వైఎస్ భారతిపై ఆరోపణలు తగదు
ఖాజీపేట : మామ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, భర్త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉంటే ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోని ఉత్తమ ఇల్లాలు. సొంత నిధులతో పేద విద్యార్థులను, దివ్యాంగులను, మానసిక వికలాంగులను అక్కున చేర్చుకొని చదివిస్తూ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్న మానవతావాది వైఎస్ భారతమ్మ. అలాంటి ఉన్నత వ్యక్తిత్వం గల భారతమ్మపై రాజకీయంగా విషం చిమ్మేందుకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిది నోరా? డ్రైనేజీనా? అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖాజీపేట మండలం, దుంపలగట్టు గ్రామంలోని తన స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఏనాడైనా భారతమ్మ ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొన్నదా? రాజకీయాల్లో జోక్యం చేసుకుందా? ఆదికి దమ్ము, ధైర్యం ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ కుటుంబం లేకపోతే ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి రాజకీయ మనుగడ, ఉనికి ఉందా? అని ప్రశ్నించారు. ఇలాంటి విమర్శలతో చంద్రబాబు మెప్పు పొందాలనుకుంటే రాజకీయ సమాధి తప్పదన్నారు.


