స్విమ్మింగ్ పోటీల్లో పోలీసులకు పతకాలు
భీమవరం: జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లా పోలీసులు పతకాలు సాధించారు. మాస్టర్స్ ఆక్వాటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరులో గత నెల 11, 12 తేదీల్లో జరిగిన 7వ నేషనల్ మాస్టర్స్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌కు హెడ్ కానిస్టేబుల్ పి.సత్యనారాయణ 50 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను సాధించారు. అలాగే కానిస్టేబుల్ డి.అనిల్ కుమార్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ వంటి మూడు వేర్వేరు స్విమ్మింగ్ విభాగాల్లో తృతీయ స్థానాన్ని దక్కించుకొని మూడు బ్రాంజ్ మెడల్స్‌ను గెలుచుకున్నారు. వీరిని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ ప్రత్యేకంగా అభినందించారు.
ద్వారకాతిరుమల: వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బుల్లిరాజు పాత్ర పోషించిన బాల నటుడు రేవంత్ ఆదవారం రాత్రి శ్రీవారి క్షేత్రంలో సందడి చేశాడు. కుటుంబ సభ్యులతో ఆలయానికి విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నాడు. అనంతరం ఆలయ ముఖ మండపంలో పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందాడు. ఆ తరువాత క్షేత్రంలో కాసేపు సందడి చేశాడు. పలువురు భక్తులు బుల్లిరాజుతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
ఆగిరిపల్లి: వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం చిన్నాగిరిపల్లికి చెందిన వర్ణకవి రాజేష్ రాజు(42) గన్నవరంలోని హెచ్‌సీఎల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో పూజకు వాడిన పూజా సామగ్రిని గ్రామంలోని కుంపిని వాగులో కలపడానికి ద్విచక్ర వాహనంపై వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడిపోయాడు. గ్రామస్తులు వాగులో గాలింపులు చేపట్టగా సోమవారం ఉదయం రాజేష్ మృతదేహం లభ్యమైంది. రాజేష్ రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్విమ్మింగ్ పోటీల్లో పోలీసులకు పతకాలు
స్విమ్మింగ్ పోటీల్లో పోలీసులకు పతకాలు


