి స్వల్ప గాయమైన తాపేశ్వర్‌ అరుస్తూ కింద ఉన్న మిగిలిన సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు సరఫరా నిలిపివేశారు. స్పృహ కోల్పోయిన దిలీప్‌ను స్థానికులు కిందకు దించి మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుభవం లేని కూలీలను స్తంభాలు ఎక్కించి, లైన్‌మెన్‌ పనులు చేయించడం ఏమిటని స్థానికులు విమర్శిస్తున్నారు.

    లారీ ఢీకొట్టంతో ద్విచక్ర వాహనదారుడు మృతి

    భట్టిప్రోలు: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన ఎన్‌హెచ్‌–216 జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. భట్టిప్రోలు ఎస్‌ఐ ఎం. శివయ్య కథనం ప్రకారం గుంటూరుకు చెందిన ఎస్‌కే అహ్మద్‌ వలీ (27) చెరుకుపల్లి మండలంలోని గూడవల్లికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గుంటూరు నుంచి గూడవల్లికి బైక్‌పై వచ్చాడు. అక్కడి నుంచి రేపల్లెకు వ్యక్తిగత పనులపై వెళ్లి తిరిగి వస్తుండగా భట్టిప్రోలు సమీపంలో సూరేపల్లి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి దిగుతుండగా వెనుకనుంచి వేగంగా లారీ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో అహ్మద్‌ వలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివయ్య తెలిపారు.

  • మానవత్వం చాటుకున్న ఎస్‌ఐ

    పర్చూరు(చినగంజాం): మృతి చెంది ఆస్పత్రిలో దిక్కులేకుండా పడి ఉన్న వ్యక్తి శవాన్ని వారి బంధువులకు అప్పగించి దహన సంస్కారాలకు సైతం సాయమందించి మానవత్వాన్ని చాటుకున్నారు పర్చూరు ఎస్‌ఐ జీవీ చౌదరి. పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన చీరాల శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే అతని కుమారుడు చీరాల సురేష్‌బాబు అతనిని వైద్యచికిత్స కోసమై పర్చూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి కనిపించకుండా వెళ్లిపోయాడు. అటు తరువాత ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు చనిపోయాడు. ఆస్పత్రి వైద్యు లు ఆ విషయాన్ని పర్చూరు పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ జీవీ చౌదరికి తెలియపరిచారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్‌ఐ తన సిబ్బందిని మృతుని కుమారుడు సురేష్‌బాబు కోసం నూతలపాడు గ్రామానికి పంపి విచారించాడు. మద్యానికి బానిసైన సురేష్‌ బాబు.. తండ్రి చనిపోయిన విషయాన్ని పట్టించుకోకుండా తాగి తిరుగుతున్నట్లుగా గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. జీవీ చౌదరి.. చనిపోయిన చీరాల శ్రీనివాసరావు బంధువులు గురించి ఆరా తీసి వారు చీరాల హస్తినాపురంలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. వారి బంధువులను, చనిపోయిన శ్రీనివాసరావు కుమారుడు సురేష్‌బాబును పిలిపించి మృతదేహాన్ని వారికి అప్పగించారు. అయితే కనీసం మృతునికి దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఉన్నారని తెలుసుకుని అవసరమైన సహాయ సహకారాలు అందించారు.

    మృతదేహం బంధువులకు అప్పగింత

    దహన సంస్కారాలకు సైతం సాయం

  • నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదు

    నెహ్రూనగర్‌ : శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి వద్ద ఉన్న షాపుల యాజమాన్యం అడుగుతున్న నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మ సాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఆదివారం మిర్చి యార్డు, శంకర్‌ విలాస్‌ వంతెన నిర్మాణ పనులను మేయర్‌ రవీంద్రబాబు, నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులతో కలిసి పనులను పరిశీలించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ మిర్చి యార్డు వద్దపై వంతెన పనులు చాలా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో యార్డు వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం అడ్డంకి కాకుండా ప్రత్యామ్నా య చర్యలు తీసుకోవాలన్నారు. శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి జీజీహెచ్‌ వైపు డిసెంబర్‌ 15 తేదీలోపు 7 పిల్లర్లు పూర్తయ్యేలా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శంకర్‌ విలాస్‌ వైపు ఉన్న షాపులు తొలగించడంలో కొంత జాప్యం చోటు చేసుకుందని, వ్యాపారు లు, ప్రజలు అర్థం చేసు కుని అభివృద్దికి సహకరించా లని కోరారు. రోడ్డు విస్తరణలో కోల్పోయే షాపులకు యాజమానులు అడుగుతున్న నష్టపరిహారం సాధ్యం కాదని...సదరు సమస్య పరిష్కారానికి నగరపాలక సంస్థ మేయర్‌, కమిషనర్‌ చర్చలు జరుపుతున్నారని వీలైనంత త్వరలో పరిష్కారమవుతుందన్నారు.

    కేంద్ర సహాయ మంత్రి

    పెమ్మసాని చంద్రశేఖర్‌

    మిర్చియార్డు, శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి

    పనులను పరిశీలన

Tamil Nadu

  • కోలాహలం..కార్తీక వనభోజనం

    కొరుక్కుపేట: చైన్నె తెలుగు అసోసియేషన్‌–వలసరవాక్కం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు కార్యక్రమాన్ని కోలహలంగా నిర్వహించారు. చెంబరబాక్కంలోని పి.శ్రీనివాసరావు ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక ఆదివారం జరిగింది. అసోసియేషన్‌ అధ్యక్షుడు జీకే రెడ్డి, కార్యదర్శి వెంకయ్యనాయుడు, ఉపాధ్యక్షుడు విజయేంద్ర రావు, కల్చరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఏవీ శివకుమారిలతో కూడిన కార్యవర్గం, కమిటీ సభ్యులు నిర్వహణతో వనబోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. కుంటుంబసమేతంగా హాజరైన ఈ వేడుకల్లో పిల్లల కోసం క్రీడలు , ఆసక్తికరమైన కార్యక్రమాలతో, సంప్రదాయ మేళాతో, మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఉసిరి చెట్టు, గో పూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిండిపోయింది.

  • రాష్ట

    ఎస్‌ఐఆర్‌ (సర్‌) రూపంలో రాష్ట్రానికి ముప్పు బయలు దేరి ఉందని, ఈ వ్యవహారాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాలలో నేతలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్‌ పిలుపు నిచ్చారు. లేని పక్షంలో కుట్రలకు పదును పెట్టి, ముప్పు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించారు.

    సాక్షి, చైన్నె: చైన్నె తేనాంపేటలోని అన్నా అరివాలయం నుంచి సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆదివారం జిల్లాల కార్యదర్శులతో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. జిల్లాల వారీగా జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రి య గురించి చర్చించారు. ఈ ప్రక్రియ రూపంలో స్థానికంగా ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు, రీజియన్‌ ఇన్‌చార్జ్‌లను ఉద్దేశించి స్టాలిన్‌ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ను పదేపదే వ్యతిరేకించేందుకు గల కారణాలను వివరించారు. ఇది మన అనుకునే వారి ఓటు హక్కును హరింపజేయడానికి పన్నినన కుట్రగా ఆరోపించారు. ఈ ఓటర్లను ఎలా రక్షించుకోవాలో అన్న విషయంపై తాను మార్గనిర్దేశం చేస్తున్నట్టు వివరించారు. సరైన సమయంలో ఓటరు జాబితా సవరణకు చర్యలు తీసుకుంటే ఆహ్వానించ వచ్చు అని, అయితే, ఎన్నిలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్నప్పుడు ఆగమేఘాలపై ఈప్రక్రియ చేపట్టడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నట్టు వివరించారు. తగినంత సమయం కూడా ఇవ్వకుండా కేంద్రం చేతిలో కీలు బొమ్మగా ఉన్న జాతీయ ఎన్నికల కమిషన్‌ తమిళనాడులో దూకుడు పెంచి ఉండడం బట్టి చూస్తే, ఏదో ముప్పు అన్నది పొంచి ఉన్నట్టు స్పష్టమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఇప్పసటికే ఈ వ్యవహారంపై స్పష్టమైన సమాచారం ఇచ్చి ఉన్నారని గుర్తుచేశారు. కేరళ సీఎం పినరాయ్‌ విజయన్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ సైతం తీవ్రంగా ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వస్తుంటే, కేంద్ర ఎన్నికల కమిషన్‌ దూకుడుగా ముందుకు సాగడం బట్టి చూస్తే, దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్నది స్పష్టం అవుతోందన్నారు.

