వైద్య సేవలు నిలుపుదల చేసిన ఆసుపత్రులకు రోగులు వస్తే ఉచిత వైద్యం కోసం మరొక ఆసుపత్రికి వెళ్లేలా సూచిస్తున్నా ం. ఉచిత వైద్య సేవలు అందించే నెట్‌వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్య సమస్యకు చికిత్స లేకపోతే, రిమ్స్‌కు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. –బాలాంజనేయులు,
ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్
సమ్మెలో ఉన్నారని చెప్పారు
నేను చెవి సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందుదామని కడపకు వచ్చాను. ఇక్కడ ఆసుపత్రుల వారు సమ్మెలో ఉన్నా మంటున్నారు. ఫీజు చెల్లించి ఇక్కడే చూపించుకోవాలి లేదంటే వేరొక డాక్టర్ కాడికి వెళ్లాలి.
–రామలక్ష్మమ్మ, జమ్మలమడుగు


