మదనపల్లె: మదనపల్లె కేంద్రంగా విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయ చదువు అందించాలన్న లక్ష్యంతో రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి శ్రమకోర్చి మంజూరు చేయించిన కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి కూటమి ప్రభుత్వ గ్రహణం పట్టింది. ఎంపీ మిథున్‌రెడ్డి మదనపల్లె బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉత్తర్వులు తీసుకురాగా దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసిన కూటమి ప్రభుత్వం వాటిని సమాధి చేసేందుకే ఆసక్తి చూపిస్తోంది. ఫలితంగా పేద విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నతమైన అందకుండా చేస్తున్నారు. అందులో భాగమైన కేంద్రీయ విద్యాలయం ప్రారంభం ఎప్పుడు అవుతుంది అన్న ప్రశ్నకు కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల దాకా సమాధానం రావడం లేదు. దీంతో ఇక్కడి విద్యార్థులకు ఎదురుచూపులే మిగలనున్నాయి.
ప్రతిష్టాత్మక విద్య
దేశంలో అత్యుత్తమ విద్యా కేంద్రాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఒకటి. జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తాయి. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) సహకారంతో విద్యలో ప్రయోగాలు చేపట్టి నూతన ఆవిష్కరణలతో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయి. హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన ఉంటుంది. లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక, ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపీ మిథున్‌రెడ్డి 2025–26లో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభం అయ్యేలా శాయశక్తులా కృషి చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తరగతులను ప్రారంభించేందుకు కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినా అందులో మదనపల్లె లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది.
భూ కేటాయింపు లేదట
కేంద్రీయ విద్యాలయం తరగతుల ప్రారంభ విషయమై శనివారం డిప్యూటి కమిషనర్ మంజునాథ్‌ను ఫోన్‌లో వివరణ కోరగా ఆయన స్పందించారు. విద్యాలయాలనికి ఇంకా భూమి ఇవ్వలేదని, ఇచ్చాక చర్యలుంటాయని చెప్పారు. వచ్చే ఏడాదైనా తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తే ఆ విషయం తాను చెప్పలేనని అన్నారు. ఇంకా భూమి ఇవ్వలేదనే విషయాన్ని మాత్రమే ఆయన గట్టిగా చెప్పడం గమనార్హం. వచ్చే ఏడాదైనా తరగతులు ప్రారంభం విషయాన్ని దాటవేశారు. దీన్ని బట్టి చూస్తే కేంద్రీయ విద్యాలయం ప్రారంభం అవ్వడం ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే భూమి కేటాయింపు జరిగింది.
బాల, బాలికల కోసం నిర్మించిన మరుగుదొడ్లు
కేంద్రప్రభుత్వం విద్యాలయం మంజూరు చేశాక వాటి నిర్వహణకు కూటమి ప్రభుత్వం సానుకూలం వ్యక్తం చేయాలి. అధికారుల బృందాలు తరగతుల ప్రారంభానికి సముఖత వ్యక్తం చేసినా, దానికి సంబంధించిన నివేదికలు రాష్ట్రప్రభుత్వానికి వెళ్లినా స్పష్టత ఇవ్వనందునే తరగతులు ప్రారంభం కాలేదన్న వాదన విద్యాశాఖ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సానుకూలత వ్యక్తం చేసి ఉంటే ప్రస్తుత ఏడాదిలోనే తరగతులు ప్రారంభమయ్యేవని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడానికి ముఖ్య కారణం ఎంపీ పీవి.మిథున్‌రెడ్డి ఈ కేంద్రం మంజూరుకు కృషి చేయడమే. ఆయన తీసుకొచ్చిన ఈ విద్యాలయాన్ని ప్రారంభిస్తే ఆ పేరు ప్రతిష్టలు మిథున్‌రెడ్డికి దక్కుతాయి. దీంతో ఆయనకు పేరు దక్కకుండా చేస్తే రాజకీయం బలం తగ్గించవచ్చన్న ప్రయత్నమని తెలుస్తోంది. బీటీ కళాశాలను విశ్వవిద్యాలయం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మిథున్‌రెడ్డి జీవో తెప్పించారు. దీన్ని కూడా నిర్లక్ష్యంగా వదిలేసింది కూటమి ప్రభుత్వం.