    నిరసనను జయప్రదం చేద్దాం..

    కూటమి పార్టీలతో ఈవ్యవహారం గురించిచర్చించామని అఖిల పక్షం భేటి గురించి గుర్తుచేశారు. ఇందులో ఆమోదించిన తీర్మానాల మేరకు న్యాయ పోరాటానికి చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. అలాగే, ఈనెల 11వ తేదీన అన్ని జిల్లాలో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనకులు పిలుపు నిచ్చామని గుర్తు చేస్తూ, దీనిని జయప్రదం చేద్దామని పిలుపు నిచ్చారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ రూపంలో ఎన్ని సమస్యలు, గందరగోళాలు ఉన్నాయో అని వివరిస్తూ, దీని గురించి సమగ్ర వివరాలను అందరికి తెలియ చేస్తున్నట్టు వివరించారు. ఈ ప్రక్రియ కోసం సిద్ధం చేసిన దరఖాస్తులలో అనేక గందరగోళాలు, అవకతవకలు ఉన్నట్టు పేర్కొన్నారు. తద్వారా మన అనుకునే వాళ్ల వివరాలను సేకరించడమే కాకుండా, వారి బంధువులు, వారి ఇతర ఆప్తులు అన్న సమాచారాల వివరాల మేరకు వాటన్నింటిని తొలగించేందుకు వ్యూహ రచన చేసి ఉన్నారని ఆరోపించారు. అందరి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించడమే లక్ష్యంగా కుట్రలకు ఎన్నికల కమిషన్‌ ద్వారా పూనుకుని ఉన్నారని పేర్కొన్నారు. చదువుకున్న, తెలివైన, అత్యంత బాధ్యతాయుతమైన వ్యక్తులు కూడా ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన దరఖాస్తును చూసి తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఒక రకమైన సమాధానం ఇచ్చి, దరఖాస్తులలో మరో రకంగా ప్రశ్నలను పొందు పరిచి ఎన్నికల కమిషన్‌ ఎత్తుగడలను వేసి ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు ఈ ఎస్‌ ఐ ఆర్‌కు వంత పడుతుండడం కేవలం వారి స్వలాభం కోసమేనని ధ్వజమెత్తారు. డీఎంకే మద్దతు ఓట్లన్నీ తొలగిన పక్షంలో వారికి అనుకూలంగా వాతావరణం మారుతుందని కలలు కంటున్నారని పేర్కొన్నారు. దరఖాస్తులు బీఎల్‌ఓలను సైతం గందరగోళానికి గురి చేసి ఉన్నాయని పేర్కొంటూ, ఇక డీఎంకే సభ్యులు రంగంలోకి దిగాలని వారితోపాటుగా ఇంటింటా తిరిగి ఓటును పరిరక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. ఆగమేఘాలపై డిసెంబరు 4లోపు ప్రక్రియను ముగించి డిసెంబర్‌ 7 నాటికి అన్ని సిద్ధం చేసి జనవరి 1న మాదిర ఓటరు జాబితా ప్రకటించేందుకు ఉరకలు తీయడం వెనుక కుట్ర దాగి ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. నెల రోజులల ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయగలరని ప్రశ్నిస్తూ, దీనిని అడ్డుకునేందుకు అప్రమత్తంగా డీఎంకే శ్రేణులు వ్యవహరించాలని హెచ్చరించారు. అనేక చోట్ల బీఎల్‌ఓలు ఇంటింటా కూడా తిరగడం లేదని గుర్తు చేస్తూ, కార్యకర్తలు అప్రమత్తంగా లేకుంటే నష్టం తప్పదన్నారు.

    హెల్ప్‌లైన్‌ నంబర్లు..

    ఎన్నికల కమిషన్‌ కుట్రలను భగ్నం చేసే దిశగా ముందుకెళ్దామని పిలుపు నిస్తూ, జాబితా నుంచి ఏ ఒక్కరి ఓటూ గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేడర్‌పై ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును పరిరక్షిద్దామని పేర్కొంటూ, డీఎంకే తరపున ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎస్‌ఐఆర్‌ వ్యవహారంలో ఓటర్ల కోసం హెల్ప్‌లైన్‌ నంబరు 08065420020 ఏర్పాటు చేశామని ప్రకించారు. ఓటర్లే కాదు, డీఎంకే వర్గాలు ఈ నెంబర్‌కు ఫోన్‌చేసిన సందేశాలను నివృతి చేసుకోవాలని సూచించారు. అవసరమైన మార్గదర్శకాన్ని ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా పొంద వచ్చని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల ఓటు హక్కులను కాపాడటానికి డీఎంకే ముందుంటుందని, నిలబడుతుందన్నారు. మన ఓటు హక్కును కాలరాసే ముప్పు మున్ముందు ఉందని పేర్కొంటూ, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, అప్రమత్తంగా వ్యవహరించి ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకుందామని పిలుపు నిచ్చారు.

  • పోరుబ

    సంతకం చేస్తున్న జాహీర్‌ హుస్సేన్‌

    సంతకం చేస్తున్న మహిళలు

    ఏపీలోని కూటమి ప్రభుత్వ అరచకాలు, అసంబద్ధ నిర్ణయాలపై తమిళనాడులోని తెలుగుప్రజలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చైన్నెలో సోమవారం ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి చంద్రబాబు సర్కారు కమీషనర్ల రాజ్యం నడుపుతోందని ఈ సందర్భంగా ప్రజలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సాక్షి, చైన్నె: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తమిళనాట సైతం తెలుగు హృదయాలలో వ్యతిరేకత, ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను, చంద్రబాబు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ చైన్నెలో వైఎస్సార్‌ సేవాదళ్‌ అధ్యక్షుడు ఏకే జాహీర్‌ హుస్సేన్‌ నేతృత్వంలో సంతకాల సేకరణకు ఆదివారం శ్రీకారం చుట్టారు. వివరాలు.. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థుల వైద్యవిద్య కలను సాకారం చేసే దిశగా గతంతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత చర్యలు తీసుకుంది. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా వైద్య కళాశాలు, ఆస్పత్రులను నెలకొల్పింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ అస్మదీయులకు ఈ కళాశాలలను కట్టబెట్టే దిశగా దూకుడు పెంచింది. పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కల్పించిన భరోసాను కాల రాసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్య ముసుగులో ప్రజల సంపదను దోచుకునేందుకు తెరదీసింది. ప్రైవేటు అజమాయిషీలోకి వైద్య కళాశాలలు, ఆస్పత్రులను తీసుకొచ్చి పేదలకు అందని ద్రాక్షగా వైద్యం సేవలను మార్చేందుకు పన్నాగాలపై దృష్టిపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు చైన్నెలోని అభిమాన లోకం సైతం కదిలింది.

    ముమ్మరంగా సంతకాల సేకరణ

    డబ్బున్నోడికే వైద్యం, సంపన్నుడికే ఉన్నత వైద్య సీట్లు అన్న నినాదంతో సాగుతున్న కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ చైన్నెలో తమిళనాడు వైఎస్సార్‌ సేవాదళ్‌ నేతృత్వంలో సంతకాల సేకరణకు ఆదివారం శ్రీకారం చుట్టింది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చైన్నెలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వారు ఈసంతకాల సేకరణకు తరలి వచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ స్థాపించిన మెడికల్‌ కళాశాలలను కొత్త ప్రభుత్వ కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌కు పలు అంశాలను సూచిస్తూ, ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఖండించే విధంగా సంతకాల సేకరణకు నడుంబిగించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు స్పందించి చైన్నెలో వైఎస్సార్‌ సేవాదళ్‌ అధ్యక్షుడు ఏకే జహీర్‌ హుస్సేన్‌ నేతృత్వంలో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంకతాల సేకరణ కార్యక్రమంపై దృష్టి పెట్టారు. చైన్నెలో తెలుగు వారు అత్యధికంగా ఉండే ప్రాంతాలలో ఈ సంతకాల సేకరణకు చర్యలు తీసుకున్నారు. ఆదివారం షోలింగనల్లూరులోని గంగమ్మ కోయిల్‌ వీఽధిలో జరిగిన సంతకాల సేకరణకు పెద్దసంఖ్యలో తెలుగు వారు తరలి వచ్చి తాము సైతం అని ముందుడుగు వేశారు. పేదల విద్యాహక్కును కాలరాయవద్దని నినదించారు. అందరికీ దరఖాస్తులను ఏకేజాహీర్‌ హుస్సేన్‌ అందజేశారు.

    చైన్నెలో 10 వేల మంది తెలుగు వారితో సంకతాలను సేకరించి దర ఖాస్తులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అందజేయనున్నట్టు ఏకే జహీర్‌ హుస్సేన్‌ తెలిపారు. రోజూ సంతకాల సేకరణకు చర్యలు తీసుకుంటునే ఆదివారాల్లో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాలలో శిబిరాలను ఏర్పాటుచేస్తున్నామని జహీర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఆగడగాలపై ఇక్కడున్న తెలుగు వారు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సేవాదళ్‌ వర్గాలు శరత్‌కుమార్‌రెడ్డి, సూర్యారెడ్డి, కృతిక, వరుణ్‌కుమార్‌, శివ, సంపత్‌కుమార్‌, మల్యాద్రి, కొండయ్య, ఎన్‌ కల్యాణ్‌, మురళి, శ్యామ్‌ సంగ్‌, పొల్లారెడ్డి,చిన్నప్పరెడ్డి, సాయికుమార్‌రెడ్డి, ఇంధ్రసేనారెడ్డి, ప్రకాష్‌, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • 24 నుంచి లైసెన్స్‌ లేకుంటే జరిమానా

    సాక్షి,చైన్నె: పెంపుడు జంతువులకు లైసెన్సులను తప్పనిసరి చేశారు. లైసెన్సులు లేకుంటే రూ. 5 వేలు జరిమానా ఈనెల 24 నుంచి విధించనున్నట్లు కార్పొరేషన్‌ అధికారులు స్పష్టం చేశారు. లైసెన్సుల మంజూరు కోసం ప్రతి ఆదివారం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆరు చోట్లశిబిరాలు జరిగాయి. వివరాలు.. చైన్నెలో అనేక మంది శునకాలు, పిల్లులు తదితర వాటిని పెంచుకోవడం తెలిసిందే. వీటిని బయటకు తీసుకొచ్చే క్రమంలో సమస్యలు తప్పడం లేదు. కొన్ని చోట్ల శునకాలు దాడి చేసి గాయ పరిచిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితులలో పెంపుడు జంతువులకు లైసెన్సులు తప్పనిసరి చేస్తూ చైన్నె కార్పొరేషన్‌ సమావేశంలో తీర్మానం చేశారు. పెంపుడు జంతువులు, వీధులలో తిరిగే శునకాలు, అవి సృష్టించే వీరంగాల గురించి కార్పొరేషన్‌ తీవ్రంగా పరిగణించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధులలో తిరిగి శునకాలను కట్టడిచేసేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టారు. అదే విధంగా పెంపుడు జంతువులకు లైసెన్సులు లేకుంటే రూ. 5 వేలు జరిమానా విధించేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 24వ తేది నుంచి ఈ జరిమానా అమలు చేయనున్నారు. పెంపుడు జంతువులకు బయటకు తీసుకొచ్చే క్రమంలో వాటి మెడకు రక్షణ బ్యాడ్జీలు లేకుంటే రూ. 500 జరిమాన విధించేందుకు చర్యలు చేపట్టారు. ఇక, పెంపుడు జంతువులను బహిరంగ ప్రదేశాలకు తీసుకొచ్చి మల, మూత్ర విసర్జన చేయించినా చర్యలు తప్పదని హెచ్చరించారు. ఈనెల 24వ తేదీ నుంచి చైన్నె కార్పొరేషన్‌ పరిధిలో జరిమానాలు విధించనుండడంతో పెంపుడు జంతువులను కలిగిన వారు లైసెన్సుల మీద దృష్టి పెట్టారు. వీరి కోసం ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు కార్పొరేషన్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఆరు మండలాలలో శిబిరాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో వచ్చిన జంతుప్రేమికులు తాము పెంచుకుంటున్న శునకాలు, పిల్లులు తదిర వాటికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

YSR

  • మదనపల్లె: మదనపల్లె కేంద్రంగా విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయ చదువు అందించాలన్న లక్ష్యంతో రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి శ్రమకోర్చి మంజూరు చేయించిన కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి కూటమి ప్రభుత్వ గ్రహణం పట్టింది. ఎంపీ మిథున్‌రెడ్డి మదనపల్లె బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉత్తర్వులు తీసుకురాగా దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసిన కూటమి ప్రభుత్వం వాటిని సమాధి చేసేందుకే ఆసక్తి చూపిస్తోంది. ఫలితంగా పేద విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నతమైన అందకుండా చేస్తున్నారు. అందులో భాగమైన కేంద్రీయ విద్యాలయం ప్రారంభం ఎప్పుడు అవుతుంది అన్న ప్రశ్నకు కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల దాకా సమాధానం రావడం లేదు. దీంతో ఇక్కడి విద్యార్థులకు ఎదురుచూపులే మిగలనున్నాయి.

    ప్రతిష్టాత్మక విద్య

    దేశంలో అత్యుత్తమ విద్యా కేంద్రాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఒకటి. జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తాయి. ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెంకడరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ), నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) సహకారంతో విద్యలో ప్రయోగాలు చేపట్టి నూతన ఆవిష్కరణలతో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయి. హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన ఉంటుంది. లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక, ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపీ మిథున్‌రెడ్డి 2025–26లో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభం అయ్యేలా శాయశక్తులా కృషి చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తరగతులను ప్రారంభించేందుకు కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసినా అందులో మదనపల్లె లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది.

    భూ కేటాయింపు లేదట

    కేంద్రీయ విద్యాలయం తరగతుల ప్రారంభ విషయమై శనివారం డిప్యూటి కమిషనర్‌ మంజునాథ్‌ను ఫోన్‌లో వివరణ కోరగా ఆయన స్పందించారు. విద్యాలయాలనికి ఇంకా భూమి ఇవ్వలేదని, ఇచ్చాక చర్యలుంటాయని చెప్పారు. వచ్చే ఏడాదైనా తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తే ఆ విషయం తాను చెప్పలేనని అన్నారు. ఇంకా భూమి ఇవ్వలేదనే విషయాన్ని మాత్రమే ఆయన గట్టిగా చెప్పడం గమనార్హం. వచ్చే ఏడాదైనా తరగతులు ప్రారంభం విషయాన్ని దాటవేశారు. దీన్ని బట్టి చూస్తే కేంద్రీయ విద్యాలయం ప్రారంభం అవ్వడం ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే భూమి కేటాయింపు జరిగింది.

    బాల, బాలికల కోసం నిర్మించిన మరుగుదొడ్లు

    కేంద్రప్రభుత్వం విద్యాలయం మంజూరు చేశాక వాటి నిర్వహణకు కూటమి ప్రభుత్వం సానుకూలం వ్యక్తం చేయాలి. అధికారుల బృందాలు తరగతుల ప్రారంభానికి సముఖత వ్యక్తం చేసినా, దానికి సంబంధించిన నివేదికలు రాష్ట్రప్రభుత్వానికి వెళ్లినా స్పష్టత ఇవ్వనందునే తరగతులు ప్రారంభం కాలేదన్న వాదన విద్యాశాఖ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సానుకూలత వ్యక్తం చేసి ఉంటే ప్రస్తుత ఏడాదిలోనే తరగతులు ప్రారంభమయ్యేవని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడానికి ముఖ్య కారణం ఎంపీ పీవి.మిథున్‌రెడ్డి ఈ కేంద్రం మంజూరుకు కృషి చేయడమే. ఆయన తీసుకొచ్చిన ఈ విద్యాలయాన్ని ప్రారంభిస్తే ఆ పేరు ప్రతిష్టలు మిథున్‌రెడ్డికి దక్కుతాయి. దీంతో ఆయనకు పేరు దక్కకుండా చేస్తే రాజకీయం బలం తగ్గించవచ్చన్న ప్రయత్నమని తెలుస్తోంది. బీటీ కళాశాలను విశ్వవిద్యాలయం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మిథున్‌రెడ్డి జీవో తెప్పించారు. దీన్ని కూడా నిర్లక్ష్యంగా వదిలేసింది కూటమి ప్రభుత్వం.

