హోంగార్డుపై దాడి చేసిన నిందితుల అరెస్ట్
యలమంచిలి: హోంగార్డుపై దాడి చేసిన నిందితులు తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీవేద సోమవారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ రాత్రి ఆర్యపేట పంచాయతీ పెదపాలెంలో కొందరు రోడ్డు మీద తప్పతాగి అల్లరి చేస్తున్నారని ఫిర్యాదు రాగా అదుపు చేయడానికి హోంగార్డు దిగమర్తి సత్యనారాయణ వెళ్లారు. అల్లరిమూక పోలీస్ ఉద్యోగి విధులను అడ్డుకోవడమే కాకుండా చేతిలోని సెల్ లాక్కుని, అతనిపై దాడి చేశారు. దీనిపై హోంగార్డు సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుల్లో జల్లి విజయరాజు, పెద్దపాటి హరికృష్ణ, యల్లమిల్లి సతీష్, తరపట్ల బద్రి, వర్థనపు మధుబాబు, తరపట్ల కిరణ్, జల్లి సూర్య కిరణ్, తరపట్ల రాజేష్, బుడితి రమేష్ ఉన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంట సీఐ జి శ్రీనివాస్, ఎస్సై కె గుర్రయ్య ఉన్నారు.


