వృద్ధ దంపతులకు సత్కారం
తిరుత్తణి: 70 ఏళ్లు నిండిన వృద్ధ దంపతులను సత్కరించనున్నట్లు అసెంబ్లీలో హిందూ దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు ప్రకటించారు. ఈ మేరకు వృద్ధ దంపతుల సత్కార కార్యక్రమం సోమవారం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చైన్నెలో ప్రారంభించారు. ఇందులో భాగంగా తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పది మంది వృద్ధ దంపతులు ఎంపిక చేసి, వారిని సత్కరించే కార్యక్రమం ఆలయ కావడి మండపంలో నిర్వహించా రు. ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్, జిల్లా హిందూ దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ అముద పాల్గొన్నారు. ఎంపిక చేసిన వృద్ధ దంపతులకు పూలమాలలు వేసి పట్టు వస్త్రాలు, పండ్లు, పసుకు, కుంకుమ, గాజులు సహా రూ.2500 విలువైన వస్తు సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు సురేష్‌బాబు, నాగన్, మున్సిపల్ కౌన్సిలర్లు గణేశన్, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.


