పోరుబాటకు.. మేము సైతం!
సంతకం చేస్తున్న జాహీర్ హుస్సేన్
సంతకం చేస్తున్న మహిళలు
ఏపీలోని కూటమి ప్రభుత్వ అరచకాలు, అసంబద్ధ నిర్ణయాలపై తమిళనాడులోని తెలుగుప్రజలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చైన్నెలో సోమవారం ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి చంద్రబాబు సర్కారు కమీషనర్ల రాజ్యం నడుపుతోందని ఈ సందర్భంగా ప్రజలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, చైన్నె: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తమిళనాట సైతం తెలుగు హృదయాలలో వ్యతిరేకత, ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను, చంద్రబాబు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ చైన్నెలో వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడు ఏకే జాహీర్ హుస్సేన్ నేతృత్వంలో సంతకాల సేకరణకు ఆదివారం శ్రీకారం చుట్టారు. వివరాలు.. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థుల వైద్యవిద్య కలను సాకారం చేసే దిశగా గతంతో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత చర్యలు తీసుకుంది. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా వైద్య కళాశాలు, ఆస్పత్రులను నెలకొల్పింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ అస్మదీయులకు ఈ కళాశాలలను కట్టబెట్టే దిశగా దూకుడు పెంచింది. పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కల్పించిన భరోసాను కాల రాసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్య ముసుగులో ప్రజల సంపదను దోచుకునేందుకు తెరదీసింది. ప్రైవేటు అజమాయిషీలోకి వైద్య కళాశాలలు, ఆస్పత్రులను తీసుకొచ్చి పేదలకు అందని ద్రాక్షగా వైద్యం సేవలను మార్చేందుకు పన్నాగాలపై దృష్టిపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు చైన్నెలోని అభిమాన లోకం సైతం కదిలింది.
ముమ్మరంగా సంతకాల సేకరణ
డబ్బున్నోడికే వైద్యం, సంపన్నుడికే ఉన్నత వైద్య సీట్లు అన్న నినాదంతో సాగుతున్న కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ చైన్నెలో తమిళనాడు వైఎస్సార్ సేవాదళ్ నేతృత్వంలో సంతకాల సేకరణకు ఆదివారం శ్రీకారం చుట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చైన్నెలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వారు ఈసంతకాల సేకరణకు తరలి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ స్థాపించిన మెడికల్ కళాశాలలను కొత్త ప్రభుత్వ కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌కు పలు అంశాలను సూచిస్తూ, ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఖండించే విధంగా సంతకాల సేకరణకు నడుంబిగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు స్పందించి చైన్నెలో వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ నేతృత్వంలో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంకతాల సేకరణ కార్యక్రమంపై దృష్టి పెట్టారు. చైన్నెలో తెలుగు వారు అత్యధికంగా ఉండే ప్రాంతాలలో ఈ సంతకాల సేకరణకు చర్యలు తీసుకున్నారు. ఆదివారం షోలింగనల్లూరులోని గంగమ్మ కోయిల్ వీఽధిలో జరిగిన సంతకాల సేకరణకు పెద్దసంఖ్యలో తెలుగు వారు తరలి వచ్చి తాము సైతం అని ముందుడుగు వేశారు. పేదల విద్యాహక్కును కాలరాయవద్దని నినదించారు. అందరికీ దరఖాస్తులను ఏకేజాహీర్ హుస్సేన్ అందజేశారు.
చైన్నెలో 10 వేల మంది తెలుగు వారితో సంకతాలను సేకరించి దర ఖాస్తులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అందజేయనున్నట్టు ఏకే జహీర్ హుస్సేన్ తెలిపారు. రోజూ సంతకాల సేకరణకు చర్యలు తీసుకుంటునే ఆదివారాల్లో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాలలో శిబిరాలను ఏర్పాటుచేస్తున్నామని జహీర్ హుస్సేన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఆగడగాలపై ఇక్కడున్న తెలుగు వారు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సేవాదళ్ వర్గాలు శరత్‌కుమార్‌రెడ్డి, సూర్యారెడ్డి, కృతిక, వరుణ్‌కుమార్, శివ, సంపత్‌కుమార్, మల్యాద్రి, కొండయ్య, ఎన్ కల్యాణ్, మురళి, శ్యామ్ సంగ్, పొల్లారెడ్డి,చిన్నప్పరెడ్డి, సాయికుమార్‌రెడ్డి, ఇంధ్రసేనారెడ్డి, ప్రకాష్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
పోరుబాటకు.. మేము సైతం!
పోరుబాటకు.. మేము సైతం!


