కడప కోటిరెడ్డి సర్కిల్: అయ్యప్పస్వాముల రద్దీని పురస్కరించుకుని నాందేడు నుంచి కడప మీదుగా కొల్లంకు ప్రత్యేక రైలును నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (07111) నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8, 15 తేదీలలో నాందేడులో ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరి నిజామబాద్, మేడ్చల్, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా కడపకు తెల్లవారుజామున 3.48 గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాడ్పాడి, విల్లుపురం, తిరుచునాపల్లి, మధురై, శివకాశి మీదు గా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు కొల్లం చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు (07112) ఈనెల 22, 28, డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీలలో కొల్లంలో శనివారం తెల్లవారు జామున 5.40 గంటలకు బయల్దేరి ఇదే మార్గంలో ఆదివారం రాత్రి 9.30 గంటలకు నాందేడుకు చేరుకుంటుందని వివరించారు.
కడప కోటిరెడ్డి సర్కిల్: కడప మీదుగా అజ్మీర్‌కు ప్రత్యేక రైలు నడవనుంది. కొయంబత్తూర్ నుంచి మదార్ స్టేషన్ వరకు 06181, 06182 నంబర్‌గల ఒక ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ రైలు ఈనెల 13, 20, 27, డిసెంబర్ 4వ తేదీల్లో ప్రతి గురువారం కొయంబత్తూర్‌లో బయల్దేరుతుందని పేర్కొన్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో 16, 23, డిసెంబర్ 7 తేదీల్లో మదార్ స్టేషన్ నుంచి బయల్దేరుతుందన్నారు. ఈ రైలు ప్రతి గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొయంబత్తూర్‌లో బయల్దేరి కాడ్పాడి, రేణిగుంట, కడప, గుత్తి, కర్నూలు, కాచిగూడ, వడోదర, అజ్మీర్ మీదుగా శనివారం 11.20 గంటలకు మదార్ జంక్షన్‌కు చేరుకుంటుందని తెలిపారు. అక్కడి నుంచి ప్రతి ఆదివారం రాత్రి 11.50 గంటలకు బయల్దేరి ఇదే మార్గంలో బుధవారం ఉదయం 8.30కు కొయంబత్తూర్‌కు చేరుకుంటుందన్నారు. అజ్మీర్‌కు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