    విద్యకు ప్రాధాన్యత

    పేదలు, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు అధికంగా ఉన్న మదనపల్లెను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నాం. కేంద్రీయ విద్యాలయం మంజూ రు, భూ కేటాయింపు జరిగింది. బీటికళాశా లను విశ్వవిద్యాలయంగా మార్చడం జరిగింది. ఖరీదైన వైద్యం పేదలకు ఉచితంగా అందేలా మెడికల్‌ కళాశాల మంజూరు చేయించాం. వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయోజనం చేకూర్చాలన్నదే మా ఆశయం. ప్రభుత్వాలు ఏవైనా విద్య, వైద్యంపై కక్ష సాధింపు ధోరణితో ప్రజలకు నష్టం కలిగించేలా వ్యవహరించడం తగదు. కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. –పీవీ.మిథున్‌రెడ్డి, రాజంపేట ఎంపీ

    మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించిన ఎంపీ మిథున్‌రెడ్డి

    రూ.40 లక్షల నిధులతో పనులు చేపట్టిఎస్‌టీ హస్టల్‌ భవనం సిద్దం

    ఈ ఏడాది విద్యార్థులకు అన్యాయం..

    వచ్చే ఏడాది తరగతులుప్రారంభంపైనా అనుమానాలు

    ఈ ఏడాది మే 22న డిప్యూటీ కమిషనర్‌ మంజునాఽథ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ అనురాధల బృందం మదనపల్లెలో పర్యటించింది. భవనాలు. వలసపల్లె వద్ద కేటాయించిన భూమిని పరిశీలించారు. సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌, తహసీల్దార్‌ ధనుంజయలు వెంట ఉన్నారు. సర్వే నంబర్లు 713/3, 713/4, 496/2, 496/3లో కే టాయించిన 6.09 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీనం చేస్తూ జారీచేసిన ఉత్తర్వును తన కార్యాలయంలో సబ్‌కలెక్టర్‌ వారికి అందజేశారు. అయితే ఇంకా భూమి స్వాధీనం కాలేదని చెప్పడం చూస్తే మదన పల్లెలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి ప్రభు త్వం ఏమాత్రం సుముఖంగా లేదని స్పష్టం అవుతోంది.

    మదనపల్లెలో 2025–26 విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయ తరగతులను ప్రారంభించేలా స్థానిక ఎస్టీ హస్టల్‌ బాలుర భవనాన్ని సిద్ధం చేశారు. అందులో తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీనికోసం ఎంపీ మిథున్‌రెడ్డి ఎంపీల్యాడ్స్‌ నుంచి రూ.40 లక్షలు కేటాయించారు. ఆ నిధులతో భవనంపై కొత్త ఒక ఫ్లోర్‌ నిర్మాణం జరిగింది. బాల, బాలికల కోసం మరుగుదొడ్లను నిర్మించారు. విద్యాలయం కోసం మదనపల్లెకు సమీపంలోని వలసపల్లె వద్ద 6.09 ఎకరాల భూమి కేటాయించారు. ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌కు ముందు, తర్వాత మదనపల్లెలో ఈ భవనాన్ని దక్షిణ భారత జోన్‌ ఇన్‌చార్జి కేవి.సంఘటన్‌, డిప్యూటీ కమిషనర్‌ మంజునాథ్‌ల బృందం పర్యటించింది. ఎస్టీ బాలుర హస్టల్‌ భవనంలో తరగతుల ప్రారంభానికి కావాల్సిన వసతులు, ఏర్పాట్లను పరిశీలించి వెళ్లాయి. ఈ భవనంలో తరగతుల ప్రారంభానికి ఈ బృందం మొగ్గుచూపుతూ కొన్నిరోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రకటించారు. ఇక్కడినుంచి వెళ్లాక దాని ఊసేలేదు.

  • వైభవం

    ఘనంగా దర్గా పీఠాధిపతి నగరోత్సవం

    కళ్లు చెదిరేలా బాణసంచా వెలుగులు

    ముగిసిన ఉరుసు మహోత్సవాలు

    కడప సెవెన్‌రోడ్స్‌: ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రమైన పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు ముగిశాయి. చివరిరోజు ఆదివారం రాత్రి దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ నగరోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం ఫకీర్లు, ఇతర శిష్య గణాలతో కలిసి పీఠాధిపతి పెద్దదర్గా నుంచి పెన్నానది తీరంలోని గండి వాటర్‌ వర్క్స్‌ కొండలోని గుహల వద్దకు వెళ్లి జెండా ప్రతిష్ఠించి ఫాతెహా నిర్వహించారు. తర్వాత ఆ ప్రాంతంలో హజరత్‌ మస్తాన్‌స్వామి స్మారకంగా అన్నదానం నిర్వహించారు. సాయంత్రం అక్కడి నుంచి ఊరేగింపుగా కడప నగరానికి తిరిగి వచ్చారు. పలు వాహనాలలో ఆయన శిష్యులు, ప్రముఖులు ఆయన వెంట ఊరేగింపులో పాల్గొన్నారు. రాత్రి మాసాపేటలోని హజరత్‌ మై అల్లా దర్గా షరీఫ్‌ వద్ద నుంచి పీఠాధిపతి ఫకీర్లు, సర్‌గిరోలు, చౌదరీలు, ఖలీఫాలు, శిష్య బృందం, నగర ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వెంట రాగా నగరోత్సవం కొనసాగింది. విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై పీఠాధిపతి కొలువుదీరి ఊరేగింపుగా బయలుదేరారు. దాదాపు అన్ని కూడళ్లలో భక్తులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. బ్యాండు మేళాలకు అనుగుణంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా నృత్యాలు ప్రదర్శించి ఆనందించారు. అడుగడుగునా యువ కు ల బృందాలు ఆయనకు స్వాగతం పలికి ఆశీస్సులు పొందాయి. ఊరేగింపు తెల్లవారుజామున తిరిగి దర్గాకు చేరింది. అనంతరం ఊరేగింపుగా తెచ్చిన చాదర్‌ను గురువు మజార్‌పై సమర్పిచారు.

    దర్గాలో సినీ నటుల ప్రార్థనలు

    దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నటులు సుమన్‌, హాస్యనటులు అలీ ఆదివారం కడపకు వచ్చారు. దర్గాను దర్శించుకుని గురువుల మజార్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారికి దర్గా ముజావర్‌ అమీర్‌ గురువుల చరిత్ర, విశిష్ఠతలను తెలియజేసి ప్రసాదాలు అందజేశారు.

  • సీపీ
    తెలుగు భాషోద్ధారకుడు

    కడప సెవెన్‌రోడ్స్‌: సీపీ బ్రౌన్‌...జిల్లా వాసులకు పరిచయం అక్కర్లేని పేరు. మరణశయ్యపై ఉన్న తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకు జీవితాంతం అవిరళ కృషి చేసిన మహానుభావుడు. జీతంలో తన సొంత ఖర్చులు పోను మిగిలిన ప్రతి పైసా...జీవితంలో మిగిల్చగలిగిన ఒక్క క్షణం తీరిక సమయం వృథా కాకుండా తెలుగుభాషా సాహిత్యాలకు ఖర్చు చేశారు. సోమవారం బ్రౌన్‌ 227వ జయంతి సందర్భంగా ఆయన గురించి....

    ● కలకత్తాలో డేవిడ్‌ బ్రౌన్‌, ఫ్రాన్సెస్‌ కౌళె దంపతులకు 1798 నవంబరు 10వ తేది బ్రౌన్‌ జన్మించారు. తండ్రి మరణం తర్వాత ఆయన కుటుంబం ఇంగ్లాండ్‌ వెళ్లిపోయింది. సివిల్‌ సర్వీసుకు ఎంపికై న బ్రౌన్‌ 1817 ఆగస్టు 3వ తేది మద్రాసు చేరుకుని అదేనెల 13వ తేది అక్కడి కాలేజ్‌ ఆఫ్‌ పోర్ట్‌ సెయింట్‌ జార్జిలో చేరారు.

    కడపలో ఉద్యోగ జీవితం ప్రారంభం

    తెలుగు ప్రజల అదృష్టం కొద్దీ 1820 ఆగస్టులో కడప కలెక్టర్‌ హన్‌బరికి రెండవ అసిస్టెంట్‌గా బ్రౌన్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. ఉద్యోగ నియామక ఉత్తర్వు ఆగస్టు 19వ తేది కడపకు చేరింది. అలా ఆయన ఉద్యోగ జీవితం ఇక్కడే ప్రారంభం కావడం విశేషం. సివిల్‌సర్వీసు శిక్షణ సమయంలో మద్రాసు గవర్నర్‌ సర్‌ థామస్‌ మన్రో మాటల నుంచి ప్రేరణ పొందిన బ్రౌన్‌ రెండేళ్లలో తెలుగు చక్కగా నేర్చుకున్నారు. ఆ తర్వాత బదిలీపై వెళ్లిన బ్రౌన్‌ 1826 మార్చి 10వ తేది కడపజిల్లా కోర్టు రిజిస్ట్రార్‌గా మళ్లీ ఇక్కడికి వచ్చి 1829 ఫిబ్రవరి దాక అసిస్టెంట్‌ జడ్జి, జాయింట్‌ క్రిమినల్‌ జడ్జిగా పనిచేశారు.

    భాషా సాహిత్యాల యజ్ఞం

    ఆ సమయంలోనే కడప ఎర్రముక్కపల్లె వద్ద బంగళా, తోటను రూ. 3500కు కొన్నారు. ఎక్కడ చూసినా పేదరికం, అవిద్య, మూఢాచారాలు రాజ్యమేలుతుండేవి. సృజనాత్మకతతోపాటు సాహిత్య స్పృహ కూడా కొరవడిన తరుణమది. జాతిని ఉత్తేజ పరిచే సాహిత్య సృష్టికి తావు లేని కాలం. ఆ సమయంలో ఆయన భాషా సాహిత్యాల సముద్ధరణ యజ్ఞానికి సమాయత్తమయ్యారు. తన బంగళాలో కొంత భాగాన్ని పండిత మండలి నివాసం కోసం కేటాయించారు. సొంతంగా పండితులకు జీతాలు ఇచ్చి పోషించారు. తెలుగు తాళపత్ర గ్రంథాలు సేకరించి వాటిని కాగితాలపైకి ఎక్కించి శుద్ద ప్రతులు తయారు చేయించారు. వ్యాఖ్యానాలు, పీఠికలు రాయించి ముద్రణకు సిద్ధం చేయడం కడపలో బ్రౌన్‌ సాగించిన నిత్య వ్యవహారం. ఇంగ్లీషు–తెలుగు, తెలుగు–ఇంగ్లీషు నిఘంటువులు రాశారు. ఇంగ్లీషులో తెలుగు వ్యాకరణం రాసిన వారిలో బ్రౌన్‌ చాలా ముఖ్యులు.

    కడపతో ప్రత్యేక అనుబంధం

    కడప జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధం విడదీయలేనిది. కడపలో రెండు పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు భోజన వసతితోపాటు ఉచితంగా తెలుగు, హిందూస్తానీ, పార్శీ భాషల్లో చదువు చెప్పించారు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నా కడపతో సంబంధాలు కొనసాగించారు. మిగతా తెలుగు ప్రజలు గుర్తించుకోకపోయినా బ్రౌన్‌ నివసించిన బంగ్లా మొండిగోడలను సుందర తెలుగు సాహిత్య మహాసౌధంగా, భాషా పరిశోధన కేంద్రంగా నిర్మించి బ్రౌన్‌ కు సుస్థిర స్థానం కల్పించింది కడప వాసులే. ఇందులో డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కీలకపాత్ర పోషించారు.

    సీపీ బ్రౌన్‌ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం బ్రౌన్‌ 227వ జయంతిని తొలిసారి అధికారికంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్‌ సభా భవనంలో నిర్వహించే కార్యక్రమానికి కలెక్టర్‌, జేసీతోపాటు ఇతర అధికారులు హాజరవుతారు. డాక్టర్‌ భూత పురి గోపాలకృష్ణ బ్రౌన్‌ సాహితీ సేవ అంశంపై, జీవీ సాయిప్రసాద్‌ బ్రౌన్‌ ఉద్యోగ ప్రస్థాన జీవితంపై ప్రసంగిస్తారు. అలాగే బ్రౌన్‌ గ్రంథాలయంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న బ్రౌన్‌ జయంతి కార్యక్రమానికి వైవీయూ వీసీ బెల్లకొండ రాజశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

    బ్రౌన్‌కు కడపతో విడదీయరాని అనుబంధం

    ఉద్యోగ జీవితం ప్రారంభం ఇక్కడే

    భాషా సాహితీయజ్ఞం సాగించిందీ ఇక్కడే

    నేడు 227వ జయంతి వేడుకలు

  • నేడు శైవ క్షేత్రాలకు  ప్రత్యేక బస్సులు

    కడప కోటిరెడ్డిసర్కిల్‌: ప్రముఖ శైవ క్షేత్రాలైన పొలతల, నిత్యపూజకోన, శ్రీశైలానికి సోమ వారం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు కడప డిపో మేనేజర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యపూజకోనకు ఉదయం 6.30, 9.30, మధ్యా హ్నం 12.30, 3.30 గంటలకు బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. పొలతలకు ఉదయం 6.30, 9.00, 11.30, మధ్యాహ్నం 2.15, 4.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. ఈ బస్సులు పాత బస్టాండు నుంచి రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. భక్తులు ఈ బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

    కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఏపీ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌– 2025లో ఇద్దరు క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపికై నట్లు డీఎస్‌డీఓ గౌస్‌ బాషా పేర్కొన్నారు. ఇటీవల కాకినాడలో జరిగిన టోర్నమెంట్‌లో అండర్‌ 8–10 కేటగిరీల్లో కడపకు చెందిన ఆర్‌ సుచిత్‌ రెడ్డి రెండు గోల్డ్‌ మెడల్స్‌, అండర్‌ 6–8 కేటగిరీలో ఆర్‌ హార్థిక రెడ్డి రెండు గోల్డ్‌ మెడల్స్‌ సాధించి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారన్నారు. కోచ్‌లు విలియం కేరి, మహేష్‌ అభినందించారు. వీరు డిసెంబరు 5 నుంచి 15 వరకు విశాఖపట్నంలో జరిగే నేషనల్స్‌లో పాల్గొంటారని వెల్లడించారు.

    కడప సెవెన్‌రోడ్స్‌: ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్‌కు కాల్‌ చేయవచ్చని పేర్కొన్నారు.

    సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహణ

    ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, మున్సిపల్‌ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని వివరించారు.

    9.30 నుంచి డయల్‌ యువర్‌ కలెక్టర్‌

    డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్‌ లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునని తెలిపారు.

  • కొనసాగుతున్న ఎంపికలు

    కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: బ్యాడ్మింటన్‌ రాష్ట్రస్థాయి ఎంపికలు నగరంలోని డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో అర్హత సాధించిన క్రీడాకారులకు ఆదివారం నుంచి 3 రోజుల పాటు మెయిన్‌ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యా డ్మింటన్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ జిలానీ బాషా తెలిపా రు. ఆదివారం మెయిన్‌ ఎంపికలను కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో ఇండోర్‌ స్టేడియం కళకళలాడింది. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సెక్రటరి నాగరాజు, మ్యాచ్‌ రెఫరీలు, టెక్నికల్‌ అఫీషియల్స్‌ కోచ్‌లు పాల్గొన్నారు.

  • పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి

    సమ్మెటివ్‌–1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రశ్నపత్రాల స్టోరేజీ, పంపిణీ, భద్రత, పరీక్షల నిర్వహణ అంశాల్లో పొరపాట్లుకు తావు లేకుండా ఏర్పాట్లు చేశాం. ఏరోజు పరీక్షకు ఆరోజు ప్రశ్నాపత్రాన్ని మాత్రమే తీసుకెళ్లి పరీక్ష నిర్వహించాలి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఆరోపణలు రాకూడదు. ఎక్కడా ఏ విధమైన పొరపాట్లు తలెత్తినా హెచ్‌ఎంలు, ఎంఈఓలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

    – షేక్‌ షంషుద్దీన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

  • రేషన్‌ బియ్యం మాఫియాపై ఎస్పీ సీరియస్‌

    అక్రమార్కులను ఏరిపారేయాలని

    పోలీసులకు ఆదేశాలు

    రేషన్‌ బియ్యం వ్యాపారి కోసం

    పోలీసుల గాలింపు

    ప్రొద్దుటూరు క్రైం : రేషన్‌ బియ్యం మాఫియాపై జిల్లా ఎస్పీ నచికేతన్‌ విశ్వనాథ్‌ సీరియస్‌ అయ్యారు. ప్రొద్దుటూరులో రేషన్‌ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాలని ఇక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడి రేషన్‌ బియ్యం అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోవడంతో పోలీసు అధికారులు వారి అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని భావిస్తున్నారు. శనివారం రాత్రి రేషన్‌ బియ్యం వాహనాన్ని పోలీసులు అడ్డుకోగా వాటిని తరలిస్తున్న అక్రమార్కుడు వాహనంతో ఉడాయించిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో పోలీసులపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేసినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఇలానే వదిలేస్తే పోలీసులను కూడా లెక్కచేసే పరిస్థితి ఉండదని, సమాజంలో తమకు విలువ లేకుండా పోతుందని ఇక్కడి పోలీసు అఽధికారులు చెబుతున్నారు.

    రేషన్‌ బియ్యం తరలింపుపై నిఘా..

    రేషన్‌ బియ్యం తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ప్రొద్దుటూరు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని స్టేషన్‌ల పరిధిలో ఆయా సీఐలు కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. అలాగే రేషన్‌ బియ్యం నిల్వ కేంద్రాలు, అక్రమార్కుల కదలికలపై నిఘా పెట్టాలని ఆదేశాలిచ్చారు. బియ్యం అక్రమ రవాణాలో ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. కాగా పట్టణంలోని కొందరు టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ, కొందరు పోలీసు అధికారుల అండతో ఈ రేషన్‌ బియ్యం దందా కొనసాగిస్తున్నారు. అడ్డు వచ్చిన పోలీసులను సైతం లెక్క చేయకుండా పట్టుబడిన వాహనాన్ని తీసుకెళ్లారంటే వారి ఽఽధైర్యం, తెగింపు ఏ పాటిదో తెలుస్తోంది.

    పోలీసుల అదుపులో అక్రమార్కుడి తండ్రి

    పోలీసులు ఉండగా రేషన్‌ బియ్యం వాహనాన్ని తీసుకెళ్లిన రేషన్‌బియ్యం వ్యాపారి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు అతన్ని పోలీసులు విచారణ చేసినట్లు సమాచారం. అంతేగాక రేషన్‌ బియ్యం తీసుకెళ్లిన బొలెరో వాహనాన్ని వన్‌టౌన్‌ పోలీసులు సీజ్‌ చేశారు. డ్రైవర్‌తో పాటు ప్రధాన వాహనం తీసుకెళ్లిన బియ్యం వ్యాపారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఇతని కోసం పోలీసు అధికారులకు పెద్ద ఎత్తున ఫోన్లు వచ్చినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యవహారం పోలీసు ప్రతిష్టతో ముడిపడి ఉందని , అతన్ని వదిలే ప్రసక్తే లేదని, పట్టుకొని తీరుతామని చెబుతున్నారు. కాగా శనివారం రాత్రి రామేశ్వరం రోడ్డులో పట్టుబడిన రేషన్‌ బియ్యం వాహనం వద్ద గిడ్డంగివీధికి చెందిన ఒక ప్రధాన రేషన్‌ బియ్యం వ్యాపారితో పాటు మరి కొందరు కూడా ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • మిట్స్‌ విద్యార్థులు  182 మందికి ఉద్యోగాలు

    కురబలకోట : అంగళ్లు మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఆఖరి సంవత్సరం విద్యార్థులు 182 మందికి కాగ్నిజెంట్‌లో ఉద్యోగాలు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ రామనాథన్‌ తెలిపారు. వీరికి గరిష్ట ప్యాకేజీ ఏడాదికి రూ.6.75 లక్షలని తెలిపారు. ఎంపికై న వారిని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎన్‌. విజయభాస్కర్‌ చౌదరి, ప్రో చాన్స్‌లర్‌ నాదేళ్ల ద్వారకనాఽథ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కీర్తి నాదేళ్ల అభినందించారు

    మదనపల్లె సిటీ : అయ్యప్పమాలధారులకు ముస్లింలు భిక్ష(అన్నదానం) ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు. మదనపల్లె పట్టణం ప్రశాంత్‌నగర్‌ జ్ఞానోదయ పాఠశాలలో ఆదివారం హెల్పింగ్‌ మైండ్స్‌ వ్యవస్థాపకుడు అబూబకర్‌ సిద్దిక్‌తో పాటు ముస్లిం యువకులు కలిసి అయ్యప్ప మాలధారులకు భిక్ష ఏర్పాటు చేశారు. తొలుత అయ్యప్పస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. హెల్పింగ్‌మైండ్స్‌ వ్యవస్థాపకుడు అబూబకర్‌ సిద్దిక్‌ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా పవిత్ర అయ్యప్పమాలధారులకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మతసామరస్యంతోపాటు సోదరభావాన్ని పెంపొందించడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో సభ్యులు ఖాదర్‌ఖాన్‌, హనీఫ్‌, సమీర్‌, సైసవల్లి, ఉమర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • 25న దేశవ్యాప్త ఆందోళన

    కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కార్మికుల మెడకు ఉరితాడైన నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికై నా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25న నిర్వహిస్తున్న దేశవ్యాప్త ఆందోళన జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చలసాని వెంకటరామారావు కోరారు. ఆదివారం నగరంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్‌ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా జనరల్‌ బాడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు అవుట్‌ సోర్శింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రెగ్యులరైజేషన్‌ చేయాలన్నారు. కేంద్రంలో ఉన్న 11 కార్మిక సంఘాలు ఉమ్మడిగా నవంబర్‌ 25 వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె చేసి ఈ నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయించుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కేసీ బాదుల్లా ఉపాధ్యక్షులు మంజుల, శ్రీరాములు, చాంద్‌ బాషా, కార్యదర్శులు మద్దిలేటి, మస్తాన్‌, లింగన్న, ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

  • విష పురుగు కాటుతో వ్యక్తి మృతి

    పోరుమామిళ్ల : విష పురుగు కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలోని కాపువీధిలో జరిగింది. ఎస్‌ఐ కొండారెడ్డి కథనం మేరకు ఈనెల 6 వ తేది రాత్రి 11 గంటల ప్రాంతంలో చిలమల గురయ్య (43) తన ఇంటి ముందు కూర్చొని ఉండగా బొటనవేలు కింద విషపురుగు కాటేసింది. దాన్ని తేలికగా తీసుకుని నిద్రపోయాడు. 7 వ తేదీ ఉదయం కాలు కమిలిపోయి నల్లగా ఉండటంతో భయపడి కడప రిమ్స్‌కు వెళ్లాడు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించి, విషానికి విరుగుడు ఇంజక్షన్‌ ఇచ్చి చికిత్స చేశారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి గురయ్య మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు.