విద్యకు ప్రాధాన్యత
పేదలు, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు అధికంగా ఉన్న మదనపల్లెను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నాం. కేంద్రీయ విద్యాలయం మంజూ రు, భూ కేటాయింపు జరిగింది. బీటికళాశా లను విశ్వవిద్యాలయంగా మార్చడం జరిగింది. ఖరీదైన వైద్యం పేదలకు ఉచితంగా అందేలా మెడికల్ కళాశాల మంజూరు చేయించాం. వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయోజనం చేకూర్చాలన్నదే మా ఆశయం. ప్రభుత్వాలు ఏవైనా విద్య, వైద్యంపై కక్ష సాధింపు ధోరణితో ప్రజలకు నష్టం కలిగించేలా వ్యవహరించడం తగదు. కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. –పీవీ.మిథున్‌రెడ్డి, రాజంపేట ఎంపీ
మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించిన ఎంపీ మిథున్‌రెడ్డి
రూ.40 లక్షల నిధులతో పనులు చేపట్టిఎస్‌టీ హస్టల్ భవనం సిద్దం
ఈ ఏడాది విద్యార్థులకు అన్యాయం..
వచ్చే ఏడాది తరగతులుప్రారంభంపైనా అనుమానాలు
ఈ ఏడాది మే 22న డిప్యూటీ కమిషనర్ మంజునాఽథ్, అసిస్టెంట్ కమిషనర్ అనురాధల బృందం మదనపల్లెలో పర్యటించింది. భవనాలు. వలసపల్లె వద్ద కేటాయించిన భూమిని పరిశీలించారు. సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్, తహసీల్దార్ ధనుంజయలు వెంట ఉన్నారు. సర్వే నంబర్లు 713/3, 713/4, 496/2, 496/3లో కే టాయించిన 6.09 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీనం చేస్తూ జారీచేసిన ఉత్తర్వును తన కార్యాలయంలో సబ్‌కలెక్టర్ వారికి అందజేశారు. అయితే ఇంకా భూమి స్వాధీనం కాలేదని చెప్పడం చూస్తే మదన పల్లెలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి ప్రభు త్వం ఏమాత్రం సుముఖంగా లేదని స్పష్టం అవుతోంది.
మదనపల్లెలో 2025–26 విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయ తరగతులను ప్రారంభించేలా స్థానిక ఎస్టీ హస్టల్ బాలుర భవనాన్ని సిద్ధం చేశారు. అందులో తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీనికోసం ఎంపీ మిథున్‌రెడ్డి ఎంపీల్యాడ్స్ నుంచి రూ.40 లక్షలు కేటాయించారు. ఆ నిధులతో భవనంపై కొత్త ఒక ఫ్లోర్ నిర్మాణం జరిగింది. బాల, బాలికల కోసం మరుగుదొడ్లను నిర్మించారు. విద్యాలయం కోసం మదనపల్లెకు సమీపంలోని వలసపల్లె వద్ద 6.09 ఎకరాల భూమి కేటాయించారు. ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌కు ముందు, తర్వాత మదనపల్లెలో ఈ భవనాన్ని దక్షిణ భారత జోన్ ఇన్‌చార్జి కేవి.సంఘటన్, డిప్యూటీ కమిషనర్ మంజునాథ్‌ల బృందం పర్యటించింది. ఎస్టీ బాలుర హస్టల్ భవనంలో తరగతుల ప్రారంభానికి కావాల్సిన వసతులు, ఏర్పాట్లను పరిశీలించి వెళ్లాయి. ఈ భవనంలో తరగతుల ప్రారంభానికి ఈ బృందం మొగ్గుచూపుతూ కొన్నిరోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ఇక్కడినుంచి వెళ్లాక దాని ఊసేలేదు.
కూటమే అడ్డంకి
కూటమే అడ్డంకి
కూటమే అడ్డంకి
కూటమే అడ్డంకి


