మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దారుణం
మాచర్ల: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను నేటి కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని చూడడం దారుణమని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రుల కోటి సంతకాల’ సేకరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి రాష్ట్ర ఐటీ వింగ్ అధ్యక్షుడు సునీల్‌రెడ్డి పోసింరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల శివారెడ్డి, పులిచర్ల అంజిరెడ్డి, స్టేట్ ఐటీ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్యాల విజయభాస్కర్‌రెడ్డిలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ ఏపీలో పేద విద్యార్థులు చదువుకోవటానికి అవకాశం లేకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. ఆ కుట్రలను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తిప్పికొడతామన్నారు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీలో స్థిరపడిన ఏపీ చెందిన ప్రజల చేత సంతకాల సేకరణ చేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి


