నర్సరీలో మల్బరీ మొక్కలు సిద్ధం
అనంతపురం అగ్రికల్చర్: పట్టుశాఖ జిల్లా కార్యాలయ ఆవరణలో ఉన్న నర్సరీలో నాటుకునేందుకు అనువుగా ఉన్న మల్బరీ మొక్కలు విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ఈ మేరకు పట్టుపరిశ్రమ శాఖ ఎస్‌ఓ సుమాముక్తశ్రీ, టీఓ రామలింగారెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 50 వేల మొక్కలు అందుబాటులో ఉండగా, ఒక్కో మొక్క రూ.2 చొప్పున విక్రయిస్తున్నారు. మొక్క నాటుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీ రైతులకు ఎకరాకు రూ.27 వేలు, ఇతర రైతులకు రూ.22,500 చొప్పున సబ్సిడీ వర్తిస్తుంది. పూర్తి వివరాలకు 95336 01205, 99598 45950 లో సంప్రదించవచ్చు.


