అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు

Nov 10 2025 7:42 AM | Updated on Nov 10 2025 7:42 AM

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు

కడప కార్పొరేషన్‌ : కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. ఆదివారం 27వ డివిజన్‌లో కో ఆప్షన్‌ సభ్యులు జహీర్‌, సలీం, గౌస్‌లపై కేసు నమోదైన నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ అని, అక్రమ కేసులు, అరెస్టులు తమకు కొత్త కాదన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందని, అక్కడ న్యాయం జరుగుతుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కక్షసాధింపులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదన్న సత్యాన్ని టీడీపీ నాయకులు గుర్తించాలని సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు షంషీర్‌, షఫీ, అక్బర్‌, దాసరి శివప్రసాద్‌, మహ్మద్‌ అలీ, ఫయాజ్‌, ఖదీర్‌, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement