భారీ ప్యాకేజీతో కూడిన ఉద్యోగాలు
తిరువళ్లూరు: విదేశీ భాషలను నేర్చుకోవడం ద్వారా భారీ ప్యాకేజీతో కూడిన ఉద్యోగాలను సాధించుకోవచ్చని ఆర్‌ఎంకే కళాశాల విద్యాసంస్తల ఛైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం సూచించారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎంకే కళాశాలకు చెందిన పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో 20వ అల్యూమిని మీట్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.2014వ బ్యాచ్‌కు చెందిన వెంకటసుబ్రమణ్యం అద్యక్షత వహించగా వార్షిక నివేదికను స్టాప్ సెక్రెటరీ హరిహరన్ ప్రవేశ పెట్టారు. కళాశాల వైస్ ఛైర్మన్ ఆర్‌ఎం కిషోర్ ప్రారంభోపన్యాసం చేశారు. కార్యదర్శి యలమంచి ప్రదీప్ అతిథులను పరిచయం చేశారు.


