లింగ నిర్ధారణ తీవ్ర నేరం
గుత్తి: జాతీయ స్థాయి కురాష్ పోటీలకు గుత్తిలోని జెడ్పీబాలిక ఉన్నత పాఠశాల విద్యార్థి మంజుల ఎంపికయ్యారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో 9వ తరగతి విద్యార్థి మంజుల బంగారు పతకాన్ని, లలిత వెండి పతకాన్ని దక్కించుకున్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను సోమవారం పాఠశాలలో హెచ్‌ఎం సుంకన్న, ఉపాధ్యాయులు అభినందించారు.
ఇన్‌చార్జ్ డీఈఓగా పాటిల్ మల్లారెడ్డి
అనంతపురం సిటీ: జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఎఫ్‌ఏసీగా పాటిల్ మల్లారెడ్డి బాధ్యతలు చేపట్టారు. డీఈఓ ప్రసాద్‌బాబు నాలుగు రోజుల పాటు సెలవులో వెళ్లారు. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గుత్తి డిప్యూటీ డీఈఓగా పని చేస్తున్న మల్లారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.
లింగ నిర్ధారణ తీవ్ర నేరం


