శివజ్యోతులతో వెలిగిన ఆలయాలు
బి.కోడూరు: ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న 108 శివలింగాలు
కడప సెవెన్‌రోడ్స్: కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలు కార్తిక దీపాలతో మెరిశాయి. మరో వారంలో కార్తిక మాసం ముగియనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచి భక్తులు కుటుంబాలతోసహా తరలివచ్చారు. పుష్పం, పత్రం సమర్పించి మొక్కుకున్నారు. జిల్లాలో ప్రముఖ శివాలయాలైన పుష్పగిరి, ప్రొద్దుటూరు అగస్తేశ్వర, రామేశ్వర ఆలయాలు, పొలతల, అత్తిరాల, కన్యతీర్థం, నిత్యపూజస్వామి కోన, రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం, బైరవకోనలలో భక్తులు పెద్ద సంఖ్యలో శివయ్యను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని పొలతల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జిల్లాలో మరికొన్ని శైవ క్షేత్రాల్లో శివ కల్యాణాలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొని పూజలు చేపట్టారు.
బద్వేలు పట్టణంలోని శివాలయంలో శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు
జిల్లా అంతటా ఘనంగా కార్తిక పూజలు
దేదీప్యమానంగా వెలిగిన శివాలయాలు
శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
శివజ్యోతులతో వెలిగిన ఆలయాలు
శివజ్యోతులతో వెలిగిన ఆలయాలు
శివజ్యోతులతో వెలిగిన ఆలయాలు
శివజ్యోతులతో వెలిగిన ఆలయాలు
శివజ్యోతులతో వెలిగిన ఆలయాలు


