బైక్ ప్రమాదంలో
జిమ్ మాస్టర్ మృతి
తిరుత్తణి: బైకు ఆవు ను ఢీకొని జిమ్ మాస్టర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరువలంగాడు ప్రాంతంలో చోటుచేసుకుంది. అరక్కోణంలోని రాజగోపాల్‌నగర్‌కు చెంది న ప్రభు నవీన్(39) అదే ప్రాంతంలో జిమ్ నిర్వహించేవారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అతని రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులో చైన్నెకు వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తరుగు పయనమైయ్యారు. తిరువలంగాడు అరక్కోణం రాష్ట్ర రహదారిలోని వ్యాశపురం వద్ద వేగంగా వెళ్లుతుండగా ఎదురుగా ఆవు రావడంతో అదుపు తప్పి బైకు ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన ప్రభు నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆవు సైతం మృతి చెందింది. తిరువలంగాడు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం అరక్కోణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగంతో జిమ్ మాస్టర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది.
విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత
– బహ్రెయిన్ విమానం
అత్యవసరంగా ల్యాండింగ్
కొరుక్కుపేట: గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ నుండి చైన్నెకి ఒక విమానం ఆదివారం అర్ధరాత్రి 187 మంది ప్రయాణికులతో వస్తుంది. ఈ విమా నం గాల్లోనే ఎగురుతుండగా, ఒక ప్రయాణికుడికి ఆరోగ్య సమస్య వచ్చింది. అతనికి అత్యవసర వైద్య చికిత్స అవసరం. దీని తరువాత పైలట్ అధికారులకు సమాచారం ఇచ్చి, తెల్లవారుజామున 3.30 గంటలకు ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడ సిద్ధంగా ఉన్న వైద్య బృందం ప్రయాణికుడిని రక్షించి ఆసుపత్రిలో చేర్చింది. తరువాత, 186 మంది ప్రయాణికులతో కూడి న విమానం ఈరోజు ఉదయం 7.40 గంటల కు, దాదాపు 3 గంటలు ఆలస్యంగా చైన్నె చేరు కుంది. ఆలస్యం కారణంగా విమానం సోమ వారం ఉదయం 9.05 గంటలకు బహ్రెయిన్‌న్‌కు తిరిగి బయల్దేరింది.
శిశువుతో
పోలీసు పరీక్ష రాసిన తల్లి
కొరుక్కుపేట: తమిళనాడు యూనిఫామ్డ్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు తమిళనాడు అంతటా కానిస్టేబుల్, జైలు గార్డ్, అగ్నిమాపక సిబ్బంది, లెవల్ 2 పోస్టులకు రాత పరీక్షను నిర్వహించింది. మామండూర్ ప్రాంతానికి చెందిన సుగుణ అనే యువతి తన 15 రోజుల పాప, తన భర్తతో కలిసి పరీక్ష రాయడానికి కాంచీపురంలోని ఎనత్తూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి వచ్చింది. ఇది అక్కడ పరీక్ష రాయడానికి వచ్చిన ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. సుగుణ పరీక్ష రాస్తున్నప్పుడు శిశువు ఏడవకుండా ఉండడానికి పరీక్షా కేంద్రంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పరీక్షా కేంద్రంలో ప్రత్యేక తల్లిపాలు ఇచ్చే గదిని ఏర్పాటు చేశారు. డీఎస్పీ శంకర్ గణేష్ ఆమెకు సహా యం చేయడానికి 10 నిమిషాలు తల్లిపాలు ఇవ్వడానికి సమయం ఇచ్చారు. అందరూ దీని ని అభినందించారు. పోలీస్ పోస్టుపై కోరిక, ఆశయం కారణంగా ప్రసవించిన 15 రోజుల తర్వాత పరీక్ష రాయడానికి వచ్చిన యువతి సుగుణను అందరూ అభినందించారు.
కొడుకును చంపిన
తండ్రి అరెస్టు
అన్నానగర్: అంబత్తూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని కళ్యాణపురం ప్రాంతంలో నివశిస్తున్న మన్మథన్, ఇతని భార్య కళ్యాణి. వీరి కుమారుడు శ్రీధర్(31) ఆటో డ్రైవర్. ఇతని భార్య కుటుంబ వివాదం కారణంగా అతని నుండి విడిపోయింది. దీంతో శ్రీధర్ తన తల్లిదండ్రులతో నివశిస్తున్నాడు. ఈ స్థితిలో శ్రీధర్ ఆదివారం ఉదయం ఇంట్లో తన మంచంలో గొంతు కోసి దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు ఇంట్లో లేరు. అతని తల్లి కళ్యాణి రెడ్‌హిల్స్ సమీపంలోని తన కుమార్తె ఇంట్లో ఉంది. అతని తండ్రి మన్మథన్ మాంసం వ్యాపారం చేస్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు మన్మథన్‌ను తీవ్రంగా విచారించారు. ప్రతి రోజూ తాగి వ చ్చి గొడవలు పడుతుండడంతో తన కుమారు డు శ్రీధర్‌ని గొంతు కోసి చంపినట్లు అంగీకరించాడు. మన్మథన్ భార్య కళ్యాణి కూడా ఇందు లో భాగస్వామి అని తేలింది. దీని తరువాత, ఇన్‌స్పెక్టర్ జామిస్ బాబు, పోలీసులు మన్మథన్, అతని భార్య కళ్యాణి ఇద్దరినీ అరెస్టు చేశారు.
చెల్లెలిపై దాడి చేసిన
అక్క..
తిరువొత్తియూరు: చైన్నె, వ్యాసార్పాడిలో ఆస్తి గొడవలో చెల్లెలిపై దాడి చేసిన అక్కను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె వ్యాసార్పాడి పి.కళ్యాణపురం ప్రాంతానికి చెందిన రాగిణి(33). ఈమె అక్క రతిదేవి (40). వీరి మధ్య ఆస్తి సమస్యల కారణంగా గొడవలు జరుగుతున్నాయి. గత 5వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో రాగిణి ఇంటికి వచ్చిన రతిదేవి, ఆమె కుమారులతో కలసి రాగిణిపై దాడి చేయడంతో గాయపడింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి వచ్చింది. దీనిపై ఫిర్యాదు మేరకు వ్యాసర్పాడి పోలీసులు కేసు నమోదు చేసి రతిదేవిని అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.


