ఢిల్లీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి
పులివెందుల: దేశ రాజ ధాని ఢిల్లీలో సోమ వారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. ఈ సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, మరో 20మంది తీవ్రంగా గాయపడటం బాధాకరమని పేర్కొన్నారు. జాతీయ జెండా ఎగురవేసే ఎర్రకోట వద్దే ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ సంఘటన జరగడానికి కారణమైన వారిని కేంద్ర హోం శాఖ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు.
కడప కార్పొరేషన్: కడప విమానాశ్రయం అడ్వై జరీ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్య క్షుడు దేవిరెడ్డి ఆదిత్య నియమితులయ్యారు. కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి సిఫారసు మేరకు ఆయన్ను సభ్యునిగా నియమించినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పి.సుజిత్ కుమార్ తెలిపారు. ఈనెల 14న జరగనున్న ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి ఆహ్వానం పంపారు.
కడప ఎడ్యుకేషన్: సీకే దిన్నె మండలం మూలవంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న జనాబ్ మహమ్మద్ మునీమ్‌కు రాష్ట్ర ఉర్దూ అకాడమీ ’లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు’ వరించింది. ఈమేరకు కడప జిల్లా నుంచి ఎన్నికై నట్లు రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రకటించింది. విజయవాడలో ఈ నెల 11 తేదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైనారిటీ మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు.
కడప ఎడ్యుకేషన్: ఏపీ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న విద్యార్థులతో మాక్ అసెంబ్లీని అమరావతిలో నిర్వహించనున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి నియోజక వర్గం నుంచి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి ఆ జాబితాను మంగళగిరి కమీషనర్ కార్యలయానికి పంపించామన్నారు. వారిలో నియోజకవర్గానికి ఒకరిని ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారని వివరించారు. ఈ నెల 8వ తేదీ శనివారం ప్రొద్దుటూరులో జరిగిన కార్యక్రమం ఎంపిక ప్రక్రియ కాదని.. విద్యార్థులకు అవగాహన కోసం చేపట్టిన సన్నాహక కార్యక్రమం మాత్రమేనని డీఈఓ అందులో పేర్కొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: కడప నగరంలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయ అభివృద్ధి కోసం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోలార్ పవర్ సిస్టమ్స్, ఎయిర్‌కండీషన్ ఏర్పాటు చేయాలంటూ బ్రౌన్ గ్రంథాలయ సలహా మండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్ కలెక్టర్‌కు ఇంతకుముందే విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ శ్రీధర్ సోలార్ పవర్ సిస్టమ్స్ ఏర్పాటు కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద రూ. 5,76,700 నిధులు విడుదల చేశారు. ఎన్‌ఆర్‌ఈడీ సీఏపీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక బ్రౌన్ శాస్త్రి సమావేశ మందిరంలో ఏడు ఏసీ యంత్రాలు ఏర్పాటు కోసం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) కార్పొరెట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ కింద రూ. 8.50,000 కలెక్టర్ మంజూరు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంపై బ్రౌన్ గ్రంథాలయ సలహా మండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి
ఢిల్లీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి
ఢిల్లీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి


