చంద్రబాబు విధానం ‘దోచుకో..దాచుకో’ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు విధానం ‘దోచుకో..దాచుకో’

Nov 11 2025 5:59 AM | Updated on Nov 11 2025 5:59 AM

చంద్ర

చంద్రబాబు విధానం ‘దోచుకో..దాచుకో’

అనంతపురం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దోచుకో దాచుకో అనే విధానంతో ముందుకెళ్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు నాయక్‌ అధ్యక్షతన అనంతపురం టవర్‌క్లాక్‌ సమీపంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ప్రభుత్వ వ్యవస్థలోనూ అవినీతి పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ప్రజలను తీరని ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని కొనియాడారు. 17 మెడికల్‌ కళాశాలలకు దాదాపు రూ.8 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించారని గుర్తు చేశారు. అలాంటి మెడికల్‌ కళాశాలలను నేడు సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములవుతుండడం హర్షణీయమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో..

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఏకంగా 17 మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఒక రాష్ట్రానికి ఒకే దఫా ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు తీసుకురావడం వైఎస్‌ జగన్‌తో సాధ్యమైందని కొనియాడారు. వీటిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చంద్రబాబు అండ్‌ కో కుట్రలు పన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని చంద్రబాబు గమనించాలని సూచించారు. బాబువన్నీ పెత్తందారీ పోకడలని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర శేఖర్‌, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌ రెడ్డి, ఎస్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతినాయుడు, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాభేగ్‌, మహిళా విభాగం అధికార ప్రతినిధి కృష్ణవేణి, ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ నాయక్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్‌, రాజు నాయక్‌, జిల్లా కార్యదర్శి సాకే ఆనంద్‌, గుజ్జల లక్ష్మణ్‌, నగర అధ్యక్షుడు గుజ్జల శివయ్య, నగర వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసులు, గోవింద్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమంతో ఆయనకు పనిలేదు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకట్రామి రెడ్డి ధ్వజం

బాబు పెత్తందారీ పోకడలు వీడాలి: మాజీ మంత్రి శైలజానాథ్‌

చంద్రబాబు విధానం ‘దోచుకో..దాచుకో’ 1
1/1

చంద్రబాబు విధానం ‘దోచుకో..దాచుకో’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement