బ్రౌన్ గ్రంథాలయం దేశానికి వారసత్వ సంపద
కడప ఎడ్యుకేషన్ : సి.పి.బ్రౌన్ నివసించిన స్థలంలో ఏర్పడిన బ్రౌన్ స్మారక గ్రంథాలయం దేశానికి వారసత్వ సంపద అని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇంటాక్ కన్వీనర్ సింగం లక్ష్మినారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం సి.పి.బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించిన లక్ష్మినారాయణ మాట్లాడుతూ డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి లాంటి మహనీయుల కృషి ఫలితంగా వెలసిన గ్రంథాలయంలోకి అడుగిడడం తన అదృష్టం గా భావిస్తున్నానని అన్నారు. పరిశోధన కేంద్రంలో భద్రపరచిన ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, చేతితో తయారు చేసిన రాతప్రతులు, తామ్రపత్రం, నాణేలు లాంటి పలు ప్రాచీన సంపదను కాపాడడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ శాశ్వత సభ్యత్వాన్ని పొందడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహా మండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్, సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేశ్‌రావు, జి.హరిభూషణ్ రావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, ఎం.మౌనిక, గ్రంథాలయ సిబ్బంది, ఇంటాక్ సభ్యుడు జి.సాయి కుమార్ పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల ఇంటాక్ కన్వీనర్
సింగం లక్ష్మినారాయణ


