నిర్వాసితులకు న్యాయం చేయాలి
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం విషయంలో వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. మండలంలోని దుద్దుకూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి నాయకులతో కలిసి అధికారులు కమీషన్ రూపంలో దండుకోవాలని చూడటం బాధాకరమన్నారు. నిర్వాసితుల పక్షాన ఉంటూ వారికి న్యాయం చేయాల్సిన అధికారులు కూటమి నాయకులకు కొమ్ము కాస్తూ, నిర్వాసితులను నాయకుల వద్దకు వెళ్లి మాట్లాడుకోండని చెప్పడం సరికాదన్నారు. కూట మి నాయకులకు కమీషన్ ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెట్టి జైలులో వేస్తామని సాక్షాత్తూ ఐటీడీఏ పీఓ బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నా రు. అలాగే ప్రస్తుతం నిర్వాసితులకు సేకరిస్తున్న భూములపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయని, భూసేకరణలో దళారులు ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.