    అదృశ్యమైన గంటలోపే

    ఆచూకీ లభ్యం

    ఎర్రగుంట్ల : అదృశ్యమైన విద్యార్థిని గంటలోపే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించి పోలీసులు శభాష్‌ అనిపించుకున్నారు. వివరాలు ఇలా.. ఎర్రగుంట్ల పట్టణంలోని రెండవ సచివాలయంలో కవిత ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. ఆమె కుమారుడు సోమచరణ్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కుమారుడు పాఠశాలకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో భయ పడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ విశ్వనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా గాలించి గంటలోపే సోమచరణ్‌ను గుర్తించారు. తల్లి కవితను స్టేషన్‌కు పిలిపించి సోమచరణ్‌ను అప్పగించారు.

  • వైఎస్‌ భారతిపై  ఆరోపణలు తగదు

    ఖాజీపేట : మామ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, భర్త వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉంటే ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోని ఉత్తమ ఇల్లాలు. సొంత నిధులతో పేద విద్యార్థులను, దివ్యాంగులను, మానసిక వికలాంగులను అక్కున చేర్చుకొని చదివిస్తూ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్న మానవతావాది వైఎస్‌ భారతమ్మ. అలాంటి ఉన్నత వ్యక్తిత్వం గల భారతమ్మపై రాజకీయంగా విషం చిమ్మేందుకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిది నోరా? డ్రైనేజీనా? అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖాజీపేట మండలం, దుంపలగట్టు గ్రామంలోని తన స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఏనాడైనా భారతమ్మ ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొన్నదా? రాజకీయాల్లో జోక్యం చేసుకుందా? ఆదికి దమ్ము, ధైర్యం ఉంటే చెప్పాలని సవాల్‌ విసిరారు. వైఎస్‌ కుటుంబం లేకపోతే ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి రాజకీయ మనుగడ, ఉనికి ఉందా? అని ప్రశ్నించారు. ఇలాంటి విమర్శలతో చంద్రబాబు మెప్పు పొందాలనుకుంటే రాజకీయ సమాధి తప్పదన్నారు.

  • డ్రాగ

    కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మూడవ రౌండ్‌ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్ల ధాటికి బ్యాటర్లు విల విల్లాడారు. రెండవ రోజు వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో కడప–అనంతపురం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆదివారం రెండవ రోజు 54 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 71.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని ప్రణధీర్‌ 29 పరుగులు, మన్నన్‌ 26 పరుగులు చేశారు. కడప జట్టులోని భాను వర్షిత్‌ రెడ్డి 3 వికెట్లు, ముని జాన్ఞేశ్వర్‌ రెడ్డి 3 వికెట్లు, మోనిష్‌ రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 46 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆ జట్టులోని డీఎండీ తాహీర్‌ 61 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని ట్రెడిక్‌ 2 వికెట్లు, కార్తీక్‌ సాయి 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

    కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో...

    కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో చిత్తూరు –కర్నూలు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆదివారం రెండవ రోజు 78 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 81.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 289 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. ఆ జట్టులోని కేవీఎస్‌ మణిదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 167 బంతుల్లో 102 పరుగులు, ప్రశవ్‌ 41 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని యశ్వంత్‌ సూర్య తేజ్‌ 3 వికెట్లు, చేతన్‌ సాయి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 32 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఆ జట్టులోని మోక్షజ్ఞ రెడ్డి 63 పరుగులు, వియం శక్తి 60 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

    కేవీఎస్‌ మణిదీప్‌, చిత్తూరు (102 పరుగులు)

    డీయండీ తాహీర్‌, కడప

    (61 పరుగులు)

    వియం శక్తి, కర్నూలు

    (60 పరుగులు)

    మోక్షజ్ఞ రెడ్డి, కర్నూలు

    (63 పరుగులు)

  • మృతులు కడప వాసులు

    మైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిలోని కూడలికి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వీరు కడప నగరానికి చెందిన వారుగా గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప బెల్లంమండి వీధికి చెందిన సాయి సంజయ్‌ (23), చిన్న చౌక్‌ ప్రాంతంలోని అశోక్‌ నగర్‌కు చెందిన చింతల సంతోష్‌ (23 ) అనే యువకులు ఇంటర్‌ చదువుతున్నప్పటి నుండి స్నేహితులు. వీరు ఆదివారం స్కూటీలో వెళుతుండగా కూడలి వద్ద సమీపంలో నెల్లూరు – బళ్లారి జాతీయ రహదారి బైపాస్‌ ఫ్లైఓవర్‌ పై ప్రమాదం జరిగింది. సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనకు కారణాలు తెలియ రాలేదు. మృతుల్లో సాయి సంజయ్‌ కడపలోని ఓ జ్యువెలరీ దుకాణంలో పనిచేస్తుండగా, సంతోష్‌ డిగ్రీ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. సాయి సంజయ్‌ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కాగా, సంతోష్‌ తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు. మృతుడు సంతోష్‌ పెద్దవాడు కాగా, డిగ్రీ చదువుతున్న జస్వంత్‌ రెండవ కొడుకు. వీరి తండ్రి రమేష్‌ మృతి చెందారు. తల్లి మహేశ్వరి నందలూరు ఆడపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో వాచ్‌మెన్‌ గా పనిచేస్తున్నారు. అర్బన్‌ ఎస్‌ఐ చిరంజీవి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతుల వివరాలను తెలుసుకున్నారు. అయితే వారు కడప నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    సాయి సంజయ్‌, చింతల సంతోష్‌ (ఫైల్‌)

  • వైవీయూ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలి

    కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేతన బిల్లుల చెల్లింపులో అవకతవకలకు పాల్పడిన ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ పి. పద్మపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది అక్టోబర్‌ 2025 నెల వేతన బిల్లుగా 2 కోట్ల 94 లక్షల 82 వేల 153 రూపాయల మొత్తానికి అక్టోబర్‌ 25న రిజిస్ట్రార్‌ ఆచార్య పుత్తా ఆమోదం తెలిపినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయన్నారు బోధన బోధనేతర సిబ్బంది ఖాతా వివరాలు అప్‌లోడ్‌ చేయకుండా, తన సొంత బ్యాంక్‌ ఖాతా నంబర్‌ను చేర్చారన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ ప్రకారం ఒక అధికారి (మేకర్‌) వేతన వివరాలు అప్‌లోడ్‌ చేస్తే, మరొక అధికారి (చెకర్‌) వాటిని ధ్రువీకరించి ఆపై రిజిస్ట్రార్‌ ఆమోదించాలన్నారు. కానీ రిజిస్ట్రార్‌ ఒక్కరే మొత్తం ప్రక్రియను నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. కడప ట్రెజరీ కార్యాలయానికి చెందిన పవన్‌ కుమార్‌ నాగూరి బిల్లును సబ్‌ ట్రెజరీ అధికారికి పంపగా ఆయన ఉదయ శేఖర్‌ రెడ్డికి, అక్కడి నుంచి ఉప సంచాలకుడు వెంకటేశ్వర్లుకు పంపించారన్నారు. వారు అక్టోబర్‌ 27న ఆమోదించి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా బిల్లును ఫైనాన్స్‌ శాఖకు పంపారన్నారు అనంతరం, ఆ శాఖ సరైన పరిశీలన చేయకుండానే బిల్లును చెల్లింపుల కోసం ఆర్‌బీఐకి పంపినట్లు సమాచా రం ఉందన్నారు. ఇది పలు స్థాయిలలో ఉన్న పర్యవేక్షణ లోపాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఆచార్య పుత్తా పద్మ గతంలో పరీక్షల నియంత్రణాధికారిగా ఉన్న సమయంలో కూడా విశ్వవిద్యాలయ పాత రికార్డులు, బుక్‌లెట్లు విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయని, అప్పటి యూనివర్సిటీ యా జమాన్యం, ఉన్నతవిద్యాశాఖ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. గతంలో జరిగిన అక్రమ నియామకాలపై విచారణ జరిపించాలని ఉన్నత విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చినా ఆయా లేఖలు అన్ని ఆమె వద్దనే భద్రంగా దాచుకున్నారన్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలపై ఉన్నత విద్యాశాఖ విచారణ జరిపించాలని, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

