రాష్ట్ర సాఫ్ట్ బాల్ పోటీల విజేత గుంటూరు
సత్తెనపల్లి: 12వ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ 2025 విజేతగా గుంటూరు నిలిచింది. సత్తెనపల్లి మండలం లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన 12వ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ 2025 పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన గుంటూరు టీమ్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని విజయనగరం టీమ్, తృతీయ స్థానం అనంతపురం టీమ్ కై వసం చేసుకున్నాయి. బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు హాజరై మాట్లాడారు. క్రీడలతోపాటు విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 415 పోస్టుల్లో 49 పోస్టులు సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకు దక్కడం అభినందనీయమన్నారు. సభకు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ వంశీకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ రమణ, స్కాలర్స్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కె.సత్యం, లయోలా కళాశాల అడ్మిషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సాఫ్ట్‌బాల్ అసోసియేసన్ గుంటూరు జిల్లా సామంత్‌రెడ్డి, ట్రెజరర్ జనార్ధన్ యాదవ్ ఆవుల, నరసింహారెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.


