ఎండుతున్న చెరుకు
పళ్లిపట్టు: కట్టింగ్‌కు అనుమతులతో కూలీలు పెట్టి చెరుకు దిగుబడి చేసి తరలింపునకు సిద్ధంగా ఉంచిన వాహనాలు సకాలంలో పంపక పోవడంతో రైతులు నష్టపోతున్నారు. తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కే పేట పరిసర ప్రాంతాల్లోని చెరుకు రైతులు తిరువలంగాడులోని తిరుత్తణి సహకార చక్కెర కర్మాగారానికి చెరుకు సరఫరా చేస్తున్నారు. గత నెల 24న చెరుకు క్రషింగ్ ప్రారంభమైంది. దీంతో రైతులకు సహకార షుగర్ ఫ్యాక్టరీ అధికారులు కట్టింగ్ అను మతి ఇవ్వడంతో రైతులు కూలీలను తీసుకొచ్చి చెరుకు కట్టింగ్ చేసి తరలింపునకు సిద్ధం చేశారు. అయితే నాలుగు రోజులైనా వాహనాలు పంపక పోవడంతో చెరుకు ఎండకు ఎండి బరువు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ విషయమై అత్తిమాంజేరి గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌నాయు డు మాట్లాడుతూ.. తిరుత్తణి సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెరుకు తరలించేందుకు రెండువేల మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నామన్నారు. కట్టింగ్ ఆర్డర్లు పొంది కూలీలు పెట్టి చెరుకు నరికి ఫ్యాక్టరీకి తరలించేందుకు రోడ్ల వద్ద సిద్ధంగా ఉంచామని తెలిపారు. అయితే షుగర్ కేన్ ఆఫీసర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు బ్రోకర్లతో చేతులు కలిపి ఆంధ్రా నుంచి చెరుకును తిరుత్తణి షుగర్ ఫ్యాక్టరీకి తరలించి ఆదాయం పొందుతున్నారని ఆరోపించారు. దీంతో రోజుకి 2200 టన్నుల క్రషింగ్ చేసే సామర్ధ్యం ఉన్న తిరుత్తణి షుగర్ ఫ్యాక్టరీకి రోజుకి 5000 టన్నులు చెరుకు రావడంతో సమస్య తలెత్తుతోందని తెలిపా రు. దళారీలతో షుగర్ ఫ్యాక్టరీ అధికారులు చేతు లు కలిపి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నందున జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు. ఆంధ్రా చెరుకు తరలింపునకు అడ్డుకట్ట వేసి వెంటనే కట్టింగ్ చేసి ఎండుతున్న చెరుకు తరలించే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎండుతున్న చెరుకు