  • నగరేశ

    ప్రొద్దుటూరు కల్చరల్‌ : స్థానిక వాసవీ సర్కిల్‌లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఉద్యాన వనంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నగరేశ్వరస్వామికి ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. నూతనంగా చరప్రతిష్ట చేసిన నగరేశ్వరస్వామి స్వరూప స్ఫటిక లింగానికి, పార్వతీ సమేత నగరేశ్వరస్వామి విగ్రహాలకు శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామిజీ చేతుల మీదుగా ప్రత్యేక పూజాకార్యక్రమాలను జరిపారు. 102 మంది ఆర్యవైశ్య సుహాసినులు పార్వతీ మాతకు సామూహికంగా కుంకుమార్చనలు చేశారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్‌ రావు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

    ఉత్సాహంగా తైక్వాండో

    చాంపియన్‌ షిప్‌ పోటీలు

    ప్రొద్దుటూరు : జిల్లా తైక్వాండో సబ్‌ జూనియర్‌, కేడెట్‌, సీనియర్‌ కై రోగి, పూమ్సే చాంపియన్‌ షిప్‌ పోటీలు స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని స్టేడియంలో ఈనెల 8, 9 తేదీలలో నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 200 మందికిపైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలను ఎస్‌ఐ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో మొదటి స్థానం కోడూరు టీం, రెండో స్థానం ప్రొద్దుటూరు టీం, మూడో స్థానం పులివెందుల టీం సాధించినట్లు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కమాల్‌ తెలిపారు. విజేతలకు ఎస్‌ఐ ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌పీడీసీఎల్‌ బీసీ సంఘం అధ్యక్షుడు మురళీమోహన్‌, ప్రెసిడెంట్‌ మౌలా, ఖజాంచి శివాజీ, టెక్నికల్‌ ఇన్‌చార్జి సుధీర్‌ పాల్గొన్నారు.

  • కడపలో యువకుడి దారుణ హత్య

    కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప నగరం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అమీన్‌పీర్‌ దర్గా ఉరుసు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇద్దరు యువకుల మధ్య గతంలో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఉర్సుకు సమీపంలో ఎగ్జిబిషన్‌ జరిగే ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన కడప నగరంలో సంచలనం కలిగించింది. ఈ సంఘటన కడప టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోనే జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ హత్య సంఘటనపై పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కుమ్మరికుంటకు చెందిన సయ్యద్‌ అబూబకర్‌ అలియాస్‌ గౌస్‌ బాషా(25) కు, కడపకు చెందిన అబూజార్‌, యూసఫ్‌ ల మధ్య గతంలో మనస్పర్ధలు ఉండేవి. శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అబూబకర్‌ ఉరుసుకు వచ్చాడు. అదే సమయంలో నిందితులు, మరో ఏడుగురు స్నేహితులతో కలిసి అబూబకర్‌ కి ఎదురుపడ్డారు. వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో యూసఫ్‌ తన వద్ద ఉన్న కత్తి తీసుకుని అబూబకర్‌ పొట్టలో గట్టిగా పొడిచి చీల్చివేశాడు. దీంతో రక్తపు మడుగులో అబూబకర్‌ తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అబూబకర్‌ను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడప టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

    పోలీసుల అదుపులో నిందితులు?

  • అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు

    కడప కార్పొరేషన్‌ : కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. ఆదివారం 27వ డివిజన్‌లో కో ఆప్షన్‌ సభ్యులు జహీర్‌, సలీం, గౌస్‌లపై కేసు నమోదైన నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ అని, అక్రమ కేసులు, అరెస్టులు తమకు కొత్త కాదన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందని, అక్కడ న్యాయం జరుగుతుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కక్షసాధింపులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదన్న సత్యాన్ని టీడీపీ నాయకులు గుర్తించాలని సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు షంషీర్‌, షఫీ, అక్బర్‌, దాసరి శివప్రసాద్‌, మహ్మద్‌ అలీ, ఫయాజ్‌, ఖదీర్‌, పాల్గొన్నారు.

  • బ్రౌన్‌ గ్రంథాలయం దేశానికి వారసత్వ సంపద

    కడప ఎడ్యుకేషన్‌ : సి.పి.బ్రౌన్‌ నివసించిన స్థలంలో ఏర్పడిన బ్రౌన్‌ స్మారక గ్రంథాలయం దేశానికి వారసత్వ సంపద అని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇంటాక్‌ కన్వీనర్‌ సింగం లక్ష్మినారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం సి.పి.బ్రౌన్‌ గ్రంథాలయాన్ని సందర్శించిన లక్ష్మినారాయణ మాట్లాడుతూ డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి లాంటి మహనీయుల కృషి ఫలితంగా వెలసిన గ్రంథాలయంలోకి అడుగిడడం తన అదృష్టం గా భావిస్తున్నానని అన్నారు. పరిశోధన కేంద్రంలో భద్రపరచిన ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, చేతితో తయారు చేసిన రాతప్రతులు, తామ్రపత్రం, నాణేలు లాంటి పలు ప్రాచీన సంపదను కాపాడడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ శాశ్వత సభ్యత్వాన్ని పొందడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సలహా మండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్‌, సహాయ పరిశోధకులు డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు ఎన్‌.రమేశ్‌రావు, జి.హరిభూషణ్‌ రావు, జూనియర్‌ అసిస్టెంట్లు ఆర్‌.వెంకటరమణ, ఎం.మౌనిక, గ్రంథాలయ సిబ్బంది, ఇంటాక్‌ సభ్యుడు జి.సాయి కుమార్‌ పాల్గొన్నారు.

    తెలుగు రాష్ట్రాల ఇంటాక్‌ కన్వీనర్‌

    సింగం లక్ష్మినారాయణ

Sports

  • ఢిల్లీ గడ్డపై తొలిరోజు ఆటలో ఆతిథ్య జట్టు బ్యాటర్ల పనిపట్టిన జమ్మూ కశ్మీర్‌ రెండో రోజు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. దీంతో రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘డి’లో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో కశీ్మర్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన జమ్మూ కశ్మీర్‌ 91.2 ఓవర్లలో 310 పరుగుల వద్ద ఆలౌటైంది.

    టాప్‌–4 బ్యాటర్లు ఇక్బాల్‌ (14), శుభం (4), వివ్రాంత్‌ శర్మ (14), సునీల్‌ (1) వరుసగా విఫలమవడంతో జట్టు ఆరంభంలో తడబడింది. దీంతో 46 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన జమ్మూ కశీ్మర్‌ను కెపె్టన్‌ పారస్‌ డోగ్రా (106; 11 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నాడు.

    రంజీ ట్రోఫీలో పారస్‌ డోగ్రా 33వ సెంచరీ సాధించి జమ్మూ కశ్మీర్‌కు కీలకమైన ఆధిక్యాన్ని అందించాడు. సహచరుల్లో అబ్దుల్‌ సమద్‌ (85; 12 ఫోర్లు, 1 సిక్స్‌), కన్హయ్య  (47; 4 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్‌ సిమర్‌జీత్‌ సింగ్‌కు 6 వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడిన ఢిల్లీ ఆట ముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అర్పిత్‌ (2 బ్యాటింగ్‌), సనత్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

    త్రిపుర 602/7 డిక్లేర్డ్‌ 
    అగర్తలా: గ్రూప్‌ ‘సి’లో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు చేసింది. 316/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆదివారం ఆట ప్రారంభించిన త్రిపుర 602/7 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సెంచరీ హీరో హనుమ విహారి (156; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన క్రితం రోజు స్కోరుకు కేవలం 13 పరుగులు చేసి నిష్క్రమించగా, విజయ్‌ శంకర్‌ (150 నాటౌట్‌; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టాడు. రాణా దత్త (51; 8 ఫోర్లు), మురాసింగ్‌ (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆడిన అస్సాం 4 వికెట్లకు 67 పరుగులు చేసింది. అభిజిత్‌ సర్కార్‌ 2 వికెట్లు తీశాడు.